నూతన మంత్రివర్గం..సరికొత్త సవాళ్లు

విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రి వర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్తమాత్రులుగా మార్చబడిన స్థితి.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు ఎడతెగని చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవుల చుట్టూ రాజకీయాలు, మీడియా కథనాలు పరిభ్రమించే ప్రస్తుత కాలంలో ఇది అనూహ్యమేమీ కాదు. తన మంత్రివర్గాన్ని సగం పదవీ కాలం తర్వాత మారుస్తానని జగన్‌ తమ మొదటి లెజిస్లేటివ్‌ సమావేశంలోనే ప్రకటించారు. కనుక మంత్రులుగా చేరిన వారంతా ఆ షరతుకు లోబడే చేరారన్నది స్పష్టం. నూటయాభై స్థానాలతో ప్రభంజనం సృష్టించిన ఆరంభ ఘట్టం అది. నాయకుడూ శాసనసభ్యులూ కూడా పాలనా పగ్గాలు చేపట్టాలనే ఉత్సుకతతో వున్న దశ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పరి స్థితి ఎలాగూ వుండదు. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర విధానాల కారణంగా ధరల మంటలు, అప్పుల ఊబి, అమరావతి ప్రతిష్టంభన ఒకటేమిటి అనేకానేక సవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న స్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హుకుంలు వాటిని ప్రశ్నించకపోగా అత్యుత్సాహంగా సమర్థిస్తూ తనూ ఒక వేటు వేసే జగన్‌ ప్రభుత్వ విధానాలు ఇందుకు మూల కారణంగా వున్నాయి. అందుకే ముంచుకొచ్చిన కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేసినా అనివార్యంగా ఇప్పుడు ఆ పునర్యవస్థీకరణ ముందుకొచ్చి కూచుంది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి స్వీయకల్పితం. ఒక ముఖ్యమంత్రి సగం కాలానికే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తర్వాత మారుస్తానని చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కనుక దీనికి ఇంతకు ముందు నమూనా ఏదీ దేశంలో లేదు. దాని ప్రభావాన్ని చెప్పడానికీ ఉదాహరణ లేదు.
మూడు దొంతరలు, విధాన ప్రశ్నలు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా బడ్జెట్‌ లీకైందంటూ మొత్తం మంత్రివర్గాన్ని సామూహికంగా బర్తరఫ్‌ చేసి అందరి రాజీనామాలు తీసుకున్న ఉదంతంతో కొన్ని పోలికలున్నా అది వేరే తరహా సందర్భం. దాని ఫలితంగా ఆ పార్టీలో చీలిక వచ్చింది, అప్పటికే ఆ ప్రభుత్వంపై వున్న అసంతృప్తి మరింత పెరిగి ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఓటమితో సహా ఆ పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల తర్వాత రెండు మాసాల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయనేలేదు. కేవలం తనూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ మాత్రమే ప్రభుత్వంగా నడిపించారు. కేంద్రంలో ప్రధానిమోడీ తన మంత్రివర్గ సహచరులలో దాదాపు 70శాతం మందిని దశలవారిగా తప్పించారు. అంతేగాక గతంలో కాంగ్రెస్‌ చేసినట్టే రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రులను వరుసగా మార్చేశారు. ఏతావాతా జాతీయ పాలకవర్గ పార్టీలలో ముఖ్యమంత్రులకూ ప్రాంతీయ పార్టీలలో మంత్రులకు పదవులు ఎప్పుడైనా ఊడిపో వచ్చనే భావం బలపడిరది. అయితే జగన్‌ నేరుగా అందరినీ మార్చేస్తానని ముందే ప్రకటించి మరీ పాలన ప్రారంభించడం కొత్త వ్యూహం. దాని అమలు ఎలా వుంటుంది, అనంతర ప్రభావాలు ఏమిటి అన్నదే ఇప్పుడు కీలక చర్చగా తయారైంది. ఏప్రిల్‌ 7న జరిగిన క్యాబినెట్‌లో పాత మంత్రులందరూ రాజీనామా చేయడం,వాటిని గవర్నర్‌ ఆమోదించడం జరిగిపోయింది. అయితే వారిలో కొనసాగే వారెవరు,ఎందరు అనే రసవత్తర కథనాలు మాత్రం నడుస్తూనే వున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగించడం తప్ప అత్యధికులను మార్చవలసి వుంటుందని ఆయన మొదట అన్నారు. అనుభవం కోసం కొందరు కొనసాగుతారన్నారు. చివరి సమావేశంలోనూ సంఖ్య చెప్పకపోయినా ఇలాంటి మాటలే మాట్లాడినట్టు మంత్రులు చెబుతున్నారు. అయిదారుగురు పాతవారు వుండొచ్చన్న లెక్క కాస్త పెరిగి పది పైన ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు ఆలస్యంగా చేరిన వారు కాగా ఒకరిద్దరు ఆ వర్గాలకు ఏకైక ప్రతినిధులుగా వున్నవారు. ఇవి కూడా ఊహాగానాలు తప్ప ఆధారం లేదు. పదిమందికి పైగా కొనసాగిస్తే అప్పుడు తప్పించబడే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం మరింత అధికమని అధినేతకూ సలహాదారులకు తెలుసు. తప్పించిన మంత్రు లను జిల్లాలకు లేదా ప్రాంతాలకు సమన్వ యకర్తలుగా పంపి వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యత అప్పగిస్తామన్నారు. మరి వారికి సంస్థాగత నాయకత్వం అప్పగిస్తే కొత్తమంత్రుల కాళ్లకు పగ్గాలు వేసినట్టు కాదా. ఈ రెండు తరహాలలో దేనికీ చెందకుండా ఏపదవీ బాధ్యతలు దక్కని మూడో తరహా నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా వైఎస్‌ఆర్‌సిపి లోనూ ప్రభుత్వంలోనూ మూడు దొంతరలు ఏర్పడే సూచనలున్నాయి. ఈ వైరుధ్యాలను సర్దుబాటు, సమన్వయం చేయడం తేలికేమీ కాదు. ఎన్నికల సన్నాహాలు, సమరం మొద లైనట్టే మాట్టాడుతున్న ముఖ్యమంత్రి తీరు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నది.తాము వచ్చేసినట్టే మాట్టాడుతున్నారు. కనుక కొత్త మంత్రులు లేదా మంత్రివర్గం ఆది నుంచి ఎన్నికల వేడిలోనే పని చేయవలసి వుంటుంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నా ప్రజలూ ప్రతిపక్షాలూ సమస్యల తీవ్రతపై ఉద్యమిస్తున్న నేపథ్యం. ఈ సమస్యలకు కారణమైన విధానాలు, పని విధానాలు మారకుండా కేవలం కొన్ని శాఖల మంత్రుల మొహాలు, విగ్రహాలు మార్చినంత మాత్రాన కలిగే ప్రయోజనం వుండదు. ప్రభావమూ వుండదు.
అసహనం, అవకాశవాదం
విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రివర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్త మాత్రులుగా మార్చబడిన స్థితి. నూటయాభై స్థానాలు గెలిచిన జగన్‌ ప్రభుత్వం వంటి వాటిలో ఇది మరింత ఎక్కువ. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి గురించి విమర్శించినవారే ఇప్పుడు ఆయన బలహీనపడ్డారనీ, ఆ విధంగా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా తనపై విమర్శల గురించి కొన్ని ఆరోపణలు గురించి అసహనంతో విరుచుకు పడుతున్నారు.గత రెండు రోజులలో టిడిపి పైన దాన్ని బలపర్చే మీడియా పైన ఆయన వ్యాఖ్యలు ఇందుకు పరాకాష్టగా వున్నాయి. దీనికి ముందు ఢల్లీి వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలసి వచ్చిన జగన్‌ బిజెపిని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడం లేదు. బిజెపి మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను కూడా టిడిపి దత్తపుత్రుడుగా విమర్శిస్తున్నారు! వామపక్షాలు మినహాయిస్తే ఈ ప్రాంతీయ పార్టీలేవీ మోడీ సర్కారు రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించలేకపోవడం నష్టదాయకం. పైగా ఆ బిజెపినే ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వాధినేత మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని భావించే జగన్‌… ఆయన, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌…కేంద్రంపై పోరాడుతున్న తీరును గమనించడం లేదా?
దిద్దుబాటుకు ఒక అవకాశం
మళ్లీ పునర్వవస్థీకరణకు వస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, ఎప్పుడూ తమ మాటే చెల్లుతుందనుకోవడం పొరబాటని ఈ మంత్రివర్గ వ్యవహారమే స్పష్టం చేస్తున్నది. లేకపోతే ఇంత కసరత్తు, ఇన్ని మల్లగుల్లాలు అవసరమై వుండేవి కావు. సామాజిక లెక్కలతో పాటు మంత్రులలో కొందరు అనుభవజ్ఞులు, బలాఢ్య ధనాఢ్య వ్యక్తులు, విశ్వసనీయత గలవారు కొనసాగడం సహజం. కేవలం నోరు జోరు బట్టి కొందరు వుంటారని, కొందరు వస్తారని వేసే లెక్కలు నిలవకపోవచ్చు. ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్న పేర్లు కూడా వున్నాయి. ఈ దెబ్బతో వైసిపి లో ముసలం పుడుతుందని, ముక్కలైపోతుందని ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్థులూ వున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంత భారీ నాటకీయ మార్పులు వుండకపోవచ్చు. పాలకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తారు. వారిలో ఒకరు మూరు?లనీ మరొకరు దార్శనికులనీ చెప్పడం అనవసరం. వ్యక్తులను బట్టి తరతమ తేడాలున్నా రాజకీయాలలో వర్గ ప్రయోజనాలే శాసిస్తుంటాయి. నాలుగు వందల మంది ఎంపిలను తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి ఫిరాయింపుల నిరోధకచట్టం కావలసి వచ్చింది. నూట యాభై మంది ఎంఎల్‌ఎలు వున్న జగన్‌ మధ్యలో మార్పు ద్వారా ఎక్కువమందిని సంతృప్తిపర్చాలని తలపెట్టారు. వాస్తవంలో ఇది అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చు. తనే కీలకం, మిగిలిన వారు నిమిత్తమాత్రులనే సంకేతం కూడా ఇందులో వుండొచ్చు. తమ పార్టీలోనూ బయిటివారిలోనూ స్పందనలను తెలుసుకోవడం కోసం గత వారం రోజులూ రకరకాల లీకులతో ఊహాగానాలు నడిపిం చారు. దీన్ని కేవలం వ్యూహాత్మక చర్యగానూ ఎన్నికల ఎత్తుగానూ హడావుడి పెంచితే ఉప యోగం వుండదు. ఈ అవకా శాన్ని తమ తప్పు లు దిద్దుకోవడానికి ఉపయో గించుకుంటే ఈ కసరత్తుకు కాస్తయినా ప్రయోజనం వుంటుంది. ప్రజల స్పందనా దాన్ని బట్టే వుంటుంది. ఇక ఆశావహులు, నిరాశోపహతుల తదుపరి అడుగులు ఎలా వుండేది ఆచరణలో చూడ వలసిందే. ముందే ప్రకటించిన ఈతతంగం నుంచి అంత కన్నా ఆశించవలసిందీ అభిశం సించవలసిందీ మరేమీ వుండదు. ఎప్పుడైనా సరే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వా మిక పునాది కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు (ప్రజాశక్తి సౌజన్యంతో…)

జిల్లాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌- ప‌రిపాల‌న సౌల‌భ్యం

‘‘ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కార మయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్ర లైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా …!’’ – ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
జగన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికినాంది పలికింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతర్వాత ఉన్న13 జిల్లాలకుతోడు కొత్తగామరో13జిల్లాలు ఏర్పాట య్యాయి. మొత్తం26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 4నుంచి కొత్త రూపు దిద్దుకుంది. వై.ఎస్‌.జగన్‌ 2019ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాలన సామాన్య ప్రజలకు,బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని నవశకానికినాంది పలికారు. ఇప్పుడు మొత్తం26జిల్లాలకుకాగా..72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాట య్యాయి.కొత్త జిల్లాల ఏర్పాటుతో..వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌,జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు..వారి క్యాంపు కార్యాలయాలు..అలాగే అన్ని ప్రభుత్వ శాఖల
కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిజిల్లాలో కనీసం ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా విష యానికి వస్తే..ఒక్కో జిల్లాకు 18నుంచి23లక్షల వరకు ఉన్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి నాలుగు వరకు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కసరత్తు చేశారు. అంతేకాదు కొత్త డివిజన్లతోకలిపి మొత్తం72 రెవె న్యూ డివిజన్లు ఏర్పాట య్యాయి.ప్రభుత్వం శాస్త్రీ యంగా అధ్యయనం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను చేసింది. జనవరి26న రిపబ్లిక్‌ డే రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యం తరాలు,సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదా పుగా17,500సలహాలు,సూచనలు వచ్చాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలించారు.. అనంతరం అధ్యయనంచేసి జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది.
కొత్త కళ..గడప వద్దకే పాలన-సిఎం జగన్‌
సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందు లో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరి పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.కొత్తజిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథ కాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13జిల్లాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాల యం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు.26జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగు తుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌,పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి…ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవ సరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజ న అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.
కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాలపేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం,రాజమహేంద్రవరం గత జిల్లా
లకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరు తున్నాయి. 1970మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భ విస్తే చివరిగా 1979జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్తజిల్లాలు ఏర్పాటు కాక పోవడంతో పరిపాలనసంస్కరణలు,వికేంద్రీ కరణ విషయంలోబాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలి పోయాం.జిల్లాలసంఖ్య,రెవెన్యూ డివిజన్లు పెరగ డంవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో727జిల్లాలు ఉండగా యూపీ లో అత్యధికంగా75,అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమై న ఏపీలోమాత్రంనిన్నటివరకు13జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి.2011 లెక్కలప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38లక్షల మంది ఉన్నారు. దేశం లో ఏరాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభాలేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6లక్షల మందికి ఒకజిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు.

భానుడు ప్ర‌తాపం..మండుతున్న ఎండ‌లు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. – సైమన్‌ గునపర్తి
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌, పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు.పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి,కానీ మీరు కాటన్‌ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.

122 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండలు..!

మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ప్రపంచవ్యాప్తంగాపక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడిరచింది.
ఈఏడాది భానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు.దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు,ఉక్కుపోత. దీనికి తోడు కరెంటు కోతలు తోడుకావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి ఎండలు పెరుగుతున్నాయి. మార్చిలో దేశ వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది.భారత వాతావరణశాఖ అందించిన వివరాల ప్రకారం..ఈ సంవత్సరం మార్చినెలలో ఉష్ణోగ్రతలు 122ఏళ్లలో నమోదైన వాటికంటే అత్యంత ఎక్కువైనవిగా పేర్కొంది. దీన్నిబట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి.
ఢల్లీి మార్చినెలలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రెండు హీట్‌వేవ్స్‌ను చూసింది. సగటు గరిష్ట,కనిష్ట ఉష్ణోగ్రతలు వరసగా 32.9సెల్సియస్‌(సాధారణ సగటుకంటే 3.3సీ),17.6సీ(సాధారణ సగటు కంటే 2సీ)వద్ద సాధారణం కంటే ఎక్కువగా నమోద య్యాయి. భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకి హీట్‌వేవ్‌ రోజుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత గణాంకాలను చూసినట్లయితే 198190లో 413 రోజుల నుంచి 200110లో 575 రోజులకు,201120 మధ్యలో ఇది 600రోజులకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ అని నిపుణులు అంటున్నారు. వాతావరణమార్పులు,పెరుగుతున్న నగరీకరణ,అడవుల నరికివేత వంటి కూడా మారుతున్న వాతావరణ తీవ్రతలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. వీటికి తోడు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న తక్కువ వర్షపాతం మరోకారణంగా తెలుస్తోంది. వర్షపాతం లోపం భారత్‌లో 72శాతం ఉండగా..దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో అది అత్యధికంగా 89శాతానికి పెరిగింది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన స్థాయికంటే ఎక్కువగా ఉంటున్నాయి. పొడి, వేడిగాలులు, వాయువ్య,మధ్య భారతదేశంలోకి వీస్తున్నాయి. 19602009మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5సెల్సియస్‌ పెరగడం కారణంగా వడగాల్పుల వల్ల సంభవించిన మరణాలు 146శాతం వరకు పెరిగాయి. దేశంలోని 13శాతం జిల్లాలు,15శాతం ప్రజలు ఈహీట్‌వేవ్‌లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.దీనివల్ల పేదలు,అట్టడుగు వర్గాలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దేశంలోని శ్రామికవయస్సు జనాభాలో అధికశాతం మంది వ్యవసాయం,నిర్మాణం,రిక్షాలాగడం వంటి బహిరంగ ఉద్యోగాల్లో ఉండటంవల్ల వారిపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినటంతోపాటు,జీవనోపాధికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దక్షణధృవం,ఉత్తర ధృవంలో వాతావరణం మార్పులవల్ల ఐసుగెడ్డలు కరిగిపోతుంది. దీని కారణంగా వాతావరణంలో వేడి పెరిగి సముద్ర నీటిమట్టం పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలోని దీవులతోపాటు,భూమి మునిగిపోతుంది. ఈ పర్యావరణ మార్పులు వల్ల(క్లైమేట్‌ ఛెంజ్‌)లో పక్షలు వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రదేశానికి వలసలు వస్తున్నాయి. దీనివల్ల కోవిడ్‌19 వంటి ఇంకా భయంకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ! ఈనేపథ్యంలో పర్యావరణంలో సంభవిస్తున్న మార్పుల పట్ల ప్రపంచ దేశాలన్నీ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములై గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

1 2