తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్ న్యూస్ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్లు రికార్డులు బ్రేక్ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 40 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్ చేసి టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీయరాలజీ డాక్టర్ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్ నెలలో యÖపీలో అలహాబాద్ (46.8డిగ్రీలు), ఝాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్ టైం హై టెంపరేచర్లు ఈ నెలలో రికార్డ్ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్ కట్లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢిల్లీలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్ పరిస్థితులపై యÖఎన్ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢిల్లీ ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యÖనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2023 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 40డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నా యి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. “వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్,పంజాబ్, హైర్యానా,రాజస్థాన్గుజరాత్-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.“దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది” అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 40డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు.– జి ఎన్ వి సతీష్
