ఎల్‌నినో పంజా ముంచుకొస్తున్న ముప్పు
“ ఎల్‌నినో ఎఫెక్ట్ రబీపంటల సాగుపైనా పడింది.దేశంలో ఈరబీ పంటల సాగు విస్తీర్ణం 28.26లక్షల హెక్టార్ల నుంచి 18.02లక్షలహెక్టార్లకు తగ్గింది.వాతావరణమార్పులు,ఎల్‌నినో ప్రభావం దేశంలో వ్యవసాయరంగంపై ఆందోళనపెంచు తున్నాయి.ఇప్పటికే ఖరీఫ్(వర్షాకాలం)పంటలసీజన్ను అతలాకుతలంచేసిన ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు రబీ(శీతాకాలం) పంటలపైనా తీవ్రంగాపడుతోంది.ఈఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణంకంటే 13శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వాతావరణ సమతుల్యతపూర్తిగా దెబ్బతింది.దీనివల్లపొలాల్లో తగినంత తేమలేకరైతులు సాగుపనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నేలలో తేమతగ్గడంసహా సాగునీటిలభ్యతపై ఆందోళనల కారణంగా గోధుమలు,శనగలు సహా పలు పంటలసాగు నెమ్మదించింది.ఈఎల్నినో-రబీపంటలవిత్తనాలువేసే ప్రక్రియను తీవ్రంగాప్రభావితం చేసింది. కేంద్ర వ్యవసాయ రైతుసంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈఆందోళనకరమైన పరిస్థితుల్ని కళ్లకుకట్టింది.”
సగానికిపైగా పడిపోయిన గోధుమల సాగు సాధారణంగా గోధుమల సాగు కాలం దేశంలో అక్టోబర్ నుంచి నవం బర్ వరకు ఉంటుంది.మార్చి- ఏప్రిల్ నాటికి కోతకు వస్తుంది.అయితే కేంద్ర వ్యవసాయశాఖ రిపోర్ట్ప్రకారం గత పం టల కాలం (2025-26)అక్టోబర్ 23వ తేదీ గణాంకాలతో పోలిస్తే, ప్రస్తుత పం టల సంవత్సరంలో (2026-27) గోధు మల సాగు విస్తీర్ణం ఏకంగా 59శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 27వేల (0.27లక్షలు) హెక్టార్లలో గోధుమ విత్త నాలు వేయగా,ఈసారి చూస్తే అది కేవలం 11వేల (0.11లక్షలు)హెక్టార్లకే పరిమితమైంది. గోధుమలతో పాటు శనగలు,అన్ని రకాల పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా భారీగా పడి పోయింది. గతేడాది అక్టోబర్ 23 నాటికి 3.77 లక్షల హెక్టార్లలో శనగలు సాగు చేయగా, ఈసారి 2.21 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడం కూడా ఆహార సరఫరాపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన వ్యక్తమవు తోంది.రాజస్థాన్‌లోనే 58 శాతం తగ్గిన రబీ సాగు రాజస్థాన్ రాష్ట్రంలో రబీ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.గోధుమలు,ఆవాలు,బార్లీ, శనగలు, కందులు,బఠానీలు వంటి పంటలు కలిగి గతేడాది ఇక్కడ అక్టోబర్ 23 నాటికి 14.13లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది అదే తేదీ నాటికి చూస్తే 5.93 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 8.21లక్షల హెక్టార్ల మేర తగ్గుదల నమోదైంది.ఇది దాదాపు 58శాతానికి సమానం.తమిళనాడులో కూడా రబీసాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గింది.యూపీలో స్వల్పంగా ప్రభావం కనిపిస్తోంది.మధ్య ప్రదేశ్‌లో గతేడాది 0.20లక్షల హెక్టార్లలో రబీ సాగు కాగా,ఈసారి అసలు నమోదు కాలేదు. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేరళంలో గతేడాది 0.14లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి 0.11లక్షల హెక్టార్లలో సాగు నమోదైంది.కొద్దిరోజుల క్రితమే, భూమిపై అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావొచ్చని అంచనా వేశారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావించారు. మరోవైపు, మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్‌నినో ఏర్పడే అవకాశం 22 శాతం ఉందని, స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడటానికి 80శాతం, ఒక మోస్తరు ఎల్‌నినో ఏర్పడేందుకు 98శాతం అవకాశాలున్నాయని అభిప్రాయపడింది.
ఇలా దేశవ్యాప్తంగా 2026,అక్టోబర్ 23 వ తేదీ నాటికి చూస్తే రబీ పంటల మొత్తం సాగు విస్తీర్ణం 18.02లక్షల హెక్టార్లుగా ఉంది. గతేడాది ఇదే తేదీ నాటికి ఇది ఏకంగా 28.26లక్షల హెక్టార్లుగా ఉం డటం గమనార్హం.ఎల్‌నినో కారణాలతో ఈసారి 10.24 లక్షల హెక్టార్ల వరకు తగ్గుదల నమోదైంది.ఈసారి శీతాకాలంలో వరి సాగు విస్తీర్ణం కూడా సగానికి సగం తగ్గింది.ఇదిలా ఉండగా,జొన్న,సజ్జ,రాగులు, ఇతర చిరుధాన్యాలు వంటి వాటి సాగు విస్తీర్ణం మాత్రం 13 వేలహెక్టార్ల నుంచి ఈసారి 23వేలహెక్టార్లకు పెరగడం విశేషం.అయితే అన్ని రాష్ట్రాల్లో సాగు తగ్గలేదు.కర్ణాటకలో రబీపంటల సాగు విస్తీర్ణం 1.80లక్షల హెక్టార్ల నుంచి1.91 లక్షల హెక్టార్లకు పెరిగింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా 0.23లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి 0.37లక్షల హెక్టార్లలో సాగు నమోదైంది.భారత వాతావరణశాఖ గణాం కాల ప్రకారం దేశంలో రుతుపవనాల సీజన్లో జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో సాధారణం కంటే 13శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.పంజాబ్‌లో సాధారణం కంటే 38 శాతం,రాజస్థాన్‌లో 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ చివరినాటికి ఈ రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయి.దేశంలోని మొత్తం గోధుమసాగు విస్తీర్ణంలో పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాల వాటానే 31శాతంగా ఉండగా,ఈ రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఎక్కువగా సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుండటంతో దేశ ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే బలహీనమైన నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటల సాగు, దిగుబడులపై ప్రభావం చూపుతుండగా..తగ్గిన జలాశయాల నిల్వలు రబీ పంటలకు నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.మరోవైపు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ అంచనాలు రాబోయే శీతాకాలంలో ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉం దని హెచ్చరిస్తున్నాయి.దీంతో ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడులతోపాటు రబీ ఉత్పత్తుల పైనా తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలు దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం దేశ ఆహార సరఫరా వ్యవస్థపై పడుతుంది.
తెలంగాణలో ఖరీఫ్, రబీ పంటలకు దెబ్బ
నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచాయి.దేశవ్యాప్తంగా 759.4మి.మీ.వర్షపాతం మాత్రమే నమోదైంది.దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ.తో పోలిస్తే ఇది 87.4శాతం మాత్రమే. 1901 తర్వాత నమోదైన అత్యల్ప రుతుపవనాల్లో ఇది13వ స్థానం కాగా..2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతంగా నమోదైంది.దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గింది.ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం 16.32లక్షల హెక్టార్లు తగ్గడం ఆహార భద్రత కోణంలో కీలక పరిణా మంగా మారింది.రాష్ట్రంలో నైరుతి సీజన్లో 17శాతం లోటు ఏర్పడింది.రాష్ట్ర సగటు ఐఎండీ ప్రమా ణాల ప్రకారం సాధారణ కేటగిరీలోనే ఉన్న ప్పటికీ..33 జిల్లాల్లో 18జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొ న్నాయి.దీంతో ఈ సీజన్లో వరిసాగు 54.26లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణ సాగు 65.96 లక్షల ఎకరాలు ఉండగా..12లక్షల ఎకరాల మేర తక్కువగా ఉంది.రబీలో 50.20లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రబీలో తెలంగాణలో దొడ్డు వడ్లనే సాగు చేస్తారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం లోటు మరింత పెరుగుతుంది. రాష్ట్ర అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది.సెంట్రల్ పూల్‌కు వెళ్లే బియ్యం తగ్గనుండటంతో ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉండనుంది.
పప్పులు, నూనెలపైనా ప్రభావం
ఆహార భద్రత అంటే పప్పుధాన్యాలు, నూనె గింజలు,చక్కెర,కూరగాయల ఉత్పత్తి కూడా కీలకమే. దేశవ్యాప్తంగా పంటల దిగుబడు లపై వర్షాభావం ప్రభావం చూపితే..పంట ఉత్పత్తి దుగుబడి తగ్గుతుంది.సరఫరా తగ్గితే బియ్యం,పప్పులు,నూనెలు,కూరగాయల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేప థ్యంలో..పంటల దిగుబడి మరింత తగ్గితే పరిస్థితి కఠినంగా మారే అవకాశం ఉంది.
దేశ ఆహార నిల్వలపై ప్రభావం
వరి సాగు తగ్గితే ఆహార భద్రతలో కీలక మైన ఉచిత బియ్యం పంపిణీలో లోటు ఏర్పడనుంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ పంట కోతలు ప్రారంభం కాగా, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు.ఎంఎస్పీరూ.2, 461 ఉండగా, అంత కన్నా ఎక్కువగా సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.3,200 వరకు చెల్లిస్తున్నారు.దేశంలోని పేదలకు రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలకు అవసరమైన ధాన్యం,మార్కెట్లో ధరలను నియంత్రిం చేందుకు అవసరమైన బఫర్ నిల్వలు.. అన్నింటికీ ప్రభుత్వానికి తగినంత ధాన్యం అవసరం. అందువల్ల ఒకటి రెండు ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గినా.. ప్రభావం కేంద్ర నిల్వలపై పడుతుంది. ఖరీఫ్,రబీ రెండు సీజన్లలో వరిసాగు తగ్గితే, రెండు సీజన్ల ఉత్పత్తిపై ఒకేసారి సీజన్లలో వరి సాగు తగ్గితే, రెండు సీజన్ల ఉత్పత్తిపై ఒకేసారి ప్రభావం పడుతుంది.ఇది దేశ ధాన్యం సేకరణ వ్యవస్థకూ సమస్యగా మారుతుంది.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కసరత్తు ముమ్మరం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్కారు కసరత్తు ముమ్మ రం చేసింది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశినిర్దేశం చేశారు. ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఇటీవల పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా అధికారులకు ఇటీవల కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి వేస్తే నష్టాలు వస్తాయని, డిమాండ్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేవిధంగా రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సూచించారు. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేవిధంగా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనందు వల్ల ప్రత్యామ్నాయ పంటలను వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. – ప్రదీప్ కుమార్
