ఒక ప్రశ్న..మÖడు దశాబ్దాల పోరాటం

“విశాఖ ఏజెన్సీ కొండల్లోని బొర్రా గుహల వద్ద 1989లో మొదలైన ఒక చిన్న ప్రశ్న..గిరిజనుల భూమి,అడవి,జీవన హక్కుల కోసం దశాబ్దాల న్యాయపోరాటానికి నాంది పలికింది.ఆప్రశ్నే 1997లోచారిత్రాత్మక సమతా తీర్పుకు దారితీసింది. అయినా తీర్పుతో పోరాటం ఆగలేదు. గిరిజనులకు భూమిపట్టాలు అందేవరకు మరోరెండు దశాబ్దాల ప్రయాణం కొన సాగింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ నుంచి పెసా,అటవీహక్కులచట్టం,భూబదిలీ నియంత్రణ,మైనింగ్విధానాలు, గ్రామసభ హక్కులు,పర్యావరణపరిరక్షణ,అభివృద్ధి ప్రయోజనాల్లో ప్రజలవాటా వరకు విస్తరించిన ఈపోరాటం..గిరిజనులను అభివృద్ధికి బలిపశువులుగా కాకుండా,అభివృద్ధి నిర్ణయాల్లో భాగస్వాములుగా చూడాలనే ఒకగొప్ప ప్రజాస్వామికసందేశాన్ని ముందుకు తెచ్చింది.గీతం విశ్వవిద్యాలయం జెన్..జీ విద్యార్థులతో సమతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి పంచుకున్న అనుభవాలు,ఆలోచనలు ఈసుదీర్ఘ పోరాటానికి ఒకచారిత్రక దర్పణంగా నిలిచాయి.”-గునపర్తి సైమన్ 

విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అరకు,బొర్రా` గుహలు ఈపేర్లు వినగానే మనకు ప్రకృతి సౌందర్యంకొండలు,అడవులు,గిరిజన సం స్కృతి,పర్యాటకం గుర్తుకు వస్తాయి.ఈ అందమైన ప్రాంతాల వెనుక దశాబ్దాలుగా కొన సాగుతున్న భూ హక్కుల పోరాటం, మైనింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన న్యాయ పోరాటం,రాజ్యాంగ పరిరక్షణలు,అభి వృద్ధి పేరుతో జరుగుతున్న స్థానచలనం వంటి తీవ్రమైన ప్రశ్నలు కూడా ఉన్నా యని సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బా ప్రగడ రవి విద్యార్థులకు వివరించారు. గీతం విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రా లు, హ్యు మానిటీస్ విభాగాల గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సెప్టెంబర్ 2న జరిగిన తనఉపన్యాసంలో ఆయన ఒకచిన్న వ్యక్తిగత అనుభవంతో ప్రారంభించి,అక్కడి నుంచి భారత రాజ్యాంగంలోని గిరిజనరక్షణ చట్టాలు, సమతతీర్పు వరకు గిరిజన హక్కు ల పరిణామాన్ని వివరించారు.వారి ఉప న్యాస సారాంశం యథావిధిగా వారి మాట ల్లోనే…

1989లో బొర్రా గుహల వద్ద మొదలైన ప్రశ్న..
పాడేరు ప్రాంతానికి కొంతమంది నాయ కులను కలవడానికి వెళ్తున్న సమయంలో రవికి బొర్రా గుహల బోర్డు కనిపించింది. ఆసక్తితో అక్కడికి వెళ్లారు. అయితే గుహల పరిసరాల్లో మైనింగ్ కార్యకలాపాలు,పేలు ళ్లు జరుగుతున్నాయంటేని గమనించి. “పైన పేలుళ్లు జరుగుతుంటే,మమ్మల్ని గుహల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు..?గుహలు కూలిపోయే ప్రమాదం లేదా?”అని ఆయన అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.“మాకు తెలియదు..మైనింగ్ కార్యకలాపాలు లీజుకు ఇచ్చారు” అన్నదే వారి సమాధానం.ఆ సమ యంలో ఆప్రశ్న అక్కడితో ముగిసి పోయిం ది.కానీ నాలుగేళ్ల తరువాత అదే ప్రాంతం నా జీవితానికి ఒకపెద్ద న్యాయపోరాటానికి దారితీసింది.
ఓ యువకుడి ప్రశ్నతో మళ్లీ మొదలైన పోరాటం..
1992లో గిరిజన యువత కోసం నిర్వ హించిన శిక్షణా కార్యక్రమంలో బొర్రా ప్రాంతానికి చెందిన గమ్మెల దేవ కుమార్ అనే ఓ యువకుడు ఇలా ప్రశ్నించాడు. “మీరు కేవలం శిక్షణ ఇస్తారా? మాటలే చెబుతారా?లేకనిజంగాఏదైనాచేస్తారా?” మా ప్రాంతంaలలో మైనింగ్ జరుగుతోం దని,తమ భూమిలపై హక్కు పత్రాలు లేవు.. కానీ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లీజులు ఉన్నాయని వివరించాడు.అక్కడి నుంచే అసలు సమస్య వెలుగులోకి వచ్చింది.
భూమి ఎవరిది? లీజు ఎవరికిచ్చారు?..
బొర్రా ప్రాంతంలోని దాదాపు 2,500 ఎక రాల విస్తీర్ణం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉం ది.అయితే ఆఅటవీ ప్రాంతంలో కొన్ని ప్రత్యే క భూభాగాలు ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. అటవీ భూమి పరిధిలోనివి కాని ఈప్రాం తాల్లో ప్రజలకు భూమిపై హక్కులు ఉండే అవకాశం ఉంటుంది.భారతదేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో గ్రామాలు అటవీ ప్రాంతాలమధ్యలోనే ఉన్నప్పటికీ,అక్కడ నివసించే ప్రజలకు పట్టాలు, నివాస హక్కులు, సెటిల్మెంట్ హక్కులు ఉండటానికి ఇదే చారి త్రక కారణం.బొర్రాప్రాంతంలో మాత్రం పరి స్థితి భిన్నంగా ఉంది.అక్కడి పది గ్రామాలకు భూమి సెటిల్మెంట్ జరగలేదు.మరోవైపు ఐదు మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వమే లీజులు ఇచ్చింది. అయితే ఇక్కడగిరిజన ప్రజలు తరత రాలుగా భూమిని సాగు చేసుకుంటున్నారు. కానీ వారిచేతిలో హక్కు పత్రాలు లేవు.అదే భూమికి మైనింగ్ కంపెనీల వద్ద మాత్రం ప్రభు త్వ లీజు పత్రాలు ఉన్నాయి.

మైనింగ్ వెనుక 1940ల చరిత్ర..
బొర్రా ప్రాంతంలోని మైనింగ్ చరిత్ర కూడా పాతదే.1940లలో ఖనిజాల అన్వేషణ ఒక రకమైన “నిధిఅన్వేషణ” వంటిదిగా ఉండేది. విలువైన ఖనిజాలు,రాళ్లు,మైకా,ఇతర నిక్షేపాల కోసం అన్వేషణ జరిగేది.బొర్రా ప్రాంతంలో పెగ్మటైట్ మైకా నిక్షేపాలు ఉండటంతో మైనింగ్ పై ఆసక్తి పెరిగింది. మైకా కోసం అన్వేషిస్తూనే విలువైన రాళ్లకోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1940ల ప్రాంతం లో అక్కడ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమ య్యాయి.స్వాతంత్య్రం తరువాత ఈప్రాం తాలు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తించబడ్డా యి.అక్కడి నుంచే రాజ్యాంగపరమైన రక్ష ణలు కీలకంగా మారాయి.
ఐదవ షెడ్యూల్`గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగ రక్షణ..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) తో అనుసంధానమైన ఐదవషెడ్యూల్ షెడ్యూల్డ్ ఏరియాలు,షెడ్యూల్డ్ తెగల పరి పాలనకు ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థను కల్పి స్తుంది అనేదిప్రధానమైన ప్రశ్నగా భావిం చాను.సాధారణ ప్రాంతాలకు,షెడ్యూల్డ్ ప్రాంతాలకు మధ్య తేడా ఏమిటి?షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులభూమి,సంప్రదాయా లు, సామాజిక వ్యవస్థ,సహజ వనరులు, స్వయం పరిపాలనకు ప్రత్యేకమైన రాజ్యాం గ, చట్టపరమైన రక్షణలు ఉన్నాయి.ఐదవ షెడ్యూల్ పరిధిలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి.అలాగే గిరిజన సలహా మండలి కూడా ఉంటుంది.గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, అభి వృద్ధిచర్యలు,విధానాలపై గిరిజనుల అభిప్రాయానికి రాజ్యాంగ వ్యవస్థలో ప్రత్యేక స్థానం కల్పించబడింది.ఈ రక్షణల ఉద్దేశం గిరిజనులను అభివృద్ధి నుంచి దూరంగా ఉంచడం కాదు;వారి భూమి,వనరులు, సం స్కృతి,స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడు తూ అభివృద్ధి జరగడం.

గ్రామసభకు (పెసా)అటవీ అటవీ హక్కుల చట్టం..
గిరిజన ప్రాంతాల రక్షణ కేవలం ఐదవ షెడ్యూల్‌తో పూర్తికాలేదు.1996లో వచ్చిన పెసా (చట్టంషెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచా యతీరాజ్ విస్తీర్ణచట్టం ద్వారా ఈవ్యవస్థను గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా విస్తరించింది.గ్రామసభకు సంప్రదాయా లు,సామూహిక వనరులు,సాంస్కృతిక గుర్తింపు,స్థానిక స్వయం పరిపాలనకు సం బంధించిన అంశాల్లో కీలక స్థానం కల్పిం చింది.అదే విధంగా 2006లో వచ్చిన అట వీ హక్కుల చట్టం అటవీ ప్రాంతాల్లో తర తరాలుగా నివసిస్తున్న అటవీ ఆధారిత సముదాయాల వ్యక్తిగత,సామూహిక హక్కు లను గుర్తించేందుకు ఉద్దేశించ బడింది. అభివృద్ధి గురించి నిర్ణయం తీసుకునే ముం దు ఆభూమిపై జీవిస్తున్న ప్రజల గొంతు వినాలి.షెడ్యూల్ ప్రాంత భూములకు రక్షణ కవచం లాంటిభూ బదిలీ నియంత్రణ చట్టం 1952 గిరిజన భూమికి రక్షణ కవ చంలా మారింది.ఆంధ్రప్రదేశ్ వంటి ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూము లను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై ప్రత్యేక నియంత్రణలు ఉన్నాయి.ఈభూ బదిలీ నియంత్రణ వ్యవస్థను ఉల్లంఘించి గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు మైనిం గ్ లీజులు ఇవ్వడం చట్టపరమైన ప్రశ్నగా మారింది.బొర్రా ప్రాంతంలో కూడా ఇదే ప్రశ్న ముందుకు వచ్చింది.గిరిజనుల భూమిని గిరిజనేతర మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం లీజుకు ఇవ్వగలదా?అనే ఈ ప్రశ్నకు సమాధానంకోసం1992లో సమత సంస్థ న్యాయపోరాటం ప్రారంభించింది.
సమతా తీర్పు: 1997లో కీలక మలుపు..
దాదాపు ఐదేళ్ల న్యాయపోరాటం తరువాత 1997లో సుప్రీంకోర్టు వెలువరించిన సమత తీర్పు గిరిజన భూమి హక్కుల చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు, ముఖ్యంగా ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం భూమిని లీజుకు ఇవ్వ డంపై సుప్రీంకోర్టు తీవ్ర పరిమితులు విధిం చింది.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మైనింగ్ కార్య కలాపాలను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు లేదా గిరిజనుల సహకార సంఘాల ద్వారా నిర్వ హించే విధానానికి ప్రాధాన్యం ఇచ్చింది.ఇంకో ముఖ్యమైన ఒక అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది.మైనింగ్‌వల్ల వచ్చే నికరలాభాల్లో 20శాతాన్ని ప్రభావిత ప్రజల సంక్షేమం, పర్యా వరణ పరిరక్షణ,అటవీ పునరుద్ధరణ కోసం శాశ్వత నిధిగా వినియోగించాలని తీర్పు పేర్కొంది. అంటే మైనింగ్ ద్వారా లాభపడేవారే కాకుండా, మైనింగ్ ప్రభావాన్ని భరించే ప్రజలు కూడా ఆర్థిక ప్రయోజనం పొందాలి అనే భావ నకు న్యాయపరమైన పునాది ఏర్పడింది.

తీర్పు వచ్చినా పోరాటం ఆగలేదు..
1997 తీర్పుతో కేసు గెలిచినప్పటికీ…బొర్రా ప్రజలకు వెంటనే పట్టాలు రాలేదు.భూమి సెటి ల్మెంట్‌కు సంబంధించిన మరోచారిత్రక సమ స్య ముందుకొచ్చింది.1958లోనే జైపూర్ మహారాజా తరఫున ఈప్రాంతం ఒడిశాకు చెందిన దని పేర్కొంటూ న్యాయపరమైన వివా దం ఏర్పడింది.ఈవివాదం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బొర్రా ప్రాంతం లోని పది గ్రామాలకు సెటిల్మెంట్ ప్రక్రియ ను పూర్తి చేయలేకపోయింది.మళ్లీ న్యాయపోరాటం జరిగింది.చివరకు 2013 -14 ప్రాంతంలో ఆభూమి ఒడిశా ప్రభు త్వానికి చెందదని స్పష్టత వచ్చింది. ఆతరు వాత పాడేరు సబ్-కలెక్టర్ ఈసమస్యను పరిశీలించారు. రెవెన్యూ ఉన్నతాధికారు లతో సంప్రదింపులు జరిపి,పది గ్రామాలకు భూమి సెటిల్మెంట్ చేయడానికి అను మతులు సాధించారు. 1992లో ప్రారం భమైన పోరాటానికి 2015 లోనే ఒకముఖ్య మైన ఫలితం లభించింది. ప్రజలకు పట్టాలు అందాయి. అంటే ఒకభూ హక్కు సమస్యను పరిష్కరించడానికి దాదాపు 23సంవత్స రాల పోరాటం సాగింది.
డి-పట్టా, సెటిల్మెంట్ పట్టా హక్కులో తేడా..
భూమిపై కేవలం సాగు హక్కు ఉండటం, సంపూర్ణ యాజమాన్యహక్కు ఉండటం రెండూ ఒకటే కావని రవి వివరించారు.డి-పట్టా వంటి వ్యవస్థల్లో భూమిపై వ్యక్తికి పరి మిత హక్కులు ఉండవచ్చు.కానీ సెటిల్మెంట్ పట్టా ద్వారా భూమిపై మరింత స్థిరమైన హక్కు ఏర్పడుతుంది. ప్రభుత్వం భూమిని ప్రజా ప్రయోజనంకోసం స్వాధీనం చేసు కోవాలంటే కూడా చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియను అనుసరించాల్సిఉంటుంది. అందువల్ల భూమి హక్కుపత్రం అనేది కేవ లం ఒక కాగితం కాదు..వ్యక్తి భద్రత, ఆస్తి హక్కు, జీవనాధారం, సామాజిక గౌరవానికి సంబంధించిన అంశం.

సంతల్లో సాగుతున్న గిరిజన జీవితం..
చిన్న అటవీ ఉత్పత్తులు గిరిజన ఆర్థిక వ్య వస్థకు వెన్నెముక.గిరిజన సమాజాల ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అటవీ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలని రవి సూచించారు.చింతపండు,దుంపలు, పసుపువంటి అనేక అటవీ ఉత్పత్తులు గిరి జన కుటుంబాల జీవనాధారంలో భాగం. వీటిని సేకరించి స్థానిక సంతల్లో విక్రయిం చడం ద్వారా కుటుంబాలు ఆదాయం పొందుతాయి.పాడేరు,అరకు వంటి ప్రాం తాల్లో జరిగే వారపు సంతలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు.వందలాదిగ్రామాల ప్రజలు తమ వ్యవసాయ ఉత్పత్తులు,అటవీ ఉత్ప త్తులు,పశువులు,ఇతర వస్తువులను తీసుకు వచ్చి అమ్మడం,తమకు అవసరమైన వస్తువు లను కొనుగోలు చేయడం అక్కడి ఆర్థిక-సాంస్కృతిక జీవితంలో భాగం.చిన్న సంత ల్లో వస్తుమార్పిడి నుంచి పెద్ద సంతల్లో నగదు ఆధారిత వాణిజ్యం వరకు వివిధ స్థాయిలు కనిపిస్తాయి. కాబట్టి అటవీ, భూ మి,నీరువంటి సహజవనరులపై హక్కు అనేది కేవలం పర్యావరణ సమస్య కాదు; అది గిరిజన సమాజాల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న కూడా.
26 శాతం వాటా ప్రతిపాదన..
మైనింగ్ తర్వాత ప్రజలకు ప్రయోజనంలో వాటా ఎందుకు ఉండకూడదు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది.సమత తీర్పులోని 20 శాతం ప్రయోజన పంపిణీ భావనను మరింత విస్తరించాలని భావించాం.2010 ప్రాంతంలో గనుల రంగానికి సంబంధించిన సుస్థిర అభి వృద్ధి విధానాలపై చర్చ జరిగినప్పుడు, మైనింగ్ వల్ల ప్రభావిత ప్రజలకు కంపెనీల లాభాల్లో 26శాతం వాటా ఇవ్వాలనే వాదన ముందుకు వచ్చింది.దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రూ పొందించిన ప్రతిపాదిత మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్`(ఎంఎం అండ్ డీఆర్) బిల్లులో స్థానికంగా ప్రభావిత ప్రజలకు ప్రయోజన భాగస్వామ్యం కల్పించే ఆలోచన వచ్చింది.అయితే పరిశ్రమల ఒత్తిడి, విధానపరమైన విభేదాలు,వివిధ మంత్రిత్వ శాఖల అభ్యంతరాల కారణంగా ఆ ప్రతిపాదన బలహీనపడింది.2014లో 15వలోక్‌సభ రద్దు తో ఆబిల్లు కాలపరిమితి ముగిసింది.కానీ 26 శాతం లాభ భాగస్వామ్యం చట్టంగా మార లేదు.డిఎంఎఫ్ లాభ భాగస్వామ్యానికి బదు లుగా రాయల్టీ ఆధారిత నమూనా తరువాత ప్రభుత్వం జిల్లా ఖనిజ ఫౌండేషన్ (ణఱstతీఱct వీఱఅవతీaశ్రీ ఖీశీuఅdatఱశీఅ-ణవీఖీ)వ్యవస్థను తీసు కువచ్చింది.మైనింగ్‌వల్ల ప్రభావిత ప్రజల సంక్షే మం కోసం మైనింగ్ కంపెనీల నుంచి రాయ ల్టీకి అనుసంధానమైన మొత్తాన్నిఈనిధులకు చెల్లించే విధానం ఏర్పడింది.జిల్లా స్థాయిలో ఈనిధుల నిర్వహణకు వ్యవస్థ రూపొం దించబడింది. అయితే నాఅభిప్రాయం ప్రకారం..ఇది కంపెనీ లాభాల్లో ప్రత్యక్ష వాటా ఇవ్వడం కంటే భిన్నమైన నమూనాగా భావించాను.26శాతం యాజమాన్య/లాభ భాగస్వామ్యం అనే ఆలోచనకు బదులుగా, రాయల్టీ ఆధారిత సంక్షేమ నిధి వచ్చింది. ఈ తేడా అభివృద్ధివల్ల ప్రభావిత ప్రజల ఆర్థిక భద్రతను ఎలా ప్రభావితం చేస్తుం దన్నది భవిష్యత్తు విధానచర్చకు ముఖ్య మైన అంశంగా పరిగణించాం.

అభివృద్ధి పేరుతో కొత్త సవాళ్లు..
గిరిజన ప్రాంతాల సమస్యలు మైనింగ్‌తో మాత్రమే మా పోరాటం ఆగలేదు.బాక్సైట్ మైనింగ్,బొగ్గు గనులు,ఇనుపఖనిజం, పరి శ్రమలు,రహదారులు,విద్యుత్‌లైన్లు వాటి నిర్వాసిత ప్రభావిత మౌలిక వసతులు, పర్యాటకం,కొత్త తరహా విద్యుత్ నిల్వ ప్రాజె క్టులు వంటి అనేక అభివృద్ధి కార్యకలా పాలు గిరిజన ప్రాంతాలపై ప్రభావం చూపు తున్నాయి.ప్రత్యేకంగా పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టులు భవిష్యత్తులో కొత్త సమస్యగా మారే అవకాశం ఉంది.
పర్యాటకమా..సంస్కృతికి ముప్పా?
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకం గణనీయం గా విస్తరిస్తోంది.దీనివల్ల ఆదివాసుల సం స్కృతి ఒకవస్తువుగా మారేప్రమాదం ఉంది. అరకు,బొర్రా వంటి ప్రాంతాలు పర్యాట కంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరో ప్రశ్నను మాముందుకు వచ్చింది. పర్యాటకంవల్ల స్థానిక ప్రజలకు నిజంగా ప్రయోజనం కలుగుతున్నదా?లేకవారి భూమి,సంస్కృతి,సాంప్రదాయాలు,జీవన విధానం గిరిజనేతరుల వంటి బయటివారి వినియోగానికి ఒకవస్తువుగా మారుతు న్నదా?. ప్రస్తుతం పర్యాటక ప్రాజెక్టుల పేరు తో.. హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నారు. గిరి జన ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు స్థానిక గ్రామ సభల నిర్ణయాధికారం,భూహక్కులు, పర్యా వరణ సమతుల్యతను బలహీనపరచ కూడ దని మాఅభిప్రాయం.

భవిష్యత్తులో గిరిజన హక్కులుముందున్న సవాళ్లు.. గిరిజన ప్రాంతాల్లో భూబదిలీ నియం త్రణచట్టం(1/70యాక్ట్) సడలించాలన్న డిమాండ్లు,మైనింగ్‌విస్తరణ,పర్యాటకం,భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు,విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు వంటి అంశాలు షెడ్యూల్ ప్రాం త ఆదివాసీ ప్రజలకు భవిష్యత్తు సవాళ్లుగా మారనున్నాయి.అదే సమయంలో జనా భా ప్రాతినిధ్యం,నియోజకవర్గాల పునర్వి భజన వంటి రాజకీయ అంశాలు కూడా గిరిజన సమాజాల ప్రతినిధిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మా ఆందోళన.
ప్రపంచం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు..
మైనింగ్‌వల్ల ప్రభావితమయ్యే స్థానిక ప్రజ లకు ప్రయోజన భాగస్వామ్యం కల్పించే నమూనాలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్నాయి. కెనడాలో ఫస్ట్ నేషన్స్‌తో ప్రయోజన భాగస్వామ్య ఒప్పందాలు,కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ పన్నులు,రాయల్టీలలో స్థానిక వర్గాలకు వాటాలు,అలాస్కాలో స్థానిక సంస్థలద్వారా వనరుల ఆదాయ భాగస్వా మ్యం,ఆస్ట్రేలియా,ఫిలిప్పీన్స్‌లో స్థానిక/ స్వదేశీ సమాజాలకు రాయల్టీ లేదా ఆదాయ భాగస్వామ్య నమూనాలు వంటి ఉదాహర ణలు.ఈ ఉదాహరణలన్నింటి వెనుక ఉన్న సాధారణ భావన ఒక్కటే.
అధికార వికేంద్రీకరణ`నిర్ణయం గ్రామసభదే కావాలి..
ఉపన్యాసం చివర్లో రవి భవిష్యత్తు కార్యాచ రణకు సంబంధించిన ఒకకీలక ఆలోచనను ముందుకు తెచ్చారు.ప్రభావిత ప్రజల గ్రామ సభ లకు నిర్ణయాధికారం ఇవ్వాలని ఆయన సూచించారు.ఇది పెసాచట్టం స్ఫూర్తికి కూడా అనుగుణమైన ఆలోచన.అంటే,అభివృద్ధి కోసం భూమిని కోల్పోయే వ్యక్తి కేవలం పరిహారం తీసుకునే వ్యక్తికాదు.అభివృద్ధి నిర్ణయంలో భాగస్వామి కావాలి.

అభిమన్యుడి కథతో ముగిసిన సందేశం..
విద్యార్థులు మధ్యలో వెళ్లిపోతుండటాన్ని గమ నించిన రవి మహాభారతంలోని అభిమ న్యుడి పద్మవ్యూహ కథను గుర్తుచేసు కున్నారు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు.కానీ బయటకు ఎలా రావాలో తెలియదు.అందుకే యుద్ధం లో అతను చిక్కుకుపోయాడు.ఈకథను ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ రవి ఒకముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.హక్కుల గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆహక్కులను ఎలా కాపా డుకోవాలి?,చట్టాన్ని ఎలా ఉపయో గించాలి?, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా పోరాడాలి?అనే విషయాలను కూడా తెలు సుకోవాలి. బొర్రా గుహల దగ్గర 1989లో ఒక సాధారణ ప్రశ్నగా మొదలైన విషయం, 1992లో ప్రజల ఫిర్యాదుగా మారింది.ఈ ప్రయాణం ఒకవిషయాన్ని స్పష్టం చేస్తుంది. చట్టం కాగితంపై ఉండటం ఒక అంశం. అది ప్రజల జీవితాల్లో హక్కుగా మారడం మరో విషయం.
ముగింపు..అభివృద్ధి ఎవరి కోసం?..
రెబ్బాప్రగడ రవి ఉపన్యాసం మొత్తం ఒక కేంద్ర ప్రశ్న చుట్టూ తిరిగింది.అభివృద్ధి పేరుతో ఏప్రాజెక్టు వచ్చినా,అక్కడి ప్రజలను కేవలం ‘ప్రభా వితులు’గా కాకుండా హక్కు దారులు,నిర్ణ య భాగస్వాములు,ప్రయోజన భాగస్వా ములుగా చూడాల్సిన అవసరం ఉంది.ఈ బొర్రాగుహల కథ మనకు మరో గొప్ప పాఠాన్ని కూడా నేర్పుతుంది.ఒక చిన్న ప్రశ్న కూడా పెద్ద సామాజిక మార్పుకు ఆరంభంకావచ్చు. 1989లో బొర్రా గుహల వద్ద అడిగిన“పైన పేలుళ్లు జరుగుతుంటే మమ్మల్ని గుహల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు?” అనే ప్రశ్న,చివరకు గిరిజనుల భూమి హక్కు లు,రాజ్యాంగ రక్షణలు,మైనింగ్ విధానం, పర్యావరణ న్యాయం,ప్రజల ఆర్థిక భాగస్వా మ్యం వంటి విస్తృతమైన ప్రశ్నలుగా మా రింది.అందుకేప్రజాస్వామ్యంలోప్రశ్నిం చడం మొదటి అడుగు.చట్టాన్ని ఎలా తెలు సుకోవడం రెండో అడుగు.హక్కును సాధిం చే వరకు నిరంతరం పోరాడటం మూడో అడుగు.`.. ధన్యవాదములు.