పారిశుద్ద్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

విశాఖపట్నం, సెప్టెంబర్ 3:
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటు వంటి అలసత్వాన్ని సహించేది లేదని, ప్రజ లకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందేలా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్య వేక్షించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు,మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రి యను కూడా వేగవంతం చేయాలని సూచించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నార్త్ జోన్ పరిధిలోని 45,48వ వార్డుల్లో షాదీఖానా,ఎన్జీవోస్ కాలనీ,కేంద్రీయ విద్యాలయం,సోనియా గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బి.రాముతో కలిసి కమిషనర్ పర్యటించారు.48వ వార్డులో డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ,రోడ్లు, కాలు వల పరిశుభ్రత,వీధి దీపాలు,తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి పారిశుద్ధ్యం,తాగునీటి సరఫరాపై ఆరా తీశారు.ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రజలు తెలియజేయగా,ఇళ్ల వద్దనేతడి,పొడి వ్యర్థాలను వేరుచేసి ప్రతిరోజూ వ్యర్థాల సేక రణ వాహనాలకు అందించాలని,పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కమిషనర్ సూచిం చారు.అనంతరం 48వ వార్డులో పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికను పరిశీలించిన కమిషనర్, ఒక శాశ్వత పారిశుద్ధ్య కార్మి కురాలితో పాటు నలుగురు పొరుగు సేవల సిబ్బంది దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవు తున్నట్లు గుర్తించారు.విధులకు సక్రమంగా హాజరుకాని శాశ్వత పారిశుద్ధ్య కార్మికు రాలిపై నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశిం చారు.పర్యటనలో పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెట్ల కొమ్మలు పేరుకుపోయి ఉండ టాన్ని గమనించిన కమిషనర్ వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను ఈపీడీసీఎల్ సిబ్బంది తొలగించి అక్కడే ఉంచినట్లు అధికారులు వివరించగా, ఈపీడీసీఎల్ అధికారులతో సమన్వయం చేసుకొనిచెట్ల కొమ్మలు,ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్‌కు సూచిం చారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై కమిషనర్ ప్రత్యేకంగా సమీక్షించారు.షాదీఖానా,కేంద్రీయ విద్యా లయం,ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ఎలిమెంటరీ స్కూల్,భారతీయ విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన పోలింగ్ స్టేషన్ల ప్లాన్ కాపీలను పరిశీలించారు. అవసరానికి అనుగుణంగా కొత్త పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని, సాధ్యమైనంత వరకు సంబంధిత వార్డుల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని వార్డు ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశిం చారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని,ఈ ప్రక్రియపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. – జి.ఆనంద్ సునీల్ కుమార్