ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి

అల్లుకుపోతున్న అంతర్జాలం

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు


… ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.


కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.


‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.


వేషభాషలు మారిపోతున్నాయ్…
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా…విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.


ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.


గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.


ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.


వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.


యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.


ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.


ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే.

జీవితంలో చాలా మార్పులు
ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.
-మధురిమ/గుండు కరుణాకర్

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాలను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాలు,సంస్థలు,పార్టీలునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, అభిప్రా యాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించు కున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాలయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిలబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాలపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిలుస్తోంది.
బడుగు బలహీనవర్గాలకు వెలుగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాలు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతలకు మూలమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూలనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతులకు జన్మించాడు. తల్లిదం డ్రులు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయులు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాలకు ఉప యోగించే పల్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాలన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతులు గాను బుద్ధి బలం, ఉత్సహంకలవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొలుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తలు కుల భేదాలను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషుల జన్మ వృత్తాంతాలలో కొన్ని అద్భుత సంఘటనలు ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాలు వస్తుండేవాట. ప్రపంచ దేశాలు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లతోపాటు, శూద్ర కులం నుంచి ఎదిగిన ఓసీ కులాల నాయకులు పాలకులు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కుల నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గాల సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితుల కోసమే కాదు ఈ దేశ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తెలుస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాలకు ఇష్టం లేకపోవడం కుల వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకులం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.
అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గాల కొసం బ్రిటిష్‌ కాలంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాలు 8 గంటల పని దినములు చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంటల వరకు పనిచే చేసే పద్ధతి అమలులో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదినం అమలు అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాలంలో అనేక కార్మిక చట్టాలను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాలకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాలు మైనార్టీలు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమాల ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనులపై దాడులు చేస్తూ చంపడమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బలహీన వర్గాల ప్రజలపై నిత్యం దాడులు చేయటం, వారి ప్రాణాలు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాలకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాలని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్యం నుండే పిల్లలకు మహనీయులత్యాగాలు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.
రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాలు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణల అమలు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి విధానాలు మొదలైన చర్యలు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేసి, రాజాభరణాలను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాసల అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. ఏలక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాలు తమ శక్తి కొలది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పుల కోసం చేపట్టిన చర్యలను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికులకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాలు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతలకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణల ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవలను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతలనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణల ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తరతరాలుగా బడుగు బలహీనవర్గాలను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదలుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వలకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికులు ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతలు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో పీడిరపబడుతున్న వర్గాలు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

1 2