మన లౌకిక వాదం నీటిమÖటలేనా?
దేశంలో ఈనాడు మత వ్యాపార సంస్కృతి పెరుగుతున్నది. గుడులు, మఠాలు, బాబాల ఆశ్రమా లకు పర్యాటకం విపరీతంగా పెరుగుతున్నది. సాధార ణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విజ్ఞా నశాలలు,విశ్వ విద్యాలయాలు, విస్తృతమైన గ్రంథా లయాలు, సముద్ర తీరాలు,నదీ తీర ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను చూడడానికి వెళ్ళాలి. కాని మత కేంద్రాలైన దేవాలయాలను సందర్శించడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. మత క్షేత్రాల సందర్శనకు టూరిస్ట్ బస్‌లు,విమాన సర్వీసులు,ప్రత్యేక రైళ్ళు ప్రభు త్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.అదే ఒకచారిత్రక కట్ట డానికి ప్రభుత్వాలు ఇటువంటి ప్రయాణ సౌకర్యం కలిగించటం లేదు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యు న్నతమైన అంబేద్కర్ స్మృతివనాల రూపకల్పన జరిగింది. విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం ఏర్పర చింది. ఆ వనంలో అంబేద్కర్ జీవిత చరిత్రను చక్కగా రూపొందించారు.వివిధ స్కూళ్లు,కాలేజీల నుండి టూరిస్ట్ బస్సులు ఏర్పాటు చేసి ఆ స్మృతి సందర్శన ద్వారా విద్యార్థుల్లో విద్యాసక్తిని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.పోయిన ప్రభుత్వం మీద ద్వేషం తో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళి ఆ విగ్రహాన్ని సందర్శించి పూలమాలాంకృతి చేయలేదు. అలాగే హైదరాబాద్‌లో డా||బి.ఆర్.అంబేద్కర్ 126 అడు గుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి నిర్మించగా ప్రస్తుత సి.ఎం ఆగేట్లు కూడా తెరవలేదు. మొన్న జయంతికి నామమాత్రంగా తెరిచారు. దాని వలన విద్యార్థుల్లో అంబేద్కర్ స్ఫూర్తి రావటం లేదు.
దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పర్యా టక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88 శాతం. గతేడాది ఇండియా సందర్శిం చిన విదేశీ పర్యాటకులు కేవలం 90లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ-ఆగ్రా-జైపూర్ ‘స్వర్ణ త్రిభు జం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టు లను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలుస్తాయి. కారణం మతపరంగా ప్రముఖమైన తిరు పతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరు పతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతి పెద్ద దేశీ య పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం.గడచిన నాలు గైదేళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమ కారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘వ్యూ’ సంస్థ నిర్వహిం చిన ‘గ్లోబల్ యాటి ట్యూడ్ సర్వే’ తేల్చింది.ఇది ఏ ఒక్క మతానికో పరిమి తం కాదు.అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడు తున్నది. ఎనఎసఎసఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం,మత ప్రదే శాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలం లో రెట్టింపు కంటే ఎక్కు వైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజం లో మÖఢనమ్మకాలు, అంధ భక్తి, మత పిచ్చి పెచ్చరిల్లు తాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భ వించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది.
క్రైస్తవం,ఇస్లాంలో కూడా విపరీతమైన వ్యా పార సంస్కృతి వుంది.ముఖ్యంగా శాస్త్రీయ అధ్యయ నానికి వ్యతిరేకంగా ప్రార్థనల ద్వారా జ్వరాలు పోతా యి అనటం,గృహ సందర్శనాల పేరుతో బలహీ నులను దోచుకోవటం, రోజుల తరబడి ఉపవాసాలు వుంచి ఆరోగ్యాలు పాడుచేయడం వంటివన్నీ అశాస్త్రీ యమైన కార్యక్రమాలు.ఇవి మÖడు మతాల్లోను విపరీతంగా జరుగుతున్నాయి.వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మక్కా ప్రయాణాల తొక్కిళ్ళల్లో వందల మంది చనిపోతున్నారు. ఇటీవల తిరుపతిలో పదుల సంఖ్యలో చనిపోయారు.జిల్లా పరిషత్ స్కూళ్లలో కూడా విద్యార్థినులకు బురఖాలు తప్పనిసరి చేసి వారిలో లౌకికవాద దృక్పథాన్ని దెబ్బతీస్తున్నారు. క్రైస్తవ స్కూళ్లలో అయితే భారత రాజ్యాంగం ప్రకారం 40 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఫీజులు విపరీతంగా దండుకుంటున్నారు.పేద పిల్లలకు అక్కడ చోటు లేదు. భారత జాతీయ గీతాన్ని ఆలపించకుండా ప్రార్థనలతో అసెంబ్లీలు నడిపిస్తున్నారు.అన్ని రేడి యోలలో,టీవీలలో మతప్రచారం ముమ్మరం అయిం ది.ఉదయ కాలాన్నే రకరకాల దేవుళ్ళ స్తుతులు, కీర్తనలు పాడుతూ జ్ఞానబోధను తగ్గించారు.వ్యక్తిత్వ నిర్మాణబోధలుబాగా తగ్గిపోయాయి.కవిత్వం, నవల, పాట,జానపదం బహు జనం స్త్రీ విముక్తి సంబంధిం చిన ఆశయాలు టీవీలలో మృగ్యమైనాయి.
ఇప్పుడు రోడ్డు మలుపుల్లో మత కేంద్రాలు, గుడులు నిర్మించడం పెద్ద వ్యాపారంగా మారింది. ముఖ్యంగా ప్రతి మలుపులోనూ ఒకదేవాలయం దర్శన మిస్తుంది. ఇక వాటిని కదిలించడానికి వీలు లేదు. చివరికి రోడ్డు విశాలపరిచేటప్పుడు కూడా వాటి ని తప్పించి రోడ్లు వేసుకోవాలి. నిజానికి నెహ్రూ, డా.బి. ఆర్.అంబేద్కర్ వంటి వారు గుడులను సంద ర్శించ లేదు.ఇప్పుడు ముఖ్యమంత్రులు లౌకిక దృక్ప థాన్ని కాపాడాల్సిన వారు మత రాజకీయాలు నడుపు తున్నారు. కొందరైతే కాషాయ వస్త్రాలతో తిరుగుతు న్నారు.ఈసందర్భంలో లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతి శీల వాదులందరూ కలిసి మతం పేరుతో జరుగుతున్న మÖఢ భావజాల ఆర్థిక దోపిడీ విధానాలను అడ్డుకో వాలి. కారల్‌మార్క్స్, అంబేద్కర్ ఆలోచనా విధానా లతో నూతన సాంస్కృతిక విప్లవాన్ని విజయవంతం చేస్తారని ఆశిద్దాం. (వ్యాసకర్త : డా.కత్తి పద్మారావు)
