యువశక్తి ఆధారిత బడ్జెట్`2026
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2026`27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే లక్ష్యంతో 2026-27సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న వార్షికపద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
ముందుగా తన బృందంతో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిశారు.రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అంద జేశారు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. అనంతరం బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం
తెలపడంతో.. ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ తీసుకువస్తున్నాం. కర్తవ్య భవన్లో రూపొం దించిన మÖడో బడ్జెట్ ఇది. యువశక్తి కేంద్రంగా దీనిని ప్రవేశపెడుతున్నాం. భారత దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. ప్రపంచ మార్కెట్లతో భారతన్ అనుసం ధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకొస్తున్నాం. నైపుణ్యం,పోటీతత్వం,ఉత్పాద కతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. రైతులు,దళిత,గిరిజన సమÖహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలి” అని ఆమె పేర్కొన్నారు.
వరుసగా రికార్డు
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి.ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు.వేర్వేరు సమయాల్లో అందించారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మొత్తం 9సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కానీ ఆయన వరుసగా చేయలేదు. అలాగే నిర్మలా సీతారామన్ మరోఅరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె 2019 మే 31న ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చారు. 2026 జనవరి 31నాటికి ఆమె ఈ పదవిలో 6ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్నారు. గతంలో సి.డి.దేశ్ ముఖ్ ఆరేళ్ల రెండు నెలల పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
కేంద్ర బడ్జెట్ ముఖ్య విశేషాలు
– ఆదాయపు పన్ను రేట్లు యథాతథం.
– ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.
– ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను(ఎన్టీటీ)0.02శాతం నుంచి 0.05 శాతానికి;ఆప్షన్స్ ప్రీమియం, ఆప్షన్స్ ఎన్టీటీ 0.01శాతం నుంచి వరుసగా0.15శాతం,0.125శాతానికి పెంపు.
– విదేశీ టూర్ ప్యాకేజీలపై మÖలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్) 2శాతానికి తగ్గింపు.
– విదేశీ విద్యపై విధించే టీసీఎస్,
– బరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వైద్య చికిత్సల వ్యయాలపై విధించే పన్నులు 2శాతానికి కుదింపు.
– వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి
– చేసుకునే పన్ను పరిధిలోని వస్తువులపై సుంకం 20శాతం నుంచి 10శాతానికి తగ్గింపు.
– క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగిం చే 17రకాల ఔషధాలపై కస్టమ్స్ సుం కం మినహాయింపు.ఏడురకాల అరు దైన వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు,ఆహారాలపై దిగుమతి సుం కాల తొలగింపు.
– అరుదైన ఖనిజాల శుద్ధికి వినియో గించే వస్తువుల దిగుమతిపై సుంకాల తగ్గింపు.
– పౌర,శిక్షణ,ఇతర విమానాల తయా రీకి వినియోగించే పరికరాలు,భాగాల దిగుమతులపై మౌలిక సుంకం మినహాయింపు.
– మైక్రోవేవ్ అవెన్స్ తయారీలో ఉపయో గించే కొన్ని రకాల విడి భాగాలకు మౌలిక సుంకాల నుంచి మినహా యింపు.
– ఆడిట్ చేయని వ్యాపారాలకు సంబం ధించిన ఐటీఆర్ దాఖలు గడువు ఒక నెల పొడిగింపు. ఆగస్టు 31వరకు ఐటీఆర్ దాఖలుకు అవకాశం.
– భారత్‌లో నెలకొల్పిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయంగా సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 సంవత్సరం వరకు పన్ను మినహా యింపు.
– కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం… బైబ్యాక్ షేర్లపై క్యాపిటల్ గెయిన్స్ కింద కార్పొరేట్ ప్రొమోటర్స్పై 22శాతం,నాన్కార్పొరేట్ ప్రమోటర్స్ 30శాతం పన్ను విధింపు.
– 2027 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.3శాతానికి కట్టడి. గత ఏడాది ద్రవ్యలోటు 4.4శాతం.
– మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5కోట్లు
– పన్ను రాబడుల అంచనా రూ.28.7 లక్షల కోట్లు
– మార్కెట్ల నుంచి తీసుకునే రుణాల అంచనా రూ.17.2లక్షల కోట్లు. సెక్యూరిటీస్ రుణాల అంచనా రూ.11.7లక్షల కోట్లు
– పట్టాలపైకి సంస్కరణల ఎక్స్‌ప్రెస్. 350కిపైగా సంస్కరణలు.
– పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద పంపిణీ చేయనున్న మొత్తం రూ.1.4లక్షల కోట్లు
– 2026-27లో …జీడీపీలో మొత్తం రుణాల 56.1 55.6.2025-265.
– మÖడు కర్తవ్యాలపై బడ్జెట్ ప్రధాన దృష్టి. అవి..అభివృద్ధిని వేగిరపరిచి సుస్థిరం చేయడం.
సామర్థ్యాల పెంపు. అందరితో కలిసి-అందరి వికాసం.
2047నాటికి జీడీపీలో 10శాతం వాటా కలిగి ఉండేలా సేవల రంగాన్ని వృద్ధి చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ.
. సరకు రవాణా కోసం తూర్పున డాంకునీ నుంచి పడమర సూరత్ వరకు ప్రత్యేక రైల్వే మార్గం.
. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20జాతీయ జల మార్గాల నిర్మాణం.
. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు,హైదరాబాద్- చెన్నై, చెన్నై-బెంగళూరు,దిల్లీ-వారణాశి, వారణాసి-సిలిగుడి మధ్య మొత్తం 7 హైస్పీడ్ రైల్ కారిడర్ల అభివృద్ధి.
. మన దేశాన్ని వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు
. మÖడు అఖిల భారత ఆయుర్వేద సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదన.
. ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడర్ల సమీపంలో ఐదు విశ్వవిద్యాలయాల టౌన్ షిప్పులు నెలకొల్పాలని నిర్ణయం
. వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా 500 రిజర్వా యర్లు,అమృత్ సరోవర్ల అభివృద్ధి
. దివ్యాంగజనుల కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజన.ఐటీ, హాస్పిటాలిటీ, ఆహారపానియాల రంగాలలో ఉపాధి కల్పన.
. సమీకృత ఈస్ట్కెస్ట్ పారిశ్రామిక నడవా అభివృద్ధిలో భాగంగా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో ఐదు పర్యాటక కేంద్రాల అభివృద్ధి
. 4వేల ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు.
. బుద్దిస్ట్ సర్క్యూట్స్ అభివృద్ధిలో భాగంగా అరుణాచలప్రదేశ్,సిక్కిం,అస్సాం, మణి పుర్,మిజోరం,త్రిపుర రాష్ట్రాల కోసం ప్రత్యేక పథకం.
చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ
వరసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీకాలాల్లో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువవుతున్నారు. 1959-64 మధ్య ఆరుసార్లు, 1967-69 మధ్య నాలుగుసార్లు మొరార్జీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది.కేంద్ర మాజీ మంత్రు ల్లో పి.చిదంబరం 9సార్లు,ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పిం చారు. అందువల్ల వరసగా తొమ్మిదేళ్లు, అదీ ఒకే ప్రధాని (నరేంద్రమోదీ) హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మ లదే అవుతుంది.
బడ్జెట్ ఎఫెక్ట్: పెరిగేవి..తగ్గేవి ఇవే..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకొన్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎఫెక్ట్ ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏమిటో చూద్దాం.
ధరలు తగ్గేవి ఇవే..
విదేశీ పర్యాటక ప్యాకేజీలు : వీటిపై ట్యాక్స్ కలెక్టెడ్,ఎట్ సోర్స్ (టీసీఎస్) 2శాతానికి తగ్గింపు
విదేశీ విద్య : దీనిపై టీడీఎస్ లిబరలైడ్జ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎసఆరఎస్) కింద విద్యా ఖర్చులు కోసం తగ్గించారు.
ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు : వీటిపై కస్టమ్స్ డ్యూటీని 5శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరత్వం నుంచి వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది.మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి,పర్యాటకం,సంస్కృతి, యువత ఉపాధి, డిజిటలీకరణ వంటి కీలక రంగాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు.
సాంస్కృతిక పర్యాటకానికి ఊతం
బడ్జెట్లో ముఖ్యంగా 15పురావస్తు ప్రదేశాలను “అనుభూతి ఆధారిత సాంస్కృతిక గమ్యస్థా నాలుగా” అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన విశేష ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా దేశ వారసత్వ సంపదను కాపాడడమే కాకుండా పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది.స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చలనం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మౌలిక వసతులు -వృద్ధికి బలమైన పునాది
రహదారులు రైల్వేలు,పోర్టులు, విమానా శ్రయాల అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించడం ద్వారా పెట్టుబడులకు అను కూల వాతావరణం సృష్టించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా మారనుంది.
రైతులు,గ్రామీణాభివృద్ధి,వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం,రైతులకు రుణసౌలభ్యం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించింది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల నుంచి నగరాలకు వలసలు తగ్గించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
యువత,ఉపాధి,నైపుణ్యాభివృద్ధి
యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు.స్టార్టప్‌లు,ఎంఎసఎంఈ రంగాలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశం ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తోంది.
డిజిటల్, గ్రీన్ ఎకానమీపై దృష్టి
డిజిటల్ సేవల విస్తరణ,ఈ-గవర్నెన్స్, గ్రీన్ ఎనర్జీ,పర్యావరణహిత అభివృద్ధికి బడ్జెట్లో చోటు కల్పించారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త అవకాశాలు
కేంద్ర బడ్జెట్ 2026లో పర్యాటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కు విశేష అవకాశాలను తీసుకువచ్చేలా ఉంది. ముఖ్యం గా 15పురావస్తు ప్రదేశాలను అనుభూతి ఆధారిత సాంస్కృతిక గమ్యస్థా నాలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతి పాదన, చారిత్రక సంపద కలిగిన రాష్ట్రా లకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బౌద్ధ వారసత్వం,ఆలయ పర్యాటకం,తీర ప్రాంత సౌందర్యం, ప్రకృతి వనరులతో సమృద్ధిగా ఉంది. అమరావతి, లేపాక్షి, శ్రీకాళహస్తి, సింహాచలం, మంగళగిరి, ఘంటశాల, సాలిహుండం,తోట్లకొండ వంటి పురావస్తు, చారిత్రక ప్రదేశాలు రాష్ట్ర పర్యాట కానికి బలమైన ఆధారాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చోటు దక్కితే అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.- (న్యూ ఢిల్లీ నుంచి సూర్య ప్రకాశ్ యాదవ్)
