పాతికేళ్ల పరామర్శ
“ ద్వితీయ సహస్రాబ్ది ప్రారంభమై, అప్పుడే పాతికేళ్లు గడిచిపోయాయి. ఈ సహస్రాబ్ది ఆగమనం వేళ.. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు. కొత్త సహస్రాబ్దిలోకి, కొంగొత్త శతాబ్ది లోకి అడుగు పెడుతున్న అరుదైన కాల విశేషం అది. ఆ సందర్భాన్ని దాటి, ఇరవై ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో…ఈ కాలం తెచ్చిన మార్పులను పరామ ర్శించు కోవటం ఒక అవసరం. నడిచిన కాలాన్ని అవలోకించుకుంటే- రానున్న కాలాన్ని అర్థం చేసు కోగలం. తగు విధంగా మలచుకోగలం.”- సత్యాజీ
నూతన సహస్రాబ్ది అందరి జీవితాల్లోకీ కొత్త వెలుగులు తెస్తుందని ఆశించాం. అంబరాన్ని తాకే సంబరాలతో స్వాగతాలు పలికాం. నెలల తరబడి గత దశాబ్దాల చరిత్రను, పరిణామాలను నెమరువేసుకున్నాం.వాటి బాటలోనే మున్ముం దుకు పోవాలని ఉబలాటపడ్డాం. మరి ఈ పాతి¹ ¿ళ్ల ప్రస్థానం ఆ విధంగానే సాగుతుందా? ఇప్పు డు మనకు కనిపిస్తున్న అనేక మార్పులకు బీజాలు 2000 నాటికే నాటుకొని ఉన్నాయి. ఈ కాలంలో అవి మొక్కలై,మానులై,శాఖోపశాఖలై విస్తరిం చాయి. వాటి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి అందాయి? అన్నదే పరిశీలించుకోవాలి. భారంగా మారిన విద్యావ్యయం..
పాతికేళ్ల నాడే ప్రభుత్వ విద్యారంగంపై పాలకులకు చిన్నచూపు మొదలైంది. అప్పటికే మండల స్థాయి వరకూ ప్రయివేటు విద్యాసంస్థలు విస్తరించాయి. అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. క్రమంగా ఈ కాలంలో ప్రయివేటు విద్య పై చేయి సాధిస్తూ వచ్చింది.జిల్లా కేంద్రాలకే పరి మితమై ఉన్న కార్పొరేటు విద్యాసంస్థలు నెమ్మదిగా డివిజన్ స్థాయి పట్టణాల్లోకి చొచ్చుకొచ్చాయి.దీంతో, స్థానికంగా పేరున్న ప్రయివేటు విద్యాసం స్థలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవల్సి వచ్చింది. ఫలానా విద్యాసంస్థల్లో ఫలానా ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఫలితాలు బాగుంటాయి అన్న కొల మానం నెమ్మదిగా పక్కకు పోయింది.ఫలానా పేరున్న విద్యాసంస్థలో చదివితేనే భవిష్యత్తు అన్న ‘బ్రాం డింగ’ బలపడింది.ఈధోరణి చిన్నస్థాయి నుంచి ఒక మాదిరి స్థాయి వరకూ ఉన్న స్థానిక విద్యాసం స్థలు మÖతపడేలా చేసింది.ప్రభుత్వ విద్యారంగం, స్థానికులు నడిపే విద్యాసంస్థలూ బలంగా ఉన్న ప్పుడు-కార్పొరేటు విద్యాసంస్థలు ఊరూరా, ఇల్లి ల్లూ తిరిగి ప్రతిభావంతులైన విద్యా ర్థులను ఉచి తంగా చేర్చుకోవటానికి పోటీపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ‘మేము తప్ప మరొక దారి లేదు’ అన్న ధోరణిని అనుసరిస్తున్నాయి. అప్పట్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యహాస్టల్ వసతితో సహా రూ. 30వేలతో పూర్తయ్యేది.ఇప్పుడు రూ.ఐదారు లక్షలు దాటిపోయింది. పాతికేళ్ల క్రితం ప్రయివేటు విద్యావ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఎంతో కొంత ఉండేది.ఇప్పుడది దాదాపు శూన్యం. పలువురు విద్యాసంస్థల అధినేతలు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.విద్యాహక్కు చట్టం ప్రకారం- పేదలకు కూడా కార్పొరేట్ విద్య అని మాటలు చెప్పినా- ఆచరణలో అది అంతంత మాత్రమే!. ఈ ఇరవై ఏళ్లలో చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్య యనం పూర్తిగా తగ్గిపోయింది.కార్పొరేటు విద్యాసంస్థల్లో హెచఇసి,సిఇసి, బిఎ, బికాం వంటి కోర్సులు లేనేలేవు. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు నూటికి 85శాతం మంది చదివేది బిటెక్. చరిత్ర,సామాజిక శాస్త్రాలపై అవగాహన లేని యువతరాన్ని వాట్సాప్ తదితర సామాజిక మాధ్య మాల ద్వారా తప్పుదోవ పట్టించటం ఈ కాలంలో పెరిగింది. రాజకీయ లబ్ధి పొందాలని పావులు కదుపుతున్న మతోన్మాద సంస్థలు చరిత్రను దారు ణాతి దారుణంగా వక్రీకరిస్తున్నాయి. ఇదే చరిత్ర అని భ్రమ పడే యువతరం పెరిగింది.
ప్రధాన పద్దుగా వైద్య ఖర్చు..
సామాన్య, మధ్యతరగతి ప్రజల ఖర్చు ను అమాంతంగా పెంచిన రంగంగా వైద్యం ముందుకొచ్చింది.తీవ్రమైన, దీర్ఘకాలికమైన వ్యాధు లు వస్తే-కుటుంబాలకు కుటుంబాలే కుప్ప కూలుతున్న పరిస్థితి! ముఖ్యంగా ఇది కోవిడ్ కాలంలో చాలామందికి అనుభవంలోకి వచ్చింది. ప్రభుత్వ వైద్యరంగమే ఆ కాలంలోనూ ప్రజలకు అండగా నిలబడింది.కొన్ని కార్పొరేటు ఆసు పత్రులు అడ్డంగా దోచుకొని, విమర్శల పాలయ్యా యి. ప్రయివేటు వైద్యం చాలా ఖరీదుగా మారిపో యింది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ బాగా పనిచేసినా-అక్కడికి వెళ్లే ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో యÖ జర్ ఛార్జీలు వంటి ఆలోచనలను పాలకులు పాతి కేళ్ల క్రితమే చేశారు. ప్రజా ఉద్యమాల కారణంగా ఆ వరవడికి కొంత బ్రేకు పడింది. అయితే, అది వివిధ రూపాల్లో ఈకాలమంతా చాప కింద నీరు లా సాగుతూ వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రయివేటుకు కట్టబెట్టే దశకు చేరింది. విద్య, వైద్య వ్యవస్థల్లో ప్రభుత్వరంగం బలహీనపడితే-ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందో ఈ పాతికేళ్ల అనుభవం చాటి చెప్పింది.బీమా ఉంటే తప్ప వైద్యం పొంద లేమన్న ప్రచారమÖ,అభిప్రాయమÖ మధ్య తరగతిలో పెరిగింది.
విస్తరించిన వినిమయ సంస్కృతి !
అవసరానికే వస్తువుల వాడకం.. ఒక నాటి పద్ధతి.వస్తు వినియోగం, బ్రాండింగ్ అనేవి అవసరంతో పాటు స్థాsTÖ సూచిక కూడా అన్న ధోరణి ఈ కాలంలో హెచ్చింది. టీవీ, సెల్‌ఫోను, కుక్కర్,బైక్, వాషింగ్ మెషీన్, ఇంటీరియల్ డెకరే షన్, డ్రెస్.. ఇలా ఏదైనా సరే-కాలానికి తగ్గట్టు మారిపోవాల్సిందే!మార్కెట్లో మోడళ్లు మారిన ప్రతి సారీ ఇంట్లో కూడా మారాల్సిందే అన్న అభిప్రా యం మధ్యతరగతి వరకూ చొచ్చుకు వచ్చే సింది. పాత వస్తువులను తిరిగి వాడడం తగ్గు ముఖం పట్టింది. ప్రతి కొనుగోలూ నెలవారీ చెల్లిం పులపై అందుబాట్లోకి వచ్చింది. ‘భవిష్యత్తు సంపా దన మీద ఈరోజే సౌకర్యాలు అనుభవించండి!’ అన్నది వ్యాపార ప్రచారం.అమ్మకాలకు అవి అనుసరించే వ్యూహాల్లో మధ్యతరగతే కాదు,సామాన్య తరగతి కూడా చిక్కుకుంటోంది. ‘పరుగెత్తి పాలు తాగటం కన్నా నిలబడినీళ్లు తాగటం ఉత్తమం’అని పాతికేళ్ల క్రితం అనుకుంటే-‘నానాతంటాలు పడైనా, ఆఖరి కి క్రెడిట్ కార్డు మీదైనా సరే బిర్యానీ తినాల్సిందే!’ అన్న అలవాటుకు వినిమయ సంస్కృతి విస్త రించింది. అంతా సవ్యంగా సాగితే- ఈ వైభోగం బాగానే ఉంటుంది. ఆదాయం,ఆరోగ్యం ఎక్కడ కొద్దిగా గాడితప్పినా అంతా అతలాకుతలం. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు ఎన్నో కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి కూడా!
గ్యారంటీ లేని ఉద్యోగం
ఈ సహస్రాబ్ది ప్రారంభంలో ప్రయి వేటు ఉద్యోగాలు,సాఫ్ట్వేర్ రంగం అద్భుతమనే సంకేతాలు బలంగా ఉన్నాయి. దరిమిలా ఆ రం గాలపై విపరీతమైన మక్కువ మొదలైంది. అనేక కోర్సులు, శిక్షణాసంస్థలు రంగంలోకి వచ్చాయి. చాలా గ్రామాల నుంచి, సాధారణ కుటుంబాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, కెనడా వంటి దేశాల్లో ఉద్యోగం చేయడం పెరిగింది. అయితే, పదేళ్లు గడిచేసరికి అంతా అస్తవ్యస్తంగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం తయారైన యువతీ యువకులు మళ్లీ పెద్దఎత్తున ప్రభు త్వరంగ ఉద్యోగాల వైపు మళ్లారు. ఎంతో ప్రచా రం పొందిన ప్రయివేటురంగం ఇప్పుడు ఉద్యో గుల నెత్తిన కత్తిలా వేలాడుతోంది. ఏఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియని అభద్రత ఆవ రించింది. ప్రపంచదేశాల అన్నింటా ఆర్థిక సంక్షో భం నెలకొని ఉంది. ఇతర దేశాల వాళ్లు, ప్రాంతా ల వాళ్లు రావటంవల్లే స్థానికులకు ఉద్యోగ ఉపా ధి అవకాశాలు తగ్గిపోయాయన్న తప్పుడు ప్రచారంతో వివిధ దేశాల్లో విద్వేషాలు చెలరేగుతు న్నాయి. ఇదే అదనుగా పని గంటలను పెంచటం గురించి కార్పొరేట్లు మాట్లాడడం, దానికి అనుగు ణంగానే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకు రావటం జరిగిపోయింది. వందేళ్ల క్రితం కార్మికు లు వీరోచితంగా పోరాడి హక్కుగా సాధించుకున్న ”ఎనిమిది గంటల పనిదినం”కుగండికొట్టే కు తంత్రం నూతన సహస్రాబ్దిలో చోటుచేసుకోవటం తిరోగమన పరిణామం..
ప్రజాస్వామికమైన, చట్టబద్ధమైన హక్కు లను కోల్పోతున్నా నోరెత్తటానికి సిద్ధపడని యువ తరం కూడా ఈ పాతికేళ్ల సృష్టి! చారిత్రిక దృష్టి లోపించటం,సామÖహిక స్పృహ కొరవడడం, అభ ద్రతా భావంలో ఇరుక్కుపోవటం.. ఈదుస్థితికి కారణం.అయితే,ఏస్థితికైనా ఒకహద్దు ఉంటుంది. లాభాలే ప్రధానమైన కార్పొరేట్ వ్యవస్థ బలప డేకొద్దీ సామాన్యులు మరిన్ని హక్కులను, అవసరాలను వదులుకోవాల్సిన దురవస్థ దాపురి స్తుంది. దానినుంచి బయటపడాలంటే- గొంతెత్తి మాట్లాడడం అందరికీ అనివార్యం అవుతుంది.
గ్రామాల రూపురేఖలూ మారాయి !
గ్రామాల రూపురేఖలు బాగా మారి పోయాయి. వ్యవసాయంలో సంక్షోభం కొనసాగు తూనే ఉంది.సహస్రాబ్ది ప్రారంభంలో ప్రజలు సాగించిన విద్యుత్ పోరాటం చాలాకాలం పాటు తన ప్రభావాన్ని చూపించింది. రైతులకు ఉచిత విద్యుత్ వంటి సదుపాయం చేకూరింది. అయి నప్పటికీ- పంటలకు మద్దతు ధర ఇవ్వటంలో పాలకుల నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాన్యం,మిర్చి,అరటి,మామిడి,టమాటా,జీడి మా మిడి,పొగాకు, పత్తి వంటి పంటల రైతులు తరచూ నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. పాడి పరిశ్రమ మాత్రం రైతులకు తోడ్పాటునిచ్చేదిగా ఎదిగింది. పరిశ్రమలు,ప్రాజెక్టులు,రాజధాని నిర్మాణం పేరిట వేలాదిమంది రైతులు తమ భూములను వదులు కోవాల్సి వచ్చింది.వారికి సరైన పునరావాసం, పరిహారం చెల్లింపు,హక్కుల కల్పన విషయాల్లో పూర్తి న్యాయం దక్కలేదు. అభివృద్ధి కోసం ఎవరు భూమిని కోల్పోతారో వారు తొలి లబ్ధిదారు కావా లి అన్న ప్రాథమిక సూత్రం అమలుకు ఆమడ దూరంలో ఉంది.
ఎవరు ఎలా సంపాదించినా అది వెం టనే వినిమయం అయిపోయేలా వ్యాపార తంత్రం పల్లెల వరకూ విస్తరించింది. టీవీలు, సెల్ఫోన్లు, మోటారు వాహనాలు వంటి వాటికి పల్లెటూళ్లు కూడా పెద్దఎత్తున నెలనెలా చెల్లిస్తున్నాయి. విద్య, వైద్య అవసరాలకు ఊళ్లు కూడా ఎక్కువ భాగం ప్రయివేటు మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి పెరి గింది. చాలా గ్రామాల్లోని ప్రభుత్వ బడులు వెల వెలబోతున్నాయి. ఒకే ఊరి పిల్లలైనా ఆర్థిక స్థాయి లను బట్టి వివిధ స్కూళ్లకు చెదిరిపోవటం సాధారణ దృశ్యంగా మారింది.సామాజిక కద లిక,సామరస్యత, స్నేహం, సౌభ్రాతృత్వ భావనలకు ఇది తీవ్రమైన ఆటంకం.
ఎన్నికల్లో ధన ప్రవాహం..
ప్రపంచీకరణ మొదలు కావటంతోనే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగింది.నీతీ, నిజాయితీ,ప్రజాపక్షపాతం, పోరాట పటిమ వం టివి పాతికేళ్ల క్రితం కాస్తలో కూస్తయినా ప్రాధా న్యం పొందేవి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టేవాడే అభ్యర్థి అన్న అభిప్రాయం పంచాయతీ ఎన్నికల దాకా పాకిపోయింది. వివిధ వ్యాపారాల్లో ఎదిగి నవాళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల బరిలోకి దూసుకురావటం పెరిగింది. ప్రతి పనిని డబ్బుతో సాధించొచ్చునన్న సూత్రాన్ని వర్తింపజేసి, ఎన్నికల ప్రక్రియను కూడా డబ్బుమయంగా మార్చేశారు.
రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థ లకు ఎన్నికైన వివిధ సామాజిక తరగతుల ప్రతి నిధులు, మహిళలు మొదట్లో మరొకరి పెత్తనంలో ఉన్నా-ఈ పాతికేళ్లలో మార్పు బాగానే కనిపి స్తోంది.స్వయంగా మాట్లాడడం,వ్యవహారాలు చక్కబెట్టడం పెరిగింది. ఇది మంచి పరిణామం. అయితే,స్థానికసంస్థల అధికారాలూ,ఆదాయా లూ అంతకంతకు కుంచించుకుపోవటం చేదు సంగతి !
పెరిగిన సాంస్కృతిక సందళ్లు..
గ్రామాల్లో, పట్టణాల్లో కొత్తగా ఎదిగిన సంపన్నవర్గం వివిధ పండగల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో జోక్యం చేసుకోవటం పెరిగింది. వినా యక మండపాలు, సంక్రాంతి సంబరాలు, ముగ్గు ల పోటీలు వంటివి స్పాన్సర్ల తోడ్పాటుతో నడుస్తు న్నాయి.రాజకీయాల్లోకి కొత్తగా వచ్చేవారు, రియల్ ఎస్టేటు వ్యాపారులు.. ప్రచార వ్యూహంతో ఈ సందర్భాలను ఉపయోగించుకోవటం సాధార ణంగా మారింది. సాంస్కృతిక ఉత్సవాలకు వేలు, లక్షలు వెచ్చించటం మామÖలు వ్యవహారం అయిపోయింది.గతంలో ఆయా ప్రాంతాల్లోని యువత నాటకాన్నో,నాట్యాన్నో స్వయంగా నేర్చు కొని, ప్రదర్శించటం ఊరికి లేదా ఆవీధికి సంద డిగా ఉండేది. ఇప్పుడు అలాంటి భాగస్వామ్యం కొరవడి, కళాకారులను దిగుమతి చేసుకోవటం సర్వసాధారణమైంది.
వెల్లివిరిసిన మహిళా చైతన్యం..
ఈకాలంలో అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు, కదలిక గణనీయంగా పెరిగింది. విద్యా, ఉపాధి రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ఆనందకారక మవుతున్నాయి.ఉన్నత విద్యలోనూ,ఉద్యోగ సాధనలోనూ విద్యార్థినుల సంఖ్య పెరగటం హర్ష దాయకం.శాస్త్ర,సాంకేతిక రంగాల్లోనూ ధీటుగానే రాణిస్తున్నారు.ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధ సమయంలోనూ మహిళల నేతృత్వం అద్వితీ యం.మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీ వాడల్లో డ్వాక్రా సంఘాల నిర్మాణమÖ, నిర్వహణ మÖడు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా సాగుతోంది. అంగన్వాడీలు, ఆశాలూ ఊరూరా నిరంతర సేవ లు అందిస్తున్నారు.ఆయా పార్టీల విధానాలకు లోబడే అయినప్పటికీ- మహిళా ప్రజాప్రతినిధుల స్వరం గట్టిగానే వినపడుతోంది.గ్రామీణ సాంస్కృ తిక రంగంలో మహిళల పాత్ర పెరగటం ఆసక్తి కర పరిణామం.కోలాటం,నృత్యం వంటి విభా గాల్లో ఇప్పుడు చాలా గ్రామాల్లో మహిళా బృం దాలు చురుగ్గా ఉన్నాయి.
వెల్లువలా సోషల్ మీడియా..
ఈ పాతికేళ్లకే పరిమితమైన కీలకమైన పరిణామం సోషల్ మీడియా ఆవిర్భావం, ప్రస్థా నం.చూస్తుండగానే ఈపదేళ్లలో ఉధృత రూపం దాల్చింది. ఇది పది వైపులా పదును ఉన్న కత్తి! సమాచార సాంకేతిక రంగంలో సైన్సు సాధించిన విజయానికి చిహ్నం. చాలా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. సమాజ చైతన్యానికి, సమా చార వెల్లడికి కొంతమంది ఉపయోగిస్తుంటే- కొన్ని స్వార్థపరశక్తులు విద్వేష వ్యాప్తికి వినియోగి స్తున్నాయి. చరిత్రను వక్రీకరించటం, విద్వేషాన్ని రగిలించటం,ఉద్వేగాలను రెచ్చగొట్టడం, రాజకీ య లబ్ధికి అబద్ధాలను ఊదరగొట్టటం ఒక మిష న్లా సాగిస్తున్నాయి.మతాన్ని రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగించుకుంటున్న ఉన్మాద శక్తులు లక్షలాది మందిని నియమించుకొని మరీ సోషల్ మీడియాను ప్రచారాస్త్రంగా మార్చుకు న్నాయి. చరిత్రను చదవని నేటి యువతరాన్ని అబద్ధాలతో, ఉద్వేగాలతో ఒక మత్తులా కమ్మేయ టం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఫ్యాక్ట్‌చెక్ పేరుతోనూ, నిజానిజాల విశ్లేషణతోనూ ఉన్మాద వ్యూహాలను ఛేదించే ప్రయత్నాలూ జరుగుతున్నా యి.అయితే,వాటిబలం, బలగం ఇంకా గణనీ యంగా పెరగాల్సి ఉంది.
ఆధునికత, వైజ్ఞానిక దృక్పథం, తార్కిక జ్ఞానం రాణించాల్సిన నవీన కాలం ఇది. కానీ, కొన్ని దుష్టశక్తులు వీటిని ఎద్దేవా చేస్తూ,వక్ర భాష్యాలకు దిగటం పెరిగింది. సూడో సైన్సు ను ప్రమోట్ చేయటం హెచ్చింది. గతమంతా గొప్పదే అన్న పెడసరితనం రాజ్యమేలుతోంది. రాజా రామ్మోహన్ రారు,కందుకూరి వీరేశలింగం, గుర జాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తలు సాగిం చిన, సాధించిన విలువలను, విజయాలను అవ హేళన చేస్తున్నారు.తమకు భిన్నంగా మాట్లాడేవారి మీద బూతులతో, నానా విధ కూతలతో దాడులకు దిగుతున్నారు.ఇలాంటి పిచ్చికూతల ఉన్మాద మÖకలను కట్టడి చేయటం చాలా అవసరం. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసు కుంటున్న యువతా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విద్యార్జనకు,విజ్ఞాన సముపార్జనకు,విషయ పరి జ్ఞానానికి వేదికలుగా ఉపయో గించుకొని, విజయాలు సాధించిన ఉదంతాలూ ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ, విచక్షణ పాటించటమే మేలైన మార్గం.
ప్రచారమే ప్రథమం..
పని జరిగితే ప్రచారం రావటం సర్వ సాధారణం. పనికి ముందే ప్రచారం పొందటం ప్రధాన విధిగా ఇప్పుడు అన్ని రంగాలూ భావిస్తు న్నాయి. గతంలో ఒక ీVAటలైనా,ఉత్పత్తి సంస్థ అయినా-తమ సేవల ద్వారా వినియోగదారులు సంతృప్తి చెందాలని, తద్వారా ప్రచారం పొందా లని ఆశించేవి. ఈ కాలం దానికి పూర్తి విరుద్ధం. హడావిడి, హంగామా ద్వారా ముందే పేరు పొం దాలని ప్రయత్నిస్తు న్నాయి. ఆఖరికి ప్రభుత్వాలూ ఇదే ఒరవడిలో సాగటం విచారకరం. ప్రచారమే ఒక వ్యూహంగా వ్యక్తులను అతిగా చిత్రీకరించ టం పెరిగింది. దీనికి ప్రచార సంస్థలు, వ్యూహ కర్తలు, పెద్ద సంఖ్యలో ప్రచారకర్తలూ రంగంలోకి దిగటం, ఇదంతా బహిరంగంగానే జరగటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రచారం కోసం ఏమాటైనా అనేయ టం,ఏ ఆరోపణైనా చేసేయటం చాలా సహజమైన విషయంగా మారిపోయింది. బడా నేతలు సైతం బాధ్యతారహితంగా వ్యవహరించటం వ్యవస్థల పతనానికి దారితీస్తోంది. ఇలాంటి ఆటల వల్ల తాత్కాలికంగా ఎవరు ఏ ప్రయోజనమైనా పొందొచ్చు గాక! కానీ, దీర్ఘకాలికంగా సమాజం నష్టపోతుంది.
సాహిత్య, సామాజిక రంగాల్లో..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పు,సమాచార వ్యవస్థ తెచ్చిన సౌలభ్యత.. ఎవరి చేతుల్లో ఎక్కువగా ఉంటే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వార్థపరశక్తులు ఎక్కువగా ఉపయోగించుకోవొచ్చు గాక!ఈ దేశపు జనాభాలో అత్యధిక శాతంగాఉన్న యువత నిజానిజాలను గ్రహించటం ఖాయం.కాలం తెస్తు న్న మార్పులను గమనించటం నిజం.
ప్రపంచీకరణ ఏం చేస్తుందో,ఎవరి లబ్ధికి ఎలా ఉపయోగ పడుతుందో-గడిచిన పాతికేళ్ల అనుభవం ఒక పాఠం. సామాన్యులు ఉరుకులపరుగుల అభద్రతతో తలమునకలవు తుంటే-సహస్ర కోట్ల సంపన్నులు కోవిడ్ లాంటి విపత్కర కాలంలోనూ కోట్లకు పడగలెత్తుతారని చాటి చెప్పింది. ఉద్యోగులను ఐదు రోజుల తీవ్ర చాకిరీతో చావగొట్టి, రెండ్రోజుల వీకెండు మత్తు లో ముంచి తేల్చుతుందని నిరూపించింది. యువ తరంలో ఈ గ్రహింపు మొదలైంది. అందుకనే బెంగళూరు నగరంలోని ఐటీ రంగంలోనూ హక్కుల పతాక రెపరెపలాడుతోంది. నల్ల చట్టా లకు నిరసనగా నెలలు తరబడి రాజధానిని చుట్టు ముట్టిన రైతుల పట్టుదల ఎంతటితో ఈ కాలమే మన అనుభవంలోకి తెచ్చింది. దేశం నలుమÖ లలా సమస్యలతో సతమతం అవుతున్న జనం ఏకోన్ముఖం కావటం ఇప్పుడు ఒక తప్పనిసరి కర్తవ్యం.సోషల్ మీడియా వివిధ రూపాల్లో చేతిలోకి వచ్చాక-ఎంతోమంది సమాజం గురిం చి మాట్లాడుతున్నారు. తమ ఆవేదనలను, ఆకాం క్షలను కవితలుగా, కథలుగా, వ్యాఖ్యలుగా వెల్లడి స్తున్నారు. వివిధ అంశాలపై పెరిగిన పాడ్‌కాస్ట్‌లు, ప్రచురిస్తున్న పుస్తకాలూ ఇందుకు సాక్ష్యం. పాతికేళ్ల క్రితం పుస్తకాలు చదివేవాళ్లు మధ్యలో సెల్ఫోన్ల వీక్షణంలోకి దిగినా-మళ్లీ పుస్తకం వైపు మళ్లుతున్న వారి సంఖ్యా గణనీయంగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాతికేళ్లలో కొత్తగా సాహిత్యం రాస్తున్న వారి సంఖ్య వెయ్యికి పైనే ఉంటుందని ఒకఅంచనా. సోషల్ మీడియా ఎక్కడె క్కడో ఉన్న ఏకాభిలాషులను కలుపుతోంది. కాలాన్ని సమÖహమయం చేయటానికి,సమైక్య భావం పలకటానికి,సంఘటితం కావటానికి దోహ దపడుతుంది. సాహితీ స్రవంతులుగా, సంగమ స్థలాలుగా ీVAరెత్తే గొంతులు ఒక్కటై సాగాలి! గత పాతికేళ్ల కాల ప్రస్థానాన్ని మార్పుల క్రమాన్ని అర్థం చేసుకొని,అర్థవంతమైన క్రమంలోకి మళ్లించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. 21వ శతాబ్ది రెండో పాతికేళ్లు మంచి మార్పులకు వాహికలు అవుతాయని ఆశిద్దాం.ఆదిశగా పయనిద్దాం.
కాలాన్ని మనుషులు నడిపిస్తారు..కాని కాలం నుంచి కలల రాజ్యానికి వారే స్వయంగా వంతె నలు నిర్మిస్తారు..ఆ వంతెనలను కూల్చటానికి, ఐక్యత విచ్ఛిన్నానికి,పాలకులు నానా విధాలా ప్రయత్నిస్తారు.కుతంత్ర వ్యూహాలను ఛేదించు కుంటూ మలిపాతికేళ్లూ సాంతం మనవేనని ము న్ముందుకు పోవటమే మనంచేయాల్సిన పని ! కాలమÖ,మనమÖ కలిస్తేనే అభివృద్ధి ఫలం పనులతోనూ, ఫలితాలతోనూ కొలుచుకోవటం మొదలయ్యాకనే-‘కాలం’అనే గణన ఆచరణ లోకి వచ్చింది.మానవులు అనే ఆలోచనాపరులు ఆవిర్భవించటానికి ముందు,ఆఆలోచనా పరులూ కాల విభజనకు ఇంత ప్రాధాన్యం ఇవ్వటానికి ముందు ఇప్పట్లా నెలలూ లేవు, సంవత్సరాలూ లేవు. ప్రకృతిలో జరిగే పరిణామాలే కాల గణనకు మÖలంగా ఉండేవి. ఇలా చాలాకాలం గడిచాక కానీ,కాలం అనే అవగాహన, దానికి సంబంధిం చిన కొలమానాలూ ఏర్పడలేదు. మానవులు తమ చుట్టూ జరుగుతున్న మార్పులను పరిశీలించ టానికి, తాము చేపట్టిన పనులను సమీక్షించుకోవ టానికి-కాలాన్ని ఒకసంకేతంగా అమల్లోకి తెచ్చు కున్నారు. సమాజం ఆధునికం అవుతున్న కొద్దీ కాలానికి ప్రాధాన్యం పెరిగింది. జీవితం వేగ వంతం అయినకొద్దీ సమయానికి విలువ చేకూ రింది. కాలమÖ,సమయమÖ ఎవరి చేతిలోనూ ఉండవు. కానీ,దాని వినియోగం ఎవరి వైపు నుంచి, ఎవరి ప్రయోజనాల వైపు నుంచి జరుగు తోంది అన్నది ఆ సమాజపు స్వభావాన్ని తెలియ జేస్తోంది.
వానలు కురవటం, చలిగాలులు వీయటం,చెట్లు మోడు వారటం,మళ్లీ చిగు రించటం,ఎండలు కాయటం వంటి పరిణా మాలకే మన పరిసరాలు పరిమితం అయివుంటే- కాలంలో కదలిక పెద్దగా ఉందని మనం అను కోం.అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ మన కళ్ల ముందు కదలాడుతున్నాయని అనుకుంటాం. మనిషి పుట్టుక-పెరుగుదల వంటి మనుగడ క్రియల్లోనే కాల పరిణామాన్ని గణించుకుంటాం. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇలాగే జరిగింది. ఆధునిక నిర్మాణాలు,మోటారు వాహనాలు వచ్చాక ‘కాలం’ లో వేగం అనుభవంలోకి వచ్చింది. మనుషులు తీసుకొచ్చే మార్పులే కాలానికి వేగం అనే స్పృహను ఆపాదించి పెట్టాయి.19వ శతాబ్దం అనేక ఆధునిక ఆవిష్కరణలకు ఆలవాలం. అనేక ఆధునిక భావాలకు, పలు పరిణామాలకు వేదిక. ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప మార్పులన్నీ ఈ కాలంలోనే సంభవించాయి. అభివృద్ధికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ఆటంకంగా ఉన్న పాత భావా లను వదిలించుకొని, ముందుకు నడవటం ముమ్మరంగా సాగింది. పాత భావాలను నెత్తిన పెట్టుకున్న ఛాందసవాదులు వ్యతిరేకించినా- నూతన భావాల ఆవిష్కరణ, ఆచరణ ఆగలేదు. ఆ వరవడి వేగంగా సాగబట్టే-ఆధునిక సమా జానికి అనేక సదుపాయాలూ,సౌకర్యాలూ సమ కూరాయి. కొత్త సమాజాలు ఏర్పడ్డాయి. విద్యా వికాసాలు అన్ని తరగతుల్లోకి ప్రసరించటం మొదలైంది.
(ప్రజాశక్తి సౌజన్యంతో..) వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
