తెరపైకి మళ్లీ బాక్సైట్ అలసడి

“ఉమ్మడి విశాఖ,అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం మరోసారి తీవ్ర అలజడి సృష్టిస్తోంది.గూడెంకొత్తవీధి మండలం జెర్రెల అటవీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి లేకుండా రహస్యంగా సర్వేలు, నమూనాలు సేకరిస్తున్న వ్యక్తులను స్థానిక గిరిజనులు,పెసాకమిటీ సభ్యులు అడ్డుకుని వారి వాహనాలను నిర్బంధించారు.సర్వే సిబ్బందిని స్థానిక సచివాలయ కార్యాలయంలో నిర్బంధించారు.అలాగే జిల్లావ్యాప్తంగా గిరిజన సంఘాలు,వివిధ రాజకీయ,వామపక్షపార్టీలు సంయుక్తంగా ధర్నాలు,ఆందోళనలు చేపడు తున్నారు. బాక్సైట్ వెలికితీస్తే సహించేది లేదంటూ ప్రతిజ్ఞలుచేస్తూ నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి.”               - గునపర్తి సైమన్

కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవినోపాధిని పొందుతున్నారు.మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొంబలు అంతరించిపోవడంతోపాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆది వాసీలు ఆది నుంచే బాక్సైట్ తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని,తాగునీటి వనరులు కూడా దొరకవడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఒడిసాలో అత్యధి కంగా 41శాతం నిల్వలు..అంటే 2,057 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్.. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధి లోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) లో ఆరు బ్లాకులు..చింతపల్లి,సప్పర్ల, అనం తగిరి,గుర్తేడు,గూడెం,కాటంరాజ్ కొండల్లో సుమారుగా 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి.1980లోనే బాక్సైట్ నిల్వల గురించి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎసఐ) నివేదికలు ఇచ్చింది. బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్ర ప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందా ల్లోని అక్రమాలు,ఆదివాసీల పోరా టాలే కారణం.ఉమ్మడి విశాఖ జిల్లా లోని దట్టమైన అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు న్నాయి. ఇది షెడ్యూల్డ్ ఏరియా. నిబం ధనల ప్రకారం మైనింగ్ ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్ లీజులు ఇవ్వాలి.ఈలెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. ఏపీఎండీసీ మైనింగ్ బాధ్యతలు నేరుగా నిర్వహించదు కాబట్టి ప్రైవేటు కంపెనీలతో జతకట్టింది.దీంట్లో భాగంగా అరకు, సప్పర్ల ఏరియాల్లో మైనింగ్‌తోపాటు అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు జిందాల్ సౌత్‌వటస్ట హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత చింతపల్లి అటవీప్రాంతం లోని జెర్రెల బ్లాకులో అల్యూమినియం రిఫైరీ ఏర్పాటుకు 2007లో రసఆల్ ఖైమాతో ఏపీఎండీసీ ఒప్పందం చేసు కుంది. ఆతర్వాత రసఆల్‌ఖైమా పెన్నా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఆన్‌రాక్‌ను ఏర్పాటు చేసు కుంది.ఈ మేరకు ఏపీఎండీసీ ఆన్‌రాక్‌తో బాక్సైట్ సరఫరా ఒప్పందం కుదుర్చు కుంది. అనంతర కాలంలో కేంద్రం నుంచి అవసరమైన ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు,అందు లోని అంశాలపై 2013లో కాగ్ ఓ సంచ లన నివేదిక ఇచ్చింది.అనేక లోపాలను ఎత్తిచూపింది. ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం (ఈవోఐ) లేకుండా.. ఏపీఎండీసీకి తీవ్ర స్థాయిలో నష్టం జరిగేలా ఒప్పందంలో క్లాజులున్నాయని..రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేవలం 1.5శాతం ఈక్విటీ ఇచ్చారని..ఇలా పలు కీలక అంశాలను లేవనెత్తింది.ఇది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిం చింది.మరోవైపు ఆన్‌రాక్ ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాటాలు చేశాయి.దీంతో ఆన్‌రాక్‌తో ఏపీఎండీసీ చేసు కున్న బాక్సైట్ ఒప్పందం ఆమోదానికి సంబం ధించిన 222, 289 జీవోలను ప్రభుత్వం 2016లో రద్దుచేసింది.ఈమేరకు జీవో 44 జారీ చేసింది.అలాగే..ఏపీఎండీసీకి బాక్సైట్ బ్లాక్ లీజుల కేటాయింపును కూడా రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. కేంద్ర గనులు,ఖనిజాల నియంత్రణ,అభివృద్ధి చట్టం-2015లోని సవరించిన క్లాజుల ప్రకా రం ఈకీలక నిర్ణయం తీసుకుంది.ఈ పరిణా మాలపై ఆన్‌రాక్ హైకోర్టుల్లో, తర్వాత సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసింది.ఎక్కడా ఊరట లభించకపోవడంతో లండన్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది. ఒప్పందాల రద్దు వల్ల తనకు రూ.2,500కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. దీనిపై మార్చి 26న విచారణ జరుగనుంది.
సీఎంసీ పాలసీతో మళ్లీ కదలిక..
మరోవైపు..కేంద్రం గనులు,ఖనిజాల రంగంలో సంచలన నిర్ణయం తీసుకుంది.క్రిటికల్ మిన రల్స్ పాలసీ (సీఎంసీ)ని ప్రకటించింది అత్యంత అరుదైన ఖనిజాల మైనింగ్‌లో స్వయం సమృద్ధిని సాధించేలా ఈవిధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అరుదైన ఖని జాల మైనింగ్ చేపట్టాలని నిర్ణయించింది. అంటే బీచ్‌శాండ్‌తోపాటు బాక్సైట్ కూడా ఇందులో భాగమే.ఈ నేపథ్యంలో గనులశాఖ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బాక్సైట్ మైనింగ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. సీఎంసీలో భాగంగా రాష్ట్రంలో బాక్సైట్ మైనింగ్ చేపడితే..అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుతోపాటు విలువ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని..ఫలితంగా ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉం దని జనవరి చివరి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రత్యక్షంగా,పరోక్షంగా 60 వేల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా తెలిపింది.
ఖనిజాభివృద్ధి సంస్థ పేరిటే లీజులు..
అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలోని ఆరు బ్లాకుల్లో మైనింగ్ లీజులు నేరుగా గిరిజన ఆదివాసీలు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే ఇవ్వాలి. అందుచేత తన శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ పేరిట మైనింగ్ లీజులు ఇప్పించాలని గనులశాఖ కోరింది.నామినేషన్ పద్దతిన లేదా వేలం విధానంలో అయినా లీజులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఏపీఎండీసీకి లీజులు ఇప్పిస్తే మైనింగ్, అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుకు అది డెవలపర్‌ను నియ మించుకుంటుందని నివేదికలో పేర్కొంది. అంటే.. మైనింగ్ రంగంలో పేరున్న ప్రైవేటు కంపెనీతో ఒప్పందాలు చేసుకుని డెవలపర్‌గా ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం బీచ్‌శాండ్ కాంట్రాక్టులో భాగంగా అదానీ గ్రూపునకు చెందిన ‘అల్లూవియల్ హెవీ మినరల్స’కంపె నీని డెవలపర్‌గా నియమించుకుంది.బీచ్ శాండ్ మైనింగ్‌లో ఆ కంపెనీకి 90శాతం వాటా ఉండగా.. ఏపీఎండీసీకి 10శాతమే ఉంది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. బాక్సైట్ మైనింగ్‌లోనూ డెవలపర్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని గనుల శాఖ కోరుతోంది. అయితే లీజుల నిర్ణయాధి కారం కేంద్రం పరిధిలో ఉంది. బాక్సైట్ లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలంటే తొలుత రాష్ట్రప్రభుత్వం ఓవిధాన నిర్ణయం తీసు కోవాలి.ఏపీఎండీసీకి లీజులివ్వాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేయాలి.ఆతర్వాత కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని కేంద్రానికి సిఫారసు చేస్తే ఏపీఎండీసీ పేరిట లీజులు మంజూరవడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జగన్ జమానాలో ఇలా…
ఉమ్మడి గోదావరి జిల్లాలు,విశాఖ,విజయ నగరంలోని అటవీప్రాంతంలో అత్యంత విలు వైన లాటరైట్,బాక్సైట్‌తోపాటు రోడ్‌మెటల్ వంటి ఖనిజాల లీజులున్నాయి. బాక్సైట్ తవ్వ కాలు లేవుగానీ గత జగన్ ప్రభుత్వంలో లాట రైట్ పేరిట బాక్సైట్‌ను తవ్వి వ్యాపారం చేసుకు న్నారు. మట్టి తవ్వకాల పేరిట అక్రమంగా లాటరైట్‌ను తవ్వి తరలించుకుపోయారు. ఇక క్రషర్ యూనిట్లకు కొదవలేదు.దేశంలో మరె క్కడా లేని యూనిట్లు అటవీప్రాంతంలో ఉన్నా యి. వీటిపై గతంలో వైసీపీకి చెందిన ఎంపీ కుమారుడు, జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ముఖ్య అధికారి కుమారుడు,మేనల్లుడు,కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గుత్తాధిపత్యం నడిపారు.పైసా పెట్టుబడి లేకుండా అన్ని రకాల మైన్లను తమ నియం త్రణలోకి తీసుకొని దందా నడిపారు. ఎదురు తిరిగిన వారిని బెదిరించేందుకు,భయపెట్టేం దుకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ప్రజాప్రతినిధిని(ప్రస్తుతం మాజీ) మన్యంకు తీసుకెళ్లారు. అక్కడ రాయలసీమ మార్క్ సెటిల్‌మెంట్లు చేశారు.జగన్ సర్కారు ఉన్నంత వరకు ఖనిజాల తవ్వకాలు,రవాణా,క్రషర్ల యూనిట్‌ల నిర్వహణ అంతా సిండికేట్‌గా మార్చారు.జగన్ ప్రభుత్వం దిగిపోగానే వారు కనుమరుగయ్యారు. ఇప్పుడు కొత్త మనుషులు తెరమీదకు వచ్చారు.
ఇప్పుడిలా…
కాకినాడకు చెందిన సతీశ్ ఇప్పుడు మన్యం లోని మైనింగ్ వ్యాపారంపై దృష్టిసారించారు. ఈయనపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గత ఎన్నికల సమయంలో జనసేన తరఫున పోటీసేందుకు విఫల ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సతీశ్ హల్‌చల్ చేయడం మొదలుపెట్టారు. విజయ వాడలోని హోటల్‌లో ఆయన నేతృత్వంలోనే సమావేశం జరిగింది.ఆయా జిల్లాల మైన్‌ల లీజుదారులు, కాంట్రాక్టర్లు, గనులశాఖలోని కీలక అధికారులను ఈ సమావేశానికి తీసుకొ చ్చారు. ఇందులో కాకినాడకు చెందిన ఓకీలక అధికారి ముఖ్యపాత్ర పోషించినట్లు తెలిసింది. లాటరైట్,బాక్సైట్,రోడ్‌మెటల్,బిల్డింగ్‌స్టోన్, మాంగనీస్ వంటి ఖనిజాల లభ్యత,వాటి విలువ గురించి ఆ అధికారి ప్రజంటేషన్ ఇచ్చి నట్లు సమాచారం.సగటున రోజుకు ఆయా ఖనిజాలపై రూ.ఐదు కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది.
టన్నుకు ఎంతిస్తారు?…
గతంలో అమలు చేసిన పాలసీ తమకొద్దని, ఆయా ఖనిజాలకు సంబంధించి టన్నుకు ఎంత ఫీజు చెల్లిస్తారో చెప్పాలని సతీశ్…. విజయవాడ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది.”మీ వ్యాపారం జరగాలి.మా పని సాఫీగా సాగాలి. కాబట్టి మేం ధర నిర్ణయిం చం. మీరే టన్నుకు ఎంత రేటు ఇస్తారో చెప్పండి.లాటరైట్‌కు ఎంత ఇస్తారు? క్వార్ట్జ్‌కు ఎంతిస్తారు? రోడ్‌మెటల్‌కు ఎంతిస్తారు? క్రషర్ యూనిట్లు నెలకు ఎంత ఇస్తాయో చెప్పండి” అన్నట్లు తెలిసింది. కాగా, ఓలీజు దారు ఈ మీటింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేయ గా,తాను చెప్పిందే ఇక్కడ నడుస్తుందని, తనను కాద ని వ్యాపారం చేయలేరని హెచ్చరించి నట్లు తెలిసింది.ఈ సమయంలో కాకినాడకు చెందిన గనుల అధికారి జోక్యం చేసుకొని తాము అన్నీ మాట్లాడతామని సర్దిచెప్పినట్లు తెలిసింది.