బొద్దింకలుగా కనిపిస్తున్నది యువత కాదు వ్యవస్థ వైఫల్యం
ఏదో అలజడి వుండింది.ఆశాభావం ఉం డింది. అదీ కాకపోతే ఎలాగైనా ముందుకు పోవాలనే తెగింపు. శాసనసభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ప్రస్తుతం సంధి దశ ఏదో అవాస్త వికంగా గోచరిస్తున్నంది. ఒక రాజకీయ శక్తిగా బీజేపీ అజేయమైందనీ, అంత కన్నా ముఖ్యంగా దాని స్థానం మరెవరూ తీసుకోలే రని ఒక కథనాన్ని వ్యాపింపచేయడంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు నిమగ్నమై ఉన్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఎక్కడకు చేరుస్తున్నది?
ఇప్పుడు ఐఐటీలకు జేఈఈ కూడా వచ్చి చేరింది.2026లో ఇది పరాకాష్టకు చేరింది. ఈమొత్తం వ్యవహారంలో మరీ చాలా దారుణమైన అంశమేమంటే మానవ వనరుల మంత్రిత్వశాఖకు,ఇంకా చెప్పా లంటే మొత్తం ప్రభుత్వానికి జవాబుదారీ తనం బొత్తిగా లేకుండా పోవడం,ప్రజా స్వామ్యం పేరు చెప్పుకునే ప్రభుత్వం ఏదైనా సరే కనీసంగా బాధ్యతాయుతంగా స్పందించి ఉండేది.కానీ హతవిధీ!ఎలాంటి ప్రతి విమర్శకూ అవకాశమే లేని ఆలోచ నకే తావివ్వని ప్రస్తుత వాతావరణంలో మనకు ఇసుకలో తలదూర్చే ఉష్ట్రపక్షులు మాత్రమే ఉన్నాయి.ఫాసిస్టు తరహా జంతు జాలం పెరగడానికిది బాగా అనువైన వాతావరణం.
డిజిటల్ రంగస్థలం..
ఇలా ఎందుకు జరుగుతుంది?కనీసంగా జరగాల్సింది హెచఆర్‌డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం.ఎన్నికైన ఒక ప్రభుత్వంపై యువత విశ్వాసం పునరుద్ద రింప బడాలంటే అది తప్పనిసరి.అయితే ఇది కేవలం 2026పరీక్షలకు సంబంధించిన సమ స్య మాత్రమే కాదు.చాలా సంత్స రాలుగా ఎన్టీఏ జరుపుతూ వస్తున్న 70కిపైగా పరీక్షల పరిస్థితి అనుమానాస్పదంగా మారి పోయింది.అందువల్ల తీవ్రమైన చర్య ఏదో తప్పక జరగాలి.యువజనుల సమిష్టి బృందా లకు ప్రతీకగా మారిన బొద్దింకలు యుద్దానికి దిగాయి.వెనక్క తిరిగిచూస్తే ఇదిజరగవలసి ఉండిందే.నిరీక్షణలోఉన్నదే.ఈ వైఫల్యం మరీ ముఖ్యంగా జవాబుదా రీతనం అన్నది మృద్యం కావడం ఏదో ఒక విధమైన తిరుగుబాటుకుదారితీసి ఉండేది.ఈరోజున యువజనులు దద్దమ్మలు కాదు.డిజిటల్ ప్రపంచంలో ప్రతిభ చూప గలవారే.కనుక వారి నిరసనకు అంతర్జా లమే రంగస్థలం కావడం తథ్యం. ప్రజా స్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరిగే వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఆత్మగౌరవం, ప్రజల భాగస్వా మ్యం,ప్రజల ప్రశ్నించే హక్కు.ఈదేశాన్ని ఎవరు పాలించాలి,ఎవరు అధికారంలో ఉండాలి,ఎవరు ప్రజల విశ్వా సాన్ని కోల్పోవాలి అన్న తుది నిర్ణయాన్ని చివరికి ప్రజలే తీసుకుంటారు.రాజకీయ నాయ కులు మారుతారు,ప్రభుత్వాలు మారు తాయి,అధికారులు మారుతారు, న్యాయ మూర్తులు కూడా మారుతారు.కానీ ప్రజలే శాశ్వతం.అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం.ప్రశ్నించే స్వరాన్ని వినడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం.అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే యువతను, నిరుద్యోగులను,సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలను లేదా వ్యవస్థను ప్రశ్నించే వర్గాలను “బొద్దింకలు”వంటి జీవులతో పోల్చ డం కేవలం ఒకపదప్ర యోగం కాదు; అది ఒక ప్రమాదకరమైన సామాజిక-రాజకీయ భావజాలానికి సంకేతం.ఎందుకంటే చరిత్ర మనకు స్పష్టంగా నేర్పిన ఒకసత్యం ఉంది. ఒక సమాజం ముందుగా మనిషిని అగౌరవ పరుస్తుంది,తర్వాత అతని హక్కులను తీసి పడేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా అసహ్యకరమైన జీవిగా చిత్రీకరించే భాష ఎప్పు డూ సమానత్వానికి దారి తీసింది కాదు.. అది ఎల్లప్పుడూ అణచి వేతకు,వివక్షకు,నియంత్రణ త్వానికి మాత్రమే దారి తీసింది.అందుకే గుర్రం జాషువా తన గబ్బిలం ద్వారా భారత సమాజం లోని కులాధారిత అమానవీయతను తీవ్రంగా ప్రశ్నించాడు.సమాజం అసహ్యంగా చూసే గబ్బి లానికైనా దేవాలయంలోకి ప్రవేశించే హక్కు ఉం దిగానీ,ఒక మనిషికి మాత్రం లేదని ఆయన తన కవిత్వంద్వారా చెప్పినప్పుడు,అది కేవలం సాహిత్య ప్రకటన కాదు అది మనిషిని మనిషిగా చూడని సంస్కృతిపై ఒకచారిత్రక తిరుగుబాటు.వేలఏళ్లుగా ఈ దేశంలో అణగారిన వర్గాలను‘తక్కువ మను షులు’,‘అస్పృశ్యులు’,‘అర్హత లేనివారు’గా చిత్రీక రించే సంస్కృతి ఎలా పనిచేసిందో మనచరిత్ర చెబుతోంది.అదే భావజాలం ఆధునిక భాషలో,కొత్త రూపాల్లో మళ్లీ బయటపడటం ఆందోళనకరం. భాష అనేది కేవలం భావాలు తెలుపుకునే సాధనం మాత్రమే కాదు.అది సంస్కృతిని నిర్మించే శక్తి.ఒక మాట సమాజాన్ని నిర్మించగలదు; అదే మాట సమాజాన్ని విషపూరితం చేయగలదు.‘బొద్దింక’ వంటి పదాలు కేవలం అవమా నపరిచే పదాలు కావు,అవి ఒక వర్గాన్ని‘మనుషులుగా చూడ కూడదు’ అనే ప్రమాదక రమైన మానసికతకు బీజం వేస్తాయి.చరిత్రలో నియంతృత్వ పాలనలు కూడా ఇలాగే ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నించే వర్గాలను అపహాస్యం చేశారు.తర్వాత వారి గౌరవాన్ని ధ్వంసం చేశారు.చివరికి వారి స్వేచ్ఛను హరించారు.అందుకే ప్రజాస్వామ్యంలో అధికార స్థానాల్లోఉన్న వ్యక్తుల భాష మరింత బాధ్యతాయుతంగా ఉండాలి.ఒకవేళ ప్రశ్నించే యువతనే‘బొద్దింకలు’అయితే,ఈ దేశంలో అవి నీతి,అక్రమాలు,అవకాశాల దోపిడీ ద్వారా లక్ష లాది ఉద్యోగ అవకాశాలను నాశనం చేసినవారు చీడపురుగులా? ఇంట్లోకోట్ల డబ్బుబ్లాక్ మనీ దాచుకొని బట్టబయలు అయిన వారిని ఏమనాలి? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం అనేది యువత వైఫ ల్యం కాదు.అది వ్యవస్థ వైఫల్యం.కొందరు అధికార యంత్రాంగాల్లో,రాజకీయ వ్యవస్థల్లో, నియామక వ్యవస్థల్లో పెరిగిన అవినీతి,అక్రమ నియామకాలు, పరీక్షా లీకులు,అవకాశాల కేంద్రీ కరణ వల్లే నిరుద్యోగం ఈదేశంపై ఒకసామాజిక గాయం లాగా మారింది.ఈ నిరుద్యోగ సంక్షోభం ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై ఒకేలా పడటం లేదు. ముఖ్యంగా దళితులు, బహుజను లు, వెనుకబడిన వర్గాల యువత ఎక్కువగా ఈ బాధను మోస్తు న్నారు. రాజకీయ సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. ఓటు హక్కు అందరికీ ఉంది. కానీ సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. చదువుకున్నా అవకాశాలు అందకపోవడం, ప్రతిభ ఉన్నా వ్యవస్థలో చోటు దక్కకపోవడం, కులం, ఆర్థిక స్థితి కారణంగా వెనుకబడిపోవడం ఇప్పటికీ ఒక కఠినమైన వాస్తవం.
ఒక నిరుద్యోగ యువకుడి జీవితం కేవలం ఒక గణాంకం కాదు. అతని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి. అప్పులు ఉంటాయి. సంవత్సరాల కష్టపడి చది విన శ్రమ ఉంటుంది. కానీ చివరికి పరీక్షలు లీకవుతాయి, ఉద్యో గాలు అమ్ముడవుతాయి, అవకాశాలు కొందరి చేతుల్లో బందీలవు తాయి. అలాంటి పరిస్థితుల్లో యువత ప్రశ్నిస్తే, వారి గొంతును అసహ్యకరమైన జీవులతో పోల్చడం అంటే బాధితులనే నిందించడం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య భాష కాదు; ఇది అధికార అహంకార భాష.
ప్రజాస్వామ్యం ప్రశ్నలతో బతుకుతుంది. నియంతృత్వం ప్రశ్నలను చంపి బతుకుతుంది. ప్రశ్నించే యువత దేశానికి ప్రమా దం కాదు; ప్రశ్నను అణచివేయాలనుకునే సంస్కృతే దేశానికి అసలు ప్రమాదం. ఎందుకంటే ఈ దేశంలో అంతో ఇంతో ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉందంటే, అది ప్రశ్నించే గొంతుల వల్లే. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం వల్లే. సమానత్వం కోసం నిలబడే యువత వల్లే.ఈ దేశాన్ని నిర్మించేది అధికార కుర్చీలు కాదు. ప్రజల విశ్వాసం.ప్రజల గౌరవం. ఒక నిరు ద్యోగ యువకుడి కన్నీరు,ఒక అణగారిన వర్గం ఆవేదన,ఒక ప్రశ్నించే గొంతు ఇవే ప్రజాస్వామ్యా నికి నిజమైన పునాదులు. ఆ గొంతును పురుగులతో పోల్చే సమాజం చివరికి తన మానవత్వాన్నే కోల్పోతుంది.ఈ దేశంలో అంతో కొంతో ప్రజాస్వామ్యం బతికి ఉంది అంటే అది కేవలం ప్రశ్నించే గొంతు వల్లనే. ‘కొందరి’ అగ్రకుల భాషలో చెప్పాలంటే ‘బొద్దింకల’ వల్లే !!! – ఫౌజాన్
-వ్యాసకర్త :` న్యాయశాస్త్ర విద్యార్థి, హైదరాబాద్
