చట్టం ఉంది..న్యాయం ఎక్కడ?
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆదివాసులకు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే ఆవేదన ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజన జరిగినా, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కుల పరిరక్షణ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఒకేలా ఉండాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఆదివాసుల జీవన విధానం ఆదివాసీలకు భూమి,అడవి,నీటితో విడదీయరాని సంబంధం కలిగి ఉంది.అందుకే “జల్-జంగల్-జమీన” అనే నినాదం కేవలం ఉద్యమ నినాదం మాత్రమే కాదు..అది వారిఅస్తిత్వానికి ప్రతీక. చరిత్రను పరిశీలిస్తే కాకతీయుల కాలం నుంచి బ్రిటిష్,నిజాం పాలన వరకు ఆదివాసులు తమ స్వయం పాలన,భూమి,అడవుల రక్షణ కోసం నిరంతరం పోరాడినట్లు స్పష్టమవుతుంది.సమ్మక్క-సారలమ్మ,రాంజీ గోండ్, కొమరం భీం,బిర్సా ముండా,వీర్ నారాయణ్ సింగ్ వంటి మహనీయులు తమ ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరిసీతారామరాజు నేతృత్వంలో జరిగిన రంపా తిరుగుబాటు,ఆదిలాబాద్‌లో కొమరం భీం పోరాటం వంటి ఉద్యమాలు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.
చట్టాల ఆవిర్భావం
ఆదివాసుల భూములను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల బదలాయింపును నియంత్రించే చట్టాన్ని తీసుకొచ్చింది. అనంతరం 1959లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ (LT=) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదలాయించడం నిషేధించబడింది. 1963లో ఈ చట్టాన్ని తెలంగాణ షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు. అయితే అక్రమ లావాదేవీలు, బినామీ పేర్లతో భూముల ఆక్రమణలు కొనసాగుతుండటంతో 1970లో రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970 (1/70 చట్టం) తీసుకొచ్చారు.
చట్టం ఎవరి కోసం?
1/70 చట్టం గిరిజనేతరులను ఇబ్బంది పెట్టడానికి రూపొందించబడినది కాదు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రక్షణలను అమలు చేయడానికి, ఆదివాసుల భూములు, జీవనాధారం, అస్తిత్వాన్ని కాపాడేందుకు రూపొందించిన రక్షణ కవచం. ఈ చట్టాన్ని బలహీనపరిస్తే నష్టపోయేది కేవలం భూమి మాత్రమే కాదు; ఆదివాసుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది.రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, 1/70 చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి నిబంధనలు ఆదివాసుల హక్కులను రక్షించేందుకు రూపొందించబడ్డాయి. కానీ అవి కాగితాలకే పరిమితమైతే ప్రయోజనం ఉండదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నర్లు, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనలో ఉన్న అధికారులు చట్టాల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలి. ఆదివాసుల భూ సమస్యలను కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా జాతీయ ప్రాధాన్య అంశంగా గుర్తించి సమర్థ వంతమైన చర్యలు తీసుకున్నప్పుడే రాజ్యాంగం ఉద్దేశించిన సామాజిక న్యాయం సాకారమవు తుంది.లేకపోతే, భూమి కోల్పోయిన ఆదివా సులు చివరికి తమ అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్‌గా విడిపోయిన ఆదివాసి ప్రజల చట్టాలను అమ లు చేయడంలో ప్రభుత్వాలు అక్కడ,ఇక్కడ ఒకే విధంగా చూడాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 79ఏళ్లు గడుస్తున్నా 1950 నుండి ఆదివాసు లకు హక్కులు అమలవుతున్న నేటికీ అగ్గి రాజేస్తున్న అనేక ఆదివాసీ భూమి పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి.జల్, జంగల్,జమీన్ నినాదం ఆదివాసీ ప్రాంతాలలో అగ్నిజ్వాల రగులుతూనే ఉంది. ప్రభుత్వ పాలనకు ముందు బ్రిటీష్, నిజాం నవాబులు, అంతకుముందు కాకతీయులు అలాగే మౌర్య చక్రవర్తుల పాలనలో సైతం ఆదివాసీల మను గడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో వారి నుండి తిరుగుబాటు పోరాటాలు జరిగాయన డానికి చారిత్రక సాక్ష్యాలు లేకపోలేదు స్వయం పాలన కోసం కాకతీయులతో పోరాడి అసు వులు బాసిన సమ్మక్క సారలమ్మ నుండి నిజాం సేనలతో పోరు చేసిన రాంజీ గోండ్, కొమరంభీం వరకు అలాగే మహారాష్ట్ర,చందా, బస్తర్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో సిద్కాకి బాబురావు,వీర్ నారా యణ సింగ్,బిర్సా ముండా, మాణిక్ ఫర్డ్,బల్లార్షా వంటి యుగ పురుషుల తిరుగుబాటు తమ మనుగడ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం చివరి శ్వాస వరకు పోరాడి ఉరి తీయబడటం కాల్చి వేతకు గురికావడం అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో భద్రాచలం నుండి రంప చోడవరం ఏలూరు దాకా జరిగిన పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం రాజు,మైసూర్ మహా రాజు సైనిక దళాల సహాయం తీసుకోవడం జరిగింది అంటే ఆదివాసి పోరాటాలపై ఆనాటి సామంత రాజుల యొక్క నియంత్రణ, అణచి వేతలు ఆనాటి నుంచి ఆదివాసులపై కొనసాగు తూనే ఉన్నాయి.భూమి,నీరు,అటవీ మాదే అంటూ జరిగిన అనేక ఆదివాసీల పోరాటా లపై అధ్యయనం చేసిన నాటి ప్రభుత్వాలు, బ్రిటీష్ ప్రభుత్వాలు అలాగే నేటి ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చాయి. 1917లో బ్రిటీష్ వాళ్ళు అప్పటి మద్రాసు రాష్ట్రంలోని ప్రస్తుత ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో భూమి బదలాయింపు, వడ్డీ వ్యాపారాన్ని నియంత్రిం చేందుకు 1917చట్టం చేసారు. ఏజెన్సీ ప్రాంతాలలో కలెక్టర్ (ఏజెంట్) అనుమతి లేకుండా గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరగడానికి వీలులే దన్నది ఈచట్టం సారాంశం.1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1917చట్టాన్ని సవరించి 1959 (ఎ.పి.ఎస్.ఎ.ఎల్.టి.ఆర్. చట్టం) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ప్రాంతాల భూమి బదలాయింపు నియంత్రణ చట్టాన్ని చేశారు.ఇందులో గిరిజనుల నుండి గిరిజనే తరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి బద లాయింపు జరగడానికి వీల్లేదని,జిల్లా కలెక్టర్ అనుమతి సైతం లేదన్నది స్పష్టం.1963 నుండి ఈ చట్టాన్ని తెలంగాణ జిల్లాలలోని షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపజేశారు.దీనితో ఆదివాసిల భూములు ఆక్రమణలు అన్యాక్రాం తంకు గురికాకుండా రక్షించబడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియాలో వలస గిరిజనేతరులు బినామీల పేర్లతో ఆదివాసుల భూములను చట్ట విరుద్ధంగా విక్రయిస్తూ…ఆదివాసుల హక్కులకే భంగం కలిగిస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులు సృష్టిస్తున్న ఆకృత్యాలపై ప్రభుత్వం,పాలకులు,ఆదివాసి ప్రజాప్రతినిధులు పట్టించుకునే నాధుడే కరువై యుండని ఆదివాసీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజ నేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆభూమిపై కొనుగోలు దారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
నాడు చోటుచేసుకున్న వాస్తవ పరిస్థితులు అంటే 1960 దశకంలో నక్సల్స్ నేతృత్వంలో జరిగిన పీడిత ప్రజల శ్రీకాకుళ గిరిజన తిరుగుబాటు వంటి పోరాటాల దాకా రాష్ట్రం లో గిరిజనుల యోగక్షే మాలు కనుక్కున్న వాళ్లు అతితక్కువలో తక్కువే. ఆ తర్వాత మాత్రం ఆదివాసుల మంచి చెడుల గురించి చర్చించడం,కొత్త చట్టాలు, కొత్త సంస్థలు వచ్చాయి.అందులో ఒకటి రెగ్యులేషన్ వన్ ఆఫ్ 1970, ఇది 1959 నాటి చట్టాన్ని సవరించి రెండు బలమైన మార్పులను ప్రవేశపెట్టింది.
1). ఇక మీదట షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల నుండి గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులే కాదు, గిరిజనేతరుల నుండి గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులు కూడా చెల్లవు.
2). షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి కలిగి ఉన్న గిరిజనేతరులు ఆ భూమిని తాము అక్రమంగా సంపాదించుకోలేదని తామే రుజువు చేసు కోవాలి. అంతవరకు అది గిరిజనుల భూమిగా భావించబడుతుంది. అంటే రుజువు చేసుకునే బాధ్యత (బర్డెన్ ఆఫ్ ప్రూఫ్) గిరిజనేతరుల మీదనే ఉన్నదనేది తేటతెల్లం. దీని ఫలితంగా గిరిజనుల నుండి ఫిర్యాదు లేకుండానే సంబంధిత ప్రభుత్వ అధికారి షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి ఉన్న గిరిజనేతరు లందరికీ నోటీస్ జారీ చేయవచ్చును.నీ భూమి అక్రమంగా సంపాదించుకున్నది కాదని నిరూపించుకోమ్మని అడగవచ్చును.సమాధా నం సంతృప్తికరంగా లేకపోతే ఆభూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని గిరిజనులకు ఇవ్వవచ్చునన్నది స్పష్టం.1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆభూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆభూమిపై హక్కులు కోల్పోతారని 1993లోరాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
షెడ్యూల్డ్ ప్రాంతంలోగల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులకు బదలాయించడం చెల్లదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 1/70 భూ నిబం ధనల కింద గిరిజనేతరునిగానే భావించాలని 1997లో సమతా మరియు మైనింగ్ కంపెనీకి మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమి నుండి వారిని తొలగించడం లేదా వారి అటవీ భూమి హక్కుల్లో జోక్యం చేసుకోవడం, గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి జీవనోపాధి అయిన వ్యవసాయం చేసుకునే భూమిని సొంతం చేసుకోవడం కూడా అత్యాచారమే అని కొత్తగా రూపొందిం చిన సవరణ చట్టం 2015 తెలియజేస్తుంది. ఆదివాసుల కోసం ఎంతో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందరో ఆదివాసి పోరాట యోధులు, బుద్ధి జీవులు నేతృత్వంలో 1960 దశకంలో నాడు ఏ అమాయకపు ఆదివాసీల కోసమైతే పోరాటాలు జరిగాయో ఆదివాసీల ప్రజల రక్షణ కోసంఎల్టిఆర్ చట్టం,1/70యాక్ట్, పేసా గ్రామ సభ,వడ్డీ వ్యాపారాలని నిషేధిత చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాలను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాలలో అంగ బలం,ఆర్థిక బలం, రాజకీయ బలం పెంచుకొని ఆదివాసుల హక్కులను,చట్టాలను లెక్కచేయకుండా ఆదివాసుల భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని వారే నిజమైన హక్కు దారులుగా రాజ్యమేలుతున్నారు. ఆదివాసీ ప్రాంతాలలో హక్కులు అడ్డొస్తున్నాయన్న పేరుతో గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతా భూములు,ఉద్యోగ అవకాశాలను దెబ్బతీ సేందుకు 1998లో జీవో నెంబర్ 275ను వలస గిరిజనేతరులు ఆంధ్రప్రదేశ్ అడ్మిని స్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి రద్దు చేయించారు. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటివ్ అధి కారి,గిరిజన సంక్షేమశాఖ సిఫారసులు మేరకు 275 జీవో స్థానంలో జీవోనెంబర్ 3ను జన వరి 2000 సంవత్సరం జారీ చేయడం జరిగి నది.వలస వాదుల కుట్రలు,కుయు క్తులతో జీవో 3ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు 22 ఏప్రిల్ 2020 రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని చదువుకున్న ఆదివాసి యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు.దానిని కొనసాగింపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు కాదు అంటూ మైదాన ప్రాంతానికి సమీపంలో ఉన్న సుమారు ఆరు గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించారు. ఇంతటితో ఆగకుండా షెడ్యూల్ ఏరియా హక్కులతో భంగం వాటిల్లుతుందని గిరిజనేతరులకు మూకుమ్మడిగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి 1/70 చట్టం సవరించి భూములపై మాకు హక్కులు కల్పించాలని 1684 మంది గిరిజ నేతరులు పిటిషన్ దాఖలు చేశారు.ములుగు జిల్లా ఏటూరు నగరంలో 140ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకు నేందుకు గిరిజనేతరులు ప్రయత్నించగా స్థానిక ఆది వాసులు తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.144సెక్షన్ విధించి పోలీ సులు అక్కడ పరిస్థితులను చక్కబెట్టారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలలో సుమారు 20వేల ఎకరాల పట్టా భూములు గిరిజనేత రుల చేతిలో పరాయికరణకు గురైనట్లు అధికారికంగానే లెక్కలు ఉన్నాయి. ఇక పోడు భూముల విషయానికి వస్తే పట్టా భూములు వలసవాదులు ఆక్రమించుకున్నారని జీవన ఉపాధి కోసం పోడుభూమి సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారుల ఆగడాలతో ఆదివాసీ ప్రజల జీవనం అందాకారమవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా చలామణి అవుతున్న గిరిజనేతరుల చేతుల్లోనే వందల ఎకరాల పోడు భూములను ఆక్రమించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆదివాసులు పోడు సాగు భూములకు హక్కు పత్రాలు కావాలని దరఖాస్తు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 12 వేల మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తెలంగాణలో పోడు సాగు పోరు రగడ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. నేడు ఆదివాసుల దుస్థితి ఊర్లో ఉన్నయ్యారు… అడివిలో బతకనీయరు అన్న చందంగా మారింది. ఆదివాసుల అభివృద్ధి కోసం ఎన్ని చట్టాలు ఉన్నా అవి అమలకు నోచుకోనంత కాలం ఆదివాసీ ప్రజలు అన్యా యాలకు, అక్రమాలకు, వలస గిరిజనే తరుల కుట్రలకు బలవుతూనే ఉంటారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాజ్యాంగ బద్ధ పదవిలో కొనసాగుతున్న దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి,రాష్ట్ర గవర్నర్ 5వ షెడ్యూల్ భూభాగం ఏజెన్సీ ప్రాంత పరిధిలోని విధులు నిర్వహిస్తున్న అధికారులు ఆదివాసీ ప్రజల భూ సమస్యలను జాతి సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఆదివాసి ప్రజల అస్తిత్వానికే ప్రమాదం పొంచి ఉంది.
జాతీయ సమస్యగా చూడాల్సిన సమయం
ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే ఆది వాసీల భూమి, అటవీ వనరులు, జీవన విధా నాన్ని రక్షించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ మైన బాధ్యత. అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు లో తీవ్రమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు భూ సమస్యలను కేవలం రెవెన్యూ వివాదా లుగా లేదా ఒక నిర్దిష్ట జాతికి సంబంధించిన అంశాలుగా చూడకుండా,దేశ రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు సంబంధించిన జాతీయ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది.ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కావడం,నకిలీ పత్రాల ఆధారంగా భూముల బదిలీలు జరగడం,న్యాయపరమైన పరిష్కారా ల్లో జాప్యం,చట్టాల అమలులో నిర్లక్ష్యం వంటి కారణాలవల్ల లక్షలాది ఆదివాసీ కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నాయి.భూమి అనేది ఆదివాసీ సమాజానికి కేవలం ఆస్తి మాత్రమే కాకుండా,అది వారి జీవనాధారం, సంస్కృతి,సంప్రదాయం,సామాజిక అస్తిత్వానికి మూలస్తంభంగా భావించాలి.భూమి కోల్పోతే వారి ఆర్థిక భద్రత మాత్రమే కాదు, వారి సాంస్కృతిక గుర్తింపు కూడా ప్రమాదంలో పడుతుంది.అందుకే ఈ సమస్యను ఒక ప్రాంతీయ లేదా సామాజిక సమస్యగా కాకుండా జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి.ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో అమలులో ఉన్న భూరక్షణ చట్టా లు,నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా అధి కారులు చర్యలు తీసుకోవాలి.గ్రామసభల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు అత్యవసరం.అదే సమయంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ వేత్తలు,సామాజిక కార్యకర్తలు కలిసి ఆదివాసీ హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలి. పరిపాలనలో పారదర్శకత,జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉంది.అధికారులు చట్టాలను అమలు చేసే యంత్రాంగంగా మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతగల ప్రజాసేవకులుగా వ్యవ హరించాలి.అప్పుడే ఆదివాసీ ప్రజల భూమి, హక్కులు,అస్తిత్వం,భవిష్యత్తు సురక్షితమ వుతాయి.రాజ్యాంగం కల్పించిన రక్షణలు కూడా నిజమైన అర్థంలో సాకారమవుతాయి.- డా.సాగబోయిన పాపారావు,(వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసీ విద్యార్థి సంఘం) -వ్యాసకర్త : ఆదివాసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్,సెల్:9441288991
