ఆమెకేది రక్షణ

దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరిం చింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్‌గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్‌లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.
2019 చివరి నాటికి ఇలా..
ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్‌ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరు గుతూనే ఉంది.
జనాభా తక్కువే అయినా..
ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్‌ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్‌ పే’లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా,ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమ యంలో…పెరిగిన మహిళల అక్రమ రవాణా ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళ లను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా,అక్కడి గ్యాంగుల కార్య కలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైం ది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమరవాణా క్రమంగా పెరుగుతూ,2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు,మానవ అక్రమరవాణాలో మహా రాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా10.8శాతంతో ఏపీ తర్వాత స్థానంలోఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398 మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురి కాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసు ల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీ ఆర్‌బీ వెల్లడిరచింది. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఎనిమిదో స్థానం..
రాష్ట్రంలో మహిళలపై, లైంగిక వేధింపులు, అత్యాచారాలు..పునరావృతం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈతర హా ఘటనల్లో 33.14% మనరాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది.
ా రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు,వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి.
ా స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది.
ా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం,గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన ఈతరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ా ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా..2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది.
ా ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.
ా పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడిరచింది.
ా ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.
ా పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా..70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
ా స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.
పరిచయస్తులే అత్యాచార నిందితులు
ా రాష్ట్రంలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచ యస్తులే.
ా 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు.997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, ఇరుగుపొరుగువారి ప్రమేయం ఉంది.
ా అత్యాచారాలు 0.82% పెరిగాయి.
ా సైబర్‌, చిన్నారులపై నేరాల్లో పెరుగుదలలిబి
ా రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ నేరాలు, చిన్నారులపై జరిగిన నేరాలు కొంత పెరిగాయి.
ా రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి.
ా అపహరణ కేసులు 902 నుంచి 737కు తగ్గాయి.
పోలీసులపై కేసుల్లో మూడోస్థానం
ా పోలీసులే పలు కేసుల్లో నింది తులవుతున్నారు.
ా దేశవ్యాప్తంగా వారిపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం.
ా అస్సాం (2,179),మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
ా ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ా ఏపీలో 70 (26.81%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలుచేశారు. మరో 10 కేసుల్ని ప్రాథమిక దశలోనే న్యాయస్థానాలు కొట్టేశాయి.
ా 17 కేసుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు.
దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాదితగ్గి 73కి చేరాయి. మణి పూర్‌లో15,అస్సాంలో 12,కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్‌లో 7,హర్యానాలో 6,ఢల్లీిలో 5, కాశ్మీర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం అంటే 14,45,127 కేసులు పెరిగాయి. అంటే లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆనివేదిక పేర్కొంది. 2020లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. మొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖల య్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఐఎల్‌) కింద నమోద య్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గా యని తెలిపింది. 2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ !
గతేడాది మార్చి 25 నుండి మే 31వరకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలు, దొంగ తనాలు, దోపిడీలు తగ్గాయని నివేదిక పేర్కొంది. హత్య కేసులు మాత్రం ఒక శాతం పెరిగాయి. ఈ హత్యలకు ప్రేరేపించిన కారణాల్లో వ్యక్తిగత కక్షలు లేదా శతృత్వం, లాభాల కోసం జరిగినవి ఇలా పలు రీతుల్లో వున్నాయి. కిడ్నాప్‌ లేదా అపహరణ కేసులు 19.3శాతం మేర తగ్గాయి. వీరిలో 73,721మంది మహిళలు కిడ్నాప్‌ కాగా, పురుషులు 14,869గా వున్నారు. ఎస్‌సిఆర్‌బి డేటా ప్రకారం వీరిలో మైనర్లు 56,591మంది (8,175మంది బాలురు, 47,876మంది బాలికలు)గా వున్నారు. పెద్దవారు 31,999మందిగా వున్నారు. మొత్తంగా 91,458మంది కిడ్నాప్‌ అవగా,281మంది చనిపోయి శవంగా తేలారు. ప్రజల శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40శాతం ఎక్కువ. వీటిల్లో 51,606 కేసులు ఘర్షణలకు సంబంధించినవే. మహిళలపై నమోదైన నేరాలు 8.30శాతం తగ్గాయి. నమోదైన కేసుల్లో భర్త లేదా బంధు వుల దాష్టీకానికి సంబంధించిన కేసులే మెజారి టీగా వున్నాయి. ఆతర్వాత అత్యాచార ఉద్దేశ్యం తో దాడి జరిపిన కేసులు 23శాతంగావుండగా, కిడ్నాప్‌ (16.8శాతం), అత్యాచారం (7.5 శాతం) కేసులు నమోదయ్యాయి. 2020లో బాలలపై మొత్తంగా 29,768 కేసులు నమోద య్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.8శాతం కేసులు తగ్గాయి.1,45,754 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి.
మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే..
దేశ రాజధాని ఢల్లీిలో మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగు తున్నాయి.. భవిష్యత్తలోనూ జరుగుతాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోనో, ఆన్‌లైన్‌ క్యాబ్‌లను బ్యాన్‌ చేస్తేనో మహిళలపై అఘాయిత్యాల అగిపోతాయను కోవడం హాస్యాస్పదం. మొత్తంగా సమాజంలోనే మార్పు రావాల్సి వుంది. ఆమార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. దానికి తగ్గ చర్యలు అధికారంలో వున్నవారు తమ స్థాయిలో చేపడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, విచిత్రంగా అలాంటి చర్యల్ని తీసుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.
చట్టాలు.. నిఘా టీమ్‌లు.. విచిత్రాలు.!
ఢల్లీి నుంచి హైద్రాబాద్‌ దాకా.. ఆమాటకొస్తే ఆర్థిక రాజధాని ముంబై నుంచి గల్లీ దాకా.. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై అఘాయి త్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు లేకనేం, నిందితుల్ని శిక్షించడానికి చాలానే వున్నాయి. కానీ, ఆ చట్టాలే బూజుపట్టిపోయాయి. అనేకా నేక కారణాలతో దోషులు తప్పించు కుంటు న్నారు. దాంతో చట్టాలంటే భయపడే పరిస్థితి లేదు తప్పు చేసేవారికి. అందుకే తప్పు మీద తప్పు.. తప్పు మీద తప్పు జరిగిపోతూనే వుంది. కొన్ని చట్టాలు విచిత్రంగా తెరపె ౖకొస్తుంటాయి. వరకట్న వేధింపుల వ్యవహారమే వుంది.. ఓమహిళ కేసు పెడితే చాలు, అత్తిం టోవారి పనైపోయినట్టే.
దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సినవాళ్ళే…
చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి. అందులోని ప్రజా ప్రతినిథులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అందరూ అలా వుంటున్నారా.? కొందరు చట్టసభల్లోనే అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆమధ్య ఓరాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ నేతలే (ఇందులో అమాత్యులూ వున్నారు) మొబైల్‌ ఫోన్లలో నీలి చిత్రాలు తిల కించారు. అలాంటి ఘటనే మరోటి ఇటీవలే వెలుగు చూసింది. ఇవన్నీ రాజకీయ వివాదా లుగా మారుతున్నాయి తప్ప, ఇంకోసారి ఇలాం టి ఘటనలు వెలుగు చూడకుండా,దోషులకు చట్ట సభలనుంచి సాగనంపడం లాంటి చర్య లేమీ తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులే ఇలా వ్యవహరిస్తోంటే, వారిని రోల్‌ మోడల్స్‌గా తీసు కునే వారి అనుచరులు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు– సింధు