భాషలను వదిలేస్తే నాగరికత సగం వదిలేసినట్టే

విశాఖపట్నం ప్రతినిథి : భారతీయ భాషల న్నింటిలోనూ మనదైన సంస్కృతిసాంప్ర దా యం శక్తి ఉన్నాయని భాషలను వదిలేస్తే సగం నాగరికతను వదిలేసినట్టేనని సాహితీవేత్త సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అన్నారు.ముఖ్యంగా అడవిదాటి రాని గిరిజన భాషలు అమూల్య మైనవని ప్రాచీన మైన వీటన్నింటిని నిలుపుకొని పరిశోధనలతో సుసం బంధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన భాషలు భారతీయ భాషలే అనే అంశం పై ఆంధ్ర విశ్వవిద్యాలయం శక్తిఫౌండేషన్ సంయుక్తంగా గత నెలలో రెండు రోజులపాటు ఆంధ్ర విశ్వ విద్యాల యం అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాల యం వైస్‌ఛాన్సలర్ ఆచార్య జిపిరాజశేఖర్ ఏక లవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పివేణు గోపాల్‌రెడ్డి,విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవిఆర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.జొన్నవిత్తులప్రధానోఉపన్యాసం చేస్తూ,మహోన్నతమైన సంస్కృతికి నాగరిక తలతో కూడిన గిరిజనభాషనుంచి మనం నేర్చు కోవాల్సింది ఎంతో ఉందని,అందుకోసం గిరిజన మాండలికాలు,పదాలు,వైద్యానికి సంబం ధించిన విషయాలపై పరిశోధ నలు జరగాలని అన్నారు.వారికథలు,పాటలు సామెతలు చాలాఉన్నతమైనవని,గిడుగురామ్మూర్తి రాసిన సవర కథలు ఎంతో స్ఫూర్తిదాయకంగాఉంటాయని చెప్పారు.
తెలుగు భాషకే సరైన ప్రోత్సాహాన్ని ప్రభు త్వాలకు ఇవ్వని సందర్భంలో గిరిజన భాషలను కాపాడుకోవడం కాస్త ఇబ్బందికరమైన విషయ మని, అయినప్పటికీ ప్రజలు భాషల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు.పిల్లలకు తెలుగు అక్షరం నేర్పకపోతే ఎలాగని స్థానిక భాషల్లోనే ప్రాథమిక విద్య బోధించాలని అన్నారు. మన సం స్కృతి మనభాషలను మనకు కాకుండా చేసే ప్రభు త్వాలను మనం తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
మరో అతిధి పి.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం గిరిజన భాషల్లోనే విద్యాబోధన జరగా లని అన్నారు.8వ తరగతివరకు విద్యాబోధన స్థానిక భాషలోనే జరగాలని కేంద్రంస్పష్టం చేసిం దని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు జరపాలని కోరారు.గిరిజన ఉపాధ్యాయులే ప్రాథమిక విద్యను బోధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని అన్నారు. గిరిజన భాషల్లోనే పుస్తకాల ప్రచురించాలని సూచించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గిరిజన ప్రాంతాల్లో వినియోగం,పిసా చట్టం అమలు ద్వారా మాత్రమే ఇది సాధ్యమ వుతుందని చెప్పారు.
ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ, గిరిజన భాషా వికాసంకోసం ఆంధ్రవిశ్వవిద్యాలయం అల్లూరు జిల్లా యంత్రాంగంతో ఒప్పందానికి కుదుర్చు కున్నదని,గిరిజన భాష,ఆరోగ్యంపై పరిశోధ నలు చేస్తామని చెప్పారు. ప్రతి గిరిజన భాషకు లిపి అవసరమా లేదా అన్నదానిపై భాషావేత్తలు పరిశోధన చేయాలని,ఏఐ యుగంలో నాలుగైదు భాషలకు కలిపి ఒక లిపి ఉంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గిరిజన భాషలకు ప్రజాదా రణ కల్పించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంటుందని చెప్పారు.ఆచార్య డి. సంధ్య దీపిక స్వాగతం పలకగా ఆచార్య పివి లక్ష్మీనారాయణ అతిధులను పరిచయం చేశారు. గిరిజన విద్యార్థి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.- జి ఏ సునీల్ కుమార్