ఆరోగ్య కోసం అందరం..

ప్రపంచ వ్యాప్తంగా 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నాం.‘ఆర్థిక,సామాజిక పరిస్థితులు, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలను అనుభవించడం ప్రతి మానవుని ప్రాథమిక హక్కు’ అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రజలను, ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకురావడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క లక్ష్యం. మానవాళికి సంబంధించిన ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యల వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క లక్ష్యం.- జి ఎన్ వి సతీష్ 
ప్రజారోగ్య సమస్యలపై ఆసక్తి ఉన్న వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు దీనిని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తాయి. ప్రతి సంవ త్సరం ఒక అంశాన్ని ఎంపిక చేసి,దానిపై అవగాహన కల్పించడంపై ఏడాది పొడవునా కార్యక్రమాలను కేంద్రీకరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) 2026 సంవత్సరానికి గానూ”ఆరోగ్యం కోసం అందరం కలిసి.. సైన్స్‌కు తోడుగా నిలుద్దాం..” (Tశీస్త్రవtష్ట్రవతీ fశీతీ ష్ట్రవaశ్రీtష్ట్ర. Staఅd wఱtష్ట్ర scఱవఅcవ) అనే నినాదాన్ని తీసుకుంది. ఈ నినాదాన్ని ఈ సమయంలో ఎంచు కోవడానికి వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సల పుకార్లు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు సరైన వైద్యానికి దూరమవుతున్నారు. అందుకే ”సైన్స్‌కు తోడుగా నిలబడాలి”అనే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధానంగా నొక్కి చెబుతోంది.సైన్స్‌కి మనం తోడుగా ఉండడం అంటే ఫ్రెండ్స్ పక్కన నిలబడడం కాదు సైన్సును మనం సక్రమంగా వినియోగించు కోవాలని. శాస్త్రీయంగా ఆలోచించాలి అని. శాస్త్రీయంగా జీవించాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం.కోవిడ్ సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న ఆరోగ్య సంక్షోభం ఎలాంటిదో మనం కళ్ళారా చూశాం. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితానికి అతిపెద్ద ముప్పులలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రజారోగ్యానికి మునుపెన్నడూ లేని విధంగా సవాలు విసిరింది. ఈ మహ మ్మారి వల్ల కలిగిన ఆర్థిక, సామాజిక అంతరాయం వినాశకరమైనది. ఇది ఇటీవలి ఆరోగ్య రంగాన్ని దెబ్బతీసింది.మరింత మందిని పేదరికంలోకి నెట్టింది.ఆహార అభద్రతకు దారితీసింది. అంతేకాదు మొత్తం ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఆ సమ యంలో కేవలం శాస్త్రీయ పరిశోధనలు, వాటి వల్ల తయారైన వ్యాక్సిన్ల వల్లే మనం ప్రాణా లను కాపాడుకోగలిగాం.
ఆధునిక చికిత్సలు..
గతంలో కూడా ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకొన్ని సంక్షోభాలు రావచ్చు. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి కొత్త విపత్తులను ఎదుర్కోవాలంటే సైన్స్ ఒక్కటే మార్గమని గుర్తుచేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నినాదాన్ని తీసుకుంది. ఆరోగ్యం అన్నది కేవలం డాక్టర్ల బాధ్యత మాత్రమే కాదు.. డాక్టర్లు జబ్బు రాకుండా సూచనలు చేయగలరు. జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయగలరు. దానితోనే సమాజం అంతా ఆరోగ్యంగా ఉండలేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) ప్రకారం,ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేదా వైకల్యాలు లేకపోవడం మాత్రమే జలది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తిగా క్షేమంగా ఉండడం. ఇందుకొరకు సమాజంలోని ప్రతి ఒక్కరూ (Tశీస్త్రవtష్ట్రవతీ) భాగస్వాములు కావాలి. వాతావరణ మార్పులు,కాలుష్యం వంటి సమస్యలు ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని అరికట్టడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జన్యు చికిత్స(Gవఅవ Tష్ట్రవతీaజూy) వంటి అత్యాధునిక సాంకేతికతలు వైద్య రంగంలోకి వచ్చాయి. ఈ విజ్ఞాన ఫలాలు సామాన్యులకు కూడా అందేలా చూడటం, సైన్స్ పట్ల ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయడం చాలా అవసరం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ”ఆరోగ్యం కోసం అందరం కలిసి.. సైన్స్‌కు తోడుగా నిలుద్దాం” అనే నినాదాన్ని తీసుకుంది.
బాధ్యతగా గుర్తించాలి..
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి వల్ల అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అందుకే ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక కాదు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల ముందుకు తెచ్చిన ఆరోగ్య సూత్రాన్ని జీవితకాలం ప్రజలు ఆచరించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఆరోగ్యం అందాలంటే ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. దీనిని ప్రభుత్వాలు తమ ప్రధాన బాధ్యతగా గుర్తించాలి. మనకున్న పేదరికంలో వైద్యానికి అవుతున్న ఖర్చులు కారణంగా ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతు న్నారు. దీనిని నుంచి బయటపడాలి అంటే ప్రజలందరికీ వైద్యం అన్నివేళలా, ఎక్కడైనా ఉచితంగా అందుబాటులో ఉండే విధంగా చేయాలి. అందరూ వైద్యాన్ని పొందే విధంంగా ”ఆరోగ్య హక్కు” చట్టాన్ని తేవడం మంచిది. ఇది ప్రభుత్వ బాధ్యత. దీనితోపాటు ప్రజలం దరూ ఆరోగ్య నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మెరుగైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, కలుషితం లేని పర్యావరణం మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.
శాస్త్రీయతే ప్రధానం..
అందరికీ ఆరోగ్యం-మనందరి బాధ్యత. మెరుగైన ఆరోగ్యం కోసం శాస్త్రీయంగా ఆలోచిద్దాం. శాస్త్రీయతను పాటిద్దాం, శాస్త్రీయ పరిశోధనలకు మద్దతును ఇద్దాం.
ఆరోగ్యకరమైన ప్రపంచం అనే ఆశయం ఒక సుదూర స్వప్నం కాదు. సాక్ష్యాధారిత ఆరోగ్య విద్య, ఆరోగ్య సమస్యలపై అవగాహనతో దీనిని సాధించవచ్చు. పాఠశాలలు, కళాశా లలు, సంఘాలు,వైద్యులు,ఆరోగ్య కేంద్రాలు, స్వచ్ఛంద సేవకులు వంటి సంస్థలతో పాటు, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా దీని గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయాలి. దాని కోసం కృషి చేయడానికి ఏకమైనప్పుడు మాత్రమే ఈ కల నిజమవుతుంది. అలాగే, మానవ కార్యకలాపాల వల్ల కలిగే వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత గురించి కూడా మనం ఆలోచించాలి. వాటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.ఈ సందర్భంగా”ఈసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోరు” అనే గురజాడ అప్పారావు గారి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. కర్షకులు, కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంపాదనా శక్తి పెరుగుతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. మన ఆరోగ్యం కోసం మనం బాధ్యత తీసుకోవాలి. ప్రజల కంటే ఎక్కువ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ గత75ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారో గ్యాన్ని మెరుగుపరచడంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) ఏర్పాటు..
ఈ సంస్థ ఏర్పాటు వెనక ఒక సుదీర్ఘమైన ప్రక్రియ మరియు అంతర్జాతీయ సహకారం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహ కారం కోసం ‘ఐక్యరాజ్యసమితి’ (యుఎన్) ఏర్పడింది. 1945లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో, ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యలను పర్యవేక్షిం చడానికి ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ ఉండాలని బ్రెజిల్, చైనా ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు 1946 జూన్ నెలలో న్యూయార్క్‌లో ‘అంతర్జాతీయ ఆరోగ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబ్ల్యుహెచఓ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించారు.
1948 ఏప్రిల్ 7వ తేదీన డబ్ల్యుహెచఓ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టినరోజైన ఏప్రిల్ 7వ తేదీని ”ప్రపంచ ఆరోగ్య దినోత్సవం”గా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ ప్రజలందరికీ మంచి స్థాయి ఆరోగ్యాన్ని అందించడం దీని ఆశయం.ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల నిర్మూలన (ఉదాహరణకు: పోలియో,కలరా),ఆరోగ్య ప్రమాణాల నియం త్రణ,అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో (Paఅdవఎఱcs) దేశాలకు మార్గనిర్దేశం చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) కార్యాలయాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహించడానికి వివిధ స్థాయిలలో కార్యాలయాలను కలిగి ఉంది. డబ్ల్యుహెచఓ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉంది. ఇక్కడ నుండే ప్రపంచవ్యాప్త ఆరోగ్య విధానాలు, నిర్ణయాలు తీసుకోబడతాయి. ప్రపంచాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఆగేయ ఆసియా ప్రాంతం కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం ఈ విభాగం కిందకే వస్తుంది. భారతదేశంలో డబ్ల్యుహెచఓ ప్రధానంగా రెండు ముఖ్యమైన కార్యాలయాలను కలిగి ఉంది. 1.డబ్ల్యుహెచఓ ఇండియా కంట్రీ ఆఫీస్. ఇది న్యూఢిల్లీలోని ‘నిర్మాణ్ భవన’ లో ఉంది. ఇది భారత ప్రభుత్వంతో కలిసి ఆరోగ్య కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది.
2.దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ కార్యాలయం ). ఇది కూడా న్యూఢిల్లీలోని ‘ఇంద్రప్రస్థ ఎస్టేట’ లో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధించిన విజయాలు
3.ప్రపంచ ఆరోగ్య సంస్థ గత 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.

మశూచి నిర్మూలన
ఇది డబ్ల్యుహెచఓ సాధించిన అతిపెద్ద విజయం.1967లో ప్రారంభించిన తీవ్రమైన టీకా కార్యక్రమం ద్వారా,1980నాటికి ప్రపంచం నుండి మశూచిని పూర్తిగా తుడిచిపెట్టేశారు. మానవ చరిత్రలో శాస్త్రీయంగా ఒక వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ఇదే మొదటిసారి.

పోలియో నివారణలో పురోగతి
1988లో ‘గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ’ ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది మంది పిల్లలు పక్షవాతానికి గురయ్యేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషితో ఇప్పుడు ప్రపంచంలోని 99.9% ప్రాంతాల్లో పోలియో నివారించబడింది. భారతదేశం కూడా 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది.

అంటువ్యాధుల నియంత్రణ..
క్షయ (టిబి), మలేరియా వ్యాధుల మరణాల రేటును తగ్గించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణనీయమైన విజయం సాధించింది. ఇటీవల మలేరియాకు మొదటి టీకాను ఆమోదించడం ఒక మైలురాయి.ఎయిడ్స్ బాధితులకు అవసరమైన మందులు (Aఅtఱతీవtతీశీఙఱతీaశ్రీ tష్ట్రవతీaజూy) చౌకగా అందేలా చేసి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది.
ఎబోలా మరియు కోవిడ్-19 అత్యవసర సమయాల్లో వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేయడం, దేశాల మధ్య సమన్వయం సాధించడంలో ముందుండి నడిపించింది.

తల్లి-బిడ్డ ఆరోగ్యం..
ప్రసవ సమయంలో తల్లుల మరణాలను, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలను తగ్గించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించింది. ముఖ్యంగా పోషకాహార లోపం, రోగనిరోధక టీకాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

పొగాకు నియంత్రణ
పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన Tశీbaccశీ ్పుశీఅtతీశీశ్రీ (ఖ్పుీT్పు) ద్వారా అనేక దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం మరియు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో..
2024 నాటికి భారతదేశం ట్రాకోమా (కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్) నుండి విముక్తి పొందింన దేశంగా అధికారికంగా ప్రకటించింది.