అపరిచితుల సుపరిచితుల దర్పణం వనవీరులు

ప్రసిద్ధమైన చరిత గల దేశం మన భారతదేశం, నిర్మాణ భౌగోళిక సాంప్రదాయ రైతుల్లో సైతం అందరికీ ఆదర్శంగా నిలిచే రతగర్భమైన మన దేశం కారణాలు ఏవైనా ఎక్కువకాలం పరాయి పాలకుల ఏలుబడిలో సన్నబడటంతో పాటు తురష్కుల దండయాత్రలో ఎన్నో విలువైన మన సాంప్రదాయ కట్టడాలు, శిల్పాలు సిధిలం చేయబడ్డాయి.
ఈ విధంగా అణచబడి పీడిరచటం ద్వారా చైతన్యం రగిలి తిరుగుబాట్లు పెరిగి స్థానికంగా జాతీయంగా అనేకమంది నాయకులు, వీరులు, పుట్టుకొచ్చి భరతమాత ఆత్మగౌరవాన్ని కాపాడారు అటువంటి వీరుల్లో మన మూలవాసులుగా చెప్పబడే ఆదివాసుల్లో అనేకమంది వీరోచితంగా ముందుకు వచ్చి పరపాలనను అంతం చేసే దిశగా అడుగులు వేసి అమరులైన వారు కొందరు,విజయం సాధించిన వారు మరికొందరు.
నేటి యువతకు చైతన్య స్ఫూర్తి పంచడమే లక్ష్యంగా నాటి మన వనవీరుల పోరాట స్ఫూర్తిని త్యాగాలను కళ్ళకు కట్టినట్టు అందించే ప్రయత్నంలో భాగంగా వనవాసి కళ్యాణాశ్రమం వెలువరించిన అత్యంత విలువైన పుస్తకం ‘‘వనవీరులు మన వీరులు’’, జోషుల మల్లీశ్వరిగారి కలం సాయంతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకంలో అందరికీ సుపరిచితులైన అల్లూరి, కొమరం భీమ్‌, పూజ్యశ్రీ గురూజీ,లతో పాటు చరితపుటల్లో మరుగున పడిపోయిన బుధు భగవత్‌, తలక్కల్‌ఓ చందు,చక్ర బిసోయి, వంటి అపరిచిత సమరయోధుల వివరాలు క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి.
బికడ భీం మొదలుకొని కొమరం భీమ్‌ వరకు గల మొత్తం 24 మంది వనవీరుల వివరాలు పరాయి పాలన పై వారు చేసిన వీరోచితమైన సాహసాలు ఇందులో మనం చదువుకోవచ్చు పరాయి పాలనపై తిరుగుబాటు చేసిన వారు కొందరైతే, తమ గిరిజన జన జాతిలో గల మూఢవిశ్వాసాల నిర్మూలన, మద్యం, మాంసం, వంటి వ్యసనాల నుంచి దూరం చేసి ఆధ్యాత్మిక భావం వైపు పయనింపజేసినవారు మరికొందరు,
ఈ రెండు వర్గాలకు చెందిన వారిలో ఒకరు ‘‘దితియాబాప్ప’’ గుజరాత్‌ రాజ్యంలోనే మారుమూల గిరిజన గ్రామం అయిన వీరవన్లో జన్మించిన ఈ గిరిజన వీరుడు తన ప్రాంతంలోని అత్యంత వెనుకబడ్డ గిరిజనులను వ్యసనాల నుంచి దూరం చేసి భక్తి భావం అలవర్చి అన్య మతాల ఊబిలో పడకుండా కాపాడిన ఆధ్యాత్మిక సంస్కర్తగా చెప్పవచ్చును. ఈ గిరిజన ఋషి చేసిన ఆధ్యాత్మిక కృషి ఆ ప్రాంతంలో నేటికి అలరారడం విశేషం 111 సంవత్సరాల పాటు జీవించిన ఈ సంస్కర్త తన యావత్‌ జీవితాన్ని భక్తి ప్రచారానికి సమాజ హితానికి అంకితం చేశారు.
నాటి చోటా నాగపూర్‌ కు చెందిన మరో వనవీరుడు ‘‘బుధుభగత్‌’’ కూడా తన కృత్యాలతో తన జనజాతి పై ఎంతగానో ప్రభావితం చేసి నాటి బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు చేసిన వీరుని గానే కాక ప్రథమ స్వాతంత్ర సమరం కన్నా ముందే స్వరాజ్య పోరాటం చేసిన వనవీరునిగా ఆయనను ఇందులో అభివర్ణించారు,ఇలా స్వరాజ్య సమరంలో పాల్గొని చరిత్ర పుటలకు చిక్కనిఎందరో సమరయోధులు మనకు ఉన్నారు.
అటువంటి అజ్ఞాత సమరయోధులు అందున వనవాసులైన యోధుల వివరాలు అరుదుగా ఉన్నాయి, ఈ పుస్తకంలో మున్నెన్నడు వినని సమరయోధుల జీవిత వివరాలు సమగ్రంగా సేకరించి వ్యాసాల రూపంలో అందించడం అభినందనీయం.
కేరళలోని వాయినాడు ప్రాంతానికి చెందిన వనవీరులు దేశ స్వరాజ్యం కోసం పోరాడిన సంతతికి చెందినవారుగా నేటికీ సగర్వంగా జీవిస్తున్న వైనం ఇందులో చెప్పారు, అంతేకాక స్వానుభవంతో కూడిన వారి గత అనుభవాలను గానం చేసుకుంటూ నేటికీ కేరళ అడవుల్లో సహజంగా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ అందులోనే ఆనందం అనుభవిస్తూ జీవిస్తున్న తీరును కూడా వ్యాస రచయిత ఇందులో సమగ్రంగా పేర్కొన్నారు, ఆధునిక కేరళ రాష్ట్ర చరిత్రలో సర్వోత్తమ పౌరుష పరాక్రమాలకు పేరుగాంచిన ‘‘కేరళ వర్మ ‘‘అక్కడి వనవాసీలను గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరులుగా తీర్చిదిద్దిన వివరాలు కూడా మనం ఇందులో చదవవచ్చు.
ఈ వ్యాసపరంపరలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న గిరిజన జాతులు నాయకులు వారి వారి పోరాట పఠిమల గురించి సవివరంగా తెలుసుకోవచ్చును.
ఇక గిరిజన నాయకులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే….అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌, రాణి దుర్గావతి, సేవాలాల్‌ మహారాజ్‌, తదితరుల వ్యాసాలు ఇందులో పొందుపరచబడ్డాయి,
గిరిజనేతరుడైన సీతారామరాజు అడవి బిడ్డలకు అండగా నిలిచి పోరాటం చేయడానికి గల కారణం, అందుకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటనలు ఇందులో మనం గమనించవచ్చు.
అదేవిధంగా కొమరం భీమ్‌ సాయుధ పోరాటంలోనికి రావడానికి గల నేపథ్యం అప్పటి భౌగోళిక అంశాలు చాలా కూలంకషంగా వ్యాసకర్త వివరించిన వైనం ఆసక్తిదాయకంగా ఉంది, విషయ అవగాహన చక్కగా సాగింది.
ఈ వ్యాస సంపుటలోని వనవీరుల వివరాలు రెండు వర్గాలుగా విభజించారు, పరాయి పాలనకు కారకులైన బ్రిటిష్‌ వారిపై ప్రత్యక్ష తిరుగుబాట్లు చేసి స్వాతంత్రోద్యమ సమరయోధులైన వనవీరులు ఒక వర్గం అయితే గిరిజన సామాజిక వర్గంలో చైతన్యం తీసుకువచ్చి సంస్కరణలకు చేయూతగా నిలిచిన గిరిజన సంఘ సంస్కర్తలు మరో వర్గంగా విభజించారు ,ఆయా రంగాలలో వారు ప్రవేశించడానికి గల కారణం అనంతరం వారి కృషి సాధించిన విజయాలు గురించి సవివరమైన సంక్షిప్త సమాచార వేదికగా నిలిచింది ఈ ‘‘వనవీరులు మన వీరులు’’వ్యాస సంపుటి,
ఈ పుస్తకానికి నేపద్యం వివరిస్తూ ప్రకాశకులు అందించిన ప్రత్యేక సమాచారంలో, మన దేశంలో జరిగిన స్వాతంత్రోద్యమానికి దారులు వేసింది మొదట వనవాసులే…అనే చారిత్రక విషయం ఆవిష్కరించడంతోపాటు అనేక భారతీయ ఇతిహాసాలకు ఆనవాళ్లుగా నిలుస్తున్న మన దేశంలోని ప్రాంతాల సమాచారం కూడా ఇందులో పొందుపరిచారు .
శత్రు రాజ్యాలతో స్వరాజ్య సమరం సాగించి అమరులైన ఆదివాసి వీరుల సమాచారంతోపాటు, వనవాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాలరాచి వారిలో విభేదాలు సృష్టించి వారిని భారతీయ సంస్కృతికి దూరం చేస్తున్న సంస్కృతి శత్రువులపై పోరాటం చేసి సఫలమైన సంస్కృతి పరిరక్షక సంస్కర్తల కృషిని కూడా ఇందులో వివరించారు, అంతేకాక భారతదేశ భూభాగంలోని విభిన్న ప్రాంతాల్లోని వివిధ తెగలకు చెందిన మూలవాసులైన వనవాసుల వివరాలు సైతం సహేతుక రీతిలో వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
పరిశోధకుల పాలిట కరదీపకగా నిలిచే ఈ పుస్తకం విలువ వెలకట్టలేనిది అనడంలో అతిశయోక్తి లేదు.
సమీక్షకుడు:- డా: అమ్మిన శ్రీనివాసరాజు,
వనవీరులు మన వీరులు
(వ్యాస సంపుటి)
రచయిత్రి : జోష్యుల మల్లీశ్వరి పేజీలు : 272, వెల : 40/- రూ, ప్రతులకు : వనవాసి కళ్యాణ పరిషత్‌ 119,బి.సిరి సంపద రెసిడెన్సి,విద్యానగర్‌, హైదరాబాద్‌-44,ఫోను : 040-27091299.

ఏపీకి పెట్టుడుల వెల్లువ

ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 63వేల 411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐ పీబీ సమావేశంలో చర్చించారు.ఇక దరఖాస్తు చేసు కున్న ప్రాజెక్టుల్లో 9కీలకప్రాజెక్టుల స్థాపనకు ముఖ్య మంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.ఈ 9ప్రాజెక్టులద్వారా రాష్ట్రానికి లక్ష 82వేల 162కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2లక్షల 63వేల411కుపైగా ఉద్యోగఅవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరిం చారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌..6 వేలఎకరాల విస్తీర్ణంలో 96వేల 862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా 2వేల 400 మంది ఉపాధి లభించబోతోంది.అలాగే విశాఖ మిలీనియం టవర్స్‌లో 80కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్‌ ముందుకొచ్చింది.దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు.దీని ద్వారా దాదాపు 2వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పెట్టు బడిదారులంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెల ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్‌..ఏపీలో భారీఎత్తున రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.రామాయపట్నం పోర్టు దగ్గర వారికి 6వేల ఎకరాల ల్యాండ్‌ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.గుజరాత్‌ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.టాటా,రిలయన్స్‌ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్‌ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకు న్నాయి.దీనిద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభి స్తాయి.నిన్న ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 2లక్షల 84వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించొచ్చు. ఎప్పటిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనే వివరాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్త య్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధికా రులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సచివాలయంలో జరి గిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్య మంత్రి ఆమోదం తెలిపారు.
బీపీసీఎల్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక..
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పా టు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.దీంతో2,400మందికి ఉపాధి కలుగ నుం దని చెప్పారు.మొత్తం 9మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌,లెర్నింగ్‌ సెంటర్‌,రిఫైనరీ,పెట్రోకెమికల్స్‌ యూనిట్స్‌,క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌,గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికా రులు ముఖ్య మంత్రికి వివరించారు. వచ్చే 20ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికిరూ.88,747కోట్ల ఆదాయం రానుందని తెలిపారు.అయితే 2029 లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
టీసీఎస్‌..
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగులవిస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.80కోట్ల పెట్టుబడి పెట్ట నుంది.దీంతో 2వేల మందికి ఉద్యోగాలు రాను న్నాయి.
ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలాఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ప్రాజెక్టు ఏర్పాటు చేయ నుంది.ఇందుకోసంఈ సంస్థ రూ.1,046కోట్ల పెట్టు బడిపెట్టనుంది.2,381మందికి ఉపాధి కలుగుతుంది.
బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ :
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని106ఎకరాల్లో రూ.1,174కోట్లతో 1,500మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీఎఫ్‌/పర్టికల్‌ బోర్డు ప్లాంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.
క్లిక్‌ అయిన క్లీన్‌ ఎనర్జీ పాలసీ :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రా నికి వస్తున్నాయి.కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పా టు చేయనున్నాయి.దీంతో కేవలం క్లీన్‌ ఎనర్జీ రంగం లోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగఉపాధి అవ కాశాలు కలుగుతున్నాయి.
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ..
ఏఎంగ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 592ఎకరాల్లో 1మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.రూ.12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 40ఎకరాల్లో 2గిగావాట్ల సామ ర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూని ట్‌ను రూ.2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది.
టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ..
400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో 1,800 ఎకరా ల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.1,380 మందికి ఉపాధి కలుగుతుంది.
క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
వైఎస్సాఆర్‌ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్‌పవర్‌, 130 మెగా వాట్ల సోలార్‌ హైబ్రీడ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,000కోట్ల పెట్టుబడులు పెడు తోంది.650 మందికి ఉద్యోగ ఉపాధి అవకా శాలు రానున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయ నుంది.ఈప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్‌ 19న జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.-జిఎన్‌వి సతీష్‌

కడలి కోత పెడుతోంది..!

‘‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ సముద్రతీరం భయపెడుతోంది. రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.అలల ఉధృతికి తీరంలో కోత పెరిగిపోతుంది. ఇసుక తెన్నెలు కరిగిపోకుండా ఏర్పాటు చేసిన రాళ్లగోడలు సైతం జారుతున్నాయి. ఆర్కేబీచ్‌లో కోత నివారణ కోసం పెంచుతున్న కొబ్బరి వనాలు కోతకు కడలిలో కలసిపోతున్నాయి.కడలి హోరును ఆవేమీ తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా కురుసురా సబ్‌మెరైన్‌ మ్యూజియం ప్రాంతంలో నానాటికీ తీర ప్రాంతం కడలిలో కలిసిపోతుంది.కొన్నాళ్లుగా శాంతించి గంగమ్మతల్లీ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. సముద్రం గత రెండు మూడు రోజుల నుంచి ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో కొన్నిచోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది.. ఆర్కేబీచ్‌లో విక్టరీ ఎట్‌ సీ ఎదురుగా ఉన్న బీచ్‌ సందర్శకులను భయపెడుతోంది.అక్కడ పర్యాటకులు, సందర్శకులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్‌ ఎరినాకు కెరటాలు తాకుతున్నాయి. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.’’ (జి.ఏ.సునీల్‌ కుమార్‌)
విశాఖలోని సాగరతీరం మళ్లీ కోతకు గురవు తోంది.తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుఫాన్లు,పెనుతుఫానుల సమయం లోనే ఇలాంటి పరిస్థితి తెలెత్తేంది.కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు,ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోం ది.గతంలో 2014,2015,2016 సంవత్స రాల్లో విశాఖసాగరతీరం కోతకు గురైంది.2015లో మరిం త అధికంగా..కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కేబీచ్‌ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండరాళ్లను దింపి దడిలా ఏర్పాటు చేసి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు.
రక్షణ కోసం వేసిన ఐరన్‌ మెస్‌ ధ్వంసం చేసేలా..
ఇన్నాళ్లు ఎక్కడో చోట అప్పుడప్పుడు తీరం కోతకు గురయ్యేది.సబ్‌ మెరైన్‌ మ్యూజియం,నోవెటల్‌ ఎదు రుగా ఉన్నబీచ్‌,సాగర్‌నగర్‌ ఋషికొండ ప్రాంతా ల్లోనూ కోతకు గురయ్యేది.ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగినప్పటికీ..తాజాగా విక్టరీ ఎట్‌ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగింది. ఆర్కే బీచ్‌ ఏరియాలో సందర్శకులు సేద జరిగినం దుకు కొన్నిచోట్ల కోకోనట్‌ ఎరీనాలు ఏర్పాటు చేశారు అధికారులు.తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపో కుండా..ఉండేందుకు ఇసుకతోపాటు పెద్ద పెద్ద రాళ్ల ను పేర్చి వాటికి ఐరన్‌ మెస్‌ ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్రరూపంతో.. ఆ ఐరన్‌ మెస్‌ను తాకి..అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా.. మెస్‌ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ఐరన్‌ మెస్‌ను ధ్వంసం చేసేలా ఉంది. దీంతో మెస్‌ లోపల కొబ్బరిచెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండ రాళ్లుసైతం బీచ్‌ కెరటాల వైపు కొట్టుకు వెళ్తున్నాయి.ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
యారాడ నుంచి భీమిలి వరకూ..
సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడంవల్ల తీరంలో ఇసుక పెద్ద మొత్తం లో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధార ణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరంకోత సమస్య ఎదుర్కొంటోంది.ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీ టర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్రతీరం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తిం చారు.ఇందులో యారాడబీచ్‌,కోస్టల్‌బ్యాటరీ, ఆర్కే బీచ్‌, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం,చిల్డ్రన్స్‌ పార్క్‌, జోడుగుళ్లపాలెం,రుషికొండ,భీమిలి తదితర ప్రాంతా లున్నాయి.ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్‌ చేయిస్తుం టుంది.ఏటా ఏఫ్రిల్‌,మే నెలల్లో డ్రెడ్జింగ్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతాళ్లో ఇసుకను పంపింగ్‌ చేస్తుంది.దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది.
తాజాగా దూకుడు..
విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి.సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు..భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా.. వాస్తవానికి,పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటు పోట్లు సహజం..కానీ,సాధారణ రోజుల్లో కూడా ఆటు పోట్లు పెరుగుతుండటం,అలలు చొచ్చుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది.దాదాపు మూడు రోజుల నుంచి ఈపరిస్థితి ఉంది.కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్నిచోట్ల కోత ప్రభావం కనిపి స్తోంది.విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓరిసార్ట్సు సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600కొబ్బరి చెట్లను నాటింది.ఆ చెట్లును బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్రతీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు,బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీ ఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు కూలుతు న్నాయి.
కోత నివారణకు విశాఖ పోర్టు సంరక్షణ చర్యలు..
విశాఖ ఆర్కే బీచ్‌ ప్రాంతంలో బీచ్‌ నిర్వహ ణ,విశాఖ పోర్టు అథారిటీ సామాజిక బాధ్యతలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అవుటర్‌ హార్బర్లో పేరుకున్న ఇసుకను సముద్రతీర ప్రాంత పరిసరాలలో నింపుతూ విశాఖలో బీచ్‌కోత నివారణకు పోర్టు సంరక్షణ చర్యలు తీసుకుంటుంది.విశాఖ నగరంలోని బీచ్లను పరిరక్షిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తుంది.బీచ్‌కోత నివారణ కోసం డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉన్న అత్యాధునిక డ్రెజ్జర్లను వినియోగించి,డిసిఐ డ్రెడ్జ్‌ 21పరికరంతో పోర్టులోపల పేరుకుపోయిన ఇసు కను తవ్వి ఆర్కే బీచ్‌ పరిసరాలలో 0.5కిలమీటర్ల పొడవైన పెపులైన్లు, రెయిన్‌ బోయింగ్‌ ద్వారా నింపు తారు.ఇలా ప్రతి ఏటా పోర్ట్‌ అధికారులు, రాష్ట్ర ప్రభు త్వం డ్రెడ్జింగ్‌ పనులు చేపడితేనే బీచ్‌ కోతకు గురవ కుండా ఉంటుంది.గత సంవత్సరం కొంతమేర పను లు చేసినప్పటికీ ఈ సంవత్సరం మరల కోతకు గురవు తుంది. ఇప్పటికైనా పోర్ట్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని బీచ్‌ కోతకు గురవకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కోత నివారణకు ప్రతిపాదనలు..
ఇటీవల సముద్రం కోతకు గురైన సంద ర్భాల్లో భారీగా సముద్రంలో ఉన్న ఇసుకను తీరంపై వేసేవారు.వైజాగ్‌ పోర్ట్‌ ప్రత్యేకంగా దీనికోసం ఆర్థిక భారాన్ని భరించి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసేది.హుదూద్‌ సమయంలో కెరటాలు ఆర్కే బీచ్‌ రోడ్డుపైకి వచ్చాయి.. ఆ సమయంలో భారీగా తీరం కోతకు గురవడంతో నివారణ చర్యలు తీసుకున్నారు.అయినప్పటికీ సము ద్రుడి ఉగ్రరూపం ముందు ఆచర్యలన్ని తాత్కాలి కంగానే మిగిలిపోయాయి.అయితే గతంలో చేసిన డ్రెడ్జింగ్‌ ద్వారా ఆర్టిఫిషియల్‌గా వేసిన ఇసుక మళ్ళీ సముద్రం తన సహజసిద్ధంగా సముద్రంలోనికి కలిపే సుకుంటుందని మరి కొంతమంది నిపుణులు అంటు న్నారు. అయితే..తీరం కొత్తశాశ్వత నివారణకు వైజాగ్‌ మెట్రో రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది.తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక పనులకు,ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తూ.. కోస్టల్‌ ఎరోసన్‌ ప్రాజెక్టుకూ ప్రతిపాదన కేంద్రానికి పంపింది. 200కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, వీఎంఆర్‌డీఏ 90:10నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళికలో సిద్ధం చేశారు.
భయపడెతున్న సాగరతీరం..
ఒకప్పుడు బీచ్‌కు వెళ్తే చాలా దూరం ఇసు కలో నడుస్తూ కెరటాల ముందు వరకూ వెళ్లే వాతా వరణం ఉండేదని,ఇప్పుడు తీరం భారీ కోతలమూ లంగా ఎక్కడ కూర్చోవాలో తెలియనంతగా ఇరుకుగా మారింది.అధికారులు,పర్యావరణవేత్తలుఈ విష యంలో తగిన పరిష్కారం చూపాలి.అందమైన విశాఖ బీచ్‌ అలాగే ఉండాలంటే విశాలమైన ఇసుక తిన్నెలు ఉండాల్సిందేనని బీచ్‌ప్రేమికులు అంటున్నారు. విశాఖ సాగరంలో 2012లోఏర్పడిన సునామీ సమ యంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు చూస్తే పరిస్థి తులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.ఈనేపథ్యంలో సముద్రం నెమ్మ దిగా ముందుకు దూసుకుని వస్తే ఎలా అన్నచర్చ పర్యాటకులు,సందర్శకుల్లో మొదలైంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
విశాఖపట్నం అనగానే సుందర సాగరతీరం అందరికీ గుర్తొస్తుంది. వైజాగ్‌ వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్‌ ని సందర్శించే వెళ్తారు. నిత్యం పర్యాటకులు, నగరవాసులతో బీజ్‌ అంతా సందడిగా కనిపిస్తుం టుంది. అయితే అలాంటి సాగరతీరం కోతకు గురవు తోంది. అలలు తాకిడికి తీరం కోతకు గురవుతోంది.. దీంతో చెట్లు, పార్కులు, రోడ్లు ధంసం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పోర్ట్‌ అధికారులు, జీవీఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సముద్ర శాస్త్ర రిట్కెర్డ్‌ ప్రొఫెసర్‌ బీఆర్‌ రెడ్డి అంటు న్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరం పక్కన ఉన్న రోడ్లు, భవనాలు మునిగిపోయే ప్రమాదం ఉదని ఆయన తెలిపారు. గతంలో సము ద్రం లోపల నుండి ఇసుక తీసుకువచ్చి డ్రెజ్జింగ్‌ పనులు చేసేవావారని..ఇలా చేస్తే తీరం కోతకు గురవ కుండా ఉంటుందని తెలిపారు. అయితే ఇటీవల డ్రెజ్జింగ్‌ పనులు చేయకపోవడం..అధిక శాతం ఇసుక అలల తాకిడికి కోతకు గురికావడంతో తీర ప్రాంతం దెబ్బతింటోందని ఆయన తెలిపారు.

గిరిజనులారా బహుపరాక్‌..!

ఇరువైతోమ్మిదేళ్లక్రితం పీసాచట్టం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మేథావులు,గిరిజనులు పోరాడి సాధించారు.ఈచట్టంపై రాజ్యాంగం కల్పించిన హక్కులు, వనరుల పరిరక్షణ కోసం షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో జనవరి3నుంచి7వ తేదీ వరకు పెసాచట్టం కమిటీలకు ఉపాధ్యక్షుడు,కార్యదర్శి పదవు లకు ఎన్నికలు జరిగాయి.వాస్తవానికి పార్టీలకు అతీతంగా చేతులు ఎత్తే విధానంలో ఈఎన్నికలు జరిగాయి కానీ అన్నీ రాజకీయపార్టీల ముసుకులోనే జరిగిన ఈఎన్నికల్లో ఆయా ప్రతినిధులు పదవులు దక్కించుకున్నారు. ఎన్నికైన వారంతా ఐదేళ్లు పదవుల్లో ఉంటారు.
అయితే,ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజన తెగలకు చెందినవారే కాబట్టి ప్రతి ఒక్కరూ పెసాచట్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకతఎంతైనా ఉంది.వనరులు,హక్కులు దోపిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఎందుకంటే..ఈచట్టం ప్రకారం ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్ర బిందువు చేశారు.గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు.ఒకప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు.వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వన రులు,అటవీ సంపదపై యాజమాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆవనరులను స్వీయ అవసరాల కోసం వినియో గించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు.ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ,నష్టపరిహారం పంపిణీ,గనులతవ్వకాలకు సంబంధించిన లీజులు,సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్ర మాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉపప్రణాళిక నిధులఖర్చుకుసైతం గ్రామసభల అనుమతి తీసు కోవాలి.అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి. జల,అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షిం చుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి.విద్యా,వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతఉంటుంది.
దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే.అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి,వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన,కట్టుబాట్లు, భౌగోళిక,సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడంఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి.గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ,చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు-‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.
పీసా,అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు.దీంతో రాజ్యాంగరక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి.పీసాతో సహా ఇతర గిరిజనరక్షణ చట్టాలు,సంబంధిత నిబంధ నలపై శిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలు తీరునుపర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది,తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి.పీసాచట్టం అమలులోకి వచ్చి 29ఏళ్లుయిన తర్వాత పెసాచట్టంపై ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పెసాచట్టం పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి.మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చిపెసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యతకొత్తగా కొలువుదీరిన పెసా కమిటీపై ఎంతైనా ఉంది!

– రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2