ముగిసిన స్థానిక పుర,పరిషత్ ఎన్నికలు

రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా మున్సిపాల్టిలు,జిల్లాపరిషత్, ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాయి. నవంబరు ఒకటన తొలిదశలో 92 పట్టణ స్థానిక సంస్థలకు (13నగర పాలక సంస్థలు,87పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు)ఎన్నికలు జరిగా యి.వీటిలో ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా 17మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.13మేయర్,70 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు మేయర్లు, చైర్మన్లు ఎంపిక జరిగింది. మొత్తం3,942 వార్డు స్థానాలకు గానూ 755వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 99.36లక్షలు ఉండగా..వీరిలో మహిళా ఓటర్ల సంఖ్యే అత్యధికం (51.05 లక్షలు),పురుష ఓటర్లు 48.29లక్షలమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుర పోర్లులో కొన్ని జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి జిల్లాలో తిరిగి పోలింగ్ ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోరు
నవంబరు 5నజిల్లా పరిషత్,ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాయి.రాష్ట్రగ్రామీణ ప్రాంతంలో2.61కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకు న్నారు.మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 659 జెడ్‌పిటిసి స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిదులు ఎన్నికయ్యారు. 9,821ఎంపిటిసి స్థానాలకుగాను 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాల్లో పోటీ నెలకొనగా,వారిలో ఎంపీటీసీలుగా విజయం సాధించారు. అర్నబ్,మురసు తుపాన్లను లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ఉత్సహంగా వినియోగించుకున్నారు.ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రవాణా, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఓటర్ల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ,పోలీసు బలగాల మోహరింపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని కల్పించారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున వెల్లడించారు. వీడియో రికార్డింగ్ సమయంలో ఓటు రహస్యానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాన్లు కారణంగా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికలు 5 మండలాల్లో ఎన్నికలు 6వ తేదీకి వాయిదాపడ్డాయి.పెదవాగు ప్రాజెక్టు రింగ్బండకు గండితో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిల్చిపోయాయి. దీంతో, బుట్టాయి గూడెం,పోలవరం, జీలుగువి Tల్లి, వేలేరుపాడు మండలాల్లో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు 6వ తేదీకి వాయిదా వేశారు.అవి కూడా ప్రశాంతంగానే ముగిశాయి.– జి ఎస్ ఎన్ సతీష్