ఎంఎసఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం

విశాఖపట్నం, డిసెంబర్ 30 ః రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విధంగా ఎంఎసఎంఈ నానో పార్కుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, వారం రోజుల్లో అన్ని రకాల సాంకేతిక ప్రక్రియ లను పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదే శించారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధి లో ఇప్పటికే స్థలాల గుర్తింపు పూర్తయిన చోట్ల కార్యకలాపాల నిర్వహణకు చర్యలు తీసు కోవాలని,గుర్తించని అనువైన స్థలాలను గుర్తిం చాలని సూచించారు. ఉత్తర దక్షణ నియోజ కవర్గాల పరిధిలో స్థలాల గుర్తింపు పూర్తి కావాల్సి ఉందని,మిగిలిన చోట్ల పూర్తయిన్టుల ఏపీఐఐసీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసు కొచ్చారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వస తుల కల్పనతోపాటు,రవాణా సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదివ రకే చర్చించిన విధంగా ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కులో బస్టాప్‌లు ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేక బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీ ఎంసీ అధికారులకు చెప్పారు. తుంగ్లాం వద్ద రైల్వే ట్రాక్‌ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిని విని యోగించుకోవటం లేదా ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు అంశంపై రైల్వే శాఖకు లేఖ రాయా లని, తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.)పనుల్లో వేగం పెంచాలని,జూన్ తొలివారం నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
జనవరి 10 నాటికి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ పబ్లిష్ చేయాలన్నారు. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తాగునీటి వసతి కోసం ఐలా ఛైర్మన్ నివేదించగా తక్షణ చర్యలు తీసుకో వాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు.రూ.1.47కోట్లనిధుల కేటాయింపు కోసం ఏపీఐఐసీ ఎండీకి లేఖ రాయాలని స్థానిక అధి కారులకు చెప్పారు. పీఎం ఈజీ పీలో భాగంగా ఎక్కువ ప్రాజెక్టులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని,స్వయం ఉపాధి పొం దేందుకు దోహదపడాలని,మహిళల చేత యÖనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగిన ప్రాంతాల్లో ఆరు నెలల లోపు పరిశ్రమలు నెలకొల్పాలని, లేదంటే నోటీసులు జారీ చేయాలని ఏపీఐఐసీ అధి కారులను ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఆ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి.ఇటీవల దువ్వాడ వీసెజ్‌లో సినర్జీస్ డూరే అనే కంపెనీలో అనుకోని కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన బాధిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, సంబంధిత యÖనియన్ ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలకు అర్హులు, వారి నైపుణ్యా లేంటి, వారి ఆసక్తి ఏంటి తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావే శంలో పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ జడ్.ఎం. సింహాచలం, ఐలా ప్రతినిధులు, పారి శ్రామకవేత్తలు,ఇతర విభాగాల జిల్లా అధికా రులు తదితరులు పాల్గొన్నారు.– జి .ఏ సునీల్ కుమార్