ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రాజముద్ర

కొత్త సంవత్సరంలో ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ప్రారంభించింది. నేటి నుంచి ఊరూరా గ్రామసభలు నిర్వహిస్తుంది. ఈ గ్రామసభల్లో రాజముద్రతో తయారు చేసిన కొత్త పాసు పుస్తకాలను జనవరి 9వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు.
గత వైసీపీ హయాంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నాటి సీఎం జగన్ బొమ్మలతో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణి జరిగింది. దీనిపై రైతుల నుంచి అప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణి చేస్తామని, రైతులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా జనవరి 2 నుంచి పంపిణీకి కావాల్సిన నూతన పుస్తకాలను సిద్ధం చేసింది రెవెన్యూ శాఖ. గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పాటు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
కీలక మార్పులు.. గత వైసీపీ హయాంలో రీసర్వే చేసినప్పుడు అనేక మంది రైతులకు వెబ్‌ల్యాండ్‌లోని వివరాలు తప్పుగా నమోద య్యాయి. దీనిపై అప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం అధికారులతో తీవ్రస్థాయిలో మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీపై వ్యతిరేకత తెచ్చిపెట్టింది. కూటమ అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్ పుస్త కాలలోని వివరాలు,పాత వెబ్ ల్యాండిగ్ వివరాలు సేకరించి.. రైతుల వద్ద నుంచి కూడా డేటా సేకరించింది. అన్ని సరి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ చేసి.. కొత్త పుస్తకాల జారీకి ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి తప్పులు లేని పాస్‌పుస్తకాలు అందజేసే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది.
బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ.. కొత్త పాస్ బుక్స్ ను బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారు.దీని ద్వారా ఈ కేవైసీ పూర్తి కాని వారికి సమస్య లేకుండా ఉంటుంది. అదే విధంగా ఎంత మందికి పంపిణీ పూర్తైందనే సరైన లెక్క కూడా ప్రభుత్వం వద్ద ఉంటుంది. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవడంతో పాటు.. ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేసి.. పాత భూహక్కు పత్రాలు(బీహెచ్‌పీ) వెనక్కి తీసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు కూడా వివరాలు తప్పుగా ఉంటే నూతన పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో కూడా పట్టాదారుని వివరాలు తప్పుగా నమోదైతే.. వాటిపై తక్షణ చర్యలకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. తహసీల్దార్ల లాగిన్ ద్వారా.. లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా ఏర్పాట్లు చేశారు. భూమి విస్తీర?ం తప్పుగా నమోదైనా, చనిపోయిన వారి పేరు తో పాసు పుస్తకాల విడుదలైన వాటిని సరి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భూ వివాదాలు లేకుండా..
ప్రజలకు భూ వివాదాలు లేకుండా, రికార్డుల్లో తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర మంత్రులతో టెలీకానæరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో కూడిన 22 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయన్నారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదంగా చేశారన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపాలన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక రోజు తాను స్వయంగా పాల్గొంటానన్నారు. ఈ సందరĝంగా రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకటించినట్లు తెలిపారు. తొలిరోజు పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల్లో పాల్గోనున్నట్లు తెలిపారు. వేలాది గ్రామాల్లో ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు.
పాస్ పుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడండి : సిఎస్
రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకు తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని సిఎస్ కెవిజయానంద్.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేలకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ కేసులకు సంబంధించిన అంశాలు,పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ప్రజల సంతృప్తి, డాక్యుమెంట్ల అప్‌లోడ్ అంశాలపై శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కానæరెన్స్ నిర్వహించారు.
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు 23 లక్షలు ముద్రించి పంపిణీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రైతుల వద్దనున్న పాత పాస్‌పుస్తకాలను తీసుకుని వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయడంతోపాటు పాత పుస్తకాలను మనుగడలో లేకుండా చేయాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవ నాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్.టి కృష్ణబాబు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగ్‌లను తొలగించి వాటి స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేదా రైల్వే అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రధాని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 766 రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఉండగా, వాటిలో ఆరఅండ్‌బి రహదారులపై 329, పంచాయతీరాజ్ రోడ్లు వెంబడి 319 ఉండగా మిగతావి ఇతర రహదారులపై ఉన్నాయన్నారు. ఇప్పటికే 363 ఆరఒబి, ఆర్‌యుబిలు మంజూరు కాగా, మరో 403 మంజూరు కావాల్సి ఉందన్నారు.
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
` అధికారులకు భీమిలి ఎమ్మెల్యే గంటా ఆదేశం
ఆనందపురం, జనవరి 2: ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో అధికారులు తక్షణమే స్పందించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందరĝంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న రెవిన్యూ సమస్యలను మరింత క్షుణ?ంగా పరిశీలించాలని ఆదేశించారు. పరిష్కార వేదికకు మొత్తం 52 ఫిర్యాదులు రాగా.. అత్యధికంగా రెవిన్యూ నుంచి 19, పంచాయతీ రాజ్ నుంచి 14 అందాయి. పి.జి.ఆర్.ఎస్. లో నమోదైన ఫిర్యాదులు, వాటి పరిష్కార వివరాలు విధిగా నమోదు చేయాలన్నారు. రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. వైసీపీ హయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ప్రింట్ చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగించిన పాస్ పుస్తకాన్ని..కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఇచ్చిన పాస్ పుస్తకానికి మధ్య తేడాను గంటా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో జి.శ్రీనుబాబు, ఎంపీడీఓ జానకి,అసిస్టెంట్ ఎంపీడీఓ సత్యనారాయణ,కూటమి నాయకు లు చిక్కాల విజయ్ బాబు,తాట్రాజు అప్పా రావు,బి.ఆర్.బి.నాయుడు,పాండ్రంగి అప్పల రాజు,లొడగల వెంకట్రావు, మహంతి శివాజీ, కర్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.– జీఎన్‌వీ సతీష్