కేసుపల్లి వాసి డాక్టర్ సాగబోయిన పాపారావు..
ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఓబాలుడు…ప్రభుత్వ పాఠశా లలో అక్షరాలు నేర్చుకున్నాడు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువును కొనసాగించాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆకలి బాధలు, అవమానాలు, అవహేళనలు ఎదురైనా చదువును మాత్రం వదల్లేదు. అదే పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా అందుకున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ సాగబోయిన పాపారావు
ఓయూ నుంచి అరుదైన గౌరవం
ఉస్మానియా విశ్వవిద్యాలయం85వ స్నాతకో త్సవ కార్యక్రమం సెప్టెంబర్ 8న హైదరా బాద్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనం గా జరిగింది. తెలంగాణ గవర్నర్,ఉస్మాని యా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల అతిథిగా,భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఇల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పరిశోధనపూర్తి చేసిన విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ములుగారం కుమార్ సమక్షంలో డాక్టర్ సాగబోయిన పాపారావు తన పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.
ఆదివాసీ అభివృద్ధిపై పరిశోధన
ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషి యాలజీ విభాగంలో ‘సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్-ఏ సోషియాల జికల్ స్టడీ ఆఫ్ ఐటీడీఏ భద్రాచలం తెలంగాణ” అనే అంశంపై పాపారావు పరిశోధన చేశారు.ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి,గిరిజన ఉప ప్రణాళిక,ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సామాజిక పరిస్థి తులు,అభివృద్ధి పథకాల ప్రభావం వంటి అంశాలను సామాజిక శాస్త్ర దృక్కోణం లో ఆయన అధ్యయనం చేశారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అనుభవించిన వ్యక్తిగా,అదే సమాజంపై పరిశోధన చేయడం ఆయన విద్యా ప్రయాణానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలి..
తాను సంపాదించిన జ్ఞానం కేవలం వ్యక్తిగత ప్రగతికే పరిమితం కాకూడదని ఆయన స్పష్టం చేశారు.“సాధించినజ్ఞానాన్ని, పొందిన అనుభవాన్ని భవిష్యత్తులో సమా జంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం,అవగా హనకోసం వినియోగిస్తాను.ఆదివాసీలు, అణగారినవర్గాల సామాజిక పరిస్థితులపై మరింత అధ్యయనంచేసి,వారి సమస్యలను సమాజం ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను”అనిడాక్టర్ పాపారావు తెలి పారు.109 సంవత్సరాల చరిత్రలో ఉస్మా నియా విద్యాలయం సోషి యాలజీ విభాగం నుండి మొట్టమొదటి ఆదివాసి పరిశోధ కుడిగా ఆదివాసి ప్రజల సామాజిక పరిస్థి తులపై అధ్యయనం చేసిన తొలి వ్యక్తిగా కేసుపల్లి వాసి సాగబోయిన పాపారావు కావడం ఓయూ చరిత్రలో సువర్ణ అక్షరా లతో లిఖించబడిన పేరుగా ఎంతో ప్రాధా న్యతను సంతరించుకుంది.ఈ అరుదైన అవకాశాన్ని పొందే క్రమంలో అనేక కష్ట నష్టాలను,ఆకలి బాధను,అవమానాలను, అవహేళనలను అధికమించి సమస్యలకు ఎదురొడ్డి లక్షసాధన కోసం ఎంతటి కష్టా నైనా ఇష్టంగా స్వీకరించి నందుకు నేడు నాకు లభించిన ఈగుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. సాధించిన జ్ఞానాన్ని,పొందిన అనుభవాన్ని భవిష్యత్తులో సమాజంలో అణ గారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం అవగాహనతో ముందుకు సాగుతానని తెలిపారు.- డాక్టర్.సాగబోయిన పాపారావు
