క్షీణిస్తున్న ఉద్యోగులు..తగ్గుతున్న వేతనాలు

ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఉందని ఇప్పుడు చాలామంది నమ్ముతు న్నారు. అయితే అభివృద్ధి అంటే జీడీపీ వృద్ధి అని మాత్రమే కాదు. జీడీపీ వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఉపాధీ ఉద్యోగ అవకాశాలూ పెరగాలి 2014 ఎన్నికలప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్‌డీఏ హామీ ఇచ్చింది. జనవరి 2018లో ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో 70లక్షల మంది కొత్తగా పీఎఫ్‌ అకౌంట్లను తెరిచారని ఇది కొత్త ఉద్యోగాల సృష్టి గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తోందని అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ప్రధానమంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సహన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం యజమానులు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్‌ మొత్తాన్ని మూడేండ్లవరకూ చెల్లిస్తున్నది. ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఇదివరకే తమ వద్ద పీఎఫ్‌ చెల్లించకుండా పనిచేస్తున్న కార్మికులను కొత్తగా చేర్చుకున్నట్టు చూపి వారికి ప్రభుత్వపథకం ద్వారా పీఎఫ్‌ చెల్లిస్తున్నారు. ఇదివరకు ఉన్న ఉద్యోగాలని కొత్త ఉద్యోగాలుగా చూపిస్తూ కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2018, 2019 లో నిరుద్యోగపు రేటు భారతదేశంలో 3.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేయగా సీఎంఐఈ ఇది ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఆర్థిక అభివ ృద్ధి గురించి కాంగ్రెస్‌, బీజేపీలు నిరంతరం వాదులాడుకుంటూ ఉంటాయి. ఈ వాదనలలో మానవాభి వృద్ధి రేటు గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. మోడీ ప్రభుత్వం ఈమధ్య జీడీపీని లెక్కించే పద్ధతి మార్చి వేసింది. తమ హయాంలో యూపీఏ కన్నా ఎక్కువ వ ృద్ధి జరిగిందని చెప్పుకోడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఈ కొత్త పద్ధతి ప్రకారం వేసిన అంచనాలు వివాదాస్పదమయ్యాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ అనధికారికంగా చేసిన అంచనాల ప్రకారం ఎన్‌డీఏ కన్నా యూపీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉండగా సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ అధికారికంగా విడుదల చేసిన అంచనాలలో ఎన్‌డీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నది. ఈ విరుద్ధమైన అంచనాలు రెండు సంస్థలు చేసిన అంచనాల విశ్వసనీయతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. జీడీపీలో వృద్ధి జరిగినా అది ప్రజల జీవితాలలో గుణాత్మ కమైన మార్పు తీసుకురానప్పుడు ఆ వృద్ధివల్ల ప్రయోజనం ఏమిటి. జీడీపీలో వృద్ధి జరిగినా సమాజంలోని ఒక పెద్ద సమూహానికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు. భారతదేశంలో వృద్ధిరేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో అసమానతలు కూడా పెరుగుతున్నాయి. జతీవసఱ్‌ ూబఱంంవ రిపోర్ట్‌ ప్రకారం ఒక శాతంగా ఉన్న సంపన్నుల సంపద 2010లో మొత్తం సంపదలో 40శాతంగా ఉండగా 2016లో అది 50 శాతానికి పెరిగింది.10శాతంగా ఉన్న సంపన్నులు మిగతా 90శాతం ప్రజల కన్న నాలుగు రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ భారతదేశంలో ఉపాధి అవకాశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇన్‌ ఇండియా’ అన్న పేరు మీద ఈ నివేదిక విడుదల చేశారు. భారతదేశ లేబర్‌ మార్కెట్‌ను విశ్లేషిస్తూ వ్యవసాయరంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు కార్మికుల వలసపోతున్నారని నివేదిక తెలియజేసింది. ఉపాధి రహిత అభివృద్ధీ, వేతనాలు పెరగని అభివృద్ధీ సహజంగానే సమ్మిళితమైన అభివృద్ధికి దారితీయదని అది అసమానతలూ అంతరాలూ పెంచుతుందని నివేదిక స్పష్టంగా తెలియజేసింది.నూతన ఆర్థిక విధానాలు అమలైన గత 25 ఏండ్లలో జీడీపీకి,ఉపాధి కల్పనకూ ఉన్న సంబంధం రోజు రోజుకి బలహీనపడిపోతున్నది. 1970, 1980లలో జీడీపీ వృద్ధి 3 నుంచి 4శాతం ఉంటే ఉపాధిలో వృద్ధి సుమారు 2శాతంగా ఉండేది.1990 తర్వాత మరీ ముఖ్యంగా2000ల తర్వాత జీడీపీలో 7శాతం వృద్ధి ఉన్నా ఉపాధిలో వృద్ధి మాత్రం ఒకశాతం కన్నా తక్కువ ఉన్నది. జీడీపీలో వృద్ధీ, ఉపాదివృద్ధికీ మధ్య నున్న నిష్పత్తి 0.1 శాతం కన్నా తక్కువగా ఉన్నది. అంటే జీడీపీలో 10శాతం వృద్ధి ఉంటే ఉపాధిలో ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంటుందన్నమాట. 2013-15 మధ్య దాదాపుగా 70లక్షల ఉద్యోగాలు మాయమైపోయాయని నివేదిక తెలియజేస్తున్నది. నిరుద్యోగం 5శాతం కన్నా ఎక్కువైందని ఉత్తరాది రాష్ట్రాలలో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని నివేదిక వెల్లడిరచింది. ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులలో నిరుద్యోగం 16శాతంగా ఉందని నివేదిక తెలపడం చాలా ఆందోళన కలిగించేదిగా ఉంది. అండర్‌ ఎంప్లాయిమెంట్‌, తక్కువ వేతనాలు మాత్రమే సమస్యలుగా ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు ఈ నివేదిక పెరుగుతున్న నిరుద్యోగం మరి ఉపాధి కల్పన భారత దేశానికి పెద్ద సవాళ్లని తెలియజేస్తున్నది. దాదాపు అన్ని రంగాలలో వేతనాలు పెరుగుతున్నాయని చెప్తున్నా ఇది జీడీపీ వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. గ్రామీణ వేతనాలలో ఎలాంటి పెరుగుదల లేదు. సగటున వేతనాలలో వృద్ధి 3శాతంగా ఉన్నది. అయితే కార్మికుల ఉత్పాదకత 30ఏండ్ల కింది నాటికన్నా ఆరు రెట్లు పెరిగింది. సూపర్వైజరీ, మేనేజరియల్‌ ఉద్యోగాల్లో వేతనాలు మూడు రెట్లు పెరగగా కార్మికుల వేతనాలలో వృద్ధి మాత్రం ఒకటిన్నర రెట్లుగా ఉన్నది. ఇప్పటికీ మగవారిలో 82శాతం, స్త్రీలలో 92శాతం నెలకు 10 వేల రూపాయలు కన్నా తక్కువగా సంపాదిస్తున్నారు. సెవెంత్‌ సెంట్రల్‌ పే కమిషన్‌ నెలకు 18వేల రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీన్నిబట్టి చాలా పెద్ద సంఖ్యలోనే భారతీయులు జీవించడానికి కావలసిన వేతనాలకు (లివింగ్‌ వేజ్‌) చాలా దూరంలో ఉన్నారని అర్థమైపోతుంది. ప్రయివేట్‌ రంగంలో చాలా పరిశ్రమలు సెంట్రల్‌ పే కమిషన్‌ సిఫారసు చేసిన కనీస వేతనం కన్నా చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అందుకనే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటున్నది. అట్లాగే కార్మిక, పెట్టుబడి (లేబర్‌-క్యాపిటల్‌) నిష్పత్తి కూడా దారుణంగా పడిపోతున్నది. 1980లో కోటి రూపాయలు (2015 ధరలలో) పెట్టుబడి పెడితే 90ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 90బదులు 10 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. అట్లాగే ఉన్న ఉద్యోగాలలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మొత్తం ఉద్యోగాలలో 60శాతానికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటున్నారు. శాశ్వత ఉద్యోగుల పనులను ఇప్పుడు రకరకాల పేర్లు గల తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్నారు. పర్మనెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల కన్నా చాలా తక్కువ వేతనాలను వీరికి ఇస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తు ప్రయివేట్‌ యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన లింగ వివక్ష నెలకొని ఉన్నదని నివేదిక తెలిపింది. మేనేజర్లు, సీనియర్‌ అధికారులు, శాసనసభ్యులలో 2011లో 13శాతంగా ఉన్న మహిళల వాటా 2015 కల్లా 7శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడిరచింది. తయారీ రంగంలోని కార్మికులలో 22శాతం మహిళలు ఉండగా సర్వీస్‌ రంగంలో మహిళలు 16శాతంగా ఉన్నారు. టెక్స్టైల్‌ గార్మెంట్‌, టుబాకో, విద్య. వైద్య రంగాలలో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యలోనే కాక వేతనాలలో కూడా మహిళలు వివక్షకూ లోనవుతున్నారు. తాము చేస్తున్న పని, తమ విద్యార్హతలను బట్టి మహిళలు పురుషుల వేతనాలలో 35 నుంచి 85 శాతం వరకు పొందుతు న్నారు. అయితే ఈఅసమానతలు కొంత తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తు న్నాయి. తయారీరంగంలో మహిళల వేతనాలు పురుషుల వేతనాలలో 35 నుంచి 45శాతానికి పెరిగింది. రెగ్యులర్‌ వర్కర్స్‌, ఉన్నత విద్యావంతులైన మహిళలలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నది. శ్రామిక మహిళలు, ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళల శాతం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువగా ఉన్నది. ఇది ఇంకా తగ్గుతూ వస్తున్నది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల కన్నా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నది. సాంఘిక పరమైన కట్టుబాట్ల కన్నాఅవకాశాలు లేకనే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నది. గ్రామీణ ఉపాధి పథకం, ఆషా, అంగన్‌ వాడీ వంటి స్కీముల వల్ల మహిళల వాటా ఉద్యోగాల్లో కొంతమేరకు పెరిగింది.
ఉపాధిలో కులపరమైన వివక్ష, అసమాన తలు కొనసాగుతున్నాయి. తక్కువ వేతనాలు ఉన్న వృత్తులలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు చాలా ఎక్కువగా ఉండగా అధిక వేతనాలు కల ఉద్యోగాలు/ వృత్తులలో వారి సంఖ్య నామమాత్రంగా ఉన్నది. కుల వివక్షతను అలాగే నిమ్న కులాలకు గౌరవప్రదమై ఉద్యోగాలలో అవకాశాలు లేకపోవడాన్ని ఇది స్పష్టంగా చూపిస్తున్నది. రిజర్వేషన్లు సరిగా అమలైన చోట ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కొంత మెరుగైన ప్రాతినిధ్యం ఈవర్గాలకు లభ్యమయిందని నివేదిక తెలియజేస్తున్నది. గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపాదనలో/ వేత నాలలో మహిళల పట్ల ఉన్న తేడాల కన్నా కులపరమైన వివక్ష తేడాలే ఎక్కువ. ఉన్నత కులాలకు చెందిన వారి సంపాదనలో ఎస్సీ కులాల వారు 56 శాతం సంపాదిస్తూ ఉండగా, ఎస్టీ కులాలవారు 55శాతం అలాగే ఓబీసీకి చెందినవారు 72శాతం సంపాదిస్తున్నారని నివేదిక అంచనా.
వ్యవస్థాగతమైన మార్పులు చాలా మెల్లగా జరుగుతున్నాయని ఇవి వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నదని నివేదిక అభిప్రాయపడిరది. అలాగే ఉపాధి కల్పనకు ఒక సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నివేదిక భావించింది. అధిక వృద్ధిరేటు ఉద్యోగాల కల్పనను పెంచలేక పోయినందున అలాగే కార్మికుల పెరిగిన ఉత్పాదకత వారి వేతనాలను పెంచలేక పోయినందున ప్రభుత్వం ఒక జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించాలని నివేదిక సిఫారసు చేసింది. దీనికిగాను గ్రామీణ ఉపాధి హామీ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నివేదిక సూచించింది. కొన్ని రాష్ట్రాలలో విజయవంతంగా అమలు చేస్తున్న ఉపాధి పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించాలని అట్లాగే పారిశ్రామిక విధానాలను ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా, కార్మికులకు వేతన ప్రోత్సాహకాలను అందించేట్లుగా రూపొందించాలని నివేదిక ప్రభుత్వాలకు సూచించింది. గ్రామీణ ఆదాయాలను పెంచడానికి వ్యవసాయ రంగంలో పబ్లిక్‌ పెట్టుబడులను పెంచాలని, విద్య, వైద్యం, హౌసింగ్‌ పబ్లిక్‌ రవాణాలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని, పర్యావరణ రక్షణ, కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాలు సృష్టించాలని నివేదిక సిఫారసు చేసింది. సాంఘిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వ పథకాలు కీలకమని నివేదిక అభిప్రాయపడిరది. త్వరలోనే పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. కార్మిక సంఘాలు, అసమానతలను అంతరాలను తొలగించడానికి కృషి చేస్తున్న సంస్థలు, పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న సంస్థలు నివేదిక తెలియజేసిన అంశాలపై ప్రజాభిప్రాయం కూడగట్టి ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిని, అంతరాలను తగ్గించే సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సాంఘిక విధానాలను అవలంబించేట్టుగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది -వేణుగోపాల్‌

ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం

శాంతిదూత అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమజాతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈదీనావస్తలను ఎలా వర్ణించాలి. మనుషులుగా మా ఆదిమజాతులకు లేని భద్రత మా భాషలకు, సంస్కృతులకు ఎలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వలస పాలన ఆక్రమణల కారణంగా స్థానిక ఆదిమజాతులు రాజ్యాధికారానికి దూరం కావడం, తద్వారా సంస్కృతిలు, భాషలు అణిచివేతకు గురికావడం నిరంతరం జరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 90దేశాలలో సుమారు ఐదువేల తెగలు, సంస్కృతులు కలిగి 370మిలియన్ల జనాభా, ఏడు వేలరకాలకు పైగా భాషలు ఉన్నట్టు యునెస్కో (ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం జుసబషa్‌ఱశీఅaశ్రీ ూషఱవఅ్‌ఱటఱష aఅస జబశ్ర్‌ీబతీaశ్రీ ూతీస్త్రaఅఱస్త్రa్‌ఱశీఅ) గుర్తించగా, 2680 లకుపైగా ఆదిమ జాతులు మాట్లడే భాషాలు అంతరించి పోతున్న భాషాల జాభిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో 104 మిలియన్ల జనాభా కలిగి 700 తెగలు (యునెస్కో గుర్తింపు పొందిన) ఆదివాసులుండగా, 500 తెగలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. 1635భాషలు స్థానిక జాతుల వాడుకలో ఉంటే 197 భాషలు, 75 తెగలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదావస్తలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో తోటి, చెంచు, కొండ రెడ్డి, కులియా, దులియా మొదలైన తెగలు, కొలాం, సవర, కొండ భాషా వంటి భాషాలు ఇతర భాషాల ఆదిపత్యానికి లోనై కనుమరుగు కానున్నాయి. ఈ పరిణామాలు ఆదిమజాతుల మనుగడకు, విశ్వ మానవాళి వినాశానికి హెచ్చరికలుగా పరిణామీస్తున్న వేళ యునెస్కో 2019 సంవత్సరాన్ని ‘‘ప్రపంచ ఆదివాసీ భాషా సంవత్సరోత్సవం’’గా ప్రకటించడం ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రపంచ సమాజం భాద్యత అని గుర్తు చేయడం శుభపరిణామం.
ఆదిమజాతుల భాషా పరిరక్షణ అంటే మన సాంస్కృతిక వారసత్వం జ్ఞానమూలాల పరిరక్షణేనని సమాజం గుర్తించాలి. ఆదిమజాతుల నాగరికత సంస్కృతులతో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఆదిమజాతులది మాత్రమే కాదని, మన అందర బాధ్యత అని యునెస్కో గుర్తుచేసింది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ మనుగడ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమజాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే పురాతన సమాధుల త్రవ్వకాలు, సామాగ్రిని మ్యూజియంలలో భద్రపరచడం మాత్రమే కాదు. మా భాషా సంస్కృతిని, జీవన విధానాన్ని, సజీవంగా కొనసాగే అవకాశాలు కల్పించడమని వీలైనంత తొందరగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు సైతం భాషా అధ్యయనాల పేరిట పురాణ ఇతిహాసాలు, రాతప్రతులు, భాషా, అలంకారాలు, రంధ్రాన్వేషణలు మాని నిజాయితీగా వాస్తవ మూల భాషాజ్ఞాన అన్వేషణ ఇకనైనా మొదలు పెట్టాల్సి ఉంది. అధ్యయ నాలు అలంకారప్రాయాలుగా అనుకరణలుగా కాక, చారిత్రక వాస్తవ నిర్ధారణలు కావాలి. ఆదివాసి భాషాసంవత్సరం భాషల జనని సంవత్స రోత్సవంగా యూరివర్శిటీలు, భాషాపండితులు, అధ్యయనాలు, మేధో మధనాలు జరగాలి.
నిజానికి యునెస్కో ప్రయత్నం మొదటిదేమి కాదు. ముందడుగు అంతకన్నా కాదు. 2005లోనే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌Êట్రైనింగ్‌ (ఎన్సీఆర్టీ) సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజేస్‌ (సి.ఐ.ఐ.ఎల్‌) సంస్థలు మైసూర్‌లో సెమినార్‌ నిర్వహించి ‘‘ఆదివాసీ సమాజంలో భాషా పరిరక్షణ-విద్యావకాశాలు మరియు విద్య వెనుకబాటుతనానికి కారణాలు’’ అనేఅంశంపై సమీ క్షించి భాషఅవరోధం ఒకపెద్ద సమస్య అనిగ్రహించింది. ఆ అవరో ధాన్ని అధిగమించడానికి మల్టీ లింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (వీూజు) ప్రోగ్రాం ద్వారా మాతృభాషలో ప్రాధమిక విద్యాబోధన అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. ఆదివాసీ విద్యార్ధిని, విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం ద్వారా ఆదివాసీ సమాజంలో విద్యాభివృద్ధికి భాషా అవరోధంతో పాటు డ్రాపౌట్స్‌ శాతం తగ్గించడం ధ్యేయంగా పెట్టుకొంది. 2006 లో దేశవ్యాప్తంగా ప్రత్యేక మాతృభాషలు కలిగిన ఆదివాసీ సమూహాలు కలిగి ఉన్న రాష్ట్రాలను ఎన్నుకుని ప్రారంభించారు. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి గోండి (గోండిభారతి), కోయ (కోయ భారతి), కొలాం (కొలాం భారతి), సవర (సవర భారతి), కొండ దొర (కొండ భారతి), కోందు (కుంవి భారతి) వారి వారి మాతృభాషాల ద్వారా విద్యబోధన మొదలైయ్యింది. వాస్తవంగా సాధారణ విద్యార్ధికి మాతృభాషే విద్యాభాష, కాని ప్రత్యేక మాతృభాష కలిగిన ఆదిమజాతుల విద్యార్ధులకు మాత్రం స్థానిక విద్యా బోధన భాష పూర్తిగా తెలియని భూతమై కూర్చుంది. ఆభాష ఏంటో ఆ అక్షరాలేంటో అర్థమవ్వక బడికి రాకుండా పారిపోయే వారే ఎక్కువ. మిగిలిన కొద్ది మందికి మాతృభాషా పమస్య (మనకు తెలుగు)ఉంటుండగానే సెంకండ్‌ లాంగ్వేజ్‌ (హింది), థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీషు) అంటూ తెలియని భాషలు బలవంతంగా చొప్పించే ప్రయత్నం కారణం గానే అజ్ఞానులుగా, అనాగరికులుగా ముద్రపడే దౌర్భాగ్యం దాపురిం చింది. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్లే మల్టీలింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (ఎం.ఎల్‌.ఇ), ఆదిమజాతుల విద్యార్ధుల మాతృభాష వికాస కార్యక్రమ మైన ‘‘ఆనందలహరి’’ వంటి పథకాలు దీర్గకాలంగా కొనసాగించ కుండా మూడునాళ్ళ ముచ్చటగా మిగిలాయి. అదే కొనసాగి ఉంటే కొంతమేరకు భాషా పరిరక్షణకు దోహదపడి ఉండేది.
అభివృద్ధి ముసుగులో ఆదిమజాతుల మనుగడ ప్రమాదక రంగా మారిందన్నది. ఎంతవాస్తవమో విద్యా విధానాలవల్ల వారి భాషలు సంస్కృతులు అంతరించి పోవడానికి దారి తీసిందన్నది అంతే వాస్తవం. ఆదిమజాతుల సంస్కృతులు పాఠ్యాంశాలు కాకపోవడం, కనీసం వారి సమీప ఆవాస ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ పండగా లకైనా సెలవులు ప్రకటించి విద్యార్థిని విద్యార్థులకు సంస్కృతిలో భాగస్వా మం కల్పించక పోవడం కారణంగా తరువాతి తరాలు సంస్కృతికి దూరమైన కారణంగానే సాంస్కృతిక వారసత్వం పూర్తిగా అంతరించి పోవడానికి కారణమౌతుంది. మాఆదిమజాతుల విద్యార్ధులు మాది కాని భాషలో విద్యాబోధన కారణంగా,ే మాభాషలకు ప్రాధాన్యత గౌరవం సమాజంలో కానీ పాలన అవసరాలు కానీ, లేనందున విద్యా వంతులైన ఆదివాసీ కుటుంబాలు తరువాతి తరాలకు భాషను నేర్పించకపోవడం, వారి లాగే ఇతర కుటుంబాలు భాషకు దూరం కావటం జరుగుతుంది. ఇది ఏస్థితికి చేరుకుందంటే భృాణ హత్యాపాత కంలా తల్లి గర్భంలోనే మాతృభాషకు సమాధి కట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఆదిమజాతుల భాషలకు దాపురించింది. నిజానికి భాష బ్రతకడానికి, కొనసాగడానికి కావలసింది సామాజిక ఆదరణ, ఆచరణ, అవసరం. ‘‘సంస్కృతిభాష ఆధరంగా విస్తృతం అవుతుంది. భాషసంస్కృతి ఆధారంగా సంపూరణమ వుతుం ది’’. ఆచరణ సంస్కృతినిస్తుంది. సాంస్కృతిక పరిరక్షణే భాషను పరిరక్షి స్తుంది. సంస్కృతి భాష ఒకదానికొకటి పెనవేసుకుని సాంస్కృతిక కొనసా గింపు భాషతో, భాషా కొనసాగింపు సంస్కృతితో వారసత్వంగా అందు తుంది. దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. కొన్ని వేల సంవత్సరాలు గా ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతులు, భాషలు, మనుగడలో ఉన్నాయంటే సామాజిక, సాంస్కృతిక ఆమోదమే కారణం. కానీ పాలకుల తోడ్పాటు ఏ మాత్రం కాదు. ఆదివాసీ భాషలు అంతరించి పోవడానికి లిపి లేకపోవడమే! అనే పరిపక్వత లేని వాదన తెరమీదికి తెస్తున్నారు. అదే వాస్తవమైతే లిపి ఉన్న హరప్ప నాగరిక భాషేది? లిపి ఉండి దేవనాగరిక భాషేది? లిపి లేకుండా దేవనాగరి లిపితో మనుగడ సాగిస్తున్న సంస్కృతం, హింది,బోజ్‌పురి,మరాఠిభాషల పరిస్థితిఏమిటి? ఇంగ్లీష్‌ కే లిపి లేక పరాయి లిపితో వెలిగిపోతుంది. నిన్నటి వరకు అధికారిక భాషగా గౌరవం పొంది లిపి ఉండి అధికారిక ఆమోదం కోల్పోయాక మనుగడే ప్రశ్నార్థకమైన మహారాష్ట్ర ప్రాంత ‘‘మోది’’ భాష పరిస్థితి ఏమిటి ? లిపి ఉండి భావన(భాష) తెలియక అడివి కాచిన వెన్నెలైన హరప్పా జ్ఞానం అంతర్ధానం మరువరాదు. అందుకే ఆదిమ జాతుల భాషలకు లిపి అందించాలనే వృదా ప్రయత్నాల కన్నా ముందుగా ఆ భాషలను ఎక్కువ సమాజం చదవగలిగిన, వ్రాయ గలిగిన లిపిలో భవిష్యత్‌ తరాలకు, సమాజానికి అందే విధంగా గ్రంథస్థం చేసుకోవటం ఉత్తమం. అలాంటి అద్భుత ప్రయత్నమే మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌. ఎవరికీ తెలియని కొత్త లిపిలో మనకు మాత్రమే తెలిసిన భాషను లిఖించుకోవటం, గ్రంథస్థం చేయటం అంటే తుఫాను సమయంలో నడి సముద్రానికి చుక్కాని లేని పడవ ప్రయాణం లాంటిది. విశ్వ జ్ఞానమూలాల ఆధారాలను అన్వేషించడం అధ్యయనం చేయటం మాని అక్షరాల్ని వెతకడం ఆదిమ జాతుల భాషా పరిరక్షణకు ఇప్పుడంత అవసరం కాదు. పైగా ఇది ఆదిమ సమాజాన్ని మరింత అయోమయంలోకి నెట్టే కుట్రలో భాగమే. ఆదిమ జాతుల భాషా వారసులు విద్యావంతులు, పెద్దలు, ఆయా భాషల్లో సాహిత్యాన్ని, రచనలను విరివిగా విస్తరింప చేయటం తక్షణ అవసరం.
పాలకులు, మేధావులు, సమాజం, ఆదిమ జాతుల భాషా పరిరక్షణని ఆదివాసుల కోసమే అనే చిన్నచూపుతో లేదా సానుభూతితో కాక సామాజికభాద్యతతో పాటు జ్ఞాన దృష్టితో చూడకపోవడం పెద్ద అవరోదం. ఎందుకంటే భాష ఒక సామాజిక సమాచార మాధ్యమమో, సాంస్కృతిక జీవాధారమో, గుర్తింపో మాత్రమే కాదు. అంతకుమించి భాష అంటే జ్ఞానం. ఆది భాషాలంటే జ్ఞానభాండాగారాలు. ఎందుకంటే ఎంత గొప్ప నాగరికత అయినా మూలం మూలవాసీలతోనే మొదలవ్వాలి. ఈనాటి విజ్ఞానానికి నాంది మా ఆదిమజాతుల భారaా జ్ఞానబీజాలే. నేటి భాషలన్నిటికీ మాతృ భాష మా తొలి పలుకులే. ఎంతటి జ్ఞానం అయినా, ఆవిష్కరణ అయినా భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. భాషలోనే వ్యక్తమవు తుంది. భాషలోనే ప్రసారమవుతుంది. ఆ భాషా జ్ఞానం లేకనే ఈజిప్టు, హరప్పా నాగరికత జ్ఞాన వైభవం తెలియక శతాభ్దాలపాటు విశ్వ విద్యాల యాలతో పాటు జుట్లు పీక్కుంటున్నాం. అయినా ఈ పాలక మేథావులకు, యూనివర్సిటీలకు నిన్న మొన్నటి భాషలకు వ్రాత ప్రతులంటూ ప్రాచీన హోదాలు కవి సమ్మేళనాలు వంటి ఇగోలు, కాలక్షేపం తప్ప మూల జ్ఞానం, మూల వాసీల వద్ద మూల వాసీల భాషా రూపంలో నిక్షిప్తమై ఉందని ఆభాండాగారాన్ని మధించి శోధించి అభివృద్ది చేద్దాం. సమాజానికి మరింత వైజ్ఞానిక మూల జ్ఞానాలు పంచుదామనే ధ్యాస, దృష్టి, దృక్పథం ఏ కోశానా లేదు. భాష ముందా, అక్షరం ముందా అనే ప్రశ్న! చెట్టు ముందా, విత్తు ముందా అన్నంత సంక్లిష్టమేమీ కాదు. అక్షరాల కంటే ముందే అద్భుత విజ్ఞానాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నాయి మా ఆదివాసి భాషాసాగరాలు. అందుకు హరప్పా నాగరికతే సాక్ష్యం. హరప్పా ముద్రికల్లో భావాన్ని అర్ధంచేసుకోవటానికి వలసవిదేశీ భాషల్లో డీకోడిరగ్‌ ప్రయత్నాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలు సైతం సాగిస్తున్నాయి. ఈ హాస్యాస్పద తంతు మన ఇంటి బిడ్డ డి.యన్‌.ఎ మ్యాచింగ్‌ కోసం పక్కింట్లో వెతుకు లాడినట్లు సాగుతూనే ఉంది. పైగా పశుపతి ముద్రికల్లోని కొమ్ముల కిరీటం ధరించే ఆదివాసి సమాజం సజీవంగా ఉన్నా, ఆ భాషలు సమృద్దిగ ఉన్నా కాదని ఆ నాగరికతవారసత్వం అంతరించింది అని నిర్దారించటం అంటే బ్రతికుండగానే డెత్‌ సర్టిఫికేట్స్‌ ఇచ్చేంత గుడ్డితనమా? లేక ఆ వారస త్వాన్ని అంతం చేసే కుట్రలో భాగమా అనేది అర్ధం అవుతూనే ఉంది. జాతులనే కాక సంస్కృతుల్ని భాషల్ని కూడా అంతం చేసి, హైజాక్‌ చేసే కుట్రలు వలస వాద పాలనలో సర్వ సాధారణం, చారిత్రక విదితం. కానీ అంతం అయ్యేది మా ఆదిమ జాతులు భాషా సంస్కృలు మాత్రమే కాదు. విశ్వమానవాళి జ్ఞానం. ఎప్పటికీ అందక అంతుచిక్కని రహస్యాలుగా మిగిలి పోవటం ఏ సమాజానికి శ్రేయస్కరం?. పొరుగు భాష అయిన ఉర్దు, చాయ్‌, తహశీల్‌ వంటి పదాలతో హిందీ భాషకు తద్వారా ఈ దేశానికి ఎంతో మేలు చేసిందని కొనియాడే మేధావులు భాషా పండితులు ఈ దేశం మూల భాషల సమృద్ధతను, గొప్పతనాన్ని కొనియాడడం అటుంచి నేటివరకు గుర్తించనే లేదు. గంగ : అంటే నది పేరు మాత్రమే కాదని నీటి ప్రవాహం అనే అర్ధం ఉందని ఎంతమందికి తెలుసు. చేపల్ని మీన్‌ లేదా మీనా, నాగుపాముని నాగ్‌ లేదా నాగిని అని అనేక భాషల్లో వ్యవహరిస్తున్నారు. నిజానికిది ఈదేశ మూలవాసీలైన కోయభాషా పదాలు. అలానే తెలుగులో పొట్ట, పటేల్‌, పట్వారీ, పొద్దు, నెల, వెన్నెల, తళారీ, ఏరువాకలో ఏరు అనే పదాలు తమిళంలో కై, కాల్‌, కండ్‌, కుడిచే, వర, నల్ల వంటి పదాలు కోయభాష లోనివే. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడంలో 80 శాతం కోయభాషా పదాలతోను సంమృద్ధతను పొందాయి. సింప్‌ాసింహం, ఇంద్‌సముద్రం (హిందూమహా సముద్రము), ఇమ్‌మంచు (హిమాలయపర్వతాలు), ఒడిస్సేల్‌, ఒడిస్సి చెట్టు పదాల నుండి ఒడిస్సా అనే పదము ఉత్పత్తి అలానే చెన్నయ్‌ చెట్టు పదం నుండి చెన్నె (మద్రాసు) పట్టణం పేరు, శివంపూనకం (దేవర) నుండి శివుడు, శివతాండవం వంటి పదాలు ఉద్భవించాయి. తెలియదు అనే పదమే ‘కంగారు’ జంతువు పేరుగా స్ధిరపడిరదనేది విదితం. అలానే మడ, మర్ర, మార ` చెట్టు అనే పదం నుండి మడ అడవులు వంటి పదాల ఉత్పత్తులు ఆదిమభాషల నుండే ఉద్భవించాయి.
ఆదిమజాతుల భాషలన్ని చిన్నచూపు చూడడం సమాజపు తెలియనితనం. చిన్నతనమే కాని ఆ భాషల చిన్నతనం కాదు. ఉదాహరణకు ప్రపంచంలో గుర్తింపు పొందిన దాదాపు అన్ని భాషల్లో భర్త చనిపోయిన భార్యను వితంతువు అనే పదం మాత్రమే ఉంది. కానీ అండమాన్‌ దీవుల్లో ఒక ఆదిమతెగ భాషలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకు లందరిని ప్రత్యేకంగా సంబోధించే పదజాలం సమృద్ధిగా ఉంది. అంటే సాంకేతిక పదజాలంలో ఆదిమజాతుల భాషలు వెనుకబడి ఉండొచ్చు కాని సామాజిక పదజాలంలో మాత్రం భాషలన్నింటికి ఆదిమజాతుల భాషలు జన్మ నిచ్చాయని స్పష్టమవుతుంది. సంస్కృతి లాగే భాషలు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ సంమృద్ధతను, సమగ్రతను సాధించుకుంటాయి. అది నాగరికతా వికాసానికి వారధి. నిజానికి సాంకేతిక పదాలు కూడా ఇతర దేశాల మూల భాషాపదాలే. తెలియని ప్రాంతాలకు మాత్రమే అవి కొత్త పదాలు. అందుకే మాఆదిమ జాతుల నాగరికత సంస్కృతితో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన భాధ్యత కేవలం మా జాతులది మాత్రమే కాదు. విశ్వ మానవాళి భాధ్యతకూడా అని ‘‘ఆదివాసి భాషా సంవత్సరం’’గా యునెస్కో చాటి చెప్పింది. 2019 సంవత్సరంలో విశ్వవిధ్యాలయాలు ప్రత్యేక శ్రద్దతో మరింత నిశితమైన అధ్యాయనాలు సాగించాల్సి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆనంద లహరి, మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదివాసి భాషా సాహిత్యం అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ తోడ్పాటు అందించాల్సిందిగా మా ఆదివాసీల ఆకాంక్ష. – మడివి నెహ్రు

ఆదివాసీ దీనావస్థ

గిరిజన జీవితం అడవికే అంకితం. అడవిపైనే వారి బతుకు ఆధారపడి ఉంటుంది. అక్కడే భూములను సాగుచేసుకుంటారు. భూసారం క్షీణిస్తే మరోచోట అడవిని కొట్టి కొత్తగా భూములు సాగులోకి తెస్తారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ప్రభుత్వం కొన్ని విధా నాలతో అటవీ శాఖ సిబ్బందిచే దాడులు చేయించడంతో దాదాపుగా పోడు వ్యవసాయం తగ్గిపోయింది. ఉన్న భూముల్లోనే సంప్రదాయ వ్యవసాయం సాగిం చడం పరిపాటిగా వస్తోంది. కానీ ఆవ్యవసాయం చేసుకోడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వారు ఎక్కడ నివాసాలు ఏర్పరుచుకుని సాగు చేసుకొంటే అక్కడకు వెళ్లి వారి గూడే లను కూల్చివేసి పంటలను ధ్వంసం చేస్తుంటారు.
అటవీ సిబ్బంది ఆగ డాలకు అడ్డూఅదుపు ఉండదు. అడ్డు వచ్చిన వారిపై కేసులు పెడతారు. నిలదీసిన వారిని మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడ కుండా లాఠీలతో దౌర్జన్యానికి దిగుతుం టారు. విశాఖ ఏజెన్సీలో అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. తెలం గాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో అదే జరిగింది. అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్లు, బుల్‌డోజర్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. చట్టం తమ చేతిలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా పశుబలం ప్రదర్శించడం మానవత్వమా?అదివాసీల హక్కులను ఉక్కుపాదంతో తొక్కివేసే హక్కు ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయని, బంగారు తెలంగాణ సాక్షాత్కరి స్తుందని కలలు కన్న పీడిత తాడిత గిరిజనానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా? గత పదేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకొంటూ పోట్టపో షించుకొంటున్న గుత్తికోయల కుటుంబాలపై అటవీ శాఖ దాడులు జరిపివారి గుడెసెలను కూల్చివేయడం, గిరిజన మహిళలను చెట్టుకు కట్టివేయడం, అడ్డువచ్చిన వారిని లాఠీలతో చావమోదడం ఈబీభత్సకాండ దాదాపు రెండు గంటలపాటు సాగడం గిరిజన ప్రజల్లో నెత్తురును ఉడికిస్తోంది. అడవిని నమ్ముకునిజీవిస్తున్న అడవిపుత్రులపై దమనకాండ విభ్రాంతి గొల్పింది. లవ్వాల అటవీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం గొత్తికోయలు, అటవీ సిబ్బంది మధ్య రణరంగంగా మారింది. ఆప్రాంతం ఖాళీ చేయాలని మరోచోట నివాసం కల్పిస్తా మని రెండు నెలలుగా చెబు తున్నా నోటీసులు జారీచేస్తున్నా మొండి కెత్తడంతో దాడులకు పూను కోవలసి వచ్చిందని అటవీశాఖ సమర్థించు కుంటోంది.అయినా ఇంత దారుణంగా మూకుమ్మడిగా దౌర్జన్యానికి పాల్పడడం వారిని నిరాశ్రయులు చేయడం,పంటలను ధ్వంసం చేయ డం కేవలం బలదర్పమే తప్ప గిరిజనులకు మేలు చేయడానికి కానే కాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కొంతకాలంగా అడవ్ఞల్లోని గొత్తికోయ గూడేలను అటవీశాఖ బలవంతంగా ఖాళీచేయిస్తోంది.గత కొన్నాళ్లుగా గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతా ల్లో ఈ విధంగా తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఆదాడులన్ని టికన్నా ఈదాడి చాలా ఘోరం.
దాదాపు 125 కోట్ల జనాభా గల భారతదేశంలో గిరిజన, దళిత తెగలకుసంబంధించి రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూలు అంశాలను పొందుపరిచినా ఆదివాసీలకు తగిన న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణం, గనుల తవ్వకం,నగరీకరణ కారణం గా గిరిజనులు నిరాశ్రయులవు తున్నారు. ఆదివాసీలకు స్వయంపాలన కల్పించాలని కొన్నేళ్లుగా కొన సాగుతున్న డిమాండ్‌ నెరవే రకపోగా లాఠీలనురaుళిపించి మహిళలను చెట్లకు కట్టివేసి గూండాగిరి సాగించడం ఎంతవరకున్యాయం? ఐక్యరాజ్యసమితి ఆదివాసీల వారసత్వపు హక్కులు, అటవీవనరులు, ఇతర సమస్యలపై 1982 ఆగస్టు9న జెనీవాలో సదస్సు నిర్వహిం చింది. ఆదివాసీల సమస్యలపై చర్చించింది. అంతేకాదు ఒక కమి టీని నియమించి1992 నుంచి పదేళ్లపాటు అధ్యయనం జరిపిం చింది. సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 100 దేశాల్లో ఐదువేల తెగలకు చెందిన 50కోట్ల ఆదివాసీలు ఉన్నారని, భారతదేశంలో 461 ఆదివాసీ తెగలున్నాయని తేల్చిచెప్పింది. ఈ తెగల్లో 92 శాతం మంది ఆదివాసీలున్నా సమితి తీర్మానించిన విధానాలకు విరుద్ధంగా అత్యంత అమానుష విధ్వంసకాండకొనసాగుతోంది.ఆదివాసీలకు స్వయంపాలన హక్కు, స్వేచ్ఛహక్కు, మానవహక్కుల సంరక్షణ, సంస్క ృతి సంప్రదాయాల జీవన విధాన సంరక్షణ హక్కు, విద్య,వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర హక్కులపై సమితి సదస్సులో తీర్మానించినా ఎంతవరకు ప్రభుత్వాలు వీటిని ఆచరణలోఉంచుతు న్నాయో చెప్ప లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని యుగాల నుంచి సామ్రాజ్యవాదవిధానంపై బీర్సాముండా,గుండాదార్‌కాసు, సిద్ధు, కొమరం భీం,రాంజీనోండు తదితర విప్లవయోధుల పోరాట ఫలితం గానే రాజ్యాంగంలో 5,6వ షెడ్యూలుఏర్పాటయింది.
అయినా ఏంలాభం? ఈచట్టాలన్నీ చట్టుబండలవుతున్నా యి. అభివ ృద్ధి పథకాల పేరుతో ఆదివాసీలను అణచివేస్తున్నారు. సహజ వనరులు, ఖనిజ సంపద కార్పొరేట్‌ వర్గాల వరమవుతున్నాయి. స్వయం స్వాతంత్య్రంతో అడవ్ఞలే తమ ఆధారమని జీవిస్తున్న ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. ఆదివాసీలపై దౌర్జన్యాలు, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా పాలకవర్గాలు మౌనం పాటిస్తున్నాయి. మావోయిస్టులకు అండదండలు అందిస్తు న్నారన్న నేరారోపణతో సాయుధ బలగాలు దారుణాలకుపాల్పడు తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఆదివాసీలపై హింసలు ఆగడం లేదు. ఆంధ్రలోని విశాఖ మన్యంలో ఆదివాసీలపై మావోయిస్టుల ముద్రవేసిహింసించే సంఘటనలు ఎన్నోజరిగాయి.శ్రీకాకుళంలో కన్నె ధార కొండగ్రానైట్‌ మాఫియా చేతిలో ఆదివాసీలు బందీలైపోతున్న ఉదంతాలు ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షలమంది ఆదివాసీలు అడ్రసు లేకుండా పోతున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కొత్త గూడెంలో విమానాశ్రయం నిర్మిస్తే 1600 ఎకరాల భూమి అవసర మని 1/70, పీసా చట్టాలకు వ్యతిరేకంగా బలవంతంగా భూమిని సేకరిస్తున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో అటవీభూము ల్లో అంగుళం భూమయినా ఆదివాసీలకు దక్కకుండా 2006 అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ మొక్కలు నాటుతున్నారు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎదిరి స్తున్న వారికి సంకెళ్లు వేస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల కారణంగా ఉత్తర తెలంగాణ లోని ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 124 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఏజెన్సీలో స్వేచ్చగా పోడువ్యవసా యం, పండ్లతోటలు, కూరగాయలు,పండిరచుకుంటూ అభివృద్ధిచెం దుతున్న ఆదివాసీల జీవనం ఈఓపెన్‌ కాస్ట్‌ గనుల వల్ల చిన్నాభిన్న మయింది. ఈ విధంగా నిర్వాసితులైనవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి అవన్నీ మొక్కుబడి వ్యవహారంగానే మిగిలిపోతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన మండలమైన తిర్యాణిలోని గోలేటి, కైరిగూర్‌, ఓపెన్‌ కాస్టు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటైనా అక్కడ నీరు,విద్యుత్‌, తదితర కనీస సదుపాయాలు లేవుసరికదా ఉపాధిలేక ఎవరూ అక్కడ ఉండడం లేదు. ఇక ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి మరీ దారుణం. 2006 ఆగస్టు 20న విశాఖ జిల్లాలో కొండతెగకు చెందిన వారిని వాకపల్లిలో గ్రేహౌండ్స్‌ దళాలు అత్యాచారం చేస్తే ఇంతవరకు నింది తులకు శిక్షపడలేదు. వాకపల్లి ఆదివాసి అత్యాచార బాధితులు ఈ వ్యవస్థపై నమ్మకం పోయి నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ మహి ళలపై ఎన్నో వేధింపులు, లైంగిక హింసలు సాగుతున్నా పాలక వర్గం పట్టించుకోవడం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఇటుక బట్టీలు తయారు చేసే వారిలో 90శాతం ఆదివాసీ మహిళలే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌,ఒడిశా,మహారాష్ట్రల నుండి వీరిని రప్పించి ఈపనులు చేయిస్తున్నారు. తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎదురు తిరిగితే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిరక్షరాస్యులైన అమా యకపు ఆదివాసీలు తమ బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా న్యాయం జరగదన్న అభిప్రాయం వీరిలో బలంగా నాటుకు పోయింది.
సమాజంలో ఆదివాసీలవేతన అరణ్యరోదనగా మారింది. రాజ్యాంగంలో ని అయిదు, ఆరు షెడ్యూల్‌లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేఆదివాసీల స్థితిగతులు, కొంతవరకయినా మెరుగుపడతాయి. షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీస్థితిని సమీక్షించి ప్రత్యే కించి చర్యలు చేపట్టే అధికారాలు గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఉన్నాయి.- పి.వెంకటేశం

అభివృద్ధి పేరుతో అప్పులు ఎవరి కోసం?

ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. అప్పుల భారతాన్ని, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి ఎవరు బయటపడేస్తారు? లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? ఏ అభివృద్ధి పేరుతో ఎవరు తిన్నట్టు? ఎన్నో వనరులున్న భారతదేశ అభివ ృద్ధికి అప్పులు అవసరమా? అప్పులు చేసి అభివృద్ధి చేయాలా? లక్షల కోట్ల అప్పులున్న దేశాన్ని అభివ ృద్ధి చెందిన దేశంగా ఎలా శ్లాఘించగలం? అన్నీ ప్రశ్నలే..?
అభివృద్ధి పేరుతో జరిగిన లక్షల కోట్ల అప్పు కనిపిస్తోంది తప్ప అభివ ృద్ధి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి అభివ ృద్ధి కనిపిస్తుంది? ఇన్నిన్ని కోట్ల అప్పు చేస్తే మిగిలిందేమిటీ? పేదలపాలిట కన్నీళ్లు.. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎవరికొరకు చేసారు? ఎందుకు చేసారు? అప్పుమూలంగా ఎవరు లాభపడ్డారు? అభివృద్ధి కనిపించదు. అప్పు కనిపిస్తుంది ఎందుకు?
అప్పు నిజం.. అభివ ృద్ధి అబద్ధం. ఇదీ మనదేశస్థితి… ఇదీ మన తెలంగాణ స్థితి. అన్నీ ఉండి అప్పులు చేసి.. అభివృద్ధి చేస్తామని గొప్పలు చేప్పుకోవటం ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ అభివ ృద్ధికి అప్పు చేసామంటే ఒక అర్థముంది. ఆ అభివృద్ధి కనిపించాలి. ఈ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్నీ ఉండి సరిపోయే ఆదాయముండి లక్షల కోట్లు అప్పు చూపిస్తే ప్రజలేమనుకుంటారు? అభివృద్ధి పేరుతో అప్పు తెచ్చి.. తమ ఆస్తులు పెంచుకున్నారని.. కోట్ల రూపాయలు దోచుకొని, దాచుకున్నారని భావిస్తారు. వాస్తవం కూడా ఇదే!
పాలకుల మీద రాజకీయ నాయకుల మీద నిందలు వేయటం సరదాకాదు. నిజానికి ప్రజలు పాలకులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా, ఆదర్శంగా, కడిగిన ముత్యంలా ఉండాలని భావిస్తారు. ‘’మేము ఓటువేసి గెలిపించాం కానీ దొంగైతేలిండు అని చెప్పుకోవటం ప్రజలకు కూడా అవమానమే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గూర్చి నేను రాయటం, మీరు చెప్పటం కాదు, ‘రాజకీయ పక్షాలే ఒకరి నొకరు ‘నీవు దొంగ నీవు దొంగ’ అని తిట్టుకుం టున్నాయి. రాళ్లు వేసుకుంటున్నాయి. దేశంలోని అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐలోని ప్రధమ ద్వితీయ అధికారులే ఒకరినొకరు అవినీతి పరులని ఆడిపోసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పు యాబదివేల కోట్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ పరిపాలనలో ఏడాది క్రితం తేలిన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు.. ఇప్పుడు పత్రికల కథనాల ప్రకారం రెండు లక్షల ముప్పది వేల కోట్ల అప్పు… ఇంత అప్పు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన అప్పు అభివ ృద్ధిలో కనిపించాలి. కనిపిస్తుందా? రెండు లక్షల ముప్పదివేల కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకు చేసినట్టు? తెలంగాణలో ఏఅభవృద్ధి కనిపిస్తుంది? అప్పులతో కూడిన అభివృద్ధి సంత ృప్తికలిగించదు. అభివృద్ధి కనిపించినా కొంత సంత ృప్తి కనిపిస్తుందేమో.‘అభివృద్దే’ కనిపించక పోతే…ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు కానీ, నూతన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పదివేల కోట్లు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? నాలుకోట్లని కొందరంటారు. మనిషికి.. అంటే తలకు ఎంత అప్పు? అరువదివేల అప్పు.. భయం వేయటం లేదూ..? తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకొని.. మన రాష్ట్రాన్ని మనం పాలిస్తున్న తృప్తిలో రెండు లక్షల ముప్పదివేల కోట్ల అప్పు పెంచుకున్నాం. అవసరమా? అవసరమైన అప్పుగా భావించాలా? ఈ లెక్కలు ఇలా ఉండగా.. భారతదేశ అప్పు 50 లక్షల కోట్లు అని ఎక్కడో చదివింది జ్ఞాపకమొచ్చింది. నిజమా? అబద్దమా? లెక్క తేలటానికి అవకాశం లేదు. రకరకాల అప్పులుంటాయి కాబట్టి లెక్క తేలటం కష్టం.. సమాచార హక్కు క్రింద ఈ లెక్కలు యివ్వకపోవచ్చు.. రాష్ట్రాలు సంస్థలు.. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగం కాబట్టి లెక్క కష్టమే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశ్రమల’ పేరుతో ఉపాధి పేరుతో బిచ్చగాళ్లలాగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరిచ్చారు అధికారం? అప్పుల పేరుతో అభివ ృద్ధి పేరుతో ఎవరు దోచుకున్నారు? ఎవరు సంపన్నులయ్యారు? అప్పులు లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందినట్టు? రాఫెల్‌ అవినీతిలో 30వేల కోట్ల అవినీతి ఉందని దేశం సంపద అనిల్‌ అంబానీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్‌ నేత రాహూల్‌ లెక్కలతో చెపుతున్నారు. బడా వ్యాపారులు బ్యాంకులను ముంచిన సొమ్ము పన్నెండు లక్షల కోట్లు. ఇట్టి డబ్బు ఏదో రూపంలో ప్రభుత్వం బ్యాంకులకు యివ్వాలి. ఒకవేళ బ్యాంకులను నింపకపోతే.. బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులకు నింపాలంటే ఎలా? ఘనమైన భారత సర్కారు అప్పు చేయవల్సిందే… లేకపోతే పన్నులు పెంచాలి.. లేకపోతే పెట్రోల్‌ డిజీల్‌పై మరో పది ఇరువది దోచుకోవాలి.. ఇదే భారతదేశ అభివృద్ధి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకయింది? దేశంలో ఉన్న 80శాతం పేద ప్రజలు, శ్రమజీవులు బాగుపడ్డారా? దేశం ప్రధాన ఉత్పత్తి, జీవనాధారం వ్యవసాయం. రైతులు బాగుపడ్డారా? ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల మంది రైతులు అప్పులతో మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఏఅభివృద్ధికి ఈ అప్పులు? భారతదేశం ఎన్నో వనరులున్న దేశం.. ఎన్నో సంపదలున్న విశాల భారతదేశం. మానవశక్తి విపరీతంగా ఉన్న దేశం. డెబ్బది ఏండ్ల స్వాతంత్య్రంలో యాబది కోట్ల లక్షల అప్పు చేసిన ఘనత మన ప్రజాస్వామ్య పరిపాలకులది. ఆంగ్లేయ పాలకులు దేశ సంపదను దోచుకొని ఇంగ్లాడు పంపిస్తే.. మన స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి అభివ ృద్ధి పేరుతో కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని విపరీతంగా పెంచారు. ఆర్థిక అసమానతలకు తెరదీసారు.
నిజానికి భారతదేశానికి 50 లక్షల కోట్లు అప్పు ఎందుకయ్యిందో అర్థం కాదు. ఏ అభివృద్ధి జరిగిందో అర్థం కాదు. ఉద్యోగాల కల్పన లేదు. కొత్త నిర్మాణాలు లేవు. ఎవరితో యుద్ధం లేదు. అందరూ జీతాలు రెట్టింపు చేసుకోవటం తప్ప కొత్త ఉద్యోగాలు లేవు. ఆదాయం విషయంలో గతం కంటే రెట్టింపు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ఆదాయం పెరిగింది. పెట్రోల్‌ డీజిల్‌ రెట్టింపు రేట్ల అమ్మకం ద్వారా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. పైగా కొత్తగా బొగ్గు, మైనింగ్‌ ద్వారా, ఇంటర్నెట్‌ సేవల మూలంగా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పన్నుల చట్టం జీఎస్‌టీ ఆదాయం ఉండనే ఉంది! మరి ఈ ఆదాయమంతా ఏమైనట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినట్టు? ప్రతి ఏటా ఇరువది లక్షల పైన బడ్జెట్‌? ఎవరు తింటున్నట్టు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే అన్నారు. తెలంగాణకు వనరులు న్నాయి. నదులున్నాయి. పచ్చని పొలాలున్నాయి. ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. లక్షకోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని అమిత్‌షా అన్నారు. రెండు లక్షల కోట్లకు అప్పు ఎందుకు పెరిగినట్టు?ఎవరు బోంచేసినట్టు?- – సిహెచ్‌.మధు

అడవిపై ఆదివాసీకి హక్కు ఎక్కడ?

అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరిణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు. దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలో ఉన్నాయి.వూకె రామకృష్ణ దొర
తరతరాలుగా ఆదివాసీలు అడవులతో మమే కం అయిపోయి అవినాభావ సంబంధంలో జీవనాన్ని గడుపుతున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, మూలికలు ఇతర ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆదివాసీలు ఆర్థిక వ్యవస్థ అంతా అడవులపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు సామాజిక, సాంస్క ృతిక, సంప్రదాయ మత జీవనాలు కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి.
ఆదిమకాలం నుంచి అడవులను ఆదివాసీలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలోకి బ్రిటీషు వారి ప్రవేశంతో సమస్యలు తలెత్తాయి. బ్రిటీషు పాలకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి భూమికి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. వనరులను తమ ఆదాయన్ని పెంచే సాధనాలుగా గుర్తించి అడవులనూ అమ్ముకోవచ్చు అనుకున్నారు.
అందుకనే ఆదివాసీలనూ అడవి నుంచి తరిమి వాటిని తమ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి అటవీ హక్కుల విధానాలనూ రూపొందించి అడవులపై తన అధికార పరిధిని పెంచుకుంటూ దోపిడి చేయటం ప్రారంభించారు. అనాదిగా అడవులు తమకి చెందినవని భావిస్తున్న ఆదివాసీల పట్ల అటవీ విధానాలు ఆశనిపాతాలయ్యాయి. అడవికి ఆదివాసికి మధ్య అగాధాన్ని పెంచాయి.
1894లో మొదటిసారిగా బ్రిటీషు ప్రభు త్వం అటవీ హక్కుల విధానాన్ని ప్రకటించింది. దీనితో అటవీ శాఖ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రమంగా ఆదివాసీలపై ప్రభుత్వ అధికారం మొదలయ్యింది. భారతదేశ స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వం 1952లో నూతన అటవీ విధానాన్ని తీసుకవచ్చింది. దీనిలో ఆదివాసుల హక్కులు రాయితీల స్థానానికి దిగజారిపోయాయి.
1894 అటవీ విధానానికి భిన్నంగా 1952 అటవీ విధానంలో మొత్తం అటవీప్రాంతానికి ఒకేపద్ధతి అవలంభించారు. ఈచట్టంతో అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం అంగీకరించారు. పచ్చిక బయళ్ళనూ అడవుల్లో పశువులకూ ఉచితంగా మేపుకునే స్వేచ్ఛనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
1952లో జాతీయ అటవీ విధానం అడవులనూ వ్యాపారానికి వాడుకునేందుకు అనువైన పరిస్థితిని రూపొందించింది. ఈ విధానమే ఆదివాసీలను అడవికి పరాయివాళ్ళను చేసింది. పారిశ్రామిక అవసరాలకు అడవులను నరకకుండా ఆపలేకపోయారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తీసుకవచ్చారు. ఈచట్టం ఆదివాసుల జీవనాన్ని భవిష్యత్‌నూ మరింత ప్రమాదంలోకి నెట్టింది.
భారత అటవీ సంరక్షణ చట్టం ద్వారా మానవ సంచారం లేకుండా ఉండే అటవీ ప్రాంతాలుగా అడవిని పునర్నిర్వించడం జరిగింది. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. చట్టబద్ధంగా పొందవల్సిన అటవీ ప్రాంత ఆదివాసీల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. అడవిని రిజర్వ్‌ చేసే క్రమంలో ఆదివాసీ గ్రామాలు, భూములు రిజర్వులలో కలిసిపోయాయి.
అటవీశాఖ ఏకపక్షంగా, గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూములు సర్వే చేయకుండానే అనేక సాగుభూములనూ ‘రిజర్వ్‌’ గా నోటీపై చేసింది. అటవీ చట్టం ప్రకారం ఆదివాసీలు తమ సొంత భూమిలోనే ఆక్రమణదారులుగా గుర్తించబడ్డారు. అడవి, ఆదివాసులకి మధ్య మరింత దూరం పెరిగింది.
ఆదివాసీ ప్రజలకు అడవికి ఉన్న సంబంధాన్ని వారి సంప్రదాయ హక్కులనూ, అవసరాలనూ కాపాడాలని 1908లో భారత అటవీ విధానం గుర్తిం చింది. దానికి అనుగుణంగా 1990 సెప్టెంబర్‌ 18న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ: 13-1/90 ఎఫ్‌పి 1,2,3,4,5 అనే సర్క్యులర్స్‌ జారీ చేసింది. అవి ఇప్పటి వరకు అమలు జరుగలేదు.
1996లో పంచాయితీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని అటవీ వనరులపై ఆదివాసీలకే అధికారం ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రభుత్వమే దానిని ఉల్లఘించి నిర్లక్ష్యం చేసింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తరువాత రిజర్వు ఫారెస్ట్‌గా వర్గీకరించేటప్పుడు ఆదివాసుల భూములనూ, ఉమ్మడి భూముల్ని హక్కుల్ని నిర్ధారించకుండానే సెటిల్‌ చేయకుండానే అడవులుగా ప్రకటించారు. ఆదివాసీల సెటిల్‌మెంట్‌ హక్కుల గురించి పట్టించుకోలేదు. 1952 నాటి జాతీయ అటవీ విధానంను భారత ప్రభుత్వం సవరించి 1980 అటవీ సంరక్షణ చట్టం ద్వారా అడవి హక్కులపై భారత ప్రభుత్వానికి పూర్తి ఆదిపత్యం వచ్చింది. ఎవరైతే వ్యాపార పరంగా అడవులను ఆదివాసీలనూ దోచుకున్నారో ఆవర్గాల నుండి వచ్చిన వారే అడవి రక్షకులుగా మారి అడవులనూ భక్షించారు.
అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరి ణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు.
దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది.
దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలోఉన్నాయి.
రచయిత : తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు, 9866073866

మహనీయ.. ‘స్వామి వివేకానంద’

‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి’’ – డా. దేవులపల్లి పద్మజ
ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒకరోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావనలు, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీదమరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థనిమీలనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒకజగద్గురువు. సామాజికసృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విష యాలను వివేకించటం ద్వారా ఆధ్యా త్మికసౌధాన్ని నిర్మించడం, ఆసౌ ధంలో చైతన్యమూర్తులుగా జనులను విరా జిల్లింప చేయటంస్వామి వివే కానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విష యాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తులు వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసు కోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివే కానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివే కానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంత ర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చైతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను, మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం, లోకాన్ని మనం అర్దం చేసు కోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ఙ్ఞాన,కర్మ,భక్తి,యోగ మార్గాలలో కానరాని వెలుగు ఆస్వాదించి వారివచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారత దేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ‘‘నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మజ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పే వారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియం త్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వా న్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసిం చేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరు నిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతిమౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం. అహిం సలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మఙ్ఞానంలో సుప్రతి ష్టులై ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారత దేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాద లను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వం తో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజ యం సాధించారు. దుస్తరమైన అద్వైతాన్ని కళాత్మకమైనదిగానూ, సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదా యాలను అత్యంతశాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరించేవారు. సత్యమనేది మతానికి ఆపాదిం చటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీరగంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మ న్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారం భించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులలో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయ నటంలో అతిశయోక్తిలేదు. వివేకానందుడు నిరంతరం మననం చేసు కునే కఠోపనిషత్తులోని శ్లోకం
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్నిః !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి !!
‘‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’’
‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆతరువాత నాదేశభక్తి వేయి రెట్లు అయింది. యువకు ల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధైర్యం సడలి, దౌర్భల్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణుల శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్భల్యాలు, అధైర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం. రచయిత :ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫోను. 9849692414

1 11 12 13