ప్లాస్టిక్ వద్దు బట్ట సంచులే ముద్దు
నేడు ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది.మార్కెట్‌కు వెళ్లినా, వస్తువులు కొనుగోలు చేసినా,ఆహార పదార్థాలను నిల్వ చేసినా ప్లాస్టిక్ వినియోగం విస్తృతమైంది. అయితే సౌకర్యం కోసం వాడుతున్న ఈ ప్లాస్టిక్ ప్రకృతికి పెద్ద శాపంగా మారింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వందల సంవత్సరాల పాటు నేలలో,నీటిలో కరగకుండా ఉండి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.- జి ఎన్ వి సతీష్
నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినో త్సవం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం భయంకరమైన స్థాయిలోకి చేరు కుంది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణంపై కలిగే హానికరమైన ప్రభావాలపై అవ గాహన పెంచి వీటి వాడ కాన్ని తగ్గించేందుకు ఏటా జూన3న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ముఖ్యం గా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యా మ్నాయాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని ప్లాస్టిక్లు పర్యావరణ సవాళ్లను కలిగి స్తుండగా,వాటిలో ముఖ్యంగా ప్లాస్టిక్ సంచు లు ఎక్కువ ఆందోళనకు కారణమవుతు న్నాయి.ఈ సంచులు వాతావరణ కాలుష్యంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇవి మట్టిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఎక్కువ కాలం పాటు వాతావరణంలో ఉండి వన్యప్రాణుల జీవనాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. సముద్రా ల్లోకి చేరిన ప్లాస్టిక్ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తోంది. మనం రోజూ విరివిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
ప్లాస్టిక్ బ్యాగుల నివారణ ఆవశ్యకం : ప్లాస్టిక్ వినియోగం మనజీవితాల్లో విస్తృతంగా ప్రవేశించి పర్యావరణంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. దీనివల్ల వన్యప్రాణులు,మానవుల ఆరోగ్యం సమస్యల్లో చిక్కుకుంది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం చాలా అవసరం. జీవక్షయం చెందనివి ప్లాస్టిక్ సంచులు సహజంగా విచ్ఛిన్నం కాని పదార్థాలను కలిగిఉంటాయి. ఇవి వందలు లేదా వేలసంవత్సరాలపాటు వాతావర ణంలో ఉంటాయి. కాలక్రమేణా,సూర్యరశ్మి, ఫిజికల్ ఎనర్జీ ప్లాస్టిక్ సంచిని ‘మైక్రోప్లాస్టిక్‌లు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ మైక్రోప్లాస్టిక్‌లు పర్యావరణంలో శాశ్వతంగా ఉంటాయి. ఇవి నేల,నీటిని కలుషితం చేస్తూనే ఉంటాయి.ఆహార గొలుసులోకి కూడా ప్రవేశిస్తాయి.
సముద్ర కాలుష్యం : ఏటా మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ సంచులు సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటిలో ఎక్కువభాగం భూమి నుంచి వస్తుంది.నదులు,గాలి,వర్షపు నీరు ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకువచ్చి సముద్రంలోకి చేరుతున్నాయి.ఇవి మాత్రమే కాకుండా నిర్లక్ష్యంగా పారవేసిన చెత్త,సముద్రంలోకి నేరుగా ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వంటి కారణాల వల్ల కూడా ప్లాస్టిక్ సంచులు సముద్రంలో కలుస్తాయి. అవి మైక్రోప్లాస్టిక్ లుగా విచ్ఛిన్నమై సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి.
డ్రైనేజి సమస్యలు : ప్లాస్టిక్ సంచులను సరిగా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టమ్‌లో ఇరుక్కుపోతాయి.మరీ ముఖ్యంగా వర్షా కాలంలో ఇవి కాలువలు,జలమార్గాలను అడ్డుకుని నగరాల్లో వరదలకు కారణమ వుతాయి.తద్వారా ఎన్నో కుటుంబాలకు ఆస్తి నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. వన్య ప్రాణులకు హాని పక్షులు,సముద్ర జంతువులు ప్లాస్టిక్ సంచులను పొరపాటుగా తినేస్తాయి. దీంతో వీటి జీర్ణవ్యవస్థలు మూసుకుపోయి ఆహారం జీర్ణం కాక ఆకలితో మరణిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే జంతువులు ప్లాస్టిక్ సంచులలో చిక్కుకుపోతుంటాయి. ఇది గాయాలు,ఊపిరాడకపోవడం,చివరికి మరణానికి కూడా దారితీయొచ్చు.ప్లాస్టిక్ సంచుల క్షీణత నుంచి మైక్రోప్లాస్టిక్‌లు ఆహార గొలుసులోకి ప్రవేశించి అధిక ట్రోఫిక్ స్థాయిలను సృష్టిస్తాయి. ఇది మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలుప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది.ఇవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇవి వాతావరణ మార్పులకు కారణమవుతాయి. ప్లాస్టిక్ సంచులను కాల్చినప్పుడు లేదా కుళ్లిపోయినప్పుడు అవి వాతావరణంలోకి, నేలలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది.
మానవ ఆరోగ్యంపై ప్రభావంప్లాస్టిక్ను కాల్చినప్పుడు, సూర్యకాంతిలో విచ్ఛిన్న మైనప్పుడు హానికరమైన రసాయనాలు, విషపూరిత వాయువులు విడుదలై నేలను, గాలిని కాలుషితం చేస్తాయి.వీటిలో డయా క్సిన్,ఫ్యురాన్ వంటి రసాయనాలు ఉంటా యి.ఇవి మానవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.శ్వాసకోశ సంబంధిత వ్యాధులు,క్యాన్సర్,గర్భధారణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవు తాయి.అయితే వీటి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.ఇన్ని సమస్యలను తెచ్చి పెడుతున్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషే ధించి స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం అవసరం. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా అందరూ బట్ట సంచులు,కాగితపు సంచులు,బయోడిగ్రే డబుల్ సంచులు,లేదా రీసైకిల్ చేసిన పదార్థాలతో చేసిన సంచులను వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి.దీన్ని ప్రతిఒక్కరి బాధ్య తగా భావించాలి.తద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మానవ ఆరోగ్యం,ఇతర జీవజాతుల ప్రాణాలను కాపాడటంలో భాగం కావచ్చు.
గిరిజన ప్రాంతాలపై ప్రభావం : ఒకప్పుడు సహజసంపదతో కళకళలాడిన గిరిజన ప్రాంతాలు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును ఎదుర్కొంటున్నాయి.అడవుల్లోకి,వాగుల్లోకి, జలపాతాల పరిసరాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ చెత్తవల్ల అడవి జంతువులు,పక్షులు ప్రమాదానికి గురవుతున్నాయి.పర్యాటక ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా పారవేసే ప్లాస్టిక్ సంచులు ప్రకృతి సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్లాస్టిక్-ఆరోగ్యానికి ముప్పు : ప్లాస్టిక్ వ్యర్థా లను కాల్చడం వల్ల విషవాయువులు విడు దలై శ్వాసకోశ సమస్యలు,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమ వుతున్నాయి.సముద్రా లు,నదుల్లో చేరిన ప్లాస్టిక్ సూక్ష్మకణాలు (మైక్రోప్లాస్టిక్స్) చేపలద్వారా మానవ శరీరం లోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తు న్నాయి.ప్రత్యామ్నాయాలే పరిష్కారం.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి బట్టసంచులు, జనపనార ఉత్పత్తులు,వెదురు వస్తువులు, తాటి ఆకులతో తయారైన వస్తువులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్స హించాలి.గ్రామాలు,పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు,మార్కెట్లు ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మారేందుకు సమిష్టి కృషి అవ సరం.పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలి.“నా సంచి-నా బాధ్యత”,“ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు” వంటి సందేశాలతో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలి.ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో చిన్న మార్పులు తీసుకొస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
