మానవ అక్రమ రవాణా..
‘ఆర్ధిక ప్రయోజనాల కోసం ప్రజల హక్కులు,రక్షణను అతిక్రమించి,అభీష్టానికి వ్యతిరేకంగా వారిని పీడించడమే మానవ అక్రమ రవాణా..ఏటా లక్షల మంది ఇలాంటి పీడనకు గురవుతూ సామాజిక మినహాయింపు/వెలి(సోషల్ ఎక్స్‌క్లూజన్)పరిధిలోకి చేరుతున్నారు.ఈ సామాజిక వైపరీత్యంవల్ల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనతోపాటు దేశం విలువైన మానవ వనరులను కూడా కోల్పోతోంది.’ – గునపర్తి సైమన్
అక్రమ రూపాలు ఇలా ..
బాలల దొంగిలించడం లేదా కొనుగోలు చేయడంద్వారా నెలల వయస్సులోనే బాలలను సేకరిస్తారు.బాలికలకు ఎక్కువ డిమాండ్ ఉంటుది.ఇలా అక్రమంగా తీసుకొచ్చిన బాలబాలికల ద్వారా అనేక రూపాల్లో ఆర్ధిక ప్రయోజనం పొందుతుంటారు.ఆడుక్కునేలా చేయడం,గృహ పనులు,యవ్వవనంలో బాలికలతో వ్యభిచారం,బలవంతపు చాకిరి,బాలురతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం.యువతలను దొంగలించడం,కిడ్నాప్ చేయడం, కొనుగోలుచేయడం,దొంగపెళ్ళిళ్లు చేసుకోవడం,ఆకర్షించడంద్వారా యువతలను సేకరిస్తారు. అదేవిధంగా అడుక్కోవడం,మానవ అక్రమ రవాణాను నిర్వహించడం వంటి పనులపై శిక్షణలు ఇచ్చి అలవాటు చేస్తున్నారు.బాల్యంలో గృహ పనులు,కౌమర/యవ్వన దశలో వ్యభిచారం,అదనపు భార్యలుగా ఉంచడం,బలవంతపు చాకరి,మానవ అక్రమ రవాణాలో యజమానులుగా మార్చడం.పురుషులను ఉద్యోగ ఆకర్షణతో సేకరిస్తున్నారు.
ఏటా 40వేల మంది బాలల అదృశ్యం..
భారత దేశంలో బలహీనవర్గాలకు చెందిన ప్రజలు,ప్రధానంగా మహిళలు మానవ అక్రమ రవాణాకు బలవుతున్నారు.ఏటా40,000మంది బాలలు అదృశ్యం అవుతున్నారు. అందులో 10వేల మందికి పైగా శాశ్వతంగా దొరకడం లేదు.దీంటో సన్ రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్..మానవ అక్రమ రవాణాలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.దేశ వ్యాప్తంగా అక్రమ రవాణాకు గురయ్యే వారిలో14.73శాతంమంది ఏపీకి చెందిన వారేనని ఓ సర్వేలో వెల్లడైంది.ఈ విషయంలో మన కంటే పశ్చిమ బెంగాల్ మాత్రమే ముందుండటం కలవరానికి గురి చేస్తోంది.దేశంలోని వివిధ ప్రాంతానికి అక్రమ రవాణాకు గురయ్యే వారిలో బెంగాలీ అమ్మాయిలు,మహిళలు 15శాతం ఉన్నారని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు ఎస్.రాజ్యలక్ష్మి తెలిపారు.యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యÖఎనఓడీసీ) సర్వేలో విస్మ యం గొలిపే ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి.
మానవ అక్రమ రవాణకు సంబంధించి 2014లో 144 కేసులు నమోదు కాగా,2015లో 145 కేసులు నమోదయ్యాయి.గతేడాది 138కేసులు నమోదు కాగా, గత ఆరు నెలల్లో 32 కేసులు నమోదు చేశారు.ఈ ఏడాది జనవరి నుంచి 939మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు రిపోర్టయ్యాయి.పోలీసులు 800మంది అమ్మా యిలను రక్షించగా,వీరంతా 16ఏళ్ల లోపు వయస్కులే కావడం గమనార్హం.అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎన్జీవోలు తమవంతుగా కృషి చేస్తున్నా యి. అక్రమ రవాణాకు గురవుతున్న వారిలో 27.41 శాతం కుటుంబ సభ్యుల బలవంతం కారణంగా వ్యభిచార రొంపిలో దిగుతున్నారు.18.40శాతం మందిని తెలిసిన వారు, 9.31శాతం మందిని పరిచ యం లేనివారు వ్యభిచారంలోకి లాగుతున్నారు.43 శాతం మంది తమంతట తాముగా ఈ నరక కూపం లోకి వెళ్తున్నారు.
గోవాలో పనిచేస్తున్న సెక్స్ వర్కర్లలో 85 శాతం మంది,ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో పని చేస్తున్నవారిలో 38శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని ఓఎన్జీవో సర్వేలో తేలింది.తూర్పు గోదావరి,కృష్ణా,గుంటూరు,విశాఖపట్నం ప్రకాశం, కర్నూలు,అనంతపురం,చిత్తూరుజిల్లాల నుంచి అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోందని హెల్ప్ అనే ఎన్జీవో డైరెక్టర్ ఎన్.వి.ఎస్ రామ్మోహన్ తెలిపారు.అక్రమ రవాణాకు విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ పట్నం నగరాలు ప్రధాన కేంద్రాలు మారాయని ఆయన చెప్పారు.అభం శుభం తెలియని మైనర్ బాలి కలను ఇక్కడి బ్రోకర్లు గోవా,ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక తదితర ప్రాంతాల్లోని వేశ్య గృహాలకు విక్రయి స్తున్నారు.దేశంలో మానవ అక్రమ రవాణాకు యాచక వృత్తి,వ్యభిచారం ప్రేరణలుగా నిలుస్తున్నాయి. ఆకర్ష ణీయ రంగు,రూపం ఉన్న బలహీన వర్గాలు/తెగల మహిళలను ఈఊబీలో దించుతున్నారు.దేశంలో మానవ అక్రమ రవాణాపై అధ్యయనం చేసిన జస్టిస్ వర్మ కమిటీ సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపిం చింది.
దోహదపడుతున్న అంశాలు..
పేదరికం..:దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 15శాతంపైగా తీవ్ర పేదరికం ఉన్నట్లు తెలుస్తోంది. పేదరికాన్ని భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెట్టిచాకరి,వ్యభిచారం,బలవంతపుచాకరి వైపు పయని స్తున్నారు.పిల్లలను పెంచలేని పరిస్థితి,కనీస జీవన అవకాశాల లేమి వారిని ఈ దిశగా ప్రేరేపిస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా మానవ అక్రమ రవాణాలో క్రియాశీలక పాత్ర దళారులదే.ఆకర్షణీయ జీవితాన్ని ఊహించుకుని..గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం దళారులు పన్నిన వలలో పడుతున్నారు.తమ హక్కు లు, బాధ్యతలు కోల్పోయి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు.తీరా అక్కడికి చేరుకున్నాక బానిస బతుకులు బతకాల్సి వస్తోంది.నైపుణ్యం అంతగా లేని ఉద్యోగాల్లో ఈఅవస్థలు ఎక్కువ.తల్లిదండ్రుల ఆలోచనధోరణి కూడా దీనికి కారణం.తాము ఎలాగూ మంచి జీవితాన్ని చూడలేదని,కనీసం తమ పిల్లలైనా బాగుపడతారనే ఆశావాదంతో వారిని ఇతర ప్రాంతా లకు పంపిస్తున్నారు.వివాహం,ఒప్పందం రూపాల్లో వేరే ప్రాంతాలకు బదిలీ జరుగుతోంది.పిల్లలు కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదని దళారుల మాట నమ్మి బలవుతున్నారు.కొత్త ప్రాంతాల్లోకి వెళ్లిన తర్వాత బహ/భార్యత్వం,బలవంతపు చాకరి లాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.హక్కులు,జీవన భద్రత లేకుండా నిస్సహాయ జీవితాన్ని గడుపు తున్నారు. పిల్లల కొనుగోలులో కూడా ఈ దళారులదే కీలక పాత్ర.తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పిల్లలను తరలిస్తున్నారు.డబ్బును ఎరగా చూపించడం వల్ల వారు నిస్సహాయలుగా మిగిలిపోతున్నారు.
సమస్య తీవ్రతను గుర్తించకపోవడం..
సమాజం,ప్రభుత్వం ఉదాసీన వైఖరిని ప్రదర్శి స్తున్నాయి.విలువైన మానవ వనరులు దోపిడికి గురవు తున్నాయనే స్పృహ వారిలో కొరవడింది. మానవ అక్రమ రవాణా మÖలాలు స్పష్టంగా వారికి తెలుస్తున్న ప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
పేదరికం నిర్మూలన పథకాల వైఫల్యం..
గ్రామీణ,పట్టణ పేదరిక నిర్మూలన పథకాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడంలేదు.ఇక గత్యం తరం లేక తప్పనిసరి నరకంగాభరిస్తూ అక్రమ రవా ణాకు వాహకాలుగా మారుతున్నారు.అక్రమ రవాణా రూపాలు సంప్రదాయాలు,ఆచారాలతో ముడిపడి ఉంటున్నాయి.దీనివల్ల సమాజం నుంచి పెద్దగా ప్రతి ఘటన రావడం లేదు.పేదరికంలో మగ్గుతున్న సమా జంలోని ప్రజలు వ్యభిచారం,బలవంతపు చాకిరీలను పెద్ద సమస్యలుగా భావించడం లేదు.
పట్టణీకరణ..
పట్టణాల్లో పెరుగుతున్నజనాభా ఒత్తిడి కూడా మానవ అక్రమ రవాణాకు ఉపకరిస్తోంది.ఉపాధి కోసం పట్టణాలకువచ్చిన శ్రామికులు,కూలీలు, యువ మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. మహిళ లను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించు తున్నారు. చేసిన నేరాలను కప్పిపుచ్చవచ్చనే హామీలతో వారిని ప్రేరేపిస్తున్నారు.కోల్కత్తా,ముంబాయి,న్యూఢిల్లీ లాంటి జంక్షన్ ప్రాంతాలు సీమాంతర అక్రమ రవాణాకు ఉపకరిస్తున్నాయి.విదేశీ మహిళలకు భారతదేశంలో బాగా డిమాండ్ ఉంచటంతో అక్రమ రవాణా జరుగు తుంది.కాశ్మీర్ లాంటి సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర వాద ముసుగులో బాలలను అక్రమంగా తరలిస్తున్నారు. నాగాలాండ్,మిజోరాం లాంటి ప్రాంతాల్లోనూ అక్రమ రవాణా ఎక్కువగా ఉంది.
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా…
రాష్ట్రంలో మానవ అక్రమ రావాణా భారీగా పెరుగుతోందన్నారు. సైబర్ నేరాలతో అధికంగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయన్నారు.ఏపీ ీీVAం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రావాణా భారీగా పెరుగుతోంద న్నారు. సైబర్ నేరాలతో అధికంగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయన్నారు.సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంట రింగ్ సైబర్ అనబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పై విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి సదస్సును ప్రారంభించిన ీVAంమంత్రి అనిత సం చలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజు రోజూకూ మానవ అక్రమరవాణా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజ్వల ఎన్జీవో, యÖఎస్ కాన్సులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సు కు వివిధ రాష్ట్రాలన నుంచి జడ్జిలు,పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తు తం దేశంలో సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ీVAమంత్రి అన్నారు. అమాయ కులను టార్గెట్ చేస్తూ..ఉద్యోగాలు, మ్యారేజీ బ్యూరోల ముసుగులో ఆన్లైన్ ద్వారా మానవ అక్రమరవాణా జరుగుతోందని ీVAం మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాల్ సెంటర్ల ద్వారా విదేశా లకు కూడా మానవ అక్రమ రవాణా జరుగుతోందని చెప్పారు.సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవ సరం ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రా యపడ్డారు.
