వృద్ధి రేటుతో ఒరిగేదెంత?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అప్పులమయం చేసిందని, వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులపై వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని అందు వల్ల ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాలు వెంటనే అమలు చేయలేక పోతున్నామని ప్రచారంలో పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని, ఆతరువాతే సంక్షేమ పథకాలు అమలు అని తెగేసి చెబుతున్నారు.ఈధోరణి కేంద్ర ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద స్వభావాన్ని తెలియజేస్తున్నది.ఈ విధానాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు పూనుకున్నది. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకొని, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనేది నయా ఉదారవాద విధానం యొక్క ముఖ్యమైన లక్షణం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏదో ఒక వంక చూపి అమలు వాయిదా వేస్తున్నది. ఒకవేళ అమలుకు పూనుకున్నా అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను చాల పరిమితం చేస్తారు. ఇప్పుడు సామాజిక పెన్షన్‌ పథకంలో అనర్హులు ఉన్నారనే ప్రచారం చేసి లబ్ధిదారులను కుదించ టానికి పూనుకున్న విషయం తెలిసిందే. పారిశ్రా మికవేత్తలకు, వ్యాపార, వాణిజ్యవేత్తలకు మాత్రం ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు పన్ను రాయితీలు ఇస్తున్నది.భూములు, గనులు, సముద్ర తీరం, అటవీ ప్రాంతం తదితర వాటిని ఈశక్తు లకు అభివృద్ధి పేర ధారాదత్తం చేస్తున్నది. ఈ చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి తీవ్ర గండి పడుతున్నది. ఉదాహ రణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్ర మలకు, ఇతర వాణిజ్య సంస్థలకు పదేళ్లు రాష్ట్ర జీఎస్టి మినహాయిస్తున్నారు. భూములు ఉచితంగా బదలాయిస్తున్నారు. విద్యుత్‌, నీటి సరఫరా రాయితీలతో పాటు ఉత్పత్తి ప్రోత్సాహకాల పేర ప్రతి కార్మికుడికి నెలకు రూ. 7500 ప్రావిడెంట్‌ ఫండ్‌ రాయితీ పేర (యజమాని చెల్లించాల్సిన వాటా) చెల్లింపు, ఆ పరిశ్రమకు అవసరమైన ప్రధాన రోడ్లు, రైల్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం వంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతా యని ప్రభుత్వం అంటున్నది. తదారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం పెరుగుతుందని, దీనిద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొ చ్చని వాదిస్తున్నది. కానీ రాష్ట్ర విభజన తరువాత గడిచిన దశాబ్దంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం లేదనేది వాస్తవం.రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ పదేళ్ళలో మూడు రెట్లు అయ్యింది. రాష్ట్ర స్థూల వృద్ధి రేటు సగటున 9శాతం కొనసాగింది. కాని రాష్ట్ర ఖజానాకు ఈ సంపద పెరుగుదల వల్ల పన్నుల ఆదాయంలో గణనీయమైన పెరుగు దల రావాలి కాని రాలేదు. ఉదాహరణకు రాష్ట్ర జిడిపి 2024-15లో రూ.5.24 లక్షలకోట్లు వుండగా 2023-24కి రూ.14.39లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు మూడు రెట్లు రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగింది. ఇదే మోతాదులో కనీసం రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరగాలి. ఇది జరగలేదు. 2014 నుండి 2024 కాలంలో రాష్ట్ర సొంత పన్నుల నుండి (రాష్ట్ర జీఎస్టీ, అమ్మ కపు పన్ను, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డ్యూటీ వంటివి) వచ్చిన ఆదాయం కేవలం రూ. 42,618 కోట్లు నుండి రూ.78,026 కోట్లకు మాత్రమే పెరిగింది. మొత్తం రాష్ట్ర సొంత పన్నుల నుండి, కేంద్ర పన్నుల నుండి రాష్ట్రానికి వాటా రూపంలో వస్తున్న ఆదాయం మొత్తం కలిపి చూస్తే రాష్ట్ర జిడిపిలో 9శాతం లోపే పరిమితం అవు తున్నది. రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం కూడా రాష్ట్ర జిడిపి పెరుగుదలలో పడిపోతున్నది. 2018-19లో రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం రాష్ట్ర జిడిపిలో 17.2 శాతం ఉంటే 2022-23 నాటికి 15.96 శాతానికి పడిపోయింది. అలాగే ముఖ్యమైన మూలధన వ్యయం కూడా రాష్ట్ర జిడిపిలో 2018-19లో 2.2శాతం ఉంటే 20 22-23కి 0.13శాతానికి తగ్గిపోయింది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మోడీ పరిపాలనా కాలంలో బాగా తగ్గి పోతున్నది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లలో కూడా కోత పెడుతున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రా ల వాటా ఏకపక్షంగా పెంచేస్త్తున్నది. రాష్ట్ర విభ జన హామీలు అనేకం అమలు చేయటం లేదు. ఈ నిరంకుశ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపటం లేదు. రాష్ట్రాలకు అప్పులు సేకరించు కొనే అవకాశాలపై కూడా కేంద్రం ఆంక్షలు విధి స్తూ కోతలు పెడుతున్నది. దీనిపై కూడా స్పందిం చడంలేదు. గత వైసిపి ప్రభుత్వం సైతం ఇదే వైఖరి అవలంభించింది. అలాగే షరతులతో అప్పులు తీసుకొని ప్రజలపై భారాలు వేయటంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు నష్టకర మైన ప్రమాదకర విధానాల అమలుకు పూను కున్నది.ఈ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అమలు చేస్తూ రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడు తూ అప్పుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. వైసిపి అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆదేశిత సంస్కరణలు చాలా వేగంగా అమలుకు పూనుకుంటున్నది. ఇటీవల నీతి ఆయోగ్‌ దేశం లోని అతి పెద్ద 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక ఆరోగ్య సూచీ-2025 పేర ఒక నివేదికను విడుదల చేసింది.గత పదేళ్ళలో 2022-23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆధారంగా విడు దల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 17వ స్థానంలో ఉందనీ నివేదిక తెలి పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించా లనే పేర ప్రజలపై భారాలకు వొడిగడుతున్నది. సుమా రు రూ.40వేల కోట్లపైబడి ప్రజల సంక్షేమంపై నిధులు ఖర్చు పెట్టకుండా దెబ్బ తీసింది. లక్షల మంది వాలంటీర్లను తొలగిం చింది. ట్రూ అప్‌ చార్జీల పేర రూ.18వేల కోట్లు విద్యుత్‌ చార్జీల భారం మోపారు.స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు బిగింపు కొనసాగిస్తున్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షించి ప్రజలకు మేలు చేస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు రాష్ట్ర జీఎస్టీపై అదనంగా ఒక శాతం సర్‌ చార్జీ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఇలాంటి పన్నుల భారాలు రాబోయే కాలంలో అనేక రూపాల్లో వస్తాయి. చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దు చేసినా పీ4 (ప్రభు త్వ, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టిసిపేషన్‌) పేర ప్రభుత్వ పౌర సేవలు, మౌలిక సదుపాయాలు,విద్య, వైద్యం వంటి సామా జిక సేవలు ప్రైవేట్‌ శక్తులకు బదిలీ చేయ టానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వంఈ బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగబోతున్నది. అలాగే ప్రభు త్వం తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో వేతనాలు, రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌, వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు (కమిటెడ్‌ ఎక్స్‌ పెండిచర్‌)కు తగు వ్యయం చేయాల్సిఉం టుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 64.6శాతం నిధులు వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తు న్నది. ప్రస్తుత కూటమి ప్రభు త్వం వేతనాలు, పెన్షన్ల మీద పెట్టే ఖర్చు తగ్గించు కునే విధానాన్ని అమలు చేస్తున్నది.గత దశాబ్దంలో వేతనాలు, పెన్షన్లపై ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39.30 శాతం నుండి 37.90శాతానికి తగ్గి పోయింది.ఇప్పుడు ప్రభు త్వం ప్రజల సంక్షేమంపై వ్యయాన్ని కుదిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, సంపన్నుల అవసరాల కోసం నిధులు ఖర్చు పెడుతున్నది. అదేమంటే 2047 నాటికి రాష్ట్ర జిడిపిని 2.4 ట్రిలియన్‌ డాలర్లలకు పెంచా లని తద్వారా రాష్ట్ర ప్రజలు అత్యంత సంపన్నల వుతారని ప్రచారం చేస్తున్నది. ప్రజలకు తక్షణ అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రాధాన్యత కాకుండా విమానాశ్రయాలు, భారీ స్టేడియంలు,బుల్లెట్‌ ట్రైన్ల వంటి వాటికి ప్రాధా న్యత ఇస్తున్నారు. తీసుకొ స్తున్న అప్పులు కూడా వీటి కోసం ఖర్చు చేస్తు న్నారు. చివరికి విద్య, వైద్యం వంటి సామాజిక సదుపాయాలకు కూడా ఖర్చు తగ్గించేస్తున్నారు. వ్యవసాయంపై కూడా ఖర్చు పెంచటానికి నిరాకరి స్తున్నారు.రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ఈవిధా నాలవల్ల ప్రజల ఆదా యాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ శ్రామికుల ఆదాయాలు బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారు ణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో పడుతున్నది. ప్రభుత్వం ప్రస్తుత విధానాన్ని విడనాడి సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య,వైద్యం వంటి సామాజిక రంగాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరణ,ప్రభుత్వ ఉద్యోగ కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రజ లకు తక్షణం ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ఖర్చులు పెంచాలి. శ్రామి కుల వేతనాలు పెంచాలి.ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ అదుపు,జోక్యం,వ్యయం పెంచాలి.దీనివల్ల ప్రజ లకు ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగు తుంది.ఈ ప్రక్రియ జరిగితేనే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక సరుకులకు, సేవలకు డిమాండ్‌ పెరిగి పన్నుల ద్వారా రాష్ట్రానికి అద నంగా రెండు నుండి మూడు రెట్లు సొంత బడ్జెట్‌ ఆదాయం పెరుగు తుంది.అంతేగాక అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయి.కొంత మేరకైనా ఆర్థిక అసమానతలు తగ్గు ముఖం పడ తాయి.ఈదృష్టితో రాష్ట్ర ప్రభు త్వం క్రియాశీల విత్త విధానం అమలు చేపడితేనే రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సమస్యలనుండి బయట పడగలదు.-(బి.గంగారావు)

బడి మారుతోంది

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది.దాంతోపాటే2023లో-24లో మొత్తం విద్యార్థు ల నమోదు డేటా కూడా వుంది.విద్యా రంగంలో ఏదో గొప్ప అభివృద్ధి వచ్చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పసఏమిటో ఈసమాచారం తేల్చివేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికిపైగా తగ్గిపోయినట్టు చెబుతున్నది. 20 23-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లు గా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37లక్షల మందివిద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. అయితే 2018-19లోసూళ్లలోనమోదు26.02కోట్లుగా వుంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6శాతం పెరిగి,26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కుపోతే 2012-13లో కూడా 26.3కోట్ల నమోదు వుంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈతగ్గుదల మరింత కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.
2023-24లోమొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా సంఖ్య 16లక్షల మంది విద్యార్థినులు విద్యా రంగాన్ని వదలివెళ్లిపోయినట్టు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్కగట్టడంలో గతంకన్నా మెరుగైన పద్ధ తులు తీసుకువచ్చినట్టు మంత్రిత్వశాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై వుండొచ్చు నంటున్నది. అయితే ఈతగ్గుదల ఆందోళనకర మైం దనీ ఈసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతున్నది.
నూతన విధానంతో పెద్ద ఎత్తున స్కూళ్ల మూత
బీహార్‌ ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈతగ్గుదల అత్యధి కంగా వుందని గమనించడం చాలా ముఖ్యం. 20 18-19లో బీహార్‌లో 2.49కోట్లమంది విద్యార్థులు నమోదుకాగా ఇప్పుడు2.13కోట్లకు తగ్గిపోయారు (అంటే35.65లక్షల కంటే ఎక్కువగాతగ్గారు).ఉత్తర ప్రదేశ్‌లో2018-19లో నమోదు 4.44కోట్లు కాగా తాజా నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో2.32కోట్ల మంది నమోదైతే తాజా నివేదిక లో ఆసంఖ్య 2.13కోట్లకు పడిపోయింది. ఈనివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదలకు కారణాలేమిటనే దానిపై వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాలు ముం దుకు తెస్తున్నారు.విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్‌షిప్‌ మొత్తాలు సకాలంలో విడుదల చేయకపోవడమో ఎగవేయ డమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బిజెపి ప్రభు త్వం మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యకే పెద్ద పీట వేసింది. హర్యా నా వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అత్య ధిక భాగం (కాంగ్రెస్‌,బిజెపి రెండిరటి సర్కార్లు నడి చిన రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలతో సహా) ప్రభుత్వ స్కూళ్లను భారీ ఎత్తున మూసివేయడం లేదా కలిపే యడం జరిగింది.అంటే పిల్లలు మరీ ముఖ్యంగా పేదకుటుంబాలకూ దళితులకూ సంబంధించిన పిల్ల లు వెళ్లవలసిన స్కూళ్లు దూరమై పోయాయి. ఎంత దూరమంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణిం చడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహ పరుస్తున్నాయి. 2018-19 మధ్య 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని యు.డి.ఐ. ఎస్‌.సి (యుడైస్‌) 2022 నివేదిక పేర్కొం టున్నది. 2024లో యు.పి ప్రభుత్వం 27వేలపాఠశాలలు మూసివేసింది.ప్రత్యేకించి బీహార్‌,మహారాష్ట్రలో ప్రైవే టు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి.ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తర ప్రదేశ్‌లో స్కూళ్ల మూతలు చూస్తుంటే కేవలం ప్రైవే టు స్కూళ్లలో నమోదు పెరగడం ఒక్కటే సమ స్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది.
కేరళలో మెరుగైన ఫలితాలు
విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసా గేలా చూడాలన్నా ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబు తుంది.విద్య నాణ్యత పెంచేందుకూ అదే మార్గం. 2021-22లో కేరళలోస్థూలనమోదు నిష్పత్తి (జి.ఇ. ఆర్‌) 41.3శాతంగా వుంది. జాతీయ సగటు 28.4 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్యా భాగస్వామ్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి జి.ఇ.ఆర్‌ కీలక సూచిక. తాజాగా2023-24 నివేదికలోకూడాకేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. ఈ రాష్ట్రంలో బాలికల చేరిక అబ్బాయిలను మించి వుం డటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యవంతమైన సుహ్రృద్భావ పూర్వకమైన వాతావ రణంకోసం కేటాయింపు ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి, నిలబడటానికి దోహదం చేస్తున్నాయి.
కనీస సదుపాయాల లేమి
యుడైస్‌ తాజా నివేదిక వెల్లడిరచే అంశాలు విద్యా ర్థుల సమస్యలకోణం నుంచి కూడా చూడాలి. ప్రత్యే కించి పేదలు సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలించాలి.చాలా స్కూళ్లలో అమ్మాయిలకు ప్రత్యే కంగా మరుగుదొడ్లు కూడా లేవని ఈ నివేదిక చెబు తున్నది. ఉన్నవాటిలో చాలా చోట్ల తలుపులు లేవు. చాలా బళ్లలో మంచినీటి సదుపాయం లేదు. అనేక స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో వున్నాయి.తరగతి గదుల్లోకి వేటలుతురే రాదు. కుర్చీలు,టేబుళ్లు కూడా వుండవు. అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సి పాళ్లు, ఉద్యోగులు పిల్లలపై అత్యాచారాలకు, లైంగిక హింసకు పాల్పడిన ఘటనలు జరిగాయి. దేశంలో అత్యధిక చోట్ల స్కూళ్లలో కుల వివక్ష సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి.విద్యారంగంలో విచారకర మైన ఈ పరిస్థితికి ఇవన్నీ కారణాలే.
ఏకోపాధ్యాయులు, పారా టీచర్లు
చాలా రాష్ట్రాల్లో ప్రస్పుటంగా కనిపించే పెద్ద లోపం ఏకోపాధ్యాయపాఠశాలలు పెద్ద సంఖ్యలో వుండటం. ఉదాహరణకు ఒకేటీచరు నాలుగు నుంచి ఆరు క్లాసులు ఇంకా ఎనిమిది క్లాసులు కూడా చూసుకునే పరిస్థితి వుంది.ప్రభుత్వ నివేదికల ప్రకారం 2023-24లో భారత దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971వున్నాయి.ఇలాంటి పాఠశాలల్లో 89 శా తం గ్రామీణ ప్రాంతాల్లోనే వున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌,గోవా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,జార్ఖండ్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ఏకోపాధ్యా య పాఠశాలలు ఎక్కువగా వున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా వుండగా కేరళలో కూడా కొన్నివున్నాయి.కానివాటిలో విద్యా ర్థుల సంఖ్య చాలా తక్కువ. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ గా పిల్లలున్నారు. కేరళలోనైతే వాటిలో సగటున పది మంది పిల్లలున్నారు. నిజానికి కేరళలో ఏకోపాధ్యా య పాఠశాలలు అతి తక్కువగా వుండగా వాటిలో పిల్లల సంఖ్య కూడా దేశంలోకెల్లా తక్కువగా వుంది. సగటున ఒకఏకోపాధ్యాయ పాఠశాలలో 70, బీహార్‌ లో నైతే 96 మంది పిల్లలు వున్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా వుంటుంది.
అందువల్ల ఇక్కడ ప్రభుత్వ తాజా నివేదికలో ఆందోళన కలిగించేది పిల్లల నమోదు తగ్గిపోవడం ఒక్కటే కాదు. పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా వుండటం,చాలా స్కూళ్లలో బోధనా ప్రమాణాలు కూడా దారుణంగా వుండటం. ఈ విషయంలోనూ కేరళ పరిస్థితి చాలా మెరుగ్గా వుంది. ఇక్కడ ముఖ్యం గా గమనించాల్సింది ఏమంటే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పారాటీచర్లు, కాంట్రాక్టు టీచర్ల నియా మకమే లేదు.అక్కడ టీచర్ల ఉద్యోగాలు పర్మనెంటు పోస్టులు. వారు తమ బోధనా నైపుణ్యాన్ని బోధనా పద్ధతులను నిత్యం మెరుగు పర్చుకుంటుంటారు. ఆ ప్రక్రియపై పర్యవేక్షణా నిరంతరంగా సాగుతుంటుం ది.దీంతో పోలిస్తే యు.పిలో24వేల మంది కాంట్రా క్టు పద్ధతిలో ఆదేశాల ఉపాధ్యాయులు వున్నారు. ఎనిమిదో తరగతి వరకూ బోధించేందుకుగాను వీరికి రూ.7000 ఇస్తారు. వారిలో చాలా మంది అవసరమైన అదనపు ఆదాయంకోసం టైలర్లు, ఆటో డ్రైవర్లు, దుకాణాలలో సహాయకులుగా పని చేస్తుం టారు. అంతేగాక 1,42,000 విద్యా మిత్రలను కూడా వార్షిక కాంట్రాక్టు పద్ధతిలో నియమించు కున్నారు.ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడిపోవచ్చు ననే భయంలో కొట్టుమిట్టాడే వారు బోధనపై శ్రద్ధ పెట్టడం ఊహకందని విషయం. ఇంతేగాక ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది ప్రిన్సిపాళ్లు, టీచర్ల పోస్టులు ఖాళీ పడి వున్నాయి. చాలా రాష్ట్రాల పాఠశాలల్లో నమోదు తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు నాసిగా వుండటం భవిష్యత్తుపై చాలా హానికర ప్రభావం చూపిస్తాయి.నమోదులోనూ పిల్లలను నిలబెట్టు కోవ డంలోనూ కేరళ విజయం ఉత్సాహకరంగా వుంది. దాంతోపాటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిరంతరం మెరుగుదల తీసుకురావడం, కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసి వుంది. అత్యవసరమైన ఈ మార్పులు సాధించాలంటే ఆ విజయాలకు కారణ మైన అక్కడి పద్ధతులను అనుసరించడం కూడా కీలకమవుతుంది.
ఏపీలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు ఆంధ్ర ప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీనిలో భాగం గా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగిం చింది.అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్‌ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది.అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశా లలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు.బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1,2తో పాటు 1నుంచి 5తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యఆధారంగా టీచర్లను కేటా యిస్తారు.మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగ తులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒకటీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటారు.హైస్కూల్‌ ప్లస్‌లకు ప్రత్యామ్నా యంగా బాలికలకు ఇంటర్‌ విద్య అందించే ఉద్దే శంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీల విధా నం తేవాలని భావిస్తున్నారు.దీంట్లో భాగంగా జిల్లాలో ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థ రద్దు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం,లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది.ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థను తీసేయనుంది.వీటిల్లోని ఇంటర్‌ను ఇంటర్మీడియట్‌ విద్యాశాఖఖు అప్పగించ నుంది.గతేడాది డిసెంబర్‌ 31వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.జాతీయ రహదారులు,రైల్వే లైన్లు,వంతెనలు,పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది.ఈవిధానాలపై అవగాహన కల్పించేందుకు,ఇప్పటికే జిల్లా,క్లస్టర్‌, మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. -(సుభాషిణీ అలీ)

నో స్మోకింగ్‌ ప్లీజ్‌..

వృత్తిలోనే ప్రవృత్తిని వెతుక్కున్నారు ఆ అధికారి. సగటు మనిషిపై వ్యసన పరుడిగా ముద్ర వేస్తున్న పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాటం సలుపుతున్నారు. పొగాకు ఉత్పత్తుల బారిన పడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను కొనితెచ్చుకో వద్దని చెప్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడు తున్నారు.పొగాకు ఉత్పత్తులకు వ్యతి రేకంగా తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. పొగాకువల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అందరిలో అవగా హన కల్పిస్తున్నారు. పొగాకు..వ్యసనపరుల బతుకుల్లో పొగ బెడుతున్న తీరును సామాజిక మాధ్యమాల్లో వివరించడంద్వారా పొగాకు ఉత్ప త్తులపై రగల్‌ జెండా ఎగురవేసిన రఘునందన్‌ సేవలు అభినందనీయం.
అవకాశం దొరికినప్పుడల్లా..
ఎక్స్‌ ఖాతా ద్వారా నిత్యం పొగాకు,సిగార్‌ గురిం చిన పోస్టులు పెడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న రఘునం దన్‌ ప్రచార సరళిని దేశవిదేశాల్లోని స్వచ్చంధ సంస్థలూ గుర్తించాయి.పొగాకు నియంత్రణలో భాగంగా ఏర్పాటుచేసే సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు రావాలని ఆయనకు అంతర్జాతీ యంగా ఆహ్వానాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రత్యక్షంగా పాల్గొన లేకపోయారు. అయితే,అవకాశం కుదిరినప్పుడల్లా ఆన్‌లైన్‌ కాన్పరెన్సుల్లో పొగాకు వ్యతిరేకంగా గళమెత్తు తున్నారు.ఛడీఘర్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో గౌరవ ప్రతినిధిగా పాల్గొని తన లక్ష్యాన్ని వివరించారు. జాతీయ స్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న ‘రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టొబాకో’‘కంట్రోల్‌ టోబాకో కంట్రోల్‌ స్టాల్‌వర్ట్‌’గా రఘునందన్‌ గుర్తింంచడం విశేషం.
సోషల్‌ మీడియాలో..
విధి నిర్వహనలో భాగంగా రఘునందన్‌ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. స్వామి కార్యంలో సమాజ కార్యంగా గ్రామాల్లో పొగాకు వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పిస్తుంటారు.ముఖ్యంగా రైతులు, కార్మికులు ధూమపానం చేస్తూ కంటబడితే ముక్కు మూసుకొని పక్కకు తప్పుకోరు.వారి చేత ఆక్షణమే సిగరెట్‌ మాన్పించేలా హితబోధ చేస్తారు.ఇలా ఒకట్రెండేండ్లు కాదు..రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.వివిధ గ్రామాల్లో సభలు, అవగా హన సదస్సుల్లో పాల్గొని ధూమపానం వదల గొట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. పొగాకు వ్యతి రేకంగా తమ చేస్తున్న పోరాటానికి మంచి స్పందన వస్తుందని చెబుతారు రఘునందన్‌. ఎవరైనా మీ మాటలు విన్నాక నేను సిగరెట్‌ మానేశానని చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహం కలుగుతుంటుందని…ఆ కిక్‌తో మరింత కష్టపడే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారాయన.
రఘునందన్‌ నేపథ్యం..
రఘునందన్‌ మాచన..మేడ్చల్‌ జిల్లా కేశవరం వాస్తవ్యుడు. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. తండ్రి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారా న్నందుకున్నారు.అలా భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తనదైన సేవలు అందిస్తూ ఉత్తమ ఉపా ధ్యాయుడిగా పేరు గడిరచారు అభిమన్యు. తండ్రి కి తగ్గ కొడుకు అనిపించు కునేలా రఘునం దన్‌ సమాజ శ్రేయస్సుకోసం తనవంతు కృషి చేస్తు న్నారు. యువత పెడదోవ పట్టకుండా తనదైన రీతిలో స్పందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా నిత్యం దాడులు,తనిఖీలు నిర్వ హించే అధికారులు ఎందరో ఉన్నారు.కానీ రఘు నందన్‌ మాచన అలా కాదు.ఉద్యోగాన్ని తన విధి గానో,ఓఅధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యత గానో మాత్రమే భావించలేదాయన. అందులో మానవత దృక్పథాన్ని వెతుక్కున్నారు. సమాజాన్ని మా ర్చాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అలా కమిట్‌మెంట్‌తో సామాజిక స్పృహతో పనిచేస్తుం టారు రఘునందన్‌.
సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ..
పొగాకు నియంత్రణపై రఘునందన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్టులు అంతర్జాతీయంగా అన్ని సమాజాలను చేరుతూ ఆలోచింప జేస్తున్నాయి.ఎక్స్‌ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీ దేశస్తులను ఆకట్టుకోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్‌ను ఆహ్వానిం చింది.దేశం తరఫున పాల్గొనడం ఆనందాన్ని చ్చింది..పంజాబ్‌ ఛండీగడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంత ర్జాతీయ సదస్సులో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా నేను పా ల్గొనడం ఆనందా న్నిచ్చింది. పొగాకు ఉత్పత్తులవల్ల ఆరోగ్యానికీ, ఐశ్వ ర్యానికీ ముప్పు వాటిల్లక ముందే..టుబా కోకు గుడ్‌ బై చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తున్న వారిలో నేనొకణ్ని. నేను సుమారుగా రెండు దశా బ్దాలుగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా. ఆఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ సంస్థ ‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’గా నాసేవలను గుర్తించింది.అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా నాసక్సెస్‌ను గుర్తిస్తూ వావ్‌..వెల్డన్‌ అని కొనియాడిరది.ఇటీవల పలువురు నన్ను అభినందించడం ఆనందాన్ని చ్చింది.పొగాకు ఉత్పత్తుల వాడకం సమసిపోయేలా చేయటం అంత సులభమైన పనికాదు.ఆలోచన ఆత్మ నుంచే రావాలి.స్వీయ చైతన్యంతోనే మార్పు సాధ్యం.బీడీ,సిగార్‌,పొగాకు ఉత్పత్తుల మత్తులో పడినవాళ్లు ఎవరికివారు ప్రశ్నించుకోవాలి.తన ఆరోగ్యంపై శ్రద్ద పెరిగినప్పుడే పొగాకు వినియో గం ఆగిపోతుంది.నా పెండ్లికివచ్చి స్మోకింగ్‌ చేయొద్దు అని నేను నావెడ్డింగ్‌ కార్డులో ఓనిబం ధన రాయించాను.ఇలా చేయడంద్వారా రాకుండా ఉంటారని కాదు!ఒక ఆలోచన,చర్చ మొదలవు తుంది.మార్పు ఆలోచనతోనే ఆరంభ వంవుతుంది కదా.నేను కోరుకునేది అంతే!నా మాటలు విని పొగతాగడం మానేసిన వాళ్లుచాలా తక్కువే కానీ..ప్రత్యక్షంగా మాట్లాడి ఆకొద్దిమంది ఆరో గ్యాన్ని కాపాడగలిగానన్న సంతృప్తి మిగిలుతోం దని,ఈఅభినందనలన్నీ నాబాధ్యతను మరింత పెంచాయని రఘునందన్‌ మాచన ఆకాంక్షిం చారు.-` గునపర్తి సైమన్‌

పౌర సేవల్లో వాట్సాప్‌ విప్లవం

దేశంలో తొలిసారిగా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు , పజల నుంచి వినతల స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను 9552300009 ప్రకటించింది. ఆ ఎకైంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌(టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈనంబర్‌ వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్త్రతం చేయనున్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్‌టీజీఎస్‌ సీఈఓ దినేష్‌ కుమార్‌ ఈ సేవలపై ప్రజంటేషన్‌ సమర్పించారు.ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌చెప్పింది.9552300009వాట్సాప్‌తో జనన, మరణ ధృవీక రణ పత్రాలు అందించేందుకు సన్నా హాలు చేస్తోంది.‘మనమిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభు త్వం,ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవ లను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది.దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా జనవిర 30న ప్రారం భించారు.దీనికోసం అధికారిక వాట్సప్‌ నెంబర్‌ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లా డుతూ..యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను.ఈఆలోచన యువగళం పాద యాత్ర నుంచి మొదలైంది. నాప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్‌ నొక్కితే సినిమాచూస్తున్నాం,భోజనంవస్తోంది,క్యాబ్‌ వస్తుం ది.ఒక బటన్‌ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది.ఆఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా.అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం,ప్రజల చేతిలో పాలన,మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించడం జరుగుతోంది.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు : వాట్సప్‌ గవర్నెన్స్‌కు 36శాఖలను అను సంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో161పౌర సేవలు అందు బాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌ గవర్నెన్స్‌. రియల్‌టైంలో ధృవపత్రా లు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసు కుం టుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆక్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏపీ గవర్నమెంట్‌ వెబ్‌ సైట్‌ కు ఆలింక్‌ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్‌ సెలెక్షన్‌ద్వారా రెవెన్యూ, మున్సిపల్‌, ఎండో మెంట్‌ సర్వీసులతోపాటు అనేక సర్వీసులు తీసుకు వచ్చాం. రెండో దశలో ఏఐ బాట్‌, వాయిస్‌ ద్వారా కూడా అమలుచేస్తాం.ప్రపంచంలోనే వాట్సప్‌ గవర్నె న్స్‌ అమలు చేస్తున్న తొలిరాష్ట్రం మనది.దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.లోటు పాట్లు సరిచేసుకునిమరింత మెరుగ్గా దీనిని తీర్చిది ద్దుతాం.రియల్‌ టైంగవర్నెన్స్‌లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తు న్నాం. డేటా లేక్‌ క్రియేట్‌ చేసి సీమ్‌ లెస్‌ సర్వీసెస్‌ అంది స్తాం.గత మూడు నెలలుగా మా టీం అహర్ని శలు కష్టపడ్డారు. గత15రోజులుగా టెస్టింగ్‌ చేస్తు న్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం.ఆరు నెలల్లో ఐడియల్‌ ప్రొడక్ట్‌ గా తీర్చిది ద్దుతాం.అన్నిసేవలుఅందుబాటులోకితీసుకు వస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా.ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు. మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ సంధ్య దేవనాథన్‌ మాట్లాడుతూ..ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది.మనమిత్ర వాట్సప్‌ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితం లో వాట్సప్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన మిత్ర ద్వారా 161పౌర సేవలను ప్రతి ఒక్కరికి అంది స్తాం. ప్రజలు సులభంగా విని యోగించేలావాట్సప్‌ గవర్నెన్స్‌నురూపొందించాం.వాట్సప్‌గవర్నెన్స్‌ సేవ లకోసం చాలా కృషిచేశామ న్నారు.ఏపీ ప్రభుత్వం తో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చి దిద్దుతామని చెప్పారు.వాట్సప్‌ డైరెక్టర్‌,ఇండియా హెడ్‌ రవిగార్గ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్‌ ప్లాట్‌ ఫామ్‌పై అన్ని రకాల సేవలు అందిం చడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందు బాటులోకి తీసుకువస్తాం. హాయ్‌ అని టైప్‌ చేయడం ద్వారా ప్రజలు సుల భంగా పౌరసేవలను పొంద వచ్చని అన్నారు. మొద టి దశలో వాణిజ్యరంగంలో సమర్థ వంతమైన ప్రభు త్వ సర్వీస్‌ డెలివరీ కోసం రీ ఇంజ నీరింగ్‌ విధా నాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈప్రక్రియ లో,ఈక్రింది విధంగా వివిధరకాల సేవలను అందిం చడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.-(కందారపు మురళి)

ప్రజా స్వామ్యం ఎక్కడ …?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్‌ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్‌ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌-ఎఫ్‌ఆర్‌ఎ), ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
‘‘పరిరక్షణ’’ అనే ముసుగు లేదా ‘‘నష్ట పరిహారం యిచ్చి అటవీ నిర్మూలన’’ వంటి ప్రహసనాల పేరుతో పర్యావరణంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను కూడా ఈ చట్టాలు సులభతరం చేస్తాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల, పులుల అభయారణ్యాలు వంటి ప్రత్యేక రక్షిత ప్రాంతాలను సృష్టించడం ద్వారా అటవీ భూముల్లోని విస్తారమైన ప్రాంతాలపై రాజ్యం తన నిర్దిష్ట ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎ, ఎఫ్‌సిఎ వంటి చట్టాలు ఆదివాసీలకు అందించడానికి ప్రతిపాదించబడిన ప్రజాస్వామిక అవకాశాలు కూడా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం యుగంలో నిరంతరం క్షీణిస్తున్నాయి.
ఆదివాసీల అటవీ భూములపై ప్రాజెక్టులను ఆమోదించడానికి ముందస్తుగా గ్రామసభ సమ్మతి అవసరాన్ని తొలగించడానికి 2022 సవరణ తర్వాత ప్రభుత్వం అనుమతించిందిబీ ఇప్పటికే పలుచన చేయబడిన, పనికిరాని ఆదివాసీల చట్టపరమైన రక్షణలపై దాడి ఎఫ్‌సిఎ కోసం ప్రతిపాదించిన కొత్త సవరణలతో మరింతగా కొనసాగింది.
వార్తల్లో వున్న అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023 ప్రజలలో గణనీయమైన వివాదాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం రాజ్యసభలో చర్చ కోసం వేచి ఉంది. బహుశా జూన్‌లో దాదాపుగా ఎటు వంటి చర్చ లేకుండా లోక్‌సభ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది.
కొత్త సవరణలు ప్రవేశపెట్టిన మార్పులు స్థూలంగా
మొదటిది,చట్టం కింద రక్షిత ప్రాంతంగా ఉండా లనే దానికి సంబంధించి కొన్ని సుప్రీం కోర్టు తీర్పులు మంజూరు చేసిన సడలింపులను తొలగించడానికి ‘‘అడవి’’ అనే పదాన్ని మారుస్తుంది.
రెండవది,‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టులను’’ చేపట్టేందుకు సరిహద్దు భూముల్లో అడవులను నిర్మూలించడానికి అనుసరించాల్సిన విధానపరమైన అవసరాలకు మినహాయింపును మంజూరు చేస్తుంది, అటు వంటి ప్రాంతాలలో అటవీ భూములను, అక్కడి జనాభాను తొలగించి రోడ్డు మార్గాలు, రైల్వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా,‘‘వామపక్ష తీవ్రవాద’’ ప్రభావిత ప్రాంతాల్లో’’జాతీయ భద్రత’’ పేరుతో ప్రజల ప్రతిఘటనను అణచివేయడానికి ప్రభుత్వానికి మినహాయింపునిస్తుంది.
మూడవది, అటవీ భూములలో జంతు ప్రదర్శనశాలలు, ‘ఇకో-టూరిజం(పర్యావరణ హిత)’ సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను బిల్లు అనుమతిస్తుంది. ప్రధానంగా వీటికి ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుందిబీ సామ్రాజ్యవాద సంపదకు సేవ చేస్తుంది. ఇది ఈ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలపై, అటువంటి ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం నిర్వాసితులయ్యే / జీవనోపాధిని కోల్పోయే జనాభాపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
‘ఫారెస్ట్‌’ (అడవి) పదంలో మార్పు అంటే అర్థం ఏమిటి?
భారతదేశపు చట్టపరమైన చట్రంలోపల ‘అడవి’ అనే పదానికి తిరిగి నిర్వచనం యివ్వడం చుట్టూ బిల్లు దృష్టి కేంద్రీకృతమై వుంటుంది. ఏదైనా సంబంధిత చట్టం లేదా అధికారిక ప్రభుత్వ రికార్డులతో సహా భారతీయ అటవీ చట్టం-1927 ప్రకారం ‘అడవులు’గా నమోదు అయినవి మాత్రమే ఈ చట్టం పరిధిలో ‘అడవులు’గా గుర్తింపు పొందాలనే నిబంధన యిందులో వుంది.
దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి,టి ఎన్‌ గోదావర్మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1996 తీర్పును ప్రస్తావించడం చాలా అవసరం. భారతదేశంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ఈతీర్పు కేంద్రీకృతమై ఉంది. అడవులలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, వన్యప్రాణ సంరక్షణను ప్రోత్సహించడం, పర్యావరణ చట్టాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఫలితంగా భారతదేశంలోని అటవీ ప్రాంతాలను సంరక్షించడానికి సుప్రీం కోర్టు ముఖ్యమైన ఆదేశాలు వచ్చాయి. తన నిఘంటువు నిర్వచనంని ‘‘అడవి’’కి అన్వయించడం ద్వారా ఈ తీర్పు అటవీ సంరక్షణ చట్టం పరిధిని విస్తృతం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ తీర్పు ఫలితం ఆదివాసీ సముదాయాలకు ఏ మాత్రం అందడం లేదు.
వాస్తవానికి, ఈ తీర్పు పర్యావరణం, పరిరక్షణ ప్రయత్నాలలో సుప్రీం కోర్టుని ఒక ఛాంపియన్‌గా చూపవచ్చు, కానీ వాస్తవానికి సుప్రీం కోర్టు 2019 తీర్పులో అడవుల్లో నివసించే ఆదివాసీలను చట్టబద్ధం చేయడానికి, అలా కానివారిని తొలగించాలని ఆదేశించడంపై కేంద్రీకరించింది. ఆ తీర్పు అటవీ భూమిపై సాంప్రదాయ అటవీ నివాసుల 11.8లక్షల దావాలను తిరస్కరించడం తోపాటు,అలా తిరస్కరించబడిన జనాభాను త్వరగా తొలగించాలని కూడా 16రాష్ట్రాలను ఆదేశించింది.
అటవీ పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలు గోదావరమన్‌ తీర్పు ఆదివాసీలకు అందించినట్లు కనిపించే స్పష్టమైన, నిజాయితీ లేని చట్టపరమైన రక్షణలను కూడా పలుచన చేస్తాయి. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ప్రకారం, 1980 అక్టోబర్‌ 25 తరువాత నుండి ప్రభుత్వ పత్రాలలో అధికారికంగా అడవులుగా గుర్తించిన ప్రాంతాలకు చట్ట పరిధి పరిమితం అవుతుంది. అందువల్ల ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం విస్తృతంగా అటవీ భూముల బదలాయింపులకు దారితీయడంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అడవి తొలగింపుకు అనుమతులను పొందడం, స్థానిక సముదాయానికి అవసరమైన సమాచారం యిచ్చి సమ్మతి కోరడం లాంటి చట్టం అందించిన రక్షణ లను 2022లో చేసిన సవరణ ఇప్పటికే తొలగించింది.
ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహం (పివిటిజి-పర్టిక్యులర్లి వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) డోంగ్రియా కోండ్‌ నివసించే ప్రాంతాలు వున్న ఆరావళి శ్రేణిలో సుమారు 40%, నియమగిరి కొండల శ్రేణిలో 95% పైన గణనీయంగా ప్రభావితమవుతాయి. ఈ సవరణలు అటవీ యేతర, కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం అడవులను బదిలీ చేయడానికి సంబంధించి రాజ్యానికి మరింత అధికారాన్ని ఇవ్వడమే కాకుండా,సామ్రాజ్యవాద,వర్గ ఆధారిత అభివృద్ధిని తప్పనిసరిగా ప్రోత్సహించడానికి మన సహజ వనరులను, భూమిని దోపిడీ చేయడానికి చట్టాన్ని ఎలా ఉపకరణంగా ఉపయోగించవచ్చనేది కూడా చూపిస్తాయి.
‘‘అభివృద్ధి భారం’’: అభివృద్ధి ఎవరి కోసం?
అభివృద్ధికి సంబంధించి ప్రజా వ్యతిరేక నమూ నాను ప్రతిపాదిస్తున్నట్లు అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ప్రాథమిక విశ్లేషణలో స్పష్టమవు తుంది. ఇది ఆదివాసీ సముదాయాలపై పరాన్న జీవి. వారి జీవనశైలికి హాని కలిగించే అభివృద్ధి నమూనాకు మద్దతుగా అటవీ భూముల నుండి వారిని నిర్వాసితులను చేయడంపై ఆధార పడిరది.‘‘అభివృద్ధి’’ అనే రాజ్య దృక్పథానికి మద్దతుగా భారతీయ అడవులలో చారిత్రాత్మకంగా నివసించే ఆదివాసీ సమూహాలపై ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి చరిత్రనే భారత దేశంలోని అటవీ ‘‘పరిరక్షణ’’ చట్టాల చరిత్ర.
వలసరాజ్యాల కాలంలో, భారతీయ అడవులను ఆ రాజ్యాల ‘‘అభివృద్ధి’’ని ముందుకు తీసుకువెళ్ళే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చే అజ్ఞాత గనిగానూ, రైల్వేలు, కార్యాలయాలులాంటి వలసరాజ్యాధిపతుల మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహాయపడేవిగానూ గుర్తించారు.
అందువల్ల, డైట్రిచ్‌ బ్రాండిస్‌ అభివృద్ధి నమూనాను భారతదేశంలోని అటవీప్రాంతాలలో ప్రవేశ పెట్టారుబీ ‘‘శాస్త్రీయ అటవీ’’ పేరుతో అటవీ భూములు నరికివేసారు, వలసరాజ్యాల అభివృద్ధికి కలపను అందించే ప్లాంటేషన్‌ నమూనాను ప్రవేశపెట్టారు. (భారతదేశంలోని బ్రిటీష్‌ ప్రభుత్వం ఒక జర్మన్‌ వృక్షశాస్త్రజ్ఞుడు డైట్రిచ్‌ బ్రాండిస్‌ను భారతదేశపు మొదటి జాతీయ అటవీ విభాగానికి అధిపతిగానూ, నిర్వహణాధికారిగానూ నియమించింది. అదే 1864లో స్థాపించబడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌. ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ స్థాపన,ఆతర్వాత ఏర్పడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (1867)ల వల్ల రాజ్య-అటవీ సంబంధాలలో పెద్ద ఎత్తున పర్యవసానాలు జరిగాయి. మరీ ముఖ్యంగా, చారిత్రకంగా అటవీ భూమి, వనరులతో ముడిపడి ఉన్న వారి స్థితిగతులను ప్రభావితం చేసాయి. అటవీ భూమి, వనరులపై సాంప్రదాయ హక్కు లను అనుభవిస్తున్న అటవీ నివాస సముదాయాల స్థానంలో త్వరలోనే నిరంకుశాధికారులు,అటవీ శాఖ అధికారులు వచ్చి చేరారు.ఆతర్వాత, భారతదేశంలోని వారి సేవక (హిజ్‌ మెజెస్టి) ప్రభుత్వం చేసిన శాసనాలు అటవీ నివాసులను నేరస్థులుగా పరిగణించాయి, వారిపై అటవీ భూమి ఆక్రమణదారులుగా ముద్ర వేసాయి. ఆదివాసీ సమూహాల తొలగింపులు,రాజ్య ఏజెంట్లు చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలు, కోల్పోయిన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాటాలు కొనసాగుతూండడం వల్ల ఈ వలసవాద సిద్ధాంత ‘పరిరక్షణ’ ప్రభావం నేటికీ కొనసాగుతోంది.) కాలక్రమేణా, శతాబ్దాలుగా ఈ భూముల మూల నివాసులను ఆదుకున్న సహజ వనరులను వలసరాజ్యాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవ డానికి, తద్వారా ఆదివాసీ సముదాయాలను నిర్వాసితులను చేయడానికి అటవీ చట్టాలు ఉపయోగపడ్డాయి.
బ్రిటీష్‌ ప్రభుత్వం క్రింద అటవీ హక్కుల చట్టం, కొన్ని అడవులను ‘‘రిజర్వ్‌’’గా వర్గీకరించింది. అటువంటి అడవులలో నివసించే ఆదివాసీ సముదాయాలు నిర్వాసితమయ్యాయి. వారి జీవనానికీ, జీవనోపాధికి ఆధారమైన అడవులలో లభించే వనరులను ఉపయోగించుకోడానికి అనుమతించలేదు. బస్తర్‌ ఆదివాసీ జనాభా తమ అడవిలో 2/3 వంతును ‘‘రిజర్వ్‌’’గా ప్రకటించ డానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమ అణచి వేతలో,తమ భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటులను బ్రిటిష్‌ సేనల క్రూర అణిచివేత కనపడుతుంది.
1947లో అధికార బదలాయింపు తర్వాత విస్తృత ప్రజానీకానికి కాకుండా రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ఈ చారిత్రాత్మక అభివృద్ధి నమూనాను భారత రాజ్యం కొనసాగించింది.రాజ్యాంగం స్వయంగా ఆదివాసీ సముదాయాలు నివసించే కొన్ని ప్రాంతాలను ‘‘షెడ్యూల్డ్‌ ప్రాంతాలు’’గా గుర్తిం చింది.ఇవి ‘‘స్వపరిపాలన’’కు సంబంధించిన కొన్ని హక్కులను పొందుతాయి. ఏదేమైనప్పటికీ, ఈ నిబంధనయే రాష్ట్ర/కేంద్ర చట్టం ఈ ప్రాం తాలలో వర్తిస్తుందా లేదా అని నిర్ణయించే హక్కును రాష్ట్ర గవర్నర్‌కు యివ్వడంతో అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంచి నట్లయింది. ఆదివాసీ సముదాయాలకు స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యం వున్నాయనే అపోహను బహిర్గతం చేస్తూ, ఈ ప్రాంతంలో ‘‘స్వయంప్రతిపత్తి కమిటీ’’ రూపొందించిన చట్టాలకు రాష్ట్ర గవర్నర్‌ సమ్మతి అవసరం అనే నిబంధన మరోసారి హానికరమైన అధికారాన్ని కేంద్రం చేతుల్లో ఉంచింది.
తాము నివసించే భూమిపై రాజ్యం చేపట్టే చర్యల విషయంలో ఆదివాసీ ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని వినిపించవచ్చనే అపోహను శాసన పరమైన చర్యలు కూడా కలిగిస్తాయి. స్వాతంత్య్రా నంతరం అటవీ హక్కుల చట్టం, ప్రత్యేకించి 2006లో చేసిన సవరణ, వ్యక్తిగత లేదా సమాజపర దావాల ద్వారా అటవీ భూములపై ప్రభుత్వ గుర్తింపు పొందిన హక్కులను పొందేం దుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ భూమిపై ఆదివాసీ రైతులు తమ హక్కులను సాధించు కోవడంలో సహాయపడే ప్రజాస్వామిక చట్టంగా ప్రకటితమయింది.
అయితే,అటువంటి దావాల వాస్తవ చరిత్ర అటవీ భూములపై ఆదివాసీ సముదాయాలు చేసిన దావాలను గుర్తించడానికి ప్రభుత్వానికున్న విముఖతను సూచిస్తుంది- మొత్తం గుర్తించబడిన దావాలలో 3.9% మాత్రమే (ఎఫ్‌.ఆర్‌.ఎ స్టేటస్‌ రిపోర్ట్‌, 2018 ప్రకారం) సాముదాయిక భూమికి అనుకూలంగా ఉన్నాయి, కానీ వాస్తవానికి 68.9% జనాభా సాముదాయిక భూమిగా బావించే అటవీ భూమిలో నివసిస్తున్నట్లు డేటా సూచిస్తుంది.
అంతేకాకుండా, మైనింగ్‌ ప్రాజెక్టులను సుల భతరం చేయడానికి అటవీ భూములపై ఆదివాసీల దావాలను తిరస్కరించిన చరిత్ర ఉంది, ఇటీవల 2015లో మైనింగ్‌ ప్రాజెక్ట్‌ ను సులభతరం చేసేందుకు జార్ఖండ్‌లోని రించి గ్రామం నుండి వచ్చిన 72దావాలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో బొగ్గు బ్లాకులు వుండడమే ఆ తిర స్కరణకు కారణం. ఆదివాసీ సముదాయాల శ్రేయస్సు, మనుగడ కోసం కాకుండా, దాని ద్వారా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టుల గురించి, వనరులను అందించడం గురించి ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తుందని ఈ వాస్త వం స్పష్టంగా వివరిస్తుంది.
ప్రజాస్వామిక నిర్మాణంగా చెబుతున్న 2006 సవరణ, తరువాత వచ్చిన చట్టాలు దాని సారాం శాన్ని తీవ్రంగా పలుచన చేసి అసలు ఏమీ లేకుండా చేసాయి. అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదానికి ముందు గ్రామసభ సమ్మతి తీసుకోవాల్సిన అవసరాన్ని 2022 నిబంధనలకు చేసిన సవరణ తిరస్కరించిందని, అప్పటికే ఆమోదం పొందిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆమోదించే దశకు అటువంటి ‘‘సమ్మతి’’ని తరలించిందని అటవీ పరిరక్షణ నియమాల శాసన చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
2022 సవరణ, ఇతర చట్టాల ప్రభావం 2006 ఎఫ్‌ఆర్‌ఎ అందించిన బలహీనమైన ప్రజాస్వామిక హక్కులను మరింతగా పలుచన చేయడం గురించి భారతదేశంలోని కొత్త అటవీ సంరక్షణ నియమాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మరింతగా అన్వేషణ జరిగింది.
సామ్రాజ్యవాద పెట్టుబడి ద్వారా నిధులు సమ కూర్చే టాటా బిర్లా,అదానీ,అంబానీల వంటి దళారీ బూర్జువాల (రాజ్యం మద్దతుతో సామ్రా జ్యవాద పెట్టుబడికి సేవ చేసే బూర్జువ ాజీలో ఒక సెక్షన్‌) ప్రాజెక్టుల ప్రయోజనాలకు మద్దతు నివ్వడానికి భారత రాజ్యం పూర్తిగా సైనిక అణచివేతను ఉపయోగించింది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ వంటి సైనిక కార్యకలాపాల ద్వారా యిచ్చిన మద్దతు పస్తుత ఆపరేషన్‌ సమాధాన్‌-ప్రహార్‌ ద్వారా పరిపూర్తి అయింది. రాజ్యం చేసే ఈ సైనిక దాడులు అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీ జనాభాపై దాడి. ఆపరేషన్‌ సమాధా నన్‌-ప్రహార్‌ కింద, వామపక్ష తిరుగుబాటును ఎదుర్కోవడానికి భారత రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లోని తన సొంత పౌరులపై వైమానిక బాంబు దాడికి దిగింది.ఆదివాసీ జనాభాపై భారత ప్రభుత్వం చేస్తున్న ఈ మారణహోమ యుద్ధానికి అటవీ పరిరక్షణ చట్టానికి ప్రతిపాదించిన కొత్త సవరణలు సహాయపడతాయి. ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టుల’’ కోసం సరిహద్దు భూములను, ముఖ్యంగా ప్రభుత్వం సవరించిన బిల్లులో ‘‘వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు’’గా వర్గీకరించిన భూమిని మినహాయించడం ద్వారా, ‘‘జాతీయ భద్రత’’ అనే పురాతన కవచం కింద ప్రభుత్వం చేసే నిర్థారణ అటవీ భూములను, జనాభాను తొలగించగలుగుతుంది, సామ్రాజ్యవాద దోపిడీకి మరింత వనరులను సమకూర్చగలుగు తుంది. భారతదేశంలోని అడవులలో నివసించే ఆదివాసీ జనాభాకు వ్యతిరేకంగా జరుపుతున్నఈ సంపూర్ణ యుద్ధాన్ని ‘‘అభివృద్ధి’’ పేరుతో రాజ్యం సమర్థిస్తోంది. ఈ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని పట్టణీకరణకు, బహుళజాతి మైనింగ్‌ ప్రాజెక్టులకు సహాయం చేస్తుంది అని అంటోంది. హిరాకుడ్‌ డ్యామ్‌ ద్వారా నిర్వాసితులైన ప్రజలకు నెహ్రూ చెప్పినట్లుగా 1948 నాటికే ‘‘నిర్వాసితులను చేయడం ద్వారా అభివృద్ధి’’నమూనాకి నాంది పలికింది. ‘‘దేశ ప్రయోజనాలకు’’ సహాయం చేస్తుంది.2011లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కారణంగా భారతదేశంలో 50 సంవత్సరాలలో దాదాపు అయిదు కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వీటిలో,డ్యామ్‌లు,గనులు,పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవాటి కారణంగా రెండు కోట్లకు పైగా ‘అభివృద్ధి’ ప్రేరిత అంతర్గతంగా నిర్వాసితులైన వ్యక్తులు (ఐడిపి-ఇంటెర్నల్లి డిస్‌ప్లేస్డ్‌ పర్సన్స్‌) ఉన్నారు. వీరిలో 40%గా ఉన్న ఆదివాసీలు మరింత దారుణగా ప్రభావితమవుతున్నారు.
ఆదివాసీల నిర్వాసిత్వానికి పారిశ్రామికీకరణ అతిపెద్ద కారణం. ఆదివాసీల ప్రాంతాల్లో గని తవ్వకాల ప్రాజెక్టుల కారణంగా 3.13 లక్షల మంది దౌర్జన్యంగా నిర్వాసితులయ్యారు.13.3 లక్షల మంది ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి నుండి నేరుగా నిర్వాసితులయ్యారు.
ఈ గందరగోళ స్థితి ముఖ్యమైన ప్రశ్నలను వేస్తుంది-మనం ఏ అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నాం? ఈ అభివృద్ధి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అభివృద్ధి ఆలోచన ఆదివాసీలు, గ్రామస్తులు, ఒక ప్రాంతంలోని స్థానికులపై ఎందుకు అసమాన భారంగా ఉంది.
ఈ‘‘అభివృద్ధి ప్రాజెక్టుల’’ వెనుక ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల స్వభావంలో పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఇంతకు ముందు వివరించినట్లుగా-ఈ ప్రాజెక్టులను భారతదేశంలోని దళారీ బూర్జువాలు చేపట్టాయి- ఇవి సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవచేస్తాయి, అయితే సర్దార్‌ సరోవర్‌, తెహ్రీ వంటి పెద్ద ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు లాంటి సామ్రాజ్య వాద ఏజెంట్ల నుండి నేరుగా నిధులు పొందుతాయి.
ముందుగా చర్చించినట్లుగా, అటవీ పరిరక్షణ నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు భారత ప్రభుత్వానికి ‘‘జాతీయ ప్రాముఖ్యత’’, ‘‘జాతీయ భద్రత’’ మొదలైన ప్రాజెక్టుల ముసుగులో ఆదివాసీ జనాభాను చట్టబద్ధంగా తరలించడాన్ని సుల భతరం చేస్తాయి. ఇటువంటి నిర్వాసిత్వం జీవితాలను నాశనం చేస్తుంది ఆదివాసీ ప్రజలు- శతాబ్దాలుగా వారు కలిగి ఉన్న తమ సామాజిక జీవనాన్ని, జీవనోపాధిని, సాముదాయిక భూమిని కోల్పోతారు.
ఒకసారి నిర్వాసితులవుతే, వారికి ద్రవ్య పరిహారం తప్ప మరింకేమీ సహాయం అందించే సమర్థత రాష్ట్రానికి లేదు. అనేక అభివృద్ధి ప్రాజెక్టు లలో చూసినట్లుగా,చట్టపరంగా రావాల్సిన వాటిని యివ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.
ఈ పరిహారం చట్టాల క్రింద,స్త్రీలు వారి మగ బంధువుల పొడిగింపులుగా పరిగణించబడతారు: వారికి ప్రత్యేక పరిహారం అందదు. నిర్వాసిత్వం వలన ఆదివాసీ సముదాయాలలోని మహిళలు మద్యపానం, వివాహాలలో హింసను లాంటి సమస్యలు ఎక్కువవుతాయి.బాల్య వివాహాలు, మనుగడ కోసం తరచూ వ్యభిచారం,మానవ అక్రమ రవాణాకు గురవుతారు.
నిర్వాసిత్వం చెందిన జనాభా తమ జీవనోపాధి వెతుకులాటలో నగరాలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తుంది. వారు ఇక్కడ రాష్ట్ర ఇతర ‘‘అభివృద్ధి’’ ప్రాజెక్టులకు చౌక కార్మికులుగా మారతారు. నిర్వాసిత్వం చెందిన జనాభా తీవ్రమైన మానసిక వేదనతో పాటు పేదరికం, దీర్ఘకాలిక పోషకాహార లోపం, ఆకలిలాంటి అనారోగ్యాలకి కూడా గురవుతారు.
‘‘పరిరక్షణ’’ ముసుగులో పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరలిస్తున్నారు. వన్యప్రాణి పార్కులు, అభయారణ్యాలు నిర్మించినప్పుడు ఆదివాసీ సముదాయాలు నిర్వాసితులు కాకపోతే ఇది పర్యావరణానికి ఉత్తమమైనదని పరిరక్షకుల వాదనబీ అటవీ పరిరక్షణ పేరుతో తమ సాముదాయిక భూమిని చుట్టుముట్టినప్పుడల్లా తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరిమికొడుతున్నారు. వన్యప్రాణుల పార్కులు, అభయారణ్యాలు సృష్టించినప్పుడు ఆదివాసీ సముదాయాలను నిరాశ్రయులను చేయకపోవడం పర్యావరణానికి మంచిది అని పరిరక్షకులు వాదిస్తున్నారు. అయితే అటవీ పరిరక్షణ పేరుతో వారిని తమ సాము దాయిక భూమి నుండి తరిమివేయనప్పటికీ, వారు జీవనోపాధిని కోల్పోతున్నారు. ఉదాహరణకు, ఒడిశాలోని సునాబేడ టైగర్‌ రిజర్వ్‌ను నిర్మించడం కోసం, రిజర్వ్‌ అడవుల నుండి ఆదివాసీ కుగ్రామాలను వేరు చేస్తున్నారు. తమ రోజువారీ జీవనానికి, జీవనోపాధికి ఆధారమైన అడవుల నుండి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరణను నిషేధిస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక ఆదివాసీ సముదాయాలు అటవీ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగానూ, వారి జీవనశైలి అడవులను అల్లకల్లోలం చేసిందనీ పోరాడారు. వాస్తవానికి, కొత్త నిబంధనల ద్వారా జరిగే జీవావరణ రిజర్వ్‌లు, జంతుప్రదర్శనశాలలు, అభయార ణ్యాలు, పర్యావరణ-పర్యాటక సౌకర్యాలు మొదలైనవాటి నిర్మాణం, అడవుల సహజ పర్యావరణ వ్యవస్థకు మరింత హానికరం అవుతుంది.
ఆదివాసీ సముదాయాలు నివసించే అటవీ ప్రాంతాలలో అంతకుముందు ఉన్న పర్యావరణ వ్యవస్థలు, ఈ అడవుల సహజ పర్యావరణ వ్యవస్థతో సామరస్యంగా జీవిస్తున్న సముదా యాలను కలిగి ఉంటాయి. పర్యావరణ-పర్యాటక సౌకర్యాలను ప్రవేశపెట్టడం, పరిరక్షణ పేరుతో ‘‘రిజర్వ్‌లు’’ నిర్మించడం ఈ అడవుల్లో నివసించే ప్రజలకు, వన్యప్రాణులకు పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తుందని నిరూపితమైంది.
మెక్సికో పసిఫిక్‌ తీరంలో, ఆడ సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి రాకుండా నిరోధించే ప్రతికూల ప్రభావాన్ని పర్యావరణ పర్యాటకం కలగచేసింది(అవి ఇప్పుడు జనసమూహం, బీచ్‌లలో వెలుతురును చూసి భయపడుతున్నాయి), అందువల్ల ఇప్పటికే అంతరించిపోతున్న జాతులను మరింత ప్రమాదంలోకి నెట్టినట్లవు తుంది. పర్యావరణ పర్యాటక కార్యక్రమాలు సమాజంలోని పెటీ-బూర్జువా, ‘‘మధ్య’’ లేదా ఉన్నత తరగతులకు మాత్రమే ఆకర్షిస్తాయి.
జంతుప్రదర్శనశాలలు, సఫారీలు, బయో-పార్క్‌లు/రిజర్వ్‌లలో వారి వినోదం కోసం ఆదివాసీ సముదాయాలు కల్లోలభరిత నిర్వాసి త్వాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాలు దేశంలోని విశాల ప్రజానీకానికి వినోద కారకాలు కాకపోయినప్పటికీ, అందుకోసం వారు నిర్వాసితులవుతున్నారు. అంతేకాకుండా, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ ‘‘హరిత పెట్టుబడి’’ కార్యక్రమాలకు, ప్రత్యేకించి పర్యావరణ పర్యాటక ప్రాంతంలో ప్రైవేట్‌ రంగ వృద్ధిని పెంచే కార్యక్రమాలకు, చాలా వరకు ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ నిధులు సమకూరుస్తాయి. అందువల్ల, పర్యావరణ-పర్యాటక కార్యక్రమాల నుండి పొందిన మూలధనం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చేరదు, అది దాని సామ్రాజ్యవాద యజమానులకు సహాయం చేస్తుంది.
ఇప్పటికే పర్యావరణంతో సామరస్యంగా జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేయడానికి పర్యావరణ పరిరక్షణ ఒక సమర్థనీయ కారణం కాదు, పర్యావరణాన్ని పరిరక్షించని లేదా దేశంలోని ప్రజలకు అందని పర్యావరణ స్థిరత్వ సామ్రాజ్యవాద నమూనాను ముందుకు తెచ్చింది.
ఈ నేపధ్యంలో, భారత రాజ్యం చేపడుతున్న ప్రస్తుత అభివృద్ధి నమూనాను పరిశీలిస్తే, అది సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రత్యక్ష సేవలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇది ‘‘భూ కబ్జా’’ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా మాత్రమే కాదు, స్థానిక జనాభా, శ్రామిక వర్గ హితాసక్తులపై ఆధారపడి జీవించే పరాన్నజీవి కూడా.
గత 77 ఏళ్లలో భారత పార్లమెంట్‌ గాని, శాసనసభలు గాని ఒక్క ‘శాసనం’ చేయలేదు. బ్రిటిష్‌వాడు వదిలి వెళ్లిన పాలనా పద్ధతులలోనే పాలన చేస్తున్నారు. ‘పాలనా అధికారంతో ఉన్న కొద్ది మంది’ బ్రిటిష్‌ పాలకుల వలే, మెజారిటీ సాధించిన రాజకీయ పక్షం ‘కేబినెట్‌’ రూపంలో ‘నిర్ణయాలు’ చేసి వాటిని చట్టాలుగా మారుస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదేనా ఒక విధానాన్ని రూపొందించాలంటే పలు కోణాల్లో సామాజిక అధ్యయనాలు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఏ వ్యక్తికీ నష్టం లేకుండా అందరికీ సమానంగా వర్తించేలా విధానాలను రూపొందించాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికీ సమాన అవకాశాలను కల్పించేదిగా, ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసే హక్కులను అందించేదిగా ఉండడమనేది ప్రజాస్వామ్య ప్రథమ సూత్రం. ఇటువంటి సమున్నత సూత్రాన్ని నిర్దేశించని రాజ్యాంగంతో ప్రజాస్వామ్య నిర్మాణం అసాధ్యం.
స్వతంత్ర భారత్‌లోని ప్రజాస్వామ్య పరిస్థితులు ఒక విషయాన్ని కొట్టొచ్చినట్లు తేటతెల్లం చేస్తున్నాయి: భారతీయులకు ‘శాసనం %-% హక్కు %-% చట్టం’ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. వాటిపై అవగాహన ఉన్న బ్రిటిష్‌ వాళ్ళు, మొదటి రెండిటిని తమకే పరిమితం చేసుకుని, చట్టాలను రచించి వదిలి వెళ్లారు. భారతీయులు వాటిని పట్టుకుని కాలం వెళ్లమారుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాకు తిరిగి ఏ సేవ ‘హక్కుగా’ ఇవ్వడం జరుగుతుందో కూడా ప్రతి చోట లిఖితపూర్వకంగా తాను ఇచ్చే రసీదులో క్లుప్తంగా వెల్లడిరచి తీరాలి. ప్రభుత్వం ఇలా చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల హక్కులను తెలుపుతూ ప్రభుత్వ డబ్బు వసూళ్ల వలన ఉపయోగం అనే సదుద్దేశ్య వాతావరణం నెలకొల్పి ప్రజలను చట్టబద్ధులను చేసే బదులు, చట్ట ఉల్లంఘనకు పర్యవసాన జరిమానా/ శిక్షలను ప్రస్తావిస్తూ వసూళ్లు చేస్తుంటారు. రౌడీయిజం పంథాని ‘అధికారంతో అజమాయిషీ’ చేయడం అని భావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి వేశాయి. వ్యాపార రాజకీయంలో ఉన్న నాయకులకు శాసనం%-% హక్కులు అనేవి వారి ఆలోచనకి అంతుపట్టని విషయాలుగా ఉన్నాయి. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అదే హక్కుగాను, కోర్టులు ఏవైతే చెప్తాయో అవి ‘న్యాయం’గాను పరిగణిస్తున్నారు. అయితే ఎవడిది పై చేయి అయితే వాడిది ‘న్యాయం’ అనే ఆటవిక వ్యవస్థతో దేశం నడుస్తున్నది. అందుకే ఒకే కేసుకు పలు తీర్పులు పలు కోణాల్లో వెలువడుతున్నాయి. భారత రాజ్యంకి సామ్రాజ్యవాద యజమానులతో ఉన్న అనుబంధం, శ్రామిక ప్రజలపై దాని విధ్వంసక ప్రభావాల ఈ విశ్లేషణ వేసే ప్రశ్న- ప్రజల-కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఎలా ఉంటుంది. ప్రస్తుత నమూనా నుండి అది ఎలా భిన్నంగా ఉంటుంది.
ప్రజల అవసరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా ప్రజల నుండి వస్తుంది. వారి సాంప్రదాయ భూమి నుండి జనాభాను నిర్వాసితులను చేయడంపై ఆధారపడి ఉండ డానికి బదులు అవసరమైన వనరులకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా జనాభా శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది.
ఎగుమతి మిగులు ద్వారా భారతదేశ ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, సహజ వనరులను విదేశాలకు తరలించేబీ త్రాగునీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల వంటి ప్రాథమిక సౌకర్యాలు అట్టడుగు వర్గాల జనాభాకు, శ్రమించే కార్మికులకు అందని, ఒక క్రమపద్ధతిలో ఉన్నతవర్గాలకు మాత్రమే అందుబాటులో వుండే ప్రస్తుత నమూనా కంటే ఇది పూర్తిగా భిన్నంగా వుంటుంది.అటవీప్రాంతా ల్లోని సహజ వనరులను రాజ్యం స్వాధీనం చేసుకునే బదులు, అవసరాలకు అనుగుణంగా జనాభాకు సేవలందించేందుకు వినియోగిస్తారు. ఈ అభివృద్ధి నమూనాలో క్రూరమైన దోపిడీకి గురవుతున్నన కార్మికులు, చిన్న, భూమిలేని రైతులు, ఆదివాసీలు నిర్వాసితులై చౌక శ్రమ వనరులుగా మిగిలిపోయిన ఆదివాసీలు లేదా నిరుద్యోగులుగా కార్మిక రిజర్వ్‌ సైన్యంలోకి నెట్టబడ్డారు. ఈ కొత్త నమూనాలో కేంద్రంగా వుంటారు.విశాల శ్రామికవర్గ ప్రయోజనాలను రక్షిస్తుంది, సామ్రాజ్యవాద శక్తులతో అనుబంధం లో ఉన్న బూర్జువా వర్గానికి చెందిన ఒక చిన్న వర్గానికి కాకుండా శ్రామికవర్గ ప్రజానీక ప్రయోజనాలను రక్షించే విధంగా ఈ కొత్త నమూనాకు కేంద్రంగా ఉంటుంది.
ఎందుకంటే వరదలు,పర్యావరణ విపత్తులు, మారుతున్న వాతావరణం కారణంగా పంట నష్టం లేదా పర్యావరణ కాలుష్యం, క్షీణత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వంటి వాటి ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ప్రభావితమవుతుంది కాబట్టి అటువంటి పర్యావరణ నష్టాన్ని నివారించడం, తగ్గించడం విస్తృత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడంవల్ల ఈ నమూనా పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని నిర్దిష్టతతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా మూలధనం విస్తరణ, దండయాత్రల కోసం ప్రయత్నించే, విదేశీ మూలధనం విలువను పెంచే భారత రాజ్యం ప్రస్తుతం అనుసరిస్తున్న నమూనాకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కొన్ని సమస్యలకు సరైన చట్టాలు లేనందువలన, కోర్టులు ఇచ్చే తీర్పులతో ‘న్యాయం’ ఏర్పడు తున్నది. పరిస్థితిని బట్టి న్యాయం మారుతున్నది, కానీ,హక్కు మాత్రం ఏర్పడటం లేదు. హక్కులు దిక్కులు లాంటివి,అవి మారవు.సమగ్ర, సహేతుక చట్టాలు లేని సందర్భాలలో కోర్టులు పార్లమెంట్‌కు కేసులను రిఫర్‌ చేస్తూ శాసనాలు అవసరం అని తెలియచేయడం లేదు. శాసన వ్యవస్థకు బదులు చాలా సందర్భాలలో ‘ప్రభుత్వాన్ని’ న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రభుత్వమే ‘పాలనా అధికారంతో ఉన్న కొద్దిమంది కేబినెట్‌’గా మారిపోయింది కదా. మన రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వ నిర్మాణం లేవు. వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం ఎన్నికల తంతు తరువాత ప్రభుత్వంలోకి చేరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ విధ్యుక్త ధర్మం ప్రజలకు అవసరమైన పనులను చేస్తూ గుర్తింపుపొంది తరువాత ప్రజల ఆమోదంతో అధికారంలోకి రావడమే కాదూ? ఇందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు మందిని పోగేసుకుని, ఎవరి ప్రయోజనాలను వారు సాధించుకునే ఆశయంతో ఒక ముఠా మీద మరొక ముఠా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటు న్నాయి. ఏమి చేస్తే పై చేయి అవుతుందో అవన్నీ చేస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.ఈ ముఠాల స్వప్రయోజన అపేక్షలకు ఒక ఉదాహరణ 77 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘కరువు భత్యం’. బ్రిటిష్‌ వలస పాలకులు తమ ఉద్యోగులకు, సమాజంలోని మిగతా వారి కన్నా అత్యధికంగా డబ్బు అందుబాటులో ఉంచాలని సంకల్పించి, ‘కరువు భత్యం’ అనే ఆర్థిక సదుపాయాన్ని కల్పించారు. సంపదలను సృష్టించే ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేనిది ఈ ‘కరువు భత్యం’. ఇంతకూ బ్రిటిష్‌ వాడి ఉద్యోగులు ఎవరు? భారతీయులే. భారత సమాజం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, భారతీయుల నుంచి వసూలు చేసిన పన్ను రాబడిని కొద్ది మంది భారతీయులకు ఆదాయ మార్గంగా ఏర్పాటుచేశారు! ఇప్పటికీ కొనసాగుతోన్న ఇలాంటి అవకతవకలు దేశంలో కోకొల్లలు. ముఠాల ప్రయోజనాల కోసం ఇలాంటి దోపిడి పనులు భారత్‌లో ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. మరి మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పటికైనా నిర్మాణమవుతాయా?
ప్రస్తుత నమూనా వైఫల్యం పర్యావరణానికి, ప్రజలకు కలిగించిన తీవ్ర నష్టంలో స్పష్టంగా కనిపిస్తుంది.జోషిమఠ్‌లో రాజధాని విస్తరణ పర్యావరణ నష్టం, మరణాలు, నిర్వాసిత్వానికి దారితీసిందిబీ లేదా అటవీ ప్రాంతాలలో, పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, ఎఫ్‌సిఎ,ఎఫ్‌ఆర్‌ఎల ద్వారా చట్టబద్ధంగా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు లేదా విశాల ప్రజానీకం కోసం కాకుండా కొద్దిమందికి ఉద్దేశించిన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సైనిక దాడులు కూడా జరుగుతున్నాయి.
ముగింపు
అటవీ పరిరక్షణ సవరణ బిల్లు అనేది ఆదివాసీ జనాభాపై భారత రాజ్య అప్రకటిత యుద్ధాన్ని మరింతగా పెంచే ఒక ప్రజా వ్యతిరేక చట్టం. బిల్లును ఆమోదించిన విధానం, దాని వెనుక ఉన్న అంతర్లీన ఉద్దేశం ద్వారా బూర్జువా ప్రజాస్వామిక కాల్పనిక గాథ బహిర్గతమైంది.
ఈ వ్యాసంలో చర్చించినట్లుగా, ఈ అభివృద్ధి నమూనావల్ల స్థానిక సముదాయాలు మూల్యం చెల్లించే సమయంలో, భారతదేశ దళారీ బూర్జువా, వారి సామ్రాజ్యవాద యజమానుల ప్రయోజనాలను నెరవేర్చడంలో రాజ్యానికి ఈ సవరణల బిల్లు మరింత సహాయం చేస్తుంది. లాభదాయకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం చేయడం కోసం స్థానిక సముదా యాలను నిర్వాసితులను చేయడం,ఓటు హక్కును రద్దు చేయడం, వారిపై బాంబుదాడి చేసేంత వరకుకూడా వెళ్ళే ఈ బిల్లు వివరించిన అభివృద్ధి నమూనా జాతి నిర్మూలన తప్ప మరొకటి కాదు.
రైతాంగ భూ యాజమాన్యాన్ని కాపాడాలని, దున్నేవాడికే భూమినివ్వాలని డిమాండ్‌ చేసే సంఘటిత ప్రజాపోరాటం మాత్రమే తన స్వంత ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న బహిరంగ భీభత్స కేంద్ర భాగంలో దెబ్బ కొట్టగలదు. అన్నింటికంటే ముఖ్యంగా, భూమి పోయినప్పుడు, ఆదివాసీలు బొగ్గును తిని బతకరు కదా.
ప్రజలచే పాలన అనే స్ఫూర్తికి కాని, పౌరులకు తాము కోరుకునే, తమ గొంతు వినే వ్యవస్థగా కాని ఆధునిక ప్రజాస్వామ్యం కట్టుబడిలేదనాలి. అప్పుడప్పుడో, ఒక క్రమపద్ధతిలోనో, న్యాయ బద్ధంగానో అన్యాయబద్ధంగానో నిర్వహిస్తున్న ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యానికి నిదర్శనం, గీటురాయి అనే అపోహ కలుగుతున్నది. కఠోర వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ప్రస్తుతం ‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాలు’గా విడిపోయింది. వాస్తవానికి మనం అనుకుంటున్న మెజారిటీ ప్రజాస్వామ్యాలు కూడా దాదాపుగా అర్ధ నిరంకుశాలే. ప్రజాస్వామ్యం భవిష్యత్తు విషయంలో అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.
పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల భాగస్వామ్యాన్ని, సలహాలను, సూచనలను స్వాగతిస్తారు, ప్రోత్సహిస్తారు. అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పుష్కలంగా అవకాశాలు కలిగించి, విభిన్న దృక్కోణాలకు విలువ ఇస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర తక్కువ నియంత్రణలు కలిగిందిగా, ప్రజలు నమ్మినదాన్ని, కోరుకున్న దాన్ని సులభతరంగా పొందడానికి సహకరించేదిగా ఉంటుంది. ప్రజలు తాము ఎంపికచేసుకున్న రాజకీయ పార్టీలోకాని, ఇతర సమూహాలలోకాని నిరభ్యంతరంగా చేరే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందక, నియంతృత్వ ధోరణులు ఉన్న చోట పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ నియంత్రణ చేసే ఒకే ఒక్క నాయకుడు వుంటాడు.
‘నిరంకుశ తరహా ప్రజాస్వామ్య నాయకత్వం’, ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ అనే రెండు విచిత్ర ప్రజాస్వామ్య విధానాలు ఇటీవలికాలంలో ఆవిర్భవించి, పుంజుకుంటున్నాయి. ఈ రెండిరటిలోనూ నిర్ణయాధికారాలన్నీ ఒకే ఒక్క వ్యక్తి (నాయకుడు) చేతుల్లో కేంద్రీకృతమై ఉం టున్నాయి. క్యాబినెట్‌ సహచరులతో సహా, పౌర సంఘాల, బ్యూరోక్రాట్ల, మేధావుల, వివిధ రంగాలకు చెందిన నిపుణుల సూచనలు కూడా ససేమిరా పట్టించుకోని పరిస్థితి ఉంటున్నది.-(సంయుక్త కణ్ణన్‌)

ఆదివాసులకు తీరని ద్రోహం

టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్‌ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్‌ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్‌ ఆల్‌ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్‌ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్‌ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్‌ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్‌ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్‌ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్‌!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్‌అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిరచించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్‌ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్‌ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ్షధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్‌ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిరదని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ ధర్మన్న పడాల్‌ పొద్దు బాలదేవ్‌ తీవ్రంగా ఖండిర చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే హోటళ్లు,రిసార్ట్స్‌ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్‌ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్‌ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్‌ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫ ికేషన్‌ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్‌ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్‌ సెల్‌ ఎనీమియా,టైఫాయిడ్‌,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్‌ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్‌ మ్యూజియం, పద్మపురం గార్డెన్‌, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.- కిలో సురేంద్ర

గోండుల పరిణామక్రమం కోమురం భీమ్‌…

ఉద్యోగరీత్యా మూడు దశాబ్దాల పాటు గిరిజన సంస్థల్లో ఉద్యోగించి అడవి బిడ్డలతో అవినాభావ సంబంధం గల అనుభవం ఒకటైతే, కొమరం భీమ్‌ పోరాటం ఇంద్రవెల్లి పోరాటం మధ్య జరిగిన సంఘటనలు నేపథ్యంలో పరిశోధన చేయడమే కాక ఉద్యోగ సమయంలో ప్రసిద్ధ మానవ శాస్త్ర పరిశోధకుడు గోండు గిరిజనుల పాలిట ఆరాధ్యుడు అయిన హేమండార్ప్‌ తో కలిసి 1971-90 సం:మధ్యకాలంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన అనుభవం గల డా: వి. యన్‌.వి.కె.శాస్త్రిగారు వ్రాసిన పరిశోధనాత్మక పుస్తకం‘‘కొమురం భీమ్‌ ముందు, తర్వాత, ఇప్పుడు,’’ఈ పుస్తకంద్వారా ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనుల పోరాట చరిత్రతో పాటు అక్కడి గిరిజనులకు మార్గదర్శకంగా నిలిచిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్‌ పోరాటానికి గల నేపథ్యంతో పాటు దాని ఫలితాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.
పక్కా పరిశోధనాత్మకంగా గణాంకాలతో ప్రామాణికంగా వ్రాయబడ్డ ఈలఘు పరిశోధన పుస్తకం 12 అధ్యాయాలుగా విభజించబడిరది.
ప్రారంభంలో కొమురం భీమ్‌కు అతని పోరా టానికి గల ఉపోద్ఘాతం అనంతరం గిరిజన పోరాటాల చరిత్రతో పాటు గోండుల పూర్వ వైభవం వారి రాజ్య స్వయం ప్రతిపత్తులకు సంబంధించిన విషయాలు విశేషాలు కూలంకషంగా చెప్పబడ్డాయి. సంఖ్యాపరంగా గోండు గిరిజనులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతిగా అభివర్ణించి అందులోని సామాజిక రాజకీయ వ్యవస్థల గురించి కూలంకషంగా వివరించారు,ఆయా గోండు గ్రామాల్లో నెలకొని ఉన్న సంస్కృతులు సాంప్రదాయాలు నేటికీ కొనసాగడంలో గల అంతరార్థం అవసరాలు గురించి కూడా మనం ఇందులో స్పష్టంగా చదవవచ్చు.చరిత్రకారులు చెప్పినట్టు 14వ శతాబ్దం వరకు గోండుల వైభవం కొనసాగగా అనంతర కాలంలో గోండు రాజ్యాలపై మారాఠాలు, మొగలు, అనంతరం నిజాములు దండయాత్రలు చేసి లోబరుచుకున్న చారిత్రిక అంశాలు గణాంకాలతో సహా వివరించారు పుస్తక రచయిత శాస్త్రి గారు.
ముఖ్యంగా నిజం పరిపాలనలో గల రెవిన్యూ విధానం నాటి ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందులో మనం గమనించవచ్చు బ్రిటీష్‌ పాలకులకు నైజాం పాలకులకు మధ్య గల వ్యత్యాసం ఇందులో ప్రత్యేకంగా చెప్పబడిరది.1855లో సాలార్‌ జంగ్‌ తొలిసారిగా తాలూకా దారులను ప్రభుత్వ ఉద్యో గులుగా నియమించారు వారే నేటి తాసిల్దార్లుగా పేరు మార్చబడిరది దీనిలో భాగంగా ప్రభుత్వ పాలన అధికారులుగా చలామణి అయిన దేశ్‌ ముఖ్‌, లు దేశ్‌ పాండేలు, చేసిన అక్రమాల వల్ల అంతకు ముందు వరకు రాజ్యాలు ఏలిన గోండు గిరిజనులు అధికారాలు క్రమంగా కోల్పోయి వారి భూములన్నీ భూస్వాములైన దేశముఖ్‌ లు, పాండేల హస్తగతమై వారి సొంత భూముల్లోనే రైతు కూలీలుగా పని చేయాల్సిన ధీన పరిస్థితి ఏర్పడిరది.
అంతేగాక 1920లో అమలు అయిన అటవీ చట్టం వల్ల గిరిజనుల నివసించే అడవులు ప్రభుత్వం వారి రిజర్వ్‌ అడవులుగా మారి పోవడంతో అడవి బిడ్డలు వ్యవసాయ భూములతో పాటు నివాస గ్రామాలు కోల్పోయి దిక్కులేని పరిస్థితికి చేరి తీవ్రంగా అణిచివేతలకు గురి కావడంతో కలిగిన అవమానాల నుంచి కొమరం భీమ్‌ పోరాటం ఆరంభమైంది, అంటూ రచయిత స్పష్టం చేశారు.
ఐదవ విభాగంలో భీమ్‌ పోరాటం గురించిన విషయ వివరణలో రచయిత అనేక సందేహాలు వెలిబుచ్చారు.
కొమురం భీమ్‌ అనే ఆదివాసి యోధుడి చరితను సమాజానికి పరిచయం చేసిన సాహు,అల్లం రాజయ్య,ల రచనతోపాటు నాటి ఆంధ్రప్రభ, గోల్కొండ, సారంగ, పత్రికల్లోని సమాచారంతో పాటు భీమ్‌ కుటుంబ సభ్యులు,నాటి సమకాలీనులు చెప్పిన మౌఖిక సమాచారాలే కొమరం భీమ్‌ పోరాటంలోని అంశాలకు ఆధారాలు, అయితే వీటన్నిటిలో కూడా కొన్ని కొన్ని లోపాలు సహేతుకంగా వివరించిన ఈ పుస్తక రచయిత డాక్టర్‌ శాస్త్రి, స్వయంగా తను ఆ ప్రాంతాన్ని సందర్శించి సేకరించిన విషయాలతో అప్పటి గోండుల భూములు అన్యాక్రాంతం అయిన తీరును వివరించారు, అలాగే భీమ్‌ చేసిన పోరాటం అతను అమరత్వం చెందిన తీరుకు సంబంధించిన రెండు సంఘట నలు తాను సేకరించిన ఆధారాలతో తెలిపారు.
కొమరం భీమ్‌ అమరత్వంతో గోండు ప్రజల్లో చైతన్యం రావడమే కాక,నాటి నిజాం ప్రభుత్వంలో కూడా చలనం మొదలై,హేమన్‌ డార్ప్‌ నేతృత్వంలో అక్కడి గోండు గిరిజనులకు కావలసిన తక్షణ అవసరాలు గురించిన సంస్కరణలు ఏర్పాటు చేయడం,అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో విద్యాలయాలు నెలకొల్పడం, గిరిజనులనే ఉపాధ్యాయులుగా నియమించడంతోపాటు గిరిజనుల సమీకృత అభివృద్ధి కోసం ఆయా గిరిజనులు నివసించే ప్రాంతాలలోనే ఐ.టీ.డీ.ఏ,లు అనే సొసైటీలు ఏర్పాటు చేసి మానవ అధ్యయన శాస్త్రం అభ్యాసం చేసిన కలెక్టర్‌ స్థాయి వారిని వాటి నిర్వహణ అధికారులుగ నియమించడం వంటి సంస్కరణలు జరిగాయి.
స్వాతంత్ర అనంతరం ఏర్పాటు అయిన రాజ్యాంగంలో గిరిజనుల అభివృద్ధి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం వంటి, అంశాలు పేర్కొనబడ్డాయి అదే విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రోడ్డు మార్గాల అభివృద్ధి కూడా ఒక కారణంగా రచయిత వివరించారు, ఏడవ అధ్యాయంగా పేర్కొన్న ‘‘ఇంద్రవెల్లి పోరాటానికి ముందు’’ అనే అంశంలో గిరిజన సమాజంలో శాంతిభద్రతలు క్షీణించడం దరిమిల ఏర్పడ్డ పరిణామాలు నక్సలైట్ల పాత్ర, గిరిజనులు సేకరించుకుని జీవనం సాగించే అటవీ ఉత్పత్తు లపై గిరిజన సహకార సంస్థలు అధికారం చెలాయించటం, దానికి తోడు గ్రామస్థాయి అధికారులు, వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్‌ షావుకారులు, చేసిన ఆకృత్యాల నేపథ్యంలోనే ఇంద్రవెల్లి పోరాటం, తదితరాలు జరగగా… గిరిజనులు అభివృద్ధికోసం కేటాయించిన మంత్రిత్వ శాఖలు గాని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు గాని, ఆశించిన మేర చురుగ్గా పనిచేయక పోవడంతో …..గిరిజన వికాసంలో మళ్లీ క్షీణదశ మొదలైంది.అన్న అంశం వివరిస్తూ… హైమన్‌ డార్ప్‌ ఆశించిన సంపూర్ణ గిరిజన వికాసం జరగాలి అంటే…రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూలు చైతన్యం కావలసిన తీరుతో పాటు గిరిజన నాయకత్వం బలపడాల్సిన తీరు, విద్య హక్కు చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలు తక్షణమే ఆశించిన రీతిలో అమలు కావలసిన ఆవశ్యకతల గురించి ఇందులో పేర్కొన్నారు. అనేక చారిత్రిక ప్రామాణిక అంశాల మేళ వింపుగాగల ఈ పరిశోధనా స్థాయి పుస్తకం గిరిజన చారిత్రక, సామాజిక, పరిశోధకుల పాలిట వరం అనడంలో సందే హం లేదు.కొమురం భీమ్‌ ముందు తర్వాత ఇప్పుడు (వ్యాస సంపుటి)రచన : డా:వి.యన్‌.వి.కె.శాస్త్రి,పేజీలు : 80, వెల : 75/-రూ, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ హైదరాబాద్‌`20,ఫోను : 040-27673787.– డా. అమ్మిన శ్రీనివాసరాజు

మహా భూతం …ప్లాస్టిక్‌

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండి పోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసి పోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి. వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తిం చేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.-గునపర్తి సైమన్‌


వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడు తున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌, రక్తం భద్రపరచే సంచులు, ఇంజక్షన్‌ సీసాలు, సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యా వరణం,ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు,రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం, సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది.కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది.ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతు న్నాయి.2030నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050నాటికి నాలుగిం తలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి.2029నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3టన్నుల ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్ర భావం చూపుతుంది.ప్లాస్టిక్‌ అనేది‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌ బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజా యిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూటాల్టిన్‌, జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌,సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు),బిస్పినాల్‌ లాంటి రసాయనా లు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి.ఈ రసాయనాలన్నీ సముద్ర జీవ రాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓకారణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం.గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు.కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయ కుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం. మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటు న్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతు న్నాయి.వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి.దీంతో రోడ్లు జలమ య మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతు న్నాయి.ఓమోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసంఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతు న్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యం త్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, బేకరీ లలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయ డానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది.ఇలా క్యాన్సర్‌,ఉదర కోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.

అవగాహనతో క్యాన్సర్‌ను అధిగమిద్దాం

క్యాన్సర్‌ ఒకప్పుడు మహమ్మారి. అదేంటో కూడా తెలియని స్థితి. నేడు క్యాన్సర్‌ జయించే స్థితిలోకి వచ్చాం. ఇది ఒకరకంగా వైద్యరంగంలో పెద్ద విజయంగా పేర్కొన వచ్చు. అయితే ఈవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదక రంగా ఉన్నదనేది అంతే వాస్తవం. అదే సందర్భంలో నేడు ఎక్కువమందిలో కనిపిస్తుండటం ఆందోళనకరం. మన దేశంలో క్యాన్సర్‌ ప్రమాదకరస్థాయిలో ఉందనేది గణాం కాలు చెప్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్‌ నియంత్రణలో అధు నాతన పద్ధతులు ఎన్నో వచ్చాయి. ఇంకా చాలా పరిశో ధనలు జరుగుతున్నాయి. రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీతో కూడా నివారించే పద్ధతుల్లో అందుబాటులోకి రావడం ఆశాజనకం.ఇంకా వైద్యరంగంలో మరింత పురోగతి సాధించటానికి కృషి కొనసాగుతూనే ఉంది.
క్యాన్సర్‌ నానాటికీ వృద్ధి చెందుతుండటంతో మరణ మృదంగంలా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన రెండు దశాబ్ధాలలో క్యాన్సర్‌ మరణాలు పెరుగుతున్నాయి.2026 నాటికి మనదేశంలో ఏటా 20లక్షలమంది క్యాన్సర్‌తో మర ణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90.5మిలియన్ల మంది కి క్యాన్సర్‌ వచ్చింది. 2019లో 23.6 మిలి యన్లకు ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే10మిలియన్ల మరణాలు సంభ వించాయి. ఇది గతదశాబ్ధంలో వరుసగా 26శాతం పెరుగుద లను సూచిస్తోంది. మొత్తంమీద చాపకింద నీరులా యావత్‌ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మాన వుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మరో ఆందోళ నాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్‌ భారినపడటం. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు కోటి మంది వరకు క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. 2024 లో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. అంటే ప్రతిరోజూ సుమారు 26వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతు న్నారనేది ఒక అంచనా.మనదేశంలో తాజాగా కొత్తగా 20 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదువుతు న్నాయని అంచనా.నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం 2022లో 14 లక్షల మంది బారినపడ్డారు. అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2025 కల్లా మనకి ఈ క్యాన్సర్‌ అనేది సగటున 12శాతం పెరిగే అవకా శంకనబడుతోందని గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఎందుకొస్తుందంటే..
మనిషి శరీరం మొత్తం కణజాణంతో నిండి వుంటుంది. అయితే శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవటమే క్యాన్సర్‌. మామూలుగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ,చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఇలాంటి ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చని పోకుండా అలాగే ఉండిపోతాయి.కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్‌ఎలవల్ల తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే పిల్లలకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే.అలాగే క్యాన్స ర్‌ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆహా రపు అలవాట్లు, రేడియేషన్‌,పొగతాగటం,ఊబ కాయం తదితర కారణాలతో కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి.ఫలితంగా శరీరానికి అవసర మైన కణాలు కంటే ఎక్కువవృద్ధి చెందుతాయి. అవన్నీ ట్యూమర్‌ (కణితి)గా ఏర్పడతాయి.దాన్నే క్యాన్సర్‌ అంటారు. పురుషుల్లో ముఖ్యంగా ఊపిరి తిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్‌ (లుకేమియా)అనే కారకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. క్యాన్సర్‌ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుం ది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణా లు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్‌ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
క్యాన్సర్‌ రహిత కణితితో ప్రమాదం లేదు..
కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి.క్యాన్సర్‌ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది.తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే క్యాన్సర్‌ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాప్తి చెందు తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్‌ కణితులు ఏర్పడతాయి.అలసట,శ్వాస తీసు కోవటంలో సమస్యలు,చర్మంలోగడ్డలు ఏర్పడటం, శరీరంబరువులోమార్పులు,చర్మంరంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేధించటం వంటి సమస్య లను క్యాన్సర్‌ లక్షణాలుగా గుర్తించొచ్చు. అయితే శరీరం లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కన్పిస్తుంటాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, స్కిన్‌ క్యాన్సర్‌,లంగ్‌ క్యాన్సర్‌,ప్రొస్టేట్‌క్యాన్సర్‌,కొలోన్‌ లేదా రెక్టం క్యాన్స ర్‌,బ్లడ్‌క్యాన్సర్‌,కిడ్నీ క్యాన్సర్‌ వంటి క్యాన్సర్లు వస్తుం టాయి. నిపుణులైన డాక్టర్లను సంప్రదించటం ద్వారా వారిచ్చే వైద్యసేవలతో క్యాన్సర్లను నియంత్రించొచ్చు.
అధునాతన వైద్యంతో నియంత్రణ
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్‌ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతం రోబోటిక్‌ పద్ధతిలో కూడా క్యాన్సర్‌ కారకాలను గుర్తించి,నియంత్రణ చేస్తున్నారు. ప్రపం చ ఆరోగ్యసంస్థ(డబ్ల్యుహెచ్‌ఒ)పిలుపునిచ్చిన విధంగా 2024లో‘క్యాన్సర్‌నియంత్రణలోఆటంకాలను అధిగ మిద్దాం’(క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌) థీమ్‌ మేరకు ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్స ర్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌,తల,మెడక్యాన్సర్‌,గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం),కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్‌ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూ నోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్‌ సంరక్షణలో సర్వైవల్‌ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
మెరుగైన జీవనశైలితో మార్పులు
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్ర త్తలు తీసుకోవాల్సిందే.అనారోగ్యంభారినపడ కుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు.. తినకూడదు.. తాగకూడదు.మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటారు.అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం.మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్‌ చేసి న ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నూడిల్స్‌) లాంటివి తినేస్తుంటాం.బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతుం టారు.అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బం దులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.-డాక్టర్‌ సాయికృష్ణ కొల్లూరు

జీవుల మనుగడ జీవ వైవిధ్యం

ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం,ఒకటే గృహం.మనుషులంతా ఒకటే అనేది ఉట్టి మాట. పొడుగు,పొట్టి,లావు,సన్నం,నలుపు,తెలుపు,ఇంకా వీటి మధ్యస్థ రకాలు,భేదాలు.ఇంకా మనుషు లంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి?ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి.ఈభూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈ తరహా భేదాల న్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్‌ వంటిది.ప్రకృతిలో ప్రతి జీవి ఒకప్రత్యేక పాత్రనుపోషిస్తూ పర్యావరణవ్యవస్థల స్థిరత్వం,స్థితిస్థాపకతకు దోహ దం చేస్తుంది.ఒకపురుగో,అసలిప్పటివరకు సామాన్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమైపోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతిజాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంక ర్షణ చెందుతుంది.పర్యావరణ వ్యవస్థను ఒకభారీ నెట్‌వర్క్‌గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవిఒకదారం ద్వారా ఇతరులతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక దారం తెగిపోయినప్పుడు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతులు ప్రభావితమౌతాయి.అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యం గా ఉంటుందో,అది అంతబాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉం టుంది.జీవుల సహజ ఆవాసాల నాశనం,కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయాలతో పర్యావరణం నిలకడగా ఉండదు.అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభా వితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు :ప్రతిరోజూ,జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు,మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరి యు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్‌ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించ డానికిఉపయోగపడుతుంది.ఉదాహరణకు, మానవు లు ఉత్పత్తిచేసే కార్బన్‌ డయాక్సైడ్‌లో దాదాపు సగ భాగాన్ని పీల్చుకోవడంద్వారా వాతావరణాన్ని నియం త్రించడంలో సముద్రాలు,అడవులు కీలక పాత్ర పోషి స్తాయి.చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీరపర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటిశుద్దీకరణతోపాటు,ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి,తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవ శాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూలుస్తు న్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే,జీవ వైవి ధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్య భరి తమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.ఎన్నో శాస్త్రీయ నివేది కలు ఈవిషయాన్ని నివేదించాయి. ఉష్ణోగ్రతలు 1.5 పెరిగితే, దాదాపు 6% కీటకాలు,8% మొక్కలు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో (ఆవాసాల మార్పు)మార్పులకులోనవుతాయి.ఉష్ణోగ్రతల పెరుగు దల 2%మేర అయితే,ఈ శాతాలు రెట్టింపు అవుతా యి.ఈకారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూ హ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభా గంలో దాదాపు 7%పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్‌ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘటనలు) ఎక్కు వగా నమోదు చేయబడుతున్నాయి, ఫలితంగా జాతు ల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపు తుంది.ఉష్ణోగ్రత1.5జలేదా2%జపెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరి యా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమికోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారి కంగా 17కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆకోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరించడం జరిగిం ది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే!భూమిచరిత్రలో జీవవైవిధ్యం అంతరించి పోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే.గతంలో కనీసం అయిదు సార్లు సహజ కార ణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు (జుఞ్‌ఱఅష్‌ఱశీఅం)జరిగాయి.వీటిలో చివరిది 65 మిలి యన్‌ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలు ప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమి టంటే,ప్రపంచీకరణనుండి,జీవవైవిధ్య నష్టం ప్రమా దకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటు న్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు, ప్రతిజాతి మన పర్యావరణవ్యవస్థ అనే వస్త్రపు సమ తుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారి పోతున్నాయి.మన కళ్లముందే ప్రకృతికను మరుగవు తోంది.భూగ్రహంపై జీవవైవిధ్యం ముప్పులో ఉండ టానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధార పడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం,వేటాడటం,ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగావక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగు తూనే ఉంది.గత కొన్నిసంవత్సరాలలో,జనాభా పెరుగు దల,దాంతోబాటే విపరీతంగా,అనిశ్చితంగా పెరిగి న,ఉత్పత్తి, వినియోగ విధానాలు జీవవనరు లకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ ఓ.విల్సన్‌ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు,అలాగే పర్యావర ణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవసంపదగా నిర్వచించవచ్చు. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవి ధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణం గా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్య పై అవగా హన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపు తుంది.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం,32,87,263చదరపు కిలోమీటర్ల వైశా ల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారత దేశంలో89,451జంతుజాతులున్నాయి.ఇది ప్రపంచజంతుజాలంలో7.31%. అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి.ఇది ప్రపంచమొత్తంలో 10. 78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న పదిహేడు అతి పెద్ద జీవవైవిధ్య దేశాలలో భారత దేశం ఒకటి. భూవిస్తీర్ణంలో 2.4 శాతమే ఉన్నప్ప టికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8 శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. – (డా.కాకర్లమూడి విజయ్‌)

1 2