వలస కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు.సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడాకూలీపనులు వుండటం లేదు.కారణం ముఖ్యం గా వ్యవసాయంలో యంత్రాలు రావడం.పంటల సాగులో మార్పులు రావడం (ఉదా:డ్రమ్‌ సీడిరగ్‌ చల్లటం లాంటి పనులు).ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం.బయట రాష్ట్రాల నుండి (బెం గాల్‌,బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసా యేతర పనులకు వెళుతున్నారు.ప్రధానంగా ఇటుక బట్టీ పను లు,భవననిర్మాణపనులు,హోటళ్ళలో క్లీనింగ్‌ పనుల కు,అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహి ళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు.నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి.ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి. వలస కూలీల పరిస్ధితి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌,బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్టచేత పట్టుకొని మహిళలను,పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తు లు,డీలర్లు చూపిన పశువుల కొట్టాలు,పాడుబడిన ఇళ్లు,బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు.వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు.ఒకఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ. 4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలంరూ.3200,రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద(గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి,కూరగాయలు,ఆటో ట్రాన్స్‌ పోర్టు) మధ్యవర్తులు,డీలర్లు కాజేస్తున్నారు.ఒక్క నెల్లూరు జిల్లా లోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది.స్ధానిక కూలీలు 2లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతాకూడా రైతాం గం బెంగాల్‌ కూలీలచేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి – (పుల్లయ్య మంగళ/ఆకారపు మల్లేశం)

గొంతెండుతున్న …మన్యం

వేల కోట్లు అందుబాటులో ఉంటున్నా వేలాది మంది సిబ్బంది ఉన్నా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం డోలీ కష్టాలు వెంటా డుతుండగా,మరోవైపు స్వచ్ఛమైన తాగునీటికి కూడా గిరిజనులు నోచుకోలేకపోతున్నారు.నీటికోసం కేం ద్రం నుంచి,రాష్ట్రంనుంచి భారీగానిధులు కేటా యిం పులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రారతాల్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలోనే ఏటా నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ల ద్వారా పనులకు నిధులు కేటాయిస్తున్నారు.విద్య, వైద్యం,ఆరోగ్యం,రోడ్లు,తాగునీరు,వ్యవసాయం వరటి అనేక రంగాలకు ఈ నిధులను కేటాయిస్తు న్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా పలు రంగా లకు నిధులు వస్తున్నాయి.ఇందులోనే తాగునీటి అవసరాలకు కూడా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈనిధులను మాత్రం సక్రమంగా ఖర్చు చేయ లేకపోతుండడంతో అనేక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికే ఊట నీటికి, చెరువుల్లో నీటికి,వాగుల్లో ప్రవహించే నీటికే పరిమితమవుతు న్నారు.దీనివల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తాజాగాఈ ఏడాది రాష్ట్రం లోని 9,934 గిరిజన ప్రారతాల్లో తాగునీటి కోసం 1,290కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమొత్తం పనులను జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేయా లనిప్రతిపాదిరచారు.ఈ నిధులతో మొత్తం 12, 838 పనులను గుర్తిరచి పనులు ప్రారంభించారు. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన ఫలి తాలు రావడం లేదు.ఇప్పటివరకు 5,718 పను లను మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2,582 పనులు పలుస్థాయిలోఉండగా, 4,5 38 పనులను ఇంకాప్రారంభించడమే జరగలేదు. ఇక మొత్తం నిధుల్లో కేవలం 218కోట్ల రూపాయ లను మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నీటివనరుల గుర్తింపులో అలసత్వం
గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ముందుగా నీటి వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అలసత్వం, జాప్యం చోటుచేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్న వనరుల నుంచి నీటిని స్వచ్ఛంగా మార్చడం కూడా సక్రమంగా సాగడం లేదను భావన వ్యక్తమవుతోంది. పనులపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని గతంలోనే నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలు కావడం లేదని తెలుస్తోరది.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో..
మన్యంలోని అధిక సంఖ్యలో గిరిజన గ్రామాల్లోని జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎండాకాలం రాకుండానే నీటి సమస్య పెరుగుతుంది.కానీ గిరిజ నుల దాహం కేకలు పాలకులకు వినిపించని పరిస్థితి నెలకొంది.దీంతో గిరి పల్లెల్లోని జనానికి నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపా యం ఉందనేది అధికారుల వాదన. కాగా ఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమిత మవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితు ల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడిరది.దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడంలేదు.ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదారు ణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టిం చుకున్న దాఖలాలు లేవు.దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతు న్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారప డాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలా లకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తు న్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊట గడ్డల నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీ లో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లాలో
ఇంటింటికీ కుళాయిలు వేసి..తాగునీటి కష్టాలు తీరు స్తామని ప్రభుత్వాలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితి భిన్నంగా ఉంది.పది రోజులుగా పార్వతీపురం మం డలంలోని 65గ్రామాలకు తాగునీరురాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్మశానాల్లో ఉన్నబోర్లు,ఊరి చివరనున్న పాడైన బావుల నీటితో గొంతు తడుపుకొంటున్నారు. మక్కువ మండ లండి.శిర్లాంలోని సువర్ణముఖి నది నుంచి పార్వతీపు రం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.ఇక్కడ ఇన్‌ఫిల్టర్‌ బావుల్లో మోటార్లు పదిరోజులు క్రితం పాడువడంతో 65 గ్రామాలకు సరఫరా ఆగిపోయింది.నర్శిపురం, బొండ పిల్లి ఎమ్మార్‌నగరం,డోకిశీల,ములగ తదితర గ్రామాల ప్రజలు ఒకటి,రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లు,బావులకు వెళ్లాల్సిన పరిస్థితి.-జి.ఎన్‌.వి.సతీష్‌

జమిలి ముచ్చట తీరేదెన్నడు..

జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమం టున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.లోక్‌సభ నుంచి పంచాయతీల వరకూ ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ జమలి ఎన్నికలపై దశాబ్దాలు గా జరుగుతున్న చర్చ మరోసారి ఉపందుకుంటోంది. కేంద్రం కోరుకుంటున్న వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ సాకారమయ్యేనా?అందుకు విపక్షాలు సహకార మందిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జమలి ఎన్నికలపై ప్రత్యేక కథనం..
లోక్‌సభ ఎన్నికలే అయినా..రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలు జరిగినా..పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా..ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది కేంద్ర ప్రభుత్వ వెర్షన్‌. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని ఈమాట ఇప్పటిది కాదు. ఆయన అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 2019 బీజేపీ మానిఫెస్టోలో కూడా పెట్టారు. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది.లా కమి షన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడు తోందని ప్రభుత్వం అంటోంది. అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే..ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెం టరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలు న్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి.కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని మోదీ భావిస్తే..అమలు పెద్దకష్టం కాదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.
సై అంటున్న తెలుగు రాష్ట్రాలు.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..ప్రధాన పార్టీలు జమిలి ఎన్నికలకు సై అంటున్నాయి.జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గతంలోనే తమపార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇక ఎలక్షన్స్‌ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేం దుకు రెడీగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.2019లో జరిగి న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే..అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. అప్పుడే జమిలీ ఎన్నికల అవశ్యకత గురించి ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ మినహా దాదాపుగా అన్నిపార్టీలు అంగీ కారం తెలిపాయి.వామపక్షాలు మాత్రం జమిలీ ఎన్నిక లను వ్యతిరేకిస్తున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా గతంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది.పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించే స్తామని చెప్పింది. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే..కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే రాజ్యాంగ సవరణ అంత కష్టమేమీ కాదు.
జమిలి కొత్తేంకాదు..కాగా, దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేంకాదు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి.జమిలీ ఎన్నికలు జరగాలి అంటే..ప్రధాని మోదీ,హోం మం త్రి అమిత్‌ షా అనుకోవాలి.ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. అందుకే జమలీ ఎన్నికలు జరుగుతా యని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. జమిలి ఎన్ని కలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్ల మెంట్‌ ఎన్నికలు జరగాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి,ఆ తరువాత పార్లమెంట్‌ ఎన్నికలు జరగడం గందరగోళం అవుతుంది. సంవ త్సరం మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరగడం వల్ల వ్యయం ఎక్కువ అవుతోంది, శ్రమ ఎక్కువైపో తుంది అన్న వాదన ఉంది.
5ఎన్నికలతో తేలిపోయింది.. అయితే 2023లో జమిలీ ఎన్నికలు నిర్వ హించాలి అనుకున్నప్పుడు యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు ఈసీ చర్యలు తీసుకునేది కాదు.ఒకవేళ 2023 జమిలి ఎన్నికలు అంటే ఎన్నికైన ఆఅయిదు రాష్ట్రాల ప్రభుత్వా లను ఏడాదిలో రద్దు చేస్తారా..?అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.ఒక వేళ జమిలి ఎన్నికలు పెట్టాలని భావిస్తే యూపీ,పంజాబ్‌,గోవా,మేగాలయ,ఉత్తరాఖండ్‌ ఎన్ని కల బదులు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేది.లేదా ఏడాదో రెండేళ్లో అసెంబ్లీని పొడిగిం చాల్సి ఉండెది.
వెయిట్‌ చేయక తప్పదా? 2025లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు 2024లో ఏపిలో ఎన్నికలు నిర్వహిం చకూడదు.ఇదే ప్రభుత్వాన్ని ఏడాది పాటు కొనసాగిం చాలి.ఒక వేళ 2029లో జమిలీ ఎన్నికలకు పోవా లంటే ఇప్పుడు జరుగనున్న అయి రాష్ట్రాల పదవీ కాలం అయిదేళ్లు 2027కు పూర్తి అవుతున్నందున ఈ రాష్ట్రాల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిం చాల్సి ఉంటుంది. ఇలా జమిలీ ఎన్నికలు నిర్వహిం చాలి అంటే పలు రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించాలి. మరి కొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని పెంచాల్సి ఉం టుంది.దీనికి ఆయా రాష్ట్రాల తీర్మానాలు తప్ప నిసరి. దేశ వ్యాప్తంగా29రాష్ట్రాలు ఉంటే కనీసం20 రాష్ట్రాల నుండి మేము జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి.ఆతరువాత పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి, లా కమిషన్‌ కు పంపించాలి. అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసర మైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలి.రాష్ట్రాలకు సంబంధం లేకపోతే కేం ద్రం తలుచుకుంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా పెట్టే యవచ్చు..కానీ దీనికి రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. ఇవన్నీ పరిశీలిస్తే జమిలి ఎన్నికలు జరగాలంటే మరికొంత కాలం వెయిట్‌ చేయక తప్పదనే అభిప్రా యం వినిపిస్తుంది.
‘జమిలి’ నిరంకుశం!
అన్నివైపుల నుండి వ్యతిరేకత వస్తున్నా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి (రాజ్యాంగ సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపంపైన, సమాఖ్యవాదంపైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే! రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాన్ని కేంద్ర పదవీ కాలంలోకి మార్చడం రాజ్యాంగానికి ద్రోహం చేయడ మేనని విమర్శించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే లోక్‌సభ ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.ఈ విష యమై ఓటింగ్‌ కోరగా269 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్పించడానికి మద్దతు ఇవ్వగా 198మంది సభ్యులు వ్యతిరేకిం చారు.బిల్లు అంతిమంగా నెగ్గడానికి మూడిరట రెండొంతుల మెజారిటీ అవసరం.కానీ ఆపరిస్థితి లేకపోయినా మోడీ ప్రభుత్వం బిల్లును బుల్డోజ్‌ చేయ డం నిరంకుశ పోకడలకు నిదర్శనం. ఏమైనప్పటికీ ప్రజెంటేషన్‌ దశలోనే తీవ్రవ్యతిరేకత రావడంతో బిల్లులను సం యుక్త పార్లమెంటరీ కమిటీకి పంపక తప్పలేదు.
సమగ్ర అధ్యయనం, విస్తృత చర్చల తర్వాతే బిల్లు తీసుకొచ్చామని,మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పా టు చేసిందని మంత్రి మేఫ్న్‌వాల్‌ లోక్‌సభకు సుతి మెత్తగా వివరించారు. కానీ,‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే భావన రాజ్యాంగంలోని ఫెడరలిజంతో సహా దాని మౌలిక స్వరూపానికి విరుద్ధం.‘బిల్లులోని నిబం ధనలు శాసన వ్యవస్థ అధికార పరిధిని ఉల్లంఘిం చేవిగా ఉన్నాయి.లోక్‌సభ పదవీకాలం ప్రకారం శాసనసభల పదవీకాలం నిర్ణయించబడదు. చట్టసభ లు విడివిడిగా ఉంటాయి. ఈ బిల్లుతో అధిక కేంద్రీక రణ అమలులోకి వస్తుంది.సభల కాలవ్యవధి, ఎన్నిక లు ఎప్పుడు నిర్వహించాలనే అధికారాలను ఎన్నికల కమిషన్‌కే వదిలేస్తున్నారు. అలా అయితే ఒక వ్యక్తి కోరిక నెరవేర్చడం కోసమేఈ బిల్లులను పెట్టినట్లు ఉంటుంది’ అన్న ప్రతిపక్ష ఎంపీలి విమర్శ అక్షర సత్యం. ఈ బిల్లుతో దేశ గణతంత్ర రాజ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌,మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబం ధించినవని, కానీ ఈ బిల్లుతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పెత్తనం కిందికి వెళ్లిపోతాయన్న సిపిఎం ఎంపి అమ్రా రామ్‌ ఆందోళన ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియు లందరిదీను. దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన భాష,తమదైన అధికార వికేంద్రీకరణ కలిగి ఉన్నాయి. వాటిపై రాష్ట్రాలకు గలహక్కును కేంద్రం ఎలా లాక్కొం టుంది? కానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీలు మూడూ ఈబిల్లును సమర్థించడం ఆత్మహత్యా సదృ శం. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుం దన్న మాట సర్వాబద్ధం.మోడీ సర్కారుకు ఊపిరి పోస్తూ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న జెడియు నుంచి ఎవరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడకపోవడం గమ నార్హం. ప్రస్తుతానికి పక్కన పెట్టినా పంచాయతీలు, స్థానిక సంస్థల ప్రాథమిక సూత్రమైన వికేంద్రీకరణ స్ఫూర్తికే పూర్తి విరుద్ధమైనది. కీలకమైన ‘స్థానికత’ మాయమవుతుంది కదా! గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అవగాహనకే ఇది విఘాతం. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో, పార్లమెంట్‌, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం. స్థానిక సంస్థలకు, వాటికి నిధులు, విధులు, అధికా రాల కల్పనకూ సాగిన ఉద్యమాలు, చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పాతర వేసే ఈజమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశం లో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొం టుంది. అది ఏక పార్టీ పాలనకూ ఆ తరువాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారి తీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్‌ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలి.
జమిలి పాట..రాజ్యాంగానికి పోటు..
పార్లమెంటు ఉభయ సభలూ ప్రస్తుతం అతి కీలకమైన రెండు అంశాలపై చర్చ తలపెట్టాయి. ఇందులో ఒకటి నడుస్తుండగా మరొకటి నిర్ణయం కావలసి వుంది.నిజానికి ఈ మూడూ పరస్పర సంబంధం లేనివేమీ కాదు. బిల్లు తీసుకు వస్తామం టున్న మార్పులు చేర్పులు గానీ రాజ్యాంగ మూల స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనవి.వాటిని జనంతో మింగిం చేందుకే ఏవో వేడుకలు, ఉత్సవాలు, చర్చలు అంటూ మాయ నాటకం నడిపిస్తున్నారు. అదానీకి సంబం ధించిన ఆరోపణలతో సహా పలు కీలకాంశాలు దాట వేసేందుకు కూడా ఈప్రహసనం తీసుకొచ్చారని చెప్పాలి.ప్రభుత్వం తరపున లోక్‌సభలో చర్చలో పాల్గొ న్న సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యాం గంలో నిబంధనలను గురించిగాక ఏకగ్రీంగా ప్రక టించిన రాజ్యాంగ ప్రతిని ప్రశ్నించడంతో మొద లు పెట్టారు. రాముడు సీత విగ్రహాలతో ఏవో మత చిహ్నాలు వుంటే వాటిని లేకుండా చేశారని ఆరెస్సెస్‌ చిరకాల ఆరోప ణలు సభలో వల్లెవేశారు. రాజ్యాంగ నిర్మాతలు కోవిదు లైన వారిని గౌరవించకపోగా దాంట్లో భారతీయత ఏ మాత్రం లేదని తిట్టిపోసిన ఆరెస్సెస్‌ భావ ప్రవక్తలైన వినాయక దామోదర సావర్కర్‌, జనసంఫ్న్‌ వ్యవస్థా పకుడైన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వంటి వారి పేర్లు జపించారు.మత రాజకీయాలను ఆ నాడే తిరస్క రించిన భగత్‌సింగ్‌ను తమ ఖాతాలో వేసుకుని మాట్లా డారు. ఇందిరా గాంధీ కుటుంబాన్ని విమర్శిం చే పేరిట నాటి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని స్వాతంత్ర పోరాట విలువలను తిరస్కరించే బిజెపి, ఆరెస్సెస్‌ బాణీయే ఈ చర్చలో అడుగడుగునా గోచరిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్‌,ఎస్‌పి, సిపిఎం తదితర పార్టీలు ప్రజా స్వామ్యం, లౌకిక విలువలు, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు హాని కలుగు తున్న తీరును ప్రస్తావిస్తే వారికి మహా కంటగింపుగా వుంటున్నది. అడుగడుగునా అడ్డు తగులుతూ చర్చను రచ్చగా మారుస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున వయనాడ్‌ నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం కూడా ఈ అంశంపైనే కావడం విశేషం.
జమిలి జుమ్లా
ఇప్పటికే కేంద్ర క్యాబినెట్‌ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెల్పింది గనక సోమవారం నాడు న్యాయ శాఖా మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ దాన్ని సభలో ప్రవేశ పెడతారని ప్రకటించారు. ఈ లోగా వీలైన ప్రతి చోటా బిజెపి, ఎన్‌డిఎ నాయకులు దానికి మద్దతు ప్రకటిస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొ స్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జమిలిని బలపరుస్తున్నదని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు బిల్లు ఆమోదించినా 2029లోనే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన కొత్త సవరణ ప్రకటించారు. మరోవంక దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోని వైసిపి మాత్రం రాజ్యాంగ కోణం కన్నా తమకు తొందరగా మళ్లీ ఎన్నికలు వస్తాయన్న ఆనందంతో పొంగిపో తున్నది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ జమిలికి సిద్ధంగా వుండాలంటుంటే వారి మీడియా, ఆ పార్టీ ప్రతినిధులు కూడా జమిలి జపమే చేస్తున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ కూడా సూటిగా స్పందిం చకుండా మరింత స్పష్టత రావాలని చెబుతున్నది. కానీ వాస్తవానికి రేవంత్‌ సర్కారు గడువుకు ముందే తొలగిపోతుందనే ఆనందం వారిలో తొంగి చూస్తు న్నది. ప్రాంతీయ పార్టీలుగా ఈమూడూ సమాఖ్య విధానానికి రాజ్యాంగస్ఫూర్తికీ పూర్తి విరుద్ధమైన ఈ మార్పును గట్టిగా వ్యతిరేకించాల్సింది పోయి తాత్కాలిక దృష్టితో మాట్లాడటం దురదృష్టకరం. చంద్ర బాబు నాయుడు బిల్లు ఆమోదించినా ఎన్నికలు రాబో వని నమ్మకంగాచెబుతున్నారంటే మోడీ తీరు, ఆరెస్సెస్‌,బిజెపి రాజకీయాలు ఆయనకు తెలియ వనా? ఎన్‌డిఎలో చేరే నాటికే వారి విధానాలు ఇలానే వుంటాయని చంద్రబాబు వంటి వారికి బాగా తెలుసు. ఏమైనా అధికారం కోసం మోడీతో రాజీపడి ఆయన హుకుంలను ఆమోదించక తప్పదని తల వంచు తున్నారు.బిజెడి,అకాలీదళ్‌,ఎఐడిఎంకె,లోక్‌ జనశక్తి వంటివి బలపర్చాయని నివేదిక చెబుతున్నది. బిఆర్‌ ఎస్‌,ముస్లింలీగ్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌,వైసిపి,టిడిపి వం టివి అధికారికంగా సమాధానమివ్వలేదట.డీఎంకె, ఆప్‌,ఎస్‌పి,వంటి ప్రాంతీయపార్టీలతో పాటు కాంగ్రెస్‌, సిపిఎం,సిపిఐ,బిఎస్‌పి,ఎస్‌పి వంటివి గట్టిగా వ్యతిరేకి స్తున్నాయి.చిన్నా పెద్ద కలిపి 32 పార్టీలు బల పరు స్తుంటే 15వ్యతిరేకిస్తున్నాయని లెక్క చెబు తున్నారు. గతంలో కొంత బలపర్చిన పార్టీలు కూడా ఇప్పుడు వ్యతిరేక వైఖరి తీసుకున్నాయని దీనిపై నివేదికనిచ్చిన కమిటీ అధ్యక్షుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడిరచారు.ఈ నివేదికను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్‌ ఆదిశలో ముందుకు పోవాలని నిర్ణయిం చింది.ఇందుకు సభలో ఎన్‌డిఎ సంఖ్యా బలం సరిపో తుందా అనేది ఒకటైతే రాజ్యాంగపరంగా ఇది చెల్లుతుందా అనేది మరొకటి.
మాజీ రాష్ట్రపతి సేవలు
దేశానికి రాష్ట్రపతి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినట్టు లెక్క. అలాంటివారికి తదుపరి కాలంలో మరో బాధ్యత అప్పగించడం గతంలో ఎరగనిది. కానీ మోడీ సర్కారు మాజీ సిజెఐలతోపాటు రాష్ట్రపతులను కూడా రంగం లోకి దింపడం చూస్తున్నాం.2023లో విడుదల చేసిన ఉన్నత స్థాయి కమిటీ నియామకం ఉత్తర్వు 11019/3/23లో కోవింద్‌కు జమిలి ఎన్నికల నిర్ణయం అమలును చర్చించమన్నారే గాని సిఫార్సు కోసం ఆ కమిటీని వేయలేదు.పైన చెప్పుకున్న రాజ్యాంగ నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకమైన నిర్ణయం. రాజ్యాంగం 75(3)అధికరణం లోక్‌సభ పదవీ కాలాన్ని,164(1)శాసనసభల పదవీ కాలాన్ని విడివి డిగా పేర్కొంటున్నది. సభ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించి వుండరాదంటున్నది. 83(2) లోక్‌సభ విషయంలోనూ,172(1) శాసన సభల విషయంలోనూ ఇతరేతరంగా రద్దు కాకపోతే మాత్రమే అయిదేళ్ల పదవీ కాలం అంటున్నాయి తప్ప కాల పరిమితి లేదు.వీటిలో దేనికి దానికి స్వంత అస్తిత్వం ఏర్పాటు ముగింపు రద్దు అవకాశాలున్నాయి. 83వ అధికరణం లోక్‌సభ కాలపరిమితినీ, 85 రద్దు అవకాశాన్ని చెబితే 172వ అధికరణం శాసనసభ గడువునూ 174 రద్దునూ చెబుతున్నాయి. రాష్ట్రాలకు అదనంగా 356 కింద రాష్ట్రపతి రద్దు చేసే మరో అధికరణం వుంది. ఆ తర్వాత ఆరు మాసాల లోపు మరో సభసమావేశం కావాలని వుంది. దీని అర్థమే టంటే రాజ్యాంగ నిర్మాతలు కృత్రిమంగా సభలను పొడిగించాలని గానీ, ప్రజల ఆమోదం (ఎన్నికలు) లేకుండా పాలన నడిపించాలని గానీ ఎంతమాత్రం కోరుకోలేదు.పైగా 1967 వరకూ లోక్‌సభ శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరిగాయంటే దానికి కార ణం కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం వుండటమే. తర్వాత కాలంలోనూ ప్రతిపక్ష ప్రభుత్వాలను కేంద్రం నిరం కుశంగా రద్దు చేయడం వల్లనే రెంటికీ మధ్య అంత రం వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు కూట ములు అయిదేళ్లు తప్పక కొనసాగుతాయనే గ్యారంటీ వుందా? కానీ ఆ పేరిట కృత్రిమంగా పొడిగించడం అంటే ప్రజల ఆమోదం లేని పాలన రుద్దడమే.
అంతా ఒకే పెత్తనమా?
ఒకే దఫా ఎన్నికల ఖర్చు ఎన్నికల్లో గెలవని పాలన సాగి ప్రజాధనం గల్లంతవుతుంది. దీనివల్ల రూ.5,000కోట్లు ఆదా అవుతాయని జిడిపి పెరుగు తుందని తాడూ బొంగరం లేని కథలు చెబుతు న్నారేగానీ బాధ్యత లేని పాలన వల్ల ఎన్ని వేల కోట్లు దారి తప్పుతాయో వేరే చెప్పాలా? ఒక చిన్న ఇంట్లో అందరి పెళ్లిళ్లు అందరి చదువులు ఒకేసారి జరగవు గానీ ఇంత పెద్ద దేశంలో అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలనడం ఏంతర్కం? ఏం ఇంగితం? కేంద్రం లో ప్రభుత్వాలు నాలుగు సార్లు కూలిపోయాయి. మరో రెండు సార్లు ముందే ప్రధాని ఎన్నికలకు వెళ్లారు. మరి ఇలాంటి సమయాల్లో అన్ని రాష్ట్రాలలో అనవస రంగా సభల రద్దు ఖర్చు తగ్గిస్తుందా పెంచుతుందా? ఈదేశాన్ని రాష్ట్రాల కలయిక అని రాజ్యాంగం చెబుతుందే గానీ కేంద్రీకృత ఏకరూప అని చెప్పడం లేదే? ప్రపంచ బ్యాంకు లేదా అంతర్జాతీయ పెట్టుబడి చెప్పే ప్రపంచీకరణ విధానాలు ఒకే విధంగా అమలు చేసే ఏకీకృత మార్కెట్‌గా రుద్దడం కోసమే దీనిపై ఇంత హడావుడి. అదే విధంగా ఏకరూప మెజార్టీ మతతత్వ నిరంకుశత్వంతో రాష్ట్రాలను మండలాల స్థానిక సంస్థల స్థాయికి దించే సంఘపరివార్‌ కుట్ర కూడా.అందుకే మలి దశలో స్థానిక సంస్థల ఎన్నిక లను కూడా ఈ పరంపరలో కలపడమంటే అర్థం అదే.ఒకే పన్ను,ఒకే రేషన్‌,ఒకే చట్టం,ఒకే విద్య, ఒకే మతం,ఒకే బిజెపి,ఒకే మోడీ అన్నదాని పరాకాష్ట. వీరు ఇది అధ్యక్ష తరహా పాలనను రుద్దే ప్రయాణం లాంటిదే. అలా రాజ్యాంగం రెండుసార్లు మార్చుకున్న శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా మళ్లీ వెనక్కు రావలసి వచ్చింది.ప్రపంచంలో భారత దేశం లా ఇన్ని భాషలు, విభిన్నతలు గల దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టదగినన్ని కూడా లేవు. అటు మార్కెట్‌ ఇటు మతతత్వం అవసరాల కోసం ఆరాటపడటమే గానీ చిన్నవీ పెద్దవీ కలిపితే 28 రాష్ట్రాలు గల ఈ దేశంలో ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. స్థిరత్వం జపం వాస్తవంలో మరింత అస్థిరతకూ మరింత ఆర్థిక భారానికి దారితీస్తుంది.15 రాజ్యాంగ సవరణలు చేయాలి. రాష్ట్రాలలోనూ ఆమోదించాలి. ఇందుకు లోక్‌సభలో 362కావలసి వుంటే 299 ఎంపీల మద్ద తు మాత్రమే వుంది.ఎటూ చేరని వారు 19.ఇక రాజ్యసభలో 164 మంది మద్దతు కావాలంటే 125 బలం మాత్రమే వుంది.24 మందిది అటూ ఇటు కాని మధ్యే మార్గం,ఈ పొందికలో తుది ఫలితం ఏంటనేది ఒకటైతే రాష్ట్రాలలో చాలా చోట్ల ఎన్‌డిఎ అధికారంలో లేదు. కనుక పార్లమెంటులో బిల్లు ఆమో దం పొందడం కూడా గగనమే గనక పార్టీలను తిప్పు కునే పథకాలు కుట్రలూ కూడా జరుగుతాయి. ఏమైనా రాష్ట్రాల హక్కులనూ ప్రజల ఎన్నుకునే హక్కును కూడా కాపాడుకోవడం ఇక్కడ కీలక సవాలు. తమ తాత్కాలిక అవసరాల కోసం వైసిపి, బిఆర్‌ఎస్‌ వంటివి ఆహ్వానించడం,టిడిపి భాగస్వామిగా మారడం అవాంఛనీయం.
జగడపు ధన్‌ఖర్‌
ఇక రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఈపరిణామాల కొనసాగింపే. ఎందు కంటే రాజ్యసభ మౌలికంగా రాష్ట్రాల సభ (రాజ్యం అంటే రాష్ట్రం).కానీ జగదీప్‌ ధన్‌ఖర్‌ వచ్చాక రాజును మించిన రాజభక్తుడిలా మోడీని మించి ఆరెస్సెస్‌ను కీర్తించడం,ప్రతిపక్షాల పీకనొక్కడం నిత్యకృత్య మైంది. దీన్ని నిరసించిన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతి ఒక్కరితో ఆయన వాదనలు పెట్టుకుని అవమానిస్తున్నారు. కనుకనే అనివార్యంగా ఆయనపై అవిశ్వాసం నోటీసునిచ్చాయి.దానిపైన కూడా తగాదా పెట్టుకోవడం ధన్‌ఖర్‌కే చెల్లింది. అయితే ఆతీర్మా నాన్ని అనుమతిస్తారా లేక ఏవో సాకులతో నిరాకరి స్తారా అనే సందేహాలున్నాయి.లౌకిక ప్రతిపక్షాలు మోడీ సర్కారు కుట్రలకూ ఒత్తిళ్లకు తల వంచకుండా ఐక్యంగా నిలబడితే ఈకుట్రలను ఛేదించడం సాధ్య మవుతుంది.ఏమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయంగా తీవ్రమవుతున్న ఘర్షణనే పార్లమెంటు ప్రతిబింబిస్తున్నదని చెప్పాలి.
(వ్యాసకర్త : ఇండిపెండిరట్‌ జర్నలిస్టు`న్యూఢల్లీి)-(ప్రకాశ్‌ యాదవ్‌జీ)

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతి

ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. ఈమె వివాహానంతరం ఇంట్లోనే విద్యాభ్యాసం ప్రారంభించారు.1847లో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందారు.1848లో భర్త జ్యోతిరావు ఫూలేతో కలసి పూణేలో అణచివేతకు గురవుతున్న బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇది మొదట తొమ్మిది మంది బాలికలతో ప్రారంభ మైంది.తర్వాత పూణె,సతారా,అహ్మదానగర్‌లలో మరికొన్ని పాఠశాలలు స్థాపించారు.ఈమె పాఠ శాలకు వెళ్లేటప్పుడు సనాతన చాందసవాదుల కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను మార్గ మధ్యలో ఆపి అసభ్యకరమైన పదజాలంతో దూషించి,రాళ్లతో దాడి చేసి,పేడ నీళ్ళు చల్లి అవమానించేవారు.అయినా సరే వెనుకడుగు వేయలేదు. తన సంచిలో అదనంగా మరో చీర పెట్టుకెళ్లి పాఠశాల దగ్గర మార్చుకు నేవారు.వారు మొక్కవోని దీక్షతో ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు.బాల్య వివాహాలను వ్యతిరేకించారు.చిన్న వయసులో వివాహం చేయటం వలన ప్రసవించే శక్తి లేక అనేకమంది బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని,చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతు వులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందనే వాదన దృఢంగా వినిపించారు.వితంతువులను హీనంగా చూస్తూ, గుండు గీయించి తెల్ల చీర కట్టించి, వారిని అశుభ సంకేతంగా చిత్రించేవారు.ఆ దురా చారాన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వి వాహాల్ని ప్రోత్సహించడమే గాక,దగ్గరుండి చేయించారు.వితంతు గర్భిణీల కోసం 1853లో ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు దగ్గరుండి చూసేవారు. వితంతు మహిళలకు గుండు గీసే పద్ధతి పోయేందుకు కృషి చేశారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు.కులాంతర వివా హాలను ప్రోత్సహించారు.1852లో మహిళా హక్కులను మహిళలకు తెలియజేసేందుకు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ‘మహిళా సేవా మండల్‌’ ఏర్పాటు చేశారు. కార్మికులు,గ్రామీణ పేదలు కోసం జ్యోతిరావు ఫూలే 52 ఆహార కేంద్రాలను తెరిచారు. వీటన్నిం టిని ఆమె చూసుకునేవారు.వారిరువురూ ఏర్పా టు చేసిన బోర్డింగ్‌ పాఠశాలలను దగ్గరుండి చూసుకునే వారు.1863లో సంఘ బహిష్కృతులైన తల్లీపిల్లల కోసం శరణాలయం స్థాపించారు. ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సేవ చేసే వారు.జ్యోతిరావు ఫూలే స్థాపిం చిన సత్య శోధక్‌ సమాజ్‌ని ఆయన మరణా నంతరం ఈమె నడిపారు.ఈ రకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా నిలబడిన ధీర వనిత సావిత్రి బాయి ఫూలే. స్త్రీల అభివృద్ధి కోసం తెగువతో నిలబడిన వీర వనిత.ప్లేగు వ్యాధిగ్రస్తు లకు సేవ చేస్తూ తను కూడా ఆవ్యాధి బారినపడి 1897 మార్చి10న తుదిశ్వాశ విడిచారు సావిత్రి బాయి ఫూలే.భారత దేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రలో రాజరామమోహన్‌రాయ్‌ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్‌,కందుకూరి వీరే శలింగం పంతులు వంటి వాళ్ళ పేర్లతోతో పాటు జ్యోతిరావ్‌ ఫూలే వినబ డటానికి,కనబడటానికి చాలా కాలమే పట్టింది.దానికి కారణం ఆయన కులం ఒక్కటే కాదు.కుల వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఆయన చేపట్టిన సంస్కరణోద్యమ స్వభావం మౌలి కంగా భిన్నమైనది కావటం మరొక ముఖ్య కారణం. ఇక మహా పురు షుల భార్యలుగా స్త్రీలు ఎప్పుడూ చరిత్ర నీడలలో మిగిలిపోయే వాళ్ళే. జ్యోతిరావ్‌ ఫూలే భార్య సావిత్రి బాయి గురించి చాలాకాలం తెలియక పోవటానికి అది అదనపు కారణం.స్త్రీల దళిత బహుజనుల అస్తిత్వ ఉద్య మాలు ఊపందుకొన్న 1980ల నుండి సమాజపు చివరి అంచులకు నెట్టివేయబడిన వర్గాల ఆలో చనా విధానాలతో,ఆచరణ కార్యకలాపాలతో దేశీయ సామాజిక రాజకీయార్థిక చరిత్రను, సంస్కృతిని సమగ్రం చేయటం,సరిచేయటం అన్న లక్ష్యాలతో సాగుతున్న కృషిలో భాగంగానే గానే జ్యోతిరావ్‌ ఫూలే గురించి,ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే గురించి మనకు తెలిసి వచ్చింది.సావిత్రిబాయి ఫూలే ది జ్యోతి రావ్‌ ఫూలే భార్యగా అతని సంస్కరణోద్యమ కార్యకలాపాలకు సహాయకారి పాత్ర మాత్రమే కాదు. అన్నింటిలో ఆమె సహ భాగస్వామి.భారత దేశంలో మహిళాఉద్యమ చరిత్రకు తాత్విక భూమికను ఏర్పరచిన క్రియాశీల శక్తి.ఆలోచన,ఆచరణ మనిషి మౌలిక లక్షణాలు అని ఆమె నమ్మింది.ఆమె ఆలోచనలు కవిత్వ రూపంలో ఆవిష్కృతమయ్యాయి.ఆచరణ ఆమె జీవితం.సావిత్రిబాయి జీవితం,కవిత్వం రెండూవర్తమానాన్నిఅర్ధం చేసుకొనటానికి, భవిష్యత్తును నిర్మించుకొనటానికి ఉత్ప్రేరకాలు. 1870లలో ఏస్త్రీవిద్యకోసం అయితే..ఆంధ్ర దేశంలో వీరేశలింగం పంతులు ఒక మహో ద్యమాన్ని నడిపాడో,కాలక్రమంలో బాలికా పాఠశాలలో బోధకులుగా స్త్రీలు ఉండాలని గుర్తించాడో,ఆ మేరకు వితంతు మహిళలు విద్యావంతులై,ఉద్యోగాలలోకి రావాలని ఆశిం చాడో దానికి మూడు దశాబ్దాలకు ముందే అంతకంటే ఉన్నత రూపంలో జ్యోతిరావ్‌ ఫూలే ఇంట ప్రారంభమైన ‘నిశ్శబ్ద విప్లవం’సావిత్రీ బాయి అనే శక్తిగా ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర సంస్కరణోద్యమంలో ఆమెది కీలక పాత్ర. కుల లింగ వివక్షలకు వ్యతిరేకంగా పని చేసే పురుషులనే సహించని సంప్రదాయ సమాజం కుటుంబ పరిధిని దాటి సమాజాన్ని మరమ్మత్తు చేయటానికి బయటకు వచ్చే స్త్రీలను అసలే సహించలేదు.అనేక రంగాలలో స్త్రీల కృషిని నిరోధించటానికి,నియంత్రించటానికి వ్యతిరేక ప్రచారాలకు,భౌతిక దాడులకు,అత్యాచారాలకు పాల్పడుతున్న పితృస్వామిక అధికార వికృతి మనకు తెలిసిన వర్తమానమే.కొదురుపాక రాజవ్వ నుండి,భన్వారీ బాయి,సోనె సోరీ వరకు ఎందరో అందుకు ఉదాహరణలు. అలాంటప్పుడు నూటా యాభై సంవత్సరాల క్రితం ఆడపిల్లలకు చదువు చెప్పటానికి,అందులోనూ శూద్ర,అతి శూద్ర బాలి కలకు చదువు చెప్పటానికి బయటకు వచ్చిన సావిత్రీ బాయిని రాళ్లు రువ్వి,కుళ్ళిన కూర గాయలు,పేడ విసిరి వేధించారంటే ఆశ్ఛర్య పడవలసినది ఏమీ లేదు.వాటిని తన పనికి అభినందనగా విసరబడే పూలగా భావిస్తూ, వాళ్ళ చర్యలవల్ల పాడై పోయిన చీరను మార్చుకొన టానికి మరొక చీర కూడా వెంట తీసుకువెడుతూ ఆమె కనబరచిన,నిబద్ధత,సంసిద్ధత గొప్ప విలువలు.సంప్రదాయ సమాజ నియమాలను తిరగరా యాలని జ్యోతిరావ్‌ ఫూలే ప్రారంభించిన ఉద్యమం తండ్రికే భరించరానిదై ఇంట్లో స్థానంలేదని బెదిరిస్తే సావిత్రి బాయి ఫూలే భర్త మార్గమే తన మార్గమని అతని తో కలిసి అడుగు బయట పెట్టింది.అప్పటికి ఆమె వయసు పద్దెని మిది.అప్పటి నుండి1897లో 66ఏళ్ల వయసులో మరణించేవరకు సావిత్రీ బాయిది సమాజ జీవితమే.ఆడ పిల్లలకు,మహర్‌,మాంగ్‌ వంటి అతిశూద్ర పిల్లలకు మాత్రమే కాదు,వయోజను లకు పాఠశాలలు ఏర్పరచటం నుండి,వ్యవసాయ కార్మికులకు (1855)రాత్రిబడి నడపటం వరకు మహారాష్ట్రలో ఆధునిక విద్యావ్యాప్తికి ఆమె చేసిన కృషి గణనీయమైంది.బాలికల చదువుకు బడులు పెడితే సరిపోదని,ఆడపిల్లలను బడికి పంపటానికి ఇంటి నుండి బడికి ఉండే దూరం ఒకఅవరోధం అని గుర్తించి,దానిని అధిగమించటానికి ఇంట్లోనే ఒక వసతి ఏర్పాటు చేసి స్వయంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకొన్న వ్యక్తి సావిత్రి బాయి.దయ ,ప్రేమగల తల్లిగా ఆమె ఆ పిల్లల హృదయాలలో చోటు సంపాదించుకొన్నది.అంటరానివారిగా బహిష్కృతులు అయినవారి కోసం తన ఇంటి ఆవరణలో బావి తవ్వించినా(1868) కరువు పీడి తులకు ఉచిత భోజన శాలలు ఏర్పరచి (1877) ఆకలి తీర్చినా,ప్రాణాలనే బలిపెట్టి ప్లేగు వ్యాధి గ్రస్తుల స్వస్థతకు పాటు పడినా అన్నీ ఆ దయ, ప్రేమగల తల్లి లక్షణం వల్లనే. సావిత్రి బాయి ఫూలే శూద్ర అతిశూద్ర బాల బాలికల విద్యకు ఎంత పాటుపడిరదో,అంతగా నూ స్త్రీల సమస్యల పై పనిచేసింది. సర్వ మానవ హక్కులు అనుభవిస్తూ స్త్రీలు ఆత్మ గౌరవంతో జీవించటాన్ని గురించి కలకంటూ 1852లో మహిళా సేవా మండల్‌ స్థాపించింది. ఆనాడు సమాజంలో ఉన్న అతితీవ్ర సమస్య వితంతు స్త్రీల దుర్భర జీవితం. అదీ బ్రాహ్మణులలోనే ఎక్కువ. సావిత్రీ బాయి చేపట్టిన సంస్కరణోద్యమంలో తొలుత సంబోధించ బడిరది అదే. వింత తువులకు తల గొరిగించటం అమానుష ఆచారంగా ఆమె భావించింది.బాధిత స్త్రీలను దానికి వ్యతిరేకంగా సమీకరించటం తక్షణం జరిగే పని కాదు అని ఆమెకు తెలుసు. కానీ తమ శరీరం మీద స్త్రీల హక్కులను ఖబ్జా చేసిన సంప్రదాయం పట్ల అవసరమైన అసహనం ఆమెను నిలువ నీయలేదు. మంగలి వారిని ఏకం చేసి ‘వితంతు స్త్రీల తలలు గొరగము’అనే నినా దంతో సమ్మె కట్టించి తన నిరసనను ఆరకంగా ప్రకటించింది. ‘తలలు బోడులైన తలపులు బోడులౌనా’అని వేమన అన్నట్లుగా వితంతు స్త్రీల తల వెంట్రుకలు తీసేసినంత మాత్రాన వాళ్లలో వయో సహజ వాంఛలను అరికట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు.అది వాళ్ళను చాటుమాటు లైంగిక సంబంధాలకు ప్రేరేపిస్తుంది.యవ్వనానికి వచ్చి పుట్టింటనో అత్తింటనో ఆశ్రయం పొందిన వితంతువులు ఇంట్లోని పురుషులో ,తరచు ఇంటికి వచ్చిపోయే బంధుమిత్ర పురుషులో పెట్టె ప్రలోభాలకు లోనై గర్భవతులు కూడా అవుతుం టారు.బిడ్డలను కనాలని ఉన్నా పరువు ప్రతిష్ఠ లకు లోబడి,లోక నిందకు వెరచి గర్భస్రావాలకు పాల్పడతారు. నాటు మందులతో అధిక రక్త స్రావంతో మంచాన పడి యాతన అనుభవి స్తుంటారు.గర్భస్రావ ప్రయత్నాలు ఫలించకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డలను అక్రమ సంతానంగా అవమానించే సామాజిక పరిస్థి తులలో పెంచి పోషించుకొనే స్థోమత లేక వదిలించుకొనటమో వధించటమో వాళ్లకు అనివార్యమవుతుంది.శిశుహత్య నేరం నిరూపితమై శిక్షించబడే స్త్రీలు కూడా ఉంటారు. 1881లో సూరత్‌లో ఉరిశిక్ష విధించబడిన విజయలక్ష్మి అనే బ్రాహ్మణ స్త్రీ అలాంటి స్త్రీలలో ఒకరు.ఆకోర్టు తీర్పును తప్పు పడుతూ స్త్రీకి ఒకరకంగా,పురుషు డికి ఒకరకంగా అమలవుతున్న నీతిని,న్యాయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ 1882లో తారాబాయి షిండే ‘స్త్రీ పురుష తులన’ అనే వ్యాసం రాసింది.అది ఆనాడు గొప్ప సంచ లనం కలిగించిన విప్ల వాత్మక చారిత్రక పత్రం.అయితే అప్పటికి 19 ఏళ్లకు పూర్వమే ఈ సమస్య తీవ్రతను గుర్తించి సావిత్రిబాయి కార్యరంగంలోకి దిగటం గమనించదగినది.కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు బిడ్డను కని లోకానికి భయపడి చంపి బావిలో వేసిన నేరానికి జీవిత ఖైదు శిక్ష విధించబడగా అందుకు కలవర పడిన జ్యోతిరావ్‌ ఫూలే దంపతులు అలాంటి ఒంటరి స్త్రీలకు ఆశ్రయం కల్పించి పురుళ్ళు పోసి నైతిక మద్దతు ఇయ్యటానికి 1863లోనే ‘బాలహత్యా ప్రబంధక్‌ గృప్‌ా’ ఏర్పాటు చేయటం విశేషం.‘అండమానులో జీవితఖైదు తప్పించుకొనటానికి మార్గం’ అంటూ ఆసంస్థను గురించి ప్రచారం చేసిన తీరులో స్త్రీల పట్ల వాళ్ళ ఆర్తి కనబ డుతుంది.ఈ ప్రసవాల యంలో వదిలి వేయ బడిన శిశువుల కోసమా అన్నట్లుగా ఆసంవత్సరమే అనాధ శరణాలయం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు.జ్యోతిబా ఫూలే సాహచర్యం లోనూ,ఆయన మరణానం తరం కూడా అలుపెరుగని,ఆడంబరం లేని కార్య నిర్వహణా దక్షురాలుగా సావిత్రి బాయి సార్ధక జీవితం గడిపింది.నిజమైన అర్ధంలో ఆమె ‘జాతిమాత’ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. శూద్రుల పరావలంబనం ఆమెకు ఖేద హేతువు. ‘శూద్రులు ,అతి శూద్రులు అజ్ఞానంచేత వెనుక బడ్డారు’ పుట్టుకకు కారణం తల రాత అనుకొన టం ఫలాన్ని ఆశించ కుండ చాకిరీచేస్తే స్వర్గంలో పుణ్యం లభిస్తుందన్న బోధనలను నమ్మటం ఆ అజ్ఞానానికి కారణం అని ఆమెకు తెలుసు. అజ్ఞానంలో మగ్గి పోతున్న వాళ్ళ పట్ల ఆర్తి ‘శూద్రుల పరావలంబనం’ కవితలో కనిపిస్తుంది. ‘శూద్రులంటే’ అన్న కవిత శూద్రుల ఆత్మభిమాన ప్రకటన. – డాక్టర్‌.ప్రియాంక గంగరాపు

వైవిధ్యాన్ని ప్రొత్సహిద్దాం..

‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచి వేయా లని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలనిచూస్తే నేను చిన్న మతం వైపు నిలబడ తాను. ఆమై నారిటీ మతంలో కులాలు ఉం డి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆఅణచివేతకు గురయ్యే కులం వైపు నిలబ డతాను.ఆణిచి వేతకు గురైన కులంలో ఒక యజ మాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏస్థితిలో ఉన్నా అది నా శత్రువు!’అంటాడు పెరియార్‌ ఇ.వి. రామస్వామి. భారత దేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవా హంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టు కొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతులసంగమం మనదేశం. అనేక సాంప్ర దాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్నిదాటి, భూస్వాములఅరాచ కాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధా నంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసు కొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యా న్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లు తున్న వేళ..న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కు ల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
థీమ్‌..
ఈఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్‌ ’’వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,హక్కులను పరిర క్షిం చడం!’’ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాట లేదు.కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యం లో ఈథీమ్‌ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి..మనిషి రక్తాన్ని మరిగినప్పుడు-ఈ దుష్ట సంస్కృతిని,నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ..‘మేమూ మనుషులమే..ఈ గడ్డలో మేమూ భాగమే..మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు,కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్‌ చేస్తూ..అణచివేస్తుంటే.. ఆఅణచివేతను,ఆనిరంకుశత్వాన్ని ఎదిరించే పోరా టాలే మానవ హక్కులయ్యాయి.ఏదేశంలోనైనా హక్కు ల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విష యమే.‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే..వారిమానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటా డు నెల్సన్‌ మండేలా.జాతీయత,మతం,వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజ మంతటికీ లభించే సమానత్వం,గౌరవం,స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా,అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడిరది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడిరది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా1992,డిసెంబర్‌ 18వతేదీని పరిగ ణిం చింది.మతము,జాతి,భాషా,లింగం,సంస్కృతి పరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తిం చాల్సిందిగా ప్రకటించింది.మనదేశంలో కూడా డిసెం బర్‌ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌ఎంసి -1992) నియమించింది.2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్‌ (ప్రమోటింగ్‌ డైవర్సిటీ అండ్‌ ప్రొటెక్టింగ్‌రైట్స్‌)వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కు లను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్‌ మనదేశంలోని ముస్లింలను (14.2) క్రైస్తవులను (2.3),సిక్కులను (1.7),బౌద్ధులను(0.7),పారశీలను(0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం,సమన్యాయం అందించడం రాజ్యాంగ బద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు’’ఒక దేశంగొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడు తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’.ఈరోజు మతం పేరు తో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగు తుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవ హత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది.హిజాబ్‌, హలాల్‌, అజాన్‌, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డో జర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయ మైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005,మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్‌ రాజేందర్‌ సచ్చార్‌ నాయకత్వాన ఒకకమిటీ వేయడం జరిగింది. ఈదేశంలో ముస్లిం మైనార్టీలు,విద్యా,ఉపాధి, ఆర్థిక పరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధా నంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధా న్యత నిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా,ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్‌ షిప్‌,విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభు త్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటం కాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విష యంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్ల లను బడి మాన్పించి,పనుల్లోకి పంపడం జరుగు తోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహా లకు దారితీస్తుంది.- (యం.డి.షకీలా బేగం)

మన జాతి రత్నం లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

భారతదేశానికి రెండో ప్రధానమంత్రి,భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి,భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు లాల్‌బహదూర్‌ శాస్త్రిగారి జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను ఈకథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్టోబరు రెండవ తేదీ భారత ద్వితీయ ప్రధాని శ్రీలాల్‌ బహుదూర్‌ శాస్త్రిగారి జన్మదినం.1904వ సంవత్సరం అక్టోబరు2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జన్మించిన లాల్‌బహదూర్‌‘జైజవాన్‌జై కిసాన్‌’ నినాదంతో దేశాన్ని మేల్కొలిపి చ్కెతన్యం రగిలించిన ధన్యజీవి. ఆకలి తీర్చే రైతుకు, దేశాన్ని కాపాడే సైనికుడికి మనం చేసే అభినందనలే వారిలో విజయమార్గంలో నడిపిస్తాయి అని అప్పటి మూడుకోట్ల జనాభాకి పిలుపు నిచ్చారు.భారతదేశాన్ని ప్రపంచదేశాల గుర్తింపు కార్యక్రమంలో భారత భవిష్యత్తును రూపొందిం చటంలో కీలక పాత్ర పోషించిన మేధావి. కాయస్థ వంశంలో శారదాప్రసాదుకు మరియు రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించిన ఈ బాలుడు, బాల్యమునందే తండ్రిని పోగొట్టుకున్నాడు.బీద కుటుంబముభర్త మరణించటంతో రామ్‌దులారీ దేవి తన ఇద్దరు కుమార్తెలను, కుమారుడు బహదూర్‌ని తీసికొని తండ్రి వద్దకు చేరినది.బహదూర్‌ని అందరూ ‘‘నానీ’’ అని ముద్ధుగా పిలుచుకొనేవారు.అది తాతగారు పెట్టిని ముద్దు పేరు.
బాల్యంలో ఆటల మైదానంలో ఆడుకుంటూ తోటి స్నేహితులతో కలసి ఒకరి జామచెట్టును, యజమాని అనుమతి లేకుండా కాయలు కోసుకొనే సమయంలో,ఆయజమాని చూసి కోపంగా అరచిన అరుపుకి అందరూ తప్పుకున్నారు గాని,నానీ మాత్రం తప్పించుకోలేదు.పైగా ఆయజమానితో ‘తండ్రిలేని వాడిని,నన్ను ఎక్కువగా దండిరచకు’అని బ్రతిమాలితేదానికి ఆయజమాని ‘నీకు తండ్రి లేడు కనుకనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన మాటను సందేశంగా భావించి,భవిష్యత్తును క్రమబద్ధంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.దాని ప్రభావము ఆయనకు బాగా తోడ్పడిరది.లాల్‌బహదూర్‌ ప్రాధమిక విద్య గంగానదికి ఆవలి ఒడ్డున గల మొగల్‌సరాయి, వారణాసిలలోని పాఠశాలలో జరిగింది. లాల్‌బహదూర్‌ నిత్యం పాఠశాలకు గంగానదిపై పడవలో ప్రయాణించి వెళ్ళి చదువుసాగించాడు. ఆ సమయంలో ఒకసారి పైకం చెల్లించే పరిస్థితి లేక బట్టలు,పుస్తకాలు సంచిలో చుట్టుకుని,వాటిని నడు ముకి కట్టుకుని నదిపై ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకుని పాఠశాలకు వెళ్ళటం జరిగింది. పడవకి డబ్బులు ఇస్తామని చాలామంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి,ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నాడు. సమ యస్ఫూర్తితో కార్యాలను సాధించుకునేవాడేగాని, పేదరికానికి మాత్రం చింతించలేదు,వెనుకంజ వేయ లేదు.లాల్‌బహదూర్‌ 13వసంవత్సరంలోనే గాంధీ గారి ప్రసంగాలకి, సిద్ధాంతాలకి ప్రభావితుడ్కె నాడు. విధ్యార్థి దశలోనే భారతసేవా సమితి అనే సంస్థలో సభ్యునిగా ఉండేవారు.బాలగంగాధర్‌ తిలక్‌గారి ఉపన్యాసాలకు ప్రీతిపాత్రుడ్కె దేశభక్తిని అమితంగా పెంచుకున్నాడు.1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణాద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, మైనరగుటచే వెంటనే విడుదలకాబడ్డారు. ఆకారణం చేత విధ్యాభ్యాసానికి హాని కలుగలేదు. కాని విశ్వవిధ్యాలయం నుండి‘‘శాస్త్రి’’ పట్టాను పొంది న కారణంగా లాల్‌బహదూర్‌ శాస్త్రి అయ్యారు. 192728 సం.లో లలితాదేవితో వివాహమైనది. వరకట్నంగా మామగారు కొయ్య చరఖాని బహు మతిగా ఇచ్చారు.అప్పుడప్పుడే స్వాతంత్య్ర పోరాటం ఉధృతమవుతున్న సమయంలో శాస్త్రికి,నెహ్రూగారితో సన్నిహిత సంబంధం ఏర్పడిరది.అది వారి మధ్య గొప్ప మైత్రికి దారితీసింది.1930లో లాల్‌బహదూర్‌ లొలిసారిగ జిల్లాకాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎంపిక కాబ డ్డారు.పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిన కార ణంగా 2సంవత్సరాలకాలం కారాగార శిక్ష వేసారు బ్రిటిష్‌వారు.ఆయన ఆశిక్షను అనుభవించారు.
ఒకసారి అలహాబాదు నగరమధ్యలో జాతీయ పతాకం ఎగురవేయుటకు కాంగ్రేస్‌ సభ్యులందరూ భయాందోళనలో వుండగా, శాస్త్రిగారు స్త్రీ దుస్తులలో బురఖా వేసుకుని పైకిపాకి జెండాను ఎగురవేసి నారట. అతని ధ్కెర్యసాహసాలకు భారతీయులందరూ ప్రసంసించినా, అందుకుగాను మరల జైలు శిక్ష అను భవించవలసి వచ్చింది.1936లో ఆంగ్ల ప్రభుత్వానికి పోటీగా కేంద్ర,రాష్ట్ర శాసనసభలకు జాతీయ కాం గ్రెసు పోటీ చేసింది.శాస్త్రిగారు అలహాబాదు నియో జగవర్గం నుండి ఎన్నికైనారు.వారు ఎప్పుడూ సమ యాన్ని వృధా చేయలేదు.జ్కెలులో ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘మేడం క్యూరీ’ జీవితగాధను హిందీలోనికి అనువదించారు. కాలాన్ని వ్యర్ధం చేయక పఠనానికో, గ్రంధరచనకో ఖర్చుచేసేవారు.విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భార్యను కూడా పాల్గొనమని ప్రోత్సహించారు. శాస్త్రిగారి జీవితం మిక్కిలిఆదర్శప్రాయమైనది. భారతీ యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిన అమర జీవి.ప్రధానిగా కొంతకాలమే వున్నప్పటికీ, ముందు వారికంటే కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. పదవు లకోసం ప్రాకులాడలేదు.పదవులే వారిని వెదుక్కుంటూ వచ్చాయి.ఉక్కుమనిషి,ఆజాత శత్రువు, నిగర్వి,ధ్కెర్య శాలి, స్థిరచిత్తుడు వంటి పదాలకి సరైన నిర్వచనం శాస్త్రిగారు.భారత స్వాతంత్య్రానంతరం అలహాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో గెలిచి ‘అలహాబాద్‌ ఇంప్రూవ్‌ మెంటుట్రస్టుకు’ట్రస్టీగా నియమించ బడినారు. రెండు బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ‘‘టాగూర్‌ నగర్‌’ అనే పేరుతో అర ఎకరం భూమిని ప్లాటుగా విభజించి శాస్త్రిగారు లేని సమయంలో మిగిలినవారు వేలానికి పెట్టారు.ట్రస్టు సభ్యులందరూ తలొక ప్లాటును స్వంతం చేసుకోవాలనుకున్నారు.
రెండు రోజులకి తిరిగి వచ్చిన శాస్త్రిగారికి ఈ విషయం తెలిసి,వారందరినీ పిలిచి,మనం ప్రజా ప్రతినిధులము,ప్రజల ముందు నిజాయితీగా నిల వాల్సిన వారం,అందరూ వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామా చేద్దాం.కావలసివారు వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి అందరిచేత వాపసు చేయించారు.శాస్త్రిగారు ప్రధానమంత్రిగా పనిచేసినా పదిరూపాయలు కూడా దాచుకోలేదు. స్వంత ఇల్లు కూడా లేని నిజాయితీకి మారు రూపం.రాజకీయంగా కీలక పదవులు చేపట్టిన సందర్భాలలో కూడా దేశానికి మేలు చేసే శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. రైల్వేమంత్రిగా 195156 వరకూ,హోంమంత్రిగా ఏప్రిల్‌ 61 నుండి ఆగస్టు 63వరకూ,ప్రధానమంత్రిగా జూన్‌ 64నుండి జనవరి 66వరకూ (మరణించే వరకూ) పనిచేసారు.ఈసమయలో ప్రధాన మంత్రి గాచేస్తూ అదనంగా కొంత కాలం హోం మంత్రి త్వశాఖను కూడా నిర్వహించారు. ఆ సమ యంలో ఎదురైన ఆహారధాన్యకొరత, పొరుగు దేశాల వత్తిడికి ధీట్కెన సమాధానం చెప్పి రెండు సమస్యలకు పరి ష్కారం చూపారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమ యంలో కూడా వారి సంతానం సిటీబస్సులలోనే ప్రయాణించే వారు.ప్రధానిగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమ కూర్చలేదు.వారిలోని జాతీయ భావానికి శాస్త్రిగారి సంస్కారానికి ఆకుటుం బ సభ్యుల సహకారానికి నమోవాకాలు అర్పించ వలసినదే.వారి పెద్దకుమారుడు హరికృష్ణకు అశోక్‌లేలాడ్‌ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో, అకస్మాత్తుగా సీనియర్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పిం చారు.శాస్త్రిగారికి ఈవిషయం తెలిసి, ఆసంస్థవారు నీకు అర్హతలు చూడ కుండా పదోన్నతి కల్పించడం లోని ఉద్ధేశ్యం వారు ప్రధానిగా నానుండి ఏదో ఆశిం చవచ్చును.కనుక నేను ప్రధానిగా ఉన్న సమయంలో ఆసంస్థలో నీవు ఉద్యోగం చేయవద్దని ఖండిరచిన మహనీయులు శాస్త్రి గారు. రైల్వేమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రమాద సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. అనేక విశేష సలహాలు, నిర్ణయా లపై కేంద్రమంత్రి వర్గంలో విశిష్టస్థానంలో ఉన్న శాస్త్రిగారి నిర్ణయంతో జరిగేవి.ఏపదవీ లేన ప్పుడు కూడా ఇదే పంధాలో కొనసాగుతూ దేశానికి సేవ చేశారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానుతో యుద్ధం సంభవిం చింది.వారి దురాక్ర మణను గుండె నిబ్బరంతో అణచివేసిన వీరుడు. శాంతి స్థాపనకై రష్యా నాయకుల ఆహ్వానంతో తాష్కెంటుకు వెళ్ళి సంధి పత్రంపైన సంతకం చేసి, గుండె పోటుతో 1966 జనవరి 11వారు మరణిం చారు.ఆయన విశ్రాంతి స్థానం‘విజయ్‌ ఘాట్‌’గా గుర్తింపబడినది.ఆయన మరణానంతరం ‘భారతరత్న’ బిరుదును ప్రకటించారు. శాస్త్రిగారు వాయిదాల పద్దతిలో తీసుకున్న కారు వాయిదా నాలుగు వేల రూపాయలను వారి సతీమణి,శాస్త్రి గారి మరణా నంతరం చెల్లించి వారి నిబద్ధతకు, నిరా డంబర జీవితానికి భర్తకి సహకరిం చిన ఆదర్శమహిళ లలితా శాస్త్రిగారు.‘జ్కె జవాన్‌జ్కె కిసాన్‌’నినాదాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. మహనీయుల పుట్టుకకు ఒకపరమార్థం వుంటుంది. భారతదేశాన్ని ఉద్దరించ టానికి జన్మించిన నిస్వార్థ మహనీయులలో శాస్త్రిగారి కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.వారికి నమోవా కములు.జై భారత్‌.(వ్యాసకర్త : సాహితీరత్న,ప్రముఖ రచయిత్రి
విశాఖపట్టణం`9849692414
) డాక్టర్‌ దేవులపల్లి పద్మజ

ఆంధ్ర అభివృద్ధికి అండగా`ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సంద ర్భంగా,నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖ పట్నంలో రూ.2.08 లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ..ఆంధ్ర ప్రజల ప్రేమ,అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్‌ కొట్టారని పేర్కొన్నారు.60 ఏళ్ల తర్వాత దేశంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొ న్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడిరచారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్‌ రాకతో వ్యవసా యంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్‌ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే..అందులో ఒకటి విశాఖకు కేటాయిం చాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమం దికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రా ల్లోనే ఇలాంటి బల్క్‌ డ్రగ్‌ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్‌ కీలకం కానుంది. రైల్వే జోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌ వల్ల వ్యవసాయ,పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’అని ప్రధాని మోదీ అన్నారు.
మేమంతా కష్టపడి పని చేస్తున్నాం`పవన్‌
‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి,అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయిం చడానికి అడుగులు వేస్తున్నాం.దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి.ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. జనవరి 8న విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టు లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తూ ‘‘సదుద్దేశం..సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది.
అభివృద్ధిలో అందరికీ సమాన వాటామోదీ సంకల్పం
అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు.జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ 24గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా..నమ్మకం..ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి.70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆగ్రామాలకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన పథకం కింద ఈరోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుం డడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌,ఉత్తరాంధ్ర,రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృ ద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజుఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శక త్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.
రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్‌ అని చెప్పుకొనేలాచంద్ర బాబునాయుడు నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు,సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం.దేశ ప్రగతిలో భాగస్వా ములవుతాం. ప్రధాన మంత్రికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు.మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ.రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి గారు, సమర్ధవంతులైన చంద్రబాబు గారు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను’’ అన్నారు.ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము..
రాష్ట్రానికి ఆక్సిజన్‌ అందిస్తున్న ప్రధాని మోడీజీ!
గత ప్రభుత్వ అసమర్థత వలన వెంటిలేటర్‌ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్‌ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌ తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 12157 కోట్ల కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి మన విజనరీ లీడర్‌ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం,దీపం పథకం ద్వారా ఉచి తంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నారు,త్వరలోనే మెగా డీఎస్సి, త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వ బోతున్నారు…దటీజ్‌ సిబిఎన్‌. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం.
వికసిత్‌ భారత్‌ స్పూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్‌ సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం తరపున గౌరవ ప్రధాని నరేంద్రమోడీజీకి స్వాగతం.ప్రతి భారతీయుడి గుండెల్లో నరేంద్ర మోదీ. డీజీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. నరేంద్రమోడీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు, మామూలుగా పిఎం అంటే ప్రైమ్‌ మినిస్టర్‌,నరేంద్ర మోడీజీ పీపుల్స్‌ మ్యాన్‌.నరేంద్ర మోదీ జీ విజన్‌ గ్లోబల్‌. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా,దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోడీజీ.వికసిత్‌ భారత్‌ 2047విజన్‌ డాక్యు మెంట్‌ రిలీజ్‌ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోడీజీ పనిచేస్తున్నారు.2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5స్థానానికి వచ్చింది.వికసిత్‌ భారత్‌ -2047లక్ష్యంతో టాప్‌ 1లేదా 2ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి తో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేసారు.వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, పోర్ట్స్‌, ఎయిర్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం.
ప్రజల నీరాజనాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోలో విశాఖవాసులు అడుగ డుగునా బ్రహ్మరథం పట్టారు.ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి సాయం త్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు.ఈక్రమంలో ప్రధాని, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్‌ కళ్యాణ్‌ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. రోడ్‌ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ..అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

విశాఖ తీరంలో నేవీ డే విన్యాసాలు

విశాఖలో నేవీ విన్యాసాలతో,సాగ తీరం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. నేవీ విన్యాసాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నేవీ చేస్తున్నటువంటివి అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. విశాఖ సాగర్‌ తీరంలో నేవీ విన్యాసాలు చూడటం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.నేవీ యుద్ధ విమానాలు దగ్గర నుండి చూడటం ఇదే మొదటిసారి అంటూ చెబుతున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో చాలా బాగుందని అంటున్నారు. నేవీ దేశం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నేవీ విన్యాసాలు చూడటం ద్వారా తెలిసిందని మరికొందరు అంటున్నారు. మన దేశం కోసం ఎంతో కష్టపడి నేవీ పని చేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు.భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్‌ స్థావరానికి పునాది పడిరదని,అధికారికంగా తూర్పునౌకాదళం 1983లో ఏర్పాటైంద న్నారు.చిన్న నేవల్‌ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్‌ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్‌ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మనవడు దేవాన్ష్‌ బాబుతో కలిసి తిలకించారు.అనంతరం సీఎం ప్రసంగించారు.మదిని మైమరపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలను చేసి చూపించింది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్‌ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్‌ అడ్మిరల్‌ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎంత క్రమశిక్షణ,కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడంసాధ్యం అవుతుంది.1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్‌ కమాండ్‌ చాలా కీలకంగా పని చేసింది. పాకిస్తాన్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీని ధ్వంసం చేసింది మనవిశాఖ తూర్పు నౌకాదళమే.ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది. కలకత్తా నుంచి చెన్నైవరకు కోస్టల్‌ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి.అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళంచేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది.దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది.హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజులపాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడు తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్రఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగా పురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది’’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో జనవరి 4ననిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.తూర్పునౌకాదళాధిపతి రాజేష్‌ పెంథార్కర్‌ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ :దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. – గునపర్తి సైమన్‌

కులగణ నేటి సామాజిక అవసరం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం.సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు.వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడిరది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931వరకు 16సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్‌ ప్రక్రియలో అంతరాయం కల్గింది.వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతం త్య్రానంతరం జనాభావివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు.దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష,అసమానతలు,ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు.ప్రభుత్వ సంక్షేమ విధానాలు,సామాజిక న్యాయం,ప్రధానంగా విద్య, ఉద్యోగాలు,అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.1931 సెన్సెస్‌ తర్వాత గడ చిన 90సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదను గుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు.ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు.ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక,అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల సాధించిన పురోగతి, తద నుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయ మే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ,బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలు గుతాయి.వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితా లను ఎలా రూపొందిస్తారు. కులాల చేర్పులు మార్పు లు ఎలా సాధ్యం. క్రీమీలేయర్‌ విషయంలో ప్రతిపాద నలు ఎలా రూపొందిస్తారు.రిజర్వేషన్‌ కోటాలను ఎలా నిర్థారిస్తారు.కులం వివక్షకు,అసమానతలకు మూల కారణమైన విద్య,ఆరోగ్యం,ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడంవల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విష యంలో విధానరూపకల్పన ఎలాసాధ్యం? అదే విధం గా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్‌ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన,నాణ్యమైన గణాంకాలు సెన్సెస్‌ ద్వారానే సాధ్యమని,ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కులగణాంకాలు నిర్వ హించకపోవడం ఎంతవరకు సహేతుకం.అది తర్కా నికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం 2011 జనా భా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబం ధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్‌ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాలపేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా,అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు.2014లో నరేం ద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకర ణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారి కంగా గుర్తించినప్పటికీ,గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగినచర్యలు చేపట్ట లేకపోయా యి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 2021సెన్సెస్‌లో కులాధార గణాం కాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆతర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది.ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విష యంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజే యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నా మని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్‌.డి.ఎ లోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయట నుండి సమర్థించే మరికొన్ని పార్టీలు,మహారాష్ట్ర, బీహార్‌,ఒడిషా,మధ్య ప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమం త్రులు,అదే విధంగా సి.పి.ఐ,సిపియం,ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌పార్టీ,డియంకె,తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణి లో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది.అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈవిషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్నిఓబిసి /బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు,కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021సెన్సెస్‌లో కులగణాంకాలు చేర్చాలని చెప్తున్నా యి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామ కాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు.1990లలో ఓబీసీ లకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తిచేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపైఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను,సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరిం చాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏవిషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మ మని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాం కాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర కుటుంబ సర్వే : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది.75ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరి స్తున్నారు.ఈసర్వే డేటాఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కాను న్నాయి. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు.ప్రధాన ప్రశ్నలు 56,ఉపప్రశ్నలు 19కలిపి మొత్తం 75ప్రశ్నలతో కుటుం బానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు.కుటుంబసభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్‌ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆకులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యులవారీగా విద్య,చదివిన మాధ్యమం,ఉద్యోగం,ఉపాధి,వ్యాపారం, వార్షికా దాయం తెలుసు కుంటున్నారు.కుటుంబానికి ఉన్న భూములు,ఇళ్లు, ఇతర స్థిర,చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య,ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్‌ ప్రయో జనాలు.
గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతిని ధులుగా,లేదా నామినేటెట్‌ పదవులు,ఎన్జీవోల్లో సభ్యత్వం వంటి అంశాలు నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా అద్దెకు ఉంటున్నారా ఇంట్లోఫ్రిజ్‌,కారు, ద్విచ క్రవాహనం,కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్‌ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు.
ఈ సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారంటే? : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గో ప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనక బడిన వర్గాలకు సంక్షేమపథకాలు,రాజకీయ,విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళి కలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించు కోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీరిజర్వేషన్లు ఎంతఉండాలోఈడేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.ఈసర్వేలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,కుల,రాజకీయ సమా చారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయి.వీటి నుంచి సమాచారంసేకరిస్తారు. ఇందులో 56ప్రధాన ప్రశ్నలు ఉండగా,మరో 19అను బంధ ప్రశ్నలు ఉంటాయి.మొత్తం రెండు పార్టులు అంటేపార్టు-1,పార్టు-2గాఉండి ఎనిమిదిపేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధా రణ,విద్య,ఉద్యోగ,ఉపాధి, భూములు, రిజర్వేషన్‌ ప్రయో జనాలు, వలసలు, రాజకీయ సమా చారం అడగను న్నారు.అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం17ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా,మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌? కు చెప్పాల్సి ఉంటుంది.సాగు విస్తీర్ణం వివరాలు అన గా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
రిజర్వేషన్‌ ఫలాలు పొందేవారు : విద్యా,ఉద్యోగ పరంగా రిజర్వేషన్‌ విధానంతో ప్రయోజనం పొంది నా,గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు,ఆ వివరాలు నమోదు చేసుకోవాలి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఈడబ్ల్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.
రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం,పూర్వం ఏపదవిలో ఉన్నారనేది తెలుసుకుం టారు. పదవీ కాలం,నామినేటెడ్‌ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్‌ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్‌ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పు డు సులువుగా వివరాలు అందించవచ్చు. ఒక కుటుం బంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు. సర్వే సంద ర్భంగా ప్రతి కుటుం బం ఈ విషయాలను గుర్తుంచు కోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు,పత్రాలు వంటివి తీసు కోరు.అలాగే కుటుం బీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయి స్తే సరిపోతుంది.వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యం గా ఉంచుతారు.
విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏమాధ్యమంలో చది వారని తెలియజేయాలి.ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
ఉద్యోగ, ఉపాధి వివరాలు : ఈ విషయానికి వచ్చిన ప్పుడు ప్రస్తుతం చేసే పని,ఉద్యోగం,వృత్తి,ఉపాధి సమాచారం ఇవ్వాలి.వార్షికాదాయం,ఒకవేళ వ్యాపా రులైతే వార్షిక టర్నోవర్‌ తెలియజేయాలి. సాంప్రదా య కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా,కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా,లేదా తెలియజేయాలి.సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడిరచారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతిఅధికారులను ఆదేశించారు. ఇంటిం టి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహా లను అధికారులతో కలిసి పరిశీలించారు. – (ప్రొ.కె.మురళి మనోహర్‌)

అరుదైన తాబేళ్లకు ఆపద

మానవ తప్పిదాలు..సముద్ర జలాల కాలుష్యం..అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల పాలిట శాపంగా మారుతున్నాయి.ఇక్కడి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న క్రమంలో చేపల వలలకు చిక్కి,బోటు పంఖాలు తగిలి కొన్ని మృత్యువాత పడుతున్నాయి.కాలుష్యం కార ణంగా మరికొన్ని చనిపోతున్నాయి.పరిస్థితి తీవ్రత గమనింఎచిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వీటి మృతికి కారణాలు తెలసుకుని పూర్తిస్థాయిలో దరాస్యప్తు చేయాలని ఆదేశిం చారు. అధికారులు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమకులు చెబుతున్నారు.విశాఖ తీరంలోనూ తాబేళ్ల మరణాలు కలవరపెడు తున్నాయి. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం వీటి కళేబరాలను చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాబేళ్లు ఎక్కడ పుడితే అక్కడకే చేరి గుడ్లు పెట్టే సుగణం వీటికి ఉంది.ఈనేపథ్యంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లుపై ప్రత్యేక కథనం..
ఆలివ్‌ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా
అరుదైన ఆలివ్‌ రిడ్లీ(సముద్ర తాబేళ్ల)లకు అమ్మ ఒడిలా ఒడిశా రాష్ట్రం ఆత్మీయత పంచుతోంది.ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి.తీరంలో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవు తున్నాయి.ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు.అవి పిల్లలుగా మారిన తర్వాత సముద్రంలోకి వదులుతున్నారు.ఆలివ్‌ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి.ఆ రాష్ట్రంలోని గహీర్‌మఠ(కేంద్రపడ జిల్లా),రుషికుల్యా ముఖద్వారం(గంజాం జల్లా),దేవీ ముఖద్వారం(పూరీజిల్లా)తాబేళ్ల పునరుత్పిత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్‌..
వేల కి.మీ.దూరం ప్రయాణించి పునుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశాఖ తీరాలకు వస్తుంటాయి.తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరా లు,తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలివ్‌ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు.ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు.ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధికుక్కలు,నక్కలు తినేయ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత ఆలివ్‌ రిడ్లేలు సముద్రంలో ఎంత దూరం వెళ్లుతున్నాయి?మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియోట్యాగ్‌లు అమర్చు తున్నారు. పరిశోధనలకు ఆచర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్‌ రిడ్లీలు..?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్‌రిడ్లీ.ఇవి చూడటానికి ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి.అందుకే వీటికి ఈపేరు వచ్చింది.పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్‌ వర్ణంలోకి మారి పోతాయి.వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది.పశ్చిమ అట్లాంటిక్‌ తీరంలో నివసించే ఆలివ్‌ రిడ్లీలు తూర్పుపసిఫిక్‌ ఆలివ్‌రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి.యుక్తవయస్సు వచ్చినా వీటి పరిమాణం 2నుంచి 2.5అడుగులు మాత్ర మే పెరుగుతుంది.ఒక్కోక్కటి 36నుంచి 49కిలోల బరువుంటాయి.వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్‌ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి..
ఆలివ్‌ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్ట పడతాయి.పసిఫిక్‌,అంట్లాంటిక్‌,హిందూ మహాసముద్ర తీరాల్లో అవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం తీరాల్లో ఆలివ్‌ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది.శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాటిక్‌ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆలివ్‌ రిడ్లీలు సర్వభక్ష కాలు..అంటే ఇవి మొక్కలను తింటాయి.అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే,ఎండ్ర కాయలు,పీతలు,రొయ్యలు,చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి.కొన్నిసార్లు ఆలివ్‌రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో500అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు.ఇక ఈఆలివ్‌ రిడ్లీలు తమజీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయ నాలు జరుగుతున్నాయి.అయితే,చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూ హంగా ఏర్పడతాయి.ఎండలో అలాగుంపులుగా నిల్చోని పరస్పర తోసు కుంటూ కన్పిస్తాయి.ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ తాయి.ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల,వేల మైళ్లు సునాయసంగా ప్రయాని స్తాయి.అలా వచ్చినవన్నీ ఒకచోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్‌’ అని అంటారు.ఇక్కడే ఆడతాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు..వందల సంఖ్యలో గుడ్లుపెడతాయి.-గునపర్తి సైమన్‌

1 2