కార్మికుల కనీస వేతనాలు పంపు
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో కార్మికుల కనీస వేతనాలు వారు పనిచేసే రంగం (నైపుణ్యంలేని,సెమీ-స్కిల్డ్,నైపుణ్యం కలిగిన, అత్యంత నైపుణ్యం కలిగిన) మరియుప్రాంతాల (జోన్-1,జోన్-2 మొదలైనవి)ఆధారంగా నిర్ణయించబడతాయి.
కనీస వేతనాల వివరాలు ఇలా.. :
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చిన సవరణల ప్రకారం,షాపులు మరియు వాణిజ్య సంస్థలలో (ఉదాహరణకు జోన్-II పరిధిలో) కనీస వేతనాలు నెలకు 12,317 (హెల్పర్) నుండి 14,504 (మేనేజర్,జోన్-I) వరకు ఉన్నాయి. తాజా సవరణల పూర్తి పట్టికను Ascవఅt H= AP వీఱఅఱఎuఎ ఔaస్త్రవs ద్వారా పరిశీలించ వచ్చు.రాష్ట్రంలో మార్పులు: ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల చట్టం ప్రకారం ఏడాదికి రెండుసార్లు వేతనాలు (VణA)సవరించబడ తాయి.తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం జూన్ 1,2026 నుండి అమల్లోకి వచ్చేలా కోటి 11లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కొత్త విధానాన్ని ప్రకటించింది.
కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం హర్హణీయం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించిన పధ్నాలుగు సంవత్సరాల తరువాత ఆరాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడీ ప్రకటన వెలువరించింది. తెలంగాణలోని ఒక కోటి పదకొండు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది కనుక ఈ నిర్ణయం విస్తృత ప్రభావం వేస్తుంది. కనీస వేతనం పెంచుతూ ప్రకటించడం బాగానేవుంది కానీ ఆపెంపుదల శాస్త్రీయంగా లేదన్నది వాస్తవం.ఈ పధ్నాలుగేళ్లలో పెరిగిన ధరలతో పోల్చితే ఈపెంపుదల స్వల్పమే! కనీస వేతనాలను తెలంగాణ రాష్ట్రంలో 3జోన్లుగా, వేతనాలను 4క్యాటగిరీలుగా విభజించి ప్రకటించారు. అందులోనూ శాస్త్రీయత కొరవడింది. ఆయా జోన్లలో అన్ని రంగాల్లో ఒకే రీతిలో పెంచడంవల్ల గతంలో ఎంప్లాయ్ మెంట్లో వివిధ రకాల పనులకు ఆయా రకాలుగా ఉన్న పద్ధతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీల్లో ఒక్క అన్‌స్కిల్డ్ వర్కర్లకు తప్ప మిగతా వారికి బేసిక్ కరువుభత్యం కలుపుకుని ఇప్పటికే వస్తున్న జీతానికి,పెరిగిన దానికి పెద్ద తేడా ఏమీ లేకపోవడం గమనార్హం.తెలంగాణ కాంట్రాక్టు లేబర్ జీవో నెం 11ప్రకారం ఇప్ప టికే కార్మికులు రూ.13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమీ లేదు కదా! తెలంగాణ జీవో 4లో స్కిల్డ్ కార్మికుడికి వేతనం రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం రూ.18,500 మాత్రమే! గతంతో పోలిస్తే రూ.1072 తగ్గింది.ఇప్పటి వరకు అనుసరించాల్సిన ఏ ప్రామాణికాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక సంఘాలు చేస్తున్న విమర్శ సత్య దూరం కాదు.పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం,డాక్టర్ ఆక్ట్రాయ్ ఫార్ములా,సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు లెక్కిస్తే రూ.32 వేలు వస్తుంది. అయినప్పటికీ కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలి. పొరుగు రాష్ట్రం చేసింది చూసి అయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు వెంటనే ప్రకటించడం కనీస ధర్మం. ఇక్కడ 72షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 50లక్షల మందికి పైగా కార్మికులకు ఈకనీస వేతనాలు వర్తిస్తాయి.ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించినదే తప్ప ఇక్కడ టిడిపి లేదా వైసిపి పాలకులు ఏనాడూ వాటిని పట్టించుకోలేదు.టిడిపి కూటమి సర్కారు ఇప్పుడైనా మేలుకోవడం అవసరం. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకు లతో పాటు ధరలన్నీ పెరిగి కార్మికుల బతు కులు దుర్భరంగా మారాయి. వాస్తవ పరిస్థితి గుర్తించి వెంటనే కనీస వేతనాలు పెంచాలి. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా పారిశ్రా మిక కార్మికుల ఆందోళన గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కనీస వేతన పెంపు ప్రకటన ఆవశ్యకత ఏమిటో పాలకులకు బోధపడుతుంది.అంతేగాక పొరుగున వున్న హర్యానా సర్కారు వేతన పెంపు ప్రకటన వెల్లడించాక ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభు త్వం బండ రాయిలా మిన్నకుండడం కడుపు మండి వున్న కార్మికుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచు కున్న తీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే సర్కారు పెద్దల్లో కదలిక వస్తుంది.ఈ రెండు నెలల్లో యుద్ధం పేరిట భారాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యాన్ని పరిగణన లోకి తీసుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం ప్రకటించిన దాంట్లోని లోపాలను సవరించి తాజాగా కనీస వేతనా లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ప్రకటిం చాలి.ఆలస్యం అనర్ధదాయకం అని గుర్తెర గాలి. లేనిపక్షంలో కార్మికుల ఆందోళనలకు లేదా వ్యక్తమయ్యే ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిరం తరం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా పెట్టుబడుల ఆకర్షణ జపం చేస్తూ కార్పొరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పాలకులు శ్రమ జీవుల గురించి కొద్దిగానైనా పట్టించుకోరా? వెంటనే కనీస వేతన పెంపు ప్రకటన చేసి విజ్ఞత ప్రదర్శించండి.
పేరు వేతనాల పెంపు.. జరిగింది తగ్గింపు
రాష్ట్రంలో కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతు న్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్తామని,ఇది అమలు జరిగేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు.రాష్ట్రంలో ఉన్న 73షెడ్యూల్ ఎంప్లాయిమెంటులోగల కోటి11 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మి కులు,వారి కుటుంబాలకు మేలు జరుగను న్నది.అయితే,ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు అసంబద్ధంగా,అన్యాయంగా ఉందనేది అర్థమవుతున్నది.1948 నాటి కనీస వేతనాల చట్టం,కార్మిక సంఘాల డిమాండ్లు, 1991నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు,డాక్టర్ ఆండ్రాయిడ్ ఫార్ములా,రోజురోజుకూ పెరుగు తున్న నిత్యావసర సరుకుల ధరలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.సర్కార్ నిర్ణయంతో కనీస వేతనాల పెంపువల్ల రాష్ట్రం లోని అన్నిరంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు లాభం చేకూరక పోగా తీరం నష్టం చేస్తుందనేది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది.ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ ఎన్నికల ప్రణాళికలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు ఎంతమాత్రం సిద్ధం కాలేదని విశదమవుతున్నది.కార్మికుల కరువు భత్యం కనీస వేతనాల్లో కలిపే ఆలోచన సైతం చేయలేదు.బీఆరఎస్ హయాంలో అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.1,809గా నిర్ణయించి కరువుభత్యం (డీఏ)పాయింట్ ఒక్కింటికి రూ.12గా నిర్ణయించింది. కనీస వేతన సలహా బోర్డు సిఫార్సులను పరిగణన లోకి తీసుకున్నది. దీని ప్రకారం 2021 జూన్ 25న కేసీఆర్ సర్కార్ ఐదు జీవోలను జారీ చేసింది. కానీ ప్రస్తుత పాలకులు రెండున్న రేండ్ల కాలంలో గెజిట్ కూడా విడుదల చేయకుండా వదిలివేశారు.కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కనీస వేతనాన్ని రూ.14వేలకు కుదించటమే కాకుండా, డీఏ పాయింట్లను పరిగణనలోకి తీసుకోలేదు.ఈనిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి పది లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు అన్యాయం చేయటమే అవుతుంది. ప్రభుత్వ వైఖరి పెట్టుబడిదారులు,యాజమాన్యాలకు మేలు చేసేదిగా ఉన్నదని స్పష్టమవుతున్నది. పెంచిన వేతనాల్లో పెరుగుదల లేకుండా ఉండటమే కాకుండా ప్రస్తుతం పొందుతున్న కనీస వేతనాలపై రూ.8,444 వరకు కార్మికుడు నష్టపోతున్న పరిస్థితి నెలకొన నున్నది.కార్మికులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పూనుకుంటున్నది.నిజంగా కార్మికుల వేతనాల పెంపునకు చిత్తశుద్ధితో కృషిచేయాలని భావిస్తే కార్మిక సంఘాలు, సంబంధిత అధికారులతో చర్చించాలి. ప్రస్తుతం అమలు జరుగుతున్న వేతనాలు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కార్మికుల జీవన ప్రమాణాలను గుర్తించటం ద్వారా సరైన నిర్ణయం తీసుకొని ఉండాల్సి ఉన్నది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నా లు చేయకపోవటంతో కనీస వేతనాలను పెంచాలనే నిజాయితీతో కూడిన ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టమవు తున్నది. వాస్తవానికి నిత్యావసర సరుకుల ధరల పెరు గుదల,కార్మికుల జీవన ప్రమాణాలు, సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్పుడు కార్మికుల కనీస వేతనం రూ.32 వేలుగా నిర్ణయించాల్సి ఉంటుంది.కార్మిక సంఘాలన్నీ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను న్యాయబద్ధ మైనదిగా తీసుకొని ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుం ది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇప్పటికే అమలు జరుగుతున్న వేతనాల్లో కనీస వేతనంగా రూ.28,444 చెల్లిస్తున్నారు.- గునపర్తి సైమన్
