యుద్ద జ్వాలలో మసకబారుతున్న బాల్యం

యుద్ధాలు కేవలం దేశాల సరిహద్దులను,భవనాలను మాత్రమే ధ్వంసం చేయడం లేదు..ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తును,అమాయకత్వాన్ని చిదిమేస్తున్నాయి.పెద్దలస్వార్థ పోరాటాల్లో పసివాళ్లు బలైపోతున్నారు. “పిల్లలకు,వారి దేహాలకు మీరు ఆశ్రయాన్ని కల్పించ గలరు కానీ,వారి ఆత్మలకు కాదు. మీరు చూడలేని కనీసం కలల్లో కూడా కాలు పెట్టలేని రేపనే ఇంట్లో నివసిస్తాయి వారి ఆత్మలు మీ పిల్లల్లా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయొచ్చు కానీ, వాళ్ళు మీలా ఉండాలని ఆశించొద్దు”
మీరు సజీవ మైన విల్లులైతే ప్రాణంతో ముందుకు దూసుకెళ్ళే శరీరాలే మీ పిల్లలు అంటాడు. ఖలీల్ జిబ్రాన్ అంటే పసిపిల్ల మనస్తత్వాలు,వారి ప్రవర్తన విధానం ప్రత్యేకమైనది. తల్లితండ్రులుగా మనం కేవలం వారికి పర్యవేక్షలుగా, మార్గదర్శ కాలుగా మాత్రమే ఉండగలం.1959లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక డిక్లరేషన్ విడుదల చేసింది దానిలో పిల్లలరక్షణ,విద్య,ఆరోగ్యం,శ్రద్ధ, పునరా వాసం,ఆశ్రయం,మంచి పౌష్టికమైన ఆహారం కల్పించాలని ప్రపంచదేశాలను కోరింది. అలాగే 2001-2010సంవత్సరాల దశాబ్ద కాలాన్ని అంతర్జాతీయ సంస్కృతి, శాంతి, అహింసలతో కూడిన పిల్లల ప్రపంచాన్ని సృష్టించాలని ప్రపంచ దేశాలని కోరింది. అంతెందుకు మన రాజ్యాంగం లోని 45వ నిబంధన కూడా 6-14 సం.లోపు పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యను కల్పించా లని అందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించింది. కేంద్రం విద్యా హక్కు చట్టాన్ని ప్రాధ మిక హక్కుగా సవరిస్తూ 2002వ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ (86వ) 21-(A) నిబంధన ప్రకారం ఉచిత విద్యను అన్ని రాష్ట్రాలు పిల్లలకు కల్పించాలని సూచించింది. ఇక ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకంగా బాలల కోసం 1946లో అంతర్జా తీయ బాలల అత్యవసర నిధిని (UచీI్పుజుఖీ) ఏర్పాటు చేయటం జరిగింది. దీనియొక్క లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలకు వారి తల్లులకు జీవన ప్రమాణాలు పెంచటం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.అలాగే సచిన్ టెండూ ల్కర్ లాంటి ప్రముఖ వ్యక్తులను రాయబారులుగా నియమించుకొని ఆ సంస్థ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా చేసిన, చేస్తున్న సేవకు గాను 1965లో నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందింది. కానీ ఇటి వలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే బాలల హక్కులు ప్రమాదం లో పడుతున్నట్లుగా భావించాలి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చరిత్రలో మళ్ళీ జరిగనప్పటికి అంతర్జాతీ యంగా చేసుకున్న ఒప్పందాలు,చట్టాలు, ఏర్పడిన శాంతి సంస్థలు వాటి లక్ష్యం ప్రస్తుతం ప్రమాదం లో పడినట్లుగా భావించాలి. అంతెందుకు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని హిరో షిమ (1945ఆగష్టు06) నగరంపై వేసిన అణు బాంబు, అనంతరం, నాగసాకి పట్టణంపై (ఆగష్టు -09న) వేసిన రెండో అణుబాంబు ద్వారా అరవై వేల నుండి యనబై వేలదాకా మరణించి ఉండొ చ్చని, హిరోషిమా దాడిలో ఐతే డెబ్బై వేల నుండి సుమారు ఒక లక్ష ఇరవై ఆరు వేల వరకు సాధా రణ పౌరులు మరణించి ఉంటారని అంచన. దీనిలో పిల్లలు, మహిళలు సగం మంది బాదితులే అనేది చారిత్రక సత్యం కూడా.అనంతరం ఈ స్థాయి యుద్ధాలు కాని యుద్ధ పరిణామాలు కాని ప్రపంచ వ్యాప్తంగా జరగనప్పటికి దేశాలలోని అంతర్గత సమస్యల వల్ల (లిబియా,అఫ్ఘనిస్తాన్, సిరియా) పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలు మరియు ప్రాబల్య రాజకీయల కోసం జరుగుతున్న చిన్నచిన్న యుద్ధాలతో వందలాది మంది చిన్న పిల్లలు నాటి నుండి నేటి రష్యా — యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా “హమాస” తిరుగుబాటుదారులకు ఇజ్రాయిల్ సైన్యానికి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కావచ్చు. ఇందు లో ప్రధానంగా బలయ్యేది చిన్నపిల్లలు కావటం బాధ కల్గించే అంశం.
ఆయా దేశాలు యుద్ధ సమయాలలో అంతర్జాతీ యంగా చేసుకున్న చట్టాలు కాని,ఒప్పందాలు కానీ అమలు చేయకుండా,వాటిని పాటించ కుండా అమానవీయంగా ప్రవర్తించటం అనేది మానవత్వానికే మచ్చ.గాజా కేంద్రంగా పరిపాలి స్తున్న “హమాస” అక్టోబర్ 07న ఇజ్రాయిల్ పై అకస్మాత్తుగా సుమారు ఆరు వేల మోర్టార్ షెల్స్ ను, రాకెట్లను ప్రయోగించటం వల్ల ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది. ఈ నెలన్నర రోజుల యుద్ధంలో ఎవరు ఎక్కువగా చనిపోయారు అంటే చిన్నపిల్లలే అధికంగా వున్నా రనేది ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరాల నుండి వస్తున్న సమాచారం ఇప్పటి వరకు అధికారికంగా పాలస్తీనా నుండి పది వేలకు పైగా మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది.అందులో చిన్న పిల్లల మర ణాలు సుమారు ఐదు వేలు దాటినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.మిగితా వారు వృద్ధులు, మహి ళలు వివిధ కారణాల చేత సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళలేని వారు ఉంటారనేది ప్రాధమిక అంచన. ఇక శిధిలాల్లో గల్లంతైన 2500 మంది పౌరుల్లోను చిన్నారుల సంఖ్య వెయ్యి దాకా ఉం టుందని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది.
ప్రస్తుతం గాజాలో డెబ్బై ఐదుశాతం భవనాలు పూర్తిగా ధ్వంసంకాగా,యాబై శాతంపైగా పాఠ శాల భవనాలు ద్వంసం ఐనట్లు అధికారుల అంచన.శిభిరాలలోని బాదితులకు త్రాగునీరు, ఆహారం దొరకక ఆహార నిల్వల కేంద్రాలపై లూఠీ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత హృదయ విదా రకంగా ఉందో గమనించవచ్చు. ప్రస్తుతం పాలస్తీ నాలోని ఆస్పత్రులు, అంబులెన్సులు, శరణార్ధి శిభిరాలు పాఠశాలలపై బాబుల వర్షం కురిపిం చిన ఇజ్రాయిల్ సైన్యం అంతర్జాతీయంగా అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుతం గాజా ప్రాంతం గాని పాలస్తీనాలోని ఏ ప్రాంతం కూడా సురక్షితమైంది కాదు. పత్రికా విలేకరులను, ఐక్యరాజ్య సమితి నిర్వహించే శరణార్ధి శిభిరాలలో సహాయం చేస్తున్న ఉద్యోగులను,స్వచ్చంద సంస్థల వాలంటీర్లను కూడా వదలకుండా బాంబుల వర్షం కురిపిస్తుందంటే ఇజ్రాయిల్ సైన్యం ఎంతటి మానవ విధ్వంసానికి పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు.ఈ యుద్ధంలో క్షతగాత్రులుగా మిగిలిన చిన్నారులు బాంబులదాడిలో వికలాం గులుగా మారిన పిల్లలు తల్లిదండ్రులను కోల్పో యిన పిల్లల మానసికస్థితి దారుణంగా మారు తోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధం కారణంగా కూలిపోయిన తమ ఇండ్లను అక్కడే వదిలిన పుస్తకాలను, వారు ఆడు కున్న ఆట వస్తువులను,చనిపోయిన తల్లిదండ్రు లను బడులలోని జ్ఞాపకాలను తలుచుకుంటూ చాలామంది నిద్రకు దూరమవుతున్నారని, చికిత్స పొందేటప్పుడు కూడా అక్కడి దృశ్యాలు హాహాకా రాలు చూసి,ఆ మానసిక సంఘర్షణ నుండి ఇంకా బయటపడలేక ఎన్నోనిద్రలేని రాత్రులు గడుపుతూ చివరకు స్మశానంలో శాశ్వతంగా నిద్రపోతు న్నారు. ఇక బ్రతికున్న పిల్లలు ప్రస్తుతం ప్రత్యక్ష నరకం చూస్తున్నారని యూనిసెఫ్ (UచీI్పుజుఖీ) ప్రతినిధి “జేమ్స్ ఎల్డర”గాజాను సందర్శించి వ్యక్తంచేసిన మాటలు అవి. అంటే ప్రస్తుతం గాజా ఓ నెత్తుటి గాయాల భూమి అక్కడ పారుతున్న రక్తం,చిద్రమైన శరీరభాగాలు,నేలమట్టమైన ఇండ్లు ప్రత్యక్షమవుతున్నాయ్.
ఈ యుద్ధం ఎవరి కోసం? ఇజ్రాయిల్ పై యు ద్ధం ప్రకటించిన “హమాస” ఏం సాధించింది? తన లక్ష్యాన్ని సాధించిందా?అన్న ప్రశ్న “హమాస” వారు వేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. పాలస్తీనా సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొనివచ్చినా “హమాస”అవలం భించిన దూకుడు చర్య వల్ల ఈరోజు పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైన్యంద్వారా ఇంత విధ్వంసం జరుగు తోంది. పాలస్తీనా పరిస్థితి ఏమిటి? కోలుకోవ డానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చును, చనిపోయిన చిన్నారుల ప్రాణాలను మాత్రం ఎవరు తిరిగి తీసుకొని రాలేరు. వారంతా ఎవరు? ఆ పిల్లలు ఆ ప్రాంతంలో పుట్టి ఏం పాపం చేశారు. వారేమైన ఇజ్రాయిల్ పై క్షిపణులు ఎక్కు పెట్టారా ? బాం బుల వర్షం కురిపించారా. తరగతి గదిలోనో, అమ్మ ఒడిలోనో ప్రశాంతంగా ఆడుకునే పసికూ నలు వారు. ప్రస్తుతం గాజాలో 16ఏళ్లలోపు చిన్నా రులు 8లక్షలదాకా ఉండొచ్చని అంచనా, వారం తా యుద్ధాన్ని యుద్ధ వాతావరణాన్ని పత్యక్షంగా చూస్తున్న వారే,అంటే భవిష్యత్తులో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసు కోవచ్చు. ఇకయుద్ధంలో మరణించిన వారి తల్లి దండ్రులను మర్చిపోవటం అంత సులువైన విష యం కూడా కాదు.వారి భవిష్యత్తు ఏమిటో, వారి రక్షణ, వారి పోషణ ఎవరు చూసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. అలానే పిల్లల్ని కోల్పోయిన తల్లిదం డ్రులు కూడా మానసికంగా కుంగు బాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది.గాజాలో ఈనెల రోజు ల్లోనే సుమారు 5500మంది చిన్నారులు జన్మించి నట్లు, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 50వేల మంది గర్భిణీలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంస్థ వెల్లడించింది. అంటే యుద్ధ భూమిలోనే ఒక వైపు పిల్లల మరణాలు మరో వైపు జననాలు జరగడం బాదకల్గించే విషయం.బాలింతలకు పౌష్టికా హారం మాట అటుంచితే రెండు పూటల తిండి దొరకడం కష్టంగా ఉందని ఈ పరిస్థితుల్లో శిశువులు భవిష్యత్తులో పౌష్టిక ఆహార లోపాన్ని, ఇతర రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాగే యుద్ధం ద్వార వెలువడిన వివిధ రకాల రసయా నాలు కూడా పిల్లలపైచెడు ప్రభావంచూపే అవకా శం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్వం కోల్పోయిన ఈ పిల్లలు భవిష్యత్తులో మళ్ళీ హింసాత్మక విధానాల వైపు మల్లే అవకాశం కూడా లేకపోలేదని మానసిక విశ్లేషకుల అంచన. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ప్రస్తుతం ఏం చేయాలనేది ప్రశ్న ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తాత్కాలికంగా విరమిం| Ÿజేసేలా ప్రపంచ దేశాలు ఇద్దరిపై ఒత్తిడి చేయాలి. విననిపక్షంలోఆంక్షలు విధించే ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి పాలస్తీనా వారు, ఇజ్రాయిల్ ప్రభుత్వం కట్టుబడి ఉండేలా ఐక్య రాజ్యసమితి చొరవ తీసుకొని శాంతిస్థాపనకు కృషిచేయాలి.1947లో ఐక్యరాజ్య సమితి ప్రతిపా దించిన 181వ తీర్మాణం ప్రకారం ఇజ్రాయిల్ ఆక్రయించిన పాలస్తీనా భూభాగాలను అప్ప గించి యధాతద స్థితిని అమలు చేసి ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు చేపట్టాలి.ఒక వైపు ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా తన సైన్యాన్ని పంపి మరొక వైపు శాంతి చర్చల పేరిట హడావుడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఇజ్రాయిల్, పాలస్తీనాకు పొరుగు దేశాలైన అరబ్ దేశాలు లేదా ఇతర ప్రపంచ దేశాలు పాలస్తీనాలోని పిల్లలకు సంఘీ భావంగా వారికి పౌష్టిక ఆహారం, మందులు, దుస్తులు,త్రాగునీరు సరైన వసతి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. తమవంతుగా సహకరించాలి కూడా యుద్ధం ద్వారా మానవ హననం మరియు నాగరికతా విధ్వంసం తప్ప ఏమిసాధించలేం అన్న విషయం ఇరు దేశాలు గమనించాలి.
రష్యాఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు పొరుగు దేశాలకు వలసవెళ్ళిన చిత్రాలు ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉన్నాయ్ అలాగే అఫ్ఘనిస్తాన్,సిరియా,లిబియా దేశా లలోని అంతర్ యుద్ధాలలో సరిహద్దులు దాటు తున్న పసిపిల్లలను, సముద్రాలు దాటుతూ మర ణించిన పసిపిల్లల చిత్రాలను మర్చిపోలేం. అంతెందుకు 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని “యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి అర్ధరాత్రి వెలువడిన “మిథైల్ ఐసోసైనడ” అనే విషవాయువును పీల్చిన పిల్లలు, పెద్దలు రాత్రికి రాత్రే నిద్రలో నుండి శాశ్వత నిద్ర లోకి జారుకున్న సంఘటన అందరికి తెలిసినదే. అది జరిగి నాలుగు దశాబ్దాలు దాటిన ఇంకా ఆ విష ప్రభావం ద్వార శారీరక మానసిక వైకల్యంతో నేటికి పిల్లలు జన్మిస్తున్నారంటే నాడు ఎంత దారుణం జరిగిందో దానిప్రభావం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.“మంచి వాతావరణం కల్పించలేని పాలకులు ఉన్నంత కాలం వారి హక్కుల కోసం సంఘర్షణ జరుగుతూనే ఉంటది”. గత ఎనిమిది దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య ఈ యుద్ధంతోనైనా శాశ్వతంగా సమిసి పోతే ప్రపంచం సంతోషిస్తుంది. లేనిపక్షంలో ఈ యుద్ధ భూమిలో పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవారై మళ్ళీ ఇజ్రాయిల్‌పై తుపాకి ఎక్కుపెట్టరని గ్యా రంటీ ఏమిలేదు.జర్మనీ నియంత “హిట్లర” బాల్యంలో ఓయూదు టీచర్ ద్వార శిక్షింపబడి పెరిగి పెద్దవాడైన తరువాత జర్మని ఛాన్సలర్‌గా పదవిని చేపట్టి లక్షలాది యూదులను చంపిన సంఘటన చరిత్రలో చదివాం.పిల్లల్ని దైవ ప్రసా దంగా భావించే సంస్కృతి మనది అలాంటి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పో యిన పిల్లలు మానసికంగా కోలుకుంటారని ఊహించడం కష్టం. పిల్లల జ్ఞాపకాలు తలుచుకొని తల్లిదండ్రులు తల్లిదండ్రుల లోటును గుర్తుచేసు కొని పిల్లలు మానసిక కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో వాళ్ళు హింసాత్మక పద్దతుల వైపు మల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. అలా జరిగితే ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యను మరో వందేళ్ళ వరకు కూడా పరిష్కరించలేం. అందుకే మనుషుల్ని మనుషులు చంపుకోవటం కాదు,కలిసిమెలిసి జీవించే విధానాలను పాలకులు అవలంబించి పాలస్తీనీయన్లు కోరుతున్న భూభా గం వారికే అప్పగించి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలను ఇజ్రాయిల్ గౌరవించి సోదర భావం తో మసలే ప్రయత్నం చెయ్యాలి లేనిపక్షంలో భవిష్యత్తులో మళ్ళీ రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం కూడా లేకపోలేదు. పొరుగున ఉన్న సౌది అరేబియా దేశంతో శాంతి ఒప్పందా లు చేసుకోవాలనుకుంటున్న ఇజ్రాయిల్ తన ప్రక్కనే వున్న “పాలస్తీనా” ప్రజలను శత్రువు లుగా చూడటంలో అర్ధం లేదు. “హమాస” కూడా శత్రు దుర్బేద్యంగా ఉన్న ఇజ్రాయిల్ ను కవ్విస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఈ యుద్ధం ద్వారా నైనా గ్రహించి శాంతి చర్చలకు ముగ్గుచూపి ప్రాణ నష్టం జరగకుండా తనపట్టును వీడి బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడిచిపెట్టాలి. ఇక నైనా రెండు దేశాలు ఒకమెట్టుదిగి హింసకు స్వస్తి పలికి ఇక ముందు కలిసిమెలిసి ప్రపంచానికి ఒక శాంతి సందేశం పంపాలి.అగ్రరాజ్యాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలనుకోవడం,అణుబాంబులను పోగే సుకోవడం కన్నా వాటికి ఐన ఖర్చును పేదదేశా లలోని పసి పిల్లలకు, పాఠశాలలకు, మౌళిక సదు పాయాల కల్పనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దించి వారి అభివృద్ధికి పాటుపడాలి. అప్పుడే ప్రపంచంలోని అంతరాలను పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించి సమాజంలో వారిని కూడా భాగ స్వామ్యులను చెయ్యగలిగిన వారమవుతాం. అయి న అందరం ఆదిమ సమాజం నుండి వచ్చిన వారమనే విషయం మరవకూడదు.ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతాలు మూడు మతాల (యూ దులు,క్రైస్తవులు,ముస్లింలు) సమాహారం అలాం టిది హింస కన్న శాంతియుతంగా జీవించే అల వాటును క్రమంగా వీరు అలవరచుకోవాలి. ఇజ్రా యిల్ పాలస్తీనా భూభాగాలు ప్రవక్తలైన “ఏసు క్రీస్తు, మహమ్మద” సంచరించిన ప్రదేశాలు అటు వంటి ప్రాంతాలను యుద్దాలతో, రక్తంతో తడపా లనుకోవడం అవివేకం.కలింగ యుద్ధంతో (క్రీస్తు శకం261)లక్షల మందిని చంపిన అశోకు డు చివరికి భౌద్ధమతం స్వీకరించిశాంతి మంత్రం పఠించిన విషయం మనకు తెలిసిందే కదా. – డా.మహ్మద్ హసన్
వ్యాసకర్త:- సహాయ ఆచార్యులు,రాజనీతి విశ్లేషకులు,