పునర్వి భజన ఇప్పట్లో లేనట్టే

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగి పోవడంతో.. నియోజకవర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండక పోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారమే వచ్చే సాధారణ ఎన్నికలు జరుగుతాయని, జమిలి ఎన్నికలు కూడా అనుమానమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటు న్నాయి. అయితే పునర్విభజన, మహిళా బిల్లులను మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలన్న పట్టుదలతో కేంద్రం ఉంటే మాత్రం.. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుని పెట్టాల్సి ఉంటుందని అంటున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌కు ముడిపెడుతూ ప్రవేశ పెట్టడంతో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకంగా ఓటు వేశాయి. దీంతో లోక్‌సభలో మÖడింట రెండొంతుల మెజార్టీ లేని ఎన్డీయే.. ఏకపక్షంగా పునర్విభజన బిల్లు పెట్టి ఆమోదించుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల నాటికి డీలిమిటేషన్ లేనట్టేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగంలో చేసిన సవరణ, ఇప్పటికే ఆమోదం పొంది ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాల ప్రకారం.. నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ 2026 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత మోదీ ప్రభుత్వ పదవీకాలం 2029లో ముగియ నుంది. అంటే జనగణన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, పునర్విభజన ప్రక్రియ కోసం కమిషన్ వేసి, ఆ కమిషన్ తన ప్రక్రియను పూర్తి చేయడానికి ఉన్న సమయం మÖడేళ్లు మాత్రమే. జనగణన ప్రక్రియ పూర్తి చేసి గణాంకాలు ప్రకటించడానికే కనీసం రెండేళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతు న్నాయి. ఆ తర్వాత పునర్విభజనకు కమిషన్ వేయడం, ఆ కమిషన్ ప్రక్రియను పూర్తి చేయడం.. ఏడాది లోపు సాధ్యం కాదని పేర్కొంటున్నాయి.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై వాస్తవాలు చెప్పాలి
131 రాజ్యాంగ సవరణ (మహిళా రిజర్వే షన్లు-డీలిమిటేషన్) బిల్లుపై ప్రజలకు వాస్త వాలు చెప్పాలని కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం లేఖ రాశారు.ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2014 విభజన చట్టంలో పేర్కొన్న అసెంబ్లీ సీట్ల పెంపుదలకు డీలిమిటేషన్‌కు ఎలా ముడిపెట్టారని ప్రశ్నించారని, ఈ విష యాలు మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి నట్లు ఉందని పేర్కొన్నారు. అసలు విషయాలు వదిలేసి సంబంధం లేని, సమకాలికత లేని విషయాలు చెప్పి చేసిన తప్పును కప్పిపెట్టు కోవడానికి గట్టిగా ప్రయత్నించినట్లు కనిపిస్తోందని తెలిపారు. మాట తప్పడం, అబద్ధాలు వల్లెవేయడం బిజెపివారికి వెన్నతో పెట్టిన విద్య అని, అలాంటి వారితో కలిసి ఈ అబద్ధ ప్రచారానికి తెరలేపడం దురదృష్ట కరమని పేర్కొన్నారు. పిన్న వయస్సులోనే టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేంద్రమంత్రిగా ఎదిగారని,ధైర్యంగా నిజాయితీగా నిజాలు చెప్పి యువతకు ఆదర్శంగా నిలవాల్సిన వారు ఇలా బిజెపితో కలిసి అవాస్తవాలు చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు.సీట్ల పెంపుదలకు డీలిమిటేషన్‌కు సంబంధం ఉందని అయితే, మహిళా రిజర్వేషన్‌కు సంబంధం లేదని, రిజర్వేషన్లు అమలు జరిపి అనంతరం డీలిమిటేషన్ చేస్తే దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా సవరించవచ్చని తెలిపారు. అలా చేయకుండా డీలిమిటేషన్‌కు ముడిపెట్టి మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపెట్టింది మోడీ నాయక త్వంలోని మీ ప్రభుత్వమేనని తెలిపారు. 2014 విభజన చట్టంలో ఉన్న సీట్ల పెంపుదల గత 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో అమలు జరగకపోవడానికి కారణం ఎవరని శ్రీనివాస రావు ప్రశ్నించారు. అప్పటి నుండి కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ఎన్‌డిఎ కూటమేనని, ఎందుకు అమలు జరపలేకపోయారని ప్రశ్నిం చారు. సీట్ల పెంపు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా డీలిమిటేషన్ కూడా జరుగుతుందని, అయితే సీట్లు పెంచకుండా కూడా డీలిమిటేషన్ చేయొ చ్చనే విషయం కేంద్రమంత్రికి తెలుసని పేర్కొన్నారు. అయినా ఒకదానికొకటి ముడి వేసి ఇప్పటి వరకూ రాష్ట్రంలో సీట్లు పెరగకపో వడానికి, మహిళా రిజర్వేషన్లు అమలు జరగక పోవడానికి ఎన్‌డిఎ ప్రభుత్వానిదే బాధ్యతని, దీనికి మంత్రిగా మీరే సమాధానం చెప్పాలని కోరారు.పార్లమెంటులో ఏప్రిల్ 17న జరిగిన చర్చలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన విషయాలు ఒకసారి గమనంలోకి తీసుకోవాలని, ఆయన మాటల ప్రకారం కొత్తగా రాబోయే జనాభా లెక్కలను నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపదికగా తీసుకుంటే ఎపి తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు.2008లో చివరగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం లోని మÖడు లోక్‌సభ స్థానాలు,ఏడు ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణకు వెళ్లాయని,ఆమేరకు ఆంధ్ర ప్రాంతం ప్రాతినిధ్యాన్ని కోల్పోయిందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అందులో రాజకీయాలు లేకపోయినా ఆంధ్రప్రాంతం నుండి తెలంగాణాకు ఎక్కువమంది వలస వెళ్లడం వల్ల అలా జరిగిందని, ఇప్పుడు 2026 జనాభా లెక్కల ఆధారంగా వెళ్తే ఎపికి మరింత నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. గత 15 ఏళ్లుగా ఎపిలో సంతాన సాఫల్య నిష్పత్తి తిరోగమనంలో సాగుతోందని, పైగా రాష్ట్రం నుండి వలసలు పెరిగాయని, ఈ సమయంలో 2026 కాదు కదా 2011జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ నష్టపో తుందంటూనే ‘ప్రస్తుతం 50శాతం సీట్ల పెంపునకు సభాముఖంగా ప్రధానమంత్రి, హోంమంత్రి హామీ ఇచ్చినందున మేం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు పలుకుతున్నాము. (ఈనాడు 18, ఏప్రిల్)’ అని చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా అమిత్‌షా మాటలు నమ్మి బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని,గత 12సంవత్సరాల్లో రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కేంద్రం ఏ ఒక్కటైనా అమలు జరిపిందా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, అసెంబ్లీ సీట్ల పెంపుదల మొదలుకొని కడప ఉక్కు ఫ్యాక్టరీ,రాజధానికి నిధులు,వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇలా అన్ని విషయాల్లోనూ వెన్నుపోటులు,మాట తప్పిదాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారి మాటలు విశ్వసించి జనాన్ని కూడా నమ్మమంటున్నారని, నిర్దిష్టంగా మన రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి,ఏ ప్రాతి పదికన పెరుగతాయి అన్న విషయం బిల్లులో ఎక్కడా పెట్టలేదని తెలిపారు. ఆవిషయం తెలిసి కూడా 2011 జనాభా ఆధారంగా సీట్ల పెంపు, డీలిమిటేషన్ జరుగుతుందని పేర్కొ న్నారని తెలిపారు. ఒకవైపు 2026 జనాభా లెక్కల సేకరణ జరుగుతుండగా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. దానివల్ల ఎస్‌సి,ఎస్‌టిలకు సీట్లు తగ్గుతాయని,జనాభాను ప్రాతిపదికగా తీసు కుంటే కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన ఎపి లాంటి రాష్ట్రాలకు నష్టం కాదా అని ప్రశ్నించారు. ఆవిషయం టిడిపి కూడా చెప్పిందని,దానివల్ల నష్టమని తెలిసే ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చి బిజెపి నాయకుల కపట రాజకీయ నాటకంలో భాగస్వాములు కావడం వల్ల రాష్ట్రానికి అన్యాయం చేసిన వారవుతారని పేర్కొన్నారు. 2023లో మహిళా బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న కనక మేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుతో జనగణన, డీలిమిటేషన్‌తో ముడి పెట్టడంవల్ల మహిళలకు రిజర్వేషన్ అమలు జరపడం ఆలస్యం అవుతుందని, అందువల్ల అలాంటి లింకు పెట్టవద్దని కోరా రని తెలిపారు. ఒకసారి రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయని, మరి ఇప్పుడదే చట్టానికి డీలిమిటేషన్ ముడిపెట్టడాన్ని టిడిపి ఎలా బలపరుస్తున్నదని ప్రశ్నించారు. 2024లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేసి ఉంటే ఈ పాటికి మహిళలు మÖడోవంతు పార్లమెంటులోనూ,మన అసెంబ్లీలోనూ ఉండే వారని, 2026 తరువాత పెరిగే జనాభాకు అనుగుణంగా సీట్లతోపాటు మహిళల సంఖ్య కూడా పెరిగేదని, దాన్ని అమలు చేయని నేరం ఎవరిదని ప్రశ్నించారు.2023లో మహిళా బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనగణన ఎందుకు చేపట్టలేదని, కులగణన కూడా దానితోపాటే చేపట్టాలని వచ్చిన డిమాండును ఆమోదించకుండా అణగదొక్కింది ఎవరో చెప్పాలన్నారు. కులగణన అంటే దేశ విచ్ఛిన్న చర్య అని అన్న ప్రధాని మరలా ఎందుకు అంగీకరించారు?రాజకీయ ప్రయోజనాల కోసమే కదా?అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌పై రాచమార్గాన్ని వదిలి దొడ్డిదారిన అది అమలు కాకుండా ఆపిన నేరం మీ ప్రభు త్వానికి కాదా చెప్పాలన్నారు. బిల్లులో ఎక్కడైనా (ప్రొరాటా) నిష్పత్తి ప్రకారం సీట్లు పెరుగుతా యని చెప్పారా? కొత్తగా ఏర్పడే డీలిమిటేషన్ కమిషన్ 2011జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాలకు సీట్లు కేటాయిస్తుందని అంటే బిజెపి ఇష్టాయిష్టాల ప్రకారం జరగ బోతుందన్నది వాస్తవం కాదా,. ఈ ప్రశ్నలకు టిడిపి నేతలు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను డీలిమి టేషన్‌తో నిమిత్తం లేకుండా 2029 ఎన్నికల్లో అమలు జరిపే విధంగా పూనుకోవాలని, ఏదో ఒకసాకు చూపి వాయిదా వేస్తే మీ ప్రభుత్వం ప్రజల ముందు ప్రత్యేకించి మహిళా లోకం ముందు బోనులో నిలబడాల్సి వస్తుందని గమనించాలని తెలిపారు. ఇప్పటికైనా ధైర్యంగా ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ముందుకు రావాలని కోరారు.
ప్రాతినిథ్యం మారదు..నష్టం ఉండదు
మహిళా రిజర్వేషన్ల అమలకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక రాజకీయమేమీ లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. బిల్లులపై వివిధ రాజకీయపార్టీలు,పౌర సమాజం నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానాలను విడుదల చేసింది.ఒకేసారి మÖడు బిల్లులు తీసుకురావ డానికి కారణాలు,దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది.
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఇటీవల ప్రవేశ పెట్టిన బిల్లులు
í 131వ రాజ్యాంగ సవరణ బిల్లు2026 í నియోజకవర్గాల పునర్విభజన బిల్లు2026
í కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు`2026

వీటిని ఒకేసారి ప్రవేశపెట్టడానికి కారణ మేంటి?: 2026తర్వాత నిర్వహించే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి,దాని ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని‘నారీశక్తి వందన్ అధినియం చట్టం’ చెబుతోంది.ఒకవేళ ప్రభుత్వం కొత్త జనాభా లెక్కలు,తదితనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూస్తే 2029సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల ప్రయోజనం దక్కదు.జనగణన,తదనంతరం చేపట్టే డీ లిమిటేషన్‌కు సమయం తీసుకోవడమే అందుకు కారణం.మహిళలకు సకాలంలో రిజర్వేషన్ల ఫలాలు అందించేందుకు ఆ షర తును చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించింది.
అయితే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేయడం.మహిళా రిజర్వేషన్ల అమలుకు అది అత్యవసరం. ఇప్పుడున్న 543లోక్‌సభ సీట్లను 1976లో ఖరారు చేశారు.1971లో దేశ జనాభా 54కోట్లు.ఇప్పుడు అది140కోట్లు.అందువల్ల సీట్లను గరిష్టంగా 850కి పెంచడం ముక్యం. ఇది ప్రజలకు పార్లమెంటులో న్యాయబద్దమైన ప్రాతినిధ్యాన్ని కల్పించింది.డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులూ చేయలేదు.ఇప్పుడున్న చట్టబద్ద స్వరూపం యథాతథంగా ఉంది.కమిషన్ ఏదైనా సిఫార్సులు చేయాలంటే అందుకు పార్లమెంటు అనుమతి,రాష్ట్రపతి ఆమోదం కావాలి.ఈ బిల్లు వల్ల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావమÖ ఉండదు.2029 సార్వత్రిక ఎన్నికల వరకు అన్నీ మునుపటిలానే సాగుతాయి.అయితే ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఉన్న నియోజకవర్గాలను అదే నిష్పత్తిలో పెంచ డమే ప్రధాన ఉద్దేశం.అంతటా 50శాతం సీట్లను పెంచితే అన్నీ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి అలాగే కొనసాగుతుంది.అందువల్లే రాజ్యాంగంలో ఉన్న గరిష్ట సంఖ్యను 850కి పెంచారు. దీనివల్ల దక్షినాది,చిన్న రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపదు.అన్నీ రాష్ట్రాల్లో సమానంగా 50శాతం సీట్లు పెరుగుతాయి.దక్షిణాది ప్రాతి నిధ్యం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొన సాగుతుంది.లోక్‌సభలో ఆ రాష్ట్రాలకున్న 23.76శాతం వాటా 23.87శాతానికి పెరుగుతుంది.అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు.అన్నీ రాష్ట్రాల్లో ఒకేవిధంగా సీట్లు పెంచాలని నిర్ణయించి నందున వాటి నైష్పత్తిక ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పూ ఉండదు.పైగా కొంత మెరుగుపడుతుంది.
ఎస్సీ,ఎస్టీల ప్రాతినిధ్యం దెబ్బతింటుందా?
అదేవిధంగా ఎస్సీ,ఎస్టీల ప్రాతినిధ్యం దెబ్బతి నదు.నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఎస్సీ,ఎస్టీలకు నైష్పత్తి రిజర్వేషన్లు కల్పిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగి ఉంటే వారి ప్రాతినిధ్యం భారీగా పెరిగేది.దానివల్ల ఆ సామాజిక వర్గాలకు బలం చేకూరేది.కులగణనకు ప్రభుత్వం ఇప్పుడే నిర్ధిష్ట కాలానుగుణ కార్యక్రమం మొదలు పెట్టింది.జనగణనలో వ్యక్తి గత వివరాలు సేకరించేటప్పుడు కుల ఆధారిత లెక్కల సేకరణ జరుగుతుంది. ఈనేపథ్యంలో పార్లమెంటులో ఈ మÖడు బిల్లులు ఆమోదం పొందితే 2029లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కేవి.- రఘువర్మ కంచికర్ల