బోగస్ ఓట్లకు చెక్ !
“ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర,కేంద్రపాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం శర వేగంగా కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి నకిలీలను తొలగించి,తప్పులను సవరించడం ద్వారా జాబితాను ప్రక్షాళన చేసి అత్యంత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు సర్ కార్య క్రమం ముందుకు దూసుకుపోతుంది.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ‘సర’ లక్ష్యంతో పాటుగా బోగస్ ఓట్లకు,ఒకవ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం లాంటి వాటికి చెక్ పెట్టేందుకు సర్ సర్వే కొనసాగుతుంది.” – గునపర్తి సైమన్
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. జూన్ 14న ఇంటింటి సర్వే ప్రారంభించామని,ఈ ప్రక్రియ జూలై 14వరకు కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారని,ప్రతి ఓటరికీ ఎన్యూమరేషన్ ఫారం అంద జేస్తున్నామని, ఇప్పటికే 80శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని చెప్పారు. అలాగే 2002 ఓటరు జాబితాతో69.34శాతం మ్యాపింగ్ ఇప్పటికే పూర్త యిందని వెల్లడించారు.సర్ ప్రక్రియలో ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి సంతకం చేసి బీఎల్వోకి తిరిగి ఇవ్వాలని, లేదంటే ఓటుహక్కు కోల్పాతారని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టంగా చెప్పారు.ప్రత్యేక సవరణ కార్య క్రమంద్వారా డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, అనర్హ ఓటర్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయ డంతో పాటు కొత్త అర్హులైన ఓటర్లను నమోదు చేయడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించే సమయంలో ఓటర్లు ఎలాంటి గుర్తింపు పత్రాలు సమర్పిం చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ సాధ్యం కాని వారికి మాత్రమే తర్వాత నోటీసులు జారీ చేసి, అవసర మైన గుర్తింపు పత్రాలు కోరుతామని వివరిం చారు. జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురి స్తామని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమ ర్పించని వారి పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉండవని స్పష్టం చేశారు.
అందువల్ల ప్రతి ఓటరు తప్పని సరిగా ఫారం నింపి బీఎల్వోకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు ఇంట్లో లేని పరిస్థితుల్లో కుటుం బంలోని పెద్దలు లేదా ఓటు హక్కు ఉన్న సభ్యులు కూడా ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని నింపి సంతకం చేసి బీఎల్వోకు ఇవ్వవచ్చన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ఆన్లైన్లో కూడా ఫారం సమర్పించే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలను కునే వారు ఫారం-6ద్వారా దరఖాస్తు చేసు కోవచ్చని ఈసందర్భంగా కలెక్టర్ తెలిపారు. అలాగే చిరునామా మార్పు,ఇతర సవరణలకు సంబంధిత ఫారాలు బీఎల్వోల వద్ద అందు బాటులో ఉన్నాయని చెప్పారు.
అభ్యంతరాల స్వీకరణకు నెలరోజులు అవకాశం
జూలై 21న ప్రాథమిక జాబితా ప్రచురిస్తామని, దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం విచా రణ నిర్వహించి సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని తొలగి స్తామని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం ప్రతి ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయంలోహెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1950 హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం పొందవచ్చన్నారు. “బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో”సౌకర్యం కూడా అందుబాటు లో ఉందని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు.
విశాఖపట్టణం జిల్లాలో 20,23,009 ఓటర్లు…
జిల్లాలో మొత్తం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 16, 63,884 మందికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. అందులో 14,02,693 మంది ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేశామని వివరించారు.
ఇంటింటికీ వెళ్లీ..
ప్రతినియోజక వర్గాల్లోను బూత్‌లెవల్ అధికారులు (బీఎల్వో) ప్రతి ఓటరు ఇంటికి స్వయంగా వెళ్లి పరిశీలన చేస్తున్నారు. పాక్షి కంగా పూరించి ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వారి సమక్షంలోనే వివరాలను సరిచూసి, సంత కాలు తీసుకుం టున్నారు.ఒకవేళ బీఎల్వో వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే..సదరు ఓటరు లభ్యతను నిర్ధారించు కోవ డానికి అధికారులు విధిగా కనీసం 3సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది. కాగా, ఓటరు గుర్తింపు ప్రక్రియను మరింత పక్కాగా చేయడానికి 2002 నాటి మునుపటి‘ఎసఐఆర్ ఆల్ ఇండియా డేటా బేస’ వివరాలను బీఎల్వోలు పరిశీలిస్తు న్నారు. కొత్త ఓటరుగా చేరాలనుకునే వారి నుంచి బీఎల్వోలు డిక్లరేషన్ ఫారంతో పాటు ఫారం-6 సేకరణ చేస్తున్నారు. ఓటర్లు తమ ఎన్యుమ రేషన్ ఫారాన్ని స్వయంగా ఈసీఐ అధికారిక వెబ్సైట్ Httజూ://ఙశీtవతీs.వcఱ.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఆన్లైన్లో కూడా పూరించి సమర్పించవచ్చు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950 అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్, ఈసీఐఎనఈటి యాప్ ద్వారా ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో‘ సదుపాయాన్ని ఉప యోగించుకోవచ్చు. ప్రాథమిక ఎన్యుమరేషన్ ఫారం తప్ప మరే ఇతర అదనపు పత్రాన్ని ఓటర్ల నుంచి సేకరించరు. ఎన్యుమరేషన్ ఫారాలు అందిన ఓటర్ల పేర్లన్నిం టినీ కలిపి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాగా ప్రచురిస్తారు. ఫారాలు తిరిగివ్వని లేదా అందుబాటులో లేని ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా ప్రదర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ అనంతరం గత సవరణ జాబితాతో లింక్ అవ్వని లేదా వివరాల్లో తప్పులు ఉన్న ఓటర్లకు ఈఆర్వో నోటీసులు జారీచేస్తారు. నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితాను కూడా బహిరంగపరుస్తారు.
సమర్పించాల్సిన పత్రాలు విభాగాలవారీగా..
నోటీసు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ లేదా పుట్టినస్థలాన్ని నిరూపించేందుకు,వారి వయసు, జన్మించిన సంవత్సరం ఆధారంగా మూడు విబాగాలుగా విభజించారు.ఆ మేరకు వారు 12రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిం చాల్సి ఉంటుంది.1.7.1987 కంటే ముందు దేశంలో పుట్టినవారు తన పుట్టిన తేదీ/లేదా పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే ఏదైనా ఒకపత్రాన్నిస్తే సరి పోతుంది.అదే 1.7.1987 నుంచి 2.12. 2004 మధ్య జన్మించిన ఓటరు తన పుట్టిన తేదీ/పుట్టిన స్థలం ధ్రువీకరణ పత్రంతో పాటు..తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. 2.12.2004 తర్వాత జన్మించినవారు తన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణ పత్రం,తల్లి లేదా తండ్రికి సంబం ధిం చిన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణపత్రాన్ని తప్ప నిసరిగా జతచేయాలి. ఇక రాష్ట్రంలో ఈ సవరణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా వచ్చేనెల 24వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యు మరేషన్ చేస్తారు.జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, 31 నుంచి ఆగష్టు 30వరకు అభ్యంత రాలు క్లెయిమ్‌ల దాఖలు చేయడానికి గడువు ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ 28వరకు నోటీసుల దశ,విచారణ, క్లెయిమ్‌ల పరిష్కారం, ఆ తర్వాత అక్టోబర్ ఒకటన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
నకిలీ ఓట్లకు చెక్!..
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధి కార యంత్రాంగం భావిస్తోంది. ప్రజల్లో సర్ ప్రక్రియ పైన ఉన్న అనుమానాలను తొలగించే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరిం చాలని,ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఇంటిని కూడా వదల కుండా,ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా సందర్శిం చి సర్వేను వందశాతం పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను ఇప్పటికే జారీ చేసింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడటంతో పాటు,జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితత్వాన్ని పెంచేలా బాధ్యతా యుతంగా వ్యవ హరించాలని తెలిపింది. అధికారుల పర్యవేక్షణ ఉమ్మడి జిల్లాలోగల ఆయాజిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ సర్వే ప్రక్రియ వేగవం తంగా సాగు తోంది.
