భయపెడుతున్న ఎల్ నినో ఎంత డేంజర్ అంటే..

భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు.దీనిని వారు ‘సూపర్ ఎల్‌నినో’గా పేర్కొంటున్నారు. ఇది జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా.దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పాటు, వర్షాకాల గాలుల స్వభావం అసాధా రణంగా మారే అవకాశం ఉందని సూచిస్తు న్నారు.మే నెలలోనే ఎల్‌నినో ఏర్పడి,ఆగస్టు నాటికి మరింత బలపడుతుందని వాతావరణ పరిశోధ కులు అంచనా వేశారు.ఆగస్టు నాటికి సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశాన్ని తక్కువగా అంచనా వేసినా,బలమైన స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సాధారణ స్థాయిలో ఎల్‌నినో ఏర్పడే అవకా శాలు దాదాపు ఖచ్చితమని భావిస్తున్నారు. భూమిపై అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. దీన్ని సూపర్ ఎల్‌నినోగా వారు అభివర్ణిస్తున్నారు.దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతా యని చెబుతున్నారు. ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో అంటే ఏమిటీ. ఇవి ఎలాంటి వాతా వరణ మార్పులు, ప్రభావాలకు గురిచేస్తాయనే అంశాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఎల్‌నినో అంటే ఏంటి? దీనివల్ల ప్రభావాలు ఏంటి?
– జి ఎన్ వి సతీష్ 
వేసవికాలం తర్వాత ఇండియన్ సమ్మర్ మాన్‌సూన్ ప్రారంభమవుతుంది. దీనికి వేసవిలో వేడిమే కారణం. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వేడి ఉండటంవల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. అలాగే దక్షిణ భారతదేశం దాటి భూమధ్య రేఖకు అవతల ఉన్న ఉన్న ప్రాంతానికి శీతాకాలం ఏర్పడుతుంది. మస్కారన్ ఐలాండ్స్ అనే ప్రాంతంలో భూ మధ్యరేఖకు దిగువగా బలమైన అధిక పీడన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అధిక పీడనం నుంచి ఉత్తర భారత్‌లోని అల్పపీడన ప్రాంతం వైపు గాలుల ప్రవాహం ఉంటుంది. పసిపిక్,హిందూమహసముద్రం, బంగాళ ఖాతం మీదుగా వేడిగాలులు ప్రయాణం చేసి రావడం వల్ల చాలా తేమను తీసుకువచ్చి ఒక నాలుగు నెలల పాటు భారత భూభాగంలో వర్షాలు పడుతుంటాయి. అయితే రుతుపవనా లపై ప్రభావం చూపించే రెండు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అవే ఎల్‌నినో, లానినో.
ఎల్‌నినో ప్రభావాలు ఇవే : పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలు పెరిగినా అది రుతుపవనాలపై ప్రభావం చూపిస్తుంది.ముఖ్యంగా భూమధ్య రేఖకు అనుకుని 5 డిగ్రీ ఉత్తర,5దక్షిణ మధ్య లో ఉన్న పసిఫిక్ జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగు దల ఉన్నట్లయితే దానిని ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో వల్ల రుతుపవనాలు ఆలస్యం కావ డం,వర్షాలు పడక పోవడం లాంటివి ప్రతి కూల పరిస్థితులు ఉంటాయి.పసిఫిక్ మహా సముద్రం తర్వాత ఆ పవనాలు హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐవోడీ) అనే పరిస్థితి ఉం టుంది. తూర్పు వైపు వేడిగా ఉండి, పశ్చిమ వైపు చల్లగా ఉన్నప్పుడు నెగిటివ్ ఐవోడీ అంటారు. దీనివల్ల మాన్‌సూన్‌మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశ్చిమాన వేడి జలాలు ఉండి, తూర్పులో చల్లని జలాలు ఉన్నట్లయితే దానిని పాజిటివ్ ఐవోడీగా పిలుస్తుంటారు.దీనివల్ల ఎల్‌నినో ప్రభావం తటస్థం చేసి రుతుపవనాలు సాధారణంగా ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ఐవోడీ తటస్థంగా ఉన్నాయి. మే చివరి నాటికి ఇది ఎల్‌నినోగా మారొచ్చని ఐఎండీ అంచనా వేస్తుంది.మేలో ఎల్‌నినో ఏర్పడి జూన్‌లో ప్రభా వం ప్రారంభమై అగస్టు నాటికి బలపడు తుందని అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎలా ఉంటాయి? నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందా? వర్షాలు ఈసారి అనుకున్న స్థాయిలో కురిసే అవకాశం ఉందా? ప్రశ్నించగా..జూన్, జూలై, అగస్టు,సెప్టెంబర్ ఈనాలుగు నెలల్లో వర్షాలు పడే రుతుపవనాల సమయం. ఈ టైమ్‌లో ఏ నెలలో అయినా ఎల్‌నినో,ఐవోడీ నెగిటివ్ ప్రభావం ఉంటే కచ్చితంగా మాన్‌సూన్‌పై ప్రభావం ఉంటుంది. మొదటి నుంచి ఎల్‌నినోగా కొనసాగుతుంటే రుతుపవనాలు ఆలస్యమవ్వొచ్చు. అనుకున్న సమయానికి వర్షాలు పడకపోవడం లాంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణలో జులై,ఆగస్టు నెలల్లో ఎక్కువగా వర్షం పడుతుంది. ఎల్‌నినో ప్రభావం ఉన్నట్లయితే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఒక్కోసారి జూన్‌లో భారీ వర్షాలు పడి, జులై అంతా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. మాన్‌సూన్ వర్షపాతం తగ్గడం లాంటివి ఎల్‌నినో లక్షణాలు.తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి కరవు ఛాయలు ఏర్పడే అవకాశం ఉంది? దీని నుంచి జాగ్రత్తలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అయితే రుతుపవనాల రాక ఆలస్యమైతే నదీజలాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల వర్షపు నీటిని సంరక్షించి భూమి లోకి ఇంకినట్లు చేసినట్లయితే భూగర్భ జలాలు పెరిగుతాయి. దానివల్ల ఒకవేళ రుతుపవా నాలు ఆలస్యమైనా నీటి కరవు సమస్య ఏర్పడకుండా ఉంటుంది.పసిఫిక్‌లో రెండు మూడు డిగ్రీలు పెరిగినట్లయితే అది తీవ్ర ప్రభావం అని అర్థం.రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భానుడి నిప్పుల వర్షం-హెచ్చ రించిన ఐఎండీరాష్ట్రంలో వేసవి ప్రారంభంలో అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెట్టాయి. మరికొన్ని రోజులకు ఉరుములు, మెరుపుల వానల కారణంగా వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో మరి కొద్దిరోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు.
రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది?
మార్చి మొదటి రెండు వారాలు ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి.40డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. మార్చి 16నుంచి ఉత్తర భారత్‌లో వెస్ట్రన్ డిస్టబెన్స్ వచ్చాయి. దీంతో మన ప్రాంతంపైనా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉపరితల ఆవర్త నాలు,ధ్రోణులు ఏర్పడ్డాయి.దీంతో ఉరు ములు,మెరుపులు,ఈదురుగాలు,వడగళ్లతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్ర తలు తగ్గాయి. ఇదే తరహా ఉష్ణోగ్రతలు మార్చి చివరి వరకు కొనసాగాయి.ఏప్రిల్ మొదటి నుంచి కొద్దికొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం 36నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వివిధ ప్రాంతాల్లో నమోదౌ తున్నాయి.
ప్రీ మాన్‌సూన్ ప్రభావం నేటితో తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో వాతారణంలో కాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నేటి ఉష్ణోగ్రతతో పోల్చితే రేపటి నుంచి సుమారు 2 నుంచి 4డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.ఉత్తర, తూర్పు తెలంగాణ, రాయలసీమను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఉష్ణో గ్రతలు పెరగనున్నాయి.
ఆ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత
నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి మెహబూబ్‌నగర్ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంది. మరుసటి రెండు రోజులూ ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెహబూబ్?నగర్? జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్? జిల్లాలోనూ ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు
నేటి నుంచి ఐదో రోజుకు ఉత్తర తెలంగా ణలోని అన్ని జిల్లాల్లోనూ 41డిగ్రీల ఉష్ణోగ్ర తలు దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఇవే పరిస్థితులు దర్శనమిస్తాయి. మధ్య తెలంగాణ,హైదరాబాద్ ప్రాంతాల్లో 36 నుంచి 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవు తాయి. సాధారణ ఉష్ణోగ్రత కుంటే 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడితే వడగాల్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువగానే నమోదవుతోంది. దీంతో మన ప్రాంతంలో వడగాల్పులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిం చడంలేదు.ఈ ఐదు రోజుల అనంతరం వాతా రణంలో మార్పులు గురించి నిర్ణయానికి రాలేం.మళ్లీ తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చు. లేదా అధిక ఉష్ణోగ్రతలు నమోదవవచ్చు. ఇదే జరిగితే వడగాల్పుల ప్రభావం ఉండనుంది. ఆ సమయంలో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తాం.