విశాఖలో ఏపీ ఫుడ్ కమిషన్ పర్యటన
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ కమిటీ బృందం జనవరి 5 నుంచి మహావిశాఖనగరంలో పర్యటిం చారు.పాఠశాలలు,రెసిడెన్సియల్ హాస్టల్స్,అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి పలు సలహాలు, సూచనలిచ్చారు.
విద్యార్ధులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని,పౌష్టికాహార సరఫరాలో ఎటు వంటి లోటు పాట్లు జరిగిన ఉపేక్షంచేది లేదని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ ప్రతా పరెడ్డి తెలిపారు. ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్తో కలిసి జిల్లాలో చౌక ధర దుకాణాలు అంగన్వాడి కేంద్రాలు మరియు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఎంవిపి కాలనీలో చౌక ధరల దుకా ణము సంఖ్య47 కు వెళ్లి చౌక ధరల దుకాణము సందర్శించి లబ్దిదారులకు రేషన్ పంపిణీ జరుగు విధానము పరిశీలించారు.ప్రతి రైస్ కార్డు లబ్దిదా రునకు రెండు కేజీల రాగులు పంపిణీ చేయాలని సూచించారు. తదుపరి ఎంవిపికాలనీ పెద్ద జాలా రిపేట జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో గల అంగ న్వాడి కేంద్రాలకు వెళ్లి అక్కడ రికార్డులు, పిల్లల ఆహార వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఉన్నత పాఠశాలను సందర్శిం చారు. అక్కడ విద్యార్ధులకు మెనూ ప్రకారము పిల్లలకు ఆహారము అందుతున్నదీ లేనిదీ విదార్ధు లను వాకబు చేశారు. శ్రీకృష్ణాపురంలో అంబేద్కర్ గురుకులం పాఠశాల పరిసరాలు,పిల్లలు,ఉపాధ్యా యుల హాజరు వివరాలు, మధ్యాహ్న భోజన ఏర్పా ట్లు పరిశీలించి డిస్టిక్ కోఆర్డినేటర్ కు తగు సూచ నలు చేశారు. అనంతరం గురుకులంలో చదువు కుంటున్న విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని హిత వు పలికారు. అనంతరం కృష్ణాపురంలో మం డల పరిషత్ ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్ర మునకు చేరుకొని అక్కడ పిల్లల సంరక్షణ పరిస్థి తులు స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడినుండి అడవివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేరుకున్నారు. అక్కడ హాజరైన విద్యార్థులతో మెనూ అమలు పై ప్రశ్నించి పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
చైర్మన్ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం ఉపయోగాలు విద్యార్థులకు తెలియజేశారు. అక్కడ నుండి సింహాచలం మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ సందర్శించగా, రెసిడెన్సియల్ పాఠశాలలో మాంసాహారము తక్కు వగా పెడుతున్నారని, వంటలు సరిగా చేయడం లేదని,తాగునీటి సమస్య ఉందని చైర్మన్ దృష్టికి రాగా, పాఠశాల ప్రిన్సిపాల్,సంబంధిత అధికా రులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిం చారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండి వడ్డించాలని సూచించారు. పాఠశాల విద్యార్థు లకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్రావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఐసిడిఎస్ పీడీ రామలక్ష్మ, జిల్లా విద్యాధి కారి ప్రేమ్ కుమార్,సోషల్ వెల్ఫేర్ డిపా ర్ట్మెంట్ డిడి రామారావు,లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు పర్యటనలో..
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ్ ప్రతా పరెడ్డి,ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కం పూడి కృష్ణ కిరణ్తో కలసి రెండో రోజు పర్యటన లో భాగంగా జిల్లాలో పలు పాఠశాలలు, అంగన్వా డీ కేంద్రాలు మరియు హాస్టల్ లను సందర్శిం చారు. 8వవార్డుసాగర్నగర్,ఋషికొండ, కొమ్మా ది, ఐదవ వార్డ్ సాయి రామ్ నగర్ కాలనీ, భీమిలి పట్నం మరియు ఎండాడలలో గల అంగ న్వాడి సెంటర్లనును సందర్శించి విద్యార్థుల హాజరు పట్టికలను గమనించారు.అదేవిధంగా రేషన్ డిపో నెంబర్ 412 మరియు 553 లను సందర్శించి మాట్లాడి, రేషన్ అందుతున్న వివరా లను అడిగి తెలుసుకున్నారు.మధురవాడ మారికవలసలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భీమిలిపట్నంలో గల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ విద్యా ర్థులతో మాట్లాడి,మెనూ ప్రకారం ఆహార పదా ర్థాలు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నా రు. కస్తూరిబాగాంధీ బాలిక విద్యాలయం సంద ర్శించి విద్యార్థులకు అందుతున్న వసతుల గురిం చి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు,జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనే జర్ శ్రీలత,ఐసిడిఎస్ పీడీ రామలక్ష్మ, జిల్లా విద్యా ధికారి ప్రేమ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడి రామారావు,లీగల్ మెట్రాలజీ,ఫుడ్ సేఫ్టీ అధి కారులు,తదితరులు పాల్గొన్నారు.– జి .ఏ సునీల్ కుమార్
