‘ఏఐ’..తో పర్యావరణానికి ప్రమాదం
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి.వందల కోట్లు ఖర్చుచేసి కొత్త ఫీచర్ల తో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందు బాటులోకి తెస్తున్నాయి. వినియోగ దారులు కూడా ఏఐని ఇష్టారీతిన వాడేస్తున్నారు. చిన్న మెయిల్ చేయ డానికి కూడా ఏఐపైనే ఆధారపడు తున్నారు. ఫోటోలను,వీడియోలను సృష్టిస్తున్నారు.చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగు తూ టైమ్‌పాస్ చేస్తున్నారు. అయితే, ఏఐ కూడా అమూల్యమైన వనరేనని,దీనిని బాధ్యతగా, పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ ఉచితంగానే సేవలు అందిస్తున్నప్పటీ పర్యావరణంపై మాత్రం భారం వేస్తున్నదని చెప్తున్నారు.అయితే శక్తివంతమైన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల వేగవంతమైన అభివృద్ధి,వినియోగం ప్రపంచా నికి కొత్త అవకాశాలు తెస్తున్నప్పటికీ, దీని వల్ల విద్యుత్ వినియోగం,నీటి అవసరం కార్బన్ ఉద్గా రాలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – గునపర్తి సైమన్
పర్యావరణానికి ప్రమాదమేంటి?
డాటా సెంటర్లలోని సూపర్ కంప్యూటర్ల ద్వారా ఏఐ పని చేస్తుంది. మనం ఏఐని అడిగే ప్రతి ప్రశ్నను ప్రాసెస్ చేసి సమాధానం ఇచ్చేది సూపర్ కంప్యూటర్లే. సూపర్ కంప్యూటర్లు పర్యావరణానికి హానికరంగా మారిన శిలాజ ఇంధనాలతో పని చేస్తున్నాయి. వీటి కోసం అణు ఇంధనాన్ని కూడా వినియోగిస్తుంటారు. దీనిపై ఇటీవల హగ్గింగ్ ఫేస్ అనే ఓసంస్థ అధ్య యనం చేసింది.కేవలం చాట్‌జీపీటీకి చెందిన జీపీటీ3 మాడల్‌కు శిక్షణ ఇచ్చే క్రమంలో 500 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయ్యిందని ఈ అధ్యయనంలో తేలింది.ఒక పెట్రోల్ కారు 10లక్షల కిలోమీటర్లు నడిస్తే ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానం.
నీటి కొరత తప్పదా ?
డాటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లు పని చేసేట ప్పుడు విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తగ్గించేందుకు భారీగా మంచినీరు అవసరమవు తుంది. దీంతో ఏఐ వినియోగం ఎంతగా పెరిగితే నీటి కొరత కూడా అంతగా పెరిగే ప్రమాదం ఉం దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాటా సెంటర్లలో వినియోగించే నీటిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఏ కంపెనీ కూడా డాటా సెంటర్లకు ఎంత నీటిని వినియోగిస్తున్నాయని వెల్లడించడం లేదు. అయితే,అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న డల్లెస్ పట్టణంలో గూగుల్‌కు ఒక డాటా సెంటర్ ఉంది.ఈ మొత్తం పట్టణానికి సరఫరా అవుతున్న నీటిలో పావు వంతు ఈడాటా సెంటర్‌కు అవస రమవుతున్న విషయం ఓ కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏఐ అందుబాటులోకి రావడం వల్ల సాంకేతికంగా కొన్నిలాభాలు ఉన్నాయి. ఇదే సమ యంలో పర్యావరణానికి ఏఐ మరింత భారంగా మారింది. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంవల్ల డాటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లపై భారం తగ్గుతుందని, ఇది పర్యావరణానికి మరో నష్టం చేసేదిగా మార కుండా ఉంటుందని పర్యావరణవేత్తలు అప్రాయ పడుతున్నారు.ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యు త్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్వెంబు తాజాగా హెచ్చ రించారు. విద్యుత్ గ్రిడ్స్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
2023తో పోలిస్తే ఏథెన్స్,జార్జియాలో ప్రస్తుతం విద్న్యత్ బిల్లులు ఏకంగా 60శాతం మేర పెరిగా యని శ్రీధర్ వెంబు అన్నారు.ఏఐ డాటా సెంటర్లు పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. డాటా సెంటర్ల జీపీయూ ఖర్చులు భరించగలిగినా విద్న్య త్ బిల్లులను తట్టుకోవడం మాత్రం ఎవ్వరి తరం కాదని చెప్పారు.చివరకు ఈభారం సామాన్య కుటుంబాలు,పరిశ్రమలపై పడుతుందని హెచ్చ రించారు.ఇంధన వినియోగంలో ప్రస్తుతం అందు బాటులో ఉన్న ఏఐ సాంకేతిక ఏమాత్రం సమర్థ వంతమైనది కాదని ఆయన అన్నారు.కాబట్టి, భారత్ తన డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుపై లోతుగా ఆలోచించాలని సూచించారు. శక్తివనరు లను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ఏఐ వ్యవస్థల అవసరం ఉందని అన్నారు. ఏఐ కంప్యూటేషన్లో మౌలిక మార్పులు రావాలని అభి ప్రాయపడ్డారు.నిపుణుల అంచనా ప్రకారం, భారత్‌లో 2030 నాటికి ఏఐ విద్యుత్ వినియోగం ఏటా 40 నుంచి 50టెర్రావాట్ అవర్‌కు చేరుకుం టుంది.గృహ వినియోగానికి,పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా చేయలేక ఇబ్బంది పడే గ్రిడ్స్‌పై ఇది భారం మరింత పెంచుతుంది. భారత్ అప్పటికి 777 జీడబ్ల్యూ విద్యుత్ ఉప్పత్తికి ప్రయత్నిస్తోంది. అయితే, పర్యావరణ ఇంధన ఉత్పత్తి టార్గెట్స్‌లో ఏమాత్రంలోటు తలెత్తినా ప్రాంతీ యంగా విద్యుత్ కొరత తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఐడాటా సెంటర్స్ ఎక్కువగా ఉన్నా ప్రాంతాలపై ప్రభావం పడుతుంది.ప్రాంతాల వారీగా కొరత వస్తుంది. చివరకు ఇది విద్యుత్ కోతలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇది చాలదన్నట్టు ప్రాంతీయ గ్రిడ్స్ విద్యుత్ డిమాం డ్‌ను తట్టుకోలేక కోతలకు తెరతీయవచ్చని నిపుణు లు హెచ్చరిస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్లకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి` కేంద్రానికి ఈ.ఏ.ఎస్. శర్మ విజ్ఞప్తి.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ మూల్యాంకన సంస్థ (APSజుIAA) జారీ చేసిన పర్యావరణ అనుమతు లను వెంటనే రద్దు చేయాలని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ కేంద్ర పర్యావ రణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (వీజుఖ్పు్పుీ)ను కోరారు. ఆనందపురం మండలంలోని విజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ (Vవీణ్పుPL), రాంబిల్లి ప్రాంతంలోని వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ (V=ణ్పుPL)లకు రాజకీయ ఒత్తిడిలో తొందరపాటుగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.గూగుల్ సంస్థ తన అను బంధ సంస్థ రైడెన్ మరియు అదానీ గ్రూప్ భాగస్వా మ్యంతో విశాఖపట్నం పరిసరాల్లో 600 ఎకరాలకు పైగా మూడు ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టు ను అభివృద్ధి చేస్తోందని శర్మ పేర్కొన్నారు. అయితే మొత్తం ప్రాజెక్టును సమగ్రంగా పరిశీలించకుండా, భాగాలుగా విభజించి విడివిడిగా పర్యావరణ అను మతులు ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. రాంబిల్లి డేటా సెంటర్ ప్రాజెక్టు సమీపంలో ఆరు రిజర్వ్ అడ వులు ఉన్నాయని,ఆ ప్రాంత భూగర్భ జలాలు ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ, పర్యావరణ ప్రభావ మూల్యాంకన (జుIA) నివేదికలో ఈఅంశాలను పరిగ ణనలోకి తీసుకోలేదని విమర్శించారు. 2006 జుIA నోటిఫికేషన్ ప్రకారం,రక్షిత అడవులు లేదా కాలుష్య ప్రభావిత ప్రాంతాలకు 10కి.మీ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను “కేటగిరీ’గా పరిగణించి కేంద్ర పర్యా వరణ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపాల్సి ఉంటుందని శర్మ గుర్తు చేశారు. అయితే APSజుIAA వాటిని తప్పుగా “కేటగిరీ-డీ” ప్రాజెక్టులుగా పరిగ ణించి స్వయంగా అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు.రాజకీయ నాయకులు ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో చట్టపరమైన నిబంధనలను పక్కనబెట్టారని ఆయన అన్నారు. Vవీణ్పుPL,V=ణ్పుPLలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసి,సమగ్ర పర్యావరణ పరిశీలన కోసం కేంద్రమంత్రిత్వశాఖకు పంపాలని ఈ.ఏ. ఎస్.శర్మ విజ్ఞప్తి చేశారు.
పొంచి ఉన్న రిస్క్‌లు
ఇది కృత్రిమ మేధ (ఏఐ) యుగం.ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ అత్యంత వేగంగా అన్ని రంగాల్లో వేళ్లూనుకుంటోంది. ఏఐ టూల్స్ చాలా పనులను మనుషుల కంటేఅత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.దీంతో ఇప్పటికే చాలారంగాల కంపెనీలు వీటి వినియోగాన్ని మొదలుపెట్టాయి. నాణేనికి బొమ్మా,బొరుసు ఉన్నట్టే,ఏఐ టెక్నాలజీకి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఉన్నాయి. పక్షపాతం:ఏఐ టెక్నాలజీని,ఏఐ టూల్స్‌ను తయా రు చేసేది మనుషులే. అందుకే వాటిపై మనిషి ఆలోచనా విధానం ప్రభావం ఉంటుంది. మనుషు లు పక్షపాత ధోరణితో ఆలోచిస్తారు. అందుకే మనుషుల చేతిలో పురుడు పోసుకున్న ఏఐ టూల్స్ కూడా పక్షపాతంతోనే పనులు చేస్తాయి.ఉదాహరణల్లోకి వెళితే, దరఖా స్తుదారులను ట్రాక్ చేసే ఏఐ టూల్ అనేది ‘మహి ళల’పై వివక్ష చూపొ చ్చు. ‘ప్రెడిక్టివ్ పోలీసింగ’ టూల్ అన్యాయంగా అణగారిన వర్గాలనులక్ష్యంగా చేసుకునే ముప్పు ఉం టుంది.ఏఐ ఫలితాలపై సంస్థలు, వాటిలోని ఉద్యో గులు గుడ్డిగా తుది నిర్ణయానికి రాకూడదు. వాటిని తనిఖీ చేసేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకో వాలి.పారదర్శక ఏఐ ఫలితాలకు నిర్దిష్ట ప్రమాణాలను నిర్దేశించు కోవాలి.వాటికి అనుగుణంగా ఏఐ ఫలితాలు వచ్చాయా లేదా అనేది చెక్ చేయాలి.ఏఐ ఫలితాల వల్ల ఏఒక్క వ్యక్తి లేదా వర్గం నష్టపోకుండా జాగ్రత్త పడాలి.సరైన ఏఐ లెర్నింగ్ మోడల్స్‌ను కంపెనీలు వినియోగించాలి.
సైబర్ సెక్యూరిటీ ముప్పులు : ప్రస్తుతం విని యోగంలో ఉన్న జనరేటివ్ ఏఐ టూల్స్‌లో 24శాతమే సురక్షిత మైనవి.ఏఐ టూల్స్‌పై సైబర్ దాడులకు పాల్పడేందుకు హ్యాకర్లు యత్నించే ముప్పు ఉంటుంది. ఆటూల్ను హ్యాక్ చేసి, అందులోని విలువైన సమాచారాన్ని దొంగిలిం చడం వారి లక్ష్యంగా ఉంటుంది. అదే జరిగితే కంపెనీ వద్దనున్న వ్యక్తులు, ఇతరత్రా సంస్థల సమా చారం గోప్యత, భద్రతలకు భంగం వాటిల్లు తుంది. సంస్థలకు ముందస్తుగా ఏఐసేఫ్టీ, సెక్యూ రిటీ వ్యూహం ఒకటి ఉండాలి. ఇందులో భాగం గా ఏఐ టూల్స్‌ను టెస్టింగ్ చేసి, వాటిలో ఉన్న రిస్కీ విభాగాలను తొలుత గుర్తించాలి. ‘సెక్యూర్ బై డిజైన’ పద్ధతిలో ఏఐ ట్రైనింగ్ డాటాను భద్రంగా ఉంచుకోవాలి.తద్వారా ఏఐ టూల్స్ వినియోగంలో రిస్క్ తగ్గుతుంది.ఒకవేళ సైబర్ దాడి జరిగితే సమర్ధంగా ఎదుర్కొనే సంస్థాగత టీమ్‌ను సమాయత్తం చేసుకోవాలి.
డాటా ప్రైవసీ సమస్యలు : చాలా జనరేటివ్ ఏఐ యాప్‌లలో లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ ఎలఎంలు) ఉంటాయి. వర్చువల్ అసిస్టెంట్లు, కన్వర్జేషనల్ ఏఐ ఛాట్‌బోట్ వంటి వాటిలోనూ ఎలఎలఎం ఏఐ మోడల్సే ఉంటాయి. చాలా భారీ ట్రైనింగ్ డాటాను క్రోడీకరించి ఎలఎలఎంలను తయారు చేస్తారు. ‘వెబ్ క్రాలర’ అనే టూల్స్చాలా వెబ్సైట్లలోకి వెళ్లి ఈ డాటాను సేకరిస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని వెబ్ సైట్ల అనుమతిని పొంద కుండానే,వాటిలోని సమా చారాన్ని వెబ్ క్రాలర్లు తీసుకుంటాయి. ఇలాంటప్పుడు ఆ సమాచారం లోకి వ్యక్తిగత వివరాలు చేరిపోవచ్చు. దీనివల్ల ఆయా వ్యక్తుల గోప్యతకు భంగం కలుగు తుంది. డాటాను ఏపద్ధతిలో సేకరించారు?ఎప్పుడు సేక రించారు? అనే సమాచారాన్ని వినియోగ దారు లకు తెలియజేయాలి. ఆసమాచారాన్ని ఎలా స్టోర్ చేయాలి?ఎలా వినియోగించాలి? అనే దానిపైనా యూజర్లకు సరైన సలహాలు ఇవ్వాలి.
