పోక్సో చట్టం ఎవరికి చుట్టం కారాదు

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ కోసం‘లైంగిక నేరాల నుండి చిన్నపిల్లల రక్షణచట్టం,2012’ఒకశక్తివంత మైన ఆయుధం గా మలిచింది. ఈ శాసనం భారత రాజ్యాంగంలోని అధికరణ 15(3)ద్వారా,ఐక్యరాజ్యసమితి చిన్నపిల్లల హక్కుల ఒడంబడిక స్ఫూర్తితో ఉద్భవించింది.పద్దెని మిది ఏళ్లలోపు వయసున్న వారందరినీ ఈచట్టం చిన్నపిల్లలుగా గుర్తిస్తుంది.వారిపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం దీని ప్రధాన లక్ష్యం.ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉదంతం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.చట్టంకఠిన అమలు ఎంత అవసరమో ఈఘటనలు స్పష్టం చేస్తున్నాయి.చట్టంపట్ల సరైన అవగాహనలేకపోవడం వల్ల 16నుండి18ఏళ్ల మధ్య వయసున్న వారు భావోద్వేగప్రేరేపిత చర్య వల్ల నేరస్తులుగా మారుతున్నారు.పోక్సోచట్టం సమ్మతిని అంగీకరించదు.మైనర్లు ఇచ్చే అంగీకారం చట్టరిత్యా చెల్లదు.- జి ఎన్ వి సతీష్ 

ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ ఉదంతం
సాంకేతికత పెరిగేకొద్దీ చిన్నపిల్లలపై నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఇటీవల హైదరాబా ద్‌లో వెలుగులోకి వచ్చిన ఇన్‌స్టా గ్రామ్ ట్రాప్ బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్ ఉదంతాలు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేశాయి.సోషల్ మీడియా వేదికగా మైనర్లను,ముఖ్యంగా ధనిక కుటుంబాలకు చెం దిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, విలాస వం తమైన జీవితాన్ని ఎరగావేసి స్నేహం చేయ డం,ఆపై వారి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి లక్షలాది రూపాయలు వసూలు చేయడం ఒక మాఫియాగా మారింది.ఈకేసుల్లో ప్రధా న నిందితులతోపాటు వారికుటుంబ సభ్యు లు కూడా పాలుపంచుకోవడం నేర ప్రవృత్తి ఎంతగా వేళ్లూనుకుందో తెలియ జేస్తోంది. సైబర్ పోక్సోనేరాల విషయంలోచట్టం మరిం త వేగంగాస్పందించాల్సిన అవసరం ఉంది.
చట్టం అధికార బలం
పోక్సో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుం దా? అనే ప్రశ్నకు ఇటీవల కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన కేసు ఒకపరీక్షగా నిలి చింది. ఒక మైనర్ బాలికను వేధించా రనే ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారు డిపై పోక్సో కేసు నమోదైంది. అయితే,దీనికి ప్రతిగా సదరు యువకుడు తనపై హనీ ట్రాప్ జరిగిందని,రూ.5కోట్లు ఇవ్వాలని బాధితు రాలి కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోం దని కౌంటర్ ఫిర్యాదు చేయడం ఈ కేసును సంక్లిష్టంగా మార్చింది. ముఖ్య మంత్రి ఈ కేసుపై, త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు.అధికారం,హోదా లేదా రాజ కీయ ప్రాబల్యం విచా రణను ప్రభావితం చేయకూడదని బాధితులతర పున సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.పోక్సో కేసు లో బాధితురాలి వయసు వివాదం ప్రధాన అంశంగా మారింది.బాధితురాలికి రెండు వేర్వేరు జనన ధృవీకరణ పత్రాలు ఉండ టంతో,ఆమె మైనరా?మేజరా?అనేదానిపై సందిగ్ధత నెలకొంది.నిందితుడి తరపు లాయ ర్లు ఈ వయసు తేడాలను హైకోర్టు ముందు ఉంచారు.
పోక్సో కేసుల్లో అరెస్టు ప్రక్రియ
పోక్సోచట్టం కింద నేరం నమోదైనప్పుడు పోలీసులు అనుసరించాల్సిన ప్రక్రియ అత్యం త కఠినంగా,స్పష్టంగా ఉంటుంది.పోక్సో కింద నమోదయ్యే నేరాలు కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్. అంటే, మేజిస్ట్రేట్ నుండి ముందస్తు వారెంట్ లేకపోయినా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయవచ్చు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాలి. నేరం జరిగిన 24 గంటల లోపు బాధితు రాలికి వైద్య పరీక్ష లు నిర్వహించాలి. అరెస్టు చేసిన 24 గంటల లోపు నిందితుడిని ప్రత్యేక పోక్సో కోర్టు లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సాధా రణ కేసుల్లో నిందితుడు నేరం చేశాడని పోలీ సులు నిరూ పించాలి. కానీ పోక్సోలో సెక్షన్ 29 ప్రకారం, నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
రోమియో-జూలియట్ క్లాజ్
పోక్సో చట్టం అమలులో అత్యంత చర్చనీ యాంశమైన అంశం రోమియో-జూలియట్ క్లాజ్.ఇది నేరుగా చట్టంలో ఒకసెక్షన్ కాకపో యినప్పటికీ, న్యాయస్థానాలు కౌమార దశలో ఇష్టపూర్వకంగా ఏర్పడే శారీరక సంబంధాల విషయంలో అనుసరించే విచక్షణను ఇది సూచిస్తుంది. ఇద్దరూ మైనర్లు అయి ఉండి లేదా వయస్సులో స్వల్ప వ్యత్యాసం ఉన్న ప్పుడు, వారి మధ్య పరస్పర సమ్మతితో ఏర్ప డిన సంబం ధాలను క్రూరమైన అత్యాచారాల కోణంలో చూడ కూడదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇటీవల అనేక హైకోర్టులు, ప్రేమ వ్యవహా రాల వల్ల తలెత్తే ఇటువంటి కేసుల్లో కఠిన శిక్షలు విధిస్తే యువత భవి ష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నా యి. వయస్సు నిర్ధారణ, నేర ఉద్దేశ్యాన్ని నిశితంగా పరిశీలించి,ఇవినిజమైన లైంగిక వేధింపులు కాన ప్పుడు విచక్షణతో తీర్పులు ఇవ్వాలని సూచిం చాయి.
ప్రత్యేక కోర్టులు విచారణలోని జాప్యం
తెలంగాణ హైకోర్టు 2018లో ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీకో ర్టులను ప్రారంభించింది. ముఖ్యం గా 2020 ఆదేశాల ప్రకారం, మైనర్ బాధి తుల సాక్ష్యాలను సేకరించే సమయంలో కోర్టు అధికా రులు న్యాయవాదుల గౌన్లు ధరించకూడదు. ఇది చిన్నపిల్లల్లో ఆందో ళనను తగ్గించి,వారు స్వేచ్ఛగా వాంగ్మూలం ఇచ్చేందుకు దోహదపడుతుంది. కానీ,జాతీ య మీడియాలో సైతం తెలంగాణలోని కొన్ని హై-ప్రొఫైల్ కేసుల దర్యాప్తు తీరుపై విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకే పరిమితమై,ఏళ్ల తరబడి విచారణ సాగడం బాధి తులకు మరోరూపంలో హిం సను మిగులు స్తోంది.
బాధితులు`నిందితులు
పోక్సో కేసులలో సుమారు 90శాతానికి పైగా కేసులలో నింది తులు బాధితుల బంధువులు, పొరుగువారు లేదా కుటుంబానికి అత్యంత సన్ని హితులుగా ఉంటున్నారు. మరోవైపు,నిందితు లలో అన్ని వర్గాల వారు కనిపిస్తున్నారు. సమా జంలో గౌరవ ప్రదమైన హోదాలోఉన్న వ్యక్తులు కూడా ఈఅఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాధితుల విషయానికొస్తే,ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా లైంగిక వేధింపులకు గుర వుతున్నారని,అయితే సామాజిక కారణాలవల్ల మగపిల్లల కేసులు వెలుగులోకి రావడం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.పెనెట్రేటివ్ సెక్సు వల్ అసాల్ట్ వంటి నేరాలకు కనీసం పదేళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు ఉన్నాయి. 2019 సవరణ ప్రకారం పన్నెండేళ్ల లోపు బాధి తుల విషయంలో కోర్టులు మరణశిక్ష కూడా విధిస్తాయి.ఈ చట్టం ‘ప్రెసంప్షన్ ఆఫ్ గిల్ట్ సూత్రంపై పనిచేస్తుంది. అంటే,నిందితుడే తాను నిర్దోషినని కోర్టులో నిరూ పించుకోవాలి.పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం,బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం.మీడియా లేదా పౌరులు బాధితుల వివరాలను సామాజిక మాధ్యమా ల్లో పంచు కోవడం చట్టవిరుద్ధం.
బలహీన వర్గాల దైన్యం
బాధితుల్లో ఎక్కువ మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు.ఉన్నత వర్గాల వారు పరు వు కోసం కేసులను నమోదు చేయడం లేదు, మరోవైపు పేద వర్గాలకు న్యాయం అందడం గగనమవుతోంది.నిందితుల్లో అత్యధిక శాతం బాధితుల పరిచయస్తులే ఉంటు న్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక సూచిస్తోంది.
పరిష్కార మార్గాలు
ప్రభుత్వాలు కేవలం మీడియా ప్రచారం కోసం కాకుండా,వ్యవస్థా గత మార్పులకోసం పని చేయాలి.పాఠశాలల్లో లైంగిక విద్యను కేవలం మొక్కుబడిగా కాకుండా, అవగాహన కలిగించేలా చేయాలి. ఆన్‌లైన్ చైల్డ్ పోర్నో గ్రఫీని అణచి వేయడంలో ఐటిచట్టం, పోక్సో చట్టం సమన్వయంతో పనిచేస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గ కుండా,బాధి తులకు న్యాయం చేకూరినప్పుడే చట్టంపై సామాన్యులకు నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వం,పౌరసమాజం సమన్వయంతో పనిచేసి నప్పుడే చిన్న పిల్లలకు పూర్తి రక్షణ లభిస్తుంది. పాఠశాలల్లో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. రాజకీ యాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోయేలా దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ నివ్వాలి.
ఫిర్యాదు చేయడం ఎలా? చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఏస్థానిక పోలీస్ స్టేషన్‌లో నైనా ఫిర్యాదు చేయవచ్చు లేదా 24/7 అందుబాటులో ఉండే జాతీయ చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు కాల్ చేయ వచ్చు. వ్యాసకర్త : లాజిక్,పాలసీ విశ్లేషకుడు