విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
సీఎం చంద్రబాబు అత్యంత ఉత్సాహంగా విశాఖలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు 5.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకుని యువతను సైతం ఆశ్చర్యపరిచారు. 76 ఏళ్ల వయస్సులో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సైకిల్ తొక్కారు. ఈ సైకిల్ ర్యాలీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రకృతి పచ్చగా ఉంటేనే మనుషుల మనుగడ సాఫీగా సాగుతుంది. పెరుగు తున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో పొంచి ఉన్న ముప్పును పారద్రోలేందుకు విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే మన ముందున్న ప్రధాన మార్గం.ఇదే స్ఫూర్తిని రగులుస్తూ విశాఖ పట్నం వేదికగా జూన్ 5న జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఉత్సా హంగా పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణ ఆవశ్యక తను వివరిస్తూ స్వయంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగ ణంలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ కేవలం 25శాతం మాత్రమే పచ్చదనం ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తక్షణమే క్యాంపస్ అంతటా భారీగా మొక్కలు పెంచేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని ఆయన ఆదేశించారు. ఇదే సమ యంలో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఎవరైతే ఎక్కువ మొక్కలు పెంచి పచ్చ దనాన్ని పెంపొందిస్తారో,రాబోయే ఎన్నికల్లో వారికే టిక్కెట్లు ఇస్తామంటూ సరదాగా నవ్వులు పూయించారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎంతో మంది గొప్ప నాయ కులను దేశానికి అందించిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. అలాంటి ప్రాంగణం పర్యా వరణానికి ఆదర్శంగా,ఒక బయోడైవర్శిటీ పార్కులా రూపాంతరం చెందాలని చంద్రబాబు ఆకాం క్షించారు.తిరుమల కొండల మీద 89.5శాతం పచ్చదనం ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఏయూ క్యాంపస్ కూడా పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి ‘నెట్‌జీరో’ క్యాంపస్‌గా మారాలని పిలుపునిచ్చారు. విపరీతంగా పెరుగుతున్న ఎండలు,అకాల తుఫానులు వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందనడానికి సంకే తాలని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.దీన్ని అరికట్టే క్రమంలో ఏయూకు ఉన్న 450ఎకరాల సువిశాల స్థలంలో ఖాళీ ప్రదేశాల న్నింటిలో చెట్లు నాటాలని సూచించారు.భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి,క్యాంపస్‌కు అవసరమైన విద్యుత్‌ను పూర్తి స్థాయిలో సౌరశక్తి ద్వారానే ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు.
చెత్త నిర్వహణ విషయంలో ఏయూ యాజమాన్యం అత్యాధునిక విధానాలు అవలంబించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాల న్నారు.స్వచ్ఛ పథం కింద రీ-సైక్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలని సూచించారు. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ వినియోగాన్ని పెంచాలని, నెట్ జీరో విధానాన్ని పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో ఒక బృం దాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఏయూ క్యాంపస్ కేవలం చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఒక నాలెడ్జ్ హబ్‌గా తయారు కావాలని సీఎం ఆకాంక్షిం చారు. ఈ నెట్ జీరో విధానంలో ఇతర విద్యా సంస్థలకు సైతం మార్గదర్శకంగా నిలిచేలా ఏయూను తీర్చిదిద్దాలని అధికారులకు సూచిం చారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నామని, ఇందులో విద్యా ర్థులను కూడా భాగస్వాములను చేస్తామని ప్రకటించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5కోట్ల సీడ్ బాల్స్ చల్లేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
విశాఖపట్నం నగరంలో ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని ఏకంగా 50 శాతానికి పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించే మహాయజ్ఞంలో విశాఖ పోర్టుతో సహా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడానికే తాను సైకిల్ మీద ప్రయాణి స్తున్నానని, సైకిలింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దినచర్యగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. –జి.ఆనంద్ సునీల్ కుమార్
