‘ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ పోయింది..’
ఆధునిక యుగంలో ప్రపంచ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల పరిస్థితి మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని గిరిజన మారు మూల ప్రాంతాల పరిస్థితులు కూడా మారకుండా అలాగే ఉండిపోయాయి. అనేక గిరిజన గ్రామాలకు, సరైన రహదారులు నేటికీ అందని కలగానే మిగిలి పోయాయి. స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం అంటే ఏమి టో తెలియని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీల గ్రామాల పరిస్థితులు మారాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు.తమ దుస్థితిని మార్చుకు నేందుకు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించు కున్నారు. కానీ ఎలాంటి పరిష్కారాలు లభించ లేదు. వారి ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయింది.నేడో, రేపో ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ వాళ్లకు పోయింది. ప్రకృతి ఒడిలో ‘పోడు’ వ్యవసాయం ద్వారా జీవనం సాగించే గిరిజన సముదాయాలు, కొండల పైనుంచి కిందికి దిగాల్సి వచ్చిన ప్రతిసారీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. గుమ్మలక్ష్మీపురం,పార్వతీపురం,సీతంపేట, కురుపాం గ్రామీణం,సాలూరు గ్రామాలకు చెందిన గిరిజనులు ఎవరైనా అనారోగ్యం పాలైనా,నిత్యావసరాలు సేకరించాల్సి వచ్చినా లేదా అటవీ ఉత్పత్తులను విక్రయించాలను కున్నా ఆ ప్రమాదకరమైన రాళ్లతో నిండిన దారుల గుండా ప్రయాణించడం వారికి నరకయాతనగా మారుతుంది.ఈ గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం కోట్లాది రూపా యలు మంజూరైనప్పటికీ బిల్లుల చెల్లింపులు, అటవీ శాఖ అనుమతులు, ఇతర ప్రభుత్వపర మైన అడ్డంకుల కారణంగా అసలు పనులు మాత్రం నిలిచిపోయాయి.ఫలితంగా గ్రామ స్థులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ బాధ్య తలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వాళ్లు, వీళ్లు మారుస్తారు అనే ఆలోచనలను వీడి,తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నడుం బిగించారు.తమ ప్రాంత అభివృద్ధి వైపు అడుగులు వేశారు అడవి బిడ్డలు. వీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొండను తొలచి రహదారికి మరమ్మతులు కురుపాం మండలంలోని ఆగంగూడ గ్రామానికి సరైన రాకపోకల రహదారి లేదు. చినుకు పడితే చాలు ఆ దారి బురదమయమై, నడవడానికి కూడా వీలులేని చిత్తడిగా మారి పోతుంది. పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్న గ్రామస్థులు ‘శ్రమదానం’ద్వారా ఒక కొండను తొలచి రహదారిని స్వయంగా నిర్మించుకుని మరమ్మతులు చేసుకున్నారు.
స్వచ్ఛందంగా కదిలి తొలగించిన బండరాళ్లు
సీతంపేట మండలంలోని పాకలగూడ,గజిలి, కడగండి గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.గ్రామస్థులు స్వచ్ఛంద శ్రమతో ఆ రహదారిలోని వివిధ భాగాల్లో రాళ్లు,కంకరను పరచి,గుంతలను పూడ్చి, వాహనాలు వెళ్లడానికి వీలుగా ఆ దారిని పున రుద్ధరించారు. అదేవిధంగా పెద్దగూడ నుంచి రంగంవలసను కలిపే రహదారి కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉంది. గిరిజన నివాసులు మరోసారి స్వచ్ఛంద శ్రమతో ముందుకు వచ్చి,దారిలో అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించి ఆ మార్గాన్ని బాగు చేశారు. రూ.70వేలు పోగుచేసి రహదారి నిర్మాణం కురుపాం మండలంలోని మారిపల్లి పంచా యతీ పరిధిలో ఉన్న చీడిమానుగూడ గ్రామా నికి రహదారి నిర్మించాలని పదే పదే చేసిన విన్నపాలు నిష్ప్రయోజనం కావడంతో గ్రామస్థులు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వారు సుమారు రూ.70 వేల నిధులను సమకూర్చుకుని ఈనెల 4వ తేదీన రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు.
20 రోజుల పాటు శ్రమించి
కొమరాడ మండలంలోని కుంతేసు పంచా యతీ పరిధిలో గిరిశిఖరపై వెలసిన బద్దిడి గ్రామానికి తాగునీటి సరఫరా పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఏళ్ల తరబడి అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. గ్రామానికి వెళ్లడానికి సరైన రహదారి లేకపో వడంతో ఆ పథకాన్ని అమలు చేయడం అసాధ్యంగా మారింది.చివరకు గ్రామస్థులే స్వయంగా ఒకరికొకరు చేతులు కలిపారు. వారు తమ గ్రామం చుట్టుపక్కల లభించిన రాళ్లు, కంకరను సేకరించి కొంత సిమెంటును కొనుగోలు చేశారు.20రోజుల పాటు అవిశ్రాం తంగా శ్రమించి వారు 38 అడుగుల లోతు గుంత తవ్వి తమ కోసం ఒక బావిని నిర్మించుకున్నారు.
కుటుంబానికి రూ.15,000 చొప్పున విరాళం
గుమ్మలక్ష్మీపురం మండలంలో రేగిడిని కొండపై ఉన్న బయ్యాడతో కలిపే రహదారి ఎంత అధ్వాన స్థితిలో ఉందంటే కనీసం కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం 2021లోనే రూ.3.35 కోట్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. వేరే మార్గం లేక ఆ గ్రామంలో నివసించే 75 కుటుంబాలు తమ వనరులను సమకూర్చు కుని కుటుంబానికి రూ.15,000 చొప్పున విరాళంగా ఇచ్చాయి. మొత్తం రూ.11.25 లక్షల నిధులను వినియోగించి ఆ రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చేందుకు వారు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
రూ.2.50 లక్షల సొంత నిధులతో
అదే విధంగా గుమ్మలక్ష్మీపురం మండలంలోనే లప్పటి నుంచి వాడబాయితో కలిపే రహదారి నిర్మాణం కోసం రూ.2.80కోట్లు మంజూర య్యాయి. అయితే పనులు ప్రారంభం కాకపో వడంతో ఆ రహదారిపై ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది.దీనికి స్పందిస్తూ ఆ గ్రామానికి చెందిన కామేశ్వర రావు అనే వ్యక్తి తన సొంత నిధుల నుంచి రూ.50,000ఖర్చు చేసి ఒకజేసీబీని అద్దెకు తీసుకుని రహదారిపై మరమ్మతులు చేయిం చారు.సాలూరు మండలంలోని దిగువ కాశాయివలసదీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.అక్కడి స్థానికులందరూ కలిసి సుమారు రూ.2.50లక్షలు సమ కూర్చుకుని ఆ రహదారి నిర్మాణ బాధ్యతలను స్వయంగా చేపట్టారు.ప్రభుత్వాలు మారుతున్నా నేటికీ గిరిజన గూడేల్లో తాగునీటి కష్టాలు తీరడం లేదు.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ మొరలోవలో గిరిజనులు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు.“మా గ్రామానికి నీళ్లు ఇవ్వండి” అంటూ ఆ గిరిజనులు వినూత్నంగా చేతులు జోడించి మొర పెట్టుకుంటున్నారు.కొండ ప్రాంతాల్లో నివసించే తమ గోడు వినేవారు లేరా అంటూ ఆవేదన చెందుతున్నారు. నీరు ఇవ్వాలని మొక్కుకుంటూ అనంతగిరి మండ లం రొంపిలి పంచాయతీ మొరలోవ గిరిజ నులు మొర పెట్టుకుంటున్నారు.ఈక్రమంలో 12 కుటుంబాల్లో సుమారు 60మంది నివసి స్తున్నారు.జల్ మిషన్ పథకం తమకు అందు బాటులో లేదని చెప్పారు.వేసవి వచ్చిందంటే కొండ దిగువన ఉన్న రెండు కిలోమీటర్ల దూరంలో నీటి ఊటలను పట్టుకుంటూ పిల్లాపాపలతో కష్టాల పడవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు బిందె లతో రాళ్లు తన్నుకుని పోయి గాయాలు పాలవుతున్నామన్నారు. పశువులు కూడా ఇదే నీటిని తాగుతున్నట్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని గుక్కెడు నీటి ఊటల కోసం వెతుకుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే కలెక్టర్ తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చేతులు ఎత్తి జోడిస్తున్నారు.
మా సొంత భూమిలో పని కల్పించాలి రావికమతమండలం చీమలపాడు పంచాయతీ 16గిరిజన గ్రామాలు.570 జాబ్ కార్డు కలిగి ఉన్నారు. వేసవికాలంలో.ఎండ తీవ్రత ఎక్కువ గా ఉంది.రెండు పుట్ల పేస్ యాప్‌వల్ల. సమ యం ఎక్కువగా పడుతుంది. ఎండలో విపరీ తంగా కాస్తున్నాయి.ఫేస్ యాప్.ఒంటి పూట చేయాలి.మజ్జిగను ప్రభుత్వం సఫరా చేయాలి. మా సొంత భూమిలో ఉపాధి పనులు పెట్టాలి. గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేక. రోజుకి5 గంటలో పనిచేస్తే 2 రెండు గంటలు ఫేస్ యాప్‌కి టైం సరిపోతుంది. దీనివల్ల వేసవికాలంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము.తక్షణమే ప్రభుత్వం ఫేస్ యాప్ రద్దు చేయాలి లేదా ఒంటిపోటే ఫేస్ ఆఫ్ అని పెట్టాలి.మాకు జీడి మామిడి తోటలుఉన్నాయి. మా గ్రామంలో చెరువులు ఉన్నాయి.వాటిలోనే పనులు పెట్టాలి.. గతంలో ఇద్దరు విఆర్పిలు ఉండారు. నేడు ఒక విఆర్పివల్ల పని ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో.అనేక ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది.తక్షణమే రెండో విఆర్పిని పోస్ట్ భర్తీ చేయాలి.ఫేస్ ఆఫ్ వంటి పూట ఏర్పాటు చేయాలి. – జి.ఆనంద్ సునీల్ కుమార్
