తెరపైకి మళ్లీ బాక్సైట్ అలసడి

“ఉమ్మడి విశాఖ,అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం మరోసారి తీవ్ర అలజడి సృష్టిస్తోంది.గూడెంకొత్తవీధి మండలం జెర్రెల అటవీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి లేకుండా రహస్యంగా సర్వేలు, నమూనాలు సేకరిస్తున్న వ్యక్తులను స్థానిక గిరిజనులు,పెసాకమిటీ సభ్యులు అడ్డుకుని వారి వాహనాలను నిర్బంధించారు.సర్వే సిబ్బందిని స్థానిక సచివాలయ కార్యాలయంలో నిర్బంధించారు.అలాగే జిల్లావ్యాప్తంగా గిరిజన సంఘాలు,వివిధ రాజకీయ,వామపక్షపార్టీలు సంయుక్తంగా ధర్నాలు,ఆందోళనలు చేపడు తున్నారు. బాక్సైట్ వెలికితీస్తే సహించేది లేదంటూ ప్రతిజ్ఞలుచేస్తూ నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి.”               - గునపర్తి సైమన్

కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవినోపాధిని పొందుతున్నారు.మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొంబలు అంతరించిపోవడంతోపాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆది వాసీలు ఆది నుంచే బాక్సైట్ తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని,తాగునీటి వనరులు కూడా దొరకవడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఒడిసాలో అత్యధి కంగా 41శాతం నిల్వలు..అంటే 2,057 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్.. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధి లోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) లో ఆరు బ్లాకులు..చింతపల్లి,సప్పర్ల, అనం తగిరి,గుర్తేడు,గూడెం,కాటంరాజ్ కొండల్లో సుమారుగా 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి.1980లోనే బాక్సైట్ నిల్వల గురించి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎసఐ) నివేదికలు ఇచ్చింది. బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్ర ప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందా ల్లోని అక్రమాలు,ఆదివాసీల పోరా టాలే కారణం.ఉమ్మడి విశాఖ జిల్లా లోని దట్టమైన అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు న్నాయి. ఇది షెడ్యూల్డ్ ఏరియా. నిబం ధనల ప్రకారం మైనింగ్ ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్ లీజులు ఇవ్వాలి.ఈలెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. ఏపీఎండీసీ మైనింగ్ బాధ్యతలు నేరుగా నిర్వహించదు కాబట్టి ప్రైవేటు కంపెనీలతో జతకట్టింది.దీంట్లో భాగంగా అరకు, సప్పర్ల ఏరియాల్లో మైనింగ్‌తోపాటు అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు జిందాల్ సౌత్‌వటస్ట హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత చింతపల్లి అటవీప్రాంతం లోని జెర్రెల బ్లాకులో అల్యూమినియం రిఫైరీ ఏర్పాటుకు 2007లో రసఆల్ ఖైమాతో ఏపీఎండీసీ ఒప్పందం చేసు కుంది. ఆతర్వాత రసఆల్‌ఖైమా పెన్నా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఆన్‌రాక్‌ను ఏర్పాటు చేసు కుంది.ఈ మేరకు ఏపీఎండీసీ ఆన్‌రాక్‌తో బాక్సైట్ సరఫరా ఒప్పందం కుదుర్చు కుంది. అనంతర కాలంలో కేంద్రం నుంచి అవసరమైన ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు,అందు లోని అంశాలపై 2013లో కాగ్ ఓ సంచ లన నివేదిక ఇచ్చింది.అనేక లోపాలను ఎత్తిచూపింది. ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం (ఈవోఐ) లేకుండా.. ఏపీఎండీసీకి తీవ్ర స్థాయిలో నష్టం జరిగేలా ఒప్పందంలో క్లాజులున్నాయని..రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేవలం 1.5శాతం ఈక్విటీ ఇచ్చారని..ఇలా పలు కీలక అంశాలను లేవనెత్తింది.ఇది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిం చింది.మరోవైపు ఆన్‌రాక్ ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాటాలు చేశాయి.దీంతో ఆన్‌రాక్‌తో ఏపీఎండీసీ చేసు కున్న బాక్సైట్ ఒప్పందం ఆమోదానికి సంబం ధించిన 222, 289 జీవోలను ప్రభుత్వం 2016లో రద్దుచేసింది.ఈమేరకు జీవో 44 జారీ చేసింది.అలాగే..ఏపీఎండీసీకి బాక్సైట్ బ్లాక్ లీజుల కేటాయింపును కూడా రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. కేంద్ర గనులు,ఖనిజాల నియంత్రణ,అభివృద్ధి చట్టం-2015లోని సవరించిన క్లాజుల ప్రకా రం ఈకీలక నిర్ణయం తీసుకుంది.ఈ పరిణా మాలపై ఆన్‌రాక్ హైకోర్టుల్లో, తర్వాత సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసింది.ఎక్కడా ఊరట లభించకపోవడంతో లండన్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది. ఒప్పందాల రద్దు వల్ల తనకు రూ.2,500కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. దీనిపై మార్చి 26న విచారణ జరుగనుంది.
సీఎంసీ పాలసీతో మళ్లీ కదలిక..
మరోవైపు..కేంద్రం గనులు,ఖనిజాల రంగంలో సంచలన నిర్ణయం తీసుకుంది.క్రిటికల్ మిన రల్స్ పాలసీ (సీఎంసీ)ని ప్రకటించింది అత్యంత అరుదైన ఖనిజాల మైనింగ్‌లో స్వయం సమృద్ధిని సాధించేలా ఈవిధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అరుదైన ఖని జాల మైనింగ్ చేపట్టాలని నిర్ణయించింది. అంటే బీచ్‌శాండ్‌తోపాటు బాక్సైట్ కూడా ఇందులో భాగమే.ఈ నేపథ్యంలో గనులశాఖ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బాక్సైట్ మైనింగ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. సీఎంసీలో భాగంగా రాష్ట్రంలో బాక్సైట్ మైనింగ్ చేపడితే..అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుతోపాటు విలువ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని..ఫలితంగా ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉం దని జనవరి చివరి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రత్యక్షంగా,పరోక్షంగా 60 వేల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా తెలిపింది.
ఖనిజాభివృద్ధి సంస్థ పేరిటే లీజులు..
అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలోని ఆరు బ్లాకుల్లో మైనింగ్ లీజులు నేరుగా గిరిజన ఆదివాసీలు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే ఇవ్వాలి. అందుచేత తన శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ పేరిట మైనింగ్ లీజులు ఇప్పించాలని గనులశాఖ కోరింది.నామినేషన్ పద్దతిన లేదా వేలం విధానంలో అయినా లీజులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఏపీఎండీసీకి లీజులు ఇప్పిస్తే మైనింగ్, అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుకు అది డెవలపర్‌ను నియ మించుకుంటుందని నివేదికలో పేర్కొంది. అంటే.. మైనింగ్ రంగంలో పేరున్న ప్రైవేటు కంపెనీతో ఒప్పందాలు చేసుకుని డెవలపర్‌గా ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం బీచ్‌శాండ్ కాంట్రాక్టులో భాగంగా అదానీ గ్రూపునకు చెందిన ‘అల్లూవియల్ హెవీ మినరల్స’కంపె నీని డెవలపర్‌గా నియమించుకుంది.బీచ్ శాండ్ మైనింగ్‌లో ఆ కంపెనీకి 90శాతం వాటా ఉండగా.. ఏపీఎండీసీకి 10శాతమే ఉంది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. బాక్సైట్ మైనింగ్‌లోనూ డెవలపర్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని గనుల శాఖ కోరుతోంది. అయితే లీజుల నిర్ణయాధి కారం కేంద్రం పరిధిలో ఉంది. బాక్సైట్ లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలంటే తొలుత రాష్ట్రప్రభుత్వం ఓవిధాన నిర్ణయం తీసు కోవాలి.ఏపీఎండీసీకి లీజులివ్వాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేయాలి.ఆతర్వాత కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని కేంద్రానికి సిఫారసు చేస్తే ఏపీఎండీసీ పేరిట లీజులు మంజూరవడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జగన్ జమానాలో ఇలా…
ఉమ్మడి గోదావరి జిల్లాలు,విశాఖ,విజయ నగరంలోని అటవీప్రాంతంలో అత్యంత విలు వైన లాటరైట్,బాక్సైట్‌తోపాటు రోడ్‌మెటల్ వంటి ఖనిజాల లీజులున్నాయి. బాక్సైట్ తవ్వ కాలు లేవుగానీ గత జగన్ ప్రభుత్వంలో లాట రైట్ పేరిట బాక్సైట్‌ను తవ్వి వ్యాపారం చేసుకు న్నారు. మట్టి తవ్వకాల పేరిట అక్రమంగా లాటరైట్‌ను తవ్వి తరలించుకుపోయారు. ఇక క్రషర్ యూనిట్లకు కొదవలేదు.దేశంలో మరె క్కడా లేని యూనిట్లు అటవీప్రాంతంలో ఉన్నా యి. వీటిపై గతంలో వైసీపీకి చెందిన ఎంపీ కుమారుడు, జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ముఖ్య అధికారి కుమారుడు,మేనల్లుడు,కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గుత్తాధిపత్యం నడిపారు.పైసా పెట్టుబడి లేకుండా అన్ని రకాల మైన్లను తమ నియం త్రణలోకి తీసుకొని దందా నడిపారు. ఎదురు తిరిగిన వారిని బెదిరించేందుకు,భయపెట్టేం దుకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ప్రజాప్రతినిధిని(ప్రస్తుతం మాజీ) మన్యంకు తీసుకెళ్లారు. అక్కడ రాయలసీమ మార్క్ సెటిల్‌మెంట్లు చేశారు.జగన్ సర్కారు ఉన్నంత వరకు ఖనిజాల తవ్వకాలు,రవాణా,క్రషర్ల యూనిట్‌ల నిర్వహణ అంతా సిండికేట్‌గా మార్చారు.జగన్ ప్రభుత్వం దిగిపోగానే వారు కనుమరుగయ్యారు. ఇప్పుడు కొత్త మనుషులు తెరమీదకు వచ్చారు.
ఇప్పుడిలా…
కాకినాడకు చెందిన సతీశ్ ఇప్పుడు మన్యం లోని మైనింగ్ వ్యాపారంపై దృష్టిసారించారు. ఈయనపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గత ఎన్నికల సమయంలో జనసేన తరఫున పోటీసేందుకు విఫల ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సతీశ్ హల్‌చల్ చేయడం మొదలుపెట్టారు. విజయ వాడలోని హోటల్‌లో ఆయన నేతృత్వంలోనే సమావేశం జరిగింది.ఆయా జిల్లాల మైన్‌ల లీజుదారులు, కాంట్రాక్టర్లు, గనులశాఖలోని కీలక అధికారులను ఈ సమావేశానికి తీసుకొ చ్చారు. ఇందులో కాకినాడకు చెందిన ఓకీలక అధికారి ముఖ్యపాత్ర పోషించినట్లు తెలిసింది. లాటరైట్,బాక్సైట్,రోడ్‌మెటల్,బిల్డింగ్‌స్టోన్, మాంగనీస్ వంటి ఖనిజాల లభ్యత,వాటి విలువ గురించి ఆ అధికారి ప్రజంటేషన్ ఇచ్చి నట్లు సమాచారం.సగటున రోజుకు ఆయా ఖనిజాలపై రూ.ఐదు కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది.
టన్నుకు ఎంతిస్తారు?…
గతంలో అమలు చేసిన పాలసీ తమకొద్దని, ఆయా ఖనిజాలకు సంబంధించి టన్నుకు ఎంత ఫీజు చెల్లిస్తారో చెప్పాలని సతీశ్…. విజయవాడ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది.”మీ వ్యాపారం జరగాలి.మా పని సాఫీగా సాగాలి. కాబట్టి మేం ధర నిర్ణయిం చం. మీరే టన్నుకు ఎంత రేటు ఇస్తారో చెప్పండి.లాటరైట్‌కు ఎంత ఇస్తారు? క్వార్ట్జ్‌కు ఎంతిస్తారు? రోడ్‌మెటల్‌కు ఎంతిస్తారు? క్రషర్ యూనిట్లు నెలకు ఎంత ఇస్తాయో చెప్పండి” అన్నట్లు తెలిసింది. కాగా, ఓలీజు దారు ఈ మీటింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేయ గా,తాను చెప్పిందే ఇక్కడ నడుస్తుందని, తనను కాద ని వ్యాపారం చేయలేరని హెచ్చరించి నట్లు తెలిసింది.ఈ సమయంలో కాకినాడకు చెందిన గనుల అధికారి జోక్యం చేసుకొని తాము అన్నీ మాట్లాడతామని సర్దిచెప్పినట్లు తెలిసింది.

ప్లాస్టిక్ వద్దు బట్ట సంచులే ముద్దు

నేడు ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది.మార్కెట్‌కు వెళ్లినా, వస్తువులు కొనుగోలు చేసినా,ఆహార పదార్థాలను నిల్వ చేసినా ప్లాస్టిక్ వినియోగం విస్తృతమైంది. అయితే సౌకర్యం కోసం వాడుతున్న ఈ ప్లాస్టిక్ ప్రకృతికి పెద్ద శాపంగా మారింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వందల సంవత్సరాల పాటు నేలలో,నీటిలో కరగకుండా ఉండి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.- జి ఎన్ వి సతీష్ 
నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినో త్సవం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం భయంకరమైన స్థాయిలోకి చేరు కుంది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణంపై కలిగే హానికరమైన ప్రభావాలపై అవ గాహన పెంచి వీటి వాడ కాన్ని తగ్గించేందుకు ఏటా జూన3న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ముఖ్యం గా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యా మ్నాయాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని ప్లాస్టిక్‌లు పర్యావరణ సవాళ్లను కలిగి స్తుండగా,వాటిలో ముఖ్యంగా ప్లాస్టిక్ సంచు లు ఎక్కువ ఆందోళనకు కారణమవుతు న్నాయి.ఈ సంచులు వాతావరణ కాలుష్యంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇవి మట్టిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఎక్కువ కాలం పాటు వాతావరణంలో ఉండి వన్యప్రాణుల జీవనాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. సముద్రా ల్లోకి చేరిన ప్లాస్టిక్ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తోంది. మనం రోజూ విరివిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
ప్లాస్టిక్ బ్యాగుల నివారణ ఆవశ్యకం : ప్లాస్టిక్ వినియోగం మనజీవితాల్లో విస్తృతంగా ప్రవేశించి పర్యావరణంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. దీనివల్ల వన్యప్రాణులు,మానవుల ఆరోగ్యం సమస్యల్లో చిక్కుకుంది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం చాలా అవసరం. జీవక్షయం చెందనివి ప్లాస్టిక్ సంచులు సహజంగా విచ్ఛిన్నం కాని పదార్థాలను కలిగిఉంటాయి. ఇవి వందలు లేదా వేలసంవత్సరాలపాటు వాతావర ణంలో ఉంటాయి. కాలక్రమేణా,సూర్యరశ్మి, ఫిజికల్ ఎనర్జీ ప్లాస్టిక్ సంచిని ‘మైక్రోప్లాస్టిక్‌లు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ మైక్రోప్లాస్టిక్‌లు పర్యావరణంలో శాశ్వతంగా ఉంటాయి. ఇవి నేల,నీటిని కలుషితం చేస్తూనే ఉంటాయి.ఆహార గొలుసులోకి కూడా ప్రవేశిస్తాయి.
సముద్ర కాలుష్యం : ఏటా మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ సంచులు సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటిలో ఎక్కువభాగం భూమి నుంచి వస్తుంది.నదులు,గాలి,వర్షపు నీరు ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకువచ్చి సముద్రంలోకి చేరుతున్నాయి.ఇవి మాత్రమే కాకుండా నిర్లక్ష్యంగా పారవేసిన చెత్త,సముద్రంలోకి నేరుగా ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వంటి కారణాల వల్ల కూడా ప్లాస్టిక్ సంచులు సముద్రంలో కలుస్తాయి. అవి మైక్రోప్లాస్టిక్ లుగా విచ్ఛిన్నమై సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి.
డ్రైనేజి సమస్యలు : ప్లాస్టిక్ సంచులను సరిగా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టమ్‌లో ఇరుక్కుపోతాయి.మరీ ముఖ్యంగా వర్షా కాలంలో ఇవి కాలువలు,జలమార్గాలను అడ్డుకుని నగరాల్లో వరదలకు కారణమ వుతాయి.తద్వారా ఎన్నో కుటుంబాలకు ఆస్తి నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. వన్య ప్రాణులకు హాని పక్షులు,సముద్ర జంతువులు ప్లాస్టిక్ సంచులను పొరపాటుగా తినేస్తాయి. దీంతో వీటి జీర్ణవ్యవస్థలు మూసుకుపోయి ఆహారం జీర్ణం కాక ఆకలితో మరణిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే జంతువులు ప్లాస్టిక్ సంచులలో చిక్కుకుపోతుంటాయి. ఇది గాయాలు,ఊపిరాడకపోవడం,చివరికి మరణానికి కూడా దారితీయొచ్చు.ప్లాస్టిక్ సంచుల క్షీణత నుంచి మైక్రోప్లాస్టిక్‌లు ఆహార గొలుసులోకి ప్రవేశించి అధిక ట్రోఫిక్ స్థాయిలను సృష్టిస్తాయి. ఇది మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలుప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది.ఇవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇవి వాతావరణ మార్పులకు కారణమవుతాయి. ప్లాస్టిక్ సంచులను కాల్చినప్పుడు లేదా కుళ్లిపోయినప్పుడు అవి వాతావరణంలోకి, నేలలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది.
మానవ ఆరోగ్యంపై ప్రభావంప్లాస్టిక్‌ను కాల్చినప్పుడు, సూర్యకాంతిలో విచ్ఛిన్న మైనప్పుడు హానికరమైన రసాయనాలు, విషపూరిత వాయువులు విడుదలై నేలను, గాలిని కాలుషితం చేస్తాయి.వీటిలో డయా క్సిన్,ఫ్యురాన్ వంటి రసాయనాలు ఉంటా యి.ఇవి మానవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.శ్వాసకోశ సంబంధిత వ్యాధులు,క్యాన్సర్,గర్భధారణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవు తాయి.అయితే వీటి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.ఇన్ని సమస్యలను తెచ్చి పెడుతున్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషే ధించి స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం అవసరం. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా అందరూ బట్ట సంచులు,కాగితపు సంచులు,బయోడిగ్రే డబుల్ సంచులు,లేదా రీసైకిల్ చేసిన పదార్థాలతో చేసిన సంచులను వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి.దీన్ని ప్రతిఒక్కరి బాధ్య తగా భావించాలి.తద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మానవ ఆరోగ్యం,ఇతర జీవజాతుల ప్రాణాలను కాపాడటంలో భాగం కావచ్చు.
గిరిజన ప్రాంతాలపై ప్రభావం : ఒకప్పుడు సహజసంపదతో కళకళలాడిన గిరిజన ప్రాంతాలు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును ఎదుర్కొంటున్నాయి.అడవుల్లోకి,వాగుల్లోకి, జలపాతాల పరిసరాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ చెత్తవల్ల అడవి జంతువులు,పక్షులు ప్రమాదానికి గురవుతున్నాయి.పర్యాటక ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా పారవేసే ప్లాస్టిక్ సంచులు ప్రకృతి సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్లాస్టిక్-ఆరోగ్యానికి ముప్పు : ప్లాస్టిక్ వ్యర్థా లను కాల్చడం వల్ల విషవాయువులు విడు దలై శ్వాసకోశ సమస్యలు,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమ వుతున్నాయి.సముద్రా లు,నదుల్లో చేరిన ప్లాస్టిక్ సూక్ష్మకణాలు (మైక్రోప్లాస్టిక్స్) చేపలద్వారా మానవ శరీరం లోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తు న్నాయి.ప్రత్యామ్నాయాలే పరిష్కారం.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి బట్టసంచులు, జనపనార ఉత్పత్తులు,వెదురు వస్తువులు, తాటి ఆకులతో తయారైన వస్తువులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్స హించాలి.గ్రామాలు,పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు,మార్కెట్లు ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మారేందుకు సమిష్టి కృషి అవ సరం.పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలి.“నా సంచి-నా బాధ్యత”,“ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు” వంటి సందేశాలతో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలి.ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో చిన్న మార్పులు తీసుకొస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఎల్‌నినో వాతావరణంపై ప్రభావం

ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే సహజ ప్రక్రియల్లో ఎల్‌నినో (జుశ్రీచీఱశీ)అత్యంత కీలక మైనది.పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య,తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు అసాధా రణంగా వేడెక్కినప్పుడు ఈపరిస్థితి ఏర్పడుతుంది.దీని ప్రభావం కేవలం సముద్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం,ఉష్ణోగ్రతలు,వ్యవసాయ ఉత్పత్తి,ఆర్థిక వ్యవస్థలపై ప్రతిఫలిస్తుంది.వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రవర్తన గతంతో పోలిస్తే మరింత అనిశ్చితంగా మారుతోంది. ప్రతి ఎల్‌నినో సంఘటనతీవ్రత,వ్యవధి,ప్రభావాలు భిన్నంగా ఉండటంతో వాతావరణ అంచనాలు కూడా సంక్లిష్ట మవుతున్నాయి.ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి,వరదలు సంభవిస్తే, మరికొన్ని ప్రాంతాలు వర్షాభావం,కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
భారతదేశంలో ఎల్‌నినో ప్రభావం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై కనిపిస్తుంది. దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో సుమారు 70శాతం ఈ రుతుపవనాల ద్వారానే వస్తుంది. ఎల్‌నినో సమ యంలో తేమగాలుల ప్రవాహం బలహీనపడటం వల్ల రుతుపవనాలు ఆలస్యమవడం లేదా వర్షపాతం తగ్గడం సాధారణంగా కనిపించే పరిణామం.దీని ప్రభావం ఖరీఫ్‌పంటలైన వరి,పప్పుధాన్యాలు,నూనె గింజల దిగుబడిపై స్పష్టంగా కనిపిస్తుంది.వ్యవసాయ ఉత్పత్తి తగ్గడంవల్ల ఆహారభద్రత,ధరల స్థిరత్వం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావంపడే అవకాశం ఉంది.వర్షపాతం తగ్గుదలతోపాటు ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల వేడితరంగాల తీవ్రత అధికమవుతుంది. రిజర్వా యర్లు,భూగర్భజలాల పునరుద్ధరణ మందగించి తాగునీరు,సాగునీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది.ఈ పరిస్థితులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి.
అయితే ఎల్‌నినో ప్రభావం ప్రతిసారీ ఒకేవిధంగా ఉండదు.భారత మహాసముద్ర ద్విధ్రువం (Iఅdఱaఅ Ocవaఅ ణఱజూశీశ్రీవ–IOణ)అనుకూల దశలో ఉన్నప్పుడు భారత మహాసముద్రం నుంచి అధిక తేమ లభించడంవల్ల వర్షపాతం మెరుగుపడే అవకాశం ఉంటుంది.అలాగే ఎల్‌నినో దక్షిణ దోలనం (జుచీSO),IOణ వంటి సముద్రవాతావరణవ్యవస్థల పరస్పరచర్యలు భారతరుతుపవనాల బలాన్ని నిర్ణయించే ప్రధాన కారకాలుగా గుర్తించబడ్డాయి.అందువల్ల కేవలం ఎల్‌నినో ఆధారంగా మాత్రమే వర్షపాతాన్ని అంచనా వేయడం శాస్త్రీయంగా సముచితం కాదు.భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే అధునాతన వాతావరణ అంచనా వ్యవస్థలు,నీటివనరుల సమగ్రనిర్వహణ,పంటల వైవిధ్యీకరణ,వాతావరణ సహన వ్యవసాయ పద్ధతుల అమలు అత్యవసరం.అదే సమయంలో రైతులకు ప్రాంతాలవారీగా ముందస్తు వాతావరణ సమాచారాన్ని అందించడం,విధాన నిర్ణయాల్లో శాస్త్రీయ సమాచారాన్ని వినియోగించడం కూడా కీలకం.
ఎల్‌నినో ఒకసహజ వాతావరణ చక్రమే అయినప్పటికీ,వాతావరణ మార్పుల యుగంలో దాని ప్రభావాలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.అందువల్ల శాస్త్రీయ అవగాహన,సమర్థ ప్రణాళిక,వనరుల సుస్థిర నిర్వహణద్వారానే ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని దేశ ఆహార,నీటి,ఆర్థిక భద్రతను పరిరక్షించడం సాధ్యమవుతుంది.! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

1 2