పోలవరం నీరు ప్రజలకా..డెటా సెంటర్లకా?

విశాఖ ప్రాంతంలో స్థానిక ప్రజలను సంప్రదించకుండా ప్రభుత్వం అనుమతిస్తున్న భారీ డేటా సెంటర్లకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి కేటాయించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమా దం ఉందని మాజీ కేంద్ర ఇంధనశాఖ కార్య దర్శిఈ.ఏ.ఎస్.శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖప్రజలనీటి అవసరాలను దృష్టిలో పెట్టు కుని డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.డేటా సెంటర్ల నీటి వినియోగంపై తాను ఆగష్టు12, 15తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెండు లేఖలు రాసి నట్లు శర్మ తెలిపారు.డేటా సెంటర్లకు ఏటా 3.5టీఎంసీల నీరు మాత్రమే అవసరమని,ఈఅంశంపై కొం దరు అనవసర విమర్శలు చేస్తున్నారని ముఖ్య మంత్రి పేర్కొన్న నేపథ్యంలో,విశాఖ ప్రజల తరఫున తన అభ్యంతరాలను ఆలేఖల్లో వివ రించినట్లు చెప్పారు.

6,500 మెగావాట్ల డేటా సెంటర్లకు ఎంత నీరు?
రాష్ట్ర శాసనసభలో ఇటీవల డేటా సెంటర్లపై జరిగిన చర్చలో ఉత్తరాంధ్రలో 6,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, వాటికి అవసరమైన సుమారు 3టీఎంసీల నీటిని పోల వరం నుంచి ఉత్తరాంధ్ర పరిశ్రమలకు కేటా యించిన వాటా నుంచి అందించవచ్చని ప్రభు త్వం పేర్కొన్న విషయాన్ని శర్మ ప్రస్తావించారు. అయితే అమెరికాలో గూగుల్ నిర్మించిన డేటా సెంటర్ల నీటి వినియోగాన్ని పరిశీలిస్తే, శీతలీ కరణ కోసం ఒక యూనిట్ విద్యుత్ వినియోగా నికి కనీసం 1.8లీటర్ల నీరు అవసరమవు తుందని తెలిపారు.ఈ లెక్కన 6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు కనీసం 3.74 టీఎంసీల నీరు అవసరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పుడే 74 ఎంఎల్‌డీ నీటి లోటు
ప్రస్తుతం విశాఖ నగర ప్రజల రోజువారీ నీటి అవసరం సుమారు 400ఎంఎల్‌డీ,అంటే 5.16 టీఎంసీలుగా ఉందని శర్మ తెలిపారు. స్థానిక రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకుపోవడం, ముడసర్లోవ,మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ల సామర్థ్యం తగ్గడం, ఏలేరు కాలువ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం ప్రజ లకు సుమారు 326ఎంఎల్‌డీ(4.2 టీఎంసీ లు) నీరు మాత్రమే అందుతోందన్నారు. అంటే ఇప్పటికే రోజుకు సుమారు74ఎంఎల్‌డీ (0. 95టీఎంసీ) నీటి కొరత ఉందని పేర్కొన్నారు. 2040 నాటికి విశాఖ ప్రజల నీటి అవసరం లిలి726 ఎంఎల్‌డీ (9.37 టీఎంసీలు)లిలికు చేరుకునే అవకాశం ఉందని, పోలవరం నీటిని లెక్కలోకి తీసుకోకపోతే అప్పటికి సుమారు 400 ఎంఎల్‌డీ (5.16టీఎంసీలు) నీటి లోటు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పరిశ్రమలకు ఇప్పటికే దాదాపు మొత్తం నీటి వాటా
విశాఖ ప్రాంతంలో నీటి సమస్య, పారిశ్రామిక కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, పారిశ్రామిక వర్గాల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని శర్మ విమర్శించారు.2019 జనవరిలో అప్పటి ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ, పురుషో త్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటిని అందించేందుకు బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (దీజీ=USS) ప్రాజెక్టును మంజూరు చేసిందని తెలిపారు.ఈపథకంద్వారా సుమారు 30 లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజల తాగునీటి అవస రాలకు,అలాగే 8లక్షల ఎకరాల వ్యవసా య భూములకు సాగునీటికి నీటిని కేటాయించిన ట్లు పేర్కొన్నారు.పరిశ్రమలకు మిగిలిన వాటా లో 5.34 టీఎంసీలు కేటాయించినట్లు తెలి పారు.అయితే దీజీ=USS మంజూరు తర్వాత HP్పుL విస్తరణ,బల్క్ డ్రగ్, ఇతర రసాయన పరిశ్రమలు,ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు తదితర పరిశ్రమలకు నీటి లభ్యతను తగినంత గా పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇచ్చారని శర్మ అన్నారు.ఈపరిశ్రమలకు అవస రమయ్యే నీరు సుమారు 5టీఎంసీలు కాగా, పరిశ్రమల కోసం కేటాయించిన5.34 టీఎం సీలలో కేవలం 0.34టీఎంసీలు మాత్రమే మిగులుతాయని వివరించారు.
ప్రజల నీటిని డేటా సెంటర్లకు మళ్లించడం సబబేనా?
ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కల ప్రకారం 6, 500 మెగావాట్ల డేటా సెంటర్లకు అవసర మయ్యేనీరు సుమారు3.74టీఎంసీలు అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 0.34 టీఎం సీలతో ఆ అవసరాన్ని తీర్చడం సాధ్యం కాదని శర్మ అన్నారు.మిగిలిన సుమారు 3.4టీఎం సీల నీటిని డేటా సెంటర్లకు మళ్లిస్తే,ఉత్తరాం ధ్రలోని సుమారు 12లక్షల మంది ప్రజల నీటి అవసరాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించిన వనరులను భారీ డేటా సెంట ర్లకు మళ్లించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.రూ.7.61 లక్షల కోట్ల రాయితీలు..ఉద్యోగాలు మాత్రం పరిమితమే.6,500 మెగావాట్ల డేటా సెంట ర్లకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1.43 లక్షల కోట్ల విలువైన రాయితీలు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.6.18లక్షల కోట్ల మేర రాయితీలు ఇస్తున్నట్లు శర్మ పేర్కొన్నారు.ఇంత భారీ స్థాయిలో ప్రజా వనరు లను రాయితీల రూపంలో వినియోగిస్తున్న ప్పటికీ,స్థానిక ప్రజలకు లభించే ఉద్యోగ అవకా శాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉం దన్నారు.ఈ మొత్తం వ్యయంలో కనీసం ఒక శాతం నిధులను ఉత్తరాంధ్రలో విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు,ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తే,ఈప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగు పరచవచ్చని సూచించారు.
పోలవరి నీటి వెనుక నిర్వాసిత ఆదివాసీల త్యాగం ఉంది
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై సుమారు రూ.30,437కోట్లు ఖర్చు చేస్తున్నా యని శర్మ గుర్తుచేశారు. ఈప్రాజెక్టు కారణంగా లక్షకు పైగా ఆదివాసీలు నిర్వాసితులవుతున్నా రని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వారికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు కూడా ప్రభావిత మవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తగిన నష్టపరిహారం అందకుండానే అనేక సందర్బా Ûల్లో భూములు కోల్పోవాల్సి వస్తున్న ఆదివాసీల త్యాగాలతో పోలవరం నిర్మితమవుతోందని పేర్కొన్నారు.“పోలవరం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టులో నిర్వాసితులైన ఆదివాసీ కుటుంబాల బాధ,త్యాగం ఉంది. అలాంటి నీటిని లక్షల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే బహుళజాతి సంస్థల డేటా సెంటర్లకు అత్యంత చౌకగా కేటా యించడం ఎంతవరకు సమంజసం?” అని శర్మ ప్రశ్నించారు.
డేటా సెంటర్లపై పునఃపరిశీలన అవసరం
విశాఖ ఇప్పటికే నీటి సమస్యను ఎదుర్కొం టున్న నేపథ్యంలో డేటాసెంటర్లకు భారీగా నీటి ని కేటాయించే నిర్ణయాలపై ప్రభుత్వం సమ గ్రంగా పునఃపరిశీలన చేయాలని శర్మ కోరారు. ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికా రులు తాను ప్రస్తావించిన అంశాలను, ముఖ్యం గా భవిష్యత్తులో విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలపై పడే నీటి ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలిం చినట్లు కనిపించడం లేదని అన్నారు. “పోలవ రం ప్రాజె క్టును అమెరికా డేటా సెంటర్లకోసం నిర్మిం చలేదు.ఉత్తరాంధ్ర ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను విస్మరించి ఆనీటిని డేటా సెంటర్లకు మళ్లించడం సమర్థనీ యం కాదు. ప్రజల ప్రయోజనాలను ముందుగా ఉంచి ప్రభుత్వం తన నిర్ణయాలను పునః పరిశీలించాలి” అని ఈ.ఏ.ఎస్.శర్మ కోరారు
ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి
డేటా సెంటర్లకు నీరుఎలా కేటాయించ బోతు న్నారు?రోజువారీ,వార్షిక నీటిఅవసరం ఎంత? ఆనీరు ఏ ప్రాజెక్టు నుంచి వస్తుంది? ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు కేటాయింపులు ఎంత?2040నాటికి ప్రజల అవసరాలకు ఎంత నీరు మిగులుతుంది?ఈ ప్రశ్నలకు ప్రభు త్వం బహిరంగంగా సమాధానం ఇవ్వాలి.డేటా సెంటర్లకు నీటి కేటాయింపుపై పూర్తి వివరా లతో శ్వేతపత్రం విడుదల చేయడం అవస రం.అలాగే స్థానిక ప్రజలతో, నిపుణులతో, నీటి రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి.
విశాఖకు నీరు సరిపోకపోతే డేటా సెంటర్లకు నీరు ఎందుకు?ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు నీటి భద్రతకు హామీ లేకపోతే భారీ నీటి వినియోగ పరిశ్రమలకు అనుమతులు ఎందుకు? పజల వనరులను రాయితీల రూపంలో ఇస్తున్నప్పుడు ప్రజలకు దక్కేది ఏమిటి?అభివృద్ధి కావాలి.పెట్టుబడులు రా వాలి.పరిశ్రమలు రావాలి. కానీ ప్రజల దాహం తీర్చలేని అభివృద్ధి నమూనా మాత్రం ప్రశ్నిం చబడాల్సిందే.విశాఖ భవిష్యత్తు కేవలం డేటా సెంటర్ల భవిష్యత్తు కాదు. అది లక్షలాది ప్రజల జీవన భద్రతకు సంబంధించిన విషయం. పోలవరి నీటిలో ప్రతి బొట్టుకూ ఒక ప్రజా ప్రయోజనం ఉంది.ఆబొట్టును ఎవరికి వ్వా లన్న నిర్ణయంలో ప్రజల హక్కే మొదటి ప్రమా ణం కావాలని ఈ.ఏ.ఎస్.శర్మ సీఎంకు రాసీన రెండు లేఖల్లో పేర్కోన్నారు.
(విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఈఎఎస్‌శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసీన లేఖలు ఆధారంగా..)