భరించలేని ఆరోగ్య ఖర్చులు

ప్రజలందరికీ అవసరమైన..ఎక్కడ అవసరమైతే అక్కడ..ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆర్థికాంశంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడాన్ని యÖనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్‌సి- సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ) అంటారు. ఇది 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సాధించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి చే ఆమోదించబడిన ప్రపంచ లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2012లో డిసెంబర్ 12న ఆమోదించి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ సార్వత్రిక ఆరోగ్యం అందించాలని చేసిన తీర్మానం ఆధారంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 12న అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ఈ ఏడాది అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దినోత్సవానికి సంబంధించిన థీమ్.. ప్రపంచ జనాభా పడుతున్న ఆరోగ్య సంరక్షణ యొక్క ఆర్థిక భారాన్ని స్పష్టంగా తెలియ చేస్తుంది. అవసరమైన ఆరోగ్య సేవలను తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ప్రజలను ఎప్పుడూ పేదరికం లోకి నెట్టకూడదు.ప్రస్తుతం ప్రపంచంలో కనీసం సగం మందికి అవసర మైన ఆరోగ్య సేవలు అందడం లేదు.ఆరోగ్యంకోసం చేసే ఖర్చు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 10కోట్ల మంది ప్రజ లు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పేదరికంలోకి నెట్ట బడుతున్నారు.93 కోట్లకు పైగా ప్రజలు (ప్రపంచ జనాభాలో సుమారు12%) ఆరోగ్య సంరక్షణ కోసం వారి కుటుంబ వ్యయంలో కనీసం 10% ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్య సేవల ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు అవసరమైన ఆరోగ్య సం రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. ప్రాణాలు పోగొ ట్టుకుంటున్న పరిస్థితి ఉంది.
ఎంతో ముఖ్యం..:మనిషి జీవితానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది.కానీ ఆరోగ్యం అనేది డబ్బు తో కూడుకున్న వ్యవహారమై పోయింది. ఏ ఆరోగ్య సమస్యకి వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు లేనిదే పని జరగదు.దీనివల్ల ఆరోగ్యం అనేది దిగువవర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలి పోతోంది. ఆరోగ్య భద్రత కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకరికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటే, అంత ఆరోగ్యవంతమైన ప్రపం చం అభివృద్ధి చెందుతుంది.దీనిని దృష్టిలో ఉం చుకునే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ ప్రతిచోట, ఎల్లవేళలా అందు బాటులో ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ”యÖనివర్సల్ హెల్త్ కవరేజ్ డే!”ని ప్రకటిం చింది.
ఎందుకు జరుపుకుంటారు? : ప్రపంచవ్యాప్తంగా బలమైన, సమానమైన ఆరోగ్యవ్యవస్థల అవస రంపై అవగాహన పెంచడానికి. అందరికీ ఆరో గ్యాన్ని వాస్తవికంగా మార్చడానికి ప్రభుత్వాలను, నాయకులను ఒత్తిడి చేయడానికి.ఆరోగ్యం అన్నది సర్వ మానవాళికి ఒక ప్రాథమిక హక్క, స్థిరమైన అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి పునా దని ప్రపం చ ఆరోగ్య సంస్థ తెలిపిన ఆలోచనను ప్రపంచానికి చేరవేయడానికి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (ప్రైమరీ హెల్త్‌కేర్-పిహెచ్‌సి)లో పెట్టుబడి పెట్ట డం అనేది కరోనా మహమ్మారి వంటి సంక్షభా లను తట్టుకునే వ్యవస్థలను నిర్మించడానికి అత్యం త ప్రభావవంతమైన మార్గంగా నొక్కి చెప్పడానికి. ధనవంతులు-పేదలు, గ్రామం-నగరం, మహి ళలు-పిల్లలు ఎవరికైనా నాణ్యమైన ఆరోగ్య సేవ లు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని గుర్తు చేయడానికి.ఆరోగ్య సేవలు పొందడానికి ఆర్థికం గా ఎవరూ ఇబ్బందిపడకూడదు అనే లక్ష్యన్ని అందరికీ తెలియజేయడానికి.వనరులను సమీక రించడం కొరకు. 2030నాటికి సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి)లక్ష్యం ద్వారా యÖనివర్సల్ హెల్త్ కవరేజ్ దిశగా పురోగతిని నిర్ధారించడానికి ఆరోగ్య రంగంలో తెలివిగా పెట్టు బడులు పెట్టాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరడానికి. ఏటా లక్షలాది మంది ప్రజలను పేదరి కంలోకి నెట్టే భరించలేని ఆరోగ్య ఖర్చుల యొక్క వినాశకరమైన ప్రభావాన్ని హైలైట్ చేయడం.కుటుంబాల ఆరో గ్యం,సంరక్షణ,ఆహారం లేదా విద్య వంటి ప్రాథ మిక అవసరాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు పోవడం కొరకు.
మనదేశంలో ఎంతవరకు జరుగుతుంది..: దేశంలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ విషయంలో అనేక గణాంకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్య బీమా, ప్రభుత్వ వ్యయం, ప్రజల వాస్తవ ఖర్చులను బట్టి మారుతూ ఉంటాయి.
ఆరోగ్య బీమా కవరేజ్: భారతదేశ జనాభాలో సుమారు 30% మందికి (దాదాపు 40కోట్ల మం దికి) ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణ లేదు. దిగువ 50% జనాభాకు ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు రక్షణ కల్పిస్తున్నాయి. సుమారు 20% మంది సామాజిక లేదా ప్రైవేట్ బీమా ద్వారా ఆరోగ్య సంరక్షణ అందుతుంది..
ప్రభుత్వ ఆరోగ్య వ్యయం : 2021-22 ఆర్థిక సంవత్సరంలో,భారతదేశం యొక్క మొత్తం ఆరో గ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 48% ఉంది. ఇది జిడిపి-లో 1.84% (2021-22 నాటికి) లేదా 2.1% (2022-23 నాటికి) ఉంది, ఇది జాతీయ ఆరోగ్య విధానం 2017 సిఫార్సు చేసిన 2.5% కంటే తక్కువ. ”ఔట్-ఆఫ్-పాౖట” (ఓపిపి) వ్యయం : ప్రజలు తమ సొంత డబ్బుతో నేరుగా చేసే వైద్య ఖర్చులు మొత్తం ఆరోగ్య వ్యయంలో గణనీయమైన భాగం గా ఉన్నాయి.2021-22నాటికి,ఇది 39.4%గా ఉంది. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తగ్గినప్పటికీ, ఇప్పటికీ చాలా ఎక్కువ.
ఆరోగ్య సేవలకు అందుబాటు: 75వ నేషనల్ శాంపిల్ సర్వే డేటా ప్రకారం, గ్రామీణ జనాభాలో కేవలం 14%, పట్టణ జనాభాలో 19% మందికి మాత్రమే ఏదో ఒకరకమైన ఆరోగ్యబీమా ఉంది. సంక్షప్తంగా, భారతదేశంలో ఆరోగ్య బీమా కవ రేజీ,ఆరోగ్యసేవలకు అందుబాటు ఇంకా తక్కువ గానే ఉన్నాయి.ముఖ్యంగా”మిస్సింగ్ మిడిల” అని పిలువబడే జనాభా విభాగానికి,గ్రామీణ ప్రాం తాల వారికి ఆర్థికరక్షణ కల్పించాల్సిన అవ సరం ఉంది.
కీలకమైన అడ్డంకులు ఏమిటి? : మనదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో కొంత మెరుగుదల ఉన్నప్ప టికీ, దేశ జనాభాలో ఎక్కువ మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరత ఉంది.అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో ఇప్పటికీ అవసరమైన మౌలిక సదుపాయాలు,వైద్య పరికరాలు,వనరులు సరి పడా లేవు.దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడం పెద్ద సవాలుగా ఉంది.2021 జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ ప్రకారం, భారత దేశంలో ప్రతి1,000 మందికి 0.6 పడకలు ఉన్నాయి. ఇది జాతీయ ఆరోగ్య విధానం, 2017 లో సిఫార్సు చేసిన దానికంటే తక్కువ.
ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత, అసమాన పంపిణీ: భారతదేశం ఆరోగ్య సంరక్షణ నిపుణుల గణనీయమైన కొరతను ఎదుర్కొంటోంది.ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు కీలకమైన సవాలుగా ఉంది. ఇది ఆరోగ్య సేవల నాణ్యతను, అందు బాటును ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) ప్రతి 10,000 మంది నివాసితులకు 44.5 మంది వైద్యులు, నర్సులు, మంత్రసానులను సిఫార్సు చేస్తున్నప్పటికీ, మన జాతీయ సాంద్రత 20.6మాత్రమే. ఆరోగ్య మానవ వనరులు (హెచ్‌హెచఆర్) అందుబాటు తక్కువగా ఉండడమే కాకుండా పంపిణీ అసమా నంగా ఉంది. పట్టణ ప్రాంతాలలో వైద్యుల సాంద్రత గ్రామీణ ప్రాంతాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. మనదేశంలో గ్రామీణ కమÖ్యనిటీ హెల్త్ సెంటర్లలో (సిహెచ్‌సి-లు)దాదాపు 80% స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది.
నిరంతర ఆరోగ్య సంరక్షణ ఖర్చులు..:ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక జేబు ఖర్చులు చాలా మంది భారతీయులకు గణనీయమైన భారంగా ఉన్నాయి. మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యయంలో దాదాపు 47% వాటా కలిగిన అవుట్-ఆఫ్-పాౖట్ వ్యయం (ఓఓపిఇ ప్రజల జోబు నుంచి జరిపే ఖర్చు), తరచుగా కుటుంబాలను దారిద్య్రరేఖకు దిగువకు నెట్టివేస్తుంది.
తగినంత ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యయం..: దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యత, నాణ్య తను మెరుగుపరచడానికి ఆరోగ్య సంరక్షణ నిధుల పెరుగుదల చాలా కీలకం.ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణపై చేస్తు న్న వ్యయం చారిత్రాత్మకంగా తక్కువగా ఉంది, ఇది ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందు బాటు తక్కువగా ఉండడమే కాకుండా ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సేవలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.
భారతదేశ ప్రజారోగ్య వ్యయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థూల ఆదాయంలో (జిడి పి) కేవలం 2.1% మాత్రమే ఉంది. ఇది ప్రపంచ సగటు కంటేచాలా తక్కువ. అనేక అభివృద్ధి చెంది న దేశాలు ఆరోగ్యానికి జిడిపిలో 5-10% కేటా యిస్తున్నాయి.ఈ బడ్జెట్ కేటాయింపు తక్కువగా ఉండడంతో ఈ పరిమిత వ్యయంలో అభివృద్ధి చెందుతున్న వైద్యాన్ని ప్రజలు అందుకోలేకున్నారు. ప్రభుత్వం అందించలేకపోతుంది.
నివారణ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై తగినంత దృష్టి లేకపోవడం..: భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా నివారణ, ప్రాథమిక ఆరోగ్య సేవలపై తక్కువ ప్రాధాన్యతనిచ్చి తృతీయ సం రక్షణపై దృష్టి సారించడం కొనసాగుతోంది. బిపి షుగర్ కొలెస్ట్రాల్ ఊబకాయంలాంటి నాన్-కమÖ్యనికబుల్ వ్యాధులు (ఎన్‌సిడి) విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది. భారత దేశంలో ఎన్‌సిడిల కారణంగా మరణాల నిష్పత్తి 1990లో 37.9% నుండి 2016లో 61.8%కి పెరిగింది.
యుహెచ్‌సి సాధ్యానికి చర్యలు..: స్థూల జాతీ యోత్పత్తిలో కేవలం 2.1శాతంగా మాత్రమే వున్న ఆరోగ్య బడ్జెట్‌ను వెంటనే మÖడు శాతానికి పెంచి క్రమంగా మరో 10ఏళ్లలో ఐదు శాతానికి పెంచు కోవాలి. తద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదు పాయాలను పటిష్టం చేయాలి.ఆరోగ్య హక్కు చట్టాన్ని రూపొందించి అమలుచేయాలి. ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చినప్పుడు ప్రభుత్వాలు చట్టాన్ని పట్టించుకోనప్పుడు ప్రజలు ప్రభుత్వాలను నిలదీయగల పరిస్థితి ఏర్పడుతుంది. మారు మÖల ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదవారికి కూడా ఆరోగ్యాన్ని హక్కుగా పొందే పరిస్థితి ఏర్పడుతుంది.ప్రాథమిక వైద్య సేవల బలోపేతం పిహెచ్‌సి, సిహెచ్‌సి..లను ఆధునికీకరించడం జరగాలి. ఆరోగ్య నిపుణుల సంఖ్య పెంచాలి. వైద్యులకు నర్సులకు, టెక్నీషియన్లకు శిక్షణ నైపు ణ్యం పెంచుకోవాలి.మందుల ధరలను నియం త్రణ చేయాలి. అవసరమైన ఔషధాలు అందరికీ చవకగా అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం జనరిక్ మందుల షాపులను ప్రభుత్వమే తెరిచి, మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి.డిజిటల్ హెల్త్ పద్ధతులను విస్తరణ చేయా లి.టెలీమెడిసిన్‌ను అభివృద్ధి చేయాలి.ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరచ వచ్చు.డిజిటల్ హెల్త్ రికా ర్డులు,ఆన్‌లైన్ కన్సల్టేషన్లు,మొబైల్ ఆరోగ్య యాప్ లు అందుబాటును పెంచాలి.ప్రభుత్వ ఆసుప త్రులను బలోపేతం చేయాలి. కార్పోరేటు ఆసుప త్రుల నియంత్రణను మెరుగుచేసి, రోగుల హక్కు లకు రక్షణ కల్పించాలి.ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలద్వారా ఆరోగ్య బీమాను విస్తరింపచేసి, ప్రజలందరికీ వైద్య ఖర్చులు తగ్గించి,వైద్య ఖర్చులవల్ల పేదరికం బారిన పడ కుండా రక్షంచాలి.వ్యాధులు రాకుండా నివారిం చడంపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యవిద్య, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, టీకాల కార్యక్రమాలను విస్తరించడం ద్వారా వ్యాధుల భారాన్ని తగ్గించ వచ్చు.
యుహెచ్‌సి అందిస్తున్న దేశాలు..: యÖనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్‌సి)ని విజయవంతంగా అమలుచేస్తున్న అనేక దేశాలు ఉన్నాయి.యునైటెడ్ కింగ్‌డమ్ (యుౖ): ఇక్కడ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌సి) ద్వారా పౌరులందరికీ ఆరోగ్య సంర క్షణ అందించబడుతుంది. ఇది ప్రభుత్వ నిధు లతో,పన్నుల ద్వారా నిర్వహించబడే ‘బెవర్‌డ్జ’ నమÖనా.
ౖనడా :ఇక్కడ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ నమÖ నాను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ రంగ ప్రొవైడర్లు సేవలు అందిస్తారు. అయితే చెల్లింపు లను ప్రభుత్వం నిర్వహించే ఒకే బీమా కార్యక్ర మం ద్వారా చేస్తారు.
జర్మనీ :జర్మనీలో ‘బిస్మార్క’ నమÖనా అమలులో ఉంది.ప్రజలు,యజమానులు తప్పనిసరిగా లాభా పేక్ష లేని”సిక్‌నెస్ ఫండ్స”కు సహకరించాలి. ఇవి ప్రైవేట్ వైద్య సేవలకు చెల్లిస్తాయి. జపాన్: జపాన్ కూడా బిస్మార్క్ నమÖనాను పోలి ఉండే వ్యవస్థను కలిగి ఉంది.ఇక్కడ తప్పనిసరి బీమా పథకాలు సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేవలను అందిస్తాయి.
ఆస్ట్రేలియా:ఆస్ట్రేలియాలో”మెడికేర” అనే సార్వత్రి క ప్రభుత్వ ఆరోగ్యబీమా కార్యక్రమం ఉంది. దీనికి సాధారణ పన్నుల ద్వారా నిధులు సమ కూరుస్తారు.స్విట్జర్లాండ్,నెదర్లాండ్స్ :ఈ దేశాలలో పౌరు లందరూ తప్పనిసరిగా ప్రైవేట్ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుంది.
తైవాన్,దక్షణ కొరియా: ఈ ఆసియా దేశాలు తమ జాతీయ ఆరోగ్యబీమా కార్యక్రమాలు,ఆరోగ్య సం రక్షణలో సాంకేతికతను సమర్థవంతంగాఉప యోగించడం ద్వారా ప్రసిద్ధి చెందాయి.
థయిలాండ్ :థయిలాండ్ ఒక అభివృద్ధి చెందు తున్న దేశం.అయినప్పటికీ దాదాపు 99% జనా భాకు సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందిం చడంలో విజయవంతమైంది.ఇది ప్రభుత్వ పన్ను ల ద్వారా నిధులు పొందుతుంది. ఈదేశాలన్నీ వేర్వేరు విధానాలను అనుసరించినప్పటికీ, అన్నిం టికి ఉమ్మడిగా ఉన్న అంశం ఏమిటంటే, పౌరు లందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉం డాలని..ఆర్థిక ఇబ్బందులు సేవలను పొందడానికి అడ్డంకి కాకూడదని.. రాజకీయ సంకల్పం కలిగి ఉండటం.
విశ్వజనీన ఆరోగ్య సంరక్షణ జరగాలంటే..
”ఆరోగ్య హక్కు చట్టాన్ని” రూపొందించి, అమలు చేయాలి.ఆరోగ్యహక్కు చట్టాన్ని తెచ్చినప్పుడు ప్రభు త్వంలో చట్టాన్ని పట్టించుకోకపోయినా ప్రభు త్వాలు నిలదీయగల పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా రోగ్యానికి నిధుల కేటాయింపు పెంచాలి. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆరోగ్య బడ్జెట్‌ను 3.5 శాతా నికి పెంచాలి.ఐదేళ్ళలో దీనిని క్రమంగా ఐదు శాతానికి పెంచాలి.కొండ ప్రాంతాలలో, వెనుక బడిన ప్రాంతాలలో,గ్రామస్థాయిలో వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి.ప్రయివేట్ వేదిక కళాశా లలను అదుపు చేసి,గవర్నమెంట్ వైద్యకళా శాలలను అభివృద్ధి చేయాలి.ప్రభుత్వం చేయదలు చుకుంటే సాధ్యమే.కానీ అది ఒకేసారి కాదు. మన దేశానికి కావాల్సిన మౌలిక వసతులు, టెక్నాలజీ, ఔషధ తయారీ శక్తి,యువ జనాభా అన్ని ఉన్నాయి.– డాక్టర్ ఎం.వి.రమణయ్య
వ్యాసకర్త :అధ్యక్షలు, ప్రజారోగ్య వేదిక, ఆంధ్రరప్రదేశ్ కమిటీ,