బడుల్లో కరోనా భయం..తగ్గిన హాజరుశాతం..!

” పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు’ .ఏపీలో తల్లితండ్రులు ‘‘మా పిల్లల్ని స్కూల్‌కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు. కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్‌కు చెందిన సరళ ఈ మాట అన్నారు. ‘‘కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’ అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్‌ రవి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు విషయాలు వెల్లడిరచారు” .
ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ కుదిపే స్తుంది. దీనిప్రభావం అధికంగా పిల్లలపై చూపడం తో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడు తున్నా రు. బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుం డటంతో..ఏపీవైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాద నలు చేసింది. ఏదైనాస్కూల్లో ఒకేరోజు ఐదు పాజి టివ్‌ కేసులు నమోదైతే..ఆస్కూలును మూసి వేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్‌ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వ హించవద్దని…లేదంటే వైరస్‌వ్యాప్తి తీవ్రమవు తుం దని హెచ్చరించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్‌ చేసి ప్రతిఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సర్కార్‌ సూచించింది. అలాగే హాస్టళ్లు,రెసిడెన్షియల్‌ పాఠ శాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీ పంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు,ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచిం చింది. ప్రతిస్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారితప్పని సరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారుల్లో ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టు లకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తా మని ఏపీఆరోగ్య శాఖ తెలిపింది.‘పిల్లల్ని బడికి పంపాలంటే భయం,ఆపేస్తే చదువు ఏమైపోతుం దోనని ఏపీలో తల్లితండ్రులుదిగులు పడుతున్నారు. ‘మాపిల్లల్ని స్కూల్‌కు పంపినా పంప కపోయినా మేం తప్పుచేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా,పంపించక చదువులో వెనుకబడినా తల్లిదం డ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేక పోయా మని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటా యించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాలటీచర్‌ రవి అన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలు స్తోంది.
చదువులో వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్ప లేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్‌ స్కూళ్ల లో చదివే పిల్లలతల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్‌లైన్‌ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించి తరగతులు నిర్వహించాలి అని ఏపీ మున్సి పాల్‌ టీచర్స్‌ఫేడరేషన్‌ (ఎఫ్‌ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్‌ చెప్పారు. ఏ ప్రభుత్వ పాఠ శాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్‌ రిలీజ్‌ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్‌ బిల్లులు చెల్లింపులు,ఇతర అవసరాలకు వాడుతుం టారు. ఈనిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులుకొనడానికి వాడమంటున్నారని…కానీ నాడు-నేడు పథకంప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.‘‘థర్డ్‌ వేవ్‌ నేపథ్యంతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు,థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్‌ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధినిధులు ఇవ్వడం లేదు. ఒకటి రెండు నెలలంటే,టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం.కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్‌ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వెంటనే పూర్తి చేయాలి.మిడ్‌ డే మిల్స్‌ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశ ముంది.అందుకే పిల్లలకు డ్రై రేషన్‌ ఇవ్వడం మంచిదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళంలో 57,విజయనగరం31,విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49,పశ్చిమగోదావరిలో48, కృష్ణాలో36,గుంటూరులో55,ప్రకాశం13, నెల్లూరు 30,చిత్తూరు55,కర్నూలు44,కడప 42, అనంత పురం28…ఇలామొత్తం556మంది ఉపాధ్యా యులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణిం చిన వారిని కూడా కలుపుకుంటే మరో 20శాతం పెరుగుతారు.విద్యార్థుల్లో కూడా కొందరు చనిపో యారు. అయితే ప్రస్తుతం పిల్లలు,ఉపాధ్యాయు లలో ఒకరినుంచి ఒకరికి కరోనాసోకకుండా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది అని ఎఫ్‌ఏపీటీవో ప్రతినిధి రవిసిద్ధార్ధ్‌ చెప్పారు.
కొన్ని స్కూళ్లలో భయాలున్నా…హాజరు పెరిగింది
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలాఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్‌ వేవ్‌ తర్వాత బడులు ప్రారంభిచగానే తమపిల్లలను పంపించడానికి తల్లి దండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయం లోనే కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. బడులు ప్రారం భించినప్పుడు 20శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85శాతానికి చేరుకుంది. మళ్లీఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం మొదలైంది.కోవిడ్‌ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు.అయితే,ప్రభుత్వం కోవిడ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదం డ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు అని విశాఖ జిల్లా విద్యాశాఖా ధికారిణి ఎల్‌.చంద్రకళ చెప్పారు. కరోనా నిబం ధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్‌ మార్గదర్శ కాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్య వేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తే క్వారంటైన్‌ పీరియడ్‌ కింద 14రోజు లు మూసివేస్తున్నామఅని విశాఖ డీఈవో వెల్లడిర చారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పిల్ల లను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపక పోతే పిల్లలు విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం,పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్‌ గేటు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌,మాస్కులు వంటివిచూస్తున్నా…బడి లోపల,తరగతి గదుల్లో ఎలాఉంటుందో…? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం కూడా చూస్తున్నాం అని విశాఖ మురళీనగర్‌ కు చెందిన సరళ చెప్పారు. సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది.ఆన్‌లైన్‌ తరగ తులే మంచిదని సరళ భావిస్తున్నారు. మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో,కాదో అర్థం కావడంలేదు. అన్‌లైన్‌ తరగ తులే బెటరని మాకు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల్లో కరోనా పాజి టివ్‌ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడంకష్టం.పైగా బడిలోకరోనా సోకిం దా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా?అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పెద్దలు,సెకండ్‌ వేవ్‌లో యువత,మధ్యవయస్కులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అవ డంతో,థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకా శం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్‌ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి.ఆడేటా ప్రతిస్కూల్లో ఉం డాలి. రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకోని తల్లిదం డ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు…వారి నుంచి మిగతా పిల్ల లకు కరోనా సోకే అవకాశం ఉంది అని విశాఖ లోని చిన్నపిల్లల వైద్యులు సతీష్‌ చెప్పారు. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్‌ సతీష్‌ భావిస్తున్నారు. ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్‌ డిస్టైన్సింగ్‌, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలు పాటించకపోతే ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని డాక్టర్‌ సతీష్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రొటో కాల్‌ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నా రు. ఏదిఏమైనా కనీసం మరోఏడాది పాటైనా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం మంచిదని ఆయన సూచిం చారు.జిఎన్‌వి సతీష్‌

క‌రోనా మహామ్మారి మార్చినాటికి తగొచ్చు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కోత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడోముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చినాటికి దీని తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్రప్రభావం చూపించొచ్చు.కేసులు ఆకస్మాత్తుగా..భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం,రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం,ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యశాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండువారాల్లో గరిష్ట స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి తొలివారం మధ్యలో కరోనా ఉధృతి గరిష్టస్థాయిలో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్దంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపడటంతోపాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. అయితే కరోనా తీవ్రత మార్చినెలలో తగొచ్చుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుపోతున్నాయి. అత్యధికంగా మహా రాష్ట్ర,ఢల్లీిలో ఒమిక్రాన్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే ఢల్లీిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా..ముంబాయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాక్షికంగా కర్ఫ్యూ అమలువుతంది. ఇదిలా ఉండగా…నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను ఆరికట్ట వచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది అని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడిరచారు.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహమద్‌ పేర్కొన్నారు.ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి,మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే కొన్చిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే 29రాష్ట్రాల్లో గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోకరోనా వైరస్‌ విజృంభణ
థర్డ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువు తున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోసారి వెలుగులోకి బ్లాక్‌ ఫంగస్‌ ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓవ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను,ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు వెల్లడిరచారు.కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్‌ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్‌ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.– గునపర్తి సైమన్‌

ఆదివాసీ సుపరిపాలన గ్రామసభల ద్వారానే సాధ్యం!

ఆదివాసీలు అధికంగా జీవిస్తున్న చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో పీసాచట్టం((పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) పారదర్శకంగా అమలు పరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆ ప్రభుత్వం అడుగులేస్తోంది. పీసాచట్టం రాజ్యాంగం అంతర్భాగంగా వచ్చిన ఈచట్టం ద్వారా గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెట్టేందుకు కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తుండటం ప్రశంసనీయం. ఆదివాసుల ఆత్మబంధువులైన ఐఏఎస్‌ అధికారులు బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా స్పూర్తితో ఆ రాష్ట్రప్రభుత్వం గ్రామసభ సంపూర్ణ అధికారాలను అందించి ప్రజలకు మంచిపాలన అందించడానికి కృషి చేస్తోంది. ‘‘ మావూళ్లో..మారాజ్యాం..,హైదరాబాద్‌..ఢల్లీిలో మన రాజ్యాం’’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఆనాటి ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ఆశయాన్ని నేడు రాష్ట్రంప్రభుత్వం గ్రామసభకు ప్రాముఖ్యత ఇస్తోంది.బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి ఆదివాసుల సుపరిపాలన కోసం పాటు పడ్డారు. 75వ రాజ్యాంగ సవరణ ద్వారావచ్చిన పీసాచట్టాన్ని 25ఏళ్లక్రితం పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు,రాజ్యసభ,అసెంబ్లీ,జిల్లా, బ్లాక్‌,పంచాయితీల స్థాయిలో గ్రామసభకు అధికారం ఇవ్వాలి.ఇది సమత జడ్జెమెంటు కూడా స్ఫస్టం చేసింది.
ఇటీవల కాలంలో ఛత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు. స్టేట్‌ ప్లానింగ్‌ తరుపున వివిధ అంశాలపై టాస్క్‌పోర్సు నియమించింది. పీసా చట్టం,పరిపాలన విధానం,పునరావాసం,సాంకేతిక పరిజ్ఞానం ఆదివాసులకు అందించడానికి కమిటీని సిపార్సులు చేసింది. ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువకావడం,అలాగే పరిపాలన అధికార యంత్రాంగం కూడా అధికశాతం గిరిజనతెగలకు చెందిన ఉద్యోగులు ఉండటంతో ఈరాష్ట్రంలో గ్రామసభకు ప్రాధాన్యత సంతరించుకుంది.వీరంతా కలసి సర్వ ఆదివాసీ సమాజ్‌ కింద ఒకసమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. దానిద్వారా వారి సంస్కృతి సంప్రదాయాలు,కట్టుబాట్లును పరిరక్షించుకుంటూ వస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఆచార సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే గ్రామసభ మూలాధారమని భావించారు. ఈ దశగా రెండేళ్ల నుంచి పీసా చట్టానికి అనుగుణంగా పాలన సాగాలని ఆకాంక్షస్తున్నారు. ఈనేపథ్యంలోనే ్ద రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ ద్వారా రాష్ట్ర,జిల్లా,బ్లాక్‌ల స్థాయిలో పీసా చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచి గ్రామసభకు విశిష్ట అధికారాలను కట్టబెట్టడానికి కృషిచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఆదివాసీ సమూహానికి అనుగుణంగా గ్రామసభకు విలువనిస్తోంది.
పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలలో లబ్ధిదారులను గుర్తించే అధికారం ఉంది. పంచాయతీ పరిధిలోగల పాఠశాలలు,హెల్త్‌ సబ్‌ సెంటర్లు, మంచినీటి పథకాలు,ప్రభుత్వసంస్థల పనితీరును సమీక్షించి,తగు సూచనలు, సిఫారసులు చేసే అధికారం గ్రామసభలకు ఇచ్చింది. పీసా గ్రామసభలు చేసిన తీర్మానాలను ప్రభుత్వ అధికారులుగుర్తించి,తగిన చర్యలు తీసుకోవాల్సిఉంది. దాంట్లో భాగంగా గ్రామాల్లో మహిళా సార్ధకతకోసం మహిళలసభ, బాలల పరిరక్షణ కోసం బాలలసభ, గ్రామంలోఉన్న వనరుల పరిరక్షణ (అడవి,నీరు,భూమి) వంటి వాటిని పర్యవేక్షించే కమిటీలు,గ్రామాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నియంత్రించేందుకు శాంతియుత`న్యాయ కమిటీలు,గ్రామానికి నిధులు సమీకరణ,సంస్కృతి,సంప్రాదాయాలు పరిరక్షించే పద్దతులపైగ్రామసభల ద్వారా కమిటీలను నియమించి పర్యవేక్షించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి గ్రామంలో గ్రామసభకు పరిపాలనాధికారం,నియంత్రణపట్ల ఆజమాయిషీ అధికారం కలిగి ఉంటాయి.చిన్నచిన్నఖనిజాలపై గ్రామసభ పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది.
ఇలాంటి శుభపరిణంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,పీసాచట్టం గ్రామసభ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆనాడు ఐఏఎస్‌ అధికారులు బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీఫ్‌సింగ్‌ భూరియా స్పూర్తి,వారి ఆశయాలు,లక్ష్యాలను నేడు ఛత్తీషఘఢ్‌ ప్రభుత్వం నెరవేర్చడానికి కృషి చేయడం అభినందనీయం. పీసాచట్టంగ్రామసభలకు విశేషాధికారాలు అప్పగించడం ద్వారానే ఆదివాసీలకు సుపరిపాలన అందివ్వగలమనే వారి ఆశయం నిజం కాబోతుంది. చత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన నిర్ణయాలతో క్షేత్రస్థాయి ఆదివాసీ సమాజంలో గ్రామస్వరాజ్యం సాధించబడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

1 2