తుఫాన్లు వాటి ప్రభావాలు
తుఫాన్..ఈ పేరు వింటేచాలుతీరప్రాంత ప్రజలు వణికిపోతారు.అయితే,ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? అవి తీరాన్ని తాకడం వల్ల కలిగే నష్టం ఏమిటనే సందేహం చాలామందిలో ఉంటుంది.‘తుఫాన’ గురించి తెలుసుకునే ముందు..అల్పపీడనం, వాయుగుండాల గురిం చి తెలుసుకోవలసిన అవసరం ఉంది.ఎక్కడైతే ఎక్కువగా గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలుల్లో రెండు రకాల గాలులు ఉంటాయి. అవి వేడి గాలి, చల్లగాలి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది.- గునపర్తి సైమన్
భూ వాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది.గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడ తాయి.దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి.ఈ అల్పపీడనం మరిం త తీవ్రమైతే వాయుగుండంగా మారు తుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా ఏర్పాడు తుంది.సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి.సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘా లుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాయి.
సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్ : భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడం అంటారు.తుఫాన్ తీరాన్ని తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి.సుడులకు కారణ మైన గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిమీ కంటే వేగంగా ప్రయాణించగలవు. ‘కన్ను’ అంటే ఏమిటీ: తుఫాన్లో ఏర్పడే ‘కన్ను’ కూడా ప్రమాదకరమే. తుఫాన్ సుడిలో ఉండే అతిపెద్ద సూన్యప్రదేశమే కన్ను.ఇందులో మేఘాలు ఉండవు,గాలి ఉండదు.ఈకన్ను భూమిపైకి రాగానే తుఫాన్ ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది.అయితే,అదితీరాన్ని దా టిన తర్వాత తుఫాన్ ప్రభావం మళ్లీ కొనసాగు తుంది.తుఫాన్ ప్రభావాన్ని బట్టిఈ కన్ను విస్తీ ర్ణం ఒక కిలోమీటరు పైనే ఉంటుంది.
తుఫాన్, హరీకేన్లకు తేడా ఏమిటీ?: తుఫాన్ల ను ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తారు. ఆగ్నేయాసి యా ప్రాంతాల్లో సైక్లోన్ అని,ఈశాన్య పసి ఫిక్,అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లు అని అంటారు.హరికేన్లు,టైపూన్ల మధ్య తేడా ని గాలి వేగాన్నిబట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100కిమీలు మించితే అది హరికేన్.గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైపూన్ అంటారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఇలాంటివి ఎక్కు వగా ఏర్పడుతాయి.
ఉప్పెనలు ఎలా ఏర్పడతాయి : తుఫాన్ అంటే బలమైన గాలులు, మేఘాలతో కూడి భారీ వలయం.ఇదితీరాన్ని సమీపించే కొల ది సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుఫాన్ వేగానికి సముద్రంలో నీరు భారీ అలల రూపంలో భూమి పైకి చేరుతుంది. దీన్నే ఉప్పెనా అంటారు. అందుకే, అధికా రులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు.తుపాన్లు తరచూ విరుచుకుపడడానికి కార ణాలేంటి? : ఎక్కడో సముద్రంలో ఏర్ప డుతుంది.మెల్లిగా కదులుతుంది.తానుఉన్న చోటును ప్రశాంతంగానేఉంచుతుంది.కానీ చుట్టూ ఉన్నప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది.
తీరం తాకడం అంటే : కొన్నిచోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. అల్పపీడనం తీవ్రంగా మారితే వాయు గుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుపానుగా మారుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుపాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడులు చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడిన తర్వాత తుపానుతో కలిసి ప్రయాణిస్తాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుపాను భూ వాతావరణంలోకి రావడాన్నే తీరం తాకడం అంటారు. తుపాను తీరం తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై, అది ఉన్న ప్రాంతం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల మేర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు గంటకు 60 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయా ణించ గలవు.
అతి పెద్ద శూన్య ప్రదేశమే కన్ను : తుపాను గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ‘కన్ను’ అనే మాట గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది.తుపాను సుడిలోఉండే అతి పెద్దశూన్య ప్రదేశమే కన్ను.తుపాను ప్రయా ణంలో ఇది కేంద్ర స్థానంగా ఉంటుంది. ఇందులో మేఘాలు, గాలి, వర్షం ఉండవు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తుపాను ప్రభావంబట్టి దీనివిస్తీర్ణం10 నుం చి 20కిలోమీటర్లదూరం వరకు ఉం టుంది.కన్నుచుట్టూ ఉండే వలయా కారా న్ని కంటి గోడలుగా పేర్కొంటారు.కంటి గోడల విస్తృతి కేంద్ర స్థానం నుంచి 225 కిలోమీటర్ల వరకు ఉంటుంది.1979 మేలో ఆంధ్రప్రదేశ్‌లో తీరం తాకిన తుపా ను కంటి విస్తృతి 425 కిలోమీటర్లు. అంటే కేంద్ర స్థానం నుంచి అంత దూరంలో ప్రభావం చూపించింది. ఇది ఒక రికార్డుగా చెబుతారు.
తుపానుగా బలపడిన తర్వాత :హుద్ హుద్ విస్తృతి 44 నుంచి 66 కిలోమీటర్లు సాధార ణంగా తుపాను కన్ను విస్తృతి ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి.భారీ నుం చి అతిభారీ,అంతకు మించిన తీవ్రతతో వర్షాలు కురుస్తాయి.వీటితోపాటు ఉరు ము లు,మెరుపులు,మేఘాలు కలిసి చుట్టూ ప్రభా వం చూపిస్తాయి.తుపానుగా బలపడిన తర్వాత దాని కేంద్ర స్థానంగా పిలుచుకునే ఈకన్నుస్పష్టంగా కనిపిస్తుంది.తీవ్ర తుపాను అయితే మరింత పెద్దగా కనిపిస్తుంది.
వందల కిలోమీటర్ల దూరంలో అలజడి : తుపాను సమయంలో అదితీరంతాకిన కొన్ని వందల కిలోమీటర్ల చోట విపత్తులు సంభ విస్తే అది ఉన్న చోట మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.ఎలాంటిగాలి, వాన ఉండదు.సముద్రం ప్రశాతంగా ఉం టుంది. తుపాను తీరం దాటిందా అని అక్క డున్న వారే ఆశ్చర్యపోయే విధంగా వాతావర ణం ఉంటుంది. ఎందుకంటే అది తుపాను కేంద్ర స్థానంకావడంతో దానికి కొన్ని వం దల కిలోమీటర్ల దూరంలోనే అలజడి అధి కంగా ఉంటుంది.అందుకే తుపాను తీరా నికి చేరువయ్యే కొద్దీభారీ వర్షాలు,గాలులు వీస్తాయి.తీరం తాకినపుడు ప్రభావం ఉండదు. తర్వాతే విలయం ఆరంభం అవుతుంది. తీరం దాటినప్పుడు అలసత్వం వహిస్తే,ఆతర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
తుపానుకు ప్రత్యేక పేరు? : తుపాన్లు వచ్చిన ప్రతిసారి దానికి ఓ ప్రత్యేకమైన పేరు నిర్ణయి స్తారు. అయితే ఆ పేర్లు నిర్ణయించడం ఆసక్తిక రంగా ఉంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షణలోని వ్యవస్థద్వారా పేర్లను నిర్ణయి స్తారు. ఈ పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, ప్రపంచ వాతావరణ సంస్థలు సంయు క్తంగా ప్రతిపాదించాయి.సుదీర్ఘ చర్చల తర్వాత 2004లో ఆమోదముద్ర వేశారు.
‘మొంథా’ అంటే అర్థం : ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీర ప్రాం తం కల్గిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఖతార్,ఒమన్,ఇరాన్,సౌదీ అరేబి యా,యూఏఈ దేశాలు ఈ గ్రూపులో చేరాయి. అక్షర క్రమంలో ఆయాదేశాలు పేర్లను నిర్ణయి స్తాయి.జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా,రెండో పేరు భారత్.ఉత్తర హిందూ మహా సముద్రం,అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు భారత వాతావరణ కేంద్రం పేర్లను ప్రకటిస్తుంది.తుపాన్లు, వాటి తీవ్రత గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి, అది వస్తున్నపుడు ప్రజలకు సమాచారం త్వరగా చేరి అప్రమత్తం చేయడానికి, శాస్త్రవే త్తలు సమాచార మార్పిడి చేసుకోవడానికి పేర్లను నిర్ణయిస్తారు.ఈపేర్లు ఎవరి మనో భావాలు దెబ్బ తినకుండా నిర్ణయించాలి. బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడిన ‘మొం థా’కు పేరును థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో మొంథాస్ అంటే సువాసన గల లేదా అందమైన పువ్వు అని అర్థం.
పెరుగుతున్న ప్రమాదాలు..: మనం పాల ప్యాకెట్లు,సరకులు తీసుకురావ డానికి వాడే ప్లాస్టిక్ సంచులు మొదలు ఫ్రిజ్‌లూ ఏసీలూ… బైకులూ కార్లూ…గనులూ ఫ్యాక్టరీలు వంటి వన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవే.మనిషి మనుగడకు ఇలాంటి వస్తువులు అవసరమే. కానీ,పెచ్చు మీరిన మానవ చర్యలవల్ల ఒక్క 2023వ సంవత్సరంలోనే5,40కోట్ల ట న్నుల విషవాయువులు గాలిలో కలిసి పోయాయంటే నమ్మగలమా? ఇలా ప్రపం చవ్యాప్తంగా వాతావరణంలోకి చేరే కాలు ష్యాన్నీ అదనపు వేడిమినీ ఎక్కువ శాతం సముద్రాలే గ్రహిస్తాయి.అసా ధారణంగా వేడెక్కిపోతున్నాయి.గిన్నెలో నీళ్లు వేడెక్కిన ప్పుడు ఆవిరి వస్తుంది కదా!అలాగే సము ద్రంలోని నీరు దాదాపు 27డిగ్రీల సెంటీ గ్రేడు ఉష్ణోగ్రత దాటినప్పుడు వేడి గాలులు విడుదల అవుతాయి.దానివల్ల ఓవైపు మేఘా లు,మరోవైపు తుపానులకు దారితీసే అల్పపీడనం వంటి పరిస్థితులు ఏర్పడతా యి. ఇది ప్రకృతిలో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియే.కానీ,1955 తరవాత ఈ ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ప్రపంచవ్యాప్తంగా పారి శ్రామిక కార్యకలాపాలు,శిలాజ ఇంధ నాల వినియోగంజోరందుకోవడంతో వాతావర ణంలోకి పెద్దయెత్తున కర్బనఉద్గారాలు విడుదలవుతున్నాయి. వాటిని గ్రహించడం వల్ల ఉపరితల సముద్ర జలాలు వేగంగా వేడెక్కిపోతున్నాయి.1955తో పోలిస్తే ఇప్పు డు4.5రెట్లు వేగంగా సాగరాలు వేడెక్కుతు న్నాయనీ,అందువల్లే తరచూ మేఘాలు ఏర్ప డి అకాల వర్షాలు కురవడం,తుపానులు ఏర్పడటం చూస్తున్నామనీశాస్త్రవేత్తలు విశ్లేషి స్తున్నారు.
భవిష్యత్తులో మరింత భీకరంగా…: ప్రపం చంలోని చాలా దేశాలు ప్రకృతి అనుకూల విధానాలను కాదని, ఇబ్బడిముబ్బడిగా కర్బన ఉద్గారాలను వెదజల్లే శిలాజ ఇంధన ఆధారిత అభివృద్ధి నమూనాలనే అనుసరిస్తు న్నాయి.ఫలితంగా 1750-2024మధ్య కార్బన్ డయాక్సైడ్ 53శాతం,మీథేన్ 166 శాతం, నైట్రస్ ఆక్సైడ్ 25 శాతం అధికంగా విడుదలయ్యాయి.2075 నాటికి ఈ విష వాయువులు మరింత ఎక్కువగా వాతావర ణంలో చేరే ప్రమాదముందని స్విట్జర్లాం డ్లోని జ్యూరిచ్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిం చారు. దానివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు 2040-2100 సంవత్సరాల మధ్య 2.5డిగ్రీల నుంచి 4.4డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరిగిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.అలా పరిస్థితుల్లో తుపానులు ఇప్పటికన్నా ఎంతోభీకరంగాఉం టాయి.సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తరచూ అకాల వర్షాలు సంభవించడమే కాకుండా, తక్కువ వ్యవధిలోనే తుపానులు ఏర్పడతాయి. వీటిలో గంటకు 220కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైనగాలులు వీచే‘సూపర్ సైక్లోన్లు’ కూడా ఉండవచ్చు. చాలా దేశాల్లో వాతావరణ వ్యవస్థలు పసిగట్టి, ప్రజలను హెచ్చరించేలోపే అల్పపీడనం తుపానుగా బలపడే పరిస్థితి వస్తుంది. దాంతో మత్స్యకారుల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం కష్టమవు తుంది.సకాలంలో సహాయక చర్యలు చేపట్టేంత సమయం కూడా ఉండదు. 2016-25 మధ్య సముద్ర మట్టాలు ఏటా సగటున 4.1మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతూ వచ్చాయి.
భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే, తీరప్రాంతాల్లో తుపానులు సృష్టించే విధ్వం సం అనూహ్య స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నచిన్న దీవులకు భారీ నష్టం తప్పకపోవచ్చు. భవిష్యత్తులో ఉష్ణమండల ప్రాంతం కంటే ఉత్తర,దక్షిణ ధ్రువాల దగ్గరే తుపానులు ఎక్కువగా సంభవిస్తాయని అధ్య యనాలు చెబుతున్నాయి.
ఉద్గారాల మూలంగా మానవాళికి పెను ముప్పు : పొంచి ఉందని తెలిసినా ప్రపంచ దేశాలుతమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. వాతావరణ మార్పుల నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని పారిస్ సదస్సులో అవి ప్రతిజ్ఞ చేశాయే తప్ప, సరైన కార్యాచర ణకు పూనుకోలేదు. తుర్కియేలోని అంతా ల్యలో ఈఏడాది నవంబరులో జరిగే ‘కాప్-31’శిఖరాగ్ర సదస్సు అయినా అందుకు నడుంకట్టాలి.
55 సంవత్సరాల్లో 61 సార్లు – రాష్ట్రంపై ‘బంగాళాఖాతం తుపాన్ల’ ప్రభావం : బంగా ళాఖాతంలో ఏర్పడే తుపాన్లు ఆంధ్రప్రదే శ్లో అలజడి రేపుతున్నాయి.1970 నుంచి ఇప్పటి వరకు60తుపాన్లు రాష్ట్రంపై ప్రభా వం చూపాయి. ఇవి పొరుగున ఉన్న తమిళ నాడు,ఒడిశా,పుదుచ్చేరిలలో తీరం దాటినా రాష్ట్రానికి మాత్రం తీవ్రనష్టమే మిగిల్చా యి.తాజాగా ‘మొంథా’తో కలిపి వాటి సం ఖ్య 61కి చేరింది. ఇందులో 16 తుపాన్లు అక్టోబరు నెలలోనే ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు పరిధిలో తీరం దాటినట్లు గణాంకా లు చెబుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం (చెన్నై నుంచి కళింగపట్నం వరకు) ఎక్కువ తుపాన్లు తీరందాటాయి. ఆ తర్వాత వాయవ్య బంగాళాఖాతం (కళింగపట్నం నుంచి కోల్కతావరకు) తీరందాటిన తుపా న్లున్నాయి. అతి పెద్ద తుపాన్ల జాబితాలో దివిసీమ (గాలివేగం230 కి.మీ.),కోనసీ మ (270కి.మీ.),హుద్‌హుద్ (220కి.మీ) నిలిచాయి.ప్రచండగాలులు పూడ్చలేని నష్టా న్ని మిగిల్చాయి. ఇదే స్థాయిలో కొన్ని తీవ్ర తుపాన్లు (సూపర్ సైక్లోన్లు) ఏర్పడ్డాయి.అవి ఎక్కువగా ఒడిశావద్దతీరం దాటాయి. నీలం తుపాను 2010అక్టోబరు 28న తీరం దా టింది.భూమిని తాకి బలహీనపడిన తర్వాత భారీ వర్షాలు కురిశాయి.2013లో ఏకంగా ఐదు తుపాన్లు ఏర్పడగా,1987, 1996, 2016,2018ల్లో ఒకేఏడాదిలో మూడు తుపాన్లు ఏర్పడ్డాయి.అక్టోబర్‌లో సగటున 112.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈస్థాయిలో వర్షపాతం నమో దవ్వడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం పేర్కొంది.అదే విధం గా 1901తర్వాత ఇది 16వసారి.ఇక ఈశా న్యరుతుపవన ప్రాంతం(కోస్తాంధ్ర, రాయల సీమ,కేరళ,కర్ణాటక,దక్షిణ అంతర్గత మాహె,తమిళనాడు,పుదుచ్చేరి,కరైకల్ సబ్ డివిజన్లు)లో అయితే అక్టో బర్లో సగటున 245.7మిల్లిమీటర్ల వర్షపాతం నమో దైంది.2019లో అత్యధికంగా 250.9 మిల్లి మీటర్ల నమోదు కాగా,తర్వాత ఈసారే అత్యధికం.2001 తర్వాత ఇదిమూడో గరిష్ఠం. దేశ వ్యాప్తంగా గత 5ఏళ్లలో ఎప్పుడూ లేనం తగా ఈసారి అక్టోబర్‌లో 236ప్రాంతాల్లో అతి భారీ (115.6 మి.మీ-204.5 మి.మీ.),45 చోట్ల అత్యంత భారీ(204.5మి.మీ.కు మించి) వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో సాధారణం కంటే 79% ఎక్కువ : రాష్ట్రంలో అక్టోబరులో సాధారణ సగటు వర్షపాతం 161.5 మిల్లిమీటర్ల కాగా, మొంథా తుపాను, వాయుగుండం ప్రభావంతో 288.3 మిల్లిమీటర్లగా నమోదైంది.ఇది సాధారణం కంటే 79%ఎక్కువ అని ఐఎండీ వెబ్సైట్లో పేర్కొంది.అలాగే 19జిల్లాల్లో సాధారణం కంటే 40%ఎక్కువ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా లో 140%,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు-131%,విజయనగరం-124%,పల్నాడు-119%,గుంటూరు జిల్లాలో109%అధి కంగా నమోదైంది.కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసా యి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా, తూర్పుగోదావరి జిల్లాలో లోటు కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెబ్సైట్ ప్రకారం, అక్టోబరులో రాష్ట్రంలోని 12జిల్లాల్లో సాధా రణానికి మించి వానలు కురిశాయి. ఏ జిల్లా లోనూలోటు వర్షపాతం నమోదు కాలేదు.
వాతావరణ శాఖ అలర్ట్‌ల గురించి తెలుసా?
గ్రీన్ అలర్ట్ :ఏదైనా ప్రాంతంలో 24గంటల వ్యవధిలో 6.4సెంటీ మీటర్ల కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ శాఖ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణంలో రాబోయే మార్పుల గురించి ఈఅలర్ట్తెలియజేస్తుంది. అయితే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకా శాలున్నందున ఈఅలర్ట్ద్వారా ప్రత్యే కంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎల్లో అలర్ట్ : ఒక ప్రదేశంలో 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం,అంచనాల మేరకు వాతా వరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావర ణం ప్రతికూలంగా మారుతుందని అర్థం.
ఆరెంజ్ అలర్ట్ : 24గంటల వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెం టీ మీటర్ల మధ్య వర్షం కురవొచ్చన్న అంచ నాతో ఐఎండీఈ అలర్ట్ ను జారీ చేస్తుంది. ఈ సమయంలో గాలుల తీవ్రత40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఉంటుంది. పరిస్థి తులు అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యం త్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజ లను సురక్షితంగా తరలిస్తారు.
రెడ్ అలర్ట్ : వాతావరణం,వర్షపాతానికి సంబంధించి ఇదిచివరి హెచ్చరికగా చెప్పు కోవచ్చు.24గంటల వ్యవధిలో ఒక ప్రాం తలో20.45సెంటీమీటర్లకుపైగా వర్ష పా తం నమోదయ్యే వీలుంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రభుత్వాలను హెచ్చ రిస్తుంది.ఈప్రమాద హెచ్చరిక అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సం బంధించిందని అర్థం.ఈసమయంలో విద్యుత్ స్తంభాలు కూలి పోవడం తోపాటు రోడ్లపైకి వరద పోటెత్తడం,రవాణా, వాహ నాల రాకపోకలకు అంతరాయం ఉం టుంది. పౌరులప్రాణాలకు ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐఎండీ ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో విపత్తు నిర్వహణా దళాలు,ఐఎండీ బృందాలు, రెస్క్యూ సహా యక సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉంటాయి.రెడ్ అలర్ట్ దాదాపు ఐదురోజుల పాటు అమల్లో ఉంటాయి.
