పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విఫత్తులు
‘‘ పర్యావరణ విధ్వంసం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కీలక అంశం. మొన్నటి కరోనా.. నిన్నటి ఉత్తరాఖండ్ విలయం ఇవన్నీ మనుషుల ప్రాణాలను తీస్తున్నవే. అభివృద్ధి పాట పాడే ప్రభుత్వాలు, అవినీతి, అక్రమాలకు అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, కార్పొరేట్లకు పర్యావరణం గురించి పట్టడం లేదు. దీంతో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. గత అనుభవాల నుంచి మనిషి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.!’
ప్రకృతి సహజంగా ఇచ్చిన అందా లను మనుషులు చేతులారా నాశనం చేస్తున్నా డు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించ కుండా దాని చేదు ఫలితాలను, పర్యవసానా లను చవిచూస్తున్నాడు. ఇక అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం గురించి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమో లి జిల్లాలో జరిగిన జల విలయం ఇదే విష యాన్ని వేలెత్తి చూపుతున్నది. రిషి గంగ వద్ద నిర్మాణంపూర్తి చేసుకున్న11మెగా వాట్ల హైడల్ పవర్ ప్రాజెక్ట్ తనతోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకుని మునిగింది. ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీని కింద నిర్మాణంలో ఉన్న 530 మెగావాట్ల ఎన్టీపీసీకి చెందిన పవర్ ప్రాజెక్ట్ కూడా ధ్వం సం అయింది. ఈ ప్రమాదం రిషి గంగలో మంచు శిఖరం పగలడం వల్ల జరిగింది. ఐస్ లాగ గడ్డకట్టిన నదిలో వాతావరణంలో వేడి పెరిగి ఈ విలయం జరిగిందని ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తం250మీటర్ల టన్నెల్ అంటే పొడవైన సొరంగాల్లో200మంది ఉద్యో గులు ఇరుక్కుపోయారు.16మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి.16వరకు శవాలను వెలికితీశాయి. మరో 175 మంది ఆచూకీ తెలియ లేదు. ఇంకా రెస్క్యూ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు..గాయపడ్డ వారికి రూ.50వేల నష్ట పరిహారం ప్రకటించింది.
2013లోనూ ఇదే తరహాలో
2013లో ఇదే ఉత్తరాఖండ్‌లో జరిగిన కేదార్నాథ్ సంఘటన నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అప్పుడు కూడా మెరుపు వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.వేలకోట్ల రూపా యల ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, అప్పటి కప్పుడు ఏవో చర్యలను ప్రభు త్వాలు ప్రకటించడం కామన్‌గా మారింది. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనేది తాజా ఘటన చెబుతున్న సత్యం. ఎప్పటి కప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వాలు, అధికారులు చర్చిస్తారు. అయితే వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.
గుట్టలను, అడవిని నాశనం చేస్తున్నరు
ధౌలీనదిపైన నిర్మించిన హైడల్ ప్రాజెక్ట్ కింద ఎన్టీపీసీ తన ప్రాజెక్టు కడుతున్నది. దీన్ని తపోవన్‌గా పిలుస్తున్నారు. ఈడిజాస్టర్ వల్ల 15 గ్రామాల్లో ఆందోళన చెలరేగింది. గ్రామాలకు గ్రామాలు నదిలో మునిగిపోయా యి. ఏడు వరకు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి బఫర్ జోన్లో ఈప్రాజెక్టుల నిర్మా ణం చేపట్టారు. రేణిగావ్ గ్రామవాసులు హైడల్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ ఎన్నోరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన సాగించారు.పర్యావరణ పరిరక్షణ సంస్థలు.. పర్యా వరణ ప్రేమికులు కూడా దీనిని వ్యతిరే కించారు. అయినా ప్రాజెక్టు పని మాత్రం ఆగలేదు. 2013 లో ఈప్రాజెక్ట్ నిర్మాణదా రుడు సొరంగంలో ఇరు క్కుని మరణించాడు. కొద్దికాలంపాటు ఆగిన పనులు, మరో కొత్త వారికి కేటాయించడంతో తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈప్రాజెక్టు కోసం వేలాదిగా చెట్లను నరికి వేశారు. పదుల సంఖ్యలో అంద మైన గుట్టలను ధ్వంసం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుతున్న గుట్టలను, అడవిని నాశనం చేసి ప్రాజెక్టులు కడుతున్నారు.
గతం నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు
కేదార్నాథ్ ట్రాజెడీ నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో గతంలో కలపతో ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో కలప ఇండ్ల స్థానంలో కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు స్థానిక అవసరాలకోసం గుట్టల బ్లాస్టిం గ్లు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ మార్పుల కారణంగా స్నో ఫాల్ సైతం తగ్గింది. హిమాచల్ ప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్టులు కడుతు న్నారు. 2013లో కేదార్నాథ్ సంఘటన తర్వాత ఒక కమిటీ వేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్పర్ట్స్ 25 అంశాలపై సిఫారసులు అందజేశారు. ఇందులో గ్రేసియర్ బర్న్‌కు సంబంధించి మ్యాప్.. ట్రాకింగ్.. అంశాలు తెలుసుకునేలా సూచనలు చేశారు. స్నో ఫాల్ ఎంత..ఎన్ని లేయర్ల గ్రేసియర్ ఉంది.ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి లాంటి అంశా లు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ కమిటీ చేసిన కొన్ని సూచనలను అమలు చేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయలేదు. అసలు వీటన్నింటినీ పక్కన పెట్టిన కారణం వల్లే కావచ్చు ప్రమాదాలు నిరంతరంగా జరగడం మాత్రం తగ్గడం లేదు.
అడవుల నరికివేత ఆపాలి
అభివృద్ధిపేరిట అడవిని నరికేసి గుట్ట లను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అడవులను,గుట్టలను ధ్వంసం చేయడం మానేసివాటిని మరింత విస్తరించేప్రయత్నం చేయా లి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దీని కోసం వేర్లలోతువరకు వెళ్లాల్సిందే. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీచేసే బదులు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలి.పర్యావరణ విధ్వం సంవల్ల కలిగేఆపద కూడా అంతే.. హిమా లయా ల్లోని మధ్య భూభాగంలో ఉత్తరా ఖండ్ ఉంది. ఇక్కడి నుంచే పర్యావరణ పరిరక్షణ మొద లు కావాలి. గుట్టలను చెట్లను కొల్లగొట్టడంపై నిషేధం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అప్పుడే అడవు లకే కాదు మనుషుల ప్రాణాలకూ రక్షణ దొరుకు తుంది.
బఫర్ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నరు
తమ రాజకీయ అస్థిత్వం కోసం.. అధి కారాన్ని నిలబెట్టుకోవడం కోసం బఫర్ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నారు.మానవ వినాశనం జరుగు తున్నప్పటికీ ఇవి అవసరమా? అనే విషయాన్ని ఆలోచించకపోతే.. మానవుడి మీద ప్రకృతి పగ తీర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది. మన దేశంలోని పొలిటికల్ సిస్టమ్, అభివృద్ధి విలువ మనులు ఫ్రాణాలుగా మారింది. ఉత్తరాఖండ్ లో తాజా డిజాస్టర్ ఇదే విషయాన్ని చెప్పకనే చెబు తోంది.ఈవిలయంలో ఎంత మంది చనిపోయారనే దానికి సంబంధించి పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద లేదు.రికార్డులు కూడా మునిగి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటికిరాని, చేరని వారు, డ్యూటీకి వెళ్లి తిరిగి రాని వారి కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విలయం వల్ల ప్రాజెక్టుల చుట్టూ నివసిస్తున్న వారి గోస వర్ణనాతీతంగా ఉంది.
పర్యావరణ విధ్వంసం ఇకనైనా ఆపాలి
పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి జీవ నాడులు పట్టుదప్పుతున్నాయి. పల్లెలకు జీవకళ తప్పింది. ప్రకృతిని చూసే విధానంలో మార్పు రావొచ్చు కానీప్రకృతి మాత్రం మారదు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆపసకపోతే పల్లెల స్వరూపమే మారుతుంది.ఈవిధ్వంసక ప్రయ త్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి.ఈ నేపథ్యం లోనే పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధం గా సాగించే ప్రయాణం మనిషి మనుగడకు, అస్తి త్వానికి పెనుసవాలుగా మారనుంది. అభివృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణిని అడ్డుకోవాలి.అభివృద్ధిపేరుతో పచ్చని చెట్లను, అడ వులను నిర్మూలిస్తున్నారు. తద్వారా పర్యావర ణం ముప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు ఇతర నిపుణుల సూచనలను కాదని యథే చ్ఛగా కొనసాగుతోన్న పర్యావరణ విచ్ఛిత్తిని అడ్డుకో వాల్సింది ప్రజలే. ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకం వల్ల చినుకు రాలంగానే పరవశించాల్సిన భూమి మనిషి వినాశకర విధానాలవల్ల ఉష్ణతా పంతో వేడెక్కిపోతోంది.అందుకే భూమి వేడెక్కింది. సారాన్ని కోల్పోయింది.సముద్రాల,నదుల, పర్వ తాల,అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధా నాల్ని అనుసరించడం వల్ల మనం ముప్పును ఎదు ర్కోవడమే గాకుండా భవిష్యత్ తరాలకు వారస త్వంగా అందిస్తున్నాం. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రసాయన ఎరువులు, విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు- వెరసి ఓజోన్ పొరను బలహీనం చేస్తున్నాయి. ప్రకృతికీ, మానవాళికీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం మన తక్షణావసరం. వర్త మాన తరాలకే కాదు భవిష్యత్ తరాలకు ఉపక రించే విధానాలు ప్రకృతి సమ్మతంగా ఉండాలి. ప్రకృతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకృతిఒడిలో మనుషులు హాయిగా ఉం డాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాదు భావితరాలకు ఆరోగ్యకరమైన, సుందర సహజ ప్రకృతి గమనాన్ని అందించడం అవసరం. అందుకు అనుగుణంగా మన విధానాలను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. చెరువులను కాపాడు కోవడం,పశువుల సంతతిని పెంచడం,రసాయన ఎరువులను దూరం చేయడం అలవర్చుకోవాలి. పాతపద్దతుల్లోనే వ్యవసాయాన్ని సాధించాలి. సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. చెరువులను కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయ బోతున్నాయి.గొర్లు, మేకల పెంపకం, పాడి అభి వృద్ది,చెరువులపునరుద్దరణ,చేపలపెంపకం వంటి వన్నీ పర్యా వరణ హితంతో కూడుకున్నవే. అలాగే గ్రావిరీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేవే. దేశం లోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువు లన్నింటి లోనూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇక గొర్రెలు, మేకల పెంపకం, హరిత హారం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు కారణంగా పర్యావరణం పరిఢవిల్లడంతో పాటుగ్రావిరీణ ఆర్థికరంగం పుంజుకోవడం ఖా యంగా ఉంది. ఇవి దేశానికి దిశానిర్దేశం చేసేలా లబ్దిదారులు పాటుపడాలి.రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడితే పల్లె స్వరూపం మారి పచ్చ గా స్వాగతిస్తుంది.
పర్యావరణ విధ్వంసాలపై సీఎంకి లేఖ
పర్యావరణ పరిరక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై మాజీ ఐఏఎస్ అధికారి,కేంద్ర ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.ఎ.ఎస్.శర్మ నవంబరు 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు.ఆలేఖ పూర్తి సారాం శం ఇదీ..
ఎన్నో విషయాలలో ప్రభుత్వాధికారులు, వారి మీద అధికారం చెలాయించే రాజకీయ నాయ కులు,చట్టాలను,నిబంధనలను ఉల్లంఘిస్తూ,కార్పొ రేటు సంస్థలతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి, పర్యావ రణను ధ్వంసం చేసి,ప్రజలకు నష్టం కలిగించి, ఆవిషయాలలో ప్రజలు కోర్టులను ఆశ్రయించి నప్పుడు,చేసిన తప్పులు ఒప్పుకోకుండా కోట్ల రూపా యల ఖర్చు తో ఢల్లీి నుంచి పెద్ద న్యాయవాదులను రప్పించి,ఆ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రజలమీద రుద్దుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు అయినఖర్చులను,బాధ్యులైననాయకులు, అధికారులు ఎందుకు భరించడం లేదు?
ఉదాహరణకు, ముందున్న ప్రభుత్వాలు శ్రీకాకుళంజిల్లాలో,సోంపేట ప్రాంతంలో, పర్యావ రణ పరిరక్షణ చట్టాన్ని, రాష్ట్రం ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని, ఇతర నిబంధనలను ఖాతరు చేయకుండా, ఉల్లంఘించి, 2008 సెప్టెంబరులో మంచి బీల భూములు ధ్వంసం చేస్తూ, వెయ్యికి పైగా ఎకరాల భూమిని ఒకకార్పొరేట్ సంస్థకు,థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పగించడం జరిగింది. బీలభూముల మీద ఆధారపడే మత్స్యకారుల, చిన్న కారు రైతుల ఉపాధులకు నష్టం కలుగుతుందనే విషయాన్ని,బొగ్గుమీద పనిచేసే పవర్ ప్లాంట్ కార ణంగా వచ్చే కాలుష్యంవలన,ప్రజల ఆరోగ్యం క్షీణి స్తుంది అనే విషయాన్ని, ప్రజలు ప్రభుత్వం దృష్టికి పదేపదే తెచ్చినా,అప్పటి నాయకులు, అధికారులు కార్పొరేట్ సంస్థ మీద ఉన్న వ్యామోహంతో గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం,ప్రజలు అడ్డుకుంటే, వారిని పోలీసు బలగాల సహాయంతో అణిచివేసి, కొంత మందికిప్రాణనష్టం కూడా కలిగించడం, దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం స్పందించక పోవడంవలన, ప్రజాసంఘాలు కోర్టు లను ఆశ్రయించడం జరిగింది.పదేళ్లకి పైగా వ్యా జ్యాలు నడిచాయి. జాతీయ పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్ ప్రజల తరఫున తీర్పు ఇచ్చినా,అధికా రులు,నాయకులు, కార్పొరేట్ సంస్థ పక్షంలో పనిచే శారు.సలీంఅలీ సెంటర్ వంటి ప్రఖ్యాతమైన పర్యా వరణ పరిరక్షణ సంస్థ, కోర్టు ఆదేశాలకు అనుగు ణంగా సోంపేట బీలభూములు మీదఇచ్చిన రిపో ర్టు మీదకూడా,ప్రభుత్వంచర్యలు తీసుకోక పోవడం వలన, ప్రజాసంఘాలు చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కేసులో ఇచ్చినా,ఈరోజు వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం, నాయకులకు,అధి కారులకు కార్పొరేటు సంస్ధమీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం.ఈ కేసులలో, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యర్థంగా చేసిన ఖర్చులు, ముఖ్యంగా న్యాయవాదులకు ఇచ్చిన ఫీజులే, కోట్లాది రూపా యలు ఉంటాయి.సోంపేట కేసులలో చట్ట ఉల్లం ఘనలకు బాధ్యులైన నాయకులనుంచి, అధికారు లనుంచి ఆ ఖర్చులకు అయిన మొత్తాన్ని సేకరించ డమే కాకుండా,బీల భూములకు కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకునివారి మీద పెనాల్టీలు వేసి, Iూజ క్రింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలాగే విశాఖపట్నంలో రుషికొండ మీద, ప్రభుత్వ పర్యా వరణాభివృద్ధి సంస్థ, మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా,విశాఖమాస్టర్ ప్లాన్‌ను ఉల్లం ఘిస్తూ,విస్తృతంగా పర్యావరణను ధ్వంసం చేసే కట్టడాలనుచేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేను ప్రభు త్వానికి ఎన్నోమార్లు రాయడం జరిగింది. అటు వంటి కట్టడాలు కాంట్రాక్టర్లకు లాభం కలిగించేవే కాని,ప్రజలకు కావలసింది కావు.
అయినా ఆ సంస్థ రాజకీయ నాయకుల మద్దతుతో,ప్రజాసంఘాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా,గుడ్డిగా పనులు చేపట్టింది.ఇక ఎటు వంటి పత్యామ్నాయం కనిపిం చక పోవడం వలన, కొంతమంది,ప్రజల తరఫున హైకోర్టులో వ్యాజ్యా లను వేయవలసి వచ్చింది. ప్రజల ఉద్దేశాలను గౌరవించకుండా,ప్రభుత్వం ఢల్లీి నుంచి కోట్లాది రూపాయల ఖర్చుతో పెద్ద న్యాయ వాదులను రప్పించి కేసును నడిపిస్తున్నారని వార్తలు చదివాను. అటువంటి ఖర్చులను ప్రజలు ఎందుకు భరించాలి?అందుకు ఖర్చయిన మొత్తాన్ని బాధ్యులైన రాజకీయ నాయకుల నుంచి,అధికారుల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు?విశాఖపట్నం నగరం మధ్యలో ఉన్న దసపల్లా ప్రభుత్వ భూముల విషయంలోకూడా ప్రభుత్వంవైఖరి అలాగే ఉండ టం బాధాకరం. ఈవిషయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, కంచే చేను మేసినట్లు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులు, వారికి దాసోహం అయిన అధికారులు,పూర్తివివరాలనుకోర్టు ముందు పెట్ట కుండా,ప్రభుత్వం తరఫు కేసును బలహీన పరచి, ఆ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించే విధంగాఅమలు చేస్తున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో పనిచేసే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడం దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.
ఈ కేసులో కూడా, ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను, ముఖ్యంగా న్యాయస్థానాలలో వ్యాజ్యాల మీద చేసిన ఖర్చుల వివరాలను,ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ఆఖర్చులను ప్రజలమీద రుద్దే హక్కు ప్రభుత్వానికి లేదు. దసపల్లా కేసులో వేలాది కోట్ల విలువ ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా,ఎనిమిది దశాబ్దాల నుంచి ప్రభుత్వం ఉపయోగిస్తున్న సర్క్యూట్ హౌస్ భూమి కూడా చేయి జారే అవకాశం ఉంది. ప్రభుత్వాధి కారులు ప్రజల తరఫున పని చేయకుండా, ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేసి, కేసును బలహీనపరిచి, భూము లను అన్యాక్రాంతం చేసినందుకు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఈ కేసు మీద ప్రభుత్వం వ్యర్ధంగా న్యాయస్థానాల ముందు చేసిన ఖర్చును ప్రజలు ఎందుకు భరించాలి? ఈ మొత్తా న్ని వారి జీతాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు? దసపల్లా భూముల ఆక్రమణ నేపథ్యంలో, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు,ప్రైవేటు వ్యక్తు లతో,రియల్ఎస్టేట్ వ్యాపారులతో,కుమ్మక్క యి, రెండు మూడు ప్రైవేటు కంపెనీలను ప్రారంభించి న వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయిస్తే కాని అసలు విషయాలు బయటకు రావు.
ఈ విషయాలను మీ ముందు పెట్టడమే కాకుండా, ప్రజల దృష్టికి కూడా తీసుకువస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని, ఈ విషయాల మీద ప్రశ్నిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు, అధికారులు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తిం చాలని లేఖ రాశారు.- (ఎండీ మునీర్), ` వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్,న్యూఢలీి