జనం ప్రేమ గెలుచుకున్న కోయ దొరసాని
అనసూయ అలియాస్ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు.కానీ మావో యిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక గిరిజన మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని,కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ..నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ…
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి,అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు…అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని…ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగా లనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమా నాన్ని చాటిన సమ్మక్క,సారలమ్మల పోరు వారసత్వం ఆమెది.ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్తకాదు,ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చు కుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే! ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్ ‘సీతక్క’.అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు,కడగండ్ల గురించి పుస్తకాలలో చదవా ల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకా లకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధదళాలలో అడవి లోత ట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తిన డానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నా న్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.
అడవిలో దొరికే ఆకూ,అలమా ఏరు కొచ్చుకుని,పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం‘అనసూయ’. తన కంటే ముందు అన్న‘సాంబయ్య’ వున్నాడు. సమ్మ క్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే! వుమ్మడి వరంగల్ జిల్లా, (ప్రస్తుత ములుగుజిల్లా) ములుగు మండ లం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరప త్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్న లలో కలసిపోయాడు. ఆమె అన్న‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్‌గా వున్నాడు. హై స్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ వుద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే వుద్యమ తరగతు లకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహి త్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింప జేసింది.దళ కమాండర్‌గా వున్నప్పుడు తన మారు పేరు ‘రణధీర్’.నల్లగా,పొడుగ్గా,చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్’ని ‘సీత’ని చేసింది.ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి,పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె‘సీత’,‘సీతక్క’ అయ్యిం ది.ఖమ్మం జిల్లాకొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.
సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసు లకి చిక్కిఅరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితం లోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబు ని ఆమెతల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా,దళ కమాండర్‌గా వుద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీ లో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు, చీలిక లు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తనభర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్ లో చనిపోయాడు. తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటి కొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగిం చింది. హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్ తీసు కుని ఐదుసంవత్సరాల న్యాయశాస్త్రంలో ఎల్ ఎల్‌బీ పూర్తి చేసింది.తన ఖర్చులు,చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్.జి.ఓలో వుద్యోగంలో చేరింది. నక్సలైట్ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు.ఒకవైపు ఆర్ధికఇబ్బందులు, మరో వైపు కేసులు…ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్య మైన మలుపు తిప్పాయి.‘లా’ పూర్తయ్యాక వరం గల్ వెళ్లి గతంలో తనకేసులు వాదించిన సీని యర్ అడ్వకేట్,వెంకటస్వామిరెడ్డిగారి దగ్గర జూనియర్ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పని చేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్ ఇమేజ్ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజానాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొన సాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజా జీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్‌కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజ కవర్గం సీటురావడం సులభతరం అయింది. కానీ,2004లో రాజశేఖర్ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి‘మోదం వీరయ్య’చేతిలో ఓడి పోయింది. అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్య కుండా అటు జనంలోనూ,ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నిక ల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్ మెజారిటీ తో గెలిచింది.అయితే అప్పటికే మలి దశ తెలం గాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ తమపార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది. అయిన ప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమం లోనే ఆమెకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) నుంచి ఒకవైపు ఆహ్వానాలురావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానంవల్ల,టీడీపీ రేవంత్ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యంవల్ల ఆమె కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపింది. మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్ధి గా పోటీచేసి ఈసారి కాంగ్రెస్ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి చందూ లాల్ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్ని కలలో అదే చందూలాల్ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది. సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యు రాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరి ష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొం దిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందు తుంది.
పోరాట పటిమకు మారుపేరు సీతక్క పట్టుదలకు, పోరాట పటిమకు మారు పేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలి గా, రెబల్ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వం లోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడంవంటి శిక్షలు విధిం చేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆదేవతల వారసులకు జాతరలోచోటు కల్పించడానికి కృషి చేసి సాధిం చింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్ ఆఫ్ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు,పాఠశాలలు,హాస్పటళ్ళు లేకపో వడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంత మేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడే లలో జీవించేవారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు లు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార,ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతి పక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది. తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమ స్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పే ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రు లు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్ కూడా లేకుండా పోవడమే ఆపరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీ లో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంత మంది మంత్రులకు లేనిబాద ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసి నప్పుడు సీతక్క అవమానంగా భావించింది. నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్ ప్రకటించి నాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజ లకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలు పెట్టింది.గత మార్చి 23నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది. మాస్కులతో పాటు బియ్యం,కూరగాయలు,నూనె సబ్బులు ట్రాక్టర్, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికా హారం గురించి, కరోనా వ్యాధి సోకకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లల ను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటు గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగిన దాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీత క్క. ఆమె సేవగురించి పత్రికలూ,సోషల్ మీడి యా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమెమీద అవాకులూ, చవాకు లూ పేలుతుంది.మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా? అని విమర్శిస్తున్నారు.సీతక్కకి మోతాదు మించి ప్రచా రం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి.ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్న ప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సిరావడం ఎవరి కైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించిన వారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచు కోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమజాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణి క్యం.సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవి త్వం రాసేది.‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్న పుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్ ఆఫ్ సెవెంటీ’ చట్టంమీద, ఆదివా సుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే! నక్సలైట్ గా బైటికొచ్చి హైదరాబాద్ లో చదువు కొనసాగించేటప్పుడు కూడా తనసొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవ సాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ని కష్టపడి ఎం.టెక్ దాకా చదివించింది, తనుకూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్ ట్రిపుల్ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్ లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో గొత్తి కోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులమీద పీహెచ్.డీ చేస్తుంది.
సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభి మానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం.నగరంలో వుండి ఎమ్మే,ఎల్.ఎల్.బి చేసినా,ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతోపాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొం టుంది. పెళ్ళికి,చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం,డోలు శబ్దం విన గానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్ ఘడ్ నుంచి డోలు వాయిద్యకారులైన గొత్తికోయ లను పిలిపించింది. నక్సలైట్‌గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు,మైదాన ప్రాంతాలలో కూడా ప్రతివూరు,పల్లె,వాగు,వంకా తనకి పరిచ యమే. తన నియోజకవర్గంలో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులు కోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితు లను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచ రులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.
తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటిపైన నమ్మకం లేదు,గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పిత్రుదేవతారాధన,ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొం టుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపంబీ నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టు కుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో,ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికార తకు ప్రతీక, ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్ పట్టినా,గన్ మెన్‌తో వున్నా ఆమెది పోరాటదృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీ సులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.
‘అనంతయానం’లో తొలి ఆదివాసీ కేబినెట్ మంత్రి` సీతక్క
గత ముప్పై ఐదేళ్ల క్రితం ఆదివాసుల సమస్యలను ఎదిరించడానికి అడవిబాట పట్టిన ‘ఆమె’ నేడు అధికార పక్షంలో ఒక ముఖ్యమైన పాలనాదీశురాలు.తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణిగా నిలిచింది. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆమె తెలంగాణ కేబినెట్ మంత్రి. ఆమె పేరే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. డిసెంబర్ 7న మూడో శాసన సభలో కొలువుదీరిన ఆమె ఎల్బి స్టేడియంలో హర్షద్వా నాల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభలోనే ఇప్పటివరకు సీతక్క తొలి ఆదివాసీ మంత్రి కావడం విశేషం. ములు గు ప్రజలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీతక్కగా సుపరిచితమైన డాక్టర్ ధనసరి అనసూ య రాజకీయ రంగంలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం లో పంచాయతీరాజ్,మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కొలువుదీరారు. డాక్టర్ అనసూయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆది వాసీ కోయతెగకు చెందిన ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు దగ్గరలోని జగ్గన్నగూడెంలో ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు 1971, జులై 9న జన్మించింది. బాల్యం నుంచి బాగా చదుకోవాలని పట్టుదలతో బడికి వెళుతున్న సంద ర్బంలో ఆమెకు కొన్ని ఆటంకాలు వెంబడిర చాయి. తన14ఏళ్ళ వయసులోనే అన్నయ్య సాం బయ్య ను పోలీసులు అకారణంగా ఎన్ కౌంటర్ చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆమె ప్రజా వ్యతిరేక శక్తులను ఎదిరించడానికి 1988 లో అన్నల బాట (అడవి దారి) పట్టింది. అప్పుడే ఆమె అడవిలో ‘సీతక్క’గా మారింది. కొన్నాళ్ళ తర్వాత పోలీసుల చేతికిచిక్కి కొద్ది రోజులు జైలు జీవితం గడిపింది.జైలు నుండి విడుదలయ్యాక ఇంటర్, డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసుకొని అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ బుల్లెట్ పట్టింది. వార్ ఉద్యమంలో కమాండర్ స్థాయికి ఎదిగింది. తన సహచరుడు అయిన కొత్తగూడ మండలం మోకాళ్లపల్లికి చెందిన కుంజా రామును పెళ్లి చేసుకుంది. కుమారుడు సూర్య జన్మించాక అమ్మ మ్మ ఇంట్లోనే పెట్టి ఉద్యమాన్ని,కుటుంబాన్ని వేరుగా చూసింది. 2001లో బుల్లెట్‌ను వీడి ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. తన కుటుం బాన్ని చూసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి బ్యాలట్ వైపు మొగ్గు చూపింది.అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ములుగు (ఎస్టీ)టికెట్‌ను సీతక్కకు కేటాయించారు. తెలం గాణ అసెంబ్లీలో ఆదివాసీల తరపున అటవీ హక్కులు, గూడేలా అభివృద్ధి గురించి ప్రశ్నించే గొంతుకగా మారింది. మరోవైపు 2014లో మహాకూటమి నుండి ఓడిపోగా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అనంతరం సీతక్కకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ. ఐ.ఎన్.సిమహిళా కమిటీలో ప్రధాన కార్యద ర్శిగా నియమించారు.తను రాజకీయ జీవితాన్ని అనుభ విస్తూ కూడా న్యాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యు యేషన్ ( ఎల్‌ఎల్ ఎం ) చదువుకున్నారు. 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. మొక్కవోని దీక్ష లాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో ‘‘ తెలం గాణకు గొత్తి కోయలు వలస రావడానికి గల సామాజిక అంతరాలు ‘‘ అనే అంశం మీద పి. హెచ్.డి పట్టా పొందినారు.ఎమ్మెల్యే గా ఉంటూ డాక్టరేట్ పొందిన తొలి ఆదివాసీ మహిళ మరి యు డాక్టర్ సీతక్కగా రికార్డ్ సొంతం చేసుకు న్నారు. 2019-20 మధ్య కరోనా మహ మ్మారికి కకావికలమైన ఆదివాసులు మంగపేట, వెంకటాపురం పరిధిలోని అడవిలో నిరాశ్రయు లుగా మిగిలారు.బంధాలు,బంధుత్వాలు తెగి పోయిన పరిస్థితుల్లోనూ‘‘నేనున్నా’’నంటూ కాలి నడక నడుస్తూ గోత్తికోయలను ఆదుకున్నది ఈ సీతమ్మ.2022,ఏప్రిల్ 28న మంగపేట మండ లంలోని శనిగకుంట అనే ఆదివాసీ గ్రామంలో ఎరగడివల్ల సుమారు 40దగ్ధం అయినవి. సర్వం కోల్పోయి నిలువ నీడలేని ఆదివాసులకు సీతక్క అండగా నిలిచింది.ఈ సంఘటనను తను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వారికి తగిన పునరావాసం కలిగింది. ఈఏడాది (2023) ఆగష్టులో కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం మల్యాల,కొండాయి,దొడ్ల తదితర ఆదివాసీ గ్రామాలు నీట మునిగినవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకురాలి హోదాలోనూ పునరావాస సేవలు స్వశక్తితో అందించారు. ప్రభు త్వం నుండి ఆదివాసులకు ఎలాంటి సహా యం అందలేదు.తన నియోజక పరిధిలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్,స్టడీ మెటీరియల్, ఎగ్జామ్స్ మెటీరియల్ పంచి పెట్టారు. అక్కడి జనాలని కదిలిస్తే ‘‘ మాతరం లో కాకతీయుల ఆరాచకాలపై తిరగబడ్డ వీరవనితలు సమ్మక్క సారక్కలను చూడలేదు కాని ప్రజా సమస్యలపై వీర్చోతింగా పోరాడుతూ నేడు తెలంగాణ సేవకురాలిగా నిలిచిన సీతక్క ను చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామ’’ ని ఆదివాసులు,గిరిజనేతరులు సైతం పేర్కొనటంవిశేషం.నేడుతెలంగాణ మంత్రి మండలిలో సీతక్క డిసెంబర్ 14(2023) న పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా విధులు స్వీకరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో యావత్తు తెలం గాణ ప్రజలకు సేవచేస్తారని,ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం!- (చల్లపల్లి స్వరూపరాణి/గుమ్మడి లక్ష్మీనారాయణ)