ఎల్ నినోతో వర్షపాతంలో తీవ్ర లోటు

ఉత్తరాంధ్ర,ఉభయ గోదావరి జిల్లాలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవగా రాష్ట్రంలోని మిగిలిన ఇతర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ పంటలు పూర్తిగా చేతికి వచ్చేందుకు సరిపోవని, మరింతగా కుర వాలని ఆకాంక్షిస్తున్నారు. ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంవల్ల ఖరీఫ్ సీజన్ తీవ్రంగాదెబ్బతింది.సాధారణ స్థాయి లతో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 21 లక్షల ఎకరాల మేర తగ్గింది. అడపాదడపా కురిసిన వర్షాల సమయంలో వేసిన పంట లు తీవ్రమైన ఎండల కారణంగా వాడి పోయాయి.పత్తి, కంది పంటల విషయం లో రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థి తిని ఎదుర్కొంటున్నారు. సాగునీటి వ్యవస్థ లు,చెరువుల ఆఖరి భాగంలో ఉన్న పొలా లకు నీరు అందకపోవడంతో వరి పంటలు కూడా ఎండిపోతున్నాయి. – (విజయ కుమార్ )
రాష్ట్రవ్యాప్తంగా497మండలాల్లో వర్షపాతం లోపం నమోదు కాగా 125 మండలాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కేవలం 66మండలాల్లో మాత్రమే సాధా రణ వర్షపాతం నమోదైంది.ముఖ్యంగా 11 జిల్లాల్లోని ఏఒక్క మండలంలోనూ సాధా రణ వర్షపాతం నమోదు కాలేదు.అయితే బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార ణంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయని రైతులు ఆశి స్తున్నారు.తక్కువ వర్షపాతం,తీవ్రమైన ఎండల కలయిక వల్ల,చాలా వరకు పంటలు ఇప్ప టికే వాడిపోవడం ప్రారంభించాయి. దీనివల్ల పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందే అవకా శాలు చాలా తక్కువగా ఉన్నాయి.
వ్యాపక పంట నష్టం : రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు చేశారు. ఇందులో వరిసాగు 31లక్షల ఎకరాల్లో జరి గింది.గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలోని కొన్ని ప్రాంతాల్లో సాగుజరిగింది.కృష్ణా డెల్టాలో సాగు కు పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీరు లభిం చింది. సాధారణసాగు విస్తీర్ణంలో కేవలం 84% మేర మాత్రమే వరినాట్లు పడ్డాయి.ఈవిస్తీర్ణంలో కూడా నీటి కొరత కారణంగా ఆఖరి భాగంలో ఉన్న పొలాల్లో నేల బీటలు వారింది. ఇటీవలి వర్షాలు కొంత ఊరటని చ్చినప్పటికీ పంట కోత దశ వరకు నీటి సరఫరా కొనసాగితే తప్ప మంచి దిగుబడి సాధించడం అనిశ్చి తిగానే ఉంది.కృష్ణా నదికి నీటి ప్రవాహం లేకపోవడంవల్ల,నాగార్జున సాగర్ ఆయ కట్టు పరిధిలో వరినాట్లు వేయలేదు. సాధా రణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే,పల్నాడు జిల్లాలో 29% ప్రకాశం జిల్లాలో 30% విస్తీర్ణంలో మాత్ర మే వరిసాగు జరిగింది. రాయలసీమ జిల్లాల్లో కూడా వరిసాగు గణ నీయంగా తగ్గింది.బోరుబావులు ఎండి పో వడంతోకొన్నిచోట్ల వరినారు వాడిపోతోంది. 10లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినప్ప టికీ, మొక్కలు సరిగ్గా పెరగలేదు.అవి కేవలం ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తులోనే ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది.ఇటీవలి వర్షాలు పత్తి దిగుబడిపై రైతుల్లో కొంత ఆశను కలిగించాయి.దాంతో వారు ఇప్పుడు ఎరువులు వేస్తున్నారు. అయితే వర్షాలు మళ్లీ కురవకపోతే వారు తమ పెట్టుబడిని కోల్పో యే ప్రమాదం ఉంది.కందులు సాగు చేసిన 7.13లక్షలఎకరాలలో,90%పంట ఎండి పోయింది.ప్రస్తుత వర్షాలు కురిసి నప్పటికీ పంట చేతికి వచ్చే అవకాశం తక్కువగానే ఉంది.రైతులు నర్సరీలలో మిరప నారును పెంచి నాటారు.నాటడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా తరలించారు.కానీ తీవ్ర మైన ఎండలవల్ల మొక్కలు ఎండి పోతు న్నాయి. దీనివల్ల రైతులు కొత్త నారును తెచ్చి నాటాల్సి వస్తోంది. ఇటీవలి వర్షాలు కొంత అనుకూల పరిస్థితులను కల్పించినప్పటికీ, సాగునీటి ప్రాజెక్టులలోకి నీటి ప్రవాహం లేకపోవడంతో మిరప సాగుకునీటిని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే ప్రశ్న రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఉద్యాన పంటలకు క్లిష్ట సమయం: రాష్ట్ర వ్యాప్తంగా 8.91లక్షల హెక్టార్లలో సాగు చేసిన ఉద్యాన పంటల పరిస్థితి అనిశ్చి తంగా ఉంది. అనేక ప్రాంతాల్లోని తోటలు ఇప్పటికే ఎండిపోవడం ప్రారంభించాయి. వాటిని కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నప్పటికీ,ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పంట లకు సాగునీటి సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం రూ.190.70కోట్లు కేటాయిం చింది.మామిడి తోటలకు రక్షణ నీటి తడు లు అందించడానికి అత్యధికంగారూ. 99. 78కోట్లు అవసరమవుతాయని అంచనా.
21.28లక్షల ఎకరాలు సాగుకు నోచు కోలేదు:
రాష్ట్రవ్యాప్తంగా 21.28లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఖాళీగా ఉండి పోయిం ది.వర్షాలు కురిస్తే, ఈభూముల్లో ప్రత్యా మ్నాయ పంటలను వేయాల్సి ఉంటుంది. దీనికి అనుకూలంగా రాయితీ ధరలకు విత్త నాలను అందించడానికి ప్రభుత్వం ఇటీవల అదనంగా రూ.90కోట్ల బడ్జెట్‌ను మంజూ రు చేసింది. పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 80% రాయితీతో,అలాగే శనగవిత్త నాలను 25%నుంచి 50%వరకు రాయితీతో అందించనున్నారు. సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంతో పోలిస్తే, ప్రకాశం జిల్లాలో 18%, మార్కాపురంలో 29%,అన్నమయ్యలో 29%,అనకాపల్లిలో 31%,చిత్తూరులో 33%,విశాఖపట్నం జిల్లాలో 44% భూమిలో మాత్రమే పంటలు వేశారు.
గత రెండు రోజులుగా కొంతఉపశమనం:
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఎండిపోతున్న బత్తాయి,మామిడి దానిమ్మ చెట్లకు ప్రాణం పోశాయి.ఈవర్షం కురవక పోయి ఉంటే, ఆఉద్యాన పంటలపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సి వచ్చేది.ఉమ్మడి అనం తపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఉపరితల ప్రవా హానికి సరిపడా గణనీయమైన వర్షపాతం నమోదైంది.
50 ఏళ్లుగా వ్యవసాయం-ఇలాంటి కరవు ఎప్పుడూ చూడలేదంటున్న రైతులు
ఎల్‌నినో పడగ విప్పింది. వరుణుడి జాడ కని పించడం లేదు. భూగర్భ జలాలు అడుగంటు తున్నాయి. కాలువల నుంచి నీరు ఆశించలేని దుస్థితిలో పల్నాడు జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పత్తి పండేలా కనిపించడం లేదు. మిరప వల్ల డబ్బు మిగిలే మాట అటు ఉంచితే, పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నారు.
ఎల్‌నినో సెగతో పల్నాడు జిల్లా రైతులు అల్లాడి పోతున్నారు.తీవ్రవర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు చాలా కష్టంగా సాగుతోంది.చాలా మంది మాగాణిలో వరి, మెట్ట భూముల్లో పత్తి, మిరప పంటలు వేశారు.లోటు వర్షపాతం,ఎండల తీవ్రత,భూగర్భ జలాల క్షీణత వల్ల వేలాది ఎక రాల్లో సాగుచేసిన పత్తి,మిరప పంటలు దారు ణంగా తయారయ్యాయి.
ఆశాజనకంగా లేని దిగుబడి:
నీటి జాడ లేక పత్తి పంట నిలువునా ఎండి పోతుంది. సాధారణంగా పత్తి ఏపుగా పెరిగితే, ఎకరాకు10నుంచి12క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.కానీ ప్రస్తుతంపత్తి మొక్క మోకాళ్ల ఎత్తుకే పరిమితమైంది.దిగుబడి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.పూత దశలోనేపూలు రాలి పోతున్నాయి.ఎకరాకు కనీసం2క్వింటాళ్లు పండే పరిస్థితి కూడాలేదని రైతులు చెబుతు న్నారు.మరోవైపు తెల్లదోమ,పేనుబంక, తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగులు పంటను చుట్టుముడుతున్నాయని రైతులు చెబుతున్నారు.అడపాదడపా వర్షాలు పడ టంతో రైతులు ధైర్యం చేసి మిరప పంట వేశారు. ఆ తర్వాత వానల్లేక, బోర్లలో నీరు అడుగంటిపోవడం, గరిష్ట ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు వాడిపోతున్నాయి.పెట్టుబడి భారీ గా పెట్టామని,పంట చేతికొచ్చే పరిస్థితి కని పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“వర్షాలు లేక పత్తి మొక్కలు బత కడమే కష్టంగా మారింది. పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండా పోయింది.50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా ఇలాంటి కరవు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మిర్చి పంట కూడా ఇదే పరిస్థితిలో ఉంది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో తెలియడం లేదు.కొంతమంది లక్షలు ఖర్చుపెట్టి బావు లు తీసి కూడా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు: వర్షాభావంతో పత్తి, మిర్చి పంటలు తీవ్రం గా దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆం దోళనకు గురవుతున్నారు. నాలుగు ఎకరా ల్లో పత్తిసాగు చేసిన రైతులు ఎకరానికి సుమారు రూ.30వేల పెట్టుబడితో పాటు రూ.20 వేలకౌలు చెల్లించామని,వర్షాలు లేక మొక్కలు బతకడమే కష్టంగా మారిం దని వాపోతున్నారు.మరోవైపు క్వింటా పత్తిని రూ.6-7 వేలకే కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు లేదంటున్నారు.50ఏళ్లుగా వ్యవ సాయం చేస్తున్నా ఇలాంటి కరవు పరిస్థి తులు ఎప్పుడూ చూడలేదని రైతులు చెబుతు న్నారు. మిర్చి రైతులు కూడా పంట చేతి కొచ్చే వరకు నమ్మకంలేదని,పెట్టుబడి ఖర్చు లైనా వస్తే చాలనుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.