హక్కుల ప్రాధాన్యత ప్రంచానికి చాటుదాం

‘‘ మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమై నప్పుడే అవి అర్థవంతమవుతాయి.జాతి,మత,కుల,లింగ, ప్రాంతీ య తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి.వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి. ఎన్నో పోరాటాల ద్వారా, మరెన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న మానవ హక్కులకు నేడు రక్షణ లేకుండా పోయింది. మానవ హక్కులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే వాటిని హననం చేస్తు న్నాయి. మానవుల మాన, ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. పుట్టుకతో ప్రతివ్యక్తికి లభించే ఈ హక్కులు జాతి,మత మౌఢ్యంవల్ల,రాజకీయాలవల్ల, వ్యక్తిగత ద్వేషం,కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితా లకు భరోసా లేకుండా పోతోంది. ’’
ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే అని మనం గొప్పగా చెప్పుకున్నా,నవ నాగరిక సమాజంలో మన ప్రయాణం సాగుతూ ఉన్నా అనేక సందర్భాలలో స్వార్థం,కుటిలత్వం,అమానుషత్వం వంటి అనేక కారణా ల వల్ల మనిషి ప్రాణాలకు సాటి మనుషుల నుండే ముప్పు వాటిల్లుతోంది. అటువంటి పరిస్థితులలో మనిషి ప్రాణా లకు భద్రత కావాలంటే మానవ హక్కులు అవసరం. ఆహక్కుల ద్వారానే మనిషి తనకు తాను రక్షణ కల్పించు కోవచ్చు.ఈ మానవ హక్కుల గురించి ఈనాడు చర్చ చేయడం,పోరాటాలు చేయడం అనేది గొప్ప విషయం కాదు.క్రీ.శ.1215లోనే ఈమానవ హక్కుల సాధన విష యమై ఒకప్రకటన జరిగింది అంటే ఆశ్చర్యకరమే. అప్ప టి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు. న్యాయబద్ధమైన తీర్పుద్వారా తప్ప,మరేవిధమైన పద్ధతు ల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నా కార్టా’ స్పష్టం చేసింది.
ఈ భూమ్మీద ఒకానొకప్పుడు పాలన సాగించిన నియంతలు,చక్రవర్తులు,రాజులు మా మాటే వేదం, మేం దైవాంశ సంభూతులం,తిరుగులేని అధికారం మాకే స్వం తం,చట్టానికి మేం అతీతులం అంటూ పాలన సాగించిన పాలకుల అధికారానికి మొట్ట మొదటిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరో పేరే మాగ్నాకార్టా.ఎవరైతే ప్రజల హక్కులను అణచివేసి,అతనే తప్పనిసరి పరిస్ధితులలో హక్కుల పత్రంపై సంతకం చేసిన క్షణాలు ఈ ప్రపం చంలో ప్రజాస్వామ్యానికి పునాది పడిన ఆ ఘడియల నుండే న్యాయం,స్వేచ్ఛ అనే మహత్తర భావాలకు పునాదు లు పడ్డాయి. రాజే సర్వాధికారి అని ప్రబలంగా నాటుకు పోయిన అభిప్రాయం ఆ రాజు సంతకంతోనే కొట్టుకు పోయింది. నియంతలపై ప్రజా సంక్షేమం పట్టని వారిపై ఈ రోజున ఉద్యమాలు చేయడం గొప్ప విషయం కాదు. ఏనాడో 800సంవత్సరాల క్రితమే సర్వాధి కారాలు చెలాయిస్తున్న అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే మాగకార్టా. నియంతరాజు మెడలువంచి స్వేచ్ఛ, సమా నత్వం అనే భావాలు మానవుల హక్కు అని నిరూపించి ప్రపంచానికి అందించిన వ్యక్తి స్వేచ్ఛల హక్కుల పత్రం.. ఇది చరిత్ర లో ఓకీలక ఘట్టం.చట్టానికి ఎవరూ అతీ తులు కాదు రాజైనా పేదైనా చట్టం ముం దు అందరూ సమానులే అంటూ ఇంగ్లాం డ్‌ ప్రజానీకం పోరు బాట పట్టింది.రాజే సర్వాధికారి అనే వేలసంవత్సరాల అభిప్రా యాన్ని కేవలం ఆఒక్క సంతకంతో తల్ల కిందులు చేసింది. తిరుగులేని ఇంగ్లాండ్‌ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అని వార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది.ఆపరిణామంతో నియం తత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ, ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచ మానవాళికే గొప్ప బహుమతిని అందించింది.మానవ హక్కు లకు పట్టం కట్టింది. భావితరాల వారికి ఈవ్యక్తి స్వేచ్ఛహక్కులపత్రం నాందీ ప్రస్తా వనగా నిలిచింది అని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పత్రం స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తదుపరి 1789వసం.లోఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ పేరిట మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. కాలక్రమేణా అనేక మంది మేధావులు ఈభూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతం త్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుండాలని, సాటి మనిషిని మనిషిగా కూడా చూడాలని అది హక్కుల కల్పన ద్వారానే సాధ్యపడుతుందని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మనుషుల్లో జాతి,భాష,కులమతాల జాఢ్యం వీడని కారణంగానే మానవ విలువలు అడుగంటిపో తున్నాయి. మానవ హక్కులు లేని నాడు, మానవ జీవనం మరింతహీనంగా పరిణమిస్తుందని అనేక మంది సాంఘి క సంస్కర్తలు తమభావాలను వ్యక్త పరుస్తూ అనేక గ్రంధాలు, ప్రసంగాలు చేపట్టి ఈ హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పారు.వీటిని పురస్కరించుకునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రూపకల్పనకై ముం దడుగు వేసింది. – (రుద్రరాజు శ్రీనివాసరాజు)

ప్రజలకు జవాబుదారిగా ఉండేలా పాలన చేద్దాం

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరిం చాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్షిప్‌ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఏపీ దేశంలో నెంబర్‌ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేక పోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడిరచారు. -జిఎన్‌వి సతీష్‌
సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలన ఎన్డీయే విధానం.పేదల ఆదాయం పెరగాలి..ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పని చేస్తాం.సూపర్‌-6,మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం.సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్‌ రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు…అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది.పేదలకు పింఛనురూ.30లతో ప్రారంభించారు.రైతులను ఆదుకు నేందుకు రూ.50లకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు…పక్కా ఇళ్లని ఆలోచించి ఇళ్లు కట్టించారు.సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.162రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.
భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్‌ ఫస్ట్‌ అన్న సీఎం అందుకే మొదటి సంతకం16 వేల 300ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టంచేశారు. మెగా డీఎస్సీద్వారా ఈఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా,పర్యాటకంగా,చిన్నతరహా పరిశ్రమలు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్తవిధానాలను తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సా హక బోర్డులోనూ 85వేలకోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు.అలాగే 1లక్షకోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ,ఏపీ జెన్కో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌?ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.రిలయన్స్‌ బయో సంస్థ కూడా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు,అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామ న్నారు.గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గంజాయి,డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం,మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్‌ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడిరచారు.
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారం లో రాష్ట్రవ్యా ప్తంగా ర్యాలీ చేస్తామని, ఆర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు.తెలుగువారు ప్రపంచ వ్యాప్తం గా నాలెడ్జ్‌ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని,వారికి గట్టిగా హెచ్చరి కలు జారీచేశారు.గతంలో ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.కూటమి ప్రభు త్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమంసజావుగా సాగాలంటే సుపరి పాలన ఉండాలన్నారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్టు`2024కు తీసుకువస్తున్నామన్న సీఎం,ఇందులో భూఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపిం చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.తప్పని తేలితే14ఏళ్ల జైలు శిక్ష భారీజరిమానా ఉంటుందన్నారు. మద్యందు కాణాల విషయంలో ప్రభుత్వం కఠి నంగా ఉంటుందని, బెల్టు దుకాణాలు వస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. మద్యం అక్రమాల విషయంలో మన, తన అనే బేధాలు ఏవీ ఉండవని తెలిపారు.ఉచిత ఇసుక సరఫరా విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పా రు.ఐదేళ్లపాటు చీకటిజీవోల ద్వారా పాలన సాగించారని, వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడుతూ నిర్ణయం తీసుకున్నా మన్నారు.పౌరసేవలన్నీ ఇకపై వాట్సప్‌లో ఇచ్చేలా నిర్ణ యం తీసుకుంటున్నామని వెల్లడిరచారు.రెవెన్యూ, దేవా దాయ,రవాణా,ఆర్టీసీ,గ్రీవెన్సు ఇలా వివిధ శాఖల సేవలు ఇక వాట్సప్‌ ద్వారా ఇస్తామన్నారు.150 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌,వాట్సప్‌ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
శాసనసభ వేదికగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌
నదుల అనుసంధానం కూటమి ప్రభుత్వ విధాన మని స్పష్టం చేశారు.సంక్షేమం,అభివృద్ధి,ఆదాయం, సాంకేతికతతో కూడిన సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని వెల్లడిరచారు. ఓర్వకల్లులో డ్రోన్స్‌ సిటీ ఏర్పాటు చేసి నైపుణ్యశిక్షణ,పైలట్‌ ట్రైనింగ్‌,ఉత్పత్తి చేస్తామని అన్నా రు. రాష్ట్రంలో సవాళ్లు,సమస్యలు చాలా ఉన్నాయన్న సీఎం,రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా మంత్రుల కమిటీ నియమించా మన్నారు.శాసనసభ వేదికగా 2047విజన్‌ డాక్యు మెంట్‌ ను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడిరచారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టాలు వారసత్వంగానే వచ్చా యని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ పోయిందని, సమస్యలు కూడా వచ్చాయ న్నారు. వ్యవస్థలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. రాష్ట్రానికి దశ దిశ చూపించటంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాముల బలిదానం వృథాగా పోదని,ఆస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే లా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వాతంత్య్రం రాక ముందు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ ఎంత మంది వచ్చినా అన్నం పెట్టారన్న సీఎం,అందుకే మధ్యా హ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అరాచకాలు, గంజా యిపై డిప్యూటీ సీఎం చాలా గట్టిగా ఉన్నారని, తాము ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. మహిళ లకు అవమానం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు లు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్య మంత్రి హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు, నక్సల్స్‌ను నియంత్రించానని తెలిపారు.
కొందరు రౌడీలు,బ్లేడ్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకో వద్దని చెబుతున్నామని అన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఉక్కుపాదంతోనే అణచివేస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్‌ కావాలని అన్నారు.ప్రజలు కూడా ప్రభుత్వానికి సహక రించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్ర బాబు ఆకాంక్షించారు.రైతులు పంపుసెట్ల వద్ద సౌర విద్యుత్‌ ప్యానళ్లుపెట్టుకుంటే మిగిలిన విద్యుత్‌ విక్రయిం చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రిడ్‌కు అనుసంధానించడంద్వారా తిరిగి సొమ్ము పొందే అవకా శం రైతులకు ఉంటుందని వెల్లడిరచారు.దీనిపై శాసన సభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు – 10 భారీ పరిశ్రమలకు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడు లకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34వేల ఉద్యోగాలు కల్పించే 10భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్య క్షతన జరిగిన ఎస్‌ఐపీబీ (ూ్‌a్‌వ Iఅఙవర్‌ఎవఅ్‌ ూతీశీఎశ్‌ీఱశీఅ దీశీaతీస) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రు లు నారాలోకేశ్‌,పయ్యావుల కేశవ్‌,గొట్టిపాటి రవి, అన గాని సత్యప్రసాద్‌,అచ్చెన్నాయుడు,టీజీ భరత్‌, నారా యణ,వాసంశెట్టి సుభాష్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అను మతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయిం చారు.

శక్తిమంతులు…మట్టి మహిళలు

‘వేట వృత్తిగా బతికిన ఆటవిక యుగంలోన/ స్త్రీ రాజ్యం స్థాపించి సమానతను చూపినాము/ నాగలి కనిపెట్టినాము/ నాగరికత నేర్చినాము’ అనే జనపదం మహిళ సామర్థ్యాన్ని తెలుపుతుంది. మహిళ ఒక ఉత్పత్తి సాధనం. పునరుత్పత్తికి ఆమే ఆధారం. ఒకప్పుడు మానవ జీవన విధానంలో ప్రముఖపాత్ర మహిళదే. అయితే పరిణామ కమంలో ఆమె మనుగడ అనేక అవరోధాల వలయంలో చిక్కుకుపోయింది. తన శ్రమ అలానే ఉంది, కానీ గుర్తింపు మాయమైపోయింది. తన కష్టం అలానే ఉంది, కానీ గౌరవం కనుమరుగైపోయింది.బాధ్యతలూ, బరువులూ ఆమె నెత్తిమీదే. ప్రమోషన్లు, రిటైర్‌మెంట్ల ఊసే తెలీదు.వెరసి ఆమె ఓ నిరంతర ఉత్పాదక మరమనిషి. నాటు వేసి, కోత కోసి, కుప్ప నూర్చి మట్టిలో మాణిక్యాలు వెలికితీసే నైపుణ్యం ఆమెది. ఈరోజున మనుషులంతా వేళకింత అన్నం తింటున్నారంటే..అందులో మెజారిటీ కష్టం గ్రామీణ,ఆదివాసీ మహిళలదే. ప్రతిఫలంగా వాళ్లకు దక్కే మూట విప్పి చూస్తే.‘కొన్ని తిట్లు, కొన్ని కన్నీళ్లు, కొంత అలసట,కొంత గుర్తింపులేనితనం,రాత్రికి రోజువారీ ఒంటినొప్పులు’.మేల్‌ సుపీరియారిటీ సొసైటీలో ‘అవని ఆకాశంలో సగం’ అనే మాట ఒట్టి మాటే. తతిమా ప్రపంచానికి సరే..గ్రామీణ, ఆదివాసీ మహిళలకు వారి హక్కుల పట్ల వారికే అవగాహన లేదు. వారిలోనూ,ప్రజల్లోనూ ఆ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సంబంధించి ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

‘అందరికీ మంచి ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణమహిళలు’అనేది ఈ ఏడాది అంతర్జాతీయ గ్రామీ ణ మహిళల దినోత్సవం థీమ్‌. ప్రపంచమంతటా ఆహా రాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళలను గుర్తించడం.. వారికున్న హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగిం చడం..అనే ముఖ్యోద్దేశ్యాన్ని చెప్పే థీమ్‌తో ఐరాస పిలుపు నిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి, ఆర్థిక వ్యవ స్థకి,ఆహార ఉత్పత్తికి గ్రామీణ మహిళలే అపారమైన కృషి చేస్తున్నారు.వారి శ్రమకు, సృజనాత్మకతకు గుర్తింపు తేవాలనే ఉద్దేశ్యంతో 2008,అక్టోబరు 15న గ్రామీణ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే దీనికి అంతగా ప్రాచుర్యం అందలేదు. అవగాహనా పెంపొందలేదు. సహజంగా గ్రామీణ ఉత్పత్తిలో ప్రధానంగా పాలుపంచుకుంటున్నది దళిత,బహుజన, ఆదివాసీ మహిళలే. ఆదివాసీ మహిళలు అడవుల్లో సేకరించి,ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. పోషకాల విషయంలోనూ అవి అంతే విలువైనవి. ప్రపంచ మహిళల్లో సగ భాగానికి పైగా భూమి లేక కూలి చేసే మహిళలే. చిన్న, సన్నకారు రైతు కుటుంబాల మహిళలు ఆహార ఉత్పత్తిలో, భద్రతలో ప్రధాన భూమిక నిర్వర్తిస్తున్నారు.పారిశ్రామిక వ్యవస్థ లోనూ మహిళల శ్రమా కీలకమైనదే.
నాటి ఆదర్శం..
గ్రామాలు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ జీ అన్నారు.గ్రామస్వరాజ్యం సాధిస్తేనే గ్రామాలు, పట్టణా లు,నగరాలు,రాష్ట్రాలు,దేశం అభివృద్ధి పథంలో పయనిస్తా యన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ వనరులే దేశ ఆర్థిక పరిస్థితికి,ఆహార భద్రతకు ఆధారం.ఆ విషయం గ్రామీణ మహిళల శ్రమ ఫలితంలో కనిపిస్తుంది. పంటల సాగు, విత్తనాల సంరక్షణ,పశుపోషణ,పెరటికోళ్ళ పెంపకం, అటవీ వనరుల సేకరణ,చేపల పెంపకం (అమ్మకం), చేనేత రంగం,బీడీ పరిశ్రమలు..ఇవన్నీ గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలే. వీటిలో మహిళలదే ప్రధాన భూమిక.
నేటి ఆధునికం..
అయితే ప్రపంచీకరణ, ప్రైవేటీ కర ణస్థానం బలోపేతమౌతున్న కొద్దీ గ్రామీణ వనరులన్నీ పలచనవుతూ వచ్చాయి. దాదా పు రెండున్నర దశాబ్దాల నుంచి గ్రామా ల్లో పేదరికం తాండవిస్తోంది. ఆర్థిక వెసులు బాటు లేక ప్రజలు మగ్గిపోతున్నారు. ఈ పరిణామం ముఖ్యంగా గ్రామీణ మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది. పోషకాహార లేమితో అనారోగ్య సమస్యలకు గురవుతు న్నారు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.ఈ ఇరవై ఏళ్ళలో దాదా పు 50శాతం మహిళలు తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామాల్లో సెజ్‌ల రూపంలో భూదోపిడీలు జరుగుతు న్నాయి. ప్రభుత్వాలే ప్రజలను మభ్యపెట్టి, పారిశ్రామిక వర్గాలకు భూములను కేటాయిస్తున్నాయి.దీంతో గ్రామాల్లో పేదప్రజలు తమ భూముల నుండి నిర్వాసి తులవుతున్నారు.ప్రభుత్వ అక్రమ విధానాల కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకం నిరాఘాటంగా సాగుతోంది. వారు సాగు చేసుకునే పోడు భూములను ప్రభుత్వాలు వివిధ కారణాలు చెప్పి,స్వాధీ నం చేసుకుం టున్నాయి. నిర్వాసితులు, నిరాధారులంతా వలస మార్గం పడుతున్నారు.
గిరిపుత్రుల గోడు..
అనాదిగా గిరిజనులుప్రకృతి ప్రేమి కులు. జీవనానికి తోడ్పడే ప్రతిదీ వారికి దైవంతో సమానం. అంతగా వారి జీవన విధానం పరిసరాలతో ముడిపడి ఉంటుంది. చెట్టు,పుట్ట,పక్షి..ఇలా తమ చుట్టూ ఉండే ప్రతిప్రాణీ వారి సొంతంగా బతుకు తారు. ఆట,పాట వారి జీవనంలో భాగం.అదే వారి సంస్క ృతి.గిరిజను లకు అటవీ భూమిలో నివసించే హక్కు ఉంది.ఆ భూమిని సాగు చేసుకునే హక్కూ ఉంది.అటవీ ఉత్పత్తులను సేక రించి,వినియోగించుకునే హక్కూ వారి కుంది.వారి ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగితే ఎదుర్కొని, న్యాయం కోరేందుకు చట్టాలున్నాయి. అయితే నిరక్షరా స్యత వల్ల వారికి వీటిపై అవగాహనే లేదు. అభివృద్ధి పేరుతో నెలకొల్పే ప్రాజెక్టులు, గనుల తవ్వ కాలు,అడవుల నరికివేత వంటివి వారి మనుగడకు పెనుభూతాలుగా మారి, నిర్వాసి తులను చేస్తున్నాయి.
అక్షరాస్యతతో అవగాహన వైపు..
గ్రామాల్లో సరైన విద్యా సౌకర్యాలు లేక నిరక్ష రాస్యత రాజ్యమేలుతోంది. ఆడ పిల్లల చదువు ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే ఆగిపోతోంది.దాంతో వారికి తమ శ్రమకు విలువ కట్టడం తెలియడం లేదు.వారికున్న హక్కు ల పట్ల అవగాహన కలగటం లేదు.అనేక దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్నారు.అక్షరాస్యతను అభివృద్ధి పరచాలని‘బేటీ బచావో బేటీ పఢావో,సర్వశిక్ష అభియాన్‌, మధ్యాహ్న భోజన యోజన’లాంటి పథకాలను ప్రభు త్వాలు తెచ్చాయి. కానీ అవి అమలుకు నోచుకున్నాయా అని తరచి చూస్తే మనకి అన్నీ ‘అచ్చుతప్పులే’ కనిపిస్తా యి.ఈవిషయంలో మన పొరుగు రాష్ట్రం కేరళది ఆదర్శవంతమైనపాత్ర. మనదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం.2011జనాభాలెక్కల ప్రకారం 94శాతం అక్షరాస్యత ఉంది. ఇటీవలి అంచనాల ప్రకారం 96.2 శాతానికి పెరిగింది. మిగిలిన రాష్ట్రాలూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దేశం అక్షరాస్యతతో సుసంపన్నమవుతుంది.
ఏరువాక విడిచి ఊరు దాటితే..
జీవనోపాధిని కోల్పోయి పట్టణాలకు,నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస పోతున్నారు గిరిజనులు, గ్రామీ ణులు.దారం తెగిన గాలిపటాలయ్యాయి వీరి జీవితాలు. తెలియని ప్రదేశాలలో ఇమడలేక,సరైన పనులు దొరక్క నానా యాతనలు పడుతున్నారు.మహిళలైతే పని ప్రదేశాల్లో హింసకు,లైంగిక వేధింపులకు,దాడులకు గురవుతున్నారు.బలవంతంగానో,బతకలేని పరిస్థితుల్లోనో వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు.గ్రామీణ మహిళలు బయటే కాదు ఇళ్లల్లోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తీవ్రమైన గృహ హింసను అనుభవిస్తు న్నారు. కుటుంబసభ్యుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిని భరించాల్సి వస్తోంది. అలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు చిన్నతనంలోనే వ్యసనాలకు లోనవు తున్నారు.తాము చేయని తప్పులకు అటు పిల్లలు, ఇటు భర్త వ్యసనాలబారిన పడుతున్నారు.చివరికి ఈ కష్టాలు మహిళలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి.
ఘనత ఉన్న పంచాయితీరాజ్‌..
మన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పంచాయి తీరాజ్‌ వ్యవస్థ కీలకం.ఇది అతి ప్రాచీనమైనది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగశాలగా చెప్పుకునే ఘనత దీనికి ఉంది.గ్రామ పరిపాలనకు వెన్నెముకగా పనిచేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 72 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారి భవిష్యత్తు పంచాయితీరాజ్‌ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది.ఈ వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ మహిళల భాగ స్వామ్యం ఉంది. వారికి ఉండేది వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే.ఆ ఆసరా కూడా లేకుండా చేసే కార్య కలాపాలు ఆపి, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.
పథకాల అమలే పరిష్కారమా..?
మహిళా రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ గ్రామ స్థాయి లోని మహి ళలు ఆర్థికంగా,సామాజికంగా ఇంకా వెనుక బడి ఉన్నారు. పంచాయితీ రాజ్‌లో పది లక్షల మంది మహిళా ప్రతి నిధులు ఉన్నారు. అయినప్పటికీ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరటం లేదు.ఈ పరిస్థితిని అధిగ మించాలనే ఉద్దేశాన్ని చెబుతూ మహిళల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టాయి.డ్వాక్రా గ్రూపు లు,సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లాంటి రకర కాల పథకాల ద్వారా మహిళలకు కొంత వరకు తోడ్పాటు ను అందిస్తున్నాయి. అయితే అవి సక్ర మంగా అమ లుకు నోచుకోవడం లేదు. దీనికి పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో పాటు మహిళలకు వాటిపై అవగాహన లేకపోవడం కూడా కారణమే. రాజ్యాంగం అనేది ఒకటి ఉందనీ, దానిలో మహిళలకు అంటే తమ కోసం కొన్ని చట్టాలు ఉన్నా యన్న కనీస అవగాహన గ్రామీణ మహిళ ల్లో లేదని ఇటీవల ఒక అధ్యయనంలో తెలిసింది.ఆయా చట్టాల గురించి,హక్కుల గురించి వారికి తెలిసిన ప్పుడే మార్పు మొదలవుతుంది.
పితృస్వామిక పరిమితులు..
సమాజంలో పాతుకుపోయిన పితృ స్వామిక విలు వలు మహిళల హక్కులను తొక్కి పెడుతున్నాయి. చాలా వరకు గ్రామా ల్లో ఆస్తులన్నీ పురుషుల చేతుల్లోనే ఉన్నా యి.అవి మహిళలకు లభించే విధంగా అమలు జరగటం లేదు.బాంకు అకౌంట్లు కూడా జనధన్‌ యోజన,ఫైనాన్స్‌ఇంక్లూ జన్‌లో మహిళలను భాగస్వా మ్యం చేయాలి. ప్రభు త్వం ఇచ్చే స్థలాలు,ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలి.అవి నేరుగా మహి ళలకు చేరేవిధంగా ఏర్పాటు చేయాలి.అంగన్‌వాడీ,జననీ సురక్ష యోజన లాంటి పథ కాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి.శ్రమకుతగ్గ వేతనం అందక పోయినా పురుషులతో సమానంగా శ్రమిస్తూనే ఉన్నారు.సామాజిక బాధ్యతలు మోస్తూనే ఉన్నారు.
విధిలేక వివక్షలో..
మహిళల శ్రమ పురుషులతో సమానం లేదా అంతకు మించి ఉంటుంది.వేతనం విషయంలో మాత్రం వివక్ష స్పష్టంగా,నిరాఘాటంగా కొనసాగుతోంది. మహిళ లకు పనికి తగ్గ వేతనం లేదు.ఆరుగాలం శ్రమించినా తిరిగి చూసుకుంటే శూన్యమని పిస్తోంది.అంతేకాదు.. ఇంత చేసినా మహిళలకు భూమిపై హక్కు లేదు. మహిళా రైతుగా గుర్తింపు లేదు. జీవనోపాధిలో నిర్ణయా ధికారం లేదు.ఆదాయంపై నియంత్రణ అనేది లేదు.తల్లిగా, భార్యగా,సోదరిగా ప్రతి పురుషుని జీవితాన్నీ తీర్చిదిద్దేది మహిళే. అయినా మన పితృస్వామ్య సమాజంలో స్త్రీకి ఉన్న విలువెంత అంటే సమాధానం శూన్యం.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా,మన పురుషాధిక్య సమాజంలో వారికే మాత్రం గౌరవం, గుర్తింపు ఉండటం లేదు. చట్టపరంగా సమాన హక్కులు ఉన్నా,అవి తెలిసినవారు ఎక్కడో ఒకరుంటారు. ఇప్ప టికీ ఇంటాబ యటా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.పైకి కనిపించే చిరునవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళెన్నో. మహిళల పరిస్థితులు మారాలని అందరూ చెబుతున్నారు. కానీ మహిళా కమిషన్‌ బిల్లును సైతం తొక్కిపెడుతూనేఉన్నారు.
తీర్పుతో మార్పు ఉందా..
సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం నియమాన్ని స్పష్టీకరించింది. రోజువారీ కూలీలకు, క్యాజువల్‌ సిబ్బందికి,కాంట్రాక్టు సిబ్బందికి ఈ నియమం వర్తిస్తుంది. అయినా ఇప్పటికీ ఆనియమం అమలు కాలేదు. స్త్రీ-పురుషుల వేతనాల విషయంలో తీవ్ర వ్యత్యా సాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వైనాన్ని కళ్ళకు కట్టింది మాన్‌స్టర్‌ సబ్‌వే. ఓవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇల్లు, అటు ఆఫీసు పనుల్లో తీవ్ర మైన వత్తిడికి గురవుతున్నారు.పని ఒత్తిడిలో మగ్గుతున్న మహిళలు43శాతం మంది ఉన్నారని ఇటీవలి నివేదికలో తెలిసింది.వీరిలో దాదాపు 92శాతం మంది మహిళలు. స్త్రీల పథకాల అమలు లోనైనా మహిళల భాగస్వా మ్యం ఉంటే కొంతవరకు అమలుకు నోచుకునే అవకాశం ఉంటుంది.
వారసత్వపు హక్కులో సత్తువుందా..
సహజంగా మనదేశవారసత్వ చట్టంలో తాత ఆస్తి మనవడికి అని ఉండేది. స్త్రీకి గానీ,ఆమె సంతా నానికిగానీ చెందేలా లేదు. చట్టపరంగానే లింగ వివక్షను చవిచూ సింది మహిళ.అయితే వారసత్వచట్టం ఒక అడుగు ముందుకేసి స్త్రీలకూ పురుషులతో సమానంగా ఆస్తి హక్కును కల్పించింది.దీన్ని ఆధారం చేసుకుని భూమిపై హక్కును,వాటాను మహి ళలు సాధించుకోవాలి. మహిళలకు వీటిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలి. స్వచ్ఛం ద సంస్థలతో పాటు ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళలకు ఆస్తి హక్కు సరైన రీతిలో చెందేలా ప్రభుత్వాలే చట్టాలు రూపొందించాలి.
మహిళా రైతు దినోత్సవం..
నేడు మన దేశంలో చిన్న,సన్నకారు రైతుల విష యానికొస్తే..వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళా కార్మికులు 86శాతం పైనే ఉన్నారు. వారిలో 53 శాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. భూమిని కౌలుకు తీసుకుని,వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. వర్షా భావం తో పంటలు పండకపోయినా కౌలు మాత్రం యజమానికి చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు భూమిపై హక్కులున్నాయా అంటే? లేవనే చెప్పాలి. మరి ఇలాంటివారికి ప్రభుత్వాలే భూపంపిణీ చేయాలి.అదీ మహిళ పేరుతో ఇస్తేనే లబ్ది చేకూరుతుంది. అప్పుడే స్త్రీలు ఒడిదుడు కులను ఎదుర్కొని పిల్లల బాధ్యత, కుటుంబ పోషణను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. పథకాలు ప్రభుత్వాల ప్రకటనల వరకే పరిమితం కాక, అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.దీనివల్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరే అవకాశంఉంది.
మహిళా రైతుల వేదిక సభ్యులు వీటిపై కృషి చేస్తున్నారు. మహిళల హక్కుల గురించి, వారి శ్రమకు గుర్తింపు రావాలని చేస్తున్న కాంపెయిన్‌లు, సదస్సులు, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి,కొన్ని సంఘాలు ముందుకెళ్తున్నాయి.గతేడాది కేంద్ర వ్యవసా య మంత్రి గ్రామీణ రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.తమ హక్కు లూ, పథకాలూ గ్రామీణ మహిళలకు చెందా లి.అందుకోసం ప్రజాస్వామిక శక్తులూ, మానవహక్కుల సంఘాలూ, మహిళా సంఘా లూ గళమెత్తాలి.మహిళలంతాఒక్కటై నినదిం చాలి.ఇది మహిళా రైతుల కృషికి సత్ఫలి తాలిస్తుందని భావిద్దాం. మానవ మనుగడకు నిరంతర కార్యదర్శిని గుర్తించి,గౌరవిద్దాం. – (టి.టాన్య)

మహిళలు..బాలల హక్కులకేదీ భరోసా

రాజ్యాంగం మహిళలు,బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
చట్టం ముందు అందరూ సమానులేనని,అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది.కుల,మత,జాతి,మత,లింగ, ప్రాంతీయ పరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది.మహిళలు,బాలలహక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనాప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే,ఆపని నిక్షేపంగా చేయవచ్చునని15(3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది.మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం,మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది.వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది.ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా,1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడిరది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది.1961లో మాతృత్వ సంక్షేమ చట్టం,వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది.ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్‌ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది.అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం,కోడళ్ల హత్యలు,ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేరగణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడిరచడం ఓభీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్ప నిసరి.అందుకే గృహహింస నిరోధానికి ఒకచట్టం చేశాం.పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని,అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని,లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం.ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి.రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు,పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం,ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశి స్తున్నాయి.పంచాయతీలు,పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్‌ కులాలు,తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయి స్తున్నారనే వార్తలు వస్తున్నాయి.కొందరు అగ్రశ్రేణి రాజకీ య నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటిం ట్లోనని,వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం.కాబట్టి కేవలం చట్టా లతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్త త్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి.ప్రత్యేక సంరక్ష ణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వ త్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది.1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి.తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది.14 ఏళ్ల లోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్క డైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి.స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందా గా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించా లన్నాయి.బాలలు,యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా,భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలి వేయడం వంటివి జరగరాదంటున్నాయి.ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి.ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం.పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగు తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
లక్ష్యసాధనలో వైఫల్యాలెన్నో
ప్రగతిశీల సమాజంగా, సజీవ ప్రజాతంత్ర, గణ రాజ్యంగా వెలిగిపోతుందనుకొంటున్న భారతదేశం నిజంగా ఏమి సాధించిందనే ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది. లక్ష్యసాధనలో కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.మరి వాటిని అధిగమించడానికి మనమేం చేశాం, ఏం చేస్తున్నాం? మొదట దేశ ప్రజల ఆలోచనా విధానం మారాలి. కాలం మారుతోందని గుర్తించి తదను గుణంగా నడచుకోవాలి.చిరకాలం ఇంటి నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన భారతీయ మహిళ నేడు బయటి ప్రపంచంలోకి వస్తోంది.‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే మను సూక్తికి కాలం చెల్లిపోయింది. తమకూ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం వాటికి భరోసా ఇచ్చిందని మహిళలు గ్రహించారు.సమానత్వం, గౌరవ మర్యాదల పరిరక్షణకు కట్టుబడిన రాజ్యాంగం వనితలను తమ హక్కులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది.దీన్ని ఎవరూ కాదనలేరు.నాయకులు కాని, మరెవరైనా కాని మహిళల హక్కులను కాలరాయలేరు. మహిళలు కూడా సంస్థాగతంగా సంఘటితమై తమ హక్కులను కాపాడు కోవడానికి ఉద్యమిస్తున్నారు.మన దేశజనాభాలో 37 శాతం బాలలే అయినా గడచిన 70ఏళ్లుగా బాలల హక్కు లను అలక్ష్యం చేస్తూ వచ్చాం.ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్నది భారత్‌లోనేనని గర్విస్తూనే బాలల గురించి పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు. బాల్యం నుంచి చక్కని చదువులు చెప్పి,యౌవనంలో నైపుణ్యాలు గరపడం ద్వారా యువ జనాభాను దేశ ప్రగతికి చోదక శక్తిగా మలచుకోవలసిన బాధ్యత జాతి మీద ఉంది. మహిళలు,బాలలకోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ-అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరుపై సామాజిక తనిఖీ చేయాలి.వసతి గృహంలో లైంగిక అత్యాచారాలపై నిష్పాక్షికంగా,హేతుబద్ధంగా జరిపిన విచారణ ద్వారానే నేరస్తులకు శిక్షలు విధించగలిగాం. సామాజిక తనిఖీ కూడా అదే పంథాలో సాగాలి.
ఆచరణలో వెనకబాటు
పిల్లలు,ముఖ్యంగా ఆడ పిల్లల శ్రేయం కోసం జాతీయ విధానాలుచాలానే రూపొందించుకున్నాం. పిల్లల సంక్షేమానికి తరుణ వయస్కుల న్యాయ చట్టం రూపొందింది.14ఏళ్ల వయసువరకు బాలలకు ఉచిత విద్య ఒకహక్కుగా గుర్తించాం.ఇన్నిచట్టాలు చేసినా వాస్త వంలో పరిస్థితి వేరుగా ఉండటం శోచనీయం. కైలాస్‌ సత్యార్థి వంటివారు నిస్వార్థంగా కృషి చేసినప్పటికీ బాల కార్మికులతో పని చేయించే పద్ధతి ఇప్పటికీ కొనసాగు తోంది. సరైన వైద్య సౌకర్యాలు లేక వందల సంఖ్యలో శిశువులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు.దేశంలో రోజుకు 250మంది బాలలు అదృశ్యమవుతున్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి. వసతి గృహా ల్లో,శరణాలయాల్లో బాలికలపై లైంగిక అత్యాచారాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక శరణాల యంలో 30మంది బాలికలపై పదేపదే అత్యాచారం జరిపిన వ్యక్తులకు ఇటీవల శిక్షపడటం చూస్తే, రాజ్యాం గం నిర్దేశించిన రీతిలో బాలలకు ముందుగానే రక్షణ కల్పించలేకపోతున్నామని తేలుతోంది.బాలలు నేరాలకు ఒడిగట్టే ధోరణి తగ్గుతుంటే,వారి పట్ల నేరాలు పెరిగి పోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడిరచింది.2016-2018 మధ్యకాలంలో బాలలపై నేరాలు గణనీ యంగా పెరిగా యని తెలిపింది. బాలలకు విద్యాహక్కును తొమ్మి దేళ్ల క్రితమే దత్తం చేసినా,ఆశించిన స్థాయిలో ఆహక్కు అమ లైందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అర్హులైన ఉపాధ్యాయులు,సరైన పాఠశాలభవ నాలు, ప్రయోగశాలలు,ఇతర మౌలిక వసతులు కొరవడటంవల్ల బాల లకు విద్యా హక్కు అరకొరగానే అమలవుతోంది. భారత గణతంత్ర రాజ్యానికి70ఏళ్లు నిం డిన సం దర్భంలో స్త్రీలు,బాలల అభ్యున్నతికి భావి కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణ యించుకోవడం ఎంతైనా అవసరం. ఆలక్ష్య సాధనకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఐక్య రాజ్య సమితి లో సభ్యులైన 193దేశాలు సంతకం చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పత్రం సరిగ్గా అటువంటి ప్రణాళికే. భారత దేశం కూడా దాని మీద సంతకం చేసింది.సుస్థిరా భివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీల)ను సక్రమంగా అమలు చేస్తే,అన్ని వర్గాలతో పాటు స్త్రీలు, బాలలూ లబ్ధిపొందుతారు. ఎస్‌డీజీలలో అయిదోది స్త్రీలు,బాలికల గురించి పట్టిం చుకొంటోంది.లింగ సమానత్వం సాధించి, మహిళలు, బాలికలకు సాధికారత అందిం చాలని అందులోని అయిదోలక్ష్యం ఉద్ఘా టిస్తోంది.ఎస్‌డీ జీలలో ఇతర లక్ష్యాలైన పేదరికం,అసమా నతలనిర్మూలన,ఆరోగ్య సంరక్షణ,ఉపాధి,ఆర్థిక ప్రగతులను సాధిం చడానికి మహిళా సాధికారతే పునాది.కొత్త దశాబ్దంలో ఈలక్ష్యాల సాధనకు జాతి యావత్తు కలిసి కట్టుగా ప్రజాస్వామికంగా కృషి చేయాలి.- వ్యాసకర్త : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి

విస్తృత పరిశోధన సారం`ఆదివాసీల జీవనం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత, సంపాదికులు భూక్యా చిన వేంకటేశ్వర్లు కలం నుంచి జాలువారిన ‘ఆదివాసుల జీవనం’ అనే పుస్తకంపై సమీక్ష
తెలుగు సాహిత్యానికి గిరిజన జీవన చిత్రానికి విడదీయరాని బంధం సంబంధం ఏనాటిదో!! మౌఖికంగా ప్రారంభమై అక్షరాల గుండా నేడు అడివంత విశాలంగా వ్యాపించి వివిధ ప్రక్రియల ద్వారా పరిశోధనాత్మకంగా పరిశీలన పథంలో పయనిస్తుంది,గిరిజన సాహిత్య వికాసం కోసం విశ్వవిద్యాలయాలతో పాటు కొన్ని పత్రికల యాజమాన్యాలు చేస్తున్న కృషి అభినందన పూర్వక ఆచరణీయం.
ఇందులో భాగంగానే సుమారు పాతికేళ్ల క్రితం గుంటూరుకు చెందిన,ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన జాతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు,గిరిజన స్రవంతి మాసపత్రిక సంపాదకుడు.
‘‘భూక్యా చిన వెంకటేశ్వర్లు’’సంపాదకత్వంలో వెలువడిన వ్యాస సంకలనం‘‘ఆదివాసుల జీవనం’’, విభిన్న రంగాలకు చెందిన రచయితలు,తమ తమ పరిధిలో పరిశోధనాత్మక,ప్రామాణిక,రీతిలో గిరిజన జనావళికి సంబంధించిన అనేక చారిత్రక,సాంస్కృ తిక,సామాజిక,ఆర్థిక,అంశాలను గణాం కాలతో సైతం అందించిన 30వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
వ్యాస సంకలనంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు వివరించడంతోపాటు,వారి వెనుక బాటుకు కారణాలు ప్రభుత్వాలు చేయాల్సిన విధులు, గురించి కూడా నిర్మొహమాటపు వ్యాసాలు అనేకం ఇందులో చదవవచ్చు.
ఆదివాసులకు అడవులకు మధ్య గల అవినాభావ సంబంధంను కాలరాస్తున్న ‘‘ఫారెస్ట్‌ బిల్లు’’ ద్వారా అడవి బిడ్డలకు జరుగుతున్న నష్టం,బావి ప్రమా దాలను, హెచ్చరికలతో అందించిన తొలి వ్యాసంలో ‘‘1927 భారత అటవీ చట్టం’’మొదలు అనంతర కాలంలో వచ్చి రూపాంతరం చెందిన పలు అటవీ చట్టాలు..బాహ్యంగా అడవుల,పర్యా వరణ,పరిరక్షణకు అన్న చందంగా కనిపించిన అంతర్గతంగా అడవి బిడ్డలకు అనేక విధాల ఆటంకాలు కలిగిస్తున్నాయి, అనే అక్షర సత్యం అందులో మనం గమనించవచ్చు, కేవలం బిల్లులోని దోషాలు ఎత్తి చూపడమే కాక పరిష్కార మార్గాలు, సూచనలు,కూడా చేయడం వల్ల ఉత్తమ విమర్శనాత్మక వ్యాసశ్రేణిలో నిలుస్తుంది,ఈ కోవకు చెందిన వ్యాసాలు అనేకం ఇందులో ఉన్నాయి.
నిడివి వ్యాసాల విషయం పక్కనపెట్టి విషయ ప్రాధాన్యతలను ప్రామాణికంగా లెక్కించి వర్గీకరించుకోవలసిన ఈవ్యాసాలు మొత్తం సంఖ్యాపరంగా 29,విషయ సూచిక లోపంగల దీనిలోని వ్యాసాలు పరిశీలించినప్పుడు గిరిజనుల సంస్కృతిని పరిరక్షించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు చేయాల్సిన కృషిని గురించి, కూడా గుర్తు చేస్తాయి.
‘‘గిరిజనాభివృద్ధి ఒక పరిశీలన’’అనే వ్యాసంలో 1957లో బలవంతరాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు గిరిజన అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 43 బహు ళార్థ ప్రాజెక్టులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విషయంతో పాటు,మూడవ,నాల్గవ,పంచవర్ష ప్రణాళికల్లో గిరిజన అభివృద్ధికి ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేసి,వారి ఆర్థిక అభివృద్ధికి జరిగిన కృషిని గుర్తు చేస్తూనే ఆదివాసుల సమగ్ర అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలు మూస పద్ధతిలో కాక, ఆయా గిరిజన ప్రాంతాల్లోని భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన రీతిలోనే అభివృద్ధి చర్యలు చేపట్టాలనే విలువైన సూచనలు అందించారు వ్యాస రచయిత డాక్టర్‌ ఎల్‌. ప్రసాద్‌,
‘‘గిరిజన విద్య-అవకాశాలు-నిర్బంధాలు’’ అనే మరో వ్యాసంలో రచయిత ‘‘ప్రొఫెసర్‌ అంబాస్ట్‌’’ అనేక విలువైన విషయాలు తెలియజేశారు. పూర్వం గిరిజన జాతులు ఒక దానితో ఒకటి ఏవిధమైన సంపర్కం గాని సమాచార సంబంధాలుగానీ లేకుండా ఉండేవి, అందువల్ల వారిలో అధిక శాతం వ్రాసే భాషను అభివృద్ధి చేయలేకపోయి కేవలం మాట్లాడటం ద్వారానే అవసరాలు తీర్చుకుంటూ గిరిజన భాషలు మౌఖిక భాషలుగానే మిగిలిపోయాయి,అనే అక్షర సత్యాలను ఈ వ్యాస రచయిత ఆవిష్కరించడంలో ఆదర్శంగా నిలిచిపోయారు.గిరిజన భాషలకు లిఖితపూర్వకమైన భాష లేకున్నా నిర్దిష్టమైన వ్యాకరణం,భాషా నిర్మాణం ఉండేవి, మన దేశంలోనే చాలా గిరిజన తెగలవారు వారి పురాతన సంస్థల ద్వారానే విద్యావసరాలు తీర్చుకునేవారు.ఈ సంస్థలు ఆయా గిరిజన తెగలలోని యువతను సామాజిక ప్రయోజనం కలిగిన ఉత్పాదక సభ్యులుగా తయారు చేసేవి. గిరిజన సమాజాలు చాలావరకు ఇతర ప్రపంచాలతో సంబంధం లేనివి కావడం చేత వారు లిపి అవస రంగా భావించలేదు. కానీ వారికి భావపరమైన నైపుణ్యం ఉంది.
గిరిజనులందరికి సంపూర్ణ విద్యా సౌకర్యాలు అందాలంటే సమయం పడుతుంది, రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యా, ఆర్థిక, ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.ఇలాంటి ఎన్నో ప్రామాణిక అంశాలు ఈ వ్యాస పరంపర సాయంగా తెలుసుకోవచ్చు.
గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించిన ప్రయోజనాల గురించి యం.టి.దిన్‌ తనవ్యాసంలో అనేక ప్రామాణిక అంశాలు కూలంకషంగా వివరించారు, పూర్వం బ్రిటిష్‌ పాలకులు అనుసరించిన ఏర్పాటు వాదాన్ని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు గిరిజన గిరిజనేతర ప్రజల మధ్య గల అవరోధాలను తొలగించే దిశగా మార్పులు చేర్పులు చేసి గిరిజనులు కూడా ఇతర భారతీయులతో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృ తికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ ,షెడ్యూళ్లు, రూపొందించారు.
వీటి ద్వారా గిరిజన జనాభా ఆశించిన లబ్ధి పొందవచ్చు, కానీ కార్యాచరణలో నేటి గిరిజన జనాభా అభివృద్ధి ఏమిటి? అన్నది వ్యాసకర్త ప్రశ్న. ఇలా అనేక విషయాల కలబోతలు గల ఈ వ్యాసాలు బహుళ ప్రయోజన కారకాలు అనాలి.
ఇక ఇందులోని రెండవ పార్శ్వం గిరిజనుల సంస్కృతి వికాసానికి సంబంధించిన వ్యాసావళిలో కోయనృత్య ప్రదర్శన, విధానాలు గిరిజనలు పండుగలు, వేడుకలు, గిరిజనుల ఆచారాలు, అలవాట్లు, మొదలైన వ్యాసాలతో పాటు డాక్టర్‌ బాలగోపాల్‌ గారి సుదీర్ఘ వ్యాసం ‘‘గిరిజనులు గిరిజన సంస్కృతి’’ ద్వారా అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలుస్తాయి.
గిరిజన జీవితాలతో విడదీయలేని బంధం గల నృత్యాల గురించిన ప్రత్యేక వ్యాసంలో గొట్టిపాటి సుజాత అనేక గిరిజన నృత్య రీతుల గురించి కళ్లకు కట్టినట్టు అక్షరీకరించారు. వీటిలో కొండ దొరల ‘‘మయూర నృత్యం’’ గురించి ప్రత్యేకంగా వ్రాశారు, వివాహ సందర్భాల్లో చేసే ఈ నృత్యంలో పెళ్లి, వైవాహిక జీవితం, మొదలైన అంశాలను ఘట్టాల వారీగా ప్రదర్శించడం వీరి ప్రత్యేకత, అలాగే గోండులు చేసే దండారి, థింసా, నృత్య విశేషాలు, అలంకరణలు, మొదలైన అంశాల గురించి కూలంకషంగా ప్రామాణికంగా
ఈ వ్యాసంలో చర్చించారు.
పరిశోధకుల పాలిట కల్ప వృక్షంగా చెప్పాల్సిన ఈవ్యాస సంకలనం బహుళ ప్రయోజన కారి అనడం సబబు, 1998లో ప్రథమ ముద్రణ పొందిన ఈ వ్యాస సంకలనం, 2002లో ద్వితీయ ముద్రణ పొందటం మరో విశేషం,
ఆదివాసుల జీవనం (వ్యాస సంకలనం), పేజీలు : 144
వెల : 55/- రూ
సంపాదకుడు : కీ:శే భూక్యా చిన వెంక టేశ్వర్లు.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌ : 77298 83223.

నిస్సహాయంగా ముగిసిన కాఫ్‌`29 సదస్సు

భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏ మాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్త ఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన, నిరుపేద దేశాలు భావిస్తున్నాయి. ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు వుండాలని ఎల్‌ఎండిసి గ్రూపు సూచించింది. ముసాయిదాను క్లిష్టతరంగా మార్చ యడంపై పేద దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలను తగ్గిం చేందుకు అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగిన కాప్‌ 29 సదస్సు ఫలవంతమైన కార్యాచరణను ప్రతిపాదించకుండానే ముగిసింది.ఈనెల 11వ తేదీన మొదలై,22వ తేదీవరకూ12రోజులపాటు జరిపిన చర్చలు సంపన్న దేశాల స్వార్థగుణాన్ని, పర్యావరణంపట్ల వాటి పాక్షిక దృష్టిని మరోసారి బయటపెట్టాయి. తాము సృష్టిస్తున్న కాలుష్యాన్ని,కర్బన ఉద్గారాల పాపాన్ని ప్రపంచం నెత్తిన వేసి,తాము చేతులు దులుపుకోవాలన్న అతి తెలివితోనే అవి వ్యవహరించాయి.
దేశాలకు సరిహద్దులు ఉంటాయి కానీ,పర్యావరణాన్ని హరించే కర్బన ఉద్గారాల వ్యాప్తికీ,వాటి పర్యవసానాలకు నియంత్రణ రేఖలు ఉండవు. ధనిక దేశాలు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న సర్వ సౌఖ్యాలకు ప్రకృతి వనరులు దహించి వేసి,కీడు ఉద్గారాలను భూగోళం మీదికి వదులుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 75శాతం వాటా ధనిక దేశాలదే! సహజ వనరుల విచ్చలవిడి వినియోగంతో తరుముకొస్తున్న ఈ ఉద్గారాల విపత్తు భూరక్షక హరిత వలయానికి చిల్లులు పెట్టి, ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈపాపం పూర్తిగా సంపన్న దేశాలది కాగా,దాని పర్యవసానాలకు బడుగు, వర్ధ మాన దేశాలు బలికావల్సి వస్తోంది.ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, పర్యావరణ పరిరక్షణలో తదనుగుణమైన పాత్ర వహించటానికీ ధనిక దేశాలు సంపూర్ణ సంసిద్ధతను వ్యక్తం చేయటంలేదు.అందువల్ల రోజుల తరబడి సదస్సులు జరిగినా తూతూమంత్రపు తలూపులతోనే అవి తంతుగా మిగిలిపోతున్నాయి.
కాప్‌`29 సదస్సులో వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నిలిచి,సంపన్న దేశాల నిర్దిష్ట బాధ్యతను గుర్తు చేశాయి.‘ఎంత హరిస్తున్నారో అంత భరించాలి’ అన్న న్యాయబద్ధమైన హితవుతో ఏటా 1.3లక్షల కోట్ల డాలర్లను పర్యావరణ రక్షణకు వెచ్చించాలని కోరాయి.కానీ,ధనిక దేశాల సన్నద్ధత 30వేల కోట్ల డాలర్ల దగ్గరే ఆగిపోయింది!ఈపాటిదానికి పన్నెండు రోజులపాటు పర్యావరణ హిత మంటూ ప్రపంచమంత రాగం తీయటం దేనికి?ఏదేశం ఎంత కాలుష్య కారక మవుతుందో,ఏదేశం ఎంతెంత పచ్చదనంతో ప్రపంచపు ఆరోగ్యానికి కారణమవు తుందో పక్కాగా లెక్కలను అనేక నివేదికలు ఘోషిస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు పర్యావరణ ధ్వంస సంపన్న దేశాలు హరిత సౌభాగ్యానికి తోడ్పడుతున్న వర్ధమాన దేశాలకు నిండుగా నిధులిచ్చి, ప్రోత్సహించటం అత్యంత అవసరమైన బాధ్యత. ఆ కనీస వివేచనను విడిచిపెట్టి, కొద్దిపాటి విదిలింపులతోనే సరిపెట్టటం, అదేదో తమ దాతృత్వ గుణానికి దాఖలాలా వ్యవహరించటం సబబు కాదు. పైగా ఈపాటి మాటకైనా ఆచరణ ఏమాత్రంగా ఉంటుందన్నది సందేహాస్పదమే! క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 10వేల కోట్ల డాలర్లు ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పు కున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదు.
ధనిక దేశాల పక్షపాత వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని వర్ధమాన దేశాలు గుర్తించి,గర్హించటం దాదాపు ప్రతి కాప్‌ సదస్సులోనూ జరుగుతోంది.ఈసారి కూడా తగిన మొత్తంలో పర్యావరణ నిధిని ఇవ్వాల్సిందేనని సంపన్న దేశాలను వర్ధమాన దేశాల ప్రతినిధులు నిలదీసిన ప్రతిసారీ హర్షధ్వానాలు మార్మోగాయి. ’’సంపన్న దేశాల వద్ద నిధులు లేక కాదుబీ అవి భౌగోళిక రాజకీయాలకు పాల్పడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది’’ అని కొలంబియా పర్యావరణ శాఖ మంత్రి సుశానా మహ్మద్‌ వ్యాఖ్యానించినప్పుడు ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సదస్సు నీడన సంపన్న దేశాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటానికి అనేక ప్రతిపాదనలను, ఒప్పందాలను ముందుకు తెచ్చాయి. క్లయిమేట్‌ ఫైనాన్స్‌ని అంతర్జాతీయ పెట్టుబడుల వ్యూహంగా మార్చే పన్నాగాలకు పదును పెట్టాయి. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులకు పెట్టుబడులు పెడతామంటూ కార్పొరేటు దిగ్గజాలు బరిలోకి దిగటం ఇందులో భాగమే! అసలు ప్రమాదాన్ని చిత్తశుద్ధితో ఎదుర్కోకుండా లాభార్జన దుర్బుద్ధితో వ్యవహరిస్తే భూగోళం మరింత రుజాగ్రస్తం అవుతుంది.ఈఎత్తుగడలను తుత్తనియలు చేస్తూ,సంపన్న దేశాల మెడ మీద బాధ్యతల కాడిని మోపటం వర్థమాన దేశాల ఉమ్మడి బాధ్యత.– గునపర్తి సైమన్‌

వాయు కాలుష్యంలో ఢల్లీి..ప్రమాద అంచన జనజీవనం

దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది.దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది.దేశంలో అత్యంత ప్రముఖలుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు.ఈఏడాది మళ్లీ కొరలు చాస్తోంది.వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది.కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపరితీసుకోలేకపోతున్నారు.కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది.విమానాలకు అంతరాయం కలుగుతోంది.సాధారణ జన జీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
దేశ రాజధాని ఢల్లీి నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢల్లీితో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఎన్‌.సి.ఆర్‌)అంతా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర రీతిలో పెరుగుతోంది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎ.క్యు.ఐ)వరుసగా మూడు రోజుల పాటు 500మార్కును దాటడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని అభివర్ణిస్తున్నారు.కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జెఎన్‌యు ఆన్‌లైన్‌బాట పట్టింది. అనేక ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమ లు చేస్తుండగా,తాజాగా ఢల్లీి ప్రభుత్వం సైతం 50శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది.పెద్ద సంఖ్యలో ప్రజానీకం రోగాల బారిన పడటం,రోడ్లన్నీ పొగతోనిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలురోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుకోవాలని సూచించింది.వీటన్నింటిని పాటించడం ఎందరికి సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలుగా భావించవచ్చు.ఈస్థాయి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం, ఆప్‌ సర్కారుకు సహాయ నిరాకరణ చేస్తుండటం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.వర్షాలు కురిస్తే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం! రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితే నెలకొన్నప్పుడు వాయుకాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరం. వాయు కాలు ష్యంతో ఢల్లీి ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది.అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పంజాబ్‌,హర్యానాతో పాటు ఢల్లీి పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబట్టే సంఘటనలు గత రెండు సంవత్సరాల్లో కొంత మేర తగ్గిన్నట్లు చెబుతున్నారు.అయినా కాలుష్యం తగ్గకపోగా, మరింతగా పెరుగుతోంది. దీంతో ఇతర కారణా లనూ అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.ఉదాహరణకు ఈ నెల 12వ తేది ఒక్కరోజే ఢల్లీి నగరంలో 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సి.ఎస్‌.ఇ) అక్టోబర్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఢల్లీి స్థానిక వాయు కాలుష్యంలో రవాణా రంగ వాటా సగానికి పైగా ఉందని తేలింది. 2021లో విడుదలైన ఒకనివేదిక ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం కూడా ప్రధాన కారణాలే! 30శాతం ఢల్లీి నగరంలో నగర పాలక సంస్థ సేవలు అందకపోవ డంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ తగల బెడుతున్నారు. ఈ పరిస్థితులే ఢల్లీిని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రెండు సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవు తుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. ఢల్లీి ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి.ఇప్పుడు కూడా ఈదిశలో కదల కపోతే, భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?
విషపూరితమైన గాలి,పొగ కమ్మేసి,ఏమీ కనిపించని పరిస్థి తులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరా ల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం,సురక్షిత స్థాయిగా భావిం చే గాలి నాణ్యత (ఏక్యూఐ)కన్నా దిల్లీ,చుట్టుపక్కల ప్రాం తాల్లో 30నుంచి35రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. నాసా అంతరిక్షం నుంచి తీసినశాటిలైట్‌ చిత్రాల్లో ఉత్త ర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది.దట్టమైన పొగతో విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)మానిటరింగ్‌ గ్రూప్‌ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ.అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబి తాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది.ఉష్ణో గ్రతలు పడిపోవడం,పొగ,దుమ్ము,చల్లని గాలులు, వాహ నాల నుంచి వచ్చే వ్యర్థాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థి తిని సృష్టిస్తాయి.భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనా భాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుక ున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషిత మవుతోంది.వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు. కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్‌ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తెలిపింది.గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచ నావేయడానికి శాటిలైట్‌ చిత్రాలపై ఆధారపడతారు. మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10,ఓజోనో, నైట్రోజన్‌ ఆక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటివి ఉన్నాయి. పీఎం 2.5లో 2.5మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ఈసూక్ష్మ రేణువులు మన రక్తనాళా ల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగి స్తాయి.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్‌ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది. ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగ లిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్‌ సాధ నం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రతినిధి అర్మన్‌ అరరా డియన్‌ చెప్పారు.
కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్‌ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది.వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండె క్స్‌ రీడిరగ్స్‌ ఉంటాయి.2001లో యూఎన్‌ ఈపీ,ఐక్యూఎయిర్‌ కలిసి తొలి రియల్‌ టైమ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్స్‌పోజర్‌ క్యాలి క్యులేటర్‌ను ప్రారంభించాయి.ఇది117 దేశాలకు చెందిన6,475మానిటర్ల నుంచి వచ్చే రీడిరగ్‌లను ఒకేసారి లెక్కిం చగలదు. ‘పీఎం2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు,శ్వాస,గుండెసంబంధమైన సమస్య లున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్‌ చెప్పారు.‘‘పీఎం2.5 రేణువులస్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభా లో ఎక్కువమంది ఆరో గ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడు తుంది.పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్య లకు గురయ్యే ప్రమాదముంది’’అని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసు కున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీరోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాం తాల్లో గాలికాలుష్యం భిన్నంగాఉం టుంది. బిజీగాఉన్న ప్రాం తాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కిం చడా నికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న మానిట రింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయా లని అరరాడి యన్‌ సూచించారు.
ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏఐక్యూ) వంద లోపు ఉంటే..ఆగాలి మనిషికి సురక్షితమై నది. ఏఐక్యూ 400నుంచి 500ఉంటే గాలి లో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురు గ్రామ్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్‌ 500కి దగ్గరలో ఉన్నాయి. 2021 లో యూఎన్‌ ఈపీ రిపోర్ట్‌ ప్రకారం,గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశం లా లేదు.అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించ డంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభు త్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్య లు తీసుకోవాలని,సమాచారంలో కచ్చిత త్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాల యాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలి పింది.
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు,ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీ నం చేస్తాయని,రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తా యని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లలు, వృద్ధులు, పోషకా హార లోపం,సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాస కోస సమస్యలు,గుండె సంబంధిత రోగాలు,గుండెపోటు, లంగ్‌ క్యాన్సర్‌ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.ఉదాహ రణకు ఆస్తమాపై ఓజోన్‌,సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రో జన్‌ డై ఆక్సైడ్‌ వంటివి ఊపిరి తిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవు తాయి.గర్భస్థ శిశువుల ఆరో గ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపం చవ్యాప్తంగా ఏటా70లక్షల మందితమ ఆయు ర్దాయం కన్నా ముందే చనిపోతు న్నారని డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధు లు,గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా,సీఓపీడీ,డయాబెటిస్‌,వంటి కారణా లతో మర ణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలి పింది. పొగా కు తర్వాత ఎక్కువ మరణాలకు కారణ మవు తోంది గాలి కాలుష్యమని, బహి రంగ ప్రదే శాల్లో గాలి కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని తెలిపింది.ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ప్లాట్‌ ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో దిల్లీ,చుట్ట పక్కల నగరాల్లో 81శాతం కుటుం బాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడు వారాల నుంచి కాలుష్యంవల్ల అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

కృత్రిమ మేథ ప్రపంచ భవిష్యత్తు

కృత్రిమ మేథ..ఇప్పుడిదే సర్వాంతర్యామి. ఇందుగలదందు సందేహం వలదన్న మాట కృత్రిమమేథకి సరిగ్గా సరిపోతుంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..అనగానే అదేదో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష,మనకు సంబంధం లేదనుకుంటాం.కానీ..తెల్లారి లేచిందగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉ ంటోంది.ఒక వస్తువైనా,సేవ అయినా కృత్రిమమేథని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది.అందుకే..విద్య నుంచి వైద్యం వరకూ,వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. విద్య,ఉద్యోగం,పాలనా రంగం..అసలు కృత్రిమమేథ ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు.ఉద్యోగుల హజరు నమోదు చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్‌తో మొదలుపెట్టి శాంతిభద్రతను పరిరక్షణకు,ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకూ పరిపాలనలో కృత్రిమమేథ ఎప్పడో ప్రవేశిచింది.
పిల్లలు బడికెళ్లి చదువుకోవటానికి ఏఐతో ఏమిటీ సంబంధం అనుకుంటే పొరపాటే.మన విద్యారంగంలో ఏఐ మార్కెట్‌ విలువ గతేడాది 75వేల కోట్లు.అది ఏటా 40శాతం చొప్పున పెరుగుతుందట.ఆన్‌లైన్‌ చదువులు వచ్చాక,తరగతి గదిలో టీచరు చెప్పాల్సిన పాఠాలను రకరకాల ఆప్స్‌ ద్వారా ఫోన్‌ తెరమీద చెప్పడానికీ,ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకీ ఏఐ సాయం కీలకమవుతోంది.విద్యార్ది సామర్ధ్యాలనూ నైపుణ్యాలనూ బేరీజువేసి ఒక్కోక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ద తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
తప్పులేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడమెలా అన్న సందేహం అక్కర్లేదిప్పుడు.గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్‌ సాప్ట్‌వేర్‌ తోడుంటే అది సాద్యమే.ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పల్లేకుండా దరఖాస్తుని దిద్దిపెడుతుంది ఆ సాప్ట్‌వేర్‌.
కృత్రిమమేథ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు.రాయగలవు.మాట్లాడగలవు.మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి.కాబట్టి వాటికి ఆ పనులు అప్పజేప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో సృజనాత్మకత,ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన.అంటే,ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభజంగా మారనుందన్న మాట.!
1950ల నుండి కృత్రిమమేధస్సు(ఎఐAI)విషయంలో అనేక పరిశోధనలు జరిగి,అది సిద్ధించి… ప్రస్తుతం మానవజాతిచేతిలో ఒక కొత్తసాధనం సమకూరింది.నవంబర్‌ 2022లో విడుదలైన చాట్‌ జిపిటి దీనికి ఒక తాజా ఉదాహరణ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ భవితవ్యం ఏమి కానుంది అనే చర్చ కూడా మొదలయింది.ఇది కార్పొరేట్‌ ప్రపంచానికి అందివచ్చిన ఫాసిస్టు ఆయుధం అని కొందరు వ్యాఖ్యానించారు.కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలు,ముఖ్యంగా కంప్యూటర్‌ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సులో జరిగే ప్రక్రియలను అనుకరించడం.డేటాసేకరణ,డేటాఎంట్రీ,కస్టమర్‌ ఫోకస్డ్‌ బిజినెస్‌, ఇ-మెయిల్‌ ప్రతిస్పందనలు,సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌,ఇన్వాయిస్‌ జనరేషన్‌ వంటి యాంత్రికంగా పునరా వృతం చేసే సాధారణ(రొటీన్‌)పనులను ఆటోమేషన్‌చేసి పనిలో విసుగుదలను తగ్గించి మనిషి మరింత సృజనా త్మకంగా చేసుకోవాల్సిన పనులకు సమయం కల్పిస్తుంది.
పరిశ్రమల ఉత్పత్తులను పెంచడం,పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చేయడం, రవాణా సౌకర్యాలను సముచితంగా నిర్వహించటం,విద్యబోధన,ఆరోగ్య సంరక్షణ,వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల కోసం అవసరమైనమార్పులు సూచిస్తుంది.పేదరికం,ఆకలికి వ్యతిరేకంగా పోరాడటం లో కూడా సహాయపడుతుంది.ఆరోగ్యసంరక్షణలో ఎఐ,వ్యాధి నిర్ధారణను మెరుగుపరచడానికీ,కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికీ సహాయపడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణలతో సహా ఔషధాలలో పురోగతికి ఇది తోడ్పడుతుంది.విద్యరంగానికి ఇదిమరింత ఆకర్షణీయమైన,అద్భుతమైన అభ్యాస అనుభ వాలను అందించగలదు.వర్చువల్‌,ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీలవల్ల పరస్పర సంభాషణా రీతిలోను (ఇంటరాక్టివ్‌’,బోధనలో పూర్తిగా లీనమయ్యే పద్ధతిలోనూ (ఇమ్మర్సివ్‌) నేర్చుకోవడం జరుగుతుంది. చదువుకోవటం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది.
కృత్రిమ మేధ సమాజంలోను,దైనందిన జీవితంలోను అనేక మార్పులు తెస్తోంది.సిరి,గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు,ఇతర పరికరాలతో అనుసంధానించబడి అనేక రకాల పనులనుచేస్తుంది. మన జీవితాలను సులభతరం,సౌకర్యవంతం,సౌఖ్యవంతం చేస్తుంది.కాకుంటే మానవులు యంత్రాలపై ఆధారపడటం మరింత పెరుగుతుంది.అది సోమరితనానికి దారి తీస్తుంది.పనిలో సృజనాత్మకత,భావోద్వేగం లేకపోవడం వంటి లోపాలు వుంటాయి.అంతేకాక సమాజపరంగా కొన్నినష్టాలు కూడా సంభవిస్తాయి.చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు.ఎక్కువగా సమాచార కార్మికుల ఉద్యోగాలకు,వైట్‌-కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు వస్తుంది.కృత్రిమమేధ సాంకేతికపరిజ్ఞానం – (బప్పా సిన్హా,/ఆంజనేయ రాజు)

ప్రాణాలు తోడేస్తున్న రక్తహీనత

మన్యంవాసులు పోషకాహారానికి దూరమవుతున్నారు.సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గిరిజన తెగలకు చెందిన పిల్లలు,బాలింతలు,గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారు.ఈపరిస్థితి వారికి ప్రాణసంకటంగా మారింది.నీరసించి నిస్పత్తువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయినా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పాడేరు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పీటీజీ గిరిజన తెగలకు చెందిన వారు తీవ్ర పోషకాహార సమస్యతో సతమవుతున్నారు.తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గిరిజన కుటుంబాల్లోని పసిప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్నాయి.ఏటా మరణాలు నమొదువుతున్నా ప్రత్యేక పోషకాహార సరఫరా,వైద్యసేవల కల్పనపై ఎటువంటి చర్యలు కానరావడం లేదు.చాలా గ్రామాలకు అంగన్‌వాడీ వ్యవస్థ కూడా విస్తరించడం లేదు.

అంగన్‌వాడీలే ఆధారం..
ఏజెన్సీలో అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారమే చిన్నారులకు,బాలింతలకు ఆధారం.అయితే వీటిద్వారా అరకొరగానే పోషకాహారం సరఫరా జరుగుతోంది.పర్యవేక్షణ లేకపోవడంతో పంపిణీ అస్తవ్యస్థంగా ఉంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు,గుడ్లు,పంపిణీ సవ్యంగా జరగడం లేదు.నెలరోజులుగా పూర్తిగా పోషకాహారం అందడం లేదు.దీంతో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు.పిల్లలకు పాలు ఇచ్చేం దుకు కూడా గిరిజనులకు పాడి పశువులు లేకుండా పోయాయి.మన్యంలో ఆహార పంటలు బాగా తగ్గిపో యాయి.దీంతో ప్రస్తుతం గిరిజనులకు రాగి అంబలి, కోటా బియ్యమే ప్రధాన ఆహారంగా ఉన్నాయి. పప్పు దినుసులు,ఇతర పోషకాహారం అందుబాటులో లేని కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి గిరిజ నుల ప్రాణాలకు ముప్పు కలుగు తోంది.ఏటా ఏజెన్సీ లో సంభవిస్తున్న మరణాలకు కారణం పోషకాహార లోపమేనని వైద్యులు చెబుతు న్నారు.రేషన్‌ దుకాణా ల్లో నాణ్యమైన సరుకులు అందని పరిస్థితి.అంగన్‌ వాడీలు, పాఠశాలలో మధ్యాహ్నా భోజనం,ఆశ్రమ పాఠశాలల్ల్లో విద్యార్థులకు మెనూలో కూడా సరైన పోషకాహారాన్ని అందించ లేకపోతున్నారు. ఏజెన్సీ లోని కొన్ని మండలాల్లో గతంలో ఐటీడీఏ పోషకా హార కేంద్రాలను నిర్వహించినప్పటికీ కొన్నాళ్లకే పరిమితమైంది.గిరిజనుల ఆహార భద్రతపై నిర్ధష్టిమైన కార్యాచరణ ఐటీడీఏ చేపట్ట లేదు.
దిగజారిన జీవన ప్రమాణాలు..
మన్యంలో సుమారు 1.80లక్షలగిరిజన కుటుం బాలు ఉన్నాయి.3,574 గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజన జనాభా ప్రస్తుతం6లక్షలు దాటి ఉంది.సగానికి పైగా గ్రామాల్లో గిరిజన కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో ఇబ్బందు లకు గురవుతు న్నారు.ఫలితంగా పోష కాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒకపూట అంబలి,ఒకపూట గంజి అన్నం తిని జీవనం సాగిస్తున్న గిరి జన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిత్య వసర ధరలు అధికం కావడంతో పేద గిరిజన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి.
గుడ్లు,పాలు సరఫరా లేదు..
సంపంగి గరువు గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రంఉంది.ఇక్కడకు ప్రతి నెల సరుకులు రావడంల లేదు.ముఖ్యం గా గుడ్లు,పాలు సరఫరా సరిగ్గా లేదు. జనవరి నెలలో 8రోజులే గుడ్లు ఇచ్చారు. ఈనెలలో ఒక్కరోజు కూడా గుడ్లు అంది వ్వలేదు.బాలింతలకు ఏడు నెలల వరకు పోషకాహారం ఇస్తున్నారు.కూరగాయలు, పాలు,గుడ్లు,పప్పు దినుసులకు కొరతగా ఉంది.ఎప్పుడైనా సంతకు వెళ్లినప్పుడే తెచ్చుకుంటాం.` మజ్జిప్రమీల,సంపంగి గరువు గ్రామం.
గిరిజన ప్రాంతాలకు 125బహుళ ప్రయోజన కేంద్రాలు..
గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రాంతాలకు ఆదివాసీ తెగలు(పీటీజీ) గిరిజన పిల్ల లకు పాఠశాల భవనాలు,అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సేవల నిమిత్తం వారు నివసించే గూడేల్లో ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభు త్వాలు నిర్ణయించింది.ప్రాథమిక పాఠశాల,అంగన్‌ వాడీ కేంద్రం,వైద్య ఉపకేంద్రం ఒకేచోట నిర్వహిం చేలా మల్టీపర్పస్‌ సెంటర్ల(బహుళ ప్రయోజన కేంద్రా లు)నిర్మాణానికి చర్యలు చేపట్టింది.పీఎం జన్‌మన్‌ పథకం కింద ఆదివాసీ గిరిజనులు నివసించే ప్రాంతాలకు 125 కేంద్రాలనుమంజూరు చేసింది. దీని కోసం ఇప్పటికే రాష్ట్రానికి రూ.75కోట్లు విడు దల చేసింది.వచ్చే ఏడాది మార్చినాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించింది.వీటిలో రెండు నెలల క్రీతం 72 కేంద్రాల నిర్మాణానికి రూ.43.20కోట్లు విడుద ల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు.త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు.తాజాగా మిగతా 53కేంద్రాల నిర్మాణా నికిరూ.31.80కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామారాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఈకేంద్రాలు మంజూరయ్యాయి.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్‌
రాష్ట్రంలో 924గిరిజన ఆవాసాల్లో అభివృద్ధి కార్యక్ర మాల అమలుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు తయారు చేశారు.దేశంలో గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృ ద్ధిపై దృష్టిసారించిన కేంద్రం-రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాద నలు గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది.ఏజెన్సీలు,మైదాన ప్రాంతా ల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో4జీ సర్వీసులు,అన్ని గ్రామాలకు వందశాతం విద్యు దీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు,విద్య,ఆరోగ్యం, జీవనోపాధి,నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్ట నుంది.దీనికి రాష్ట్ర నిధులు లేకుండా కేంద్రమే మొత్తం నిధులు కేటాయి స్తుంది.ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్‌ జాతీ య ఉన్నత్‌ గ్రామ అభియాన్‌గా మార్చింది.రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది.ఈ పథకం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తం గా రూ.79,156కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలి పింది.పథకం వివరాలను ముసాయిదా రూపంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 17మంత్రిత్వశాఖ లు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నాలుగు కమిటీలు వేయాలని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అపెక్స్‌ కమిటీపథకం అమలును పర్య వేక్షిస్తుంది.దీంతో పాటు రాష్ట్ర, జిల్లా,మండల స్థాయి ల్లో కమిటీలు మౌలిక సదుపాయాలు,ఇతర పనుల ప్రతిపాదనల్ని నోడల్‌ విభాగమైన గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పంపించనున్నాయి.పీఎంజుగా కార్యక్ర మాలకు ప్రత్యేక విధివిధానాలు త్వరలో జారీ చేస్తా మని వెల్లడిరచింది.గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్‌ పేరిట నూరుశాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొంది.
కేంద్రం చేపట్టే పనులు : కరెంటు లేని గిరిజన ఆవాసాల్లో కుటుంబాలు, ప్రభు త్వ విభాగాలకు విద్యుత్తు సౌకర్యం, రహ దారుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఏజెన్సీ ప్రాంతా ల్లో 5కి.మీ.మైదాన ప్రాంతాల్లో 10కి.మీ.దూరంలో హెల్త్‌సెంటర్‌ లేకుంటే సంచార మెడికల్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. గిరిజన కుటుంబాలకు ఆయు ష్మాన్‌ భారత్‌ వైద్య బీమా కార్డుల పంపిణీ చేస్తుంది. గిరిజన రైతుల సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపు.పశుపోషణ కార్యక్రమాలు చేపడతారు.
కొత్త అంగన్‌వాడీలకు రూ.12 లక్షలు : రాష్ట్రంలో ఇప్పటివరకు అమలైన పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియా న్‌ కింద81గిరిజన ప్రాంతాల్లో అంగన్‌ వాడీ కేంద్రాల నిర్మాణానికి మహిళాశిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిం ది.పాత నిబంధనల ప్రకారం కేంద్రం 60,రాష్ట్రం40శాతం నిధులు భరించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుంది.గిరిజన ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.12లక్షల చొప్పున నిధులివ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల ఉన్నతీకరణకు రూ.లక్ష చొప్పున అందిం చనుంది.ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యని వివరించారు.గర్భిణులు, బాలింత లకు అమలవుతున్న పథకాలు,పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై చంద్ర బాబు సమీక్ష చేశారు.2014లో ప్రవేశ పెట్టిన బాలామృతం,అమృతహస్తం, గోరు ముద్ద,గిరిగోరుముద్ద,బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను అధికారు లను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో మొత్తం 55,607అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అందులో ప్రధాన అంగ న్వాడీ కేంద్రాలు48,770ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837ఉన్నాయని అధికా రులు తెలిపారు.ఇందులో గిరిజన ప్రాం తాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలుఉన్నా యని వివరించారు. గునపర్తి సైమన్‌

భూ కబ్జా నిరోధిక చట్టం`2024

‘‘ ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.రాష్ట్రంలో ఇష్టానుసారం ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా, అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్‌ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని అన్ని భూములకు రక్షణ : ప్రభుత్వ, ప్రైవేటు భూములు అక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం-1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం-2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.’’
ఏపీలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాదారులకు భారీ జరిమానా,14ఏళ్లు జైలుశిక్ష వేయనుంది.ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి.
పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్‌ : ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం -1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -2024 అమలుకు బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీని ప్రకారం పాత చట్టంలోని ప్రభు త్వ,ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం,ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం,నకిలీ పత్రాలతో రిజిస్ట్రే షన్లు చేయడం వంటి వాటిని నిరోధించేది.ఇప్పుడు ఈ చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.పాతచట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితం అవ్వగా, దాని ద్వారా రూ.5వేల వరకుజరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేవారు.కానీ కొత్త చట్టం రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోని భూములు రక్షణకు వీలుం టుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14ఏళ్ల వరకు జైలు శిక్ష, పరిహారం,భూమి విలువతో పాటు జరిమానా విధించనున్నారు.దీనికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయ నున్నారు.నిర్ణీత కాలంలో కేసులు పరి ష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఎ.పి.భూ దురా క్రమణ(నిషేధం)చట్టం-1982కంటే గట్టిచట్టం తెస్తు న్నందున,ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న ఆచట్టాన్ని రద్దు చేస్తున్నామ న్నారు. పాత చట్టానికి,కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ‘1982’యాక్ట్‌ అప్పటి ఉమ్మడి ఎ.పి.లోని అర్బన్‌ ప్రాంతా లకు పరిమితంకాగా,‘2024’బిల్లులో రూర ల్‌,అర్బన్‌ సహారాష్ట్రంమొత్తానికీ వర్తి స్తుం ది.అప్పుడూ ఇప్పుడూ ల్యాండ్‌ గ్రాబర్‌ అనే దానికి నిర్వచనం మక్కికి మక్కికి దించారు. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌,చారిటబుల్‌, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరా లుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభి యోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్షఅన్నారు.జైలు శిక్షను ఐదేళ్ల వరకు వేయొచ్చు.ఐదు వేలరూపా యల జరిమానా కూడా అన్నారు.కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుం డా జైలు శిక్ష అన్నారు.పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విస్తరించవచ్చు అన్నారు. కబ్జాకు గురైన ఆస్తి మార్కెట్‌ విలువను జరిమానాగా వేస్తారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. ఆ కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. సర్కారు ఎప్పుడైనా ఆ పని చేయొచ్చు.1982 జూన్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తదుపరి ఆగస్టులో అసెంబ్లీలో బిల్లు పెట్టింది. 1982 ఆగస్టు 10న ఆ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సిపిఎం అగ్ర నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే,ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలువస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను,జడ్జిల నియామకాలను బతకనిస్తారా, ఆగ్యారంటీ బిల్లులో లేదని నిలదీశారు.రద్దు చేసిన చట్టంలో ఏముందో, కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది.ఇక్కడే ప్రభుత్వ నైజం అర్థమవుతుంది.నాలుగు న్నర దశాబ్దాలలో పరిస్థితుల్లో మార్పొచ్చింది. అదానీ వంటి వారు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్‌ కోర్టులను, జడ్జిలను రద్దు చేయిస్తారు.చట్టంలో పొందుపర్చిన ఈ లొసుగు ముందు ల్యాండ్‌ గ్రాబ్‌ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి,డిఎస్‌పి స్థాయి కి తక్కువ కాకుండా అధికారితో దర్యాప్తు చేయించాలి, ఆర్నెల్లలో విచారణ పూర్తి కావాలి అనేవి చాలా చాలా చిన్నవి.
మతలబు ఇదే : బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరి మానా అన్నారు.కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్‌ విలు వను గ్రాబర్‌ నుంచి వసూలు చేస్తామంటు న్నారు. ఇక్కడ మార్కెట్‌ విలువంటే రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఉండే బుక్‌ వాల్యూనా లేదంటే బహిరంగ మార్కెట్‌లో క్రయవిక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్‌వాల్యూనే అయితే గ్రాబర్‌కే లాభం. గ్రాబింగ్‌ చట్టబద్ధమై పోతుంది.అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవు తుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి.బిల్లులో ఆ అంశం లేదు. అందువల్లనే కొత్త చట్టం ఆర్థికంగా,రాజకీయంగా బలవంతులైన పెద్ద వాళ్లకు,కార్పొరేట్లకు చుట్టం అవుతుందని సందేహిం చాల్సి వస్తుంది. ప్రభుత్వ,ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్‌ గ్రాబర్ల కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్‌ గ్రాబర్‌ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులవుతారు. ప్రభుత్వ,ఎండోమెంట్‌,వక్ఫ్‌ భూములను ఎకరమో, రెండె కరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణ దారులై శిక్షలకు గురవుతారు.కొంతమంది పెద్దలు ప్రభు త్వ భూములను ఆక్రమించి ప్లాట్లువేసి దర్జాగా అమ్ముకుం టున్నారు.చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు.ఎవరు ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నారో వారు గ్రాబర్‌ అయిపోతారు తప్ప అక్రమంగా భూము లను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుం టారు. ఒక వేళ భూ దురాక్రమణ ఆరోపణలొచ్చినా వ్యవస్థలను మేనేజ్‌ చేసే పలుకుబడి అటువంటి పెద్దలకు ఎలాగూ ఉంటుంది. అపరాధులయ్యేది పేదలు, చిన్న వాళ్లే.అందుకే పేదలకు,చిన్న చిన్న వారికి కొంత వరకు మినహాయింపులుండాలి.ప్రభుత్వ అభ్యంతరాల్లేని నివాసా లకు ప్రభుత్వం కొంత విస్తీర్ణ పరిమితి పెట్టి పట్టాలిస్తోంది. అనధికారిక బిల్డింగ్‌లను రెగ్యులరైజ్‌ చేస్తోంది. అలాగే చట్టంలో పొందుపర్చాలి.పెద్దలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి.అటువంటి సదుద్దేశం బిల్లులో కనిపించదు. పాత చట్టం ఉన్నా ఆచరణలో పేదలకు,సామాన్యులకు నష్టం జరిగింది. అర్బన్‌ ప్రాంతాల్లో యథేచ్ఛగా పెద్దల ఆక్రమ ణలు సాగిపోయిన అనుభవం ఉండనే ఉంది. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కబ్జాలు, వీరంగాలు రోజూ చూస్తున్నవే. ఆ కారణం గానే 2024-ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టంపై పేదల్లో, ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి.
అసైన్డ్‌లో జరుగుతున్నదేంటి? :1977-అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణల సమయం లోనూ ఎస్‌సి,ఎస్‌టి,పేదలు నష్టపోతారన్న భయాలు వ్యక్తమయ్యాయి. ఆచరణలో నిజం అయ్యాయి కూడా.1977-చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములు అమ్మడం,కొనడం నిషి ద్ధం.2019లో టిడిపి ప్రభుత్వం దిగిపోయే ముం దు అసైన్డ్‌ ఇళ్ల స్థలాలు పొంది 20 సంవ త్సరాలు దాటితే ఒరిజనల్‌ ఎస్సయి నీలకు సర్వ హక్కులూ కల్పిస్తూ చట్టం తెచ్చింది. అమరావతి ప్రాంతంలో ఐదేళ్ల గడువుపై చట్టానికి ప్రయత్నించగా నాటి గవర్నర్‌ అంగీకరించలేదు. అదే దారిలో ఐదేళ్ల కాల పరిమితి పెట్టి సర్వ హక్కులూ అంది వైసిపి సర్కారు.కోర్టులు అంగీక రించకపోయే సరికి అసైన్డ్‌ వ్యవసాయ భూములకు 20ఏళ్లు, ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితి పెట్టి జగన్‌ సర్కారు సవరణ చట్టం తెచ్చింది.ఈచట్టం పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా కార్యక్షేత్రంలో చూస్తే అసైన్‌ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన,ఆక్రమించిన,బెదిరించి లాక్కున్న పెద్ద లకే ఎక్కువగా ఉపయోగ పడుతోంది. ఈ పూర్వరంగంలో ప్రస్తుత ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం)చట్టంకూడా అంతే.ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం) చట్టంపై ప్రజల్లో సందే హాలు,భయాందోళ నలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏపక్షంగాచట్టం చేయబూను కోవడం ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే ప్రభుత్వా నిది సదుద్దేశం అనిపించు కుంటుంది. చట్టాన్ని అమలు చేసే ముందైనా అన్ని పక్షాలతో చర్చలు జరపాలన్న డిమాండ్‌ సహేతుక మైనది.ఎలాంటి చర్చలు,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేసే చట్టం ఆచరణలో నిలబడదు. అప్పటికి తాత్కాలిక రాజకీయ కక్షలకు ఉపయోగపడితే పడ వచ్చు.ప్రధానంగా పేదప్రజలకు నష్టం జరగకూడదు. పేదల పక్షాన,వారి హక్కులకోసం పోరాటాలు, ఉద్యమా లు నిర్వహించే సంస్థలపై,వ్యక్తులపై అణచివేత, నిర్బంధా లకు ప్రభుత్వానికిచట్టం ఆయుధం కాకూ డదు.అప్పుడే ‘మంచి ప్రభుత్వం’ అవుతుంది.
ఎవరి కోసం భూ ఆక్రమణల (నిషేధ) చట్టం?
భూకబ్జాలను అరికట్టడానికి,కబ్జాదారులకు కఠిన దండన విధించడానికి ఆంధ్రప్రదేశ్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది.జులై 15న జరిగిన క్యాబినేట్‌ సమావేశం అనం తరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మీడియాకు తెలియజేశారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020 ఆధారంగా త్వరలోనే కొత్త చట్టం తెస్తా మని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,దేవదాయ, వక్ఫ్‌ భూములను ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కబ్జా చేశారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.భూ కబ్జాదారులను శిక్షిస్తే ప్రజాతంత్ర వాదులందరూ హర్షిస్తారు. కాని ఈ చట్టం మాటున పేదల పోరాటాలను అణచివేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు హర్షించరు.
మనరాష్ట్రంలో స్వాతంత్య్రానంతరం వామ పక్షాలు,ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా భూ సీలింగ్‌ చట్టం,కౌలుదారీ హక్కుల చట్టం,1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు వచ్చాయి. పాలకవర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యమాలకు తలొగ్గి దళిత,గిరిజన, బలహీ న వర్గాలకు చెందిన సుమారు 25లక్షల పేద కుటుం బాలకు 33లక్షల ఎకరాల భూమి ప్రభుత్వాలు పంపిణీ చేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. వీటిలో సుమారు 15లక్షలఎకరాల భూమిని పిఓటి 9/77చట్టాన్ని ఉల్లం ఘించి ప్రజా ప్రతినిధులు,రాజకీయంగాను,ధనబలం, కండ బలం కల్గిన నాయకులు అక్రమంగా,దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు2006 నుండి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.కాని రాష్ట్రంలో పిఓటియాక్ట్‌ (భూనిషేధ చట్టం) ప్రకారం ఆక్రమించుకున్న వారిపై 6 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించాలి,ఆక్రమించుకున్న భూములను తిరిగి పేదలకు ఇవ్వాలి. ఈ చట్టం చేసిన నాటి నుండి (1977) నేటి వరకు కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలే రాష్ట్రాన్ని పాలించాయి. కాని ఇప్పటి వరకు ఒక్క భూకబ్జాదారుని మీద కూడా కేసు పెట్టి జైలుకు పంపలేదు.జరిమానా విధించి వసూలు చేయలేదు. కనీ సం ఒక్క పేదవానికైనా తిరిగి భూమిని ఇప్పించారా? అంటే ఎక్కడా అమలు జరిగిన దాఖలాలే లేవు. అసైన్డ్‌ చట్టం ప్రకారం పేదల భూమి పేదలకివ్వాలని ఆందోళన చేసిన ప్రజా సంఘాలు, సామాజిక సంస్ధలు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, పేదలపై క్రిమినల్‌ కేసులు,రౌడీషీటర్‌ కేసులు పెట్టి జైళ్ళకు పం పారు. వారు నేటికీ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క భూ కబ్జాదారుడు కూడా జైలుకు వెళ్ళలేదు. వేలాది ఎకరాలను పెద్దలు, ఉన్నతాధికారులు ఆక్రమించుకున్నా రని,వీటిని తిరిగి తీసుకోవాలని కోనేరు రంగారావు భూ కమిటి, ప్రజాసంఘాలు చెప్పినా ఏఒక్కరి నుండి ఒక్క ఎకరం భూమికూడా స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వ లేదు. ఏ కోర్టూ శిక్షించలేదు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తామని చెబుతున్న భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 కూడా అలాగే మిగులుతుందా! ఉన్న చట్టాలనే అమలు చేయకపోగా కొత్తచట్టాలను తెచ్చి అమలు చేస్తా రంటే ఎలా నమ్మగలం? గుజరాత్‌ తరహాలో చట్టం తెస్తామని చెప్పారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చట్టం 2020 అక్టోబర్‌ 9 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(4) ప్రకారం ఎవరైనా భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నా లేదా డబ్బు ఆశ చూపి వేరే వారి నుండి ఆక్రమించుకున్నా,చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా,భూమిపై అనధికారికంగా,అక్ర మంగా అద్దె (డబ్బు)వసూలు చేసినా లేదా భూఆక్ర మణ లకు సహాయం చేసినా,ప్రోత్సహించినా,వారి పక్షాన నిలబడినా భూఆక్రమణదారుల కిందకి వస్తారు. అటు వంటి భూములను కౌలుకి తీసుకున్నా, ఆ భూములలో పేదలు పని చేసినా నేరస్తులుగా పరిగణించబడతారు. నేరం రుజువైతే 10నుండి 14ఏళ్ళ జైలు శిక్ష, ఆ భూమి విలువను బట్టి జరిమానా విధించబడుతుంది.సెక్షన్‌ 6 (1) ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించి పరిశ్రమ లేదా ఏదైనా కంపెనీ నిర్మించి ఉంటే కూడా శిక్షార్హులు.ఈ ఆక్రమణ తమకు తెలియకుండా జరిగిందని లేదా ఆక్రమణ జరగకుండా ఆపామని పరిశ్రమాధి పతులు రుజువు చేసుకుంటే శిక్ష నుండి మినహాయింపు ఇస్తారు.పైసెక్షన్లను బట్టి ఈ చట్టం ప్రకారం పెట్టుబడిదారులు, పారిశ్రా మికవేత్తలకు,పెద్దలకు శిక్ష విధించే కంటే కూడా చారెడు భూమి కోసం పోరాడే ప్రజా ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడానికే గుజరాత్‌ ప్రభుత్వం ఈచట్టం తెచ్చినట్లు కన్పిస్తుంది.
సెక్షన్‌ 7-న్యాయస్థానాల పాత్ర : రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సమ్మతితో ఒకటి లేదా ఎక్కువ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కోర్టులకు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తిని నియ మిస్తారు. దీనికి ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఉంటారు.ఈకోర్టులు భూ కబ్జాలను అరికట్టడానికి కలెక్టర్‌ నాయ కత్వంలో నియమించిన కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసినా లేదా కోర్టే సుమో టాగా చేపట్టినా లేదాఎవరైనా ఫిర్యాదుచేసినా చర్య లు తీసుకుంటారు.కేసు బనాయించబడ్డ వ్యక్తి పూర్తి ఆధారాలతో,రాత పూర్వకంగా తనే స్వయంగాకోర్టు ముందు ఆధారాలు సమర్పిం చుకోవచ్చు.నేరం రుజు వైతే జైలు శిక్షతో పాటు అతను లేదా వారు ఆక్రమిం చుకున్న భూమి ఆరోజు మార్కెట్టు విలువ ఎంతఉంటే అంత మొత్తం నష్ట పరిహారం చెల్లిం చాలి.అదే ప్రభుత్వ భూములైతే ఆక్ర మించు కున్ననాటి నుండి ఆక్రమణ దారులు ఎంత చెల్లించాలో కోర్టు నిర్ణయిస్తుంది.ఈ కేసుల న్నిటినీ 6నెలలలోపు పరిష్కారం చేయాలి. ఒక వేళకోర్టు పరిష్కరిం చకపోతే రాష్ట్ర ప్రభు త్వానికి నివేదిస్తుంది. –(కె.ఎస్‌.వి.ప్రసాద్‌,/వి.వెంకటేశ్వర్లు)

1 2