పొంచి ఉన్న విఫత్తుల ముప్పు

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతోఆ కారణంగా చోటుచేసు కుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం.కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. భూకంపాలు సంభవిస్తున్నాయి.మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.గాలి దుమారాలు,ధూళి తుఫాన్లు,వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే..ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది.అందుకు ఇటీవల మయన్మార్ భూకంపమే నిదర్శనం.అలాగే గతేడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ముంబాయి,రాజస్థాన్,గుజరాత్,ఢిల్లీ వంటి మహానగరాల్లో చోటుచేసుకున్న ఘటనలు తార్కాణం.
ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీలిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మÖడు రెట్లు పెరిగిందని తేలింది.ఈ సమాచారాన్ని ‘నేచర్ కమÖ్యనికేషన్స’ పేరుతో నిర్వహిస్తున్నసైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది.ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు,విపత్తుల కారణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది.భారత్‌లో ఎక్కువగా ఉత్తర,మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.గుజరాత్,మహా రాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీస్‌గఢ్,తెలంగాణ, ఒడిశా,ఝార్ఖండ్, అస్సాం, మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా,కర్ణాటక కోస్తా ప్రాంతం,ఉత్తర కర్ణాటకలో ఈతరహా విపత్తులకు ఎక్కువగా నమోదవుతున్నాయి. 
ఈభూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువులస్థాయి పెరగడమే. అయితే వీటి మోతాదు వాతావరణంలో పెరిగేకొద్ది అనర్థాలు,వైపరీత్యాలే.కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల(పెట్రోలియం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు,నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి.శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక,లక్ష్యం నిర్దేశించుకుంది. ఆప్రకారం రానున్నరోజుల్లో దేశంలో అపారంగా లభ్యమయ్యే సూర్య కాంతి ఆధారంగా సోలార్ ఎనర్జీని పెంపొందించాలని,అలాగే ఏమాత్రం కాలుష్యాన్ని వెదజల్లని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది.అయితే ఇదంతా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడానికి చాలా సమయం పడుతుంది.ఈలోగా ప్రకృతికి జరగాల్సిననష్టం జరిగిపోతోంది.గ్రీన్ హౌజ్ వాయు వులు సముద్ర జలాల ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి.ఫలితంగా సముద్రమట్టం పెరుగుతోంది.సముద్రజల ప్రవాహాలు (కరెంట్స్)లోమార్పులు చోటుచేసుకుని భీకరతుఫాన్లు,హరికేన్లు ఏర్పడుతున్నాయి.
ఇలాంటి ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏజీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే..దాని బారినపడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావరణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.అయితే ప్రకృతిలో సంభవించే అన్నిరకాల వైపరీత్యాలను,వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందు కంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్ట మైన అంశం.సుదీర్ఘ అనుభవం,లోతైన అవగాహన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణశాఖ ఈ మధ్యకాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడిగాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణశాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి.ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారించగల్గుతున్నాం.ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని,తద్వారా గ్రీన్ హౌజ్ వాయువులస్థాయిని తగిన మోతాదులో ఉంచగల్గితే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు.వేడిగాలులు,అధికఉష్ణోగ్రతలు వేడి సంబంధిత వ్యాధులను పెంచుతున్నాయి (ఉదాహరణకు,హీట్ స్ట్రోక్,డెంగ్యూ,మలేరియా,చికున్‌గునియా).మానవ సమÖహాలు ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత భయంకరమైన ప్రభావాలు కనిపించే అకాశాలున్నాయి.
ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే,భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు మనల్ని చుట్టుముడతాయి. సుదీర్ఘకాలిక పరిష్కారాలు ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. - రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్