గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల గోడు వినరే..
అక్షరాస్యతలో బాగా వెనుకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు.అటువంటి గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత పెంచాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్46గిరిజనులకు విద్య,రక్షణ,సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.1985 నుండి 1990 వరకు గిరిజనుల విద్యకోసం చేసినకృషి ప్రశంసించదగ్గది.క్రమేణా ఆశ్రమ,గురుకులపాఠశాలలు,గిరిజనప్రాథమిక పాఠ శాలలను నెలకొల్పి అక్షరాస్యత కోసం,విద్య కోసం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు,సదుపాయాలు కల్పించబడ్డాయి. గిరిజనులకు విద్యను అందిస్తూ వారిని అన్ని విధాలా సామాజిక వివక్షతల నుంచి,దోపిడీ నుంచి రక్షించాలని ఆర్టికల్46సూచించింది.5వషెడ్యూల్ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నరుకు ప్రత్యేక బాధ్యతను ఇచ్చింది.275(1)ప్రకారంషెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక నోడల్ ప్యాకేజీలను ఇవ్వాలని సూచిం చింది.రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు నేటికీ అమలుకు నోచుకోలేదని,బాలారిష్టాలతోనే కొనసాగుతున్నాయని గిరిజన ప్రాంతాలలో జరిగే సంఘటనలే నిరూపిస్తున్నాయి. - కె.విజయగౌరి
మౌలిక వసతులు కీలకం
ఈనాటికీ గిరిజన ప్రాంతాల నుండి ఆసుపత్రికి రావాలంటే డోలీ మోతలు ప్రత్యేక కథనాలుగా చూస్తున్నాము. ఆ ప్రాంత ప్రజలపై గల బాధ్యతా రాహిత్యం విద్యార్థులు చదువుకునే సంక్షేమ గృహాలపై కూడా కొనసాగుతున్నది. పదేళ్ల క్రితం కురుపాం మండలం తుమ్మిక మాను గూడకు చెందిన ముగ్గురు విద్యార్థులు టంపల పాడు ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటు న్నపుడు తాగునీరు లేక,మరుగుదొడ్లు లేక రోగాల బారిన పడి చనిపోయిన ఘటన నుండి తాజాగా కురు పాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన వరకు రాష్ట్రాన్ని కుది పివేశాయి. ఇద్దరు బాలికలు చని పోవడం, 138మంది పచ్చకామెర్లతో ఆసుప Ÿత్రిపాలు కావ డం సంక్షేమ హాస్టళ్ల పట్ల ప్రభుత్వ బాధ్యత ఏపాటి దో రుజువు అవుతున్నది.
ఈ ఘటనే కాదు. గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఎక్కువ శాతం సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక కురు పాం గురుకుల పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. పాఠాలు బోధించడానికి, బాలికలు నిద్రించడానికి, సామానులు భద్రపర చడానికి, భోజనాలు చేయడానికి అన్నింటికీ ఒకటే గదులు. 600 పైచిలుకు గల బాలికలకు కేవలం 18 మాత్రమే మరుగుదొడ్లున్నాయి. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు క్లాసులున్న గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. బాలికల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిం చేం దుకు ఒక్క ఆశ్రమ పాఠశాలలో కూడా ఎ.ఎన్. ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు కల్పించడంలేదు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు భయపడి ఆందోళనతో స్వంత డబ్బులతో ఆరోగ్య కార్యకర్త లను నియమించుకుంటున్నారు. రెండు దశాబ్దా లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో నీటి కష్టాలు
పాఠశాలలో మొత్తం 320 మంది విద్యార్థులు ఉన్నారు.వీరికి అక్కడ వసతి చాలడం లేదు ఇరు కు గదుల్లో కిక్కిరిసి ఉంటున్నారు. తగిన సిబ్బంది లేక గదులు శుభ్రం చేయడం లేదు.దోమలు బెడద ఎక్కువగా ఉంది.మరుగుదొడ్లు సరిపడా లేవు ఉన్నవి దారుణంగా ఉన్నాయి. పాఠశాలలలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ వార్డెన్?గా నవీన్ బాబు రెండేళ్లుగా కొనసాగుతున్నారు. రొటేషన్ పద్దతి అమలు కావడం లేదు. ఇందుకు అధికార పార్టీ నాయకుల మద్దతేనని ఆరోపణలు ఉన్నాయి. నవీన్ బాబు భార్య జీలుగుమిల్లి ఎంపీపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వసతి గృహంలో పాడైన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నా రని, కనీస శుభ్రత పాటించడం లేదని మరుగు దొడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని విద్యార్థు లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనం దున ఉపాధ్యా యులే డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు చేపడుతున్నారు. బోధన ఒకవైపు, పిల్లల బాధ్యత మరొకవైపు చూడటం నష్టదాయకంగా ఉంది. వైద్యపరమైన సేవలు అందించడానికి ప్రత్యేకంగా శాశ్వత సిబ్బంది లోపం కూడా విద్యార్థులకు శాపంగా మారుతున్నది.విద్యార్థుల అనారోగ్య పరిస్థితులలో మెడికల్ ఖర్చు ముందస్తుగా ప్రధా నోపాధ్యాయులు,వార్డెన్లపై పడుతున్నది. ఆశ్రమ పాఠశాలలలో ఆయాలు లేరు. గిరిజన ప్రాథమిక పాఠశాలల నుండి3,4,5తరగతుల పిల్లలను ఆశ్రమ పాఠశాలలకు విలీనం చేసిన తరువాత అంత చిన్నపిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని,టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపో వడం వలన పిల్లల మానసిక,శారీరక, విద్యాపర మైన అంశా లపై తీవ్ర ప్రభావం చూపి డ్రాపవు ట్లుగా మారు తున్నారు.అప్పటివరకు కొన్ని ఘటనల్లో వీరికి తీవ్రవ్యాధుల లక్షణాలేమీ కని పించవు.ఉన్నట్లుండి బయటపడి, అంతలోనే చని పోతున్నారు. గడిచిన 25 రోజుల్లో సెలవులకు ఇంటికి వెళ్లిన నలుగురు విద్యార్థులు ఇలానే మృతి చెందారు. ఒ అమ్మాయికి ఆయాసం,మరో అబ్బా యికి వాంతులు, ఇంకో పిల్లాడికి కడుపు నొప్పి, మరో చిన్నారికి తలనొప్పి ఇవి వారిలో కనిపించిన లక్షణాలు.గిరిజన విద్యార్థుల్లో కడుపునొప్పి,తల నొప్పి, గొంతునొప్పి,ఆయాసం,శరీరం ఉబ్బడం తదితర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బయట పడి అవిమరణాలవరకు వెళ్తున్నాయి.కొన్నేళ్లుగా గిరిజన పాఠశాలల్లో ఇలాంటిఘటనలు తరచూ జరుగుతున్నాయి. వారికి సరైన వైద్యం అందు బాటులో లేకపోవడమే ప్రధాన కారణం. గతంలో ఇలాంటి మరణాల్ని గుర్తించే వ్యవస్థ సరిగా ఉండేది కాదు.ఇటీవల దీనిని పక్కాగా నమోదు చేస్తున్నారు. చాలా ఘటనల్లో వారి మృతికి కారణాలు విశ్లేషిస్తే గుండె,కిడ్నీ వ్యాధులు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్య లతో మృతి చెందినట్లు తెలుస్తుంది.ఇంకా జన్యుపర మైన సమస్యలూ ఉన్నాయి.గిరిజన విద్యార్థుల అకాల మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక అధ్యయనం చేయిం చడానికిమంగళగిరి ఎయిమ్స్‌ను సంప్రదించిం ది.జన్యుపరమైన సమస్యలతోనే వారు ఇలా మృతి చెందుతున్నారని వైద్యులు ప్రాథమికంగా తెలి పారు.దీనికి సమగ్ర పరీక్షలు అవసరమని చెప్తు న్నారు.ఇందుకు నలుగురు వైద్యులను కేటాయిం చారు.పైలట్ ప్రాజెక్టు అధ్యయనానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. కానీ ఈమొత్తాన్ని వెచ్చించేందుకు గిరిజన సంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖ ముందుకు రాకుండా నిధుల కోసం కేంద్రా నికి నివేదించాయి. దీంతో జాప్యం జరుగుతోంది.
దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్ లోపం
ఈ గిరిజన బిడ్డలను పోషకాహారలోపం, రక్తహీ నత, అంటువ్యాధులు వేధిస్తున్నాయి. వారికి సోకే జన్యువ్యాధులపై సరైన వివరాలు లేవు. దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్ లోపముంది. సికిల్‌సెల్ ఎనీమియాను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షల్లో నూ ఒక వేరియంట్‌నే గుర్తిస్తున్నారు. ఇంకో ప్రమాదకర వేరియంట్ పరీక్షల్లో బయటపడట్లేదు. అలానే వీరికి జన్యు,రక్తసంబంధిత,గుండె, మెట బాలిక్ వ్యాధులను గుర్తించేందుకు అన్నిరకాల పరీక్షలు పక్కాగా చేయాలి.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విద్య దోహద పడాలి
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశా లలు,గురుకులాలను ఏర్పాటుచేసి గుణాత్మక విద్య ను అందివ్వాలి.తద్వారా సామాజికంగా,ఆర్థి కంగా మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలనేది ఆచరణలో జరుగుతున్నదా అనేది పరిశీలిస్తే ఆటంకాలు అనేకం. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతులు కనిపిస్తున్నాయి.తాగునీటిది పెద్ద సమ స్య. ఎప్పటికప్పుడు ఆర్.ఓప్లాంట్లు మరమ్మ తులకు గురికావడం,వాటి కోసం నిధులు కేటా యించక పోవడం.ఇవన్నీ పరిశీలిస్తే గిరిజన విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోవడం. దాం తో గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు రోగాల బారినపడి పిట్టల్లా రాలిపోవడం చూస్తున్నాం. విషజ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ రం గంపై నిర్లక్ష్యం తగదు.
గిరిజన బాలబాలికలకు చదువు, వసతి సౌక ర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ బాలుర-బాలికల వసతి గృహాలు ప్రారంభించారు. ఎప్పుటికప్పుడు మౌలిక వసతులు కల్పించే విషయంలో బడ్జెట్ కేటాయిం పులు పెంచాలి.పెరుగుతున్న ధరలకు అనుగు ణంగా, మరమ్మతులు, వైద్య అవసరాలు, పోషక విలువలతో కూడిన మెనూచార్జీల పెంపునకు నిధులు వుండాలి. ఈ ఏడాది షెడ్యూ ల్ తెగల సంక్షేమానికి కేవలం రూ.8,159 కోట్లు మాత్రమే కేటాయించారు.పాఠశాల విద్యకు రూ.31,806కోట్లు కేటాయించారు.గిరిజన విద్యారంగానికి కేటాయింపులు తక్కువ. ఇటు వంటి పరిస్థితులలో గిరిజన సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బాలబాలికలకు ఆరోగ్యం బాలేక పోతే బాధ్యత ఎవరిది? ఇటువంటి పరిస్థి తులను ఎవరు చక్కది ద్దుతారో పాలకులే చెప్పాలి.రాజ్యాంగ పరమైన హక్కులను అమలు చేయక పోవడంతో గిరిజన ప్రాంతాలు వెనుకబడ్డాయి. పేదరికం, దోపిడీ, వెనుకబాటుతనం నుండి విముక్తి జరగాలంటే నేటితరం గిరిజన విద్యార్థు లంతా చదువుకోవాలి. సంక్షేమ హాస్టళ్లను ఆశ్ర యించే విద్యార్థులకోసం మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వ్యాసకర్త : యు.టి. ఎఫ్ సీనియర్ నాయకులు
