కార్పొరేట్ల పరం కానున్న ఖనిజం

మోడీ ప్రభుత్వ వికసిత్ భారత్ నుంచి ఉద్భ వించిన స్వర్ణాంధ్ర -2047 నుంచి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అస్త్రం తీసింది. పారిశ్రామిక, కార్పొరేట్ శక్తులకు అత్యంత వేగంగా లాభాలు కట్టబెట్టడానికి రేర్ ఎర్త్ మినరల్ (అరుదైన ఖని జాలు) కారిడార్‌కు రూట్‌మ్యాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాయి. అదానీ, అంబానీ వంటి కుబేరులకు కట్టబెడుతున్న భూములు, గనులు, ఓడరేవులు, విమానాశ్ర యాలు సరిపోక… తీర ప్రాంతాన్నీ వారి గుప్పెట్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. తీర ప్రాంత ఇసుకలో లభించే అతి విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు స్వాధీనపర్చేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ ఖనిజాలను కొల్లగొట్టుకుపోయేందుకు అమెరికా పన్నిన వ్యూహంలో భారత్ పడింది. – గుల్ల కాంతారావు
అరుదైన ఖనిజాలకు చైనాపై అమెరికా ప్రధా నంగా ఆధారపడింది. చైనా ఇటీవల ఖనిజ ఎగుమ తులపై,వాటి శుద్ధి సాంకేతికతపై నియంత్రణ విధిం చడంతో అమెరికా భరించలేకపోతున్నది.సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా,బ్రెజిల్,భారత్ నుంచి ఎగుమతి చేసుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అమెరికా మాట జవదాటని మోడీ ప్రభుత్వం,దాని ప్రయోజనాలకనుగుణంగా ఖనిజ రంగంలో భారీ మార్పులను తీసుకొస్తోంది. ఖనిజ తవ్వకాలకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ మోడీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.భారత్‌లో అత్య ధికంగా ఆంధ్రప్రదేశ్,ఒడిశా తీరప్రాంతంలోని ఇసుక లో భారీ పరిమాణంలో ఖనిజాలున్నాయి. సముద్ర ఇసుకలో మైనింగ్ ప్రాసెసింగ్,పరిశోధన,తయారీకి ఆంధ్రప్రదేశ్,ఒడిశా,కేరళ,తమిళనాడును ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లుగా ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 బడ్జెట్‌లో రూ.7,280 కోట్లు కేటాయిం చింది.దేశంలో 30 మినరల్ బ్లాకులను అందుబాటు లోకి తెచ్చింది. తీర ప్రాంత ఇసుక నుంచి ఖనిజ తవ్వకాల లీజులకు ఆసక్తి కనబర్చుతున్న కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడి ప్రోత్సాహం,భారీ రాయితీలు కల్పించనుంది. సముద్రంలో ఖనిజ తవ్వకాలతో వచ్చే శబ్ధాలు,ప్రకంపనలు,మత్స్య సంపద దెబ్బతినడం, ఇంధనాలు,రసాయనాలు సముద్రంలో కలవడంతో జీవ,మానవ మనుగడకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడు తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతు న్నారు. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలు తగ్గి, కోతకు గురవుతాయి. తీర సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశిం చడంతో తాగునీటి సమస్య ఏర్పడుతుంది. నిర్మాణాలు దెబ్బతింటాయి. జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుంది. ఇసుక శుద్ధి క్రమంలో వెలువడే వ్యర్ధాలు సముద్రం లోకి వదలడంతో చేపలు చనిపోతాయి. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిబతుకుతున్న మత్స్యకారుల కొద్దిపాటి జీవనోపాధి పోతుంది.సముద్రపు ఇసుకలోని మోనజైట్ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో పరిసర ప్రజలు చర్మ, క్యాన్సర్, ఊపిరితిత్తులు వంటి వ్యాధుల బారినపడతారు. ఇసుక తవ్వకాలు జరిగిన తీరంలో మత్స్యకారుల వేట పడవలు ఉంచడానికి చోటుండదు. ఇన్ని అనర్ధాలు, నష్టాలు, దుష్ఫ్రభావా లున్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి.
గతేడాది అమెరికా భారీగా సుంకాలు విధిం చినా భారత్ నోరు విప్పలేదు. అందుకని ఖనిజాలపై చైనాపై ఆధారపడ్డం తగ్గించుకొని తామేమన్నా, కాదనని భారత్‌పై అమెరికా దృష్టి పెట్టింది. కొద్ది రోజుల క్రితం భారత్ పర్యటనకు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడిక్ మెర్జ్ వచ్చిన సందర్భంగా జరిగిన 19 అవగా హనా ఒప్పందాల్లో కీలక ఖనిజ రంగం ప్రధానంగా వుంది.
ప్రపంచంలో మÖడో అతిపెద్ద అరుదైన, విలువైన 48.2కోట్ల టన్నుల ముడి నిల్వలున్నట్లు దేశ సముద్రతీరంలో వున్నట్లు కేంద్రం గుర్తించింది. ఎసఐఓ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్‌శాండ్ నిల్వలు 241 మిలియన్ టన్నులకు పైగా వున్నాయి. దేశంలో బీచ్‌శాండ్ నిల్వలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వుంది.ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్,రక్షణ రంగ వృద్ధికి ప్రపంచ వ్యాపితంగా ప్రాధాన్యత పెరుగుతుంది. 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగెట్‌ల వినియోగం రెట్టింపు అవు తుందని అంచనా. మోనజైట్ నిల్వలు 35 శాతం రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సము ద్రతీరంలో వున్నాయి.దేశంలో 7.23 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వున్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ గుర్తించింది. 13.15 మిలియన్ టన్నుల మోనజైట్‌లో 7.23మిలియన్ టన్నుల మÖల కాలున్నాయని అంచనా.
రాష్ట్రంలో 40వేల ఎకరాలలో,అత్యంత నాణ్యమైన ఖనిజాలు విశాఖపట్నం,శ్రీకాకుళం జిల్లా ల్లో వున్నట్లు ఎపి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి) గుర్తించింది.విశాఖపట్నం జిల్లా భీముని పట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల మధ్య 2,500 ఎకరాల తీరంలో తొలుత ఖనిజ తవ్వకాలు ప్రారంభించి, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఆకర్షిం చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2,265 ఎకరాల బీచ్ శాండ్ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌ను అదానీ గ్రూపునకు చెందిన అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ దక్కించుకున్నట్లు సమాచారం. సముద్రతీర ఇసుకలోని ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై కోర్టు తీర్పులు, ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. తీరంలోని విలువైన ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న నిబంధనలను పట్టించుకోవడంలేదు.
పర్యావరణ, జీవవరణ సమస్యలు, మత్స్యకా రుల ఉపాధి బాధ్యత వదిలి, సింగ్ విండో పద్ధతిలో బీచ్‌శాండ్ తవ్వకాల అనుమతులు,భూ కేటాయిం పులు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలపైనే దృష్టి కేంద్రీకరించింది. కార్పొరేట్ల లాభాలకు తీర ప్రాంత ప్రజలను, ప్రధానంగా మత్స్యకారుల జీవనో పాధిని ఫణంగా పెట్టడానికి రెండు ప్రభుత్వాలూ సిద్ధపడ్డాయి.