షెడ్యూల్డ్ తెగల ప్రామాణీకతకు చోటేది?
గిరిజన హక్కుల సాధనలో,ఆదివాసీ గిరిజనుల గుర్తింపులో నేటికీ కీలకంగా నిలుస్తున్నశాస్త్రీయ ప్రమాణాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగల గుర్తింపు,విలీనం వంటి అంశాలు పరిష్కారం దొరకని దీర్ఘకాలిక సమస్యగా మారాయి.రాజ్యాంగంలోని5,6గిరిజన షెడ్యూళ్లలో పొందుపరిచిన ఆదిమ గిరిజన తెగల హక్కులకు నిజమైన లబ్ధిదారులు..ఆదివాసీలు ఇంకా న్యాయంకోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో,సర్వోన్నత న్యాయస్థానం ఈవిషయంలో స్పష్టమైన చొరవ చూపకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల దారి వెతకాల్సిన పరిస్థితి వస్తుందా?అనే సందిగ్ధత ఆదివాసీ సమా జంలో నెలకొంది.ఇలాంటి సమయంలో ఎస్టీగుర్తింపునకు సంబంధించిన చారిత్రకమైన,శాస్త్రీయమైన మార్గదర్శకత్వం అందించిన జస్టిస్ లోకూర్ కమిటీ ప్రాధాన్యతను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.- అక్షర భీమ్
లోకూర్ కమిటీ నేపథ్యం
స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గుర్తింపు విషయంలో స్పష్టత లేకపో వడం ఒక ప్రధాన సమస్యగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో,1965,జూన1న అప్పటి ప్రధాన మంత్రి శ్రీలాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం గిరిజన తెగల జీవన విధానం,సామాజిక స్థితి,రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం కోసం జస్టిస్ భీమ్ జీ నారాయణరావ్ లోకూర్(బి.ఎన్.లోకూర్) అధ్యక్షతన ఒక సలహా కమిటీని నియమించింది.ఎస్టీ గుర్తింపుకు అవసరమైన ప్రమాణాలను శాస్త్రీ యంగా,స్పష్టంగా ప్రతిపాదించిన మొదటి కమిటీగా లోకూర్ కమిటీ చరిత్రలో నిలిచింది.
కమిటీ సూచించిన ప్రధాన ప్రమాణాలు
లోకూర్ కమిటీ ప్రకారం, ఏదైనా సమాజాన్ని షెడ్యూ ల్డ్ ట్రైబ్గా గుర్తించాలంటే ఒక్క లక్షణం సరిపోదు. కింది నాలుగు ప్రమాణాల్లో ఎక్కువ భాగం ఆ సమా జానికి వర్తించాలి.
- ఆదిమ గిరిజన లక్షణాలు: సాంప్రదాయబద్ధ జీవన విధానం, వేట, ఆహార సేకరణ, చేతిపనులు వంటి పాత తరాల వృత్తులు, ఆధునికీకరణ తక్కువ గా ఉండటం వంటి లక్షణాలు కనిపించాలి.
- ప్రత్యేక సంస్కృతి : మిగతా సమాజాలకు భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక భాష లేదా మాండలికం, ప్రత్యేక ఆచారాలు ఉండాలి. ఈ ప్రత్యేకతే ఆ సమాజాన్ని వేరుగా గుర్తించే ప్రధాన లక్షణం.
- భౌగోళిక విభిన్నత: అడవులు, కొండ ప్రాంతాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమÖల ప్రాంతాల్లో నివాసం ఉండటం, ప్రధాన సమాజంతో పరిమిత సంబంధాలు కలిగి ఉండటం.
- వెనుకబడిన స్థితి: సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రమైన వెనుకబాటుతనం ఉండటం.జీవన పరిస్థితులు, అవకాశాల లేమి ద్వారా ఇది స్పష్టంగా కనిపించాలి.
ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ
ఏదైనా కులం లేదా తెగను ఎస్టీ జాబితా లో చేర్చే ప్రక్రియ పలు దశలుగా సాగుతుంది. మొదట రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అనంతరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పరిశోధనలు, సర్వేలు, సామాజిక అధ్యయనాలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ వల్ల కలిగే ప్రభావాలను విశ్లేషించిన తరువాతే పార్లమెంట్ చట్టం ద్వారా ఎస్టీ జాబితాలో చేర్పు జరుగుతుంది.
లోకూర్ కమిటీ సూచనల మాటేమిటి?
లోకూర్ కమిటీ 800కు పైగా గిరిజన, సామాజిక సమÖహాల చారిత్రక, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి తీవ్రమైన వెనుకబాటుతనాన్ని ప్రధాన ప్రమాణంగా తీసు కుంది.1955లో అస్పృశ్యత నిషేధం తరువాత, ఎస్సీ ీVAదాకు అస్పృశ్యత వల్ల ఏర్పడిన వెనుక బాటుతనమే ఆధారమని కమిటీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పథకాలు డినోటిఫైడ్ మరియు నోమాడిక్ తెగలకు సరిపోవడం లేదని గుర్తించి, వారిని వేర్వేరు సమÖహాలుగా గుర్తించి ప్రత్యేక పథకాలు అవసరమని సూచించింది. స్వాతంత్య్రం తరువాతి ఐదేళ్ల ప్రణాళికలు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి దోహదపడ్డాయని, అందువల్ల కొత్తగా మరిన్ని సమÖహాలకు ప్రత్యేక ీVAదా అవసరం లేదని అభిప్రాయపడింది. కొన్ని సమÖహాలను ఎస్సీ, ఎస్టీ జాబితాల నుంచి తొలగించినా, వారి ప్రయోజ నాలను దశలవారీగా ఉపసంహరించాలని, అలాగే గుజ్జర్లు, గడ్డీలు, బంజారాలు వంటి సమÖహాలకు ఓబీసీల కంటే ఎక్కువ ప్రత్యేక సహాయం అవసs Áమని కమిటీ స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే, ఎస్టీ గుర్తింపుకు లోకూర్ కమిటీ సూచించిన నాలుగు ప్రమాణాలు నేటికీ మార్గదర్శకంగా నిలు స్తున్నాయి. షెడ్యూల్డ్ తెగల గుర్తింపు విషయంలో శాస్త్రీయత, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధతకు బలమైన రూపరేఖను అందించిన ఈ కమిటీ నివేదికను 1967లో ప్రభుత్వానికి సమర్పించింది. అయినప్పటికీ కమిటీకి భిన్నంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1976లో బంజారా, ఎరుకల, యానాది అనే మÖడు కులాలను, మరో రెండు కులాలైన నక్కల, కుర్వికరన్,దులియా, పుటియా, ఫైకో గ్రూపు లను 2003లో గిరిజన తెగలలలో ఎలా విలీన మైనాయో అంతుబట్టడం లేదు. మొత్తం 35 తెగలలో 5మైదాన తెగలు (కులాలు) కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కలిసాయి. అసంబద్ధంగా వున్న ఈ మైదాన తెగలకు కలిపి 6శాతం రిజర్వేషన్ కొనసాగుతోంది. ఇప్పటికైనా ఆ కమిటీ సిఫార్సులను న్యాయస్థానాలు, ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆదివాసీలు కోరుతున్నారు.
