హిమాలయాల్లో విఫత్తుల కొత్త ముఖం
నేపాల్`టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం భీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో ఆగష్టు 26న సంభ వించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది మృతి చెందారు.ఇంకా అనేక మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు..అందులో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 200మంది మంది భారతీయ యాత్రికలు గల్లంతై నట్లు సమాచారం.
భట్కోషి,త్రిశూలి నదీ వ్యవస్థలో ఒక్క సారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు,బండరాళ్లు కొట్టుకొచ్చాయి.ఉద యం 9గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్‌లోని రాసువా,ధాదింగ్,నువాకోట్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు,రహదారులు,వంతెనలు ధ్వంసమయ్యాయి.వరదల ధాటికి నేపాల్‌లో రవాణా,విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా.హిమాలయాలు ఎప్పటినుంచో ప్రకృతి శక్తులకు నిలయంగా ఉన్నాయి.భూమి పొరలు ఢీకొనే చోట ఏర్ప డిన ఈపర్వత శ్రేణి భూకంపాలకు సున్నిత మైన ప్రాంతం.మంచు, హిమానీనదాలు, నదులు,లోతైన లోయలు కలిసి ఈ ప్రాంతా నికి ప్రత్యేకమైన భౌగోళిక స్వభావాన్ని ఇచ్చాయి. అయితే ఇప్పుడు హిమాల యాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు కనిపిస్తున్న చిత్రం మరింత ఆందోళన కరంగా ఉంది.భూకంపం,హిమపాతం, హిమానీనదం కూలిపోవడం, కొండచరి యలు,ఆకస్మిక వరదలు,హిమ సరస్సుల విస్ఫోటనాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా జరిగే సహజ విపత్తులు కాకుండా,ఒకదానిని మరొకటి ప్రేరేపించే సంక్లిష్ట పరిణామా లుగా మారుతున్నాయి. ఈమార్పు వెనుక వాతావరణ మార్పు ఎంతవరకు పనిచే స్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
నేపాల్‌లోని భోటేకోశి నది పరివాహక ప్రాంతంలో సంభవించిన తాజా విషాదం ఈ ప్రశ్నను మరోసారి ప్రపంచం ముం దుకు తెచ్చింది. తొలుత అక్కడ నమో దైన ప్రకంపనలను భూకంపంగా భావించారు. 4.4తీవ్రతతో భూకంపం సంభవించిందని ప్రాథమిక సమాచారం వెలువడటంతో,దాని ప్రభావంతో కొండ చరియలు విరిగిపడి నదిలోకి చేరడం, ఆ తర్వాత ఆకస్మిక వరద రావడం జరిగిందని అనుకున్నారు.అయితే తదు పరి విశ్లేషణలో ఆ అంచనా తప్పని అమెరికా జియోలాజికల్ సర్వే తేల్చింది. భూకంప కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం, భూకంప తరంగాల స్వభా వం, ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత అక్కడ సంప్రదాయ అర్థంలో భూకంపం జరగలేదని,భారీ హిమానీ నదం లేదా మంచు-శిథిలాల కదలిక వల్లే భూకంప తరంగాల మాదిరి ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడిం చింది.ఈ ఒక్క వివరణే హిమాలయాల్లో మారుతున్న విపత్తుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద సంకేతం. మనం భూకంపం అని భావించిన ప్రకంపనకు కారణం మంచు-శిథిలాల భారీ కదలిక అయితే,దాని వెనుక ఉన్న పర్యావరణ పరిస్థితులను కూడా పరిశీ లించాల్సిందే. హిమానీనదం ఎందుకు కదిలింది? పర్వత వాలు ఎందుకు అస్థిరమైంది? మంచు ఎందుకు వేగంగా కోల్పోయింది? నదిలోకి ఒక్కసారిగా అంత భారీ పరిమాణంలో నీరు, మంచు,మట్టి,రాళ్లు ఎలా చేరాయి? ఇవన్నీ కేవలం ఒకరోజు జరిగిన సంఘటనలతో సమాధానం దొరికే ప్రశ్నలు కావు. వాటి వెనుక సంవత్సరా లుగా మారుతున్న ఉష్ణోగ్రతలు,మంచు నిల్వలు,వర్షపాత ధోరణులు,పర్వత భౌగోళిక పరిస్థితులు ఉండవచ్చు. హిమాలయాల విషయంలో వాతావరణ మార్పు ప్రభావాన్ని అర్థం చేసుకోవా లంటే ముందుగా హిమానీనదాల పరిస్థితిని గమనించాలి.హిమానీనదం అనేది కదలని మంచు కొండ కాదు. అది చాలా నెమ్మదిగా కదిలే మంచు వ్యవస్థ. మంచు పేరుకుపోవడం, కరగ డం,కిందికి జారడం మధ్య సమతుల్యత ఆధారంగా దాని పరిమాణం,ఆకారం మారుతూ ఉంటుంది.వాతావరణం వేడెక్కినప్పుడు ఈ సమతుల్యత దెబ్బ తింటుంది.అనేక హిమానీనదాలు వెనక్కి తగ్గడం ప్రారంభిస్తాయి. మంచు పరిమా ణం తగ్గుతుంది.గతంలో మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు బయటపడ తాయి.హిమానీనదం అంచుల వద్ద నీటి నిల్వలు ఏర్పడతాయి.ఈ మార్పులన్నీ పర్వత భౌగోళిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలవు.ఇక్కడే మరో ప్రమాదం పుట్టుకొస్తుంది.హిమానీనదాలు వెనక్కి తగ్గుతున్నప్పుడు వాటి ముందు భాగం లో,పక్కలలో లేదా మంచు-శిథిలాల మధ్య సరస్సులు ఏర్పడవచ్చు. వీటిలో కొన్ని సహజమైన మంచు లేదా మోరైన్ అడ్డుకట్టలతో నిలిచి ఉంటాయి.ఇవి శాశ్వతమైన ఆనకట్టలు కావు.ఒకభారీ మంచు ముక్క సరస్సులో పడటం,కొండ చరియ విరిగి నీటిలోకి దూకడం,భారీ వర్షం కురవడం లేదా ఇతర భౌగోళిక మార్పులు చోటుచేసుకోవడంవల్ల ఆ సహజ అడ్డుకట్ట బలహీనపడవచ్చు. ఒక్కసారిగా సరస్సు తెగిపోతే వేల, లక్షల క్యూబిక్ మీటర్ల నీరు కొన్ని గంటల్లోనే దిగువకు దూసుకెళ్లవచ్చు. దీనినే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ GLOఖీ అంటారు.
అటువంటి వరద సాధారణ వరదకు భిన్నమైనది.నీటితో పాటు మంచు,రాళ్లు, మట్టి,చెట్ల దుంగలు,ఇతర శిథిలాలు కిందికి వస్తాయి.దాంతో అది ఒకవిధమైన శిథిల ప్రవాహంగా మారుతుంది.నది తన సహజ మార్గాన్ని దాటి గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలపైకి దూసుకుపోతుంది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు స్పందించే సమయం చాలా తక్కువగా ఉం టుంది. ఒకసారి ఇలాంటి ప్రవాహం ఏర్ప డితే దాని ముందు ఉన్న మౌలిక వసతులు ఎంత బలంగా ఉన్నా తీవ్ర నష్టం తప్పక పోవచ్చు.
భోటేకోశి ఘటనలో కూడా ఇదే తరహా క్రమం కనిపిస్తోందని నిపుణుల పరిశీలనలు సూచిస్తున్నాయి. టిబెట్ వైపు ఎత్తైన ప్రాం తంలో మంచు,శిథిలాల భారీ కదలిక సంభ వించి ఉండవచ్చని, దాంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి భోటేకోశి నదిలోకి చేరి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. సుమా రు 5,200 మీటర్ల ఎత్తులో హిమానీనదం లేదా మంచు భాగం జారిపడినట్లు ఉప గ్రహ చిత్రాల ఆధారంగా చేసిన పరిశీ లనలు కూడా ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను తెచ్చాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన మార్పులు అక్కడ మంచు నష్టం, హిమానీనద కదలిక లేదా శిథిల ప్రవాహం వంటి ప్రక్రియలు జరిగినట్లు సూచిస్తున్నాయి.అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.ఒకనిర్దిష్ట విపత్తుకు వాతావరణ మార్పే నేరుగా కారణమని తేల్చడానికి శాస్త్రీయ ఆధారా లు అవసరం. ప్రతి హిమానీనద విరుపు ను, ప్రతి వరదను, ప్రతి కొండచరి యను వాతావరణ మార్పుకు ఆపాదిం చడం సరైన శాస్త్రీయ విధానం కాదు. హిమాలయాలు సహజంగానే అత్యంత చురుకైన భౌగోళిక ప్రాంతం.భూకం పాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. కొండచరియలు కూడా సహజ పర్వత ప్రక్రియలో భాగమే. భారీ వర్షాలు, మంచు తుఫానులు కూడా కొత్త విషయాలు కావు.కానీ వాతావరణ మార్పు ఈ వ్యవస్థల పునాది పరిస్థి తులను మార్చుతోందా? వాటి తీవ్రతను లేదా సంభవించే అవకాశాన్ని పెంచు తోందా? ఇదే అసలు పరిశోధన ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిశోధనలు ఈ ప్రశ్నకు ఆందోళన కలిగించే సంకే తాలు ఇస్తున్నాయి. హిమాలయ-కారా కోరం ప్రాంతంలో హిమానీనదాల వెనుకడుగు,మంచు నిల్వల తగ్గుదల, హిమ సరస్సుల విస్తరణ వంటి మార్పు లు నమోదవుతున్నాయి.ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎత్తైన ప్రాంతాల్లో మంచు కరిగే ప్రక్రియ మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో మంచుగా పడాల్సిన వర్ష పాతం వర్షంగా పడే అవకాశం పెరుగు తోంది. ఈమార్పులు పర్వత వాలులపై నీటి ప్రభావాన్ని పెంచవచ్చు. అదే సమ యంలో శాశ్వతంగా గడ్డకట్టిన నేల పర్మా ఫ్రాస్ట్ వేడెక్కడం వల్ల పర్వత వాలుల స్థిరత్వం కూడా దెబ్బతినవచ్చు. అందువల్ల హిమాలయాల్లో వాతావరణ మార్పు ప్రభావాన్ని కేవలం “మంచు కరుగుతోంది” అనే ఒకవాక్యంలో పరి మితం చేయడం పెద్ద పొరపాటు. మం చు కరుగుదల ఒక ప్రారంభ ప్రక్రియ మాత్రమే. దాని తర్వాత నీటి నిల్వలు మారవచ్చు.హిమానీనదం ఆకారం మారవచ్చు.పర్వత వాలు బలహీనపడవచ్చు. కొత్త సరస్సు ఏర్పడ వచ్చు.సరస్సు తెగిపోవచ్చు.నది ఒక్క సారిగా ఉప్పొంగవచ్చు.నదిలోకి శిథి లాలు చేరవచ్చు.చివరికి ఒకచిన్న భౌగో ళిక మార్పు వేలాది మందిని ప్రభావితం చేసే విపత్తుగా మారవచ్చు.
ఇదే హిమాలయాల భవిష్యత్తుపై అత్యంత ఆందోళన కలిగించే అంశం. భవిష్యత్ విపత్తులు ఒక్క కారణంతో సంభవించే అవకాశం తగ్గుతూ,బహుళ కారణాలు పరస్పరం కలిసే ప్రమాదం పెరుగుతోంది.దీనినే శాస్త్రవేత్తలు ‘కాస్కే డింగ్ డిజాస్టర’గా పరిగణిస్తున్నారు. ఉదాహరణకు ఒక భూకంపం కొండచరియను ప్రేరేపించవచ్చు. ఆ కొండచరియ నదిని అడ్డుకోవచ్చు. దాంతో సరస్సు ఏర్పడవచ్చు.సరస్సు తెగితే వరద రావచ్చు. అదే సమయంలో ముందుగానే వేడెక్కిన హిమానీనదం, అస్థిరమైన పర్వత వాలు ఉంటే నష్టం మరింత పెరగవచ్చు.
ఈపరిస్థితిలో విపత్తు నిర్వహణకు కూడా కొత్త ఆలోచన అవసరం.ఇంతవరకు భూకంపాలను ఒకవిభాగం,వరదలను మరో విభాగం, హిమానీనదాలను మరో విభాగం,వాతావరణాన్ని మరో విభాగం అధ్యయనం చేసే విధానం ఉంది.కానీ హిమాలయాల్లో ఇవన్నీ ఒకే వ్యవస్థలో భాగాలు. ఒకే ప్రాంతంలో భూకంప శాస్త్రవేత్త, హిమానీనద శాస్త్రవేత్త, వాతావ రణ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, జల వనరుల నిపుణుడు కలిసి పనిచేయా ల్సిన అవసరం ఏర్పడింది.
ఉపగ్రహ సాంకేతికత ఇక్కడ కీలక పాత్ర పోషించగలదు.ఏ హిమ సరస్సు విస్తరిస్తోంది? ఏహిమానీనదం వేగంగా వెనక్కి వెళ్తోంది?ఎక్కడ మంచు పొరలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయి? ఏ పర్వత వాలు కదులుతోంది? ఎక్కడ నది మార్గాన్ని శిథిలాలు అడ్డుకున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు ఉపగ్రహ చిత్రాలు ముందస్తు హెచ్చరికలకు ఉపయోగపడ తాయి. అయితే ఉపగ్రహాలను మాత్రమే నమ్మడం సరిపోదు. ప్రమాదకర హిమ సరస్సుల్లో నీటి మట్టం కొలిచే సెన్సర్లు, నదుల్లో రియల్‌టైమ్ నీటి ప్రవాహ పరికరా లు,భూకంప సెన్సర్లు, వాతావరణ రాడార్లు, ఆటోమేటిక్ హెచ్చరిక వ్యవస్థలు కూడా అవసరం.
మరో కీలక అంశం సరిహద్దులు. హిమాలయ నదులకు దేశాల సరిహద్దులు తెలియవు. టిబెట్‌లో జరిగిన మంచు విరుపు ప్రభావం నేపాల్‌లో వరదగా కనిపించవచ్చు. నేపాల్‌లోని నదీ ప్రవాహం భారతదేశంలోని ప్రాంతాలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల విపత్తు హెచ్చరికల సమాచారాన్ని దేశాల మధ్య వేగంగా పంచుకోవడం అత్యవసరం. ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం, నదీ ప్రవాహ వివరాలు, హిమ సరస్సుల పరిస్థితి వంటి సమాచారాన్ని సరిహద్దులకు అతీతం గా పంచుకునే శాస్త్రీయ సహకారం ఇక ఐచ్ఛికం కాదు.హిమాలయాల్లో నిర్మాణాలపై కూడా పునరాలోచన అవసరం.పర్యాటకం, రహదారులు,సొరంగాలు,జలవిద్యుత్ ప్రాజెక్టులు,పట్టణీకరణ అన్నీ వేగంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి అవసరమే. కానీ గత వాతావరణ గణాంకాల ఆధారం గా మాత్రమే భవిష్యత్ నిర్మాణాలను రూపొందించడం ప్రమాదకరం.రాబోయే దశాబ్దాల్లో వరద తీవ్రత,మంచు కరుగు దల,హిమ సరస్సుల పరిమాణం, కొండ చరియల ప్రమాదం ఎలా మారవచ్చో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రత్యేకంగా జలవిద్యుత్ రంగం ముందు పెద్ద సవాలు ఉంది.హిమాలయ నదులు అపారమైన జలవిద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ అదే నదులు ఆకస్మిక వరదలకు మార్గాలుగా కూడా మారవచ్చు. ఒక భారీ హిమ సరస్సు తెగిపోతే నదిలో నీటి ప్రవాహం సాధారణ స్థాయితో పోలిస్తే అనూహ్యంగా పెరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల భద్రత,ఆనకట్టల సామర్థ్యం, అత్యవసర నీటి విడుదల విధానాలు, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల తరలింపు మార్గాలు ముందుగానే పరిగణించాల్సి ఉంటుంది.
తాజా నేపాల్ విపత్తులో మౌలిక వసతు లకు జరిగిన నష్టం ఈప్రమాదాన్ని మరింత స్పష్టంగా చూపించింది. వంతె నలు, రహదారులు,జలవిద్యుత్ ప్రాజె క్టులు,వాణిజ్య సంస్థలు వరద ప్రవాహా నికి దెబ్బతిన్నాయి.ఒక ప్రాంతంలో రహ దారి తెగిపోతే అది కేవలం రవాణా సమస్య కాదు. సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడు తుంది. వంతెన కొట్టుకుపోతే ఒక గ్రామం లేదా పట్టణం గంటల తరబడి బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోవచ్చు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే ఆసుపత్రులు, కమ్యూనికేషన్,నీటి సరఫ రా అన్నీ ప్రభావితమవుతాయి.
ఇంకా ఒక మానవ కోణం ఉంది. హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రతి విపత్తు కేవలం ఆస్తి నష్టం కాదు.పర్వత గ్రామాల్లో ప్రజల జీవనా ధారం వ్యవసాయం,పశుపోషణ, పర్యాటకం,చిన్న వ్యాపారాలపై ఆధార పడి ఉంటుంది.ఒక వంతెన కొట్టుకు పోవడం అంటే మార్కెట్‌కు వెళ్లే మార్గం తెగిపోవడం.ఒక రహదారి ధ్వంసం అంటే వైద్య సహాయం అందకపోవడం. ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు మూతపడటం అంటే స్థానిక ఉపాధిపై ప్రభావం. అందు వల్ల వాతావరణ మార్పు ప్రభావాన్ని కేవలం పర్యావరణ సమస్యగా చూడటం సరిపోదు.అది సామాజిక,ఆర్థిక,మానవ భద్రతా సమస్య కూడా.నేపాల్‌కు భారత్ అందిం చిన అత్యవసర సహాయం వంటి ప్రాంతీ య సహకారం విపత్తు సమ యంలో ఎంతో ముఖ్యమైనది. కానీ విపత్తు సంభవించిన తర్వాత సహాయం చేయడం కంటే,అది సంభవించే ముందు ప్రమాదాన్ని గుర్తించడం మరింత ముఖ్య మైన దశ. సాంకేతిక పరిజ్ఞానం,ఉపగ్ర హ నిఘా,ముందస్తు హెచ్చరికలు, సరి హద్దు సహకారం, స్థానిక ప్రజలకు శిక్షణ ఇవన్నీ కలిస్తేనే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
హిమాలయాల విషయంలో మరో ప్రమాదకరమైన భ్రమను కూడా విడిచిపెట్టాలి. “ప్రకృతి విపత్తులను ఆపలేం కాబట్టి ఏమీ చేయలేం” అనే భావన పూర్తిగా తప్పు. భూకంపాన్ని ఆపలేం. హిమానీనదం కూలిపోవడాన్ని ప్రతి సందర్భంలో ఆపలేం. కానీ ఒక హిమ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుతున్నదని గుర్తించవచ్చు.నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించవచ్చు.ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించ వచ్చు. ప్రజలను ముందుగానే తరలించ వచ్చు.అత్యవసర మార్గాలను సిద్ధంగా ఉంచ వచ్చు. ప్రాణనష్టం భారీగా తగ్గించవచ్చు. అంతేకాదు,వాతావరణ మార్పును నియంత్రించే ప్రపంచ ప్రయత్నాలకు హిమాలయాల భవిష్యత్తు ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంది. స్థానికంగా మంచి విపత్తు నిర్వహణ ఎంత అవసర మో,ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిం చడం కూడా అంతే అవసరం. ఒకవైపు అనుసరణ అంటే మారుతున్న పరిస్థి తులకు మౌలిక వస తులు, సమాజా లను సిద్ధం చేయడం; మరోవైపు ఉపశ మన చర్యలు అంటే వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడం. ఈ రెండు మార్గాలు కలిసే నడవాలి. హిమాలయాల్లో జరుగు తున్న మార్పు లనుచూస్తే ఒకవిషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పర్వతా లు మౌనంగా ఉన్నాయనుకోవడం ఇక సాధ్యం కాదు.మంచు వెనక్కి తగ్గడం, కొత్త సరస్సులు ఏర్పడటం,వర్షపు నమూనాలు మారడం,పర్వత వాలులు అస్థిరమవడం ఇవన్నీ భవిష్యత్తు ప్రమాదాలకు ముందస్తు సంకేతాలుగా చదవాల్సిన అవసరం ఉంది. నేపాల్‌లో భూకంపంగా భావించిన ప్రకం పనలు హిమానీనద కదలికకు సంబంధిం చినవిగా తేలడం,దాని వెంట వచ్చిన ఆకస్మిక వరద,మంచుశిథిలాల ప్రవాహం ఇవి ఒక ప్రత్యేక సంఘటనగా ముగిం చాల్సిన కథ కాదు.ఇది హిమాలయాల్లో ప్రకృతి వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా మారు తోందో చూపించే హెచ్చరిక.అదే సమయం లో సిక్కిం,ఉత్తరా ఖండ్,నేపాల్,భూటాన్, టిబెట్ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా నమోదవు తున్న హిమ సరస్సు విస్ఫోటనాలు, హిమ పాతాలు,కొండచరియలు,ఆకస్మిక వరదల ను ఒకే పెద్ద చిత్రంలో చూడాల్సిన అవ సరం ఉంది.రేపటి హిమాలయాన్ని కేవలం మంచు కొండగా చూడకూడదు. అది వేగం గా మారుతున్న వాతావరణ వ్యవస్థలో ఒక జీవంతమైన ప్రయోగశాల. అక్కడ జరుగు తున్న మార్పులు ముందుగా మంచులో కనిపిస్తాయి,తర్వాత నదుల్లో కనిపిస్తాయి, ఆతర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో,మౌలిక వసతుల్లో కనిపిస్తాయి.హిమాలయాల్లోని ప్రతి కొత్త హిమ సరస్సు, ప్రతి అసాధారణ మంచు కదలిక, ప్రతిభారీ కొండచరియ మనకు ఒక ప్రశ్న వేస్తోంది ప్రకృతి మార్పు ను మనం ముందుగానే చదువుతున్నామా, లేక అది విపత్తుగా మారిన తర్వాతే స్పందిస్తు న్నామా?ఇది నేపాల్‌కు మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు. హిమా లయాల నీటిపై ఆధారపడే భారత్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం దక్షిణాసి యాకు సంబంధించిన ప్రశ్న. హిమాల యాల్లో మంచు మారితే నదులు మార తాయి; నదులు మారితే వ్యవసాయం, విద్యుత్, తాగునీరు మారతాయి; నీటి వ్యవస్థలు మారితే కోట్లాది ప్రజల జీవన భద్రత ప్రభావితమవుతుంది.
అందుకే హిమాలయాలపై ఇప్పుడు కావాల్సింది మరిన్ని విపత్తు కథనాలు మాత్రమే కాదు మరిన్ని శాస్త్రీయ పరిశీ లనలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సరిహద్దు సహకారం, బాధ్యతాయుత మైన నిర్మాణ విధానాలు,స్థానిక ప్రజల భాగస్వామ్యం. ప్రకృతి ఇచ్చే హెచ్చరి కలను విస్మరించి అభివృద్ధిని కొనసా గిస్తే,భవిష్యత్తులో ప్రతి విపత్తు మరింత ఖరీదైనదిగా మారవచ్చు.హిమాలయాల్లో భూకంపాలు కొత్తవి కావు. వరదలు కూడా కొత్తవి కావు. కానీ వేడి పెరుగు తున్న ప్రపంచంలో భూకంపం,హిమా నీనదం,కొండచరియ,హిమసరస్సు, వరద ఒకదానితో ఒకటి కలిసే విధానం మాత్రం కొత్త ప్రమాదాన్ని సృష్టిస్తోంది. ఆ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ముందుగానే గుర్తించడం, ప్రజ లను రక్షించడానికి సిద్ధపడటం ఇదే ఇప్పుడు హిమాలయ దేశాల ముందు ఉన్న అత్యవసర బాధ్యత.– గునపర్తి సైమన్
