క‌రోనా మహామ్మారి మార్చినాటికి తగొచ్చు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కోత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడోముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చినాటికి దీని తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్రప్రభావం చూపించొచ్చు.కేసులు ఆకస్మాత్తుగా..భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం,రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం,ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యశాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండువారాల్లో గరిష్ట స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి తొలివారం మధ్యలో కరోనా ఉధృతి గరిష్టస్థాయిలో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్దంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపడటంతోపాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. అయితే కరోనా తీవ్రత మార్చినెలలో తగొచ్చుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుపోతున్నాయి. అత్యధికంగా మహా రాష్ట్ర,ఢల్లీిలో ఒమిక్రాన్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే ఢల్లీిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా..ముంబాయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాక్షికంగా కర్ఫ్యూ అమలువుతంది. ఇదిలా ఉండగా…నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను ఆరికట్ట వచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది అని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడిరచారు.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహమద్‌ పేర్కొన్నారు.ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి,మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే కొన్చిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే 29రాష్ట్రాల్లో గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోకరోనా వైరస్‌ విజృంభణ
థర్డ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువు తున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోసారి వెలుగులోకి బ్లాక్‌ ఫంగస్‌ ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓవ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను,ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు వెల్లడిరచారు.కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్‌ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్‌ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.– గునపర్తి సైమన్‌